ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు.
ఈ రోజు ఇంట్లొ దీపావళి సెలెబ్రేషన్స్ జరిపారు. నిన్న అందరికి సందేశా లు వస్తే ఈ రోజేమొ గిఫ్ట్స్ వచ్చాయి ఇంటి నుండి. ఈ వారం అంతా కూడా బిగ్ బాస్ ఎపిసోడ్స్ నిండా బంధాలు అనుభంధాలు మంచితనం మానవత్వం పరిమళించాయ్ ఓ వసంతం, ఓ సంక్రాంతి ఓ మా అన్నయ్య సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట ఎస్ ఎ రాజ్ కుమార్ మ్యూజిక్ ఒక్కటే తక్కువ. ఈ రోజు బిగ్ బాస్ ఎంటర్టైన్ చేస్తా అంటే ఆబ్బోమాములుగా ఉండదు కాబోలు అనుకున్నా ఈయన జోక్స్ లాస్య చీమ ఏనుగు జోక్స్ కు పోటీ పడేలా ఉన్నాయ్.
అసలా అఖిల్ సీక్రెట్ రూం లో ఏం చేస్తున్నాడో ఎందుకు ఉంచారో ఇంకెన్నాళ్ళుంచుతారో కూడా ఆర్థంకాలేదు. ఈ వీకెండ్ కూడా రూం లోనే ఉంచేసి నాగ్ రియల్ గా వెళ్ళాడని చెప్పి ఒక్కొక్క హౌస్మేట్ ఒరిజినల్ ఫీలింగ్ తెలుసుకుని ఆ త్వరాత సోమవారం ఏదైనా టస్క్ తో తనని ప్రవేశ పెడితే తప్ప ఈ అవకాశం దుర్వినియోగం చేసినట్లే. అలా చేసినా కూడా వెరీ బాడ్ ప్లానింగ్ అనే అనుకోవాలి.
కాకపోతే సగానికి పైగా దదాపు అరవై ఐదు రోజులు ముగిసాయి కనుక హౌస్మేట్స్ కు కూడా ఈ పండగ వారం విశ్రాంతి ఇచ్చినట్లుగా ఇచ్చి వచ్చేవారం నుండీ మరింత సీరియస్ టాస్క్ లు ఇస్తారేమో బిగ్ బాస్ మరి చూడాలి.
వివరాలలోకి వెళ్తే 68వ రోజు ఉదయం రియల్ మాంగో జ్యూస్ జింగిల్ తో మొదలు పెట్టి వేదాళం సినిమాలోని ఆలుమ డోలుమ పాటతో మేల్కొలిపారు. అందరూ బాగా డాన్స్ చేశారు అభి తో సహా :-) సోహెల్ రెచ్చిపోయి ఎగిరాడు.
గార్డెన్ ఏరియాలొ ఒక బాక్స్ లో దీపావళి గిఫ్ట్స్ పెట్టి ఉన్నాయి మీకోసం బిగ్ బాస్ మీ ఇంటి నుండి ఈ గిఫ్ట్స్ తెప్పించారు. మీరు ఇవి పొందాలంటే ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది సమయం వచ్చినపుడు చెప్తారు బిగ్ బాస్ అని అన్నారు.
అవినాష్ మూడు గుడ్లు పగలగొట్టాడు అని మళ్ళా సోహెల్ అండ్ మెహబూబరియాన కలిసి లొల్లి మొదలుపెట్టారు.
అవినాష్ అరియానాని ఫ్లర్ట్ చేస్తున్నాడు నువ్వు నా ముందే బావున్నావ్ అని అందరితో చెప్తున్నావు ఇపుడు నువ్వు నాకు బావున్నావ్ అని అంటే నేను పడను అని చెప్తుంది. హే మనం ఫ్రెండ్స్ మి నువ్వు అలా పడడం పడకపోవడం ఏంటి అలాంటిదేం లేదు అని అంటున్నాడు.
మీరు ఎంటర్టైన్ చేయడం లో విఫలమయ్యారు. అందుకని బిగ్ బాస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయ దలిచారు. అలా చేస్తున్నా కానీ మీరు నవ్వకుండా సీరియస్ గా ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు నవ్వడం నిషిద్దం. మీరు సోఫాలో కూచున్నంత సేపు ముసి ముసి నవ్వులు మెల్లగా గట్టిగా నవ్వడం ఏం లేకుండా సీరియస్ గా ఉండాలి అని అన్నారు. బెల్ మోగినపుడల్లా ఒక ఇంటి సభ్యుడు వేరే వాళ్ళందరిని ఎంటర్టైన్ చేస్తుండాలి. మరో బెల్ మోగగానే వాళ్ళు కూర్చుని తర్వాత సభ్యులు ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది.
అఖిల్ ఎలా ఉన్నారు అని అడిగితే అస్సలు బాలేను చాలా లోగా ఫీలవుతున్నాను హార్ట్ అంతా హెవీ హెవీ ఔతుంది అన్నాడు. మీరు టాస్క్ విజయవంతంగా ముగించినందున మీక్కూడా లేఖ లభిస్తుంది. కాస్ట్యూంస్ ధరించి బిగ్ బాస్ లా కామెంట్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని లెటర్ ఇచ్చాడు. ఫుల్ ఏడ్చుకుంటూ చదివాడు అమ్మ రాసినట్లున్నారు. బర్త్ డే విషెస్ పంపారు. థ్యాంక్స్ చెప్పాడు.
బజర్ మోగాక లాస్య చీమా ఏనుగు జోక్ మొదలు పెట్టింది. ఒక చీమ శారీ కట్టుకుని అందంగా రెడీ అయి ఏనుగుని పడేయాలని చూసిందట పడట్లేదని కాలడ్డం పెట్తి పడేసిందంట. హౌస్మేట్స్ కి ఇది ఈజీ టాస్క్ అస్సలు నవ్వు రాలేదు.
ఈ సారి అరియానా వచ్చి ఒక్కొక్కరిని నవ్వించడనికి ట్రై చేసింది. అవి మెల్లగా నవ్వాడు.
అవినాష్ వచ్చాడు తర్వాత. తన నవ్వుతోనే లాస్యని నవ్వించాడు, మోనల్, మెహబూబ్, సోహెల్ నవ్వేశారు.
మెహబూబ్ ని కన్ఫెషన్ రూం కి పిలిచారు. కాస్ట్యూమ్స్ ని ఇక్కడే ధరించి ఇంటి సభ్యులని నవ్వింఛడనికి ప్రయత్నించండి అని అన్నాడు. రాబిట్ కాస్ట్యూంస్. అవినాష్ ఏదో ట్రై చేస్తున్నాడు కానీ కాలేదు.
బెల్ మోగింది అభి మొదలు పెట్టాడు నవ్వించడనికి అవినాష్ ని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాడు. హారిక అండ్ లాస్య ముసి ముసి నవ్వులు నవ్వేశారు. మోనల్ మాత్రం నోటికి అడ్డుపెట్టుకుని కూర్చుంది.
సోహెల్ ఏంది పంచాయితీ కత ఎట్లుంది అని అన్నారు బిగ్ బాస్ లైట్ గా నవ్వాడు కాస్త కన్ఫ్యూజ్ అయ్యి. హారిక నవ్వేసింది. లాస్య కూడా నవ్వేసింది. కత మాములుగ ఉందా వేరే ఉందా అని అడుగుతున్నారు. సీరియస్ జవాబులు చెప్తూ నవ్వు కంట్రోల్ చేస్కుంటున్నాడు.
సోహెల్ కి జోకర్ గెటప్ వేసి పంపించారు. నవ్వురా ఇజ్జత్ పోతుందిరా అని మెహబూబ్ ని అడుగుతున్నాడు. నవ్వురాడం లేదు బాలేదు అని చెప్తున్నాడు. మెహబూబ్ నవ్వేశాడు.
మోనల్ నువ్వు ఇట్రా నీకొ ఐడియా ఇస్తా రా అని అభి పిలుస్తుంటే సోహెల్ ఈయన జెయ్యడు ఐడియాలే ఇస్తుంటాడు అని అంటున్నాడు చాలా సీరియస్ గా అఖిల్ పగలబడి నవ్వుకుంటున్నాడు.
అవినాష్ మీ తెలుగు చాలా బావుంటుంది ఆని బిగ్ బాస్ చెప్తున్నాడు. నేను నవ్వను అని దిండు అడ్డు పెట్టుకుని కొరికి రకరకాలుగా అపుకుంటున్నాడు. ఒక సారి తెలుగులో నవ్వండి అని అడుగుతున్నారు.
నవ్వద్దని చెప్పినప్పటికి మీరంతా నవ్వారు కానీ వినోదం పంచడంలో సఫలమయ్యారు కనుక మీకు బహుమతులు ఇవ్వదల్చారు అని చెప్పారు.
ఎక్కువమందికి డ్రస్సులు వచ్చాయ్. అవినాష్ కి తన మెమరీస్ తో ఫోటో ఫ్రెం వచ్చింది.
సోహెల్ కి సింగరేణి ముద్దు బిడ్డ అని ప్రింట్ చేసి ఉన్న టీ షర్ట్ వచ్చింది.
అఖిల్ కి తన పెట్ మోడల్ బొమ్మ వచ్చినట్లుంది చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు.
లాస్యకి జున్ను పుట్టిన అప్పటి ఇన్ఫర్మేషన్ తో ఓ ఫోటో ఫ్రేం వచ్చింది.
జున్నుగాడి నవ్వులు ముద్దు ముద్దు మాటలు రికార్డ్ చేసి స్పీకర్స్ లో వినిపించారు సో క్యూట్ చాలా బావుంది.
ఎంటీఆర్ వారి గులాబ్ జాం మిక్స్ వచ్చింది. దానితో గులాబ్ జామూన్స్ చేస్కోవాలి. అవి తిన్నాక ఎంటీఆర్ స్వీట్ సర్ ప్రైజ్ గిఫ్ట్ హ్యాంపర్ ఓపెన్ చేయాలి.
లాస్య అండ్ మోనల్ కి కుకింగ్ లో అస్సలు కలవదు అని అనుకుంటున్నారు అభి అండ్ హారిక.
దీపాలు వెలిగించి స్విమ్మింగ్ పూల్ లో వేసి మీకు నచ్చిన వారందరికి శుభాకాంక్షలు తెలుపండి. అఖిల్ మస్తుగ సచ్చే దిల్ సే వెలిగించి పెట్టండి అని అంటున్నాడు అఖిల్. ఇతన్ని సీక్రెట్ రూంలో ఎందుకు పెట్టారో ఏం చేస్తున్నారో సెలెబ్రేషన్స్ కి దూరంగా ఎందుకు ఉంచారో ఏం అర్థం కాడం లేదు.
పాటలు ప్లే చేస్తున్నారు అందరూ డాన్స్ చేస్తూ ఉన్నారు. అఖిల్ సోఫాలో పడుకుని సైలెంట్ గా చూస్తున్నాడు.
రేపు బయటికి వెళ్ళేదెవరు అంటూ ప్రోమో వేశారు.
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.