16, డిసెంబర్ 2020, బుధవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ అందులో రిఫర్ చేయవచ్చు. 



101 వ రోజు ఇంట్లో 5 గురు సభ్యులు ఉన్నారు. ఫైనల్ ఫైవ్. అభి,అఖిల్,సోహెల్,అరియానా,హారిక  
ఉదయం ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి పాటతో మేల్కొలిపారు. 

డైరెక్ట్ గా తొమ్మిదిన్నరకి తీస్కెళ్ళారు. జర్నీ గురించి విడియో అండ్ సమ్మరీ లాగా చెప్పారు బిగ్ బాస్. లాస్త్ టైమ్ ఒక రూం లో పెట్టిన సెటప్ ఈ సారి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చెశారు బావుంది. 

మొత్తం గేం లో క్రిటికల్ మొమెంట్స్ తాలూకు వి అన్ని సెట్ చేశారు గార్డెన్ ఏరియాలో. 
 
మొదట అఖిల్.. 
ఎంతోమంది హార్ట్ థ్రోబ్ లా వచ్చారు అలగే ఒక సినిమా హీరోలా మీలో అనేక భావాలున్నాయ్. ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే హార్ట్ తో ఆడారు. 
మెదడుతో ఆలోచించి తెలివైన నిర్ణయాలు తీస్కున్నారు. అఖిల్ తక్కువగ నవ్వుతారని అందరు అంటున్నారు కానీ నాకు తెలుసు మీరు ఎంతో కష్టపడి మీ భావాలని లోపలే దాచుకున్నారు. కానీ ఫ్రెండ్స్ దగ్గర మీరు లేరనే లోటు రానివ్వలేదు.  

అఖిల్ ఏవీ బావుంది. 

ఒక బంకమట్టిలా వచ్చాం మమ్మల్ని మేం మలచుకున్నామో ఇంకా మట్టిలో కలిసిపోయామో అనేది మా చేతిలోనే ఉంది. నేనైతే మలచుకున్నాను అనే అనుకుంటున్నా.  

బాల్కనీలో కొన్ని ఫోటోస్ పెట్టి ఉన్నాయి వాటిలో ఒకటి తీస్కోని లోపలికి వెళ్ళమన్నారు. 

రాత్రి పదకొండు గంటలకి అభి వచ్చాడు. 
అన్ని చూస్కున్నాడు. 

యంగ్ ఛార్మింగ్ బోయ్ గా వచ్చి మెచ్యూర్డ్ మాన్ ఇన్ ద హౌస్ అనే టైటిల్ సాధించారు. 
మీరు అందరికి మర్యాదనిచ్చి మీరూ తిరిగి పొందారు. 
మీలాంటి పరిపక్వత చెందిన తెలివైన కంటెస్టెంట్ బిబి ఇంట్లో ఉన్నందుకు బిగ్ బాస్ చాలా గర్వపడుతున్నారు. 
హానర్ ఈజ్ మైన్ అని అంటున్నాడు. 

అఖిల్ ఏవీలో ఉన్నదానికంటే అభి ఏవీలో మోనల్ ఎక్కువ కనిపించింది అనిపించింది నాకు. 
అభి ఏం చేయలేదు ఏవీ కట్ చేయడం కష్టం అని ఈ మధ్య కొందరు జోక్స్ వేస్తున్నారు కానీ అభి ఏవీ చూశాక వాట్ ఎ వండర్ఫుల్ జర్నీ అనిపించింది. రియల్లీ గ్రేట్. 

లోపలికి వచ్చిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు. చాలా హాపీగా అనిపించింది. చాలా విషయాలు నేను ఎవరు అర్థంచేస్కోడంలేదు అని అనుకున్నానో అవన్నీ నేను అర్ధం చేస్కున్న అన్నట్లు చెప్పారు అని చెప్తున్నాడు. 

రాత్రి పన్నెండున్నరకి హారిక ఎంటరైంది..
హారిక, సోహెల్ వీడియొలు రేపు ప్రోమోలో చూపించారు.  
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts