8, నవంబర్ 2020, ఆదివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 


ఈ రోజు సన్ డే ఫన్ డే.. యాంకర్ సుమ వచ్చింది షో కి తన స్పాంటేనియస్ పంచ్ లతో కామెడీతో అందరిని చాలా ఎంటర్టైన్ చేసింది. నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ నమ్మించడానికి ప్రయత్నం చేసి చివరికి కాదని వెళ్ళిపోయింది. తర్వాత హౌస్మేట్స్ ఒకరికోసం ఒకరు దివాలి గిప్ట్స్ ఆర్డర్ ఇచ్చుకున్నారుట అవి వచ్చాయ్ వాటికోసం చిన్న చిన్న టాస్క్స్ పెట్టి అవి చూపించారు. మోనల్ కి అమ్మ గారికి ఎవరూ రాయలేదని వాళ్ళకి నాగ్ ఏ ఇచ్చారు. చివరిగా అమ్మ రాజశేఖర్ గారు ఎలిమినేట్ అయ్యారు. 

వివరాలలోకి వెళ్తే ఏ మాయ చేశావే సినిమాలోని "ఈ హృదయం కరిగించి వెళ్ళకే" పాటతో నాగ్ ఎంట్రీ. 
దివాలి గిఫ్ట్స్ ఇస్తున్నాం హౌస్ లో అందరికీ ఎవరెవరికి ఏ గిఫ్టో చూడ్దాం అంటూ ఎంటర్డ్. 
గార్డెన్ ఏరియాలోకి. అభిజిత్ గెట్ రెడీ టు డాన్స్. అంటే నాకు కెరీర్ ఉండాదు సర్ ఇక తర్వాత డాన్స్ రాదు బాబుకి అని ఫిక్సవుతారు అని చెప్పారు. 

సోహెల్ గిఫ్ట్ ఐటమ్ వచ్చింది ఒకర్ని సెలెక్ట్ చేస్కోవాలి మెహబూబ్ ని ఎన్నుకున్నాడు ఓన్లీ ఫేస్ మజిల్స్ వాడి మూడు బిస్కట్స్ తినాలి. యాభై సెకన్స్ లో చేసేశాడు. బ్రేస్లెట్ మెహబూబ్ ఆర్దర్ ఇచ్చాడు. 

అఖిల్ హెడ్ గేర్ వేస్కుని బాస్కెట్స్ బాల్ దాన్లో వేయాలి టెన్ బాల్స్ వేయాలి. ఈయనకి టాస్క్ ఇచ్చినపుడు అభి గేం ఆడాల్సిందే నో షార్ట్ కట్స్ అని నాగ్ పంచ్ వేశాడు.. మోనల్ గిఫ్ట్ చేసింది చాక్లెట్స్. 

అభిజిత్ బైనాకులర్స్ తో సేం కలర్ బాల్స్ తీస్కుని వాటి వాటి రంగు బాస్కెట్స్ లో వేయాలి అని చెప్పారు అఖిల్ ని సెలెక్ట్ చేస్కున్నాడు. చేయలేకపోయాడు. 

లాస్య టిష్యూ బాక్స్ నడుము కి కట్తుకుని దాన్లో నుండి బాల్స్ అన్నీ బయటికి పడేలా షేక్ చేయాలి. ట్వంటీ బాల్స్ వేయాలి. హారికని సెలెక్ట్ చేసింది.   

మెహబూబ్ అవి అమ్మ వాలంటీర్స్ మోనల్ జడ వేయాలి ఇద్దరికి విగ్స్ పెట్టుకుని చేశాడు. సోహెల్ గిఫ్ట్ చేశాడు మెహు సోహెల్ ఫోటో ఉన్న కప్. 

అవినాష్ ఊదుతు రెండు బెలూన్స్ ని పగలగొట్టాలి. అమ్మ గారిని సెలెక్ట్ చేస్కున్నాడు. చేయలేక పోయారు. గిఫ్ట్ రిటర్న్ చేశాడు. 

అరియానా వెల్క్రో బెల్ట్ వేస్కుని గోల్ చేయాలి. మెహబూబ్ చేయలేకపోయాడు బాక్ టుద రిటర్న్ బాక్స్ 

హారిక వెల్క్రో జాకెట్ తో ఉంటే బాల్స్ వేసి అతికించాలి. అభి త్రోయింగ్. లాస్య జాకెట్ వేస్కుంది. పదిహేను బాల్స్. రెండు ఉన్నాయ్ నువ్వులుండలు అభిజిత్ అండ్ ఇంకోటి మంచి డ్రెస్ ఉంది లాస్య పంపింది. 

మోనల్ కి అమ్మ గారికి ఎవరూ గిఫ్ట్స్ పంపమని అడగలేదు నేనిస్తున్నా అని మోనల్ కి అహ్మదాబాద్ నుండి స్వీట్స్ అండ్ అమ్మ గారికి ఫిష్ కర్రీ పంపించారు. ఇలా ఎవరూ అడగలేదంటే అదేంటీ అఖిల్ ఏం రాయలేదా అని అడిగుతుంది లాస్య :-)

మెహబూబ్ ని కిచెన్ లోకి వెళ్ళమన్నారు. అక్కడ అద్దం మోద  పేరు రాసుంది వాళ్ళ పేరు చదువుకుని రా నేను చెప్పమన్నప్పుడు వెళ్ళి వాళ్ళని హగ్ చేస్కో అన్నారు. అభిజిత్ సేవ్ అయ్యాడు.   

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ సుమ వచ్చింది. నువ్వు వైల్డ్ కార్డ్ ఏంటీ అని అంటే మరేం చేయమంటారు మీరూ మీ కోడలు ఇద్దరు యాంకరింగ్ చేసేస్తున్నారు ఇక నాకు చేయడానికి ఏముంది అందుకే హౌస్లోకి వెళ్తున్నా అంటోంది :-)

ఎలా ఒప్పుకున్నావ్ అంటే హౌస్లో వాళ్ళు అంత హాపీగా ఫ్రీగా ఉన్నారు మాస్కుల్లేవు శానిటైజర్ లేదు హాపీ అని అంటూంది. 

టిష్యూ బాక్స్ తీసి నర్మద కోసమా అని అడిగారు నాగ్ ఈ బ్రాండ్ వాళ్ళు అంబాసిడర్ గా పెట్టుకఉంటారు. అని మోనల్ ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది. 

లాలిపాప్ అరియానా కోసం కెప్టెన్ అరియాన ఇపుడు అసిస్టెంట్ కదా ఏ సీజన్ లొనూ అసిస్టెంట్ ని చూడలేదు అని అంది. ఇమిటేట్ ఛేసింది బాగా. 

లాస్య స్మైల్ ఏంటీ అని అడిగారు నాగ్ కన్నింగ్ కాదు రియల్ కాదు కవరింగ్ స్మైల్ అని చెప్పారు. అలా అనడం లేదు గోల్డ్ స్మైల్ అని చెప్పింది. చీమ ఏనుగు జోకుల పుస్తకం తెచ్చింది తనకి. ఓ హోటల్లో ప్లేట్ లో చ్తులు కడాగద్దు అంటే గ్లాస్ లో కడిగాడు అవినాష్ అనే జోక్. సరే లాస్య జోక్ చెప్పమంటే జలుబు నోస్ కే ఎందుకు అంటే అది ఐస్ మధ్యలో ఉంటుండి కాబట్టి అని చెప్పింది. 

అభి కోసం ఫిజికల్ యాక్టివితీ అని రెండు గరిటెలు తెచ్చాడు నంబర్స్ చెప్తున్నపుడు ఆ యాక్టివిటీ చేయాలి అంటూ ఫిజికల్ యాక్టివిటీస్ చేయించింది. 

హారిక ఎవనికి నువ్వు కేప్టెన్ ఐతే అని తనకి ఓ టంగ్ ట్విస్టర్ ఇచ్చింది. కుప్ప పక్కన కుక్క కుప్ప పక్కన కప్ప అని. లక్ష్యభక్ష్యములు కూడా అడిగింది. ఫైవ్ టైంస్. 

అవినాష్ కి ఇంగ్లీష్ టంగ్ ట్విస్టర్ ఇవ్వు అని అడిగారు బిట్ట్య్ బటర్ ఇస్తే 

సోహెల్ కి కోపం వచ్చినపుడు రెండు వైర్లు పెడితే హౌస్ లోకి సరిపోయే ఎలక్ట్రిసిటీ వస్తుంది అని అంది. ఇద్దరికీ పేర్లు రాసున్న ట్విన్స్ షూ ఇచ్చింది. 

అవినాష్ కి బిస్కట్స్ ఉన్న బాక్స్ తెచ్చింది. నువ్వు ఎవరికి బిస్కట్స్ వేస్తున్నావో కూడా తెలీదా అని అడిగింది. ఆ అమ్మాయిని అడిగితే చెప్తూంది. అందర్ని అడిగితే లేదంది. అరియానా ని అడిగితే లేచి నుంచుంటే నువ్వు కూర్చోవాలి అని చెప్తున్నాడు అవినాశ్. థ్యాంక్స్ నువ్వు లోపలుండడం వల్ల మాకు ఎక్కువ గాలి దొరుకుతుంది బయట లేకపోతే నీ ముక్కుతో పీల్చేస్తావ్ అని చెప్పింది. అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పు అంది. 

ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చింద్.ఒకరు అస్తమాను హర్ట్ అవుతున్నారు బయట కనిపించదు కానీ ఎక్కడో హర్ట్ అవుతున్నారు. అది ఈ ప్లాస్టర్ పెట్టుకోవాలి అని చెప్ప్పింది. 

అఖిల్ కోసం పాడ్ పెన్ తెచ్చాను కానీ కనపడడం లేదు అని ఓ వారం నుండీ మాటలు లేవు ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు అని చెప్తుంది. ఆయన మనసులో ఉన్నదంతా పేపర్ మీద పెడతాడేమో అని తెచ్చాను అని చెప్పింది. సరే ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అంటే ఏం చేస్తావ్ చెప్పు అని అడిగింది. అది ఫ్లోలో వచ్చేస్తుంది అని చెప్పాడు. మోనల్ కోసం తెచ్చిన టిష్యూ తీసి దీని మీద రాస్తాడు వాడేవాళ్ళు వేరే ఉన్నారు ఐనా ఇద్దరిలో ఎవరైనా ఒకటే అని పంచ్ వేసింది. పాట బాపాడుతాడు అని నాగ్ అంటే సరే పాడిద్దాం అంటే ఏమైపోయావే పాడాడు చాలా బాగా పాడాడు. నీ పేజ్ లు పెన్నులు ఏం అక్కర్లేదు తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు అని టూగుడ్ అని అందరూ మెచ్చుకున్నారు. 

నీ కోసం ఎవరైనా పాడారా అని నాగ్ అడిగితే హా పాడారు సార్ పాడాకే నేను రెండు జోల పాటలు పాడాను అని ఇన్స్టంట్ పంచ్ వేసేసింది :-)

హౌస్మేట్స్ అందరిని కన్ఫెషన్ రూం దగ్గరకి వెళ్ళండి డోర్ ఓపెన్ అవుతుంది అని కౌంట్ డౌన్ చేసి డోర్ ఓపెన్ అనగానే అక్కడ కాకుండా స్టేజ్ మీద డోర్ ఓపెన్ ఐంది. బిగ్ బాస్ కి వెళ్ళాలనే ఉంది కానీ చాలా సినిమాలు ప్రిరీలీజ్ లు వస్తున్నాయ్ అని ఇపుడు వెళ్ళలేను నాకు గంగవ్వ ఏజ్ వచ్చాక వెళ్తా అంటే నాగ్ వెంటనే ఓహ్ ఐతే నెక్స్ట్ ఇయరే అనమాట అని పంచ్ వేశారు :-) ఈ షోలో పాల్గొనాలంటే చాలా ధైర్యం చాలా గట్స్ కావాలి నాకు ఇంకా అంత లేదు అని చెప్పింది. వెళ్ళి పోయింది. 

కొంచెం నమ్మారు కదా అని నాగ్ అడిగితే సండే కాదు ఫ్రూట్ డే అని అభి అంటున్నాడు. అఖిల్ ఇంకా కొందరు లేదని చెప్పారు. 

ఇపుడు కార్డ్ తిప్పి చుపించాలి వాటి మీద అన్ని ఫ్రూట్స్ ఒకెటే ఉంటే వాళ్ళు సేఫ్. 
అవికి రెండు యాపిల్స్ ఒక పీచ్
మాస్టర్ కి మూడు వేరే మాంగోస్ అండ్ సీతా ఫల్ 
మోనల్ కి బనానాస్ మూడు సార్లు బనానా సేవ్డ్.. మోనల్ చాలా హాపీ యల్లో డ్రస్ వేస్కుంది సో చూస్తూ బనానా సేవ్డ్ మీ అంది అఖిల్ గట్టిగా హగ్ చేసేసుకున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా హగ్ చేస్కోడానికి వస్తుంటే అభి గివ్ దెమ్ సం స్పేస్ అంటూ వాళ్ళని ఆపాడు. 
  
అవినాష్ అండ్ అమ్మ గారు ఇద్దరూ అందరికి బై బై చెప్పారు. ఒక వేళ నువ్ ఎలిమినేట్ అయితే కనుక నాకోసం వెయిట్ చేయ్ నువ్వు ఏం చేస్కోకు అని అరియానా ఏడ్చేస్తూ ఉంది.   

ఇద్దరూ బూత్స్ లోకి వెళ్ళి డోర్ వేస్కున్నారు. 
లైట్స్ ఫ్లాష్ అవుతాయ్ గ్రీన్ లైట్స్ వచ్చాక ఓపెన్ చేయండి అని అన్నారు. వచ్చాక వెళ్ళి ఓపెన్ చేశారు. రెండు బూత్స్ ఎంప్టీ. ఫిఫ్టీన్ వీక్స్ గేం ఛాన్స్ ఫర్ డబల్ ఎలిమినేషన్ అని అన్నారు. నాగ్. అరియానా సీరియస్లీ యూ ఆర్ డూయింగ్ దిస్ డబుల్ ఎలిమినేషనా అని అడిగింది. స్టోర్ రూం చెక్ చేయండి అని అడిగాడు నాగ్. అక్కడ అవినాష్ ఉన్నాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చేశాడు. సేఫ్ అయితె ఆనందపడతారు నువ్వేంటి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటున్నావ్ అని అడిగారు నాగ్. చాలా సేపు గట్టిగా ఏడ్చేశాడు. గుండే ఆగిపోయింది సార్ ఎలిమినేట్ అయ్యాను అనుకుని బయటికి తీస్కెళ్ళే సరికి షివరింగ్ వచ్చేసింది కూలబడిపోయాను. జీరోకొచ్చాను సార్ మళ్ళీ బిగ్ బాసె లైఫ్ ఇచ్చింది అని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ పాదాభివందనం అని చెప్పాడు. నాగ్ క్లాప్ చేసి గివిటప్ ఫర్ అవినాష్ హీ ఈజ్ సేఫ్ అని చెప్పారు.  

అమ్మ గారు ఎలిమినేటెడ్ స్టేజ్ మీదకి వచ్చారు. 
ఎలా ఉంది జర్నీ అని అడిగితే ఇక్కడ కష్టపడే వాళ్ళకంటే కూడా కష్టపడకుండా కూడా ఉండచ్చు అని తెలిసింది అన్నారు. 
ఏవీ చూపించారు. దదాపు అన్ని ఎమోషన్స్ ఉన్నాయ్ బావుంది. 

ఈయన పదిహేడు కేజీలు తగ్గారుట.
అసలు నకిలీ అంటే అసలు లో సోహెల్ అండ్ అరియానా లాస్య మోనల్ నువ్వు నేను ఒకటే సేఫ్ గేం మనకి రాదు అందుకె గిఫ్ట్ కూడా రాలేదు. మెహబూబ్ నా శిష్య నా చిన్నపుడులా ఉంటాడు. కొన్ని కరెక్ట్ చేస్కుంటే హీరో విలన్ కాదు అని అన్నారు. అవినాష్ రియల్ జోకర్ కొంచెం కారెక్టరేషన్ ఉంది ఛేంజ్ చేస్కోవలి అని చెప్పారు. 
      
నకిలీ అఖిల్ బ్యాడ్ లేదు కానీ ఫ్యామిలీ మీద లవ్ బావుంటుంది పెళ్ళి తర్వాత కూడా కంటిన్యూ చేయ్ అన్నారు. 
అభిని నా సన్ లాగా చూస్తాను టాస్క్ లు సరిగా ఆడరు ఒక ప్లేస్ లో ఉంటాడు బి ద బెస్ట్ అన్నారు. 
హారిక కథ చెప్పినపుడు నేను ఏడ్చాను నా వైఫ్ స్టోరీ అది ఫాదర్ లేని స్ట్రగుల్ నాకు తెలుసు.

కెప్టెన్సీ ఎవరికి ఇస్తారు అని అడిగారు మెహబూబ్ కి ఇచ్చారు.. నువ్వు యాక్టింగ్ కాప్టెన్ ఓన్లీ ఇమ్యునిటీ ఉండదు అని చెప్పారు. 

లాస్య కి జున్ను ఫోటో వచ్చింది. రెండు పళ్ళెక్కువ వచ్చాయ్ అని గమనించి మురిసిపోవడం బావుంది. అఖిల్ అండ్ అవినాష్ ఇద్దరు రాశారట లాస్య కి ఈగిఫ్ట్. అవినాష్ కి వచ్చిన టీ షర్ట్ కూడా బావుంది అతని ఏవీ కోసం చేసిన ఫోటోస్ తో. 

రేపటి ప్రోమోలో ఇంటి సభ్యులంతా ప్రొటెక్టివ్ గ్లాసెస్ థరించి వరుసగా నిలబడ్డారు ఈ వారం నామినేషన్ లో తల మీద బాటిల్ పగల గొట్టారు. ఐస్ బాటిల్స్ లాగా ఉన్నాయ్ అవి. అందరు డైరెక్ట్ గా తల మీదే పగల గొడితే అభి అండ్ అఖిల్ మాత్రం ఎదుటి వాళ్ళ తలమీద చేయి పెట్టి దాని మీద కొట్టడం బావుంది. అండ్ అఖిల్ ఈ సారి అభిని నామినేట్ చేశాడండోయ్. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం. 


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts