ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం చూడవచ్చు.
ఈ రోజు రోస్టింగ్ డే. అభికి అరియానాకి బాగానే క్లాస్ లు పడ్డాయ్ అండ్ నాగ్ పంచ్ లు కూడా అద్దిరాయ్. కమల్ పుట్టిన రోజు సంధర్బంగా తమిళ్ బిగ్ బాస్ టీంతో కాన్ఫరెన్స్ ప్లాన్ చేశారు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయనకి విషెస్ అంద చేసి హారికని తనతో సేవ్ చేయించారు బావుంది. ఇమ్యునిటీ టాస్క్ లో ఎవరు గెలవలేదు కనుక చివరి వరకు ఉన్న ముగ్గురిలో అమ్మగారు కెప్టెన్ కనుక మిగిలిన ఇద్దరికి ఛాన్స్ ఇస్తాను ఎవరికోసం హౌస్ లో ఎక్కువ శాక్రిఫైస్ చేస్తే వాళ్ళు వచ్చేవారం ఇమ్యునిటీ పొందుతారు అని అన్నారు అవినాష్ పొందాడు.
వివరాలలోకి వెళ్తే రణం సినిమాలోని నా పేరు చిన్నా పాటతో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. ఎక్కువ పార్ట్ డాన్సర్సే వేసినా ఈ ఏజ్ లో తను వేసిన నాలుగు స్టెప్పులు కూడా మాంచి హుషారుతో అదర గొట్టేశారు నాగ్.
అరవై రెండో రోజు ఎవరు వెళ్తారో అని డిస్కషన్ నడుస్తుంది. అరియానా అమ్మ అవినాష్ మధ్య. అమ్మ గారి పేరు తప్ప మిగిలిన వాళ్ళందరి పేర్లు చెప్పింది అరియానా. అవి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నేను దేన్లోనూ వీక్ కాదు అని అన్నాడు.
హారిక అఖిల్ మాట్లాడుకుంటున్నారు. రేషన్ మానెజర్ రోల్ నాకు ఇవ్వాలి కద అని హారిక అంటూంది. అరియానాకి ఉన్న మెచ్యూరిటీ కూడా లేదు అమ్మ గారికి అని చెప్తుంది. అసలు కన్సర్నే వినడం లేదు అంటూంది.
లక్జరీ బడ్జెట్ ఐటమ్స్ వచ్చాయ్ రాస్తున్నారు మెహబూబ్ రాస్తున్నాడు
అరియానా అండ్ సోహెల్ మధ్య డిస్కషన్ నడుస్తుంది. నెయ్యి సీసా గురించి సోహెల్ రూడ్ గా మాట్లాడుతున్నాడు అని అరియానా అంటుంది. లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ వచ్చేశాయి.
డాజ్లర్ ఎటెర్నా మేకప్ ప్రోడక్ట్స్ గురించి వచ్చాయ్. ఇంట్లోని ఆడవాళ్ళు ఆ ప్రొడక్ట్స్ ఉపయోగించి సిద్దమవ్వాలి అని టాస్క్. అంతా మేకప్ వేస్కున్నారు.
నాగ్ మరో సారి క్లారిటీ ఇచ్చారు హాట్ స్టార్ అండ్ మిస్డ్ కాల్స్ లో వోట్లు మాత్రమే కౌంట్ అవుతాయి అండ్ ఎలిమినేషన్ మీ ఓట్స్ బట్టే జరుగుతుంది. సోషల్ మీడియా ఓట్స్ కౌంట్ అవ్వవు కన్ఫూజ్ అవకండి అని చెప్పారు.
నాగ్ హౌస్ లోకి ఎంటర్ అయిపోయారు.
ఏంటి కెప్టెన్ శివాలెత్తిస్తున్నావంట అని అడిగారు.
ముందే మాస్టర్ కి క్లారిటీ ఇచ్చేశారు. మీ ఇమ్యునిటీ ఈ వీక్ కాదు వచ్చేవారం అని చెప్పారు. ఈ వీక్ ఉన్నా వెళ్ళినా ఓకే అని చెప్పాడు
మీ ఎలిగేషన్స్ ఏంటి అని అడిగారు అభి అమ్మ గారు మన మాటలు వినరు అని చెప్పాడు. సరే నీకు పనిష్మెంట్ ఏంటి అంటే ఇంగ్లీష్ లో మాట్లాడనందుకు అంటే నేను కూడా పనిష్ చేశాను అంటే ముప్పై ఏళ్ళగా నేను ఇలా ఉన్నాను మూడ్నెల్లు వేరేగా ఉండడం కష్టం అన్నాడు అభి. వెంటనె నాగ్ ఎస్ మరి మాస్టర్ కూడా ముప్పై ఏళ్ళగా అలా ఉన్నారు ఆయన అంతే కదా మరి ఆయనకి కూడా టైమ్ పడుతుంది కదా సోహెల్ మారుతున్నాడు. అలాగే మారుతారు అని అన్నారు.
తర్వాత ఇమ్యునిటీ టాస్క్ లో గివప్ ఇచ్చిన దాని గురించి బాగానే అభి ని డ్రిల్ చేశారు. నువ్ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కాకుండా ఏవరో ఒకరు దిగితే తప్ప ఉపయోగం ఉండదు కనుక నేను దిగుతున్నా అని చెప్పుంటే బావుండేది అని చెప్పారు.
హౌస్ లో వెలిగే దీపం ఎవరూ ఆరిపోయే దీపం ఎవరూ అని అడిగారు.
అభి ని అడిగితే డ్రస్సింగ్ బట్టి ఇస్తా అని వెలుగుతున్నది మోనల్ చాలా బాగా డ్రస్సప్ అయింది. అన్నారు ఆరిపోయేది అంటే వెళ్ళే వాళ్ళు అంటే ఆమ్మ గారి పేరు చెప్పారు.
అరియానా అవినాష్ వెలుగు అని మంచి క్లారిటీతో ఇచ్చారు. అభికి ఆరిపోయె అని ఇచ్చింది. గివప్ ఇస్తాడు స్మార్ట్ అని చెప్పి ఆపేస్తాడు అంది.
మోనల్ ని అడిగితే సోహెల్ అండ్ లాస్య నామినేట్ చేస్తే ఓకే కానీ అఖిల్ నామినేట్ చేయడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అరియానా అవినాష్ అమ్మ గారికి సపోర్ట్ చేసింది అలాగే అఖిల్ నాకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పలేకపోయాడు. నాకు అతనికి నామినేట్ చేసినందుకు కారణం లేదు అంది. నాగ్ ఎందుకు నామినేట్ చేశావ్ అని అడిగారు. ఇన్ని రోజులు సపోర్ట్ చేశా కానీ ఇపుడు కూడా అలా సేవ్ చేస్కోవాలి ఎంతకాలం నేను సేవ్ చేస్కుంటూ రావాలి. నేను నామినేట్ చేశాకే ఇమ్మ్యునిటీ టాస్క్ స్ట్రాంగ్ గా ఆడింది అని చెప్పాడు. టీ స్టాండ్ లో నేను సపోర్ట్ చేశా కదా ఇంకా స్పెషల్ గా చెప్పాల్సిన పనేంటి అర్ధమవుతుంది కదా అని చెప్పాడు.
అఖిల్ ని మోర్ దేన్ ఎ ఫ్రెండా లేక జస్ట్ ఫ్రెండా అని అంటే ఫ్రెండే సర్ అని అన్నాడు అఖిల్. మోనల్ ముందు హీ ఈజ్ ఫ్యామిలీ అన్నది తను అన్నాక ఫ్రెండే సర్ అని అంది.
వెలిగే దీపం అని అఖిల్ కే ఇచ్చింది తను నా ఫ్రెండే అని నాగ్ అండ్ అఖిల్ కూడా చాలా హాపీ ఫీలయ్యారు. ఆరిపోయె దీపం అరియానా అంది. నాకు ఇచ్చిన టాస్క్ నేను చేశా అంతే.
సోహెల్ వెలిగే దీపం మెహబూబ్ అన్నాడు ఇద్దరి మధ్య గొడవ గురించి అడిగారు. ఆరిపోయే దీపం అరియానా అన్నాడు. నువ్వు పగతో ఆడావా లేక టాస్క్ ఆడావా అని అడిగారు అరియానాని నాగ్. నేను టాస్క్ ఆడా అంతే అని చెప్పింది.
టాస్క్ లో బిగ్ బాస్ ఐస్ ఎందుకు పంపారు అన్న అరియానా కి బిగ్ బాస్ పూలూ పంపుతాడు కత్తి పంపుతాడు మీ కారెక్టర్ తెలుస్కోడానికి అని చెప్పారు నాగ్.
అవినాష్ పవర్ ఫుల్ అని అరియానాకి షైనింగ్. ఆరిపోయే అని మోనల్ కి
హారిక షైనింగ్ లాస్య కి వంట చేస్తుంది పేషన్స్. ఆరిపోయే దీపం అవినాష్ మొదట్లో తెలుసు కానీ ఇపుడు అవినాష్ అరియానా ఒక పాకేజ్ కిండ వస్తుంది నాట్ ఇన్ ఎ రాంగ్ వే అని చెప్పింది.
లాస్య నలుగురైదుగురికి ఇవ్వాలి అంటే నాకు తెలుసు మీరు పాకేజ్ అని అన్నారు ఒక్కరికే ఇవ్వు అంటే హారిక కి ఇచ్చింది నాకు తెలుసు తను నీకు నువ్వు తనకి ఇచ్చావ్ అన్నాడు. ఆరిపోయేది అరియానాకి ఇచ్చింది. ఫెండ్లీ గా డిస్కస్ చేయాలి.
మెహబూబ్ షైనింగ్ లైట్ సోహెల్ కిఇచ్చాడు తన లోపాలు చెప్తే మర్చుకుంటాడు అది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పాడు. ఆరిపోయే దీపం అరియానా కెప్టెన్సీ లో వర్క్ అసైన్ చేసినపుడు కొందరి కంఫర్ట్ కావాలని అంది నాకు నచ్చలేదు.
అమ్మ గారు అఖిల్ ఆరిపోయె దీపం మోనల్ కి ఎగ్ కొట్టడం నచ్చలేదు. మనం అడ్వైజ్ చేయచ్చు కానీ నామినేట్ చేసి వెళ్ళమనడమ్ కరెక్ట్ కాదు అని అన్నారు. మీ లెక్కప్రకారం ట్రూఫెండా కాదా అంటే ముందు వరకు నేను నమ్మాను కానీ తర్వాత మారింది. వెలిగే దీపం అరియానాకి ఇచ్చాడు. నా టాస్క్ లో బ్యాక్ పెయిన్ అని నా వల్ల కాదన్నా ఒకటే జననం పాడుతూ నాకు సపోర్ట్ చేస్తూ నాతో ఉన్నారు అది నాకు బాగా నచ్చింది అని చెప్పారు.
అఖిల్ ఆరిపోయే దీపం అమ్మ గారు సేం నామినేట్ చేసినపుడు చెప్పినట్లే రీజన్ చెప్పి నామినేట్ చేయడు అని అన్నారు. షైనింగ్ లైట్ మోనల్ కి ఇచ్చాడు. యూ కెన్ డూ ఇట్ అని సపోర్ట్ చేశాను. అండ్ షి డిడ్ ఇట్ అని చెప్పాడు.
కమల్ పుట్తిన రోజు కనుక స్పెషల్ ఈవెంట్ అని ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ కాన్ఫరెన్స్ కాల్ లో కలిపారు. ఈ దేశం గర్వించే మహానటుడి పుట్తిన రోజు. మీరు ఒకర్ని సేవ్ చేయాలి అని చెపపరు నాగ్. అందర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే తమిళ్ లో కూడా అందర్ని ఇంట్రడ్యూస్ చేశారు కమల్. హౌస్ ఫుల్ గా ఉంది సార్ మీది అంటే అది మనిద్దరికి నచ్చిన మాట కదా అని అన్నారు కమల్. మీ కంటెస్టెంట్స్ లుకింగ్ షార్ప్ అండ్ ఆల్ ఆఫ్ యూ డోంట్ ప్లే సేఫ్ గేం అని అన్నారు. ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు వాళ్ళలో ఒకర్ని సేవ్ చేయాలి అని చెప్పారు కార్డ్ చూపించారు. కౌంట్ డౌన్ తర్వాత హారిక పేరు చెప్పారు. ఐ వుడ్ లైక్ టు సేవ్ ఆల్ ఫైవ్ కానీ ఇది గేం కనుక ఒకళ్ళనే చేస్తున్నా అన్నారు. సో ఆల్ అఫ్ యూ ప్లే వెల్ అండ్ దిస్ ఈజ్ ద గేం యు కెన్ టేక్ బాక్ టూ లైఫ్ అని చెప్పారు. హారిక చాలా హాపీ ఇది నాకు చాలా స్పెషల్ సేవ్ థాంక్స్ ఎ లాట్ సర్ అని చెప్పింది.
వచ్చేవారం ఇమ్యునిటీ వచ్చే అవకాశం ఇస్తున్నాను మోనల్ అండ్ అవినాష్ కి అని చెప్పారు. టాస్క్ లో ఇమ్యునిటీ ఎవరికి అనౌన్స్ చేయలేదు కానీ నేను మరో అవకాశం ఇస్తున్నాను. మాస్టర్ కెప్టెన్ అయ్యారు కనుక ఆయన్ని వదిలేస్తే మోనల్ అండ్ అవినాష్ ల కోసం రెండు బాస్కెట్స్ ఇస్తున్నాను. వాటిలో హౌస్మేట్స్ వాళ్ళ వస్తువులని త్యాగం చేయాలి అవి వెనక్కి రావు. ఎవరి బాస్కెట్ బరువు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇమ్యునిటీ వస్తుంది.
పది నిముషాలు ఇచ్చారు. హౌస్ ప్రాపర్టీస్ కాకుండా మీ పర్సనల్ ఐటమ్స్ వేయాలి అని చెప్పారు.
మోనల్ అండ్ అవినాష్ కన్విన్స్ చేయడనికి ప్రయత్నిస్తున్నారు మెహబూబ్ కి. అఖిల్ చాలా షూస్ తెచ్చి వేశాడు మోనల్ కి అరియానా అవినాష్ కి సపోర్ట్ చేస్తుంది.
అవినాష్ నేను నా అదర్ షో కూడా వదిలేసి వచ్చాను. నేను సపోర్ట్ లేకపోయినా స్ట్రాంగ్ గా ఆడాను అని చెప్తున్నాడు.
వేరె స్టేట్ నుండి వేరే కల్చర్ నుండి వచ్చి ఆడాను నా శక్తి మేరకు అని చెప్తుంది మోనల్. లాస్య నెక్స్ట్ టైం హెల్ప్ చేయగలను ఇపుడు కాదు అనిచ్ చెప్పింది అవినాష్ కి హెల్ప్ చేసింది. మెహబూబ్ సోహెల్ కూడా అవినాష్ కే హెల్ప్ చేస్తుననరు. అఖిల్ ఒక్కడే మోనల్ కి సపోర్ట్ చేస్తున్నాడు. చాలా ఐటమ్స్ తెచ్చాడు దాదాపు అన్ని ఐటమ్స్ పెట్టేశాడు. హారిక కూడా మోనల్ కోసమే తెచ్చింది. అభి కూడా కొన్ని షూస్ తెచ్చాడు.
బుట్టలు రెండూ వెయిట్ చేశారు. మోనల్ కి ముగ్గురు చేశారు. అవినాష్ కి నలుగురు సపోర్ట్ చేశారు. హారిక అండ్ అభి పెట్టినవి బజర్ తర్వాత కాబట్తి కౌంట్ రావు అని చెప్పాడు నాగ్.
మోనల్ ఒక రిక్వెస్ట్ అని అఖిల్ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ పెట్టేశాడు తనవి సో నాకు వద్దు సార్ అని చెప్పింది మోనల్ నీకు ఛాయిస్ లేదన్నారు నాగ్ రెండు బుట్టలు వెయింగ్ కి పంపారు.
మోనల్ : 13.280 kilO. అవినాష్ : 23.17 సో అవినాష్ కి ఇమ్యునిటీ వచ్చేవారం వస్తుంది ఈ వారం సేవ్ అయితే అని చెప్పారు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.