19, డిసెంబర్ 2020, శనివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లొ ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్, ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజంతా కూడా రీయునియన్ ఎపిసోడ్ కంటిన్యూ చెశారు. ఈ రోజు గంగవ్వ, సుజాత, నోయల్, మెహబూబ్, దివి అండ్ అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. అందరు చక్కగా మేకప్ చేస్కుని బాగా రెడీ అయి వచ్చేసరికి హౌస్మేట్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు అరె ఒకొక్కళ్ళు ఇంత బాగున్నారేంటి అని. అండ్ అవినాష్ ఈజ్ ద ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు తన ఎంట్రీతో తనకి వేసిన మాషప్ సాంగ్ కానీ తర్వాత తను మాట్లాదిన మాటలు కానీ బావున్నాయ్. అరియానా వజ్ లిటిల్ డల్ అనిపించింది ఎందుకో హౌస్మేట్స్ అందరిలోకి. 
            
వివరాలలోకి వెళ్తే 103 వ రోజు రీయూనియన్ ఎపిసోడే కంటిన్యూ అవుతుంది. నిన్న గంగవ్వ ఎంట్రీతో ఆపేశారు కదా ఈ రోజు ఎంట్రీ తో కంటిన్యూ చేశారు. ఆవిడ మాట్లాడుతుండగానే సుజాత ఎంటర్ అయిపోయింది హౌస్ లోకి.. సుజాత మేకప్ గురించి వావ్ ఏంటి ఇంత మంచిగా రెడీ అయ్యావ్ అని అడుగుతున్నారు అంతా కూడా. 

మెసేజ్ ఫ్రం హోమ్ తెచ్చా.. కానీ మీరంతా నన్ను ఇంప్రెస్ చేయాలి అంటే అభి కప్ తీస్కొచ్చాడు.. 
సోహెల్ సుజాత ప్లేట్ తీస్కొచ్చాడు.. కానీ దానిమీద పేరు రాశాడు అంటున్నారు అంతా..   
అభికి ఇస్తా అంది.. 
ఎంట్రీ పక్కన ఓ వీడియో పెట్టారు కదా అందులో అభి వాళ్ళ అమ్మ అండ్ నాన్న గార్ల మెసేజ్ ఇచ్చారు వీడియోలో.. ఇక కొట్టుకోకండి అని చెప్పారు అమ్మ.. 


నెక్స్ట్ హారిక కి 
వాళ్ళ అమ్మ అన్నయ్య వచ్చారు ఇద్దరూ మాట్లాడారు.. అసలు టాప్ ఫైవ్ లో ఉన్నావంటే సూపర్ హాపీ ఉన్నాం మేం అని చెప్పారు. 
తర్వాత అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు వాళ్ళ అమ్మగారు బాగా మాట్లాడారు. 
కప్ అండ్ ప్లేట్ రెండూ గ్లాస్ పై నుండి వేశాడు అభి..
గంగవ్వ సోహెల్ పేరు చెప్తా అని అంటే సుజాత గంగవ్వ ఇద్దరు పోట్లాడుకున్నారు నేను చెప్తా నేను చెప్తా పేరు అని ఫన్నీ.. 
బిగ్ బాస్ అన్న సోహెల్ ది వేయ్ అని అడిగింది...
సోహెల్ కి మెహబూబ్ అండ్ చాలా పెద్ద టీం వచ్చింది వాళ్ళ నాన్న గారితో పాటు..  
చెప్పిన్నా లేదా మనతో పెట్టుకుంటే కథ వేరుంటది అని గంగవ్వ సూపర్ చెప్పింది.. 
అరియానా వాళ్ళ అమ్మ గారు వచ్చారు. యూ ఆర్ నాట్ ఓన్లీ బోల్డ్ యూ ఆర్ మై గోల్డ్ అని చెప్పారు భలే ఉంది.. 

గంగవ్వ సుజాత వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది అంటే మేం ఈ రోజు ఉంటాం అని అంటుంది గంగవ్వ.. 
బిగ్ బాస్ ని పాట అడిగితే వేయలేదని హౌస్మేట్స్ మాయదారి మైసమ్మో పాట పాడేశారు. 

సాయంత్రం ఆరున్నరకి మెసేజెస్ చూసిన హౌస్మెట్స్ అందరు కూడా చాలా హాపీగా ఉన్నారు. మెహబూబ్ మేకప్ చూసి కూడా హౌస్మేట్స్ చాలా సర్ ప్రైజ్ అయ్యారు అరే వేరే లెవెల్ లో ఉన్నాడు అని. 

పంకజ్ కస్తూరి బ్రీత్ ఈజీ ప్రోమో టాస్క్.. ఆల్ ద బెస్ట్ ఛెప్పి ఒకొ ప్రోడక్ట్ ని ఒకొక్కరు ప్రోమోట్ చేశారు.    

రాత్రి తొమ్మిదిన్నరకి నోయల్ వచ్చాడు.. ఫుల్ లైట్స్ అండ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.. మంచి రాప్ తో ఎంట్రీ.. తను కూడా గొంతు కలిపి పాడాడు.. అందరు చాలా హాపీ.. 

హారిక బుగ్గలొచ్చినయ్ నీకు అని చెప్తుంది.. 
అందరికీ పర్సనల్ గా మెసేజ్ ఇచ్చాడు.. నువ్వు కేప్టెన్ అయినందుకు నువ్వు ఎంత ఫీల్ అయ్యావ్ తెలీదు కానీ ఆ రోజు నా టీ షర్ట్ వేస్కున్నావ్ నువ్వు చేసిన దానికి నేను చాలా హాపీ లవ్యూ అని చెప్పాడు.. మాంచి కలర్ ఫుల్ సూట్ తో వేస్కున్నాడు. 
చాలా హడావిడి చేస్తూ ఎంటరయ్యాడు కానీ మంచి ఎమోషనల్ గా కంటిన్యూ చేశాడు. రోబో టాస్క్ అపుడు పాడిన మనసెట్టి ఓడామండీ పాట పాడించుకున్నారు. 

హీ ఈజ్ స్టిల్ నాట్ వెల్ అని అనుకుంటున్నారు అభి అండ్ హారిక. ఇంకా పెయిన్ ఉంది ఆయనకి లోపల్ అని చెప్తున్నారు. 

పదకొండుకి దివి అండ్ మెహబూబ్ వచ్చారు నీతోనే డాన్స్ టునైట్ పాటకి డాన్స్ అదరగొట్టేశారు ఇద్దరూ.. సోహెల్ చాలా ఎమోషనల్ అయిపోయాడు మెహబూబ్ ని చూసి. 

మీ అందరు ఇక్కడికి దాకా వచ్చారంటే మాత్రం ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అని కాదు అందరు చాలా గ్రేట్ అని చెప్తుంది దివి. మొత్తం అందరు మన గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్తుంది దివి. మెహబూబ్ ఏడ్చేశాడు ఎమోషనల్ అయ్యాడు. ఏడిపివ్వకురా అని అంటున్నాడు సోహెల్. 
వీళ్ళిద్దరికి సోఫాలోని హార్ట్స్ విసిరేశారు. దివి ఒకటి మెహబూబ్ నాలుగు కాచ్ చేశాడు కాయిన్ టాస్క్ అనుకుంటున్నావారా అని అంటున్నాడు సోహెల్. దివి కి ఒకటి ఇచ్చేసి శాక్రిఫైస్ చేస్తున్నారా అని చెప్తున్నాడు మెహబూబ్ :-)

మేం ముగ్గురం ఉండాలి టప్ ఫాఇవ్ లో అని అనుకున్నాం అందుకే వాడు లేడని బాధపడుతున్నాం అని చెప్తున్నారు సోహెల్ అండ్ అఖిల్ అభితో.

పన్నెండుకి అవినాష్ రావణా పాటతో తన డైలాగ్స్ తో కలిసిన మ్యూజిక్ తో ఎంట్రీ ఇచ్చాడు అరియానా గేట్ దగ్గరే వెయిట్ చేస్తూ మ్యూజిక్ రాగానే అమ్మ రాజశేఖర్ అని గెస్ చేసింది. 
తన ఏవీ నుండి డైలాగ్స్ అన్నీ మిక్స్ చేసి రాప్ లా వేశారు చాలా బావుంది. వాటి అన్నిటికి ఎనాక్ట్ చేశాడు అవినాష్. 

అరియానా ఏడ్చేసింది గట్టిగా అవినాష్ ని చూసి... నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది. నేను మాట్లాడడం కూడా తగ్గించేశాను అని చెప్తుంది. గర్ల్ పవర్ ఏంటో చూపిస్తున్నావ్ అని అన్నాడు. నువ్వు ఉన్నపుడు నాకు తెలీలేదు వాల్యూ అని చెప్తుంది. ఒక నిముషం నీకొకటి చూపిస్తా అని బిగ్ బాస్ ఇచ్చిన ఫోటోస్ చూపించింది.  మీ అందరు కూర్చుంటే నేను ఏస్కుంటా అని చెప్తున్నాడు. 

అవినాష్ అని పిలిచే అందరూ నన్ను ఎంటర్టైనర్ అని పిలుస్తున్నారు. నామినేషన్స్ గురించి కలవరిస్తున్నా అని నేను కూడా టాప్ ఫాఇవ్ లో ఉండాలి కానీ అని సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అని డైలాగ్ చెప్పి నవ్వించాడు. 
ఇప్పుడు నేను మీకు పేరెంట్ అయిపోయా లోపలికి రానివ్వకుండా. 
అందరికి చాలా పాజిటివ్ ఫీడ్ బాక్ ఇచ్చి చాలా బాగా చెప్పాడు. టాప్ ఫైవ్ కి వచ్చారంటే మాములు విషయం కాదు అదరగొట్టేశారు అని చెప్పాడు. 

వదిలి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది అంటే ఎన్ని సార్లు పంపిస్తారు బిగ్ బాస్ అని అంటూ సరదాగా ఏడుస్తూ నవ్వించాడు.. 
అరియానాతో ఏడవద్దు.. ఎక్కడ పడితే అక్కడ పడిపోవద్దు ఎవరికి పడితే వాళ్ళకి పడిపోవద్దు అనిచెప్తున్నాడు అరియానాతో. 
యూ ఆర్ ఎ ఎంటర్టైనర్ బ్రో అని చెప్పింది హారిక. 
అందరు కూడా చాలా హాపీ ఫీలయ్యార్.. అవినాష్ యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది అరియానా.. 

రాత్రి పన్నెండున్నరకి మంచి మ్యూజిక్ ప్లే చేశారు అంతా చాలా హుషారుగా డాన్సులు చేశారు.     

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts