11, నవంబర్ 2020, బుధవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



అఖిల్ ని ఎలిమినేట్ చేస్తున్నాం అంటూ సీక్రెట్ రూం లో పెట్టిన బిగ్ బాస్. హౌస్మేట్స్ అందరూ కూడా ఆస్కార్ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎవరూ తగ్గకుండా అభి మాత్రం ఇది నేను నమ్మనూ అని చెప్తూనే ఉన్నాడు. ఈ సీక్రెట్ రూం టాస్క్ ప్రివిలేజ్ ని అడ్వాంటేజ్ గా తీస్కుని అఖిల్ హైలైట్ అవుతాడో లేదా తన స్మార్ట్ అండ్ డీసెంట్ రియాక్షన్స్ / బిహేవియర్ తో అభి హైలైట్ అవుతాడో రానున్న రోజుల్లో తెలుస్తుంది. 

వివరాల్లోకి వెళ్తే 65 వ రోజు రాత్రి ఒంటిగంటకు సైరెన్ తో నిద్రలేపారు. స్టోర్ రూం లోని సూట్ కేసెస్ లో తమ వస్తువులు సర్దుకొమ్మని చెప్పారు. 
ఏంటిది ప్రాంకా అని అందరూ కన్ఫూజ్ అవుతున్నారు. ఒక బ్లాక్ సూట్ కేస్ దాన్లో ఓ రెడ్ సూట్ కేస్ వచ్చాయి. అరగంటలో అందరూ సర్దుకుని రెడీ అయ్యారు. రెడ్ సూట్ కేస్ లను తీస్కుని గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు. 

బిగ్ బాస్ ఇల్లు లాక్ చేయబడింది అది తెరిచి ప్రయాణం కొనసాగించడానికి ఒక నిర్ణయం తీస్కోవాలి. విజేతగా నిలిచేది ఒక్కరే. ప్రతీసారి బయటికి పంపే నిర్ణయం ప్రజల చేతిలో ఉంటుంది. ఈ సారి ఆ అవకాశం మీకిస్తున్నారు బిగ్ బాస్. ఫైనల్ వరకూ మీ ప్రయాణంలో ఎవరైతే మీకు అడ్డుపడుతారని భావిస్తున్నారో వారిని ఇంటి సభ్యులు అందరు కలిసి బిగ్ బాస్ కు తెలియజేయండి. 
అందరు కలిసి బయటికి పంపడానికి నిర్ణయించిన ఆ సభ్యుని పేరు బిగ్ బాస్ కి చెప్పండి. 

నేను గెలవడానికి నీ డ్రీమ్స్ చంపేసి నేను గెలవలేను కదా అని ఆలోచిస్తున్నారు హౌస్మేట్స్ అందరూ. నాకు అడ్డుపడేంత స్ట్రాంగ్ అని ఎవర్నీ ఫీలవట్లేదు అని అభిజిత్ అంటున్నాడు. అది ఫేర్ ప్రాసెస్ కాదు అని అన్నారు. 
గంటన్నర ఐనా కూడా ఎవరూ ఒక నిర్ణయంతీస్కోలేదు. కొందరు తప్ప మిగిలిన వారు నిద్రపోడానికే ప్రయారిటీ ఇస్తున్నారు తక్షణమే చెప్పాలి అన్నారు. 

సోహెల్ మెహబూబ్ అన్నాడు ఫిజికల్ టాస్క్ లో బీట్ చేయలేను కనుక అని.
అరియానా అఖిల్ అంది ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ కనుక అతను. 
మెహబూబ్ అరియానా తను టాస్క్ ని అర్ధం చేస్కున్నంత ఎవరూ అర్ధం చేస్కోలేకపోతున్నాం బాగా ఆడుతుంది. 
లాస్య నాకు నేను స్ట్రాంగ్ అనుకుంటున్నాను నేను ఎవరి పేరు చెప్పలేను. 
అఖిల్ వీక్ ఎవరు లేరు నాకడ్డుపడేవాళ్ళు లేరు ఒకళ్ళని బయటకి పంపించాలని అనిపించడం లేదు. నా పేరే చెప్పుకుంటున్నా. 
మోనల్ అందరు స్ట్రాంగ్ ప్రతి ఒక్కరికి వీక్నెస్ ఉన్నాయ్. స్ట్రాంగెస్ట్ ఒక పేరు చెప్పాలి కనుక అఖిల్ పేరు చెప్తా. 
హారిక ఏకాభిప్రాయం అన్నారు కనుక మీరు తీస్కున్న అభిప్రాయానికి సపోర్ట్ చేస్తాను నాపేరు చెప్పుకోలేను కనుక అంతే. 
అవినాష్ అరియానా స్ట్రాంగ్ అనిపిస్తుంది. 
అభిజిత్ బిగ్ బాస్ ఒక పేరు చెప్పమన్నారు కనుక అభిజిత్ అన్నాడు.   
ప్రేక్షకుల ఓట్లు రాలేదని బాధపడి వెళ్ళాడం వేరు ఇక్కడ స్ట్రాంగ్ అని వీళ్ళు పంపించడం వేరు. ఇక్కడ నవ్వాలో ఏడ్వాలో అర్ధం కాటం లేదు అంటున్నాడు అఖిల్.    
అఖిల్ మెహబూబ్ ఇద్దరికి మెజారిటీ ఓట్స్ వచ్చాయి. సో వీళ్ళిద్దరి కంపారిజన్ లో అఖిల్ అంటున్నాడు సోహెల్.  
మెజారిటీ అఖిల్ పేరు చెప్పారు. అభి మాత్రం నేను ఒప్పుకోను మీరు ఆ పేరు చెప్తాను అంటే మాత్రం ఏడుగురు ఒకే మాట మీదున్నపుడు నేనూ ఓకే అంటాను అన్నాడు. 
అఖిల్ నే బయటికి పంపిద్దామనుకుంటున్నాం అని మళ్ళీ మీరు చెప్పమన్నారు కనుక చెప్తున్నా అఖిలే  స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నాం మేం అని చెప్పేశాడు సోహెల్.

మీకోసం డోర్ తెరుచుకుంటుంది. ఇంటి సభ్యుల నిర్ణయం మేరకు మీరు బయటికి వెళ్ళండి అని బిగ్ బాస్ చెప్పారు. 


స్ట్రాంగ్ అని చెప్పి పంపిస్తున్నారు కనుక నేను హాపీ ఫీలవుతున్నా. ఓట్లు రాలేదని వెళ్తే ఎక్కువ ఫీలయ్యే వాడ్ని. మాటలు రావడం లేదు యూ పీపుల్ ప్లే వెల్ అని అన్నాడు. 
మోనల్ ఏడ్చేస్తుంది. సోహెల్ అండ్ మెహబూబ్ యూ విల్ బి బాక్ అని చెప్పారు. అఖిల్ కూడా ఏడ్చేశాడు గట్టిగా. 
బయటికి వెళ్ళి డోర్స్ పడిపోయాక అభి అండ్ హారిక లుక్డ్ సర్ప్రైజ్ వచ్చేస్తాడు అనుకున్నారేమో. 
హారిక,అభి,లాస్య నేం చెప్పకుండా ఇలాగే వదిలేస్తే ఏం జరిగి ఉండేదో తెలుసుకోవాలని ఉంది అనిపించింది అంది లాస్య.
మోనల్ కూడా అఖిల్ పేరే చెప్పింది అని ఆశ్ఛర్యపోతుంది. 
హారిక నేనైతే నా ఫ్రెండ్ స్టాంగ్ అని ఇంట్లో నుండి పంపించను నాకు కొన్ని మోరల్స్ ఉన్నాయ్ అని అంది. 
లాస్య మోనల్ ని అడిగిందట స్ట్రాంగ్ అని చెప్పి ఇంట్లో నుండి పంపిస్తావా అని. స్మైల్ ఇచ్చి ఊరుకుందట.      

అఖిల్ ని సీక్రెట్ రూం లోకి పంపారు తెల్లవారు ఝూమున ఐదు గంటలకు. ఆ విషయం అర్ధమయ్యాక అఖిల్ మొహంలో నవ్వు వచ్చింది అపుడు :-)
ఓకే ఇప్పుడు క్లారిటీగా కనపడుతుంది ఆట ఎవరెవరు ఏం చెశ్తున్నారో క్లారిటీ దొరుకుతుంది నాకు అని సంతోషిస్తున్నాడు అఖిల్.  
బిగ్ బాస్ అఖిల్ మీరు కొద్దిరోజులు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది విశ్రాంతి తీస్కోండి అని చెప్పాడు. ఏమైనా చెప్పాలనుకుంటే హెడ్ ఫోన్స్ ద్వారానే తెలియజేస్తారు. 
మోనల్ తెల్లారు ఝూమున ఐదు నలభై ఐదు అప్పుడు కూడా ఏడుస్తూ ఉంది ఐ యామ్ సారీ ఐ సెంట్ యూ నేనూ అన్నీ నేర్చుకుంటున్నాను ఫేర్ గా ఆడాలి గేం అంటే గేం నేను ఫేర్ గా ఆడుతున్నా. 
సోహెల్ మంచం మీద కూర్చుని ఏడుస్తున్నాడు వీడు కొద్దిసేపు పోతేనే ఇంతలా అనిపిస్తుందేందిరా ఇంత అటాచ్మెంట్ ఏర్పడిండా అని ఫీలవుతున్నాడు. వాడి పాటలు గుర్తొస్తున్నాయ్ అని బాధపడుతున్నాడు.
అభి ఐ వోంట్ ఫాల్ ఫర్ దిస్. బిగ్ బాస్ కే తెలియాలి. చాలా ఈజీగా వెళ్డానికి రెడీ అయ్యాడు బాబు మోనల్ దగ్గరే తగ్గలేని మనిషి నేను స్ట్రాంగ్ ఈ హౌస్ లో ఉండాలి అని చెప్పాలి. ఏకాభిప్రాయం తీస్కున్న తర్వాత మార్చలేవు కానీ ఒక్కటైనా పాయింటాఫ్ వ్యూ చెప్పలేదేంటి అని అంటుంది హారిక. తను క్లెవర్ ఆ రకంగా అని చెప్తున్నాడు. 

అరవయ్యారో రోజు ఉదయం పదకొండుకి నిద్రలేపారు ఎనిమిది బదులు. కేరాఫ్ కంచరపాలెం లోని ఆశాపాశం బందీ సేసేలే పాట తో మేల్కొలిపారు. 
మోనల్ రాత్రంతా బయటే కూర్చున్నట్లుంది. ఈ పాటకి ఏడుపు కూడా కంట్రోల్ చేస్కోలేకపోతుంది. 
అఖిల్ కి హౌస్ లో జరిగేవి చూపిస్తున్నారు. అతనికి ఒక ఒపీనియన్ ఉండాలి కదా డిఫెండ్ చేస్కోడానికి అని అభి అంటున్నాడు నేను స్ట్రాంగ్ నేనెందుకు వెళ్ళాలి బయటికి అని పాయింట్ రావాలి కదా అంటున్నాడు. 
దీనికి డెఫినెట్ గా ఓ యాంగిల్ ఉంది అంటున్నాడు.
అఖిల్ సీక్రెట్ రూం కి వస్తా అని కలలో కూడా అనుకోలేదు అంటున్నాడు. అభి ఏ పని చేయడు దేన్నీ ముందుకెళ్ళనీడు. ఆఅడియన్స్ ఓట్స్ లేక వెళ్ళడం ఫీలయ్యేవాడ్ని కానీ స్ట్రాంగ్ అని పంపించడం ఓకే అని అంటున్నాడు. 
మోనల్ నాకోసం నేను గేం ఆడుతున్నాను అంటుంది. కొంచెం బాడ్ ఫీలింగ్ వస్తుంది కానీ చాలా బాడ్ ఫీలింగ్ వస్తుంది అని అంటుంది. పిల్లోని పట్టుకుని అఖిల్ చెప్పు నేను కరెక్ట్ చేశాను అని అంటూ పిల్లొని హగ్ చేసుకుని అఖిలూ నెంబర్ వన్ అని మిస్ యూ మిస్ యూ బడ్డీ సారీ సారీ బడ్డీ అని పాడుకుంటుంది. 

ఈ వారం ఎవరికి ఇమ్యునిటీ రాకుండా పోయింది చూడు అది చాలా బాడ్. సోహెల్ బయటికి వచ్చేయడం ఎంతవరకు అనేది అర్ధమ్ కాలేదు. మెహబూబ్ సటిల్ గానే ఉన్నాడు ఎక్కడా కూల్ లూజ్ అవ్వలేదు. అంటున్నాదు అభి. అంత గొడవ పడ్డారు వాళ్ళు ముగ్గురు అఖిల్ లిటరల్లీ పది రోజులు వాళ్ళతో మాట్లాడలేదు. నా గేం నేనెట్లా ఆడాలో అది అప్ ఫర్ జడ్జిమెంటా అంటున్నాడు. ఇరిటేటింగ్ పాయింటెంటంటే నా పక్కన ఉన్నాదు పది రోజులు . అత్నఏం ఆడుతున్నాడో నాకు అర్ధం కాలేదు. అఖిల్ నన్ను చూస్తున్నా కూడా బాస్ నువ్వు వచ్చాక నీతో మాట్లాడాల్సి ఉంది అసలు ఎట్లా పోయావ్ నాకు అర్థం కావడం లేదు అని అంటున్నాడు. కాళ్ళతో నడుచుకుంటు వెళ్ళా అని అఖిల్ పంచ్.. ఇలా మధ్య మధ్యలో పంచెస్ వేస్తున్నాడు తను. 

నిజంగా పంపించేస్తారని అనుకున్నావా అని అభి అడుగుతున్నాడు మోనల్ ని తెలీదంది.  అభి తిన్నావా మధ్యాహ్నం అని అడుగుతున్నాడు. మోనల్ సడన్ గా హౌస్ సైలెంట్ ఐంది అంటే నాకైతే ఛేంజ్ అవలేదు అన్నాడు. నువ్వు స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ అని అంటుంది మోనల్. అలా అని కాదుకొన్నిటిలో ఎమోషనల్ కాకపోవడం మంచిది అంటున్నాదు అభి ఒక సిట్యుయేషన్ ని అర్ధం చేస్కుని నిర్ణయం తీశ్కోవాలి అన్నాడు.
 
మోనల్ ఓ మై ఫ్రెండ్ అని పాట పాడుకుంటుంది.    

రేపటి ప్రోమో లో ప్రతి ఇంటి సభ్యుడు ఇప్పటి వరకూ ఎవ్వరితో పంచుకోని అతి పెద్ద రహస్యాన్ని కన్ఫెస్ చేయాలి అని అన్నారు. ఒక్కొక్కరు కన్ఫెషన్ రూం లో చెప్తున్నారు.  అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం. 


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts