19, నవంబర్ 2020, గురువారం

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ - నవంబర్ 19th గురువారం ఎపిసోడ్ No: 75 పై నా అభిప్రాయం నా మాటలలో ఇక్కడ వినవచ్చు. కింద ఇచ్చినది రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ అందులో చదవచ్చు. 



నిన్నటి కమెండో టస్క్ లో ఫ్యామిలీలు రావడన్నే ఈ రోజు కూడా కంటిన్యూ చేశారు. ఈ రోజు కొన్ని కొన్ని సంధర్బాల్లో హౌస్మేట్స్ తో ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్రీజ్ లు చెప్తూ బిగ్ బాస్ బాగానే ఆడుకున్నారు హౌస్మేట్స్ తో. అరియానా కోసం వాళ్ళ ఫ్రెండ్ వినీత్, సోహెల్ కోసం వాళ్ళ నాన్నగారు వచ్చారు. లాస్య ఫ్యామిలీ రేపొస్తుంది. మోనల్ కి వాళ్ళ అమ్మగారి వాయిస్ మెసేజ్ వినిపించారు. వాళ్ళ అక్క హేమాలి కూడా వచ్చింది. తిను కొంచెం హౌస్ లో నెగటివ్ ఎనర్జీ ని నింపి వెళ్ళిందనిపించింది ఎందుకో వివరాల్లో చూద్దాం.       

వివరాలలోకి వెళ్తే ఈ రోజు 74 వ రోజు ఇంట్లో 8మంది సభ్యులు ఉన్నారు. 
ఉదయం మనం సినిమాలో కనిపెంచిన మా అమ్మకే పాటతో మేల్కొలిపారు. ఇంకోసారి పాటెయ్యచ్చుగా అని అడుగుతున్నారు అరియానా. 

అఖిల్ అండ్ మోనల్ మాట్లాడుకుంటున్నారు. నీతో ఎందుకో ఎక్కువ మాట్లాడలేదు అని అనుకుంటున్నారు. అఖిల్ మా అమ్మ చాలా పొసెసివ్ అని చెప్తుంది. నేనూ ఈ ఇంట్లో మనం పర్మెనెంట్ కాదు కదా వెళ్తాం కదా అని  "దుర్గా ఆంటీ హీ ఈజ్ కమింగ్ హోమ్" అని చెప్తుంది మోనల్ :-) ఊ నేను కూడా పొసెసివ్ నా ఫ్రెండ్స్ విషయంలో అని అంటుంది.  

అవినాష్ బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు అరియానా దోశలు వేస్తుంది. బిగ్ బాస్ ఫార్వర్డ్ పవర్ సేవ్ స్లో మోషన్ అని అంటూ మాములుగా ఆడుకోలేదు ఇట్ వజ్ ఫన్ :-) చాలా సేపు ఆడుకున్నాడు :-) మోనల్ దోశ తిప్పుతుంటే అందరూ వార్న్ చేస్తున్నారు మాడినా పర్లేదు వదిలేయ్ అని అది బావుంది. నీ పేరెంట్స్ ఇంకా రాలేదు గుర్తు పెట్టుకో అని అంటున్నాడు అఖిల్. దానితో మోనల్ కి బాగా కోపం వచ్చేసింది అందరు చెప్తారు అని అలిగింది. అఖిల్ అండ్ సోహెల్ ఇద్దరూ కన్విన్స్ చేశారు పక్కన కూర్చుని బావుంది. 

అఖిల్ ని వాటర్ మిలన్ జ్యూస్ అడిగితే మోనల్ ఇవ్వను అని అన్నాడు. సోహెల్ వజ్ కన్ఫూజ్డ్ అయ్యో కాఫీ ఇస్తది జ్యూస్ ఇస్తది నువ్వు ఇవ్వచ్చు కదా అని అంటున్నాడు. హౌస్ లో మొదట్లో వాటర్ అవీ తెచ్చిచ్చేవాడు అడిగీ అడగకుండానే మరి నిన్న వాళ్ళమ్మ గారి రియాక్షన్ నిబట్టి జాగ్రత్త పడుతున్నాడా అని అనిపించింది. 

అవినాష్ ని అరియానా మోనల్ ల మద్యమళ్ళీ ఆడుకున్నారు. పిలిస్తే రావా అని ఇద్దరూ తర్వాత వెళ్ళి మళ్ళా మోనల్ తో ఫ్లర్టింగ్ స్టార్ట్ చేశాడు. 

హౌస్మేట్స్ అంతా మార్చ్ ఫాస్ట్ చేస్తుంటే అరియానా ఫ్రెండ్ వినీత్ వచ్చారు. చాలా ఏడ్చేసింది. తొందరగానే రిలీజ్ చేశారు అరియానాని ఇద్దరూ బాగా మాట్లాడుకున్నారు. నువ్వేందో అట్లానే ఆడు గేం అని చెప్పాడు. హౌస్మేట్స్ పిలిస్తే హాయ్ బ్రో అని అంటున్నాడని నాతో మాట్లాడు నన్ను చూడు అని అరుస్తూ ఏడ్చేస్తుంది. మొన్న లెటర్ ఎవరు రాశారు అని అడిగింది. అన్నంలేని స్టేజ్ లో వీళ్ళింటికి వెళ్ళి తినేదాన్ని అని చెప్పింది. మీ చెల్లితో కొట్లాడి వచ్చా అని చెప్తున్నారు. లెటర్ లో ఏం రాశావో చెప్పు అని అడిగింది. అయ్యో గుర్తు లేదు అని చెప్పాడు. దిస్ ఈజ్ ద బెస్ట్ సర్ ప్రైజ్ అని గెంతులేసింది. 

అందరూ రిలాక్స్ అవుతుండగా మోనల్ వాళ్ళ అమ్మ గారి వాయిస్ మెసేజ్ వచ్చింది చాలా గట్టిగా ఏడ్చేసింది. అందరితో మంచిగా ఉండు అని చెప్పారు. జైశ్రీకృష్ణ బేటా అని ఎండ్ చేయడం బావుంది. తను వస్తారు అని చెప్తున్నారు అఖిల్ అండ్ సోహెల్ పక్కన హౌస్ లో అందరూ కూడా షాక్ అయ్యారు రారేమో అని. కెమేరా ముందు తను మెసేజ్ ఇచ్చింది. అందరు వచ్చారు మిస్సయ్యాను అని చెప్తుంది. గుజరాతీలో మాట్లాడింది. తర్వాత బిగ్ బాస్ ని బెదిరిస్తుంది చెప్తాను నాకు చాలా కోపమొస్తుంది నా ఎమోషన్స్ తో ప్లే వద్దు అని వార్నింగ్ ఇస్తుంది. ఇపుడు హేమాలి వస్తే ఇది చాలా తప్పు అని చెప్తుంది. నిన్న నైట్ మమ్మీ వాయిస్ నోట్ ఐనా కావాలని అన్నావ్ కదా అందుకని అది కూడా ఇచ్చారు అని చాలా చక్కగా కన్విన్స్ చేస్తూ చెప్తుంది హారిక చాలా చాలా నచ్చేసింది. ఇంత బాగా చూసుకుంటుంటే పక్క వాళ్ళని ఇంకా చిన్నపిల్ల అంటారేంటో హారిక వాళ్ళ మమ్మీ. 

ఇక అలా కాసేపు ఏడిపించాక మోనల్ కోసం హేమాలి వచ్చింది మోనల్ వాళ్ళ సిస్టర్.. అమ్మని చాలా మిస్ అవుతున్నాను గుజారాతీలో మాట్లాడు అని అడుగుతుంది. అఖిల్ గురించి నా గురించి బయట బాడ్ గా అనుకుంటున్నారా అని అడుగుతుంది ఏం లేదు అందరూ మెచ్చుకుంటున్నరు అని చెప్పింది. అమ్మ గుర్తొచ్చినపుడల్లా ఏడ్పొచ్చేస్తుంది అని చెప్తుంది. బాగా అడుతున్నావు అని చెప్తుంది. అందర్ని పరిచ్యం చేస్తుంటే నాకు తెల్సు రోజూ చూస్తాను అని చెప్తుంది. అందరూ బాగా ఆడుతున్నారు అని అంది. అపుడపుడు నెగటివ్ ఎందుకు అవుతున్నారు అని అడిగింది. అభిజిత్ ని వెనక మాట్లాడకు చెడైనా మంచైనా ఏమున్నా ముందే చెప్పు అని చెప్పింది. ఇదన్న కాసేపటికి అభి సైలెంట్ గా ఉన్నాడని ఆర్ యూ ఫీలింగ్ బాడ్ అని ఇంకా నేను నీతో ఎక్కువ మాట్లాడక పోతె నీకు నచ్చలేదు కదా నువ్వు కూడా మోనల్ తో అలా తక్కువ మాట్లాడకు ఇంకా బాగా మాట్లాడు అని చెప్పింది. 

అవినాష్ నాకు గుజరాతీ వచ్చు అని గుజరాతీ లో నన్ను పెళ్ళి చేస్కుంటావా అని అడిగాడు. నా ఫియాన్సే ఉన్నాడు బయటా ఐనా నువ్వేంటి అందరిని ఇలా అడుగుతూ అందరితో ఫ్లర్ట్ చేస్తావా అనేసింది. ప్రతి సారి ఎందుకు ఏడుస్తావ్.. ఏడిస్తే కొట్టేస్తాను అని చెప్తుంది మోనల్ కి.. ఆవిడ వెళ్ళిపోయాక మోనల్ కెమేరాకి హగ్గులిచ్చేసి ముద్దులు పెట్టేసింది థ్యాంక్యూ బిగ్ బాస్ అని చెప్తూ.. 

అరియానా అవినాష్ హారిక ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఆవిడ ఇచ్చిన ఫీడ్ బాక్ గురించి. ఇక్కడ కూడా హారిక చాలా క్లారిటీతో చెప్పింది అభి వెనక ఏం మాట్లాడాడో అదే ముందు కూడా మాట్లాడుతాడు ఏం మార్చడు అని. నాకు మళ్ళా హారిక నచ్చేసింది బాగా చెప్పిందనిపించింది. 

అఖిల్ అండ్ సోహెల్ కూడా తను చాలా స్ట్రయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది ఇలా ఉంటే బావుంటుంది నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు అఖిల్. అండ్ మోనల్ నేను అఖిల్ కి ఆల్రెడీ చెప్పాను తనొస్తే ఇలానే మాట్లాదుతుందని అభికి కూడా తెలుసు అని చెప్తుంది. 

అభిజిత్ బాగానే ఫీలయ్యాడు అనిపించింది. పాపం నిన్న అనుకుంటూనే ఉన్నాడు మోనల్ వాళ్ళ అమ్మ గారు వస్తే నన్నేదో ఒకటి అంటారు అని అన్నట్లే అనేసింది. అండ్ బెస్ట్ థింగ్ ఎంత ఫీలైనా ఒక్క మాట మాట్లాడకుండా ఎదురు చెప్పకుండా డీసెంట్ గా సరే అని వదిలేశాడు. ఇక్కడ నాకు అభిజిత్ ఇంకొంచెం నచ్చేశాడు. మరొకళ్ళు వేరేవాళ్ళైతే కనుక ఏదో ఒకటి అనేసేవారు వెంటనే కానీ అభిజిత్ కాబట్టి స్టెబిలిటీ కోల్పోకుండా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ నవ్వుతూ స్వీకరించాడు అని అనిపించింది. కానీ నాకు నచ్చని విషయమేంటంటే తర్వాత మోనల్ కూడా వెళ్ళి కన్సోల్ చేయలేదు అభిని. మోనల్ కాకపోయినా అఖిల్ అండ్ సోహెల్ నిన్నె కలిసిపోయారు కదా వాళ్ళైనా వెళ్ళి అభితో మాట్లాడి ఉంటే బావుండనిపించింది. రేపు అన్ సీన్ లో చూపిస్తాడేమో చూడాలి.  

ఈ యంగ్ స్టర్స్ తో ఇదే ప్రాబ్లం.. నాకు ఈ అమ్మాయ్ తనిష్ వాళ్ళ బ్రదర్ ని గుర్తు చేసింది సెకండ్ సీజన్ లో తను కూడా ఇలానే ట్రై చేశాడు. స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉండడం అంటే రూడ్ గా ఉండడం కాదు కదా ఇదె విషయాన్ని కాస్త మ్రుదువుగా సరదాగా కూడా ఛెప్పి ఉండచ్చు అనిపించింది. ఆ సీజన్ లో దీప్తి వాళ్ళ హజ్బండ్ అలా మెత్తగా చెప్పి బాగా హాండిల్ చేసినట్లు గుర్తు. మరి బిగ్ బాసే చెప్పి పంపాడో లేక చెల్లెలి మీద అక్కలకు ఉండే సహజమైన పొసెసివ్ నెస్ తో ప్రొటెక్ట్ చేయాలనే ఇన్ స్టింక్ట్ తో అలా చెప్పిందో తెలీదు. ఏదైనా కానీ అభికి ఇది పాజిటివే ఔతుంది అనిపిస్తుంది తనని గెలుపుకి చేరువగా తీస్కెళ్ళే మరో మంచి సిట్యువేషన్ ఇది. 

ఇవన్నీ పక్కన పెడితె తను కమిటెడ్ అని చెప్పింది కానీ చూడ్డానికి మాత్రం మాములుగా లేదు హేమాలి సార్ హేమాలి అంతె అన్నట్లుంది :-) సోహెల్ ఉండి హే తనకి ఆల్రెడీ పెళ్ళి సెట్ అయిందని చెప్పావ్ కదా అబ్బా ఛా మిస్ అయిపోయా అని చేతిని కొట్టుకుంటున్నాడు :-) అంత బావుందనమాట. 

ఇక ఈ రోజు చివరగా సోహెల్ కోసం వాళ్ళ నాన్న గారు వచ్చారు. సోహేల్ బాబా అని పిలుస్తుంటే సోహెల్ ఏడ్పు అసలు ఆపుకోలేకపోయారు. తనని తప్ప మిగిలిన అందరిని రిలీజ్ చేశారు. సోహెల్ తో పాటు హారిక అఖిల్ అక్కడే ఉన్నారు.. చాలా బావుంది. సోహెల్ ని రిలీజ్ చేశారు. ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు. ఉర్దూతో మొదలు పెట్టి ఇక్కడ తెలుగు మాట్లాడుకోఆలి అని చెప్పాడు. అందరూ సంతోషపడుతున్నారు అని చెప్తున్నారు ఆయన. నువ్వు ఖుష్ ఏ కదా అని అడిగితే హా అని చెప్పారు నువ్వు ఖుష్ ఉంటే చాలు అనిచెప్తున్నాడు సోహెల్. అందరు బాగా చూసుకుంటున్నారు అని చెప్తున్నాడు. 

మాంచి శ్లాంగ్ లో మాట్లాడుతున్నారు. బయటికి వస్తే గొడవలు అన్నీ సల్లబడతాయ్ అని చెప్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు ఎప్పుడేం చేస్తావో తెలీడంలేదు అని చెప్తున్నారు ఆయన గూడా. హారికని పరిచయం చెస్తె ఫైటింగ్ అని చెప్తున్నారు. లాస్యకి ఒకటికి రెండు సార్లు చెప్పారు తమ్ముడ్ని బాగా చూస్కో అని. 

కట్ చేస్తే నైట్ లాస్య జున్ను గాడి ఫోటో తో మాట్లాడుకుంటుంది "సిన్సియర్ గా పొద్దున్న పప్పాని ఇంప్రెస్ చేద్దామని రెడీ అయ్యానురా కానీ డే ఎండ్ చేసే సరికి మన చేతిలో లేదు కదారా" అని చెప్తుంది. ఇక నేను ఒక్కతినే కదా మిగిలింది ఎప్పుడు వస్తాడో రానీ అప్పుడు ఎలా ఉంటే అలా కనిపించడమే ఏం చేస్తాం అని చెప్తుంది. 

లాస్యకి మేకప్ చేస్తుంటే అఖిల్ అండ్ మోనల్ బిగ్ బాస్ మళ్ళీ పవర్ సేవ్ రిలీజ్ చెప్పి అందరితో ఆడుకున్నారు. అఖిల్ కి మాములుగా మేకప్ వేయలేదు మోనల్ అండ్ లాస్య ఇద్దరు కలిసి :-) ఇట్ వజ్ ఫన్. సోహెల్ కూడా ఫుల్ మేకప్ వేశాడు అఖిల్ కి.. లిప్ స్టిక్ ఐలైనర్ అన్నీ వేసేసి. అఖిల్ ని రిలీజ్ చెప్పగానే అందరూ పారిపోయారు సోహెల్ మాత్రమే దొరికాడు. 

లాస్య ఫ్యామిలీ జున్ను ఎంట్రీ రేపటికి పోస్ట్ పోన్ చేశారు. రేపటి ప్రోమోలో చూపించారు. జున్ను ఏమాత్రం ఏడవకుండా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు సో గుడ్ చాలా బావుంది చూడ్డానికి. మంజునాథ్ గారు చాలా బాగా చూసుకుంటున్నట్లు ఉన్నారు అని అనిపించింది. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts