15, డిసెంబర్ 2020, మంగళవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఇది ఫైనల్ వీక్ అంటే అంత సీరియస్ టాస్క్ లు ఏమి ఉండవని తెలిసిందే కదా ఈ రోజు ముందు సీజన్స్ లోని టప్ ఫైవ్ మెంబర్స్ లోంచి నలుగురు వచ్చారు. హౌస్మేట్స్ తో ముఖాముఖిలా నిర్వహించారు. బావుంది మంచి ఎంటర్టైనింగ్ గా సీజన్ మొత్తం రౌండప్ వేస్కున్నట్లుగా అనిపించింది. అందరి గురించి మంచిగా మాట్లాడి హౌస్ లో పాజిటివ్ వైబ్ నింపి వెళ్ళారు. తర్వాత హౌస్మేట్స్ అంతా కూడా హాపీగా ఫీలయ్యారు. 
            
వివరాలలోకి వెళ్తే 100 వ రోజు ఇంట్లో 5 గురు సభ్యులు ఉన్నారు. ఫైనల్ ఫైవ్. అభి,అఖిల్,సోహెల్,అరియానా,హారిక  
ఉదయం ఉన్నది ఒకటే జిందగీ సినిమాలోని ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే పాటతో మేల్కొలిపారు.  

పగలంతా రిలాక్స్ అవనిస్తున్నట్లున్నారు ఏం యాక్టివిటీ లేకుండా. నేరుగా సాయంత్రమ ఐదున్నరకి ముందు సీజన్స్ లోని టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ని చూపించారు. 
హరితేజ(సీజన్ వన్ రన్నర్ కావాల్సింది తర్డ్ ప్లేస్ లో ఆగింది), గీతామాధురి (సీజన్ టు రన్నరప్), శ్రీముఖి(సీజన్ త్రీ రన్నరప్), ఆలిరెజా (సీజన్ త్రీ ఫైనలిస్ట్) 
ఒకొక్కరి ఎక్స్పీరియన్స్ డిస్కస్ చేస్కున్నారు. మొదటి సీజన్స్ లో ఏం లేవూ సీజన్స్ మారే కొద్దీ ఏమేం సౌకర్యాలు వచ్చాయి అనేది మాట్లాడుకున్నారు. 

ఎవరు హాపీగా ఫీలవుతారు అని అడిగారు. గీతా ఏమొహాన్ని చూసినా హాపీనే ఫీలవుతారు అని అంటుంది. పాపం ఎవరూ లేరు గెస్ట్ లు కానీ ఎవరూ లేరు కదా అని చెప్తున్నారు. 

హరితేజ, గీతా, ఆలీ వాళ్ళ ఫ్యామిలి వచ్చినపుడు హౌస్ లో రొమాన్స్ గురించి మాట్లాడుతుంటే  
ఇప్పుడున్న వాళ్ళు రొమాన్స్ కోసం బయట వెతుక్కోనక్కరలేదు అని అంటుంది గీతా క్లాసిక్ లైన్ :-)
పబ్లిక్ కి విజ్ఞప్తి మీరు మమ్మల్ని ఫేమస్ చేయక్కర్లేదు అని అంటున్నారు పబ్లిక్ తో. 

హరితేజని తప్ప మిగిలిన ముగ్గురిని బాగానే గెస్ చేశారు హౌస్మేట్స్ అందరూ కూడా. 
 

అరియానా సీరియస్లీ అని అంటూ నవ్వించేసింది శ్రీముఖి. అరియానా అవినాష్ నిన్ను మిస్సవుతున్నా అని చెప్పమన్నాడు  అని శ్రీముఖి అంటే. నేను టాప్ ఫైవ్ లో ఉన్నా అని చెప్పండి అంట అరియానా.. టీవీలో టెలికాస్ట్ అవుతుందక్కా అని శ్రీముఖి కౌంటర్. 

ఆలీభయ్ నాకు ఏమైనా చేసి టాప్ ఫైవ్ కి రారా భై అని చెప్పాడు. అని చెప్తుంటే హరితేజ నైన్ ముందు చెప్పాడా తర్వాత అని అదిగి నీకు వోట్స్ వేసే వాళ్ళు కూడా నైన్ తర్వాతే వేస్తున్నారబ్బా అని చెప్తుంది. అందుకే దోస్తుల్ని పిలవద్దు షోకి అని అంటున్నాడు.  
అఖిల్ నువ్వ్ మోనల్ వెళ్ళాక సైలెంట్ అయ్యావ్ కదా అని అంటుంది. యా కొంచెం డల్ అయ్యాను అని అంటుంది. 
అఖిల్ హారిక చేతిమీద ఏం రాశావ్ అని అడుగుతుంది గీతామాధురి. 

అభిజిత్ ఈజ్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్ రైట్ నౌ అని అడుగుతుంది శ్రీముఖి. 
మీరందర్ని ఇక్కడ చూడ్డం ఎంత బావుందో వి ఆర్ ఆల్ బిగ్ బాస్ ఫ్యామిలీ అని చెప్పాడు. 
మెచ్యూరిటీనా స్లోడౌన్ అవుతావా ఇంత కూల్ గా ఇన్ని వీక్స్ ఎలా ఉన్నావ్ అని అడిగింది హరితేజ. లేదు లేదు నేను కూడా కాస్త కోల్పోయాను కొన్నిసార్లు అని అన్నాడు. నేను కంట్రోల్ చేస్కుంటున్నా అన్నాడు. సోహెల్ నేను కూడా కంట్రోల్ చేస్కున్నా అంటే నువ్వు కంట్రోల్ చేస్కుంటేనే ఇట్లుంటే చేస్కోకపోతే పరిస్థితి ఏంటి అంటుంది శ్రీముఖి. 
డాన్స్ బాగా చేశావ్ అని అన్నారు అభిని అందరు కలిసి అభి స్టెప్ ఒకసారి వేశారు. 

అరియానా లౌడ్ స్పీకర్ అని అరుపులు మానరిజమ్స్ నువ్వు ఆపరా అవి అన్నీ చెప్పి నవ్వింఛారు.  
సోహెల్ అరియానాని ఇమిటేట్ చేసి చూపించాడు. మళ్ళా ఓసారి హగ్ చేస్కోండి అని అడిగింది గీత మేంఉ మాములే ఇపుడు కలిసిపోయాం అని చెప్పారు. 
చింటు గాడ్ని ఏం చేశాడో తెలుసా అరియానా అని వాష్ రూం లో చేసిన అల్లరి చెప్పారు. అయ్యో అని ఫీలవుతున్నాడు సోహెల్ మీరు గొడవ చేయడం మళ్ళీ నువ్వు పాచప్ చేస్కోడం చూడ్డానికి బావుంటుందిరా అని అన్నాడు అలి. 

సీరియస్ నోట్ శ్రీముఖి అరియానాతో నీకు గర్ల్ పవర్ టూ యూ.. చాలా సంధర్బాల్లో ఇంటికి ఎగెయినెస్ట్ గా వెళ్ళి చాలా సార్లు లీడ్ తీశ్కుని చేశావ్ ఎట్లా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అని అడిగింది. 
నా రోల్ మోడల్ మీరే అని చెప్పింది శ్రీముఖితో. నువ్వు గర్ల్స్ అందరికి ఒక స్ట్రెంత్ సెట్ చేశావ్ అని చెప్పారు హరితేజ కూడా. ఫుల్ జోష్ అండ్ ఎనర్జీ ఇచ్చారు అరియానాకి. గీత మాత్రం ఏది మాట్లాడిన ఎం చేసినా కూల్ గా ఉండండి ఎంజాయ్ చేయండి అని చెప్పింది. 

హారికని చోటూ అంటారు కానీ టాస్క్ లు ఆడే పద్దతి కానీ డేసిషన్ మేకింగ్ కానీ ఎంత పద్దతిగా అనిపిస్తాయో ఇలాగే ఆడి ఫైనల్ కి వచ్చావ్ కాబట్టి ఇలాగే ఆడు అన్నారు.

అండరు నీకోసం ఒక పాట అని రిక్వెస్ట్ చేస్తే వెల్కం టు ద పార్టీ పాట వేశారు హారిక కోసం డాన్స్ చేసింది భలే. 

అభిజిత్ నాకు కొన్ని టిప్స్ ఇవ్వు అని అడిగాడు నేను నానా రచ్చ చేయాల్సొచ్చింది నువ్వు సింపుల్ గా ఉండి ఎలా ఇంప్రెస్ చేస్తున్నావ్ అమ్మాయిల్ని అడుగుతున్నాడు. 
నీ గర్ల్ ఫాన్స్ కి ఏమైనా చెప్తావా అని అదిగితే మనోడు ఇంగ్లీష్ లో మొదలు పెట్టాడు. అఖిల్ ఎక్కువ పాడాడు కదా ఈ సారి నువ్వు పాడు అని అడిగారు. 
నీ ఎదలో నాకు చోటె వద్దు పాట పాడాడు లిరిక్స్ 

నాసీజన్ లో నన్ను అర్జున్ రెడ్డి అనేవారు నువ్వు నన్ను దాటేశావ్ అంటే నీవల్ల వీడికి మంచి పేరు వచ్చింది అని అంటుంది శ్రీముఖి. సో ఇంతకీ నువ్వు ఏది కోపంమనిషివా లేక వెళ్ళి కన్సోల్ చేస్తావ్ కదా అది నువ్వా అని అడిగాడు. సోహెల్ నేను కంట్రొల్ చేస్కోలేను నా తప్పు లేనపుడు అంటే నేను అలా రియాక్ట్ అవుతా అని అన్నాడు. సోహెల్ ఏడ్చిన సంధర్బాలు చెప్పారు. గొడవైనా అల్లరి ఐనా నువ్వుంటావ్ అని చెప్పాడు. 
అఖిల్ నువ్వు ఇద్దరి చేతులు పట్టుకుంటే నాగ్ నువ్వేం చెప్తావ్ అని అడిగారు నో మోర్ శాక్రిఫైస్ అని చెప్పారు. 

నౌ వి వాంట్ టు టాక్ టు మోస్ట్ డిజైరబుల్ మమ్మాస్ బోయ్ అఖిల్ గారు అని అడిగింది శ్రీముఖి. మోనల్ విషయంలో నువ్వెందుకు హర్ట్ అయ్యావ్ అని అడిగింది. నన్ను నామినెట్ చేసింది రాంగ్ రీజన్స్ చెప్పింది ప్రామిస్ బ్రేక్ చేసింది అని అందుకే అన్నాడు. టాస్క్ లో స్పీడ్ మాత్రం మాములుగా లేదు అని అంది గీత. 
మీ సెట్ అయితే అద్దిరిపోయింది అసలు చాలా బావుంది అని చెప్పారు. 
అఖిల్ కూడా వాళ్ళల్లో ఒకొక్కరి గురించి గ్రేట్ గా చెప్పాడు. 
మిగిలిన రోజుల గురించి మాకో సజెషన్ చెప్పండి అని అడిగాడు అభిజిత్. డిస్కనెక్ట్ అయి ఎంజాయ్ ద హౌస్ అని చెప్పారు. 
ప్రతి ఒక్కరికి వాళ్ళ గెం అండ్ స్ట్రాటజీ ఉంది ఇక్కడికి వచ్చారంటే ఇకమీద మార్పులు చేయాల్సిన అవసరం ఏం లేదు ప్రజలకి వదిలేయడమే బెస్ట్ అని చెప్పింది హరితేజ. 
మీకే తెలుస్తుంది అద్దం ముందు నుంచుని మీతో మీరే మాట్లాదుకుంటే మీకే తెలుస్తుంది అనిచ్ ఎప్పింది. 

గీతా చాలా బాగా ఆడారు కాబట్టే ఫైనల్ కి వచ్చారు ఆ ఇల్లు ఇంకా ఐదు రోజులే కాబట్టి ఎంజాయ్ చేయండి. చివరిలో మీరు ఇచ్చే ఏ స్టేట్మెంట్ కూడా ఎవరి కెరీర్ ని ఇంపాక్ట్ చేయకూడదు జాగ్రత్తగా ఉండండి. అని ఒకొక్కరి గురించి బాగా చెప్పింది. హారికని ఇంత్లో చిన్న చెల్లి లాగా అనిమాకు లే మీకు కాదు అంటే హా వద్దు మాకు చెల్లెలు అని అంటున్నాడు అఖిల్. గీటా ఏమో ఆ మాకు తెలుసులే మీకు వద్దు మీ పులిహోర మేం రుచి చూశాంలే అని చెప్తుంది :-) ఎవరు బాగా యుటిలైజ్ చేసారు అంటే నువ్వేఅంటున్నాడు అలి. 

శ్రీముఖి నేనేం చెప్పను.. చివరి వారంలో ప్రతి మూల మూల ఛూసుకున్నాను ప్రతి కెమ్రేరాతో కావాలని ఇంగ్లీష్ లో మాట్లాడి చిల్ అయ్యాను మీరు కూడా అలాగే చిల్ అవ్వండి అంది. తిను కూడా ఒకొక్కరి గురించి చాలా బాగా చెప్ప్పింది. 

అలి దురదృష్టం అని సరిగా చెప్పలేకపోటె నవ్వారు. ఏం పర్లేదు వాళ్ళు నవ్వుతూనె ఉంటారు మనం ముందుకు వెళ్ళాడమే అంటే ఇదే నేర్చుకున్నా అమ్టుంది హరితేజ ఇక్కడ పాజిటివిటి నెగెటివిటి రెండూ వస్తాయ్. మీరు ఏం చూపింఛాలని అనుకున్నారో అది చూపించేశారు ఈ చివరి వీక్ లో ఏం మార్చకండి ఏం పీకలేరు చివర్లో అని అన్నాడు. 

హారిక చేతి మీద ఏం రాశానో ఎలా కనిపించింది అని ఆశ్చర్య పోతున్నాడు అఖిల్. చింటుగాడ్నేం చేశావ్ రా అని అడుగుతుంది అరియానా. 
మొత్తం మీద హౌస్మేట్స్ అందరికి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు అందరు చాలా హాపీ ఫీల్ అయ్యారు. అందరితొనూ సమానంగా మాట్లాడారు కదా అనుకుంటున్నారు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts