10, నవంబర్ 2020, మంగళవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 


ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ పెట్టారు ఐతే ఒకరికోసం ఒకరు ఆడాల్సిన ఓ కొత్త ఆట కావడంతో చివరికి రసాభాసా అయి అఖిల్ అండ్ మెహబూబ్ మొండితనంతో టాస్క్ రద్దయింది. ఎవరూ కెప్టెన్ కాలేదు ఎవరికీ ఇమ్యునిటీ రాలేదు. మెహబూబ్ పై అయిష్టత పెరగడానికి కారణం అయింది. ఇదివరకూ కూడా ఇలాగే సెల్ఫిష్ గేం ఆడాడు పట్టే తప్ప విడుపు లేని ఇతని ప్రవర్తన కారణంగా ఈ రోజు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పే అఖిల్ కి తీరని నష్టం చేశాడనిపించింది. 

వివరాలలోకి వెళ్తే  65 వ రోజు తొమ్మిదిమందున్నారు ఇంట్లో. లక్స్ పాప లక్స్ పాప పాటతో నిద్ర లేపారు. 

లాస్య సోహెల్ మాట్లాడుకుంటున్నారు. సోహెల్ ఆంటీ అని అంటే లాస్య తిడుతుంది వాదిస్తుంది నిన్ను నువ్వు ఎట్లనుకుంటావ్ అని మళ్ళీ మార్చేశాడు సోహెల్ వాదన. ఆంటీ అన్నావంటే నేను నీకు యాంటీ అవ్వాల్సి వస్తుంది అంట :-) 

కెప్టెన్సీ టాస్క్ ఆఖరి బంతి. అందరూ పోటీ దారులు. పోటీ దారుని ముఖం అతికించిన బంతి ఉంది. ఒకొక్కర్రు వేరే సభ్యుని బొమ్మ ఉన్న బంతిని తీస్కెళ్ళి బాస్కెట్ లో వేయాలి. ఎవరి బంతి చివరికి వెళ్తుందో వాళ్ళు రేస్ నుండి తప్పుకుంటారు. వెళ్ళాక ఆ లైన్ ని కోన్ తో బ్లాక్ చేయాలి. చివరి రౌండ్ లో ఎవరి బంతి ముందు పడుతుందో వాళ్ళే కెప్టెన్. 
గేం ఇంట్రెస్టింగ్ ఎవరి గేం వాళ్ళు కాకుండా పక్కనోళ్ళ కోసం ఆడాలి. అలాగే తమ బంతిని కాపాడుకోవాలి.  

ఎవరెవరు బాల్స్ తీస్కోవాలి అని అనుకోవడంలో సోహెల్ అండ్ మోనల్ దగ్గర అఖిల్ మోనల్ వేయలేదు అని అన్నాడు. అన్నట్లే మొదట తనే లాస్ట్ ఆడింది లాస్య ఆగిపోయింది. 

పెయిర్స్ పెయిర్స్ గా ఆడుతున్నందు వల్ల మోనల్ బంతి ఎవరూ తీస్కోకపోవడంతో తను ఆగిపోయింది. 
అలాగే అవినాష్ అరియానా 
అభిజిత్ అండ్ హారిక కూడా ఔట్ అయ్యారు. 

ఫైనల్ గా అఖిల్, మెహబూబ్, సోహెల్ మిగిలారు. మీరిద్దరిలో ఎవరో ఒకరు అవండి అని చెప్పాడు సోహెల్. అఖిల్ అండ్ మెహబూబ్ ఇద్దరిలో కాంపిటీషన్ ఇపుడు.  

సోహెల్ డ్రాప్ అయినందుకు నేను నిన్ను నామినేట్ చేయచ్చా అని అభి డిస్కషన్ పెట్టాడు. సోహెల్ నువ్వు ఆటలో ఉండి కూడా ఎందుకు ఆడడం లేదు నేను నామినేట్ చేస్తా అని అవినాష్ కూడా అంటున్నాడు. 

ఈ రౌండ్ లో అఖిల్ మెహబూబ్ ఇద్దరూ ఒకేసారి వేశారు. సోహెల్ ఎలిమినేట్ అయ్యాడు. 
చివరి రౌండ్ లో అఖిల్ అండ్ మెహూ ఇద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు నేను అవ్వాలంటే నేను అవ్వాలి అని. మెహబూబ్ నేను నామినేషన్ లో ఉన్నా కనుక నేను కెప్టెన్ ఐతే నాకు ఉపయోగం అని అంటున్నాడు మెహబూబ్. దీన్కి దానికేం సంబంధం లేదు అని అఖిల్ అంటున్నాడు నేను ముందు వేయను అని అన్నాడు. 

ఇద్దరి మధ్య డిస్కషన్ ఐతె అస్సలు తెగడం లేదు. కాయిన్స్ విషయంలో నీకు ఇచ్చాను కనుక ఇపుడు నాకు చేయ్ అని అఖిల్ అంటున్నాడు. ఇద్దరూ కూడా విల్లింగ్ కాదు. బజ్జర్ మోగినా కూడా ఎవరూ వేయడం లేదు. 

అఖిల్ అండ్ మెహబూబ్ ఇద్దరూ ఎవరి బాల్ వాళ్ళే పట్టుకున్నందున టాస్క్ రూల్స్ నే కాక మీ ఇద్దరిని ఫైనల్ లో నిలబెట్టిన ఇతర సభ్యుల ఆటకి కూడా విలువ ఇవ్వడం లేదు ఈ బాధ్యతా రాహిత్యం కారణంగా ఈ టాస్క్ ను రద్దు చెస్తున్నాను. ఈ వారం ఎవరూ కెప్టెన్ ఉండరు ఎవరికీ ఇమ్యునిటీ రాదు. 

సోహెల్ చాలా కోప్పడుతున్నాడు. అఖిల్ కూడా చాలా కోప్పడుతున్నాడు. మీరిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేస్కుంటారు కానీ నాకెవరూ సపోర్ట్ చేయరు అని అన్నాడు. 
సోహెల్ నేనైనా బావుండేది అని బాధపడుతున్నాడు.
 
మెహబూబ్ కూడా కూర్చుని ఏడుస్తున్నాడు దేవుడు ఇచ్చినట్లే ఇచ్చి లాగేస్తున్నాడు అని. 
ఇద్దరూ మొండోళ్ళే అని అరుస్తున్నాడు సోహెల్. మోనల్ ఆగు ఐపోయింది కదా అని అంటే ఐంది కనుకే బాధ ఉంటుంది అని చెప్తున్నాడు. 
తర్వాత మెహబూబ్ దగ్గరికి వెళ్ళి లేచెళ్ళి మొహం కడుక్కో మళ్ళా ఏడుపొకటి అని అనడం తన మంచితనం స్నేహానికి ఇచ్చే విలువ బాగా తెలుస్తున్నాయ్. 

లాస్య ఈ టైం లో ఎవరితో వెళ్ళి మాట్లాడాలో తెలీడం లేదు అని అంటుంటే ఇది టైం కాదు ఎమోషన్ తగ్గాక మాట్లాడితే ఓకే అన్నాడు అభి. 
మోనల్ అఖిల్ మధ్య డిస్కషన్ నడుస్తుంది.  అఖిల్ మెహబూబ్ ఒక్క సారి కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని బాగా కోప్పడ్డాడు.     దివాలి గిఫ్ట్ కూడా నాకు మీ ఇద్దరిలో ఎవరూ రాయలేదు అన్నాడు. నువ్వు కూడా మా ఇద్దరిలో ఎవరికీ రాయలేదు కదా అని అంటున్నాడు సోహెల్. 

హారిక అభి మధ్య డిస్కషన్ నువ్వు ఎక్కడో ఉంటున్నావ్ పో పోయి వాళ్ళకి హగ్ లు ఇచ్చుకో పో అని అంటున్నాడు అసలు నీ అంతట నువ్వు వచ్చి హగ్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది అని అడుగుతున్నాడు అభి హారికని. హారిక మళ్ళీ ఎక్కువ చనువు తీస్కుంటే నేను టంగ్ స్లిప్ ఐ నిన్నేమైనా అంటాను మళ్ళీ నీక్కోపం వస్తుంది అందుకే కాస్త జాగ్రత్తగా ఉంటున్నా అని చెప్తుంది. 

ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారనే విషయం మీద సోహెల్ మోనల్ మధ్య డిస్కషన్ నడుస్తుంది. 

ఫైనల్ గా అఖిల్,మెహు,సోహెల్ ముగ్గురు హగ్గులిచ్చుకున్నారు. 

అవినాష్ మోనల్ కి బిస్కట్లేస్తున్నాడు. లడికి లడికి టాప్ ఫై లడికి అంటూ.. హారిక అఖిల్ కి హెడ్ మసాజ్ చేస్తుంది. థ్యాంక్స్ మోనల్ నాకు తలనొప్పి ఇచ్చినందుకు థ్యాంక్స్ హారిక అది తగ్గిస్తున్నందుకు అంటున్నాడు అఖిల్.. 

రాత్రి ఒంటిగంటకి సైరన్ తో అందర్ని నిద్రలేపాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులందరూ స్టోర్ రూం లోని సూట్ కేసెస్ లో తమ వస్తువులన్నీ సర్దుకోండి అని చెప్పాడు. 

రేపటి ప్రోమోలో అందరూ సర్దుకుని బయట గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఫైనల్ వరకూ సాగే మీ ప్రయాణంలో ఎవరు అడ్డు పడతారని మీరు భావిస్తున్నారో వారి పేరు చెప్పండి అని అడిగారు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం. 


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts