ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది నా రఫ్ నోట్స్ కీ పాయింట్స్ కోసం ఆసక్తి ఉన్న వాళ్ళు అది చూడవచ్చు.
నామినేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అయ్యాక ఐదుగురు నామినేట్ అయ్యారు. వారిలో ఒకరు సేవ్ అవ్వచ్చు అని చెప్పి ముఖం జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చారు. అందరూ పంతంగా ఆడి చివరి వరకు ఉన్నారు కానీ అంత శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందనిపించింది. కనీసం హారిక అభి డ్రాప్ అయ్యాకైనా ముగ్గురు మాట్లాడుకుని ఒకరిని సేవ్ చేసి ఉంటే బావుండేదనిపించింది.
అభి అమ్మ గారిని నామినేట్ చేశాడు. మీరు ఎదుటి వారిని ఒక మాట ఈజీగా అనేస్తారు మీరు మాత్రం ఏం తీస్కోలేరు అందుకే నామినేటింగ్. ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. నోయల్ నన్ను కొట్టాడు తల మీద అనేది తీస్కొచ్చాడు. నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి అతనెవరు అని అడిగాడు మాస్టర్. అవినాష్ మధ్యలో వచ్చాడు నా పేరు వచ్చింది అంటూ.. ఇది నా నామినేషన్ ప్రక్రియ మీరు రాలేరు అన్నాడు అభి. అదే మాట హారిక చెప్తే నువ్వు నోర్మూయ్ అన్నాడు అమ్మ. మీరు ఇంత లైఫ్ చూశారు మీకు తెలుసు అని ఏదో చెప్పబోతుంటే నా లైఫ్ హిస్టరీ అంతా నీకెందుకు అదంతా చెప్పకూడదు నువ్వు అంటూ నువ్వు నోయల్ ని సపోర్ట్ చేస్తున్నావ్ నోయల్ కోసమే నామినేట్ చేశావ్ నన్ను అని గట్టిగా అరుస్తున్నారు. అభి మాత్రం మిమ్మల్ని ఒక మాటంటే మీరు తీస్కోలేరు అందుకే మిమ్మల్ని నామినేట్ చేశా నేను అని చెప్పాడు. ఇద్దరూ వాయిస్ పెంచి చాలా గట్టిగా అరుచుకున్నారు.
కష్టపడకుండా సినిమా వస్తే ఇంతే అనే మాట అన్నాడు మాస్టర్ అది చాలా తప్పు మాట అనిపించింది. కష్టం కష్టం అంటే ఎవడు మాత్రం కష్టపడట్లేదు అని అన్నాడు అభి. అమ్మ గారు ఫుల్ గా అరిచేసి మొత్తం పెద్ద సీన్ చేసేశాడు. దిల్ ఉంటే టాస్క్ కి రా చైర్ లో కూచోడం కాదు. దా రన్నింగ్ రేస్ ఆడదాం రా అని పిలిచాడు అమ్మ.
నేను నామినేషన్ వేయనురా అని అమ్మ గారు లోపల్కి వెళ్ళారు. ప్రాసెస్ అది దాన్ని ఆపకూడదు అని చెప్తున్నారు మెహబూబ్ అండ్ సోహెల్.
హారిక అవినాష్ ని నామినేట్ చేస్తుంది. మజాక్ గా అన్నా కూడా మీరు నా హైట్ గురించి కామెడీ చేయకండి. అని చెప్పింది. నేను హీరోయిన్ రోల్స్ చేయాలి అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ చెప్పలేదు కనుక సీరియస్ గా చెప్తున్నాను దయచేసి హైట్ గురించి మాట్లాడకండి అని అంది.
అమ్మ గారు ఏడ్చేస్తున్నారు. అలా ఏడుస్తున్న మనిషిమీదే గుడ్డు కొట్టి నామినేట్ చేసి హారిక కారణాలు వివరిస్తుంది. ఆ నిన్నే ఎలిమినేట్ ఆవ్వాలి అని ఓటేశావ్ కదా ఇంకేంటి కొట్టి పో అని అంటున్నారు అమ్మ. హారిక దానికి రీజన్స్ ఇమ్మన్నారు బిగ్ బాస్ ఇవ్వనివ్వడం లేదు అలా ఆపితే నేనేం చేయలేను అని అంటుంది. నేను కూడా రీజన్ ఇస్తాను అన్నారు అమ్మ గారు. ఇండాక వరకు మోనల్ ని చేద్దాం అనుకున్నా. పది నిముషాల ముందు నోర్ముయ్ అన్నారు నన్ను అది నాకు నచ్చలేదు అని చెప్పింది. అమ్మ గారు నోటికి వచ్చినట్లు మాటాడేస్తున్నారు. హారిక కూడా సీరియస్ గానే రిప్లై ఇచ్చింది.
లాస్య అవినాష్ ని నామినేట్ చేసింది. నువ్వు చాలా మారిపోయావ్ అని నా మీద కామెంట్ చేశావ్ అండ్ నీ రీజన్స్ నాకు నచ్చలేదు అని అంది. మోనల్ మన మధ్య చాలా డిఫరెన్సెస్ వున్నాయ్ అని అంది. అలాగే టాస్క్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదనిపించింది.
మోనల్ ఫస్ట్ సోహెల్ మీద నేను జాయిన్ చేస్తానే తప్ప ఇలా నిన్ను అఖిల్ ని బ్రేక్ చేయడనికి నేను ఎప్పుడూ ట్రై చేయను అని అంది. అలాగే నోయల్ వాళ్ళ విషయంలో నేను వెళ్ళి డైరెక్ట్ గా చెప్పలేదు. వాళ్ళు అడిగారు కనుక చెప్పాల్సి వచ్చింది. నేను అఖిల్ దగ్గర అన్ని చెప్తాను అని చెప్పింది.
లాస్య మీద సెకండ్. బేబీ టాస్క్ లో చాలా మంది బేబీస్ హంగ్రీ ఉన్నాయి. మెహబూబ్ అండ్ అరియానా కి తప్ప మిగిలిన వళ్ళకి సరైన టైమ్ కి ఫుడ్ రాలేదు నాకే రిపీటెడ్ గా చెప్పారు. కెప్టెన్సీ టాస్క్ లో కూడా నామీద జోక్ వేశారు. ఎంత ట్రై చేసినా మన మధ్య గ్యాప్ వస్తూ ఉంది అది కన్సిడర్ యాజ్ గుడ్ అని అనుకుంటున్నా అన్నాదు.
అమ్మ గారు అభి మీద నామినేట్ చేశారు. తను పాజిటివ్ గా ఇది మీ బ్లెస్సింగ్ లా తీస్కుంటాను అని అంటే కాదు ఇది బ్లెస్సింగ్ కాదురా అని చెప్పారు. ఇక ఒక విషయం మనం ఎనిమీస్ కాదు అని ఏడుస్తూ చెప్పారు. నోయల్ విషయం వద్దు నా గురించి చెప్పు అని అన్నారు.
అఖిల్ మీద రెండోది.. ఒకరు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి అనుకున్నపుడు నన్ను పంపిస్తా అని అన్నావ్ మొన్న అందుకే ఇపుడు నేను కూడా అందుకె చేశా నా పద్దతి కూడా అదే అని అన్నారు. నువ్వు నన్ను చేస్తె నేను చేస్తా అంతే అన్నారు. అది చిన్నపిల్లలాట అంటాడు అఖిల్ అది వాలీడ్ రీజన్ కాదని అన్నాడు.
మెహబూబ్ హారిక మీద వేశాడు. స్టార్ట్ చేసినపుడు పీక్ లో ఉంటున్నావ్ కానీ మధ్యలో ఎక్కడో డ్రాప్ అవుతున్నావ్ ఆ గ్రాఫ్ అలాగే ఉంటే ఎక్కడో ఉంటావ్ నువ్వు అన్నాడు.
అవినాష్ నీ గేం నువ్వు సూపర్ ఆడుతుననవ్ కానీ నువ్వు కొన్ని చెప్పడం వల్ల నీ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుఎన్స్ అవుతున్నారు అన్నాడు.
అఖిల్ అమ్మ గారు మీరే వెళ్తా వెళ్తా అని అన్నారు కనుక మిమ్మల్ని నేనే పంపిస్తాను అని అన్నాడు. అలాగే మీరు మోనల్, అభిలమాటర్ తీస్కొచ్చారు ఇందాక డిస్కషన్ లో అది కూడా బాలేదు అని అన్నాడు.
మోనల్ కి లాస్ట్ టాస్క్ లో నువ్వు పెర్ఫార్మ్ చేయలేదు. ఓవరాల్ గా డల్ అవుతున్నావ్ లైఫ్ లో క్లారిటీ లేదు మిస్సవుతుంది నువ్వు కన్ఫూజ్డ్ అనిపిస్తుంది. అది తెచ్చుకుంటే బావుంటుంది అన్నాడు.
ఈ వారం నామినేటెడ్ అవి అమ్మ అభి మోనల్ హారిక.
అఖిల్ సోహెల్ మెహబూబ్ హగ్ చేసుకున్నారు మనం సేఫ్ అని.
అమ్మ గారు మోనల్ ని పిలిచాడు నీ ఆట నువ్వు ఆడు అని మొదటి నుండి చెప్తున్నా. ఆడలేదని నిన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు అన్నాడు. ఎవరినైతే మనం ట్రస్ట్ చేస్తామో వాళ్ళే ఇలా హార్ట్ బ్రేక్ చేస్తారని అంటుంది మోనల్. అమ్మాయ్ తో ఫ్రెండ్శిప్ అంటే వేరే మీనింగ్ ఉంది కొంచెం మోర్ కావాలి ఆ మోర్ లేదు కదా అదే ప్రాబ్లం. నేను రాంగ్ జడ్జింగ్ ప్యూపుల్ అని అంటుంది. మోనల్ గ్రూప్స్ అన్ని చెప్తుంది మూడు గ్రూప్స్ ఉన్నాయ్ నేనొక్కదాన్నే ఒంటరిని అయ్యాను అని చెప్తుంది. నేను నీకు సపోర్ట్ ఉంటాను అని చెప్తున్నారు అమ్మ గారు.
యాభై ఎనిమిదో రోజు ఉదయం ఒకటే జననం ఒకటే గమనం పాటతో మేల్కొలిపారు. అందరూ బాగా డాన్స్ చేశారు. మెహబూబ్ అవినాష్ సోహెల్ ఎక్సర్సైజెస్ లాంటి యక్టివిటీస్ చేశారు బావుంది.
నామినేషన్ ప్రక్రియ పూర్తవలేదు. ఐదుగురికి ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఛాలెంజ్ లో గెలిచిన సభ్యులు ఇమ్యునిటీ పొందుతారు.
ముఖం జాగ్రత్త ఛాలెంజ్
టీ స్టాండ్ మీద ముఖం పెట్టి నిలబడాలి. ఇచ్చిన వస్తువలని ముఖం మీద వేసి తీసేలా ప్రయత్నించాలి ఒక ఛాన్స్ ఉంటుంది ఒక సారి తీయచ్చు రెండో సారి తీస్తే ఔట్. ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళు సేవ్ అవుతారు.
ఐస్క్యూబ్స్ గడ్డి పేడ ఇలా చాలా ఐటమ్స్ తెచ్చారు అభిని ఎవరూ ఏం కదిలించడం లేదు మిగిలిన నలుగురిపై అన్నీ వేస్తున్నారు కానీ ఎవరూ కూడా కదలడం లేదు.
అఖిల్ మోనల్ మొహం మీద మట్టి క్లీన్ చేశాడు కళ్ళలో మట్టి పోయింది అని అదంతా క్లీన్ చేస్తున్నాడు. సోహెల్ అడ్డుపడ్డాడు. నువ్వు మెహబూబ్ ని అన్నావ్ నువ్వు ఇక్కడ మాత్రం చేస్తున్నావ్ అని అంటున్నాడు. ఆవిడకి లెన్స్ లున్నాయ్ అంటే అమ్మ గారు నడుం నొప్పి ఉంది అందరికి ఏదో ప్రాబ్లమ్ ఉన్నాయ్ అని అన్నాడు. మెహబూబ్ సోహెల్ అఖిల్ తో వాదిస్తూ ఉన్నారు. గట్టిగా వాదన ఐంది. మెహబూబ్ అండ్ సోహెల్ మోనల్ ని గట్టిగా అటాక్ చేస్తున్నారు. నలభై ఐదు నిముషాలు అలాగే కంటిన్యూ చేస్త్తున్నారు.
అఖిల్ సోహెల్ మెహబూబ్ ల మీద సీరియస్ అయ్యాదు సరే మీరు ఆడండ్ర చూస్తాను అని అఖిల్ మానేసి వెళ్ళి పూల్ గట్టు మీద కూచున్నాడు. అఖిల్ అండ్ సోహెల్ ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. మెహబూబ్ మాస్టర్ కి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అఖిల్ నుండి అప్పుడు బాగా అఖిల్ కి కోపం వచ్చింది.
సోహెల్ అఖిల్ పక్కకి వచ్చి కూర్చుని మాట్లాడి మళ్ళీ నచ్చచెప్పడానికి ట్రై చేశాడు గేం ఆడురా అని.
అరియానా మోనల్ మీద ఎగ్ కొడతాను అని బాగా బయపెట్టింది. హారిక ఒక సారి కదిలింది. దదాపు మూడు గంటలు ఎవరు కదలలేదు. హారిక ఒక సారి కదిలింది.
అరియానాని నీళ్ళు కొట్టనివ్వకుండా బకెట్ పారబోశాడు సోహెల్ మళ్ళీ అఖిల్ తో గొడవ వేస్కున్నాడు. అఖిల్ ముందే ఎవరికి సపోర్ట్ చేస్తున్నామ్ అనేది డిసైడ్ అవ్వాలి అని అన్నాడు దాంతో సోహెల్ మళ్ళీ రైజ్ అయ్యాడు.
ఐదున్నరకి మెహబూబ్ షేవింగ్ క్రీం తెచ్చి అందరి మొహాలకి పూశాడు.
మోనల్ కి ఎగ్ స్మెల్ రాకుండా టీ స్టాండ్ కి ఫోం పూసి ఏడవవద్దు దాని గురించి ఆలోచించకు అని చెప్పారు అఖిల్ అండ్ సోహెల్ ఇద్దరూ.. ఎగ్స్ కొట్తి ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఒక్కరు కూడా కదలడం లేదు. ఎండ్ బజర్ మోగపోతుంది అది మోగే సరికి ఒకరికన్నా ఎక్కువ ఉంటే అందరు నామినేట్ అవుతారు అని అంటున్నారు.
రాత్రి ఏడుగంటలకి అభి నాకు లైన్ దాటినట్లు అనిపిస్తుంది అని వెళ్ళిపోయాడు. నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను కానీ నాకూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఇది లిమిట్ దాటేసింది ఇక ఐ యామ్ పుల్లింగ్ ఔట్ అని తీసేశాడు. హారిక రెండు సార్లు తీసినందుకు ఔట్ అయింది అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు.
ఎనిమిదిముప్పావ్ కి అవి,మోనల్,అమ్మ ముగ్గురు ఉన్నారు ఒకరికంటే ఎక్కువ మంది టీస్టాండ్ మీద ఉన్న కారణంగా ఎవరికి ఇమ్యునిటీ లభించదు అని చెప్పారు బిగ్ బాస్. అందరూ నామినేటెడ్.
అవినాష్ ఏడ్చేస్తున్నాడు. ఎన్నో అవమానాలు భరించి వచ్చానిక్కడికి ఆ షో వాళ్ళు నన్ను బయటికి పంపించేశారు అవన్ని గుర్తొచ్చి చాలా స్ట్రంగ్ గా ఉన్నాను అని అన్నాడు. కాకపోతె ఇక్కడ నేనే కాదు అందరూ ఎవరికి వాళ్ళే చాలా స్ట్రఆంగ్ అని చెప్పాడు.
అందరిలోకీ మోనల్ దదాపు ఆరున్నర గంటల పాటు ఉండడం మాత్రం వెరీ సర్ప్రైజింగ్ అనిపించింది నాకు.
ఐ యామ్ హర్ట్ అఖిల్ నేను చాలా హర్ట్ అయ్యాను. నువ్వు నన్ను నామినేట్ చేసినందుకు కాదు నువ్వు నన్ను నమ్మడం లేదు అందుకని నీకు కూడా నా పై తప్పు అభిప్రాయం ఉంది మిగ్లిన వాళ్ళలాగానే అని ఒక్కతే బాధ పడుతూ ఏడుస్తుంది మోనల్. అండ్ యూ ఆర్ రైట్ యూ డోంట్ నో మీ అని ఏడుస్తూ థ్యాంక్యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ బిగ్ బాస్ అని అంటుంది. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.