24, నవంబర్ 2020, మంగళవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయవచ్చు. నా అభిప్రాయాలు వీడియోలో మాత్రమే ఉంటాయి. 
 


నామినేషన్స్ తర్వాత జరిగిన డిస్కషన్స్ చూపించారు. అరియానా ఏడుస్తుంది అవినాష్ ఏడవకు అని చెప్తున్నాడు. టాస్క్ లు ఆడి ఉపయోగం లేదనమాట అని బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్నాడు. అంత స్పీచ్ ఇచ్చాడు కదా వద్దంటే ఏమవుతుంది ఒక్క మాట అని అనుకుంటున్నారు అభి గురించి అవినాష్ అండ్ అఖిల్. 

అభి నాకు తోడున్నాఅరు నేను ఒక్కడ్ని కాదు అని చెప్తున్నాడు హారికతో.. హారిక ఇంకా బాధపడుతూ ఉంది. 

అవినాష్ కోపంగా ప్రోసెస్ ని అంటూంటే వద్దు అని చెప్తుంది అరియానా అండ్ అఖిల్ కూడా నువ్వు బిగ్ బాస్ ప్రాసెస్ ని అనకూడదు అని సర్ది చెప్తున్నారు. 

అఖిల్ ని స్వాప్ చేయనందుకు హారిక బాధపడుతున్నట్లు ఉంది ఎవరు అనేది చెప్పలేదు కానీ అభి తను స్ట్రాంగ్ ఉంటే సేవ్ అయివస్తాడు అని క్లియర్ గా చెప్పాడు. హార్ట్ ఏం చెప్తే అది చేయాలి అని చెప్తుంది హారిక. 

సైలెంట్ గా మోనల్ దగ్గరికి వచ్చి తను అఖిల్ తో స్వాప్ చేయమన్నట్లుగా వినలేదు అన్నట్లు అప్పుడే మొదటి సారి విన్నట్లు చెప్తుంది కాకపోతే సారీ అది నేను చేయలేను. అందులో కూడా నిన్ను డిజప్పాయింట్ చేసినందుకు సారీ అని చెప్పింది. 

అఖిల్ ఉండి సోహెల్ తో నువ్వు అడిగావ్ కదా నాకు అది చాలు అని చెప్తున్నాడు. అభి ఎన్ని మాటలు మాట్లాడాడు నాకొద్దు తొక్కి ముందుకెట్ల వెళ్ళాలి అని అన్ని చెప్పి స్వాప్ ఇచ్చినపుడు ఒక్కమాట అనచ్చు కదా గమ్మున వెళ్ళిపోవడం ఏంటి అని అంటున్నాడు అఖిల్. 

నైట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర అభి అండ్ మోనల్ మాట్లాడుకుంటున్నారు. నువ్వు బాగా మాట్లాడావు కొన్ని పాయింట్స్ చాలా కరెక్ట్ గా చెప్పావు అని అంటున్నాడు అభి. మోనల్ సారీ ఫర్ ఎవ్విరితింగ్ అని చెప్పింది అభికి... ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే లోపల అఖిల్ రెస్ట్ లెస్ గా అటూ ఇటూ తిరగడం చూపిస్తున్నారు.
మా డాడీకి నువ్వు నచ్చావ్ అంటే మాములు విషయం కాదుతను మనుషుల్ని చాలా కరెక్ట్ గా అంచనా వేస్తారు అని చెప్తున్నాడు. మోనల్ స్ట్రెంజ్ అని అంటుంటే నేను మొదటి నుండీ చెప్తున్నది అదే మీ మమ్మీ చూస్తున్నారు నువ్వు చూడట్లేదు అని అంటున్నాడు.      
 
79 వ రోజు ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సూపర్ మచ్చీ పాటతో మేల్కొలిపారు. అభి కూడా డాన్స్ వేశాడు ఇంట్రెస్టింగ్ ఫన్నీ స్టెప్స్ :-)

జిమ్ చేయాలి అని అంటూంటే సోహెల్ మీరు చేస్తారు సేవ్ అయ్యార్ కదా ఏమైనా చేస్తారు అని అంటున్నాడు అవినాష్. నువ్ లాస్ట్ వీక్ సేవ్ అయ్యావ్ కదా అని అంటున్నాడు సోహెల్. ఇతనికి టెన్షన్ మాములుగా లేనట్లుంది. 

ఇంటి సభ్యులు ఫినాలేకి అతి చేరువలో ఉన్న కారణంగా నామినేట్ అయిన సభ్యులు ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనే అవకాశాన్ని పొందబోతున్నారు. ఈ పాస్ తో ఎవిక్షన్ నుండి తప్పించుకోవచ్చు. లెవెల్ వన్ లో ఇంట్లో జండాలు పెట్టబడి ఉన్నాయి వాటిని కలెక్ట్ చేయాలి. ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వారే విజేత. 
అందరూ కలెక్ట్ చేస్తున్నారు సోహెల్ అఖిల్ కి హారిక, అభి మోనల్ కి డైరెక్షన్స్ చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన వాటిని అరియానా అవినాష్ వెళ్ళి కలెక్ట్ చేస్కుంటున్నారు వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపు. అవినాష్ కూడా చాలా షార్ప్ గా వెతుకుతున్నాడు. అరియానా కూడా బాగా కలెక్ట్ చేసింది. అవినాష్ అరియానా ఒకరినొకరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు కానీ ఇద్దరు వదల లేదు.  

అఖిల్ 35 అరియానా 17 అవినాష్ 28 మోనల్ 20 ఉన్నాయి నలుగురిలో ఎక్కువ జండాలు సేకరించినందున అఖిల్ అవినాష్ లెవెల్ టు కి ఎంపికయ్యారు. 
లెవెల్ టూ లో కాంపెయిన్ చేస్కోవాలి. ఇంటి సభ్యులు మద్దతు తెలుపుతున్న సభ్యుల మెడలో వేసి సపోర్ట్ చేయాలి. ఎవరి దగ్గర ఎక్కువ దండలు ఉంటే వాళ్ళు ఎవిక్షన్ పాస్ పొందుతాడు. 
అవికి అరియానా అండ్ అఖిల్ కి సోహెల్ సపోర్ట్ చేస్తూ కాంపెయిన్ చేస్తున్నారు. 

పొలిటిషియన్ డ్రస్సులు ఇచ్చారు ఇద్దరికీ. వోట్ ఫర్ అవినాష్ అని పోస్టర్ ప్రిపేర్ చేసుకున్నాడు అవినాష్.
 
కష్టానికే గెలుపు అని బిబి అని లోగో ప్రిపేర్ చేసుకున్నాడు అఖిల్. 
హారికదే డిసైడింగ్ ఓట్ లాగ అయింది. మోనల్ సోహెల్ అఖిల్ కి అభి అరియానా అవినాష్ కి వేస్తున్నట్లున్నారు. 
హారికని పర్సనల్ గా ఇద్దరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అవినాష్ ఏడ్చేస్తున్నాడు. ప్లీజ్ హారిక ఓట్ అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. టైమ్ ఇవ్వు అంటే కూడా వినడం లేదు అవినాష్.
 
అరియానా చాలా చక్కగా మాట్లాడుతుంది అవినాష్ తో నీకు శత్రువైనా నువ్వు ఎలా తగ్గాలి ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటున్నావ్ అని చెప్తుంది. ఎలెక్షన్ కాంపెయినింగ్ టైప్ లో చేస్తున్నారు హుషారుగా అవినాష్ అండ్ ఆరియానా.. అరియానా మాములుగా కాంపెయిన్ చేయడం లేదు. 
అఖిల్ అండ్ సోహెల్ కూడా కాంపెయిన్ చేస్తున్నారు ఇండిపెండెంట్ గా ఆడుతాడు అని చెప్తున్నాడు సోహెల్. ఇన్ని రోజులు అలాగే ఆడాడు ప్లీజ్ ఓట్ ఫర్ అఖిల్ అని కాంపెయిన్ చేస్తున్నాడు. వీళ్ళకి పోటీగా అవినాష్ వాళ్ళ టీం కూడా కాంపెయిన్ చేస్తుంది స్లోగన్స్ తో గోల గోల చేసేశారు ఇంట్లో.

ఇక్కడ అరియానాకి అర్ధంకానిదేంటంటే ఒక వేళ అవినాష్ కి కనుక ఈ పాస్ వచ్చి తను సేవ్ అయితే ఈ వీక్ అరియానా ఎలిమినేట్ ఆవుతుంది. ఆ విషయం అర్ధం చేస్కోకుండా తెగ సపోర్ట్ చేసేస్తుంది అరియానా అవినాష్ ని. 
 
ఎలెక్షన్స్ లో స్పీచ్ కి పోడియం కూడా ఏర్పాటు చేశారు. దాని ముందు నిలబడి ఇద్దరూ మాట్లాడారు. అవినాష్ ఎమోషనల్ గా మాట్లాడాడు. అఖిల్ కూడా నా గుర్తింపే నాకు బిబి ప్రతి సారి సపోర్ట్ దొరకలేదు ఇప్పటి వరకు ఒక్కడ్నే ఆడుతూ వచ్చాను ఇప్పటి వరకు ఎవర్ని అడగలేదు మీ ఒక్క వోట్ నాకు చాలా ముఖ్యం అని చెప్తున్నాడు.   

అరియానా నాకు హౌస్ లో మొదట కనెక్ట్ అయింది అవినాష్ సో ఫ్రెండ్శిప్ బేసిస్ మీద తనకే వేస్తున్నా అని చెప్పింది. 
మోనల్ నా హెల్త్ గురించి నా అడ్వైజ్ గురించి నాకు గుడ్ టైమ్స్ లో బాడ్ టైమ్స్ లో సపోర్ట్ చేసింది అఖిల్ అని తనకే సపోర్ట్ చేసింది. 
సోహెల్ ఇద్దరూ ఇంపార్టెంటే ఎప్పుడైనా నాకు అఖిల్ అండ్ మెహబూబ్ ఇద్దరు నాకు తోడు ఉన్నారు. అఖిల్ బ్రదర్ లాగా ఉన్నాడు నాకు అందుకె తనకే సపోర్ట్ అన్నాడు. 
అభిజిత్ గుర్రం గుర్తుకే నా ఓటు. నువ్వు కాంపెన్ చేసిన విధానమే నాకు నచ్చింది, కాలునొప్పి ఉన్నా నాకు కెప్టెన్సీలో సపోర్ట్ చేశావ్ నీకు రిటర్న్ చేసే అవకాశం వచ్చింది అని చెప్పింది. 

హారిక నాకు కొంచెం టైం పడుతుంది అని చెప్పి. కాంపెయినింగ్ గురించి కాదు మీరు సపోర్ట్ చేస్తున్నారా చేశారా అని కూడా కాదు. నేను చేయాలనుకుంటుంది ఒకటి కానీ చేయాల్సింది ఒకటి. ఇది చేస్తేనే నాకు హండ్రెడ్ పర్సెంట్ రిగ్రెట్ ఉండకుండా ఉంటుంది. ఇమ్యునిటీ టాస్క్ లో మోనల్ కి సపోర్ట్ చేశాను అపుడు. 
అఖిల్ తో ఉన్న పర్సనల్ రీజన్స్ వల్ల నేను తనకే సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నా అవినాశ్ కన్నా నువ్వే క్లోజ్ కానీ కంప్లీట్ శాటిస్ఫాక్షన్ ఇక్కడ హార్ట్ లో లేదు అని చెప్తుంది. బాగా ఏడ్చేసింది. ఇది అందరికి ఒక డెసిషనే కానీ ఇదే కరెక్ట్ అని చెప్తుంది. రిగ్రెట్ వద్దు అని చెప్తుంది ఇమ్యునిటీ విషయంలో నేను సగంలో ఆపేశాను కానీ ఇపుడు ఇది కంప్లీట్ చేయాలి అని అనిపిస్తుంది అని అంటుంది. అవినాష్ కి సపోర్ట్ చేసింది. 

ఎవిక్షన్ ఫ్రీ పాస్ పొందిన కారణంగా అభినందిస్తున్నాం. దీనికి రెండు వారాల వాలిడిటీ ఉంటుంది. ఎపుడైనా ఒకసారి ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు.      

అవినాష్ బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాడు. అరియానా నువ్వు నిన్న బిగ్ బాస్ ని ఎన్ని మాటలన్నావ్ నేను చెప్పానా టైమ్ ఇవ్వు అని అంది. రెండువారాలు ఉంటుంది అనుకున్నా అంటే ఆహా అవునా నువ్వే తీసేస్కో కప్ ఇంక మేమంతా ఇక్కడెందుకు అని అంటుంది :-)
 
అఖిల్ బాధపడుతున్నాడు లైఫ్ లో ఎప్పుడూ అయ్యేదే అని అంటున్నాడు సోహెల్ దగ్గర. 

మోనల్ అఖిల్ తో లక్ ఫేవర్ చేసినా కూడా గేం మార్చేస్తుంది కదా అని అంటుంది. నిన్న నన్ను ఒక్క మాట అడిగి ఉండచ్చు కదా స్వాప్ చేస్కోమని అంటే నేను నామినేట్ చేద్దామనుకున్న వాళ్ళు వేరే కొన్ని పాయింట్స్ క్లియర్ చేస్కోవాలి అనుకున్నా అవి చేశావ్ కదా స్ట్రాంగ్ గా గుడ్ అని అంటున్నాడు. 

రేపటి ప్రోమోలో అరియానా కి అద్దంలో దెయ్యం కనిపించింది చాలా భయపడినట్లుంది ఏడ్చేసింది. అందరూ తనని కన్సోల్ చేస్తున్నారు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts