22, నవంబర్ 2020, ఆదివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఉన్నది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన వివరాలకోసం అది చదవచ్చు. 
 


ఈ రోజు ఎలిమినేషన్ డే కదా లాస్య ఎలిమినేట్ అయింది. మండే నామినేషన్స్ లో అరియానాతో నువ్వు నాకు పోటీనే కాదు అని అన్న లాస్య ఈ రోజు తనతోనే ఓడిపోవడం అంటే చివరికి వీళ్ళద్దరే మిగిలి తను ఎలిమినేట్ అవడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కాకపోతే హౌస్ లో కానీ తను కానీ ఎవరూ ఏడవకుండా పెద్ద సీన్ చేయకుండా హాపీగా వెళ్ళడం బావుంది. 

తన ఎలిమినేషన్ కి ముఖ్యమైన కారణం సేఫ్ గేం చాలా మందికి నచ్చకపోవడం అనిపిస్తుంది. బహుశా అది తన ఒరిజినల్ నేచర్ కూడా అయుండచ్చు నొప్పింపక తానొవ్వక మెసలడం తన పద్దతి అయినా కూడా అది సమాజంలొ ఓకే కానీ అది బిగ్ బాస్ ఇంటి విషయానికి వస్తే మాత్రం అలాంటి తత్వాన్ని సేఫ్ గేం అనేసి పక్కన పెట్టేస్తారు ఆడియన్స్.   

తను వెళ్తూ వెళ్తూ లాస్య టాప్ టూ సోహెల్ అభి ల పేర్లు చెప్పింది. పబ్లిక్ ఒపీనియన్ కానీ హౌస్మేట్స్ ఫామిలీస్ ఒపీనియన్ కానీ ఇదే ఉంది. అఖిల్ సీక్రెట్ రూం కి వెళ్ళక ముందు సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు కానీ అక్కడికి వెళ్ళొచ్చాక బాగా నెగటివ్ అయింది తనకి. అదే టైమ్ లో సోహెల్ జెన్యునిటీకి బోయ్ నెక్స్ట్ డోర్ యాటిట్యూడ్ కి పబ్లిక్ బాగా కనెక్ట్ అయ్యారు అనిపిస్తుంది. ఈ రోజు టాప్ టూ లో పేరు చెప్తే కూడా సోహెల్ ఏ మాత్రం భేషజం లేకుండా తను మొదట్లో నేనే అందరికన్నా వీక్ కంటెస్టెంట్ ని అనుకునే వాడ్ని ఇపుడు మీరు సెకండ్ పొజిషన్ లో పెట్టడం చాలా హాపీగా ఉంది ఖుష్ ఇది చాలు అని మనస్ఫూర్తిగా చెప్పాడం  చాలా బావుందనిపించింది. ఆ అమాయకత్వం హానెస్టీనే అందరిని ఆకట్టుకుంటున్నట్లుంది. 

అలాగే ఈ వీక్ మోనల్ డేంజర్ జోన్ లో ఉంటుందని చాలా మంది ఊహించారు. కానీ కెప్టెన్సీ టాస్క్ లో ఒక్క ఇంచి కూడా కదలకుండా అబ్బాయిలకన్నా స్ట్రాంగ్ గా హారికని భుజాల మీద మోసి తను పాజిటివ్ పాయింట్స్ కొట్టేసిందనిపించింది. సోషల్ మీడియా ఓట్ల ప్రకారం ఐతే హారిక మోనల్ అండ్ లాస్య మధ్య ఓట్ల తేడా కేవలం వందల్లో ఉండడం గమనించవచ్చు.   


వివరాలలోకి వెళ్తే ఈ రోజు నాగ్ లవ్ స్టోరీ సినిమాలోని ఏ పిల్లా పరుగున పోదామా పాటతో ఎంట్రీ ఇచ్చారు.. 

హౌస్మేట్స్ అంతా కూడా తెగపొగిడేశారు ఏంటొ మరి నాగ్ ని. 

టీమ్ ఏ హారిక లాస్య, అభి, అఖిల్, 
టీమ్ బి అరియానా అవినాష్, సోహెల్, మోనల్,    
ఫస్ట్ వీక్ మోనల్ కి ఇప్పుడు మోనల్ కి పోలికే లేదు అని చెప్పారు నాగ్ చాలా ఇంప్రూవ్ ఐంది అన్నారు. 

బజర్ కొట్టాలి టీవీలో ఇమేజెస్ వస్తాయ్ వాటిని బట్టి సాంగ్ గెస్ చేయాలి. 
గాజువాక పిల్లా - టీం బి గెస్ చేశారు. 
ఆరడుగుల బుల్లెట్ - టీం ఏ గెస్ చేశారు
బంగారు కోడిపెట్ట - టీం ఏ గెస్ చేశారు. 
ఈ పాటకి అభి బాగా డాన్స్ చెశాడు నాగ్ కూడా వావ్ అని ఛీరప్ చేశారు. అఖిల్ మీ ఫ్రెండ్ డాన్స్ చేస్తున్నాడు అని ప్రత్యేకంగా చెప్పారు. 
బుట్ట బొమ్మ పాటా టీం బి గెస్ చేశారు
అందరి మీద నీ డాన్సే బావుంది గ్రేస్ ఫుల్ గా అన్నారు అభిని.
నక్క్లీస్ గొలుసు టీం ఏ గెస్ చేశారు.  

మీరిద్దరు మరీ టూమచ్ ఉన్నారు అని బజర్ కొట్టే వాళ్ళని మార్చేశారు. అరియానా అండ్ లాస్య ని పెట్టారు. 

ప్రేమ వెన్నెల రావె ఊర్మిళ పాట ఎవరూ గెస్ చేయలేకపోయరు

కన్నెపెట్టరో కన్నుకొట్టరో పాట టీం బి గెస్ చేశారు. 

టైం టు సేవ్ వన్.. ఫోటోలను ఒక బ్లాక్ నుండి బయటికి లాగాలి గ్రీన్ ఉంటే సేవ్ రెండ్ ఉమ్టే నాట్ సేవ్ హారిక సేవ్ అయింది.

ఈ వీక్ హారిక కెప్టెన్ అయితే అఖిల్ కి చెప్తున్నారు పనులన్నీ మొన్నే చెప్పారు నాగ్ నేను అమ్మాయిలకే సపోర్ట్ అని మరి అందుకే హారికని కష్టపెట్టడం లేదేమో. 

నీలి నీలి ఆకాశం టీం ఏ గెస్ చేసింది
ఏ వచ్చి బి పై వాలె టీం బి గెస్ చేశారు. 
కలర్ ఫుల్ చిలక పాట టీం బి గెస్ చేసింది. అవినాష్ వచ్చి ఆ పాట కాదంటూ వేరే పాట చెప్పాడు. బజర్ కొట్టకపోగా తప్పు సాంగ్ చేస్తున్నావా అని నవ్వేశారు నాగ్. 

టీం ఏ హారిక వాళ్ళ టీం గెలిచింది. 

పంకజ్ కస్తూరి కాల్ లాస్య కి గుంటూర్ నుండి చంద్రిక కొంతమంది మొదటినుండి ఓపెన్ కొందరు మధ్యలో నుండి ఓపెన్ మీరు ఇంకా సేఫ్ గెం ఆడుతున్నారు ఎంత వరకు కరెక్ట్ అని అడిగింది. నేనైతే ఇంతే ఉంటాను బయట కూడా కాస్త మొహమాటం ఎక్కువ అని చెప్పింది. నేనైతే సేఫ్ గేం ఆడడం లేదు అని అంది.  

గార్డెన్ ఏరియాలో నెక్స్ట్ గెం.. ఒకళ్ళని సేవ్ చేయాలని సేవ్ అయ్యే వాళ్ళ ఫ్యామిలి ఫోటో నా దగ్గర ఉంది అని చూపింఛారు. మోనల్ సేఫ్. సో స్పెషల్ అని చెప్పింది.    

లూడో గేం ఆడించారు
అఖిల్ బాబు కి డేర్ వచ్చింది అల్ఫబెట్స్ రివర్స్ లో చదవమన్నారు చదవలేకపోయాడు.

సోహెల్ కి యాక్టివిటీ నెయిల్ పాలిష్ నోటితో పట్టుకుని వేయాలి సూపర్ గా వేసేశాడు. ఈజీ టాస్క్. పాండమిక్ టైమ్ లో నైట్ నైన్ తర్వాత బాగా వర్క్ షాప్ చేసినట్లున్నవ్ లే అన్నారు. 

అఖిల్ కి యాక్టివిటి వచ్చింది మళ్ళీ పాట పాడమన్నారు. చిరు చిరు చినుకై కురిశావే పాట పాడాడు. ఈ రొమాంటికి సాంగ్ ని బాధగా పాడమన్నారు. ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఫాస్ట్ గా పాడమన్నారు. స్లోమోషన్ లో పాడమన్నారు అన్నీ సూపర్ గా పాడాడు.

లాస్యకి యాక్టివిటీ నాలుక బయటపెట్టి సినిమా డైలాగ్ చెప్పమన్నారు. ఎవడు కొడితే డైలాగ్ చెప్పింది. ఫన్నీ.. నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది చెప్పింది. నీ మొహం అని తిట్టారు నాగ్ సార్ ప్రోమోలో చూపించినది అవినాష్ ని కాదు లాస్యని అనమాట. 

అవినాష్ కి యాక్టివిటీ ఒక నిముషంలో చీర కట్టుకోవాలి. కట్టేశాడు. ఫెంటాస్టిక్ అవినాష్ నీకు తొమ్మిది తర్వాత ఇదనమాట యాక్టివిటీ అన్నారు నాగ్ :-) చీరతో డాన్స్ కూడా బాగా వేశాడు ఊడిపోకుండా. అవినాష్ నీలో చాలా కళలు ఉన్నాయ్ అని అన్నారు నాగ్. 

అవినాష్ కి నెక్స్ట్ అక్టివిటీ వచ్చింది. స్టోర్ రూం లో లెమన్స్ ఉన్నాయ్ అని తెప్పించారు. ఎక్స్ప్రెషన్ లెస్ గా నిమ్మకాయలు తినాలి అన్నారు బానే చేశాడు. 

టీం అరియానా విన్నర్ మోనల్ వరసగా సిక్స్ లు కావాల్సిన నంబర్స్ వేసేసి విన్ చేసేసింది. ఈవిడ లక్ మాములుగా ఉన్నట్లు లేదు అసలు. 

అభితో లూడో గేం లో మనం మైండ్ గేం ఆడలేం అది పడితే పడుతుంది లేకపోతే లేదు అని చెప్పారు నాగ్. 

టైమ్ టు సేవ్ వన్ రియల్ మ్యాంగో జ్యూస్ వచ్చింది తాగమన్నారు అరియానా లాస్య చాలా ఫాస్ట్ గా తాగారు. ఎవరి బాటిల్ లోపల  గ్రీన్ కలర్ ఉందొ అది కెమెరాకి చూపించండి అని అన్నారు. అభి సేఫ్..  

చివరికి అరియానా అండ్ లాస్య మిగిలారు బొమ్మల మీద లైట్స్ ప్లే అవుతుంది ఎవరి బొమ్మ మీద లైట్ ఉంటే వాళ్ళు సేఫ్ అండ్ రెండో వాళ్ళు ఎలిమినేటెడ్.   

అరియానా ఈజ్ సేఫ్ అండ్ లాస్య ఈజ్ ఎలిమినేటెడ్.. షీ గాట్ ఎ కూల్ ఎలిమినేషన్ ఎవరు ఒక్కరు కూడా ఏడవలేదు అండ్ ఎమోషనల్ అవలేదు. అందరూ ఊహించినట్లున్నారు చాలా సర్ ప్రైజింగ్ అసలు :-)

లాస్యని అడిగారు ఏంటీ ఊహింఛావా అసలు సర్ ప్రైజ్ అవలేదు అని అన్నారు నాగ్ కూడా. నవ్వుల లాస్య అని అంటే నా నవ్వు జెన్యూన్ సర్ అని అంది హా ఆవిషయం నాకు తెలుసు ప్రేక్షకులకీ తెలుసు అని నవ్వేశారు. 

ఏవీ చూపించారు అన్ని ఎమోషన్స్ తో చాలా బావుంది. జున్ను ని చూడగానే ఏడుపొచ్చేసింది. హమ్మయ్య ఇపుడు నేను జున్ను దగ్గరకే వెళ్తున్నాను అంటే అవునా ఐతే హాపీగా వెళ్ళు అన్నారు. 

సోహెల్ కి ఇరవై దోశలు వేసేదట. ఎవరు వంట చేస్తారు అని అడిగితే అందరికి వంట వచ్చు సర్ ఎవరు చెప్పడం లేదు అని అంది.
అవినాష్ ఆయిల్ లేకుండా ఆమ్లెట్ వేస్తాడని చెప్పింది. ఆమ్లెట్ వేశాక గుర్తొచ్చింది ఆయిల్ వేయాలని అన్నాడు. నీకు నువ్వే సాటి అన్నారు తనని నాగ్.   

సేఫ్ ఆడకుండా టాప్ టూ ఎవరో చెప్పు అన్నారు సోహెల్ అండ్ అభి అని చెప్పింది. 
ఒక్కొక్కరికి ఏం చెప్పాలో చెప్పు అని అడిగారు అందరు బాగా ఆడుతున్నారు అంటే మళ్ళీ సేఫ్ ఆడకు ఉన్నదున్నట్లు చెప్పు అన్నారు నాగ్. 

అవినాష్ ఎంటర్టైనర్.. నామినేషన్ లో తననెవరైనా ఏమైనా అంటే బాగా ఫీలవుతాడు. తీస్కో అంది. 

మోనల్ భాష వల్ల అయుండచ్చు కొన్ని సార్లు కన్ఫూజ్డ్ గా ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో అభ్సర్వ్ చేశాను అంది. 

అరియానా లో బాగా నచ్చే విషయం హిట్ మన్ టాస్క్ లో దెబ్బలు తగిలించుకుని వెళ్ళి నామినేట్ చేసింది నాకోసం అలా వెళ్ళ్దం బావుంది. బోల్డ్ గా మాట్లాడతావ్ కానీ రాంగ్ ఉన్నపుడు ఒప్పుకో అని చెప్పింది. 

సోహెల్ ముక్కు మీద కోపం. ఎంత కోపం వస్తే అంతే త్వరగా కరిగిపోతాడు సెటిల్ చేస్కుని కూల్ అయ్యేవరకు నిద్రపోడు. మీసాలు చాలా బావున్నాయ్ స్క్రీన్ లో సూపర్ ఉన్నావ్ అని చెప్పింది. 

అఖిల్ కోపం వచ్చినపుడు అంత ఎగ్రెసివ్ నెస్ వద్దు. ఎదుటి వాళ్ళు మాటాడుతున్నపుడు విను మిగతా అంతా పర్ఫేక్ట్ అని చెప్పింది.

అభి నాకోసం టీ చేస్తాడు నాకు బాగా నచ్చేశాడు అని చెప్పింది. మీ ఇంట్లో ఉంటాను వచ్చాక నెల రోజులు అని చెప్పాడు అభి జున్నుని డ్రవ్ కి తీస్కెళ్తా అని చెప్తున్నాడు. 

హారిక చాలా స్ట్రఆంగ్ అన్యాయం జరిగిందనిపిస్తే ఒకటికి పది సార్లు వాదించి సాధిస్తుంది. నువ్వు టాప్ త్రీ లో టూ లో ఉండాలి విన్ అవ్వాలి అని చెప్పింది. 

టైం ఫర్ బిగ్ బాంబ్ అని తను క్వీన్ ఆఫ్ ద కిచెన్ కదా కింగ్/క్వీన్ ఆఫ్ ద కిచెన్ అని చెప్పి ఒక వారం వాళ్ళకి కిచెన్ అప్పగించేయ్ అని చెప్పారు. నేనైతే అభికి ఇస్తా అని అన్నారు నాగ్. అయ్యో అని అభి అంటుంటే నాకోసం చేయలేవా అని అంది. ఎనీథింగ్ ఫర్ యూ అని చెప్పాడు. బ్రేక్ ఫాస్ట్ ఐతే ఫర్ ష్యూర్ అని అన్నాడు. 

చివరిలో నాగ్ స్ట్రాంగ్ గా ఆడండీ నాలుగు వారాలు మాత్రమే ఉన్నాయ్ అని చెప్పారు. ఏడుగురు మాత్రమే ఉన్నారు. 

రేపటి ప్రోమో చూపించలేదు ఈ రోజు.. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts