ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ అందులో చూడవచ్చు.
ఈ రోజు మండే నామినేషన్స్ డే. బిగ్ బాస్ తన రొటీన్ ని బ్రేక్ చేస్తూ లక్ మీద ఆధారపడి నామినేషన్స్ ఇచ్చారు. సెలెక్ట్ చేసుకున్న టోపీని బట్టి నామినేటెడ్. తర్వాత శ్వాప్ చేస్కునే అవకాశమ్ ఇచ్చిఅ వాళ్ళ కన్విన్సింగ్ పవర్ ని కూడా టెస్ట్ చేశారు కానీ ఎవరు కన్విన్స్ చేయలేకపోవడంతో కెప్టెన్ గా హారికకి పవర్ ఇచ్చి ఒకరిని స్వాప్ చేయమన్నారు. దాంతో ఫైనల్ గా అఖిల్,మోనల్,అవినాష్ అండ్ అరియానా నామినేషన్స్ లోకి వచ్చారు.
ఈ రోజు ఎపిసోడ్ అంతా మోనల్ మోనల్ మోనలే కనిపించింది. చాలా స్ట్రాంగ్ గా తనని తాని డిఫేండ్ చేసుకుంటూ ఇండివిడ్యువల్ గా బాగా ఆడింది అనిపించింది. మాములుగా ఐతె అవినాష్ అండ్ అరియానా తో ఐతే ఆర్గ్యూ చేయడం ఊహించగలం కానీ అఖిల్ తో కూడా గట్టిగా మాట్లాడడం మాత్రం చాలా బావుంది. బాగా హైలైట్ అనిపించింది. కానీ అంత చేసినా కూడా ఫైనల్ గా తను కెప్టెన్ చేసిన హారిక హాండ్ ఇవ్వడంతో నామినేషన్స్ లోకి వెళ్ళక తప్పలేదు.
అఖిల్, అరియానా, అవినాష్ ముగ్గురు కూడా సోహెల్ నేమో చాలా కన్విన్సింగ్ గా మెల్లగా మాట్లాడుతూ అడిగి మోనల్ ని మాత్రం ఆర్డర్ చేసినట్లు నువ్వు అస్సలు డిజర్వింగ్ కాదు అని అన్నట్లుగా మాట్లాడడం అస్సలు నచ్చలేదు నాకు బహుశా మోనల్ కూడా అక్కడే ఎఫెక్ట్ అయి బాగా స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేసిందేమో అనిపించింది.
అట్ ద సేం టైం అభి కూడా ఈ రోజు ఎపిసోడ్ లో చాలా నచ్చేశాడు. తను స్వాపింగ్ కి ఎవరిని ఎందుకు అడగలేకపోతున్నాడో చెప్పిన విధానం మోనల్ తో మాట్లాడిన విధానం భలే నచ్చేసింది అండ్ ఈ ప్రోసెస్ ని అర్ధం చేస్కుని స్పోర్టివ్ గా ఎలా తీస్కున్నాడో అవినాష్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో చూస్తే హీ ఈజ్ మిస్టర్ కూల్ ఫర్ ఎ రీజన్ అని అనిపించింది.
వివరాలలోకి వెళ్తే ఈ రోజు 78 వ రోజు ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
ఉదయం ఊసరవెల్లి సినిమాలో రావే చేద్దాం దాండియా పాటతో మేల్కొలిపారు. బాగానే డాన్స్ వేశారు హౌస్మేట్స్.
అభి దోశ వేయమంటే పరాఠా వేశాడు రౌండ్ రాలేదు అని సోహెల్ ఆటపట్టిస్తున్నాడు. ఇజ్జత్ కా సవాల్ అని మళ్ళీ గట్టిగా దోశని రౌండ్ గా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ముద్ద ముద్దగా ఉంది సరిగా రాలేదు అని చెప్తున్నాడు సోహెల్.
మోనల్ అండ్ అఖిల్ మాట్లాడుకుంటున్నారు నువ్వు మీ సిస్టర్ ని మనిద్దరి మధ్య ఏమైనా బయట చూపిస్తున్నారా అని అడిగావు నీకు అంత కన్సర్న్ ఉన్నపుడు నేను కూడా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పాడు అఖిల్ నేను మా అమ్మని ఏం అడగలేదు అని అన్నాడు. మనిద్దరం మాట్లాదుకున్నాం అపుడు మీ అమ్మ గారు నాతో సరిగా మాట్లాడలేదు అన్నావ్ కదా అందుకని నాకు డౌట్ వచ్చి మా సిస్టర్ ని అడిగాను అని క్లారిటీ ఇచ్చింది. ఆల్రెడీ నాకు బయట ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి నాకు ఆ అటాచ్మెంట్ వద్దు అని చెప్పాడు. ఫర్దర్ గా నువ్వు గేం లో ఏమైనా చేస్తే నేను ఎఫెక్ట్ అవుతున్నా అందుకే నాకు వద్దు అంటున్నాడు. ఓవర్ గా కనెక్ట్ అయి ఉండను అది నాకే కొడుతుంది అని చెప్తున్నాడు.
అవినాష్ నువ్వు షర్ట్ లు వేయకు అంకుల్ లాగా ఉంటావ్ అని అంటుంది అరియానా. నువ్వు నడుచుకుని వస్తుంటే ముందు నీ బొజ్జ నడుస్తుంది ఇలా అని చేసి చూపించింది. హిలారియస్ అఖిల్ పిచ్చి పిచ్చిగా నవ్వాడు. సోహెల్ సపోర్ట్ కి వచ్చాడు ముగ్గురు కలిసి ఆడుకున్నారు అవినాష్ ని సోహెల్ సపోర్ట్ చేస్తున్నట్లే చేస్తూ ఆడుకుంటున్నాడు.
సాయంత్రం ఆరుముప్పావ్ కి నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టేశాడు.
గార్డెన్ ఏరియాలో టోపీలు ఉన్నాయ్ టాస్క్ బజర్ మోగగానే ఇంటి సభ్యులంతా తలొక టోపీ తీస్కుని ధరించి తదుపరి ఆదేశం వరకు ఫ్రీజ్ అవ్వాలి.
సోహెల్ మోనల్ గ్రీన్ సేవ్.
అభి, అవి, అరియానా, అఖిల్ రెడ్ నామినేటెడ్.
మోనల్ ఏడ్చేస్తూ మమ్మా థ్యాంక్యూ అని చెప్తుంది.
నాలుగు శవపేటికల్లో నిలబడమన్నారు.
అవినాష్ తో సెకండ్ లెవల్ మొదలు పెట్టారు. బయట ఉన్న వారిని కన్విన్స్ చేయండి స్వాప్ చేస్కోడానికి అని అడిగారు.
అవినాష్ మొదట సోహెల్ ని అడిగాడు హెల్ప్ చేయి నువ్వు స్ట్రాంగ్ సో సేవ్ అవుతావు నాకు హెల్ప్ చేయి అన్నాడు కానీ అతను ఒప్పుకోలేదు.
మోనల్ ని నీకన్నా నేను బెటర్ నేను టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ అర్హుడిని అని అన్నాడు. నువ్వు డిజర్వ్ కాదు అని అన్నాడు. మోనల్ చాలా గట్టిగా వాదించింది. నువ్వు బెటర్ పెర్ఫార్మ్ చేస్తున్నా అంటున్నావ్ మరి నీకు భయమెందుకు నామినేట్ అవ్వు ఓట్లేసి గెలిపిస్తారు నిన్ను అని చెప్పింది. ఈ ఆర్గ్యుమెంట్ తో అవినాష్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఓకే నేను ఉంటాను అని సైలెంట్ అయిపోయాడు.
అఖిల్ మోనల్ ని కన్విన్స్ చేస్తున్నాడు. సోహెల్ ని అడగలేదు. ఒక పాయింట్ లో మోనల్ ఒప్పుకోదని ఫైనల్ అయ్యాక సోహెల్ సైగ చేశాడు నన్ను రమ్మంటావా అని కానీ అఖిల్ వద్దన్నాడు. మోనల్ తో నేను స్ట్రాంగ్ అని నువ్వే ఒప్పుకున్నావ్ చాలా సార్లు నైట్ నన్ను నామినేట్ చేసింది కూడా మొదట నువ్వే నన్ను స్ట్రాంగ్ అని అందుకే నేను డిజర్వింగ్ అన్నాడు. అవును నేను ఒప్పుకుంటాను నేను వీక్ అందుకే నేను సేఫ్ జోన్ లో ఉండాలి. ఫ్యామిలీస్ కూడా మిమ్మల్ని టాప్ ఫై లో పెట్టింది నేనే లేను అని అంది. అది ప్రేక్షకులు కాదు ఫ్యామిలీస్ అని అంటున్నాడు అఖిల్ అదే ఏదైనా నేను అందులో లేను ఇపుడు సేఫ్ జోన్ లోకి వచ్చా కనుక మారను అని అంది. ఒక ఫ్యామిలీ లాస్యని తర్డ్ లో పెట్టారు కాని తను ఎలిమినేట్ అయింది అన్నాడు. మీరు పక్కన ఉంటే నేను గేం లో కనపడడం లేదు అని అంది. అఖిల్ ఓకే బిగ్ బాస్ నేను స్వాప్ చేస్కోను అన్నాడు. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ అని చెప్పాడు. ఇమ్యునిటీ కోసం నా బట్టలు వస్తువులు అన్ని శాక్రిఫైస్ చేశా అని చెప్పాడు. నువ్వు ఆల్రెడీ హారిక కి సపోర్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యావ్ అని అన్నాడు. నేను చెప్పేది విను నా పాయింట్స్ నువ్వే ఏదో అనుకున్నావ్ నాకు సపోర్ట్ రాలేదు నువ్వు ఎప్పుడు అని అంటున్నాడు.
గట్టిగా మాట్లాడుతుంది చాలా కన్నీళ్ళు వస్తున్నా కానీ ఆపుకుని గట్టిగా మాట్లాడుతుంది. నువ్వు మాట ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వు పదే పదే మారిపోతుంది నీ మాట అని చెప్పాడు.
అరియానా సోహెల్ ని కన్విన్స్ చేయడనికి ప్రయత్నిస్తుంది. నాకు ఇపుడు నీ హెల్ప్ చాలా అవసరం. నేను ఎప్పుడు అడిగినా కానీ నువ్వు వేరే ఎవరో ఒకరికి సపోర్ట్ చెయ్యాలి అని చెప్పావు నీ రీజన్స్ నీకు ఉన్నాయ్ అపుడు. ఇపుడు మాత్రం నాకు ఖచ్చితంగా నీ హెల్ప్ కావాలి అని అడిగింది.
మోనల్ మీకన్నా బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ నేనిచ్చాను అని చెప్పింది మోనల్ కూడా గట్టిగా వాదించింది. మీరు స్ట్రాంగ్ అని చెప్తున్నారు కదా మరి ఎందుకు భయం వెళ్ళి రండి నామినేషన్ కి అని చెప్పింది. లక్ వచ్చింది నాకు నేను మాత్రం శ్వాప్ అవను ఇది నా స్వంత నిర్ణయం అని చెప్పింది. ఇండివిడ్యువల్ గేం ఆడు అని నాకు పదే పదే అందరు సజెషన్ ఇస్తున్నారు కదా ఇపుడు నాకు అవకాశం వచ్చింది నేను ఆడుతున్నాను అంతె అని మొండిగా చెప్పింది.
వీళ్ళ వాదన జరుగుతున్నపుడు సోహెల్ అరియానా అడిగిన దానికి ఒప్పుకోలేదు కానీ అఖిల్ ని గట్టిగా కన్విన్స్ చేయడనికి ట్రై చేశాడు రా నేనుంటాను అని కానీ అఖిల్ కూడా స్ట్రాంగ్ గా లేదురా నేను ఉంటాను వద్దు అని చెప్పాడు. సోహెల్ ఇలాంటి పనులు చేసి ఇంకా మార్కులు కొట్టేస్తున్నాడు. మై హార్ట్ మెల్టెడ్ ఫర్ దెయిర్ ఫ్రెండ్షిప్.
అభి మాట్లాడుతున్నాడు ఎవరి గేం వాళ్ళది నీ గేం ఎదుటి వాళ్ళు జడ్జ్ చేయలేరు. మొదటి నుండీ అదే చెప్తున్నా నేను. మీ అమ్మ గారు నన్ను ఫేవరెట్ అన్నారు కదా అది నాకు ఎంత కనెక్ట్ అయిందో చెప్పలేను ఇపుడు నిన్ను అడగలేను కూడా స్వాప్ చేయమని అన్నాడు. ఆ మదర్ సెంటిమెంట్ ఎలా అంటే ఐ ఫీల్ టచ్డ్. ఈ పాయింట్ లో అభి చాలా నచ్చేశాడు నాకు. నేను ఎవరితోనూ స్వాప్ చేస్కోవాలని అనుకోడం లేదు బిగ్ బాస్ అని చెప్పాడు.
అవినాష్ బాగా ఇరిటేట్ అయ్యాడు వచ్చి టోపీలు పెట్టుకుంటే నామినేట్ చేస్తారా బాగా ఆడేవాళ్ళని అని అంటే మరి ఏం చేస్తాం మన కిస్మత్ అట్లుంది అని అంటున్నాడు అభిజిత్.
బిగ్ బాస్ ఇది వ్యక్తిగత ఆటని మీ అందరికి ముందే తెలియజేయడం జరిగింది అలాగే ఈ ఆటలో చివరికి ఒకరే విజేతగా నిలిచి ట్రోఫీ తీస్కెళ్తారు. నామినేషన్ లో ఎవరు ఉంటారనేది ప్రేక్షకుల చేతిలో కానీ బిగ్ బాస్ చేతిలో కానీ లేదు. మీకు ఒక అవకాశాన్ని ఇచ్చారు కానీ సద్వినియోగ పరుచుకోలేక పోయారు కనుక కెప్టెన్ హారిక మీరు కెప్టెన్ పవర్ ని ఉపయోగించి ఒక స్వాప్ చేయండి అని అడిగారు.
హారిక అండ్ అభి ఇద్దరూ కూడా ఓ మై గాడ్ అని ఆశ్చర్యపోయారు.
టు బి ట్రూత్ ఫుల్ టు ద గేం అని పాయింట్ కి వస్తే సోహెల్ గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది నీకు అర్హత లేదు అని అనడానికి ఏ పాయింట్ దొరకడం లేదు.
నేను మోనల్ ని స్వాప్ చేస్తున్నాను నువ్వు చివరి రెండు వారాల నుండి పెర్ఫార్మ్ చేస్తున్నా అన్నావు కానీ మొదతి వారం నుండీ పెర్ఫార్మ్ చేస్తున్నావు ఈ చివరి రెండు వారాల నుండీ నోటీసబుల్ ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ అని చెప్పింది మొదటిలో కాదేమో అనిపించింది. నువ్వు కెప్టెన్సీకి హెల్ప్ చేశావ్ నాకు ఈ నిర్ణయం చాలా కష్టంగా ఉంది కానీ సోహెల్ విషయంలో ఏం పాయింట్ దొరకడం లేదు అని చెప్పింది.
స్వాప్ మి విత్ ద రైట్ పర్సన్ అఖిల్ అని అడిగింది మోనల్. కానీ హారిక అభిజిత్ అని చెప్పింది. నేను రీజన్ చెప్పనా అని అడిగితే నో అంది.
మోనల్ చాలా ఏడ్చేసింది సోహెల్ దగ్గర నేను తనతో గివప్ ఇచ్చినా ప్రాబ్లమే తనతో ఫైట్ చేసినా ప్రాబ్లమే ఏం చేయాలి అని అడిగుతూ చాలా ఏడ్చేసింది.
హారిక అభితో నువ్వు ఎవరి సపోర్ట్ తీస్కోలేదు ఇప్పటి వరకు అండ్ ఒక పాయింట్ లో నాకెవరు లేరేమో అని అన్నావ్ అండ్ ఐవాంట్ టు క్లారిఫై దట్ నేనున్నాను అని యూ డిజర్వ్ ఇన్ని వారాలు నామినేషన్ కి వెళ్ళి రావడం అంటే మాటలు కాదు అని చెప్పింది.
మోనల్ తో అభిజిత్ ని స్వాప్ చేసింది.
అభి సారీ చెప్పాడు ఇలా అవుతుందని నేనసలు అనుకోలేదు అని అన్నాడు.
మొదటి సారి నాకోసం నేను ఫైట్ చేశాను మొదటి సారి నాకోసం నా వాయిస్ రైజ్ చేశాను అని చెప్తుంది మోనల్. ఐ డోంట్ నో వాట్ టు సే అని హారిక అంటుంటే డోంట్ సే ఎనీథింగ్ అని అంది. ఐ యామ్ హియర్ టు స్టే అని స్ట్రాంగ్ గా అంది మోనల్. హారిక కూడా ఏడ్చేసింది.
నేను అఖిల్ తో స్వాప్ అవ్వాలి అని ఉంది అని అందంట మోనల్ సోహెల్ తో. లేదు ఆమె వచ్చి ఉన్నా నేను తీస్కునే వాడ్ని కాదు నా మనసులోది మొత్తం క్లియర్ చేయాలని చెప్పా అంతే అన్నాడు అఖిల్.
అవినాష్, అఖిల్, అరియానా, మోనల్ నామినేటెడ్.
రేపటి ప్రోమోలో నామినేట్ అయిన సభ్యులకి ఒక అధ్బుతమైన అవకాశాన్ని కల్పించబోతున్నారు బిగ్ బాస్ అని చెప్పారు. బజర్ మోగాక ఇంట్లో అక్కడక్కడ పెట్టిన ఫ్లాగ్స్ ఏవో కలెక్ట్ చేస్తున్నారు నామినేటెడ్ మెంబర్స్ అంతా పరుగులు పెడుతూ. మరి కలెక్ట్ చేసిన దాన్నిబట్టి ఎవరికైనా ఇమ్యునిటీ వస్తుందేమో చూడాలి. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.