5, నవంబర్ 2020, గురువారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. ముఖ్యమైన పాయింట్స్ కోసం క్రింద ఇచ్చిన రఫ్ నోట్స్ చూడవచ్చు. 


ఈ రోజు ఇంట్లో నిన్నటి "పల్లెకు పోదాం చలో చలో" టాస్కే కొనసాగుతుంది. హారిక మిగిలిన రెండు హత్యలను విజయవంతంగా పూర్తి చేసింది. టాస్క్ ముగిసాక అరియానా, హారిక, అమ్మ రాజశేఖర్ ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎన్నుకున్నారు. ఆ టాస్క్ రేపటి ప్రోమొలో చూపించారు. కొత్తగా ఉంది కానీ అంత గొప్పగా ఐతే అనిపించలేదు.   

వివరాలలోకి వెళ్తే రాత్రి పన్నెండున్నరకి అవినాష్ వడ్లు దంచుకున్నాడు. మా తమ్ముడి తరపున నేను దంచుకున్నా అన్నాడు. నీకు రైట్ లేదు నువ్వు దంచలేవు అని సోహెల్ అంటున్నాడు. సందు చూసి మెల్లగా హారిక దగ్గరకు వచ్చింది. ఎలా గొడవ మధ్యలో దూరాలి అని. 

అరియానా ఈన ఎప్పుడూ ఫుడ్ దగ్గరే ఆపేస్తున్నారేంటి అని అబి గురించి సోహెల్ కి కంప్లైంట్ చేస్తున్నది. మోనల్ ఫుడ్ ఇస్తానంటే ఓకే కిచెన్ తీస్కొచ్చి నువ్వు బయట పెట్టు ఐతే అంటున్నాడు అభి. అక్కడే అరియానాకి కోపం వచ్చింది. ఫుడ్ కంట్రోల్ అంటే చేయాలి గేం లో అదే రాసి ఉంది అని అంటున్నాడు అభి. ప్రతి సారీ నువ్వు ఇదే చేస్తావ్ అని అంది అభిని అక్కడే అతనికి బాగా కోపం వచ్చింది. 

అరియానా ఆమ్లెట్ గురించి అలిగిందని అమ్మ గారు సరే నేను వెళ్ళి తీస్కొస్తాను అని హీరోలా ఇంట్లోకి వెళ్ళారు. అక్కడేమో అభి స్ట్రిక్ట్ గా ఒక చేతి బియ్యానికి ఒకరికి రైస్ కర్రీ అండ్ ఆమ్లెట్ కి రెండు చేతులు అని లెక్క చెప్పేసరికి అర్థం చేస్కోకుండా అరిచేస్తున్నారు. అప్పటికి మోనల్ మధ్యలో ఆపి క్లారిటీ ఇచ్చింది. దాంతో ఆయన ప్లేట్ మీద కొట్టి మీరే పెట్టుకోండి అని అరిచేస్తున్నాడు. 

ఆమ్లెట్ ఒక చేతి కొలతకే అని అంటున్నాడు సోహెల్ కానీ అభి ఒప్పుకోలేదు. ఎగ్స్ అంటే స్పెషల్ అది ఎలా కుదురుతుంది అని అన్నాదు. సో అందరు సైలెంట్ అయ్యారు. 

అరవయ్యో రోజు ఉదయం రాముడొచ్చాడు సినిమాలోని "మా పల్లే రేపల్లంటా" పాటతో మేల్కొలిపారు. 
ఎనిమిదింపావుకే హారిక మీరు మీ మైక్ బ్యాటరీస్ ని సరిగా మార్చుకోండి అని అనౌన్స్మెంట్ వచ్చింది. సెకండ్ హత్యకి లీడ్ అనమాట. 

ఇలాంటి దాన్నా నువ్ లవ్ చేసింది అని అన్నాడు అవినాష్. దాన్నా ఏంది అని గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టింది హారిక. అఖిల్ బాగా సపోర్ట్ వచ్చాడు హారిక కి అవినాష్ ని రెచ్చగొట్టడంలో హారిక పాన్ పెట్తిన ట్రేని లాగేసి తోసేయడనికి ప్రయత్నం చేస్తూ కోపం తెప్పిస్తుంది. టాస్క్ ఇది అని అర్థం చేస్కున్నాడు అవినాష్ ఎం పర్లేదు అని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. కానీ హారిక బాగానే రెచ్చగొట్టింది. స్టిల్ బాగానే కంట్రోల్ లో ఉన్నాడు. హారిక లాగేస్తుంది అవినాష్ ని.. ఒక మొమెంట్ లో అవినాష్ లాస్ట్ ఇట్ ట్రేని విసిరి కింద కొట్టే ప్రోసెస్ లో వెనక అది మెహబూబ్ కి తగిలేలా కొట్టాడు. మెహబూబ్ ఐపోయిందా సీక్రెట్ టాస్క్ నాకు ఇచ్చినపుడు చుక్కలు చూపిస్తా అని అంటున్నాడు. 

మెహబూబ్ సోహెల్ ని పెద్దమనిషిగా నా దగ్గరకి రాకు. కొట్టు పాడుచేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావ్ అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు సోహెల్ మీద. ఇద్దరు కొంచెం ఉంటే కొట్టుకునే వారు అని అనిపించింది.
హారిక అవినాష్ ని రెచ్చగొట్టడం ఐతే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. అఖిల్ మధ్య మధ్యలో దూరిపోతున్నాడు. 

మీ గ్రామంలో మరొక హత్య జరిగింది కాబట్టి గ్రామస్థులు మంటని ఆరకుండా చూసుకుంటూ మరో హత్య జరగకుండా చూస్కోండి అని అనౌన్స్ చేశారు. 

ఇది గొడవ జరిగిన రెండు గంటలకి అనౌన్స్ చేయడంతో అభి కి అమ్మ గారి మీద డౌట్ వచ్చింది. అతనే ఈ హత్యలు చేస్తున్నాడు అని కన్ఫర్మ్ చేసేశాడు. అనౌన్స్మెంట్ వచ్చినపుడు అమ్మ గారే మిస్సింగ్. ఆయనేదో చేస్తున్నాడు అందుకే హత్యలు జరుగుతున్నాయ్ అని అంటున్నాడు అభి.  
సోహెల్ ఏదో సర్దాడు అని బహుశా అతనేమైనా హత్యలు చేస్తున్నాడేమో అని అవినాష్ అండ్ మెహబూబ్ అనుమానిస్తున్నారు.
 
మధ్యాహ్నం పన్నెండున్నరకి హారిక ఒక విండో మీద మెహబూబ్ యూ ఆర్ డెడ్ అని రాసేసింది లిప్స్టిక్ తో. 

అది చూసి హారిక లిప్స్టిక్ అని అరియానా డౌట్ పడింది. 
అఖిల్ తెగ ఇన్వెస్టిగేట్ చేసేస్తున్నాడు. కాసేపు అభి హాండ్ రైటింగ్ అని ఫిక్స్ చేశాడు. 
అవినాష్ హారిక అని ఫిక్స్ చేశాడు. ముందు కాసేపు వాదించింది కాదని. తర్వాత అమ్మ గారు దేనికి వాదించడం సరే అని ఒప్పుకో అని చెప్పారు. దాంతో సరే సరే అని సైలెంట్ గా ఉంది. 

పంచాయితి సీన్ సరదాగా ఉంది. అమ్మ గారి ఎకో ఫన్నీ. సోహెల్ పెదరాయుడి పెర్ఫార్మెన్స్ ఫన్నీ. కొందరు అఖిల్ హంతకుడు అని గెస్ చేశారు. హారిక కూడా అఖిల్ అని కన్విన్సింగ్ గా చెప్పింది. 
సీక్రెట్ టాస్క్ సక్సెస్ అని అనౌన్స్ చేసి కెప్టెన్సీ కంటెండర్ గా ఇచ్చారు. 
అరియానాని ఈ వారంలో బెస్ట్ పెర్ఫార్మర్ ని చెప్పమన్నారు మీ పేరు కూడా చెప్పుకోవచ్చు అని అన్నారు. నేను కెప్టెన్సీలో ఇంపాక్ట్ చూపించినందుకే నాకు ఛాన్స్ ఇచ్చారు నా పేరు కూడా చెప్పుకోవచ్చన్నారు కనుక నేను నా పేరే చెప్పుకుంటాను అని చెప్పింది అరియానా.

హారిక అపుడు తను చేసిన హత్యల గురించి చెప్పింది. 

పంచాయిత్ లో వరస్ట్ బిహేవియర్ ఎవరు అని ఆప్షన్ ఇచ్చుంటే నేను నీ పేరు చెప్పేదాన్ని అని అంది అరియానా అవినాష్ ని. నీకు అంత కోపం రాకూడదు అని అంది. ఈ మధ్య చాలా డీగ్రేడ్ చేస్తూ మాట్లాడుతున్నావ్ నన్ను నా గురించి మాట్లాడకపోవడం బెటర్ అని అంటున్నాడు. 

బి ద లైట్ ఇన్ అదర్ పీపుల్స్ లైఫ్ టాస్క్. 

సభ్యులు ఇతరుల జీవితంలో వెలుగు నింపిన సంఘటన పంచుకోవాలి. 
విజెతకి ఒక ఓపో ఎఫ్ సెవెంటీన్ ప్రో ఫోన్ ఇస్తారు. 

సోహెల్ ఫ్రెండ్ కి ప్రిమెచ్యూర్డ్ బేబీ సమయానికి అతని దగ్గర డబ్బులు లేనప్పుడు సోషల్ మీడియా హెల్ప్ తీస్కుని పదిలక్షలు సమీకరించి సహాయం చేశాను. వాడు ఎప్పుడూ సొసైటీకి నీకు రుణ పడి ఉంటాను అంటాడు మనమేదైతే మంచి పని చేద్దామనుకుంటామో అపుడు సొసైటీ కూడా ముందుకొచ్చి హెల్ప్ చేస్తుంది అని చెప్పాడు. 

లాస్య రెండువెలపదిలో పెళ్లైంది. కానీ రెండేళ్ళు ఎవరి జీవితంలో వాళ్ళు కొనసాగుతూ పన్నెండుకి కలిసి ఉండడం మొదలు పెట్టాం. ఆ తర్వాత రెండేళ్ళకి నాన్న గారు ఫోన్ చేసి మీ పెళ్ళి గురించి ఎవరికి చెప్పకండి మేమే చేస్తాం అని చెప్పారు. పద్నాలుగులో ప్రెగ్నెంట్ అని తెలిసింది. అబోర్ట్ చేస్కున్నాను పదిహేడులో పెళ్ళైంది అండర్ని ఒప్పించి. పెల్లైన ఐదునెలల్లో ప్రెగ్నెంట్ ఐనా కనీ మిస్ కారేజ్ అయింది అని చెప్పింది. మళ్ళా పిల్లలు పుట్టరు అనుకున్నాను. పద్దెనిమిది లో జున్ను నాకడుపున పడ్డాడు. మూడోసారి చాలా జాగ్రత్తలు తీస్కున్నాను. మా లైఫ్ లో వెలుగులు తీస్కొచ్చింది జున్ను అని చెప్పింది. 

లాస్యని విన్నర్ గా అనౌన్స్ చేశారు. 

రేపటి ప్రోమోలో కెప్టెన్సీ టస్క్ రింగ్ లో రంగు. 
 
పంచాయితీ పెద్ద హంతకురాలు హారిక అని గెస్ చేశారు.  హారిక బాగా డల్ అయిపోయింది ఏడుపొకటే తక్కువ తన పేరు గెస్ చేసినందుకు.  

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts