18, డిసెంబర్ 2020, శుక్రవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజు ఎపిసోడ్ లో రెండ్రోజులు కవర్ చేసేశారు. నూటరెండో రోజు ఓప్పో ఫ్లాంట్ యువర్ సెల్ఫ్ టాస్క్ ఇచ్చారు వైట్ టీషర్ట్స్ ఇచ్చి అవి వేస్కుని ఒకొక్కరి వీపు మీద మెసేజెస్ రాయమన్నారు. ఒకప్పటి ఆటోగ్రాఫ్ బుక్స్ అండ్ తర్వత శ్లామ్ బుక్స్ గుర్తొచ్చాయనమాట. 

ఇక నూటమూడో రొజు రీయూనియన్ ప్లాన్ చేశారు. పొద్దు పొద్దున్నే మోనల్ వచ్చి బెలూన్స్ ఎగరేస్తూ మంచి మెసేజ్ ఇచ్చేళ్తే మధ్యాహ్నం కళ్యాణి గారు లాస్య గారు వచ్చి చిన్న ఆట ఆడించి వెళ్ళారు. సాయంత్రం కుమార్ సాయి స్వాతి దీక్షిత్ వచ్చి కంటెస్టెంట్స్ ని ఆడుకుని వెళ్ళారనమాట. 

మోనల్ అరియానా ని చూస్తే నాకు జెలస్ గా ఉంది నువ్వు టాప్ ఫైవ్ లో ఉన్నందుకు అని అంటే కుమార్ సాయి ఎవర్నీ వదలకుండా అందరి మీద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ పంచ్ లు వేసేశాడు. అవేంటో వివరాల్లో చూద్దాం.  

            
వివరాలలోకి వెళ్తే 102 వ రోజు ఇంట్లో 5 గురు సభ్యులు ఉన్నారు. ఫైనల్ ఫైవ్. అభి,అఖిల్,సోహెల్,అరియానా,హారిక  
ఉదయం రియల్ మాంగో జ్యూస్ జింగిల్ తో  మేల్కొలిపారు. 

సాయంత్రం ఐదున్నరకి ఓప్పో టాస్క్. టీ షర్ట్స్ పంపారు వేస్కుని ఒక్కొక్కరి టీ షర్ట్ వెనక వైపు అందరు మెసేజ్ రాయాలి. 

అఖిల్ కి యువర్ సోల్మేట్ ఈజ్ వెరీ లక్కీ హోప్ షి విల్ ఫైండ్ యు సూన్ అని రాసి హారిక లిప్స్టిక్ ముద్ర వేసింది.
సోహెల్ ఒక చిన్న సైజ్ ఎస్సే రాశాడు ఒక్కొక్కరికి.

103 వరోజు ఉదయం ఎనిమిది గంటలు కింగ్ సినిమాలోని నువ్వు రెడీ నేను రెడీ పాట వేశారు బ్లైండ్స్ పైకి తీసే టైం కి మోనల్ గ్లాస్ ఛాంబర్ లోకి వచ్చేసింది. 

ఆల్ మోస్ట్ పాట అంతా ఫుల్ గా డాన్స్ చేసింది మోనల్ చాలా హుషారుగా. 
 

తెల్లారుఝూము మూడు నాలుగు వరకు నిద్రపట్టట్లేదంట మోనల్ కి. 

హౌస్మేట్స్ బయట గురించి కొశ్చన్స్ అడుగుతుంటే ఏం చెప్పట్లేదు మోనల్ తెలివిగానే స్కిప్ చేసింది.    
మీరు అనుకున్నవి అన్నీ నిజమవ్వాలని బెలూన్స్ ఎగరేసింది. 
అరియానా నువ్వు టాప్ ఫైవ్ లో ఉననవ్ నేను కొంచెం జెలస్ అని చెప్పింది స్టిల్ లెట్ ఇట్ గో నెగటివిటీ అంతా వదిలేయాలి అని చెప్పింది. ఏమైనా బీహాపీ కథ వేరే ఉంటుంది అని చెప్పింది అరియానాకి. 

సోహెల్ ఇంత తక్కువ టైం లో ఇంత క్లోజ్ అయ్యారు యూ ఆర్ జస్ట్ లైక్ మి లైక్ బ్రదర్ లైక్ సిస్టర్ అని చెప్తుంది. మీ అందరూ విన్ అవ్వాలి అని చెప్పింది. మనీ షేర్ చేస్కోండి అని చెప్తుంది. 

దేత్తడి ఇచ్చిపాడు.. ఆల్రెడీ గ్రోన్ సోమచ్ ఔట్ సైడ్ నువ్వు టాప్ లో ఉండాలి లైఫ్ లో అని చెప్పింది.   

బిగ్ బాస్ వెళ్ళండి అని అంటే నైంటీఎయిట్ డేస్ గురించి ఆలోచించండి. ఒక్క టూ మినిట్స్ టైమ్ ఇవ్వండి ప్లీజ్ అని అడిగింది. డోర్స్ ఓపెన్ అయ్యాక కూడా కాసేపు మాట్లాడి వెళ్ళింది. మోనల్ మీరంతా బయటికి వస్తే చాలా బిజి బిజి అవుతారు అని అంది. పొద్దున్న లెవగానే రావడం అండ్ లాస్య వాళ్ళకన్నా తక్కువ టైం కేటాయించడం చూస్తే తను ఏదో బిజీగా ఉండి పొద్దున్నే వచ్చిందేమో అని అనిపించింది. 

మధ్యాహ్నం పన్నెండుగంటలకి కళ్యాణి గారు హరికథ చెప్తూ ఎంటర్ అయ్యారు. 
హౌస్మేట్స్ కోసం చక్కగా ఓ సోఫా అండ్ కుర్చీలు సెటప్ చేశారు. కళ్యాణి గారు ఏడ్చేశారు అందర్ని చూసి. అభి కూడా అక్క మిమ్మల్ని మీ పాటలు మిస్సయ్యాం అని చెప్పడం బావుంది. 

నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను పాట పాడారు కళ్యాణి గారు. హరికథతో ఎంట్రీ ఏంటీ ఈ పాటేంటి అండీ అసలు :-)

ఎస్ / నో చెప్పాలి.. మూడు కన్నా ఎక్కువ ఎస్ లు వస్తే నీళ్ళు పోస్కోవాలి. 
  
అఖిల్ కి ఎక్కువ హగ్గులు లభించాయ్ నాలుగు ఎస్ లు.. 
అఖిల్ అరియానా కంటే హారికతో ఎక్కువ ఫ్లర్ట్ చేస్తాడు. నాలుగు ఎస్ లు...
అఖిల్ అభిజిత్ కంటే మంచి సింగర్ నాలుగు ఎస్ లు.. 
పాపం మూడు సార్లు ఐస్ వాటర్ పోసేసుకున్నాడు. లాస్య చాలా వెటకారంగా ఉండిపోరాదే అని పాడింది. 
అఖిల్ కి వచ్చే ఏడాది పెళ్ళి అవుతుంది నాలుగు నోలు.. 

అరియానా తను తెలివైనదని ఫీలవుతుంది. 
అరియానాకి అవి కంటే చింటూ ఎక్కువిష్టం
అరియానా గొంతు జలజ గొంతు కంటే ఎక్కువ భయంకరం.. నాలుగు ఎస్.. 

సోహెల్ నైన్ పిఎమ్ తర్వాత ఏ పని చేయడు. ఒకటే పని చేస్తాడు అది ఇక్కడా చేయలేడు. 
ఫ్యూచర్ లో సోహెల్ ఒక మంచి పోల్ డాన్సర్ అవుతాడు. అఖిల్ అభి నో చెప్పారు. 
సోహెల్ టూత్ పేస్ట్ ని మేకప్ లా వాడతాడు ఎస్.. 

అభి వాళ్ళమ్మగారు మోర్ ఫన్నీ దాన్ హిమ్ అన్ని ఎస్
అభి వాటర్ ఒంపేసి ఓన్లీ ఐస్క్యూబ్స్ వేస్కున్నాడు. 
అభి మనాలి జాకెట్ తనకన్నా ఫేమస్ ఎస్.. 

హారిక జోక్స్ పాథటిక్ గా ఉంటాయ్.. అఖిల్ తప్ప అంత ఎస్.. 

ఒక వాటర్ బాటిల్ పై నోయెల్ కోసం నెయిల్ పాలిష్ తో మెసేజ్ రాస్తున్నాడు అభిజిత్. సో క్యూట్ అనిపించింది వీళ్ళిద్దరి రిలేషన్ అండ్ ద వే హీ ఈజ్ మిస్సింగ్ హిజ్ కంపెనీ.  

సాయంత్రం నాలుగింటికి స్వాతి కుమార్ సాయి ఒక పెయిర్ లా వచ్చి గొడవ పడుతూ మధ్యలో హౌస్మేట్స్ ని తీస్కొస్తూ కాసేపు ఫన్ జెనెరేట్ ఛేశారు. కాసేపు చేశాక ఇక మా వల్ల కావట్లేదు అని నవ్వేసి అందరితో కబుర్లు చెప్పారు. 
కుమార్ సాయి నవ్విస్తూనే ఒక్కొక్కరిపై ఒక్కో రకం పంచ్ వేసేశాడు దదాపు అందరిపైనా - హారిక చిన్న కారణలతో నామినేట్ చేస్తుందని. 
కుమార్ సాయి అఖిల్ తో మనిద్దరికి ఇష్టమైనది పులిహోర.. అండ్ మనిద్దరికీ ఇష్టం లేనిది కరివేపాకు అంట :-)
కుమార్ సాయి అభి తో ప్లేయర్ కి గుర్తింపు వస్తుంది బౌలర్ కి బాట్స్మన్ కి కానీ ఎంపైర్ కి గుర్తింపు రావడం ఎక్కడైనా జరిగిందా అభి నువ్వు ఎన్ని సంచాలక్ రోల్స్ చేశావ్ హౌస్ లో దానితోనె నీకెంత గుర్తింపు వచ్చింది అని చెప్పేశాడు. 
సోహెల్ అండ్ కుమార్ సాయి మధ్య వేలు దించుఅనె విషయం మీద మళ్ళా ఎనాక్ట్ చేసింది. 

గంగవ్వ వచ్చారు ఇంట్లో మళ్ళీ చూడ్డం చాలా సంతోషంగా ఉంది. 
తన ఎంట్రీతో ఈ రోజు ఎపిసోడ్ కట్ చేశాడు. రేపు ప్రోమోలో గంగవ్వతో పాటు సుజాత ఎంట్రీ, మెహబూబ్ అండ్ దివి, నోయల్, అవినాష్ ల ఎంట్రీ కూడా చూపించారు. దేవి గారు, సూర్యకిరణ్ గారు, అమ్మ గారు మిస్సింగ్.   
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts