9, నవంబర్ 2020, సోమవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటలలో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజు నామినేషన్ డే.. 
అరియానా ఏడు, మెహబూబ్ మూడు, అభిజీత్, హారిక, మోనల్, సోహెల్ తలా రెండు వోట్స్ తో నామినేట్ అయ్యారు. 

వివరాలలోకి వెళ్తే అమ్మ గారు వెళ్ళినందుకు సోహెల్ బాగా ఏడుస్తున్నాడు. ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు అసలు అని చాలా ఫీలవుతున్నాడు.
అరియానా ఎందుకు నన్నింత ఒంటరిని చేస్తున్నారు బిగ్ బాస్ నన్ను పంపేయండి. వీళ్ళెవరూ నాకు నచ్చట్లేదు అయామ్ లిటరల్లీ డన్ అని నన్ను పంపించేయండి బిగ్ బాస్ అని అడుగుతూ ఏడుస్తుంది. 

అరవై నాలుగో రోజు ఇంట్లో తొమ్మిదిమంది ఉన్నారు. ఉదయం పేట సినిమాలోని మరణం మాస్ మరణం పాట తో మేల్కొలిపారు.  

మోనల్ పక్షుల గురించి మాట్లాడుతూ ఉంది హిందీ పాట పాడుకుంటుంది. తెలుగులో మాట్లాడండి అని అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఫ్రూట్స్ తీస్కుని జైలులో పెట్టాడు మెహబూబ్. మాస్టర్ ఒక రోజు పనిష్మెంట్ అని చెప్పాడు అని ఒక రోజు అంతా ఉండాలి అని చెప్పారు మాస్టర్ అదే అనుకున్నారట. అభి అండ్ అఖిల్ వచ్చి నువ్వు ఎంత ఖుషీగా ఉన్నావ్ జైల్లో అని అడుగుతున్నారు. 

సాయంత్రం నామినేషన్ ప్రక్రియ. షుగర్ బాటిల్స్ పెట్టారు. ఇద్దరి తలమీద పగల గొట్తి కారణాలు చెప్పాల్లి. అవినాష్ ఇమ్యూన్. మెహబూబ్ మొదలు పెట్టాడు. 

అరియానా : మెహూ నువ్ కెప్టెన్ గా ఉన్నపుడు అందరికి ఈక్వల్ రావాలని. కొందరికి కంఫర్ట్ కావాలని చూశావ్ అది నచ్చలేదు. 
హారిక సేవ్ అవ్వచ్చు అన్నపుడు నామీద కన్సర్న్ చూపించావ్ కానీ కళ్ళు తిరుగుతున్నాయ్ అన్న తర్వాత కూడా ఐస్ వాటర్ కొట్టావ్ అందుకే. 
సోహెల్ టాస్క్ నువ్వే కాదు మేం కూడా చేస్తున్నాం చేసేప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి అవి హెల్త్ పరంగా కూడా చూస్కోవాలి అంతే అని చెప్పాడు. 
అభి టాస్క్ నాది టాస్క్ నాది అని చెప్పుకోడం ఎంతవరకూ కరెక్టో ఆలోచించుకోవాలి. అవి ఇంత ఆడమంటే అంత ఆడుతున్నావ్ మొహంమీద కొట్టమంటే వెనక కొడతావ్. అది చూస్కోవాలి. 
అఖిల్ పల్లెటాస్క్ లో గడసరి తనం నాకు కనిప్ంచలేదు. కారెక్టర్ నుండి ఔటయిపోయావ్ అవినాష్ తో కూర్చుని డిస్కస్ చేస్తున్నావ్ సో నీ గేం నచ్చలేదు నాకు అన్నాడు. 
లాస్య కెప్టెన్సీ టాస్క్ లో నా ఆపిల్ కట్ చేయద్దు అని నన్ను అడిగి నువ్వెళ్ళి డైరెక్ట్ గా నా యాపిల్ కట్ చేయడం నచ్చలేదు. ప్రతి చిన్న పాయింట్ ని చూసి రైజ్ చేయడం వల్ల అది అనవసరంగా హైలైట్ అవుతుంది అని చెప్పింది.  
మోనల్ నాకు రేషన్ మానెజర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ నా టాలెంట్ గుర్తించినందుకు థాంక్స్. ఇది ఫేవర్ కాదు నన్ను నామినేట్ చేయాలి అంటే ఎగ్ వాడచ్చు కానీ అది పెద్ద విషయం. నువ్వు వేసినపుడు నేను అరిస్తే మరీ ఎక్కువ చేస్తుంది అంటున్నావ్ నా నొప్పి నీకెల తెలుస్తుంది అని అడిగింది. 
   

హారిక : మెహబూబ్ ఒక టాస్క్ లో కనెక్షన్ బిల్డ్ చేస్కోడానికి బిబినే అవకాశం ఇచ్చారు. వర్క్ దగ్గర మళ్ళా క్లాషెస్ వచ్చాయ్ బాండ్ రావడం లేదు మనకి అది క్లియర్ అవ్వాలి. 
అవినాష్ పల్లెకుపోదాం టాస్క్ లో నాకు కోపం తెప్పించడానికి నువ్వు మాట్లాడిన మాటలు బాలేవు. నువ్వు పాకేజ్ అన్నది కూడా నాకు నచ్చలేదు మాకెలాంటి ఉద్దేశాలు లేవు. 

మెహబూబ్ : హారిక నామినేషన్ లో ఒకర్ని సేవ్ చేయచ్చనపుడు నువ్వు స్టాండ్ తీస్కున్నావ్ టాస్క్ అయ్యేంత వరకూ నీ సపోర్ట్ ఊహించాను. కానీ సెకండ్ అనౌన్స్మెంట్ తర్వాత మార్చేశావ్ ఆ హోప్ ఇవ్వకుండే బావుండేది. 
లాస్య నువ్వు గట్టిగా ఆడుతున్నావ్ కానీ టస్క్ లో కొన్ని మాటలు అంటావ్ అవి వెనక్కి తీస్కోలేం. సో అవి కొంచెం జాగ్రత్తగా చూస్కోని ఆడాలి. 
మోనల్ మీరు సపోర్ట్ చేయక పోయిన పర్లేదు కానీ నేను కనీసం మిమ్మల్ని కన్విన్స్ చేద్దామని మాట్లాడుతుంటే నా మాట వినకుండా వెళ్ళిపోయావ్ అది నాకు చాలా అప్సెటింగ్ గా అనిపించింది. మీరు నాతో మాత్లాడడం లేదు అందుకే అని చెప్పింది. 

మోనల్ : అవినాష్ ఈ మధ్య మోనల్ పనులు సరిగా చేయడం లేదు అది నాకు నచ్చడం లేదు. నేను గొడవలు వస్తౌన్నాయ్ అని నేను ఎవరికి చెప్పడం లేదు నా పని చేస్తున్నాను అని చెప్పింది. 
అరియానా నాకు మోనల్ ఫేక్ అనిపిస్తుంది ఎన్ నంబర్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఎగ్ అంటే ప్రాబ్లం నన్ను పాన్ కడగలేదని నామినేట్ చేసింది. మొన్న ఆమ్లెట్ వేస్కుంటా అంటే ఓకే అంది ఒకోసారి ప్రాబ్లం ఒకోసారి ఓకే. టాస్క్ లో ఒకటి రెండు సార్లు తగిలి ఉంటుంది అన్ని సార్లు తగలలేదు. పైగా లెన్స్ ఉంది లెన్స్ ఉంది అంటుంది టాస్కే మొహం కాపాదుకోడం కదా లెన్స్ పెట్తుకుని ఎలా వస్తారు అని అడిగింది. ఇన్ కంప్లీట్ గేం మీద ఫోకస్ లేదు టెన్ పర్సెంట్ ఫేక్ అని చెప్పింది.   

అభి : సోహెల్ నీ రీజన్స్ నీకున్నాయ్ కానీ ఇమ్యునిటీ టాస్క్ లో గివప్ ఇచ్చావ్ కనుక అంతే.
అఖిల్ టాస్క్ గురించే చేస్తున్నాను గివ్ అప్ ఇచ్చినందుకు. నువ్వు అందులో ఉండుంటే ఇమునిటీ వచ్చుండేది అది తప్ప వేరే ఏ రీజన్స్ లేవు అని చెప్పాడు.  

సోహెల్ : అభి నువ్వు కూడా లాస్ట్ వీక్ టాస్క్ లో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని అన్నాడు. వీళ్ళిద్దరు ఒకరినొకరు నామినేట్ చేస్కుని సారీ చెప్పుకున్నారు. 
అరియానా అందరితో మంచిగ ఉండాలి అని గేం మీద ఫోకస్ చేయడమ్ లేదు. నామినేషన్స్ కి వచ్చిన ప్రతి సారి ఎవరు లేరు అంటున్నావ్ అది చూస్తే నువ్వు ఫోకస్డ్ అనిపించలేదు. నాతో ఎగ్రెస్సివ్ గా మాట్లాడకు నన్ను యాటిట్యూడ్ అని ఫ్రెం చేయకు నీ యాటిట్యూడ్ నచ్చడం లేదు అని చెప్పాడు. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో దూకిన విషయమే డిస్కషన్ వచ్చింది. ఇద్దరు నీ యాక్షన్ బట్టి రియాక్షన్ అని అనుకున్నారు నీకోపం అని అరియానా అంటే నీ యాటిట్యూడ్ అని సోహెల్ అన్నాడు. 

క్లారిఫికేషన్స్ : 
అరియానా హారిక పాకేజ్ అనడం కరెక్ట్ కాదు 
మెహబూబ్ నేనెవరికి కంఫర్ట్ ఇవ్వలేదు అని అరియానా క్లారిటీ ఇచ్చింది. 

అభి : క్లారిఫికేషన్స్ అఖిల్ అది ఆడకపోయుంటే ఈ వారం ఇమ్యునిటీ వచ్చి ఉండేది అన్నావ్ కద అది ఎంత వరకు కరెక్టో చెప్పలేం అన్నాడు. ఏమో అన్నావ్ కదా నీ ఇండివిడ్యువల్ టాస్క్ వేరు నా ఇండివిడ్యువల్ టాస్క్ వేరు దాని మీద జడ్జిమెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. నీకు తక్కువ రుద్దినా కూడా నువ్వు బాక్ వచ్చేశావ్ నేను చెప్పా కూడా రెండో ఛాన్స్ ఉంది అని అన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను అని అన్నాడు అభి. నా గేం నేను ఎలా ఆడతానో అనేది నా ఇష్టానికి వదిలేయాలి అని అన్నాడు. దాన్ని బేస్ చేస్కుని ఎలా నామినేట్ చేస్తావో తెలీదు అని అన్నాడు. 

సోహెల్ క్లారిఫికేషన్ అరియానాతో నేను నెయ్యి దాచిపెట్టాను హౌస్మేట్స్ తింటారు కదా అని నువ్వు ఎందుకు తిన్నావ్ అని అడిగాడు. అరియానా నాతో రూడ్ గా బిహేవ్ చేయకు అని చెప్పింది. ఇదంతా చెప్తుంటే అవినాష్ మెహబూబ్ నవ్వుకుంటున్నారు. సరే ఇట్లనే మర్యాదగా మాట్లాదుకుందాం అని ప్రామిస్ 

అరియానాఏడు, మూడు మెహబూబ్, అభిజీత్, హారిక, మోనల్, సోహెల్ రెండు వోట్స్.  

అరియానా అవినాష్ మాట్లాడుకుంటుననరు. అవి తప్ప మొత్తం హౌస్ నామినేట్ చేశారు నేను బట్టలు సర్దుకోవాలి అని చెప్పింది. చాలా గట్టిగా తగిలింది లాస్య చాలా గట్టిగ కొట్తింది అని బాధపడుతుంది. అందరూ ఒక గ్యాంగ్ అయ్యి చేస్తున్నారు. వచ్చేవారం ఫస్ట్ సేవ్ అయ్యేది నువ్వే అని చెప్తున్నాడు అవినాష్. 

అఖిల్ డార్క్ చాక్లెట్ తీస్కో అని అభికి ఇస్తున్నాడు. ఇదేం పద్దతి నామినేట్ చేసి చాక్లెట్ ఇచ్చేది కొత్తపద్దతా అని అడిగాడు అభి. తను కూడా క్లారిటీ ఇచ్చాడు నా ఇష్టంతోనే నేను డెసిషన్ తీస్కునిబయటికి వచ్చా దానికి నువ్వు నామినేట్ ఎట్లా చేస్తావ్ అని అంటాడు. దాన్ని నువ్వు నామినేషన్ రీజన్ ఎలా చెప్తావ్ అని అంటావ్. నేను ఇంటికి వెళ్తా ఏందిపుడు అని అంటాడు. నా ఇండిపెండెంట్ డెసిషన్ రెస్పెక్ట్ చేయాలి అంతే కానీ ఎలా నామినేట్ చేస్తావ్ హారికని చేయాల్సింది గేం సరిగా ఆడలేదు అని అంటున్నాడు అభి. 
 
కెప్టెన్సీ టాస్క్ ఆఖరి బంతి బాస్కెట్స్ అండ్ బాల్స్ ఇచ్చారు ఒకొక్కళ్ళ బొమ్మలు ఒక్కో బంతి మీద అంటించి ఉన్నాయ్ వాతిని బాస్కెట్ లో లాస్ట్ వేసిన వాళ్ళు ఒకొక్కళ్ళు ఎలిమినేట్ ఆవుతారు అనుకుంటాను.  

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts