17, డిసెంబర్ 2020, గురువారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయవచ్చు. 




ఈ రోజు కూడా ఎపిసోడ్ అంతా జర్నీ వీడియోస్ చూపించారు నిన్న అభి అఖిల్ ది చూపిస్తే ఈ రోజు సోహెల్ హారిక అరియానాలది చూపించారు. అన్ని వీడియోస్ అండ్ బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన ఫీడ్ బాక్ అండ్ వాళ్ళు బిగ్ బాస్ కి చెప్పిన మాటలూ కూడా బావునాయ్. 
ఇక బిగ్ బాస్
హారికని చోటా పాక్ బడా ధమాకా అంటే 
సోహెల్ ని యంగ్ ఎనర్జిటిక్ షార్ట్ టెంపర్డ్ పాషనేట్ పర్సన్ అని ఆడాలన్న తాపత్రయం ఆటపట్ల శ్రద్దకి శాల్యూట్ చేశారు 
అరియానాని వైల్డ్ హార్స్ / అడవి గుర్రం తో పోల్చి షైనింగ్ స్టార్ అని మెచ్చుకున్నారు. 
ఇక రేపు ఎక్స్ హౌస్మేట్స్ వస్తున్నారు కానీ గ్లాస్ ఛాంబర్ లోకి మాత్రమే కలవడానికి వీలు లేదు.  

            
వివరాలలోకి వెళ్తే 101 వ రోజు రాత్రి వీడియోలు చూపిస్తున్న టాస్క్ కొనసాగుతుంది ఈ రోజు కూడా. 

హారిక వచ్చింది. 

చోటూ అనిపించుకుంటూ ఎంటరయ్యారు మీ పట్టుదల మొండితనంతో ముందుకు సాగారు. ఎన్ని మేఘాలు కప్పడానికి ప్రయత్నించినా సూర్యకాంతిలా ఛేదించుకుంటూ సిల్వర్ లైనింగ్ లా నిలిచారు. చిన్నపాకెట్ పెద్ద ధమాకా అన్న మాట నిజం చేస్తూ ఫైనలిస్ట్ గా నిలిచారు. 

తన ఏవీ ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ విత్ ఆల్ ద ఎమోషన్స్.. చాలా బావుంది.. కంప్లీట్.. 

బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్స్ చెప్పింది. ఇట్ మీన్స్ ఎలాట్. ప్రతి రోజు కొత్త విశయం నేర్చుకున్నా అని చెప్పింది. నా లైఫ్ లో ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ అనేది నిలిచిపోతుంది. ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. ఇది చూశాక మై ఫైట్ ఈజ్ ఓవర్ ఇన్ బిగ్ బాస్ అని చెప్పింది. ఎక్సైటెడ్ టు సీ ద ఫ్లేర్స్.. 


రాత్రి ఒకటీ నలభై ఐదుకి సోహెల్ వచ్చాడు. అన్నీ చూసుకున్నాడు ఇంట్రెస్టింగ్ గా.. 

ఈ ఇంట్లో ఇబ్బంది పెట్టే పక్కింటి వారుగా ప్రయాణం మొదలు పెట్టి ఈ రోజు ఇంట్లో మీ ప్రయాణం ముగిసే సమయానికి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబం మీకోసం చూసే ఒక సభ్యునిగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందారు. ఈ ప్రయాణంలో అందరికి మీలోని అన్ని భావోద్వేగాలు చూపించారు. స్నేహితులకోశం ఏమైనా చేయడానికి సిద్దంగా ఉండే యంగ్ ఎనర్జిటిక్ షార్ట్ టెంపర్డ్ పాషనేట్ పర్సన్. మీ ప్రతి ఎమోషన్ చాలా స్వచ్చంగా నిజమైనది గా ఉంటుంది. మీటో పాటు నవ్వుతూ ఏడుస్తూ మీటో కలిసి ప్రయాణాం చేశారు. త్యాగాలు చేశ్తూ సరైన నిర్ణయాలు తీస్కుంటూ సాగించిన మీ ప్రయాణాన్ని బిగ్బాస్ తో పాటు ప్రేక్షకులు చూశ్తూన్నారు. అందుకె అందరి హృదయాలు గెలుచుకున్నారు. మీ ఎనర్జీ, ఆడాలన్న తాపత్రయం, ఆటపట్ల మీకున్న శ్రద్దకి బిగ్ బాస్ శాల్యూట్ చేస్తున్నారు. మీరు పడ్డ శ్రమకి మీ ప్రతిభకి మీకథ వేరేగా ఉంటది. 

ఏవీ చాలా బావుంది విత్ ఆల్ ఎమోషన్స్...  

మీ రుణం ఎప్పతికి తీర్చుకోలేను. నా సినిమాలు పాతిక మంది కూడా రాక షో కాన్సిల్ చేశారు. నన్ను ప్రజల్లోకి తీస్కెళ్ళారు. నూటాఐదు రోజుల్లో పది సం.ల కష్టం ఇచ్చారు. ఇపుడీ ప్రేక్షకులు ఒక సినిమా చూశ్తే నాకు అదే చాలు అని అంతున్నాడు. అలా చూడరు అనే విషయం బాబుకి తెలియడం లేదు పాపం. 

ఫోటో తీస్కోమంటే తెగ వెతికాడు ఒకటి రెండు సార్లు బిగ్ బాస్ తల పైకెత్తి చూడండి అని చెప్తే కాని కనిపించలేదు. ఒకటేనా రెండు తీస్కోవచ్చా అని అడిగాదు మీ ఇష్టం అని చెప్తే మూడు తీస్కున్నాదు. ఊహించినట్లే మొదట మెహబూబ్ తో ఉన్న ఫోటో తీస్కున్నాడు. 

రాత్రి రెండున్నరకి అరియానా వచ్చింది.  

మీరు ఇంట్లోకి అడుగు పెట్టినప్పటినుండీ మీరో సంచలనం ఆ రోజు నించీ ఈ రోజు వరకు మీ వేగాన్ని తగ్గించలేదు. మీకున్న స్టైల్ ఛార్మ్ ఎనర్జీతో ఎల్లప్పుడూ మీరు ప్రత్యేకంగా నిలిచారు. సొంత నియమాలతో సొంత ఆటని మీ పరిథిలో ఆడుతూ వచ్చారు కొన్ని సార్లు వొంటరయ్యారు అందరి గురి మీమీదనే ఉన్నా ఏమాత్రం రాజీ పడకుండా ఎదుర్కుంటూగమ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధైర్యం కోల్పోకుండా అడవి గుర్రంలా ముందుకు సాగారు. ఎన్నెన్నో కలల్ని కంటూ ప్రవేశించి అంతకంటకు సాకారాం చేస్కుంటూ నిజమైన ఆటను కనపరచారు. అందుకే ఈ రోజు ఇక్కడ షైనింగ్ స్టార్ అరియానాగా నిలిచారు.  ముందు ముందు మీ కష్టానికి తగిన ఫలితం లభించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. 

ఏవీ చాలా బావుంది. ఎమోషనల్ ఎట్  స్ట్రాంగ్. 

నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి మీ పేరుతో కలిపి నాకో మంచి గుర్తింపు నిచ్చారు చాలా థ్యాంక్స్ అని చెప్పింది. 

అవినాష్ తినిపిస్తున్న ఫోటో, చింటు గాడి ఫోటో రెండూ తీస్కుంది. 

రేపటి ప్రోమోలో మోనల్, కళ్యాణి గారు, లాస్య హౌస్ లోకి వచ్చారు స్టిల్ వితిన్ గ్లాస్ చాంబర్ ఇంటిలోపలికి అనుమతి లేదు. మోనల్ ని చూసిన వెంటనే అఖిల్ ఫేస్ లో వెలుగు మాములుగా లేదు :-)
   
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts