20, నవంబర్ 2020, శుక్రవారం

నవంబర్ పందొమ్మిదిన టెలికాస్ట్ ఐన డెబ్బై ఐదవ ఎపిసోడ్ అన్ సీన్ రివ్యూ తో పాటు అభిజిత్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడా అనేదానిపై నా విశ్లేషణ ఇక్కడ నా మాటలలో వినవచ్చు. 



సోహెల్ అవినాష్ లాస్య ఎవరెవరు కెప్టెన్ అవలేదు అని డిస్కస్ చేస్కుంటున్నారు. అఖిల్ ఓన్ గా కాలేదని సోహెల్ అంటే అలా ఐతే నేను కూడా కాలేదు అని లాస్య అంటుంది. నిన్ను కట్టప్ప అన్నారు నువ్వు ఆ అవమానాన్ని మోశావ్ కదా ఇంకేంటి అని అంటున్నాడు. థాంక్స్ తమ్ముడు గుర్తించావ్ అని అంది లాస్య. 

సోహెల్ హారిక ఇద్దరు మొన్న ఐన గొడవ గురించి మాట్లాదుకుంటున్నారు. నేను మొదటి సారి అరిచాను అంతగా ఇప్పటి వరకు ఎప్పుడు అంత అరవలేదు అని చెప్తుంది. ఏందో ఈ హౌస్ లో మూడ్స్ ఇలా మారిపోతాయ్ అని అనుకున్నారు. సోహెల్ కూడా ఏంటో ఆ మొమెంట్ లో అసలు అవసరమా అని అనిపించింది అని చెప్తున్నాడు. నాగ్ సార్ మనల్ని తిడతారేమో అని అనుకుంటున్నారు. 

మోనల్ కోపం కాస్త తగ్గిన తర్వాత అఖిల్ దగ్గరకి వెళ్ళి మూడ్ బాలేదు మీరు వచ్చారు మాట్లాడడానికి కానీ ఇంట్లో వాళ్ళు రాలేదని ఇలా చేస్తే రారేమో అని అనడం బాలేదు అని చెప్పి బాధపడుతుంది. నేనే అన్నాను కానీ మరి టాస్క్ లో జాగ్రత్తగా చేయాలి అని చెప్పాడు క్లారిటీగా అఖిల్. నువ్వు ప్లాంక్ వాక్ అవి కూడా సరిగా చేయలేదు అర్ధం చేస్కున్నాను అది నీకే మంచిది కాదు అనిచెప్పాడు. సారీ చెప్పింది మిస్టేక్ చేయకు అని అంటుంది. తెలిసి అంటుందా తెలీక అంటుందా అని నేను బుర్రగోక్కునేంతలో అఖిల్ బానే అర్థం చేస్కుని చేయకు కాదు చేయను అని చెప్పు నువ్వు చేయకూడదు అని అంటే అపుడు సరే అంది.   


హారిక అఖిల్ ఫామిలీ వచ్చింది చాలలేదు ఏం మాట్లాడామో కూడా గుర్తు లేదు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అని మళ్ళీ రికలెక్ట్ చేస్కుంటున్నారు. 

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది పాటని పూర్తిగా మార్చేసి పారెడీ చేసి పాడుకుంటున్నారు. ఫన్నీగా బావుంది. 

మోనల్ కి అవినాష్ నీ పేరు ఎందుకు తీస్కున్నాం అని వివరణ ఇస్తున్నాడు. మా అందరికన్నా నువ్వు ఎక్కువ ఫ్మామిలిని మిస్ అవుతున్నావ్ మా అందరికి ఇక్కడే ఉంది నువ్వు చాలా దూరం కదా అందుకే అని చెప్తున్నాడు. బహుశా ఈ డిస్కషన్స్ అన్నీ చూశాకే బిగ్ బాస్ మోనల్ కి స్పెషల్ ఎఫెక్ట్ ప్లాన్ చేశాడానిపించింది నాకు. 

లాస్య జున్ను గాడికోసం గోపాల బాలుడమ్మ పాట పాడింది ఎంత బావుందో అసలు చాలా బావుంది.  

అరియానా వాళ్ళ ఫ్రెండ్ వినీత్ అభిజిత్ తో నీకు బిగ్ ఫాన్ అని చెప్తున్నాడు. దట్స్ సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. 
 
బాక్ బిచ్చింగ్ అండ్ బిగ్ బాస్ హౌ రెలెవెంట్. అన్ని కెమేరాల ముందు ఎపుడు ఎవరికి ఎవరి వీడియో చూపిస్తారో తెలీదు సో అక్కడ ఉన్న వాళ్ళందరికి ఈ విషయం తెలుసు వాళ్ళలో స్మార్ట్ గా ఆలోచించే అభికి ఇంకా తెలుసు. 

టీవీ ఫోన్ లాంటి ఎంటర్టైన్మెంట్ సాధనాలేమీ లేని బిగ్ బాస్ ఇంట్లో మాటలే ఎంటర్టైన్మేంట్. ఎవరి టాపిక్ వస్తే వాళ్ళాని పిల్చి మాట్లాడుకో లేరు కదా.

అదీ కాక అభిజిత్ ఎప్పుడూ ఎవరి ముందు మంచివాడిగా ఉండాలని నటించడం చూడలేదు. నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంటాడు. వఆళ్ళు లేనపుడు మాట్లాడుకున్నా కానీ అదే విషయం ఎదురుగా చెప్పడానికి సంకోచించడు. 

అసలు ఈ పదం బిగ్ బాస్ కి వర్తించదు అన్ని కెమేరాల ముందు మాట్లాడుకుంటూ అది ఎపుడైనా అవతలి వాళ్ళకి తెలిసే అవకాశమున్నపుడు అలా అనలేం అని నా అభిప్రాయం.  



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts