ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ దానిలో చూడవచ్చు.
ఈ రోజు హౌస్ లోకి లాస్య ఫ్యామిలి వచ్చింది మంజునాథ్ గారు బగా మాట్లాడారు. జున్ను గాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో మాటల్లో చెప్పలేం నిజంగా లాస్య చాలా మిస్సవుతుంది అని నాకే అనిపిస్తుంది తనకెలా ఉందో. ఇక కెప్టెన్సీ టాస్క్ లో మోనల్ చాలా బాగా ఆడి హారికని గెలిపించింది, కంటిన్యువస్ గా తను మోటివేట్ చేయడం కూడా బావుంది. ఇన్ని రోజులకి ఒకేసారి తన ఫిజికల్ స్ట్రెంత్ ని గేం ని రెండిటిని చూపించి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. అలాగే లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో హౌస్మేట్స్ చాలా ఐటంస్ గెలుచుకున్నారు.
వివరాలలోకి వెళ్తే 74 వ రోజు రాత్రి తొమ్మిది గంటలకు లాస్య ఫ్యామిలీ ఎంటర్డ్ ఇన్ హౌస్ జున్ను గాడు సో క్యూట్.. లాస్య ఫ్రీజ్ లో ఉంది కానీ అక్కడ నుండే బిస్కట్స్ వాటర్ అన్నీ చెప్తుంది. త్వరగానే రిలీజ్ చేశారు. జున్ను గాడి కోసం అభి రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్లీజ్ బిగ్ బాస్ మమ్మల్ని కూడా రిలీజ్ చేయండి అని ఇంట్రెస్టింగ్.
గివప్ ఇవ్వకు చాలా బాగా ఆడుతున్నావ్ వంటగది వదిలేసి టాస్క్ లు ఆడు అని చెప్తున్నాడు. లాస్య మంజునాథ్ మాత్లాడుకుంటుంటే జున్ను గాడు వాడ్ని పట్టించుకోట్లేదని వచ్చి ఆఅ అని పిలుస్తున్నాడు.
అవినాష్ జోకర్ నోస్ వేస్కొని వచ్చి నవ్విస్తున్నాడు అండ్ అదే లాస్య కూడా పెట్తుకుని నవ్వించింది. జున్ను గాడు హాయిగా హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉన్నాడు హారిక తో అఖిల్ తో. అందరిని చూసి వాడికేం అర్థం కావడం లేదు.. అందరికి హాపీగా బాయ్ చెప్పాడు. లాస్య చాలా ఏడ్చేసింది.
నైట్ అవినాష్ అందర్ని ఇమిటేట్ చేస్తున్నారు ఎవరెవరు సేవ్ అయితే ఎలా రియాక్ట్ అవుతారని చూపిస్తూ ఉన్నారు. ఫన్నీ.
కమెండో ఇన్స్టిట్యూట్ టాస్క్ పూర్తయింది. హారిక ఏడుస్తూ భోం చేస్తుంది ఎందుకో మరి. అభిజిత్ ఒక్కడే ఎందుకో సీరియస్ గా ఉన్నాడు. కాస్త డల్ గా ఉన్నట్లు అనిపించింది.
75 వ రోజు ఇంట్లో 8మంది సభ్యులు ఉన్నారు.
ఉదయం రంగస్థలం సినిమాలో ఆగట్టునుంటావా పాటతో మేల్కొలిపారు. ఈ పాట ఈ రోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ కి భలే రెలెవెంట్ గా అనిపించింది.
హారిక అవినాష్ అండ్ సోహెల్ తో ప్రాంక్స్ చేసి అరచేత్తో మొహం మీద కొట్టింది. హిలేరియస్..
స్కూల్ కి పోకుండా హోం వర్క్ చేయకుండా ఏంటి మీరు అని అవినాష్ అరియానా ని హారికని ఏడిపిస్తున్నాడు. ఇద్దరూ చక్కగా రెడీ అయి కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఒక క్వీన్ ఎలిజెబెత్ అండ్ క్వీన్ విక్టోరియాలా ఉన్నాం కదా అని అడ్గుతున్నారు ఇద్దరు.
హయర్ రిఫ్రిజిరేటర్ ప్రోమో అండ్ లక్జరీ బడ్జెట్ టాస్క్. ఐటమ్స్ ఫ్రిజ్ లో ఉన్నాయ్ క్విజ్ ప్రోగ్రాం నలుగురు జవాబులు చెప్పాలి రైట్ చెప్పిన ప్రతి సారి ఒక డోర్ తెరిచి ఒక ఐటం తీస్కోవచ్చు. మాస్టర్ అవినాష్ పార్టిసిపెంట్స్ సోహెల్, లాస్య, అభిజిత్, మోనల్.
సోహెల్ కి
లివింగ్ ఏరియాలో బెలూన్స్ ఎన్ని తొమ్మిది రాంగ్
డైనింఘ్ టేబుల్ పైకప్పు పై ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయ్ అని అడిగారు. నలభై ఎనిమిది ఉన్నాయంట
స్మోకింగ్ జొన్ లో సోఫా కలర్స్ ఇది కరెక్త్ చెప్పాడు
కన్ఫేశన్ రూం లో ఎన్ని ఛెస్ కాయిన్స్ ఉన్నాయ్ ట్వంటీ కరెక్ట్
గార్డెన్ ఏరియా సోఫా రంగు ఏంటి ఎల్లో రైటాన్సర్..
లాస్య ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతుంది కిచెన్ అది కూడా తప్పు చెప్పాడు.
ఇంటి మొదటి కాప్టెన్ ఎవరు లాస్య అన్నీ కరెక్ట్ చెప్పారు..
లాస్య కి
లివింగ్ ఏరియాలో ఎన్ని రైనో హెడ్స్ మూడు
బెడ్రూం ఏరియా గోడలపై నెమళ్ళు త్రీ
లివింగ్ ఏరియాపై ఎన్ని గిటర్స్ రెండు
డైనింఘ్ టేబుల్ దగ్గర ఎన్ని కుర్చీలు ఉన్నాయ్ రాంగ్
అభిజిత్ ఫేవరెట్ సోఫా రైట్
అభి
లివింగ్ ఏరియా గోడపై ఎని
హైర్ కి సంబందింది ఎన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాయ్ నాలుగు
ఏ ఐటం సోహెల్ ని సంతోషపరుస్తుంది. మటన్
మోనల్ కోసం
బెడ్రూం ఏరియా సీలింగ్ పై ఎన్ని లైన్స్ లైట్స్ ఉన్నాయ్
మొత్తం మీద చాలానే లగ్జరీ బడ్జెట్ ఐటంస్ వచ్చాయ్.
సాయంత్రం ఛాలెంజెస్ పూర్తి చేసి స్టర్ పొందిన కెప్టెన్సీ పోటీ దార్లు ముగ్గురు మిగతా ఇంటి సభ్యులని ఒప్పించి వారి భుజాల మీద నించోవాలి చివరి వరకు ఎవరైతే ఉంటారో వారు కెప్టెన్. ఆ పోటీ వినగానే అభి నవ్వుకుంటున్నాడు.
యెల్లో భాక్స్ లో నిలబడి ఎత్తుకోవాలి అండులో నుండి కదిలినా సభ్యుడు కిందకి దిగినా తప్పుకోవాలి. భుజాలమీద నుండి కిందకి దిగకుండా మార్చుకోవచ్చు కావాలంటే.
అవినాష్ అభిని, సోహెల్ అఖిల్ ని మోనల్ హారికని మోస్తా అని ఒప్పుకున్నారు.
నాలుగు నలభై ఐదుకి స్టార్ట్ అయింది.
బాక్స్ లు కొంచెం చిన్నగానే ఉన్నాయ్ సులువుగా బయటికి వెళ్ళేట్లు.
లాస్య హే సోహెల్ అని పిలుస్తుంటే హే వద్దు అని అంటు విసుకున్నాడు..
అవినాష్ కాళ్ళు స్లిప్ అయ్యాయి నీస్ బెండ్ అయ్యాయి కాళ్ళు అటూ ఇటూ కదిలాయ్ దిగుతా బ్రో అని రెడీ అయ్యాడ్ అభి కూడా. అంతలో కాలు కద్లింది.
నేను హేమాలి అనుకో నేను ట్రబుల్ లో ఉన్నాను నువ్వు సపోర్ట్ చేయ్ ఈ సారి మనం అబ్బాయిలకి ఇవ్వద్దు అని మోటివేట్ చేస్తుంది హారిక.
సోహెల్ చాలా కష్టపడుతున్నాడు. చెయ్యలేకపోతే వదిలేయ్ అని చెప్తున్నాడు అఖిల్ కానీ సోహెల్ ఈజ్ నాట్ గివింగప్. ఒక టైమ్ లో ఐయామ్ డన్ అని చెప్పాడు పొజిషన్ మార్చుకున్నాడు కానీ చేయలేక పోయాడు దించేశాడు. మోనల్ మాత్రం అందరు దిగాక కూడా దిగకుండా అంతే మోసింగ్ గర్ల్స్ అందరూ గ్రూప్ హగ్ ఇచ్చుకున్నారు. అంతా సోహాపీ.. అరియానా హారికని ఎత్తుకుని అంతా తిప్పేసింది.
హారిక చాలా ఎమోషనల్ అయింది మోనల్ ని గట్టిగా హగ్ చేసుకుని ముద్దులు పెట్టేసి ఐలవ్యూ చెప్పేసి చాలా హాపీ ఫీలైంది.
సోహెల్ నేను నా కేప్టెన్సీ లాగే ఆడాను కానీ వీపంతా పట్టేసింది అని చెప్తున్నాడు అఖిల్ కి అలాగే మోనల్ ఫిక్స్ అయిపోయింది ఇంకో పదినిముషాలైనా ఉంటుంది అని అనిపించింది అన్నాడు. వెరీ వెరీ సారీ అని చెప్తున్నాడు సోహెల్.
మోనల్ వచ్చి పక్కన కూర్చుంటే నన్ను ఒక ఐదునిముషాలు వదిలేస్తావా అని అన్నాడు.
అభి మోనల్ మాట్లాడుకుంటున్నారు. మోనల్ చెప్తుంది నేను అడిగాను తనకి సపోర్ట్ కోసం కానీ తనకి సోహెల్ మీద ఎక్కువ నమ్మకం ఉంది మరి నేనేం చేయను అని అంది. లాస్ట్ టైం టాస్క్ లో నేను కొంచెం బాధపడ్డాను నన్ను ఎవరూ నమ్మలేదని ఈ సారి హారిక నన్ను నమ్మిందని సంతోషించాను అందుకే కష్టమైనా ఉన్నాను అని చెప్పింది. గేం కదా అందరు గేం ఆడుతున్నారు అని చెప్తుంది.
నిజానికి అఖిల్ లాస్ట్ వీక్ కూడా మోనల్ ని చాలా చులకనగా మాట్లాడాడు నీతో పెట్టుకుంటే నేను మొదటే ఔట్ అయ్యేవాడ్ని నువ్వు ఫిజికల్ టాస్క్ లు ఆడలేవు అని ఈ రోజు ఆడి చెక్కు చెదరకుండా నిలబడి స్టామినాని తన సంకల్పబలాన్ని ప్రూవ్ చేసుకుందనిపించింది టూగుడ్.
ఇంట్ళోకి వచ్చాక నేర్చుకున్న విషయాలేంటి ఇక్కడకొచ్చాక మీలో వచ్చిన మార్పులేంటి చెప్పమన్నారు.
సోహెల్ ఫుడ్ వాల్యూ తెలుస్కున్నా అన్నాడు కోపం ఎక్కువుండేది అన్నాడు. మనుషులతో ఇంటరాక్షన్ తక్కువుండేది ఇక్కడ అందరితో కలుస్తున్నా అన్నాడు. మనుషులతో రియల్ ఎమోషన్ అటాచ్ ఐంది అని చెప్పాడు.
అరియానా టైమ్ వాల్యూ నేర్చుకున్నా అంది.
చిన్న చిన్న విషయాలకి సంతోషించడం థ్యాంక్ ఫుల్ గా ఉండడం నేర్చుకున్నా అంది. ఇగో తగ్గించుకుని కోపం తగ్గించుకున్నా అని చెప్పింది.
నన్ను కెప్టెన్ గా చూడలేకపోతున్నారు అని అంటుంది హారిక.. అభి మోనల్ ఎంత పనిచేస్తివి అని అంటున్నాడు. ఖుదా మెహార్బాన్ హైతో గథాబీ పహల్వాన్ అని సామెత వేశాడు అంటే ఇక్కడ గథా ఎవరు అని అడిగింది హారిక. నువ్వే అర్థం చేస్కో అంటున్నాడు. అది జోక్ అని అంటున్నాడు అభి. సరే ఇది గుర్తుపెట్టుకుంటాలే ఈ సారి నే జోక్ వేస్తే నువ్వు సీరియస్ అవుతావ్ కదా అపుడు చెప్తా అంటుంది.
హారికని మైక్ ధరించమని అనౌన్స్మెంట్ వచ్చింది. నాకు మీరెవరు గుర్తు చేయలేదు కాబట్తి ఒక స్టెప్ వేద్దాం అని అభిని కుడ పిలిచి రూల్స్ బ్రేక్ చేస్తే మేం గుర్తు చేస్తఆం అని స్టెప్ వేయించింది అందరితో. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.