12, నవంబర్ 2020, గురువారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పా
యింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజు ఎపిసోడ్ అంతా ఇంటి సభ్యులు తమ లైఫ్ లోని ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ ని కన్ఫెస్ చేయడంలోనూ దానికి ప్రతి ఫలంగా ఇంటినుండి వచ్చిన లేఖలు అందుకోని చదువుకోవడంతోనూ నింపేశారు. వారి సీక్రెట్స్ విని లెటర్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం అఖిల్ చేతిలో పెట్టడంతో అవినాష్ అరియానాలకి లెటర్స్ ఇవ్వలేదు తను. అఖిల్ కు కూడా ఈ రోజు రాలేదు.

వివరాల్లోకి వెళ్తే 67వ రోజు ఉదయం నానీ గ్యాంగు లీడర్ టైటిల్ పాటతో నిద్ర లేపారు. 
అఖిల్ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. గేం చూపిస్తుంది నేను మొదటి రోజు నుండీ ఒకటే ఫీలింగ్ లో ఉన్నాను అని అంటున్నాడు. 
అభి మెహబూబ్ మాట్లాడుకుంటున్నారు. చెప్పిన పని చేయాలి కానీ న్యాయం గా ఆలోచించాలి అఖిల్ చేసిన పనులు అన్ని చెప్పి ఇన్ని చేసిన వాడు కొట్లాడకుండా ఎలా వెళ్ళాడు అని అంటున్నాడు అభి. బాల్ ఎవరిది కొట్టాడు అంటే నాదే అని చెప్పాడు. నువ్వు చాలా డీసెంట్ గా మాట్లాడాడు మెహబూబ్ అని చెప్తున్నాడు. కోపం రావడం కొట్టడం ఏందది అని ఎక్కిస్తున్నాడు మెహబూబ్ కి సోహెల్ కి.  


మటన్ పాడైపోయిందిట. రోజూ చూడకుండా ఏం చేస్తున్నావ్ అని అందరు అవినాష్ ని అంటున్నారు. ఎలిమినేషన్ ఎవరు అని అడుగుతున్నారు. అవి కన్ఫూజ్ అయి మటన్ ని డీప్ లో పెట్టాలా మాములు ఫ్రిజ్ లో పెట్టాలా అనే కన్ఫూజన్ లో డీప్ లో పెట్టలేదంట. అందుకే పాడైంది.
 
అవినాష్ ని ప్రతి కెమేరా దగ్గరకు వెళ్ళి చెప్పమని అన్నారు. దేవుడు కరుణిస్తాడని అంటూ పాటని మార్చేసి పాడుతున్నాడు. 

అందరూ ఫీలవుతున్నారు. అరియానా సీక్రెట్ టాస్క్ అని చెప్పింది మటన్ పాడు చేయడం. డీప్ లో పెట్టాలని తెలీకుండా ఎలా రేషన్ మానేజర్ అయ్యావ్ అని అంటున్నారు. 
అందరూ కలిసి అవినాష్ ని ఎత్తుకుని వెళ్ళి పూల్ లో పడేశారు.

అఖిల్ ఇంటి సభ్యులకి బహుమతులుఇచ్చే అవకాశం ఆప్తులనుండి సభ్యులకు లేఖలు వచ్చాయ్. అవి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం మీచేతుల్లో ఉంది. కన్ఫేషన్ రూం లోకి వచ్చి అతి పెద్ద రహస్యం చెప్తారు. మీరు ఇవ్వద్దనుకుంటే శ్రెడ్డర్ లో వేసి కట్ చేయాలి. ఈ టాస్క్ విజయవంతంగా చేస్తే మీకూ లేఖ లభిస్తుంది అని చెప్పారు అఖిల్ కి. 

మెహబూబ్ నో పార్కింగ్ లో పార్క్ చేసిన బైక్ దగ్గర గొడవ ఐ రెండ్రోజులు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడుట. మెసేజ్ పంపాడు. తమ్ముడు మెసేజ్ రాశాడు ఇంట్లో అందరి హెల్త్ బావుందని చెప్పారు. 

హారిక ఇది నా ఫ్యామిలీ సీక్రెట్ ఆరేళ్ళనుండి అమ్మతో చెబ్దామనుకుంటున్నా కానీ చెప్పలేకపోయాను. ఇపుడు చెప్తున్నాను అమ్మకి. లవ్వులు రిలేషన్ లేవు హారికకి అని చెప్తుండే దానివి కదా రెండేళ్ళ క్రితం జరిగింది ఇది నాలుగున్నరేళ్ళు నేను రిలేషన్ లో ఉన్నాను. మన ఫ్యామిలి సిట్యుయేషన్ లో ఒకతను కొంచెం కేరింగ్ చూపించాడని అలా కొంచెం ఫీలయ్యాను అంతే రెండేళ్ళ క్రితమే బ్రేకప్ అయింది అని చెప్పింది. 
చెప్పింది చిన్నదనిపిస్తుంది కానీ చాలా పెద్దదే అని అంది. అన్న హ్యాండ్ రైటింగ్ అది.. చాలా ఎమోషనల్ అయింది చదువుకుంటూ. ఏం రాశారు సోహెల్ చాలా మంచోడు మాట్లాడు అని చెప్పి రాశారా అని అడుగుతున్నాడు సోహెల్ :-)

అవినాష్ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూ కిరాణా షాప్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్ బోయ్ గా పని చేశాను. మణికొండలో ఆఫీస్ లో ఆడిషన్స్ కి వెళ్ళాను ఎనభై వేలు అడిగితే వడ్డీకి తెచ్చి నాన్న గారు ఇచ్చారు.. అవి పోగొట్టుకున్నాను ఆఫీస్ మూసేయడం వల్ల అని చెప్పాడు. ఈ విషయం నాకు తెలుసు అందుకే ఈ లెటర్ ఇవ్వడం లేదు అని చెప్పాడు అఖిల్. 
ష్రెడ్ అయిన పీసెస్ కవర్ లో పెట్టి పంపారు. అవినాష్ వాటిని అతికించి చదువుకోడానికి ట్రై చేస్తున్నారు.    

లాస్య మరాఠీ అబ్బాయ్ ని పెళ్ళి చేస్కుంటున్నా అంటే కోటీశ్వరుడు అని అనుకున్నారు. మిడిల్ క్లాస్ కూడా కాదని చెప్పింది. నాకన్నా అబ్బాయ్ ఒక ఏడాది చిన్న అని చెప్పింది. ఇంట్లో ఎవరికీ తెలీదు మా అమ్మకి షాకుల మీద షాకులు ఇస్తున్నా అని చెప్పింది. లెటర్ పంపాడు. చాలా ఎమోషనల్ అయింది. 

అభి అమెరికా మొదటి సారి వెళ్ళినపుడు ఏదో రెస్టారెంట్ కి వెళ్తె కెన్ ఐ గెట్ యూ ఏ డ్రింక్ అని అడిగితే ఇదేదో బావుందే అని అనుకున్నాను కానీ అతను చాలా క్లోజ్ గా బిహేవ్ చేశాడు నీకు తెలీదా ఇది గేబార్ అని అన్నాడు. అపుడు బయటికి వెళ్ళి చూసి రియలైజ్ అయ్యాను అని చెప్పాడు. ఇది ఎవరికి తెలియని సీక్రెట్ కనుక లెటర్ ఇస్తున్నా అని చెప్పాడు. అమ్మ ఇంగ్లీష్ లో రాసింది. చిన్నపుడు నేను నీ చేతులు పట్తుకుని స్కూల్ కి తీస్కెళ్ళే దాన్ని ఇపుడు నువ్వు నా చేతిని పట్తుకు రోడ్ దాటిస్తున్నావ్ అని బారాశారు. 

అరియానా తనకి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పింది దదాపు ఒక కి.మి. దూరం కార్ లాక్కెళ్ళింది రివర్స్ ఐ ఎలక్ట్రిక్ పోల్ కార్ మీద పడింది. నేను బతికి ఉండను అనుకున్నాను అని చెప్పింది. ఇది సీక్రెట్ లాగా అనిపించడం లేదు ఎటో వెళ్ళిపోయింది అని ష్రెడ్ చేసేశాడు లెటర్.

మోనల్ నా ఫాదర్ చనిపోయినపుడు పదిహేనేళ్ళు ట్వల్త్ స్టాండర్డ్ లో ఉన్నాను జాబ్ రావడం లేదు ఆ టైమ్ లో బ్యాంక్ లో ఓ జాబ్ వచ్చింది బాగా ఉంది బికాం లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ వచ్చింది. టైమింగ్ కుదిరేది కాదు. ఫైనల్ ఇయర్ డ్రాప్ ఔట్ చేశాను. నా ఫామిలి కోసం చదువు త్యాగం చేసి జాబ్ ముఖ్యమని ఉన్నాను. ఇది ఎవరికి చెప్పలేదు. లెటర్ పంపాడు. పెద్ద ఏఫోర్ సైజ్ కవర్ లో వచ్చింది అండ్ డెకరేషన్ చాలా బావుంది. పూవులు అవీ కట్ చేసి అతికించి పంపారు. చెల్లెలు అనుకుంటా ఎంతైనా అమ్మాయిలు ఉత్తరాలు రాసే పద్దతే వేరుంటది లెండి. అసలు ఓపెన్ చేయడమే చాలా ఎమోషనల్ అయింది ఏడుస్తూ చదువుతుంది. 

సోహెల్ డ్రంక్ డ్రైవ్ ఏందనిపించేది రెండున్నరేళ్ళా క్రితం పబ్ నుండి వస్తున్నా వన్నాటూ రీడింగ్ వచ్చింది కార్ తీస్కెళ్ళారు పొద్దున్న ఛలాన్ కట్టాను కోర్ట్ స్లాట్ తీస్కోమన్నారు తర్వాత పేరెంట్స్ ని తీస్కురమ్మన్నారు. డూప్లికేట్ పేరెంట్స్ ని తీస్కెళ్దామని ప్లాన్ చేశా కానీ ఐడి కార్డ్స్ మ్యాచ్ చేసి చూస్తారు అన్నాడు తమ్ముడిని పిలిచి మ్యానేజ్ చేశాను. వాడివిషయం నాకు ఎప్పుడు చెప్పలేదు అందుకె పంపుతున్నా అన్నాడు.      
నాన్నా గారు రాశారు. బావుంది లెటర్.. అందరితో మంచిగా ఉండు ఎవరిని బాధపెట్టద్దు అని అఖిల్ అండ్ మెహబూబ్ పేరు మెన్షన్ చేశారు. మంచి పెళ్ళి సంబంధాలు వస్తున్నాయ్ అని రాశారు. అఖిల్ పేరు వచ్చింది అని వాడుండుంటే పేరొచ్చిందని హాపీ ఫీలయ్యేవాడు ఐడిడ్ ఎ మిస్టేక్ తప్పుచేశా అని చాలా బాధపడ్డాడు. 

కోల్గేట్ వేదశక్తి టాస్క్ ఇస్తున్నారు. 
రెండు టీంస్ గా విడిపోయి బోర్డ్ మీద ఉన్న టగ్ లైన్స్ లోని బ్లాంక్స్ ఫిల్ చేయాలి. విజేతలకి హైజీన్ కిట్ హ్యాంపర్స్ లభిస్తాయ్ ఓడిపోయిన వాళ్ళకి స్ప్రే కిట్ దొరుకుతుంది ఎవరూ ఓడిపోరు అని చెప్పారు. 

చివర్లో అఖిల్ ఐ రిక్వెస్ట్ ఐ బెగ్ యూ నాకు లెటర్ కావాలి అని అడుగుతున్నాడు కానీ లెటర్ వచ్చినట్లు లేదు. 

రేపటి ప్రోమోలో ఈ రోజు నవ్వడం నిషేధం అని రకరకాల గెటప్స్ లో ఒక్కో హౌస్మేట్ వచ్చి మిగిలిన వళ్ళని నవ్వించడనికి ప్రయత్నిస్తున్నారు.  అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం. 
  

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts