30, నవంబర్ 2020, సోమవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది నా రఫ్ నోట్స్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అందులో చూడవచ్చు. 



ఈ రోజు నామినేషన్స్ డే కదా కాస్త పెద్ద డిస్కషన్సే నడిచాయి. అవినాష్, మోనల్, అభిజిత్, హారిక, అఖిల్ నామినేట్ అయ్యారు. ఈ రోజు నంబరాఫ్ ఓట్స్ ని బట్టి కాకుండా బౌల్స్ లో పోసిన లిక్విడ్ లెవెల్స్ ని బట్టి నామినేట్ చేశారు.

అఖిల్ అండ్ హారిక ఇద్దరివి ఒకే లెవల్ లో ఉండడం వల్ల ఇద్దరు నామినేషన్స్ లోకి వచ్చారు. అఖిల్ ని మోనల్ నామినేట్ చేసి ఉండకపోయినా కాస్త బుర్ర ఉపయోగించి ఇంకొంచెం తక్కువ లిక్విడ్ పోసున్నా తను నామినేషన్స్ లోకి వచ్చేవాడు కాదు. తను లేకపోతే కనుక మోనల్ ఖచ్చితంగా సేవ్ అయ్యేది. కానీ ఇపుడు తన గొయ్యి తనే తవ్వుకుందా అనిపిస్తుంది. కాకపోతే ఈ దెబ్బతో మోనల్ ట్రూ స్ట్రెంత్ ఏంటనేది తెలిసిపోతుంది. 

అఖిల్ అండ్ అభి ఇద్దరిని నామినేట్ చేసిన మోనల్ తన గొయ్యి తనే తవ్వుకున్నట్లు తను కూర్చున్న చెట్టుకొమ్మను తనే నరుక్కున్నట్లు అనిపించింది. ఈ దెబ్బతో తన అసలు వోటింగ్ స్టామినా ఏంటో తెలియనుంది అనిపిస్తుంది. ఏదైనా తనిలా స్ట్రాంగ్ గా తన గేం తను ఆడడం మాత్రం మెచ్చుకోవాల్సిన విషయమే.

నామినేషన్స్ లో సోహెల్ అండ్ అరియానా లది టామ్ అండ్ జెర్రీ నామినేషన్స్ లా ఫన్నీగా అనిపిస్తే. మోనల్ ఆవేశం గేం లో తను ఎంత స్ట్రగుల్ అయి నిర్ణాయాలు తీస్కుంటుందో ఎలా నామినేట్ చేస్తుందో, అవినాష్ తనని ప్రతి సారి చులకన చెస్తున్నాడని ఎంత సీరియస్ అయిందో చూస్తే షీ ఈజ్ రియల్లీ స్ట్రాంగ్ ఈ ట్రయాంగిల్ గోల లేకపోతే తన గేం ఇంకా బావుండేది అనిపించింది. 

హారిక అభిని నామినేట్ చేసి తర్వాత ఇది వీకెండ్ కన్ఫేషన్ రూం ఎఫెక్ట్ కాదు అని నొక్కి చెప్పడం చూస్తే ఇది అందుకేలే అని ఎవరికైనా అనిపిస్తుంది.  

వివరాలలోకి వెళ్తే 84 వ రోజు అవినాష్ సేవ్ అయిన తర్వాత డిస్కషన్స్ చూపిస్తున్నారు. సోహెల్ అండ్ అఖిల్ కన్విన్స్ చేస్తున్నారు అవినాష్ ని నాకు తక్కువ ఓట్లు పడ్డాయి నేను ఎవరికోసం ఆడాలి అని అంటున్నాడు. మెహబూబ్ కన్నా తోపు ఆడావా అని అడుగుతున్నాడు సోహెల్. అలా ఐతే అతను ఉండేవాడు అని అంటున్నాడు. ఎవరు తోపు కాదు అని చాలా సీరియస్ గా ఉన్నాడు అవినాష్.  

85 వ రోజు ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం పండగచేస్కో సినిమాలోని యూ అర్ మై డార్లింగ్ పాటతో మేల్కొలిపారు. 

అరియానా లాస్ట్ వీక్ వరకు ఉంటే ఈ రోజు నెక్స్ట్ వీకే నామినేట్ చేస్కుంటాం అని చెప్తుంది. సోహెల్ నన్ను ఎవరు నామినేట్ చేయకండి అని అంటూంటే అరియానా హగ్ ఇచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి సారీ చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం సోహెల్ నీ ఫ్రెండ్షిప్ కావాలి అని అంటుంది. ఏడిపించకు ఇక అంటున్నాడు సోహెల్. 
అంతా అయ్యాక ఈ ఒక్క రోజు నెక్స్ట్ వీక్ కొట్టుకుందాం ఇక అంతే అంటుంది. ఇదేంది మళ్ళీ అంటే మరేం చేస్తాం గేం అంతే తప్పదు అంట :-)

అవినాష్ అఖిల్ సోహెల్ పడుకున్నారు బాడీ అంత దారుణంగా ఉంది ఒక పదినిముషాలు బిగ్ బాస్ అని అడిగారు. అరగంటాగాక ముగ్గురి పేర్లు చెప్పి మీ నిద్రపూర్తయితే నామినేషన్ ప్రాసెస్ మొదలు పెడదాం అని పిలిచారు :-)

ఒకొక్క సభ్యుడి పేరున్న మంచినీళ్ల కంటెయినర్స్ ఉన్నాయ్ తిక్ కలర్ లిక్విడ్ ఉన్న ట్యూబ్స్ ఉన్నాయి ఒక్కోటీ ఒక్కొక్కరు మెడలో వేసుకుని బిగ్ బాస్ పేరు పిలిచినపుడు ఆ కలర్ లిక్విడ్ ని కనీసం ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కంటెయినర్స్ లో పోసి నామినేట్ చేయాలి. ముగిసే సమయానికి ఎక్కువ రంగునీళ్ళు ఉన్న నలుగురు సభ్యులు నామినేట్ అవుతారు. 
 

హారిక నుండే మొదలు పెట్టారు. 

అవినాష్ : నేను ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చాను దానికి నువ్వు వాల్యూ ఇవ్వలేదనిపించింది అంది. అవినాష్ నేను ఫీలైంది నాకన్నా వీక్ వాళ్ళున్నారు నేనెందుకు వెళ్ళాలి అన్నాడు హారిక బాగా చెప్పింది నువ్వు ఎలా చెప్తావ్ ఆడియన్స్ దృష్టిలో అని చెప్పింది.  
అభి : హారిక డినైయింగ్ ద టాస్క్ అంతకన్నా వేరే కారణం లేదు అంది. అభి ఐ రిక్వెస్టెడ్ అంతే అని క్లారిటీ ఇచ్చాడు. కానీ టాస్క్ ని టాస్క్ లా తీస్కోవాల్సింది అంది. 

హారిక బిగ్ బాస్ కి కెమేరాతో ఇది నిన్న కన్ఫెషన్ రూం ఎఫెక్ట్ ఐతే కాదు నాకు ఇంకెవరి పేర్లు కారణాలు లేవు అని చెప్తుంది ఏడ్చేసింది. ఆ పాయింటాఫ్ టైం లో కేప్టెన్ గా నేను చూస్కోవాలనేది నాకు ఆసమయంలో తట్టలేదు అని చెప్తుంది. 

తర్వాత అవినాష్ టార్న్. 
మోనల్ : స్వాప్ చేస్కోమన్నపుడు నేను సరైన రీజన్స్ చెప్పినా నువ్వు రీజన్స్ చెప్పలేదు ఎందుకు నువ్వు స్ట్రాంగ్ అనేది అన్నాడు. తెలుగు నేర్చుకుంటున్నావ్ కానీ అదొక్కటే కాదు అన్ని కన్సిడర్ చేస్తారు అన్నాడు. 
నేనే వీక్ కాదు మీ కంపారిజన్ ప్రకారం నన్ను సేవ్ చేసి జనాలు ప్రూవ్ చేశారు అని చెప్పింది. (ఇలాంటివి వస్తాయ్ అనే నేను బాధపడుతున్నాను హారిక అని చెప్తున్నాడు అవినాష్)

అఖిల్ నన్ను వర్స్ట్ కాప్టెన్ అని చెప్పారు అందుకే తనని అన్నాడు ఇద్దరు తప్ప అందరం కాప్టెన్ అయ్యాం ప్రూవ్ చేయలేం అన్నాడు నీ కెప్టెన్సీలో నువ్వు మైక్ ధరించలేదు అన్నది కరెక్ట్ రీజన్ అనిపించలేదు అన్నాడు.

అఖిల్ తర్వాత టర్న్ 
అవినాష్ నివ్వు వేశావ్ అని కాదు ముందునుండే ఉంది. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. ఆ కార్డ్ నాకు ఎందుకు కావాలని కొట్లాడానో నాకు తెలుసు నువ్వు ఉంది కానీ నేను పోను అని అన్నావ్ ఇంకొకరిని వీక్ అని అంటున్నావ్ అక్కడెవరు లేరు అని అన్నాడు. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా అంటే నువ్వు అఖిలే నంబర్ వన్ అనుకుంటే నీకు ఓఅర్ కాన్ఫిడెన్స్ అనిపింఛట్లేదా అని అన్నాడు. అది జోక్ గా అన్నమాట అని అఖిల్ క్లారిటీ ఇచ్చాడు.   నా మైండ్ సెట్ అది దాన్ని ఎలా రీజన్ గా చెప్తావ్ అని అంటున్నాడు అవినాష్. కానీ అఖిల్ కార్డ్ యుటిలైజ్ చేస్కోడం నీకు తప్పనిపించింది అందుకే నామినేట్ చేస్తున్నా అన్నాడు.  

మోనల్ కెప్టెన్సీ వరకు ఎప్పుడూ వెళ్ళలేదు గేం పరంగా ఆలోచిస్తే ఎఫర్ట్స్ తక్కువ ఉన్నాయ్ అనిపిస్తుంది అభి సెకండ్ లెవల్ వరకు వెళ్ళాడు కానీ మోనల్ వెళ్ళలేదు అందుకే అని చెప్పాడు. నేనైతే ఎఫర్ట్స్ పెడుతున్నాను నాకు రిగ్రెట్ ఉంది కాప్టెన్ అవలేకపోయాను అని కానీ ఈ రీజన్ కి నేను ఏం మాట్లాడాలో కూడా తెలీదు యాక్సెప్ట్ చేస్తాను అంది. 

అభి తర్వాత
మోనల్ నాకు తెలీడం లేదు కానీ నీతో డే వన్ నుండీ నాకు పర్సనల్లీ ఎమోషనల్ గా నేను హర్ట్ అవుతున్నాను. హండ్రెడ్ పర్సెంట్ నీ తప్పు కాదు కానీ నీ దగ్గరున్నా దూరమున్నా నీ పాయింట్ వచ్చేసరికి నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను ఎలా చెప్పాలో కూడా ఆర్ధంకాడం లేదు. కొన్ని విషయాల్లో నువ్వు స్టాండ్ తీస్కుంటే బావుండేది కానీ నువ్వు తీస్కోలేదు అందుకే అన్నాడు.
 
అభి మళ్ళీ తెలివి ఉపయోగించాడు. తన దగ్గర ఉన్న లిక్విడ్ లో నైంటీఫైవ్ పర్సెంట్ లిక్విడ్ మోనల్ కే పోసేశాడు. హౌస్ లో మిగిలిన వాళ్ళెవరూ ఇలా ఆడలేదు బిగ్ బాస్ చెప్పిన ఎక్కువ లిక్విడ్ ఎవరి దగ్గర ఉంటే ఆ నలుగురు అన్న పాయింట్ ని అభి బాగా ఉపయోగించాడు. 

అఖిల్ మనిద్దరాం ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టేశాం నేను నిన్నర్ధం చేస్కోవాలి నువ్వు నన్ను అర్థం చేస్కోవాలి వియ్ నీడ్ టు మూవాన్ అని చెప్పాడు.  

హారిక నీ ఒపీనియన్ నీకు ఉంది టాస్క్ ని టాస్క్ లా తీస్కోవాలి అనేది తప్పు చేశాను కానీ ఎందుకో నీకు చాలా బాగా తెలుసు నువ్వు అర్ధం చేస్కోలేక పోతే ఇంకెవరూ చేస్కోలేరు అని ఆ మిగ్లిన ఫిఫ్టీ ఎమ్మెల్ పోసి తనని నామినేట్ చేశాడు. 
తర్వాత కెన్ యూ హగ్ మీ అని అడిగింది హారిక బోత్ గేవ్ ఎ టైట్ హగ్. 

తర్వాత మోనల్ హారిక హెల్ప్ కావాలి అని సిక్స్ రూల్స్ ని ఒకొకటి చదువు అని అడిగింది హారికని. 
మైక్ ధరించడం, తెలుగులో మాటలు, నిద్రపోకూడదు, హింస సహింఛరు, వస్తువులకి నష్టంకూడదు, మైక్ తో నో స్విమ్మింగ్.

అవినాష్ కి పోసింది తిను కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ లిక్విడ్. 
నేను తెలుగు నేర్చుకోడం మాత్రమే కాదు మిగతా వాళ్ళకంటే నా ఎఫర్ట్ తక్కువ కనిపిస్తుందేమో కానీ నేను ఎఫర్ట్ పెడుతున్నాను అంది. మీరు స్ట్రాంగ్ అని చెప్తున్నారు ఇక్కడ సూపర్ సెవెన్. మీ అభిప్రాయంలో మీరే వీక్ అని నాకు చాలా సార్లు చెప్పారు కానీ నేనెపుడు మీకు వీక్ అని చెప్పలేదు మీరు వీక్ ఎందుకంటే ఏం జరిగినా మీరు యాక్సెప్ట్ చేయలేరు ఇక్కడే మీరు వీక్ ఇదీ మీ వీక్నెస్ మీరు నామినేషన్ యాక్సెప్ట్ చేయలేరు. నా గేం నేను ఆడతాను ప్రతి రోజు నేర్చుకుంటున్నాను. నీకు కనిపించట్లేదు కానీ నేను ఆడుతున్నాను మీ హౌస్మేట్స్ కోశం కాదు పబ్లిక్ కోసం నా ఫామిలీ కోశం ఆడుతున్నా అన్నారు. ఆ ఆరుపాయింట్స్ ఎందుకు చెప్పానంటే గేం ఒక్కటే కాదు రూల్స్ కూడా ఫాలో అవ్వాలి నాకు తెలుగ్ ప్రాబ్లం ఉంది మీకు లేదు. మీరు నిద్ర పోనవసరం లేదు మైక్ ధరించటం లేదు ఇవన్నీ కౌంట్ అవుతున్నాయ్. గేం అంటే టాస్క్ కాదు ఈ ఇంట్లో ప్రతి మోమెంట్ గేం అని అంది. నువ్వు నా తెలుగు తప్ప ఇంకేం చూడలేకపోతే నా సమస్య కాదది అని అంది. ఈ రూల్స్ ఫాలో అవడం లేదు అక్కడే మీరు తక్కువయ్యారు అని చెప్పింది. 

మిగిలిన కాస్త లిక్విడ్ లో మరి కాస్త అభి కి పోసి నామినేట్ చేసింది మీ వల్ల నేను కూడా హర్ట్ అయ్యాను. ఒక్క సారి ఈ పర్సన్ తో లింక్ వద్దు అని రిక్వెస్ట్ చేశారు అప్పటి నుండి మీరే కాదు నేనూ దూరంగా ఉంటున్నాను లాస్ట్ వీక్ అది టాస్క్ టాస్క్ లా తీస్కుని ఆడి ఉండాల్సింది మీరే వద్దన్నారు అని అంది.

మిగిలిన ఫైవ్ ఎమ్మెల్ అఖిల్ కి పోసి నామినేట్ చేసింది. మోనల్ ఏడిపించారు డేట్ తీస్కెళ్ళండి అని వచ్చింది. ఇది మజాక్ లో వచ్చింది ఎలా వచ్చింది నాకు తెలీదు కానీ ఇది జరిగింది నేను మీ ఇద్దరిని హర్ట్ చేశాను మీరు నన్ను హర్ట్ చేశారు పర్పస్ గా కాదు. అఖిల్ నన్ను నామినేట్ చేశారు గేం ఆడలేదని కానీ మీకు తెలుసు ఎందుకు ఆడలేదు అని ప్రతి సారి ఎందుకు ఆడలేదని హౌస్మేట్స్ కి తెలీదు మీకు తెలుసు వాట్ ఐయామ్ గోయింగ్ త్రూ అని. నేను కెప్టెన్సీ ని వదిలేయలేదు. ఎఫర్ట్స్ పెట్టలేదనిపిస్తుందా మీకు అని అడిగింది. 

నువ్వు ఎఫార్ట్స్ పెట్టలేదు అని కీ టాస్క్ గురించి చెప్పాడు అఖిల్ నీ బ్రెయిన్ ఎందుకు ఉపయోగించలేదు నిన్ను వేరే వాళ్ళకి మాట ఎవరు ఇవ్వమన్నారు అని అడిగాడు. నువ్వు బ్రెయిన్ తో గేం ఆడుతున్నావ్ నేను హార్ట్ తో గేం ఆడతాను అని చెప్పింది. సో ఇప్పుడివన్నీ చెప్తున్నావ్ ఆడియన్స్ కి టు మేక్ మీ బాడ్ అని అడిగాడు అఖిల్. నేను నిన్ను బాధపెట్టాలని ఎపుడు అనుకోలేదు అని అంటుంది. సరే నువ్వు నన్నెపుడు నామినేట్ చేయను అని ప్రామిస్ చేశావ్ కానీ ఇపుడు నామినేట్ చేస్తున్నావ్ కానీ ఎయిట్ వీక్స్ నేను హార్ట్ తో ఆలోచించబట్టే నిన్ను నామినేట్ చేయలేదు అని అన్నాడు. 

మీరే నాకు గేం ఆడడం నెర్పించారు. మొన్న నువ్వే కదా అన్నావ్ ఇప్పటి నుండీ నువ్వు నీ గేం ఆడు నేను నా గేం ఆడుతాను అని అంది. అఖిల్ ప్రామిస్ బ్రేక్ చేయడం మీదే ఫోకస్ చేస్తున్నాదు. ఈ హౌస్ లో మీరు ఏం చేసినా రైట్ నేనేం చేసినా తప్పు అని అంటుంది. ఏడుపును చాలా కంట్రోల్ చేస్కుంది బయట..

తర్వాత ఏడ్చేసుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి మొహం కడుక్కుంది. తను చేస్తే కరెక్ట్ నేను చేస్తే తప్పు. ఇక్కడ నేను నా ఫామిలీ కోశం వచ్చాను ఎవరు ఏం ఫీలయినా నాకు అనవస్రం అని అంటుంది. ఇదిలాస్ట్ కెప్టెన్ అని చెప్పినపుడు చాలా ఏడ్చాను ఇది నా హోప్ అని చెప్పింది. ప్రతి వీక్ నేను నామినేట్ అయి వస్తున్నాను ఎఫర్ట్స్ అని చెప్తారు. నువ్వు నన్ను నామినేట్ చేస్తే నేను స్మైల్ తో తీస్కోవాలి నేను నామినేట్ చేస్తే మీరు నన్ను బ్లెమ్ చేయడం పోక్ చేయడాం మొదలు పెడతారా అని బాధ పడుతుంది. అవినాష్ నన్ను మూడు నాలుగు వరాలుగా పని చేయడం లేదు అని నామినేట్ చేస్తున్నాడు పులిహోర చేయలేదని ఇవా రీజన్స్ అని బాధపడుతుంది. అవినాష్ మీద పీకల్దాక ఉంది కోపం అందుకే అరిచేసినట్లుంది తన మీద. 

తర్వాత అరియానా వచ్చింది. 
నువ్వు నాకు ఇచ్చిన వర్స్ట్ కాప్టెన్ అన్నదానికి ఇచ్చిన రీజన్ బాలేదు నేను ఊరికె పని చేయను అన్నా కానీ నేను వంట చేశా ఒక రోజు నా కాప్టెన్సీలోనె అంది. నాకు నచ్చలేదు అని నామినేట్ చేసింది. 

మోనల్ నా కెప్టెన్సీలో మిమ్మల్ని రేషన్ మానేజర్ చేయడం బెస్ట్ డెసిషన్ నాది. గొడవలు అయ్యాయ్ అన్నారు ఏంటి అని అడిగారు. నా కెప్టెన్సీ లో మీకు ప్రాబ్లం ఏమైంది. మీరు మాట్లాడే పద్దతి అంటే ఎలా అని అడుగుతుంది. సోహెల్ తో పనిష్మెంట్ పెద్ద గొడవ చిన్న చిన్న విషయంలో గొడావ చేశారు దానికే హౌస్ హార్మొని డిస్ట్రబ్ అవుతుంది అని చెప్పింది. దేనికి దేనికి అని పిన్ పాయింట్ చేస్తుంది. హిందీలో చెప్తుంటే తెలుగు అని అన్నాడు అవినాశ్ మధ్యలో మాట్లాడకు అని ఒకటే పాయింట్ మీద పట్టుకుని రిపీటెడ్ గా చెప్పాడు. 

సోహెల్ నువ్వు వర్స్ట్ కెప్టెన్ గా నా పేరు రావాలి నా పేరు రావాలి అని అన్నావ్ కదా అదే నాకు నచ్చలేదు అదే బెస్ట్ కాప్టెన్ విషయంలో అని ఉంటే బావుండేది అని తన దాన్లో పోసి నామినేట్ చేసింది.

సోహెల్ తర్వాత
అవినాష్ ఎవిక్షన్ కార్డ్ వల్ల నన్ను సేవ్ చేయలేదేమో అంటున్నావ్ సక్సెస్ నాకొచ్చిందని ఎంజాయ్ చెయాలి. అలాగే వీక్ ఉన్నారు వీక్ ఉన్నారు అని అంటున్నావ్ కానీ ఇపుడు స్ట్రాంగ్ అయ్యారు ఆడుతున్నారు అని చెప్పాడు. తను కూడా స్ట్రాంగ్ అవుతుంది తనని అనకు అని అన్నాడు. సరే అది జస్ట్ సజెషన్ కానీ ఎవిక్షన్ పాస్ గురించే నామినేషన్ అని చెప్పాడు మాక్సిమమ్ ఇతని దాన్లోనే పోశాడు. సోహెల్ చెప్తుంటే అవినాశ్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏదో స్పీచ్ ఇవ్వడానికి ట్రై చేశాడు కానీ ఏం చెప్పాడో తనకైనా అర్ధమైందా అనేది నా డౌట్. 

అరియానా మనం మూడ్నెల్లుగా ఉన్నాం ఐదారు తప్పులన్నా చేసుంటాం లైక్ చేస్తుననవ్ కదా అని అడిగాడు ఎందుకు చెయను అన్నాడు. సరే కొంచెం వేస్తన్నాలే అని కొద్దిగా వేశాడు. తక్కువ పడింది నాకె ఎక్కువ ఉంది అని అన్నాడు. వీళ్ళిద్దరికే తక్కువ లిక్విడ్ ఉంది. వీళ్ళిద్దరూ ట్రూ టామ్ అండ్ జెర్రీ ఈ సీజన్ కే కాదు ఇన్ ఆల్ సీజన్స్ అఫ్ బిగ్ బాస్ అనిపించింది ఒకళ్ళనొక్కళ్ళు నామినేట్ చేస్కున్నది చూస్తే.. లవ్లీ అండ్ ఇంట్రెస్టింగ్ రిలేషన్ షిప్. 

మోనల్ ఏడుస్తుంటే సోహెల్ ఆపుతున్నాడు. ఓదారుస్తున్నాడు గుద్దుతా ఏడిస్తే సమ్పుతా అంటా.. ఓరినాయనా ఇదేం ఓదార్పురా సామీ అని అనిపించింది నాకైతే :-) కానీ అలాంటి ఓ ఫ్రెండ్ ఉండాలి లైఫ్ లో.. సచ్ ఎ స్వీట్ గై.. 

ముగిసే సరికి లిక్విడ్ లెవెల్స్ : 

అవినాష్ 21
అభి 16.5
హారిక 16 
అరియానా 15 
అఖిల్ 16 
మోనల్ 20
సోహెల్ 15 

హారిక, అఖిల్ మధ్య టై అయిన కారణంగా వారిద్దరిని కూడా నామినేషన్ లోకి పరిగణనలోకి తీస్కుంటున్నాం. 

అవినాష్, మోనల్, అభిజిత్, హారిక, అఖిల్ నామినేటె అయ్యారు. 

రేపు రేస్ టు ఫినాలే టాస్క్. 
గార్డెన్ ఏరియాలో ఒక ఆవును పెట్టారు. ఆవి అంబా అని అరిచినపుడల్లా దానికి వచ్చే పాలని నింపుకోవాలి. ఏ సభ్యుని దగ్గర తక్కువ పాలబాటిల్స్ ఉంటాయో వాళ్ళు టాస్క్ నుండి తప్పుకోవాలి. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts