4, నవంబర్ 2020, బుధవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందొ నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చిన రఫ్ నోట్స్ లో ముఖ్యమైన పాయింట్స్ చదవచ్చు. 


59వ రోజు ఇంట్లో పదిమంది సభ్యులు ఉన్నారు. ఉదయం ఈ రోజు థీం కి తగినట్లుగా రంగా రంగా రంగస్థలానా పాటతో మేల్కొలిపారు. అంతా బాగా డాన్స్ చేశారు. 

కరోనా సమయంలో సేవలు అందించిన వారిని కొనియాడుతూ ఓ ఏవీ వచ్చింది. ఇది విప్రో వారి హైజీనిక్స్ అడ్వర్టైజ్మెంట్. సోప్స్ శానిటైజర్ అండ్ వైప్స్ ఇంట్లో అందిస్తున్నారు. అన్నిటినీ మెంబర్స్ తో లాంచ్ చేయించారు. 
కొత్త టవల్స్ కూడా వచ్చాయి హైజీనిక్స్ బ్రాండ్ తో.
సోహెల్ మైక్ పెట్టుకోలేదు అనౌన్మెంట్ వచ్చింది అరియానా పనిష్మెంట్ చేయమంటే చేయను అని చెప్పేశాడు. 
అభి మోనల్ ని నిన్నెందుకు అంతమంది టార్గెట్ చేశారు అని అడిగాడు. వాళ్ళ దృష్టిలో నేను వీక్ త్వరగా గివప్ చేస్తాను అనుకున్నారు అని చెప్తుంది. 

పల్లెకి పోదాం ఛలో ఛలో కెప్టెన్సీ టాస్క్
ముఖ్యమైన పని మండే మంటని ఆరకుండా చూడాలి. ఆహారం/పాన్ కి ప్రతిఫలంగా వడ్లను దంచి ఇవ్వాలి. 
పాన్ షాప్ ముందు బల్లమీద వినోదాత్మకంగా కాలక్షేపం చేయాలి. 
ఊర్లో జరిగిన విషయాల మీద సాయంత్రం పంచాయితి జరిపి పరిష్కరించి శిక్షలు విదించాలి. 
గ్రామ పెద్ద అందరికి అన్ని అందేలా చూస్కోడం మంట ఆరకుండా చూస్కోవాలి. గ్రామ పెద్దకి అన్ని ఉచితం అతని నిర్ణయం తుదినిర్ణయం.   
ఇది వ్యక్తిగత ఆట మీ అటని పట్టి కెప్టెన్సీ పోటీ దారులని నిర్ణయిస్తారు.
సోహెల్ అవినాష్ మొదలు పెట్టేశారు ఊర్లో వాళ్ళలాగా మాట్లాడుకోవడం. 

నిద్రపోతున్న సోహెల్ ని కన్ఫెషన్ రూం కి పిలిచారు. మీ నిద్రపూర్తయిందా అని అడిగారు. 
సోహెల్ గ్రామ పెద్ద. ఊర్లో జరిగే మంచి చెడులని చూస్కోవాలి, మంట ఎల్లప్పుడు మండేలా గ్రామస్థులు చూడాలి. వాళ్ళు చూసేలా మీరు చూస్కోవాలి. 


అరియానా లాస్య : వంటలు అని అందరూ గెస్ చేశారు. తల్లీ కూతుళ్ళు. లాస్య గ్రామపెద్ద భార్య అలాగే సామాజిక కార్యకర్త. అందర్ని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. గడసరి పిల్ల గ్రామ పెద్ద కూతురు. ఊర్లో కుర్రాళ్ళంత ఇష్టపడుతుంటారు. 

అమ్మ రాజశేఖర్ కష్టపడే స్వభావం ఉన్న గ్రామస్థుడు. గ్రామపెద్దకి గ్రామం లో విషయాలని తెలుపుతుంటారు. గ్రామ పెద్ద భార్యని ఆకట్తుకోటానికి ప్రయత్నిస్తుంటారు. 

అఖిల్ భాద్యత లేని గ్రామస్థుడు గ్రామ పెద్దని ఎదురు ప్రశ్నిస్తుంటారు. గ్రామ పెద్ద భార్యకి తమ్ముడు.   

అభి మోనల్ వంట సిద్ధం చేసే జంట. సిద్దం చేసి అమ్మి ప్రతిఫలంగా బియ్యం పాన్ తీస్కోవాలి. గ్రామస్థులతో మీ సంబంధాన్ని బట్తి ఎవరిదగ్గర ఎంత తీస్కోవాలనేది మీ ఇష్టం. 

హారిక గ్రామంలో పుకార్లు పుట్టించే అమ్మాయి. పాన్ షాప్ యజమాని తమ్ముడు మీ ప్రియుడు మీరు ఊర్లో అబ్బాయిలందర్ని ఆటపట్టిస్తుంటారు. వేరే వారి పనుల్లో సహాయం చేస్తుంటారు. 
సీక్రెట్ టాస్క్ మీరు హంతకురాలు. మూడు హత్యలు చేయాలి. బిగ్ బాస్ చెప్పిన ప్రతిసారి చెప్పిన క్రమంలో చేయాలి. రాజశేఖర్ పై కాఫీ చల్లడం. అవినాష్ కి కోపం తెప్పించి అరిపించడం, చంపాలనుకుంటున్న వ్యక్తి పేరు ఓ విండో పై రాయాలి. 

అవినాష్ పాన్ షాప్ యజమాని మంచి అన్న మీ తమ్ముడు మెహబూబ్ అంటే ఇష్టం. అరియానాని ప్రేమిస్తూ ఉంటారు. మెహబూబ్ మీరో రౌడి. 

టాస్క్ మొదలవుతుండగా హారిక కాఫీ కలుపుతుంది. అభి వచ్చి ఫుడ్ ఏం కావాలన్నా నన్ను అడగాలి అని అడ్డుపెట్టాడు. మొదలయే ముందే కలిపా ఇది నేను అని చెప్పింది. ఇది తన సీక్రెట్ టాస్క్ లో భాగంగా అమ్మ గారిమీద ఒంపడనికి కలుపుకుంది.  

హౌస్మేట్స్ అందరూ మంచి పల్లెటూరి శ్లాంగ్ లో మాట్లాడుతు బాగానే చేస్తున్నారు. 

పరువు పోతుంది అంటే పోతే తిరిగిరమ్మని పోవద్దు అని అంటుంది అరియానా.. అవినాష్ తో తిరిగి తిరిగి జబర్దస్త్ పంచ్ లు వచ్చేసినట్లున్నాయ్ :-) అఖిల్ అండ్ లాస్య మాములుగా నవ్వలేదు గలీజ్ పంచ్ అని :-)

టాస్క్ చేస్తూ మధ్య మధ్యలోనవ్వుకుంటున్నారు వాళ్ళ్లలో వాళ్ళే. 

అభి మోనల్ కిచెన్ లో వంట చేస్కుంటూ ఉన్నారు. 
గార్డెన్ ఏరియాలో మంచి మంచి సరదా సరదా సీన్స్ రన్ చేస్తున్నారు. 
మెహబూబ్ కొన్ని కట్టెలు వాష్ రూం లో దాచి పెడుతున్నాడు. ఇంకా అమ్మ గారు కూడా దాచి పెడుతున్నారు.
అఖిల్ అలిగాడు సోహెల్ పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు నీతో మాట్లాడదామని వస్తే అసలు మాట్లాడడం లేదు అని అంటున్నాడు. ఎంత కన్విన్సింగ్ గా చెప్పినా అఖిల్ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. 

మంట ఆరిపోయె పరిస్థితి వచ్చింది. కట్టెలు దొరకడం లేదు.  

హారిక మీరు మైక్ సరిగా థరించండి అని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇదె మొదటి హత్యకి అనౌన్స్మెంట్. సో  ఉడ్ కావాలని అందరూ ట్రై చేస్తుంటే పనిలో పనిగా వాళ్ళ మధ్యలో హడావిడి చేస్తూ హారిక అమ్మ గారి మీడ కాఫీ ఒంపేసింది. సారీ చెప్పింది కాఫీ ఒంచినందుకు. 

ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలని పాన్ షాప్ లో అవినాశ్ అండ్ మెహబూబ్ వాదిస్తున్నారు. అభి నేమోమా పార్టనర్ ఒప్పుకోదని చెప్తున్నారు. 

మీ గ్రామంలో ఒక హత్య జరిగింది సో గ్రామస్తులలో ఇద్దరు రాత్రంతా మేలుకొని మంట ఆరకుండా మరో హత్య జరగకుండా చూస్కోండి అని అనౌన్స్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్. 
అదే సమయానికి మాస్టర్ బెద్ రూం లోకి వెళ్ళడంతో అండరి అనుమానం ఆయన మీదకి తిరిగింది హారిక కూడా ఆయన మీదకి తిప్పేసింది.

అభి ఇంటిలోకి వెళ్ళే వీలు లేకుండా తలుపు లాక్ చేసి అడ్డుపడ్డాడు. ప్రోటీన్ షేక్ తీస్కుని తాగుతున్నారు సో లోపలికి వెళ్ళనివ్వ్వను అని చెప్పాడు అభి. నా ఫ్రూట్స్ నేను తెచ్చుకుంటాను అని అననడు అఖిల్. లేదు అలా ఎలా కుదురుతుంది. నువ్వు రెండు సార్లు తిన్నావు. మూడో సారి ఎలా తీస్కుంటావు అని అంటున్నాడు. ఇల్లు లాక్ చేయడానికి వీల్లేదు అని అంటున్నాడు అఖిల్ బిగ్ బాస్ కి చెప్పండి అని చెప్తున్నాడు కానీ అనౌన్స్మెంట్ రాలేదు. 
 
వడ్లు దంచడానికి కష్టపడుతున్నాను అని చెప్తున్నాడు. డీల్ మాట్లాడుకుని వడ్లు తీస్కెళుతుంటే అభి అతని దగ్గర మెహబూబ్ కొట్టేయడనికి ప్రయత్నింఛాడు. సోహెల్ హెల్ప్ చేసి ఆపాడు. 

మెహబూబ్ నీళ్ళు పోసి మంట ఆపడనికి ట్రై చేశాడు. ఇంతలో అమ్మ గారు మెహబూబ్ దగ్గర కట్టెలు తీస్కున్నాడు. మెఅహ్బూ మొత్తం కట్టెలు అన్నీ మోసుకెళ్ళాడు. అంతలో అఖిల్ కూడా వచ్చి కట్టెలు తీస్కున్నాడు వెనక్కి. 

మెహబూబ్ సోహెల్ కి కోపం తెప్పింఛడనికి ప్రయత్నిస్తునాడు. అరియానా ఆపుతుంది. కోపం తెచ్చుకోకండి కోప్పడితే నువ్వు చచ్చిపోతావ్ అని.

రేపటి ప్రోమోలో ఇదే టాస్క్ కంటిన్యూ అవుతుంది. అభి ఫుడ్ విషయంలో బాగా స్ట్రిక్ట్ గా ఉన్నట్లున్నాడు. ఆ నెగోసియేషన్స్ లో అభి అరియానా మీదా మాస్టర్ అభి మోనల్ ల మీద అరుస్తున్నారు.  

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts