29, నవంబర్ 2020, ఆదివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటలలో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. నా అభిప్రాయాలు వీడియోలో ఉంటాయి. 



ఈ రోజు ఎలిమినేషన్ డే.. అవినాష్ కి తక్కువ ఓట్లు వచ్చాయి అతను ఎలిమినేట్ అవ్వాల్సింది.. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడం వలన తను అది వాడదామని రైట్ డెసిషన్ తీస్కోడం వలన తను సేవ్ అయ్యాడు. అందువలన ఈ రోజు నో ఎలిమినేషన్. 

ఈ పాస్ ఉపయోగించే విషయంలొ అరియానా క్లియర్ గా నేను ఎలిమినేట్ అయినా పర్లేదు నువ్వు కష్టపడి సంపాదించింది నీకోసమే ఉపయోగించుకో ఇంకో సారి ఇంకో సారి ఐతే నాకు వాడమని అడిగేదాన్నేమో కానీ ఈ వారమైతే వద్దు అని అనడం నాకు చాలా నచ్చేసింది. 

ఇక ఈ వారం కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ వచ్చి హౌస్ లో కాసేపు సందడి చేశారు అన్నపూర్ణా స్టూడియోలోనే తన ఫాంటమ్ సినిమా షూట్ చేస్తున్నారట అందుకే వచ్చారు. 

మనం అందరం ఊహించినట్లుగానే వీక్ లో స్కేరీ రూం లో అఖిల్ అండ్ సోహెల్ చేసిన అల్లరిని హౌస్మేట్స్ అందరికి చూపించారు అంతా మాములుగా నవ్వుకో లేదు వాళ్ళిద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. 
  
వివరాలలోకి వెళ్తే నాగార్జున తన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని టైటిల్ సాంగ్ తో ఎంటర్ అయ్యారు. 

ఇంటి సభ్యులంతా ఒక చిన్న పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేశారు. జగడ జగడ జగడం పాటతో మొదలు పెట్టి నాగ్ సాంగ్స్ కి డాన్స్ చేశారు. బావుంది అభి కూడా బాగానే జాయిన్ అయ్యాడు స్టెప్స్ లో. మంచి మెమొరీస్ తీస్కొచ్చారు మీరు అని మెచ్చుకున్నారు. 

చీకటిలో ధైర్యం స్థైర్యం టాస్క్ ఈ సారి కన్ఫెషన్ రూం లోకి సోలోగా వెళ్ళాలి.     

అరియానా నో సర్ అని అంటే నాగ్ నాకు నీ మీద గొప్ప నమ్మకం నువ్వే మొదలు పెట్టాలి అని అన్నారు. నువ్వు చేస్తావ్ అని గట్టిగా అభి అండ్ అవినాష్ అందరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఏడ్చేస్తునే వెళ్ళింది నాగ్ కూడా నువ్వు చేయగలవు అని అన్నారు. సగంలోనే ఆపేశారు బాగా భయపడుతుందని. 

తరువాతా సోహెల్ వెళ్ళాడు ఫుల్ హిలేరియస్ చీకట్లో ధైర్యంగానే వెళ్ళాడు కానీ సౌండ్స్ వస్తుంటే మాత్రం భయపడుతున్నాడు. ఏయ్ సౌండ్స్ వేయకండి అని అంటున్నాడు. హిలేరియస్ పెర్ఫార్మెన్స్. 

హారిక వెళ్ళింది ధైర్యంగానే వెతికింది. సౌండ్స్ కి కూడా భయపడలేదు మూడూ ఈజీగానే కనుక్కుంది కానీ డోర్ ఎక్కడుందో మర్చిపోయింది తెగ వెతుక్కుంది. అందరు చోటూ చోటూ అంటారు కానీ ధైర్యం స్థైర్యం అక్కడ ఉంది తొణకలేదు బెణక లేదు అని చెప్పారు. 

తర్వాత అఖిల్ వెళ్ళాడు.. హిలేరియస్ గజ్జెల సౌండ్ వస్తుంటే మస్త్ భయపడ్డాడు. నాగ్ సర్ నీ పక్కనే ఉంది జలజ అని చెప్తున్నారు. మన వాడు కాస్త సౌండ్స్ కి భయపడుతున్నాడు. గజ్జల సౌండ్ వస్తుంటే హే దగ్గరకు రాకు అక్కడే ఉండు అని అంటున్నాడు.. రాఅ రా అని అడుగుతుంటే ఆ వస్తన్నా ఆగు అని చెప్తున్నాడు. మూడూ బాగానే కనిపెట్టాడు కానీ మూడో దానికోసం కాస్త వెతుక్కున్నాడు. 

మోనల్ వెళ్ళింది ఈ సారి.. కాస్త భయపడూ అని అంటున్నాడు అఖిల్. సర్ నో చికెన్ నో ఎగ్ నో ఫిష్ అని అడిగింది. మానిక్విన్, నూడుల్స్ టచ్ చేసింది ప్రాన్స్ ఉంటే తచ్చ్ చేయద్దు అని చెప్పారు నాగ్. సౌండ్స్ కి ఏం భయపడలేదు సైలెంట్ గా వెళ్ళి చూసి వచ్చేసింది. 
హౌస్ లో ఆడపిల్లలే బెటర్ అఖిల్ అని చెప్తున్నారు నాగ్.
 
అభి వెళ్ళాడు ఏం కనిపించట్లేదు లిటరల్లీ అని అంటున్నాడు. సౌండ్స్ వస్తుంటే ఏం భయపడలేదు సైలెంట్ గానే ఉన్నాడు సులువుగా వెతికాడు. ఈజీగానే చెప్పి వచ్చాడు. 

ఈ సారి అవినాష్ వెళ్ళాడు బగానే పెర్ఫార్మెన్స్ చేశాడు భయపడుతూ నవ్వించాడు. సౌండ్స్ బాగా ఎక్కువేశారు ఇతని కోసం జలజ నవ్వులు బాగా ఎక్కువొచ్చాయ్. ఏయ్ నవ్వకునువ్వు అని భయపడుతున్నాడు. నాగ్ ఇంకా భయపెడుతున్నారు అటెళ్ళకు అమ్మాయుంది కాళ్ళమీద తొక్కుతావ్ అని చెప్తూ ఉన్నారు. 

హౌస్మేట్స్ కోసం స్పెషల్ ఫిల్మ్ చేశాం ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అని చెప్పారు.. అఖిల్ అండ్ సోహెల్ డార్క్ రూం వీడియో చూపించారు హిలేరియస్. అందరూ చాలా నవ్వారు. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంట అవినాష్. ఎవరికి చూపింఛద్దన్నారు బిగ్ బాస్ తో అప్పుడే డిసైడ్ అయ్యారు బిగ్ బాస్ చూపించాలని అన్నారు నాగ్. 

అరియానా మళ్ళా ఓ సారి ట్రై చేస్తావా అని అడిగారు ఓకే సార్ ట్రై చేస్తాను అని చెప్పి వెళ్ళింది. భయపడుతుంది కానీ ధైర్యంగా వెళ్ళి వెతికి అన్ని కరెక్త్ గా చెప్పింది. సౌండ్స్ వస్తుంటే చెవులు మూసుకుంటుంది కానీ చేసేసింది సులువుగా వెల్ డన్ అరియానా ఫాంటాస్టిక్ అని నాగ్ మెచ్చుకున్నారు. 

కిచ్చా సుదీప్ వచ్చారు. తను కంటిన్యువస్ గా సెవెన్ సీజన్స్ గా హోస్ట్ చేస్తున్నారుట కన్నడలో. నాకు చాలా పేషన్స్ వచ్చింది ఎక్కువ వింటున్నాం ఎక్కువ అర్ధం చేస్కుంటున్నా జడ్జ్ చేయడం మానేశాను మొత్తం మీద నా లైఫ్ లో కూడా ఉపయోగపడింది అని చెప్పారు.

హౌస్ లోకి డైరెక్ట్ గా వెళ్ళారు సుదీప్. నాగ్ మీరంతా విసిగిస్తుననరు అని నాకప్పగించి వెళ్ళారు అని చెప్పారు. మీరంతా ఎందుకు నాగ్ కావాలి ఒకో రీజన్ చెప్పండి అని అడిగారు. 
వి లవ్ 
నాగ్ వచ్చేశారు. మీరు కనపడకపోతే పిచ్చోళ్ళమై పోయాం అని అన్నారు హౌస్మేట్స్.

అవినాష్ : నువ్వు డేట్, పెళ్ళి, కిల్ ఎవర్ని అని అడిగారు హౌస్మేట్స్ లో.. మోనల్, హారిక, అరియానా ఇదే ఆర్డర్ లో చెప్పాడు. ఎందుకు పెళ్ళి అంటే 

హారిక : వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ లాయల్టీ ఆర్ విన్నింగ్ అని అడిగారు. లాయల్టీ అని చెప్పింది. 

అభి : హారిక విత్ లాంగ్ ఆర్ షార్ట్ హెయిర్ అంటే షార్ట్ అయితేనే బావుంటుంది ఫేస్ బాగా కనిపిస్తుంది అన్నాడు. 

అరియానా నువ్వు అవినాశ్ లా మేలుకుంటావంటే ఫస్ట్ ఏం చేశ్తావ్ అని అడిగారు. నేనారోజు నిద్రే లేవను నాకొద్దు అంది. 

సోహెల్ నీకు ఏది ఎకువ  మటన్ / చికెన్ మటన్ అని చెప్పాడు సౌండ్ ఆర్ టేస్ట్ అని అడిగారు టేశ్ట్ ఖీమా.     

అఖిల్ : అని మోనల్ అని అన్నారు ఇద్దరిలో ఎవరిని అడిగినా ఒకటే సేం థాట్స్ సేం ఆన్సర్ అని అడిగారు. హా సేం కలర్ ఆల్సో అని చెప్పారు. 

అఖిల్ వన్ సూపర్ పవర్ టూ మేక్ వన్ హౌస్మేట్స్ డిజప్పియర్ అంటే మోనల్ అని అన్నాడు. 

మోనల్ నీ గురించి ఒక రూమర్ కావలంటే ఏం మాట్లాడతావ్ అంటే అసలు ఏడుపు రాదు వెరీ స్ట్రాంగ్ అని చెప్పారు.  అది నిజంగా నే రూమర్ అన్ చెప్తున్నారు నాగ్. 

నీ తెలుగు బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పారు నీకో తెలుగు డైలాగ్ ఇస్తె డైరెక్టర్ నాగ్ సార్ కి చెప్పమని నువ్వు ఎలా చెప్తావ్ అని అడిగారు. "నువ్వు నాకు చాల ఇష్టం." అని చెప్పింది. వావ్ ఇట్ లుక్డ్ వెరీ జెన్యూన్ సర్ అని చెప్పారు సుదీప్.  

అవినాష్ చేతిలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. ఇప్పుడు జరిగే ఎలిమినేషన్ రౌండ్ లో చేయి టోపీలో పెట్టాలి ఎవరికి రెడ్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ గ్రీన్ వస్తే సేఫ్. 
నువ్వు కాన్ఫిడెంట్ ఐతే వచ్చేవారం లేకపోతే ఈ వారం వాడచ్చు లేదా ఈ వారం అరియానాకి ఇవ్వవచ్చు అని చెప్పాడు. నువ్వు ఆలోచించుకొని చెప్పు. అని అన్నాడు

నేను ఎలిమినేటెడ్ అని అనుకుంటున్నాను. సో నేను నాకే యూజ్ చేస్కుంటాను అని అన్నాడు. అరియానా కూడా నీ కార్డ్ నువ్వే యూజ్ చేస్కోవడమే నాకు ఇష్టం అని చెప్పింది అరియానా కూడా అక్కడ నాకు భలే నచ్చేసింది అరియానా. 

హౌస్మేట్స్ అంతా కూడా నువ్వు ఇపుడు వాడడమే బెటర్ అని అన్నారు. నీ డెసిషన్ చెప్పేముందు ఒకటి గుర్తుపెట్టుకో నీకోసం కాంపెన్ చేసి నిన్ను దగ్గరకి తీస్కెళ్ళిన మనిషి అరియానా అలా హారిక కూడా తన వోట్ తో చేసింది. ఆలోచించుకో అని అన్నారు. ఒక వేళ నువ్వు పాస్ యూజ్ చేసి నువ్వు సేవ్ అయితే నీ పాస్ వేస్త్ అయినట్లు అరియానా ఎలిమినేట్ అవుతుంది అని కాస్త కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు. 

నాకోసమే ఈ వారమే వాడుకుంటున్నాను అని చెప్పాడు అవినాష్. ఇద్దరూ చేతులు లోపలికి పెట్టండి చెప్పినపుడు తీయండి అన్నారు. 

అవినాష్ హ్యాండ్ రెడ్.. గుడ్ డెసిషన్ అవినాష్ లేకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యేవాడివి. పాస్ వాడడం వలన మీ ఇద్దరూ సేఫ్ అని చెప్పారు. 

ప్రేక్షకుల ఉద్దేశ్యం ప్రకారం నేను ఎలిమినేట్ అయ్యాను కదా బిగ్ బాస్ ఏదో ఈ అవకాశం ఇచ్చాడు కానీ అన్నాదు అవి. ఐతే ఏంటి ఏం చెబ్దాం అనుకుంటున్నావ్ అని అడిగారు నాగ్. ఏం చెప్పాలో కూడా తెలీడం లేదంటే.. 

నామినేషన్ లో ఉన్న నలుగురిలో నీకు ఓట్స్ తక్కువ వచ్చాయ్ అంతె ఇంకా ఇద్దరు నామినేషన్స్ లోకి రాలేదు గుర్తు పెట్టుకో అన్నారు. అంతే కాక నీకు పాస్ ఉంది కనుక ఓట్స్ వేయలేదేమో అని అన్నారు. సెల్ఫ్ సింపతీలోకి వెళ్ళకు అని చెప్పారు. మంచి సలహా ఇచ్చారనిపించింది. 

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts