ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. నామినేషన్స్ ప్రక్రియ పూర్తవలేదు కనుక ఓటింగ్ లైన్స్ ఇంకా ఓపెన్ అవలేదు. రేపు మంగళవారం షో టైం తర్వాత ఓపెన్ అవుతాయి.
56వ రోజు సాయంత్రం నేను సేవ్ అయ్యాక నువ్వు నాతో ఎందుకు కూర్చోలేదు అని అడుగుతుంది మోనల్ అఖిల్ ని. నువ్వే రావాల్సింది నా పక్కకి అని అంటున్నాడు. సరే హగ్ ఇవ్వు అంటే జస్ట్ కాజువల్ హగ్ ఇచ్చాడు ఇది అఖిల్ కాదు ఏమైంది అని అడిగింది మోనల్ ఏం లేదు నాకు ఇలా ఉండబుద్ది అవుతుంది ఇలా ఉంటున్నా అంతే అన్నాడు. నేను నార్మల్ గానే ఉన్నాను నువ్వు ఎక్కువ ఆలోచించకు నాకు కొంచెం టైమ్ ఇవ్వు అని అన్నాడు.
57వ రోజు ఉదయం డార్లింగే ఓసి నా డార్లింగే పాటతో మేలుకొల్పారు. అందరూ డాన్సులు బానే చేశారు. అఖిల్ మాత్రం కూర్చోని ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాడు. మోనల్ కిచెన్ లో ఉంది.
పదకొండున్నరకి సోహెల్ అండ్ మెహబూబ్ నిద్రపోతున్నారు కుక్కలు మొరిగాయ్.. అరియానా వచ్చి అడిగితే నాకు తెలీదు మెహబూబ్ అని చెప్పాడు సోహెల్. తర్వాత నేను కూడా నిద్రపోతున్నా అని మెహబూబ్ తో చెప్పాడు. మెహబూబ్ పై రెండు బక్కెట్లు నీళ్ళు పోశాడు.
అరియానా మెహబూబ్ ల మధ్య డిస్కషన్ మెహబూబ్ పని చేయడం లేదని.
అభి అండ్ లాస్య డిస్కషన్. నామినేషన్స్ వయొలెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది అని అన్నాడు అభి. మాస్టర్ అయితే మొహం కూడా చూడట్లేదు అని అంటుంది లాస్య.
సోహెల్ నిద్రపోయాడు కుక్కలు మొరిగాయ్. అరియానా రెండు బక్కెట్స్ నీళ్ళు పోస్కోమని అంటే సాయంత్రం చేస్తా అన్నాడు నువ్వు ఇపుడే పదిహేను నిముషాల్లో చేయాలి అని అంది వాదించి విసుగొచ్చి ఒక్క పరుగులో ఎగిరి స్విమ్మింగ్ పూల్ లోకి దూకాడు. మెహబూబ్ బయటికి రమ్మంటే కూడా రాలేదు చాలా సేపు.
ఏమొద్దు ఇట్లనే బోత ఇంట్లోకి నా ఇష్టం ఎప్పుడైనా స్నానం చేస్తా ఏంది అని తడి ఒంటితో తడి కాళ్ళతో ఇల్లంతా తిరుగుతున్నాడు. ఇంతే ఉంటా మళ్ళా నిద్ర పోతా మళ్ళా పూల్ లో దిగుతా అని అంటున్నాడు. చాలా ఆరొగెంట్ గా మాట్లాడుతున్నాడు.
సోహెల్ కే మైక్ ధరించండి అని అనౌన్స్మెంట్ వచ్చింది. నా కెప్టెన్సీ తీస్కున్న వెంటనే చెప్పాను అనౌన్స్మెంట్ వస్తే వెంటనే చేయాలని చెప్పాను ఇష్టముంటే చేయండి లేదంటే లేదు అని అంది అరియానా. సోహెల్ నేను చేయను అని చెప్పేశాడు. పనిష్మెంట్స్ గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయ్.
నా లేస్ నువ్వు తీస్కున్నావ్ ఇవ్వాలి కదా అని సోహెల్ అరియానా తో డిస్కషన్. నేను బెడ్ పక్కన పెట్టమనలేదు అని సోహెల్ అంటాడు అరియానా నేను బెడ్ పక్కన పెట్టాను నువ్వు అక్కడే పెట్టమన్నావ్ అని చెప్తుంది. నా లేస్ లేకపోతే నేను పనిష్మంట్ ఇస్తాను ఐతే అన్నాదు. సరే పనిష్మెంట్ ఏంటి అంటే అరగంటలో ఆలోచించి చెప్తాను అని అన్నాడు.
మధ్యాహ్నం బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటికి మీ ప్రయాణం సగం పూర్తయింది. ఇప్పట్నించీ ఇంటి సభ్యులందరూ అసలైన ఆటని కనపరచే సమయం మొదలైంది. ఇప్పుడు నామినేషన్ లో భాగంగా ప్రతి ఇంటి సభ్యుడికి రెండు ఎగ్స్ ఇస్తారు. సమయానుసారం ఒక్కొక్కరిని పిలుస్తారు. వారు ఇద్దరు సభ్య్ల పేర్లు చెప్పి వారి తలమీద ఎగ్స్ పగల గొట్టాలి. అరియానా కెప్టెన్ కనుక సేఫ్.
మోనల్ ఎగ్ వద్దు బిగ్ బాస్ ప్లీజ్ ప్లీజ్ నేను చేతిలో తీస్కోలేను అని రిక్వెస్ట్ చేసింది. మీ తరఫున ఎవరినైనా పగలగొట్టమని చెప్పమన్నారు.
హారిక : అరియానా లాస్ట్ టైం నామినేట్ చేసినపుడు బయటుండి ఏం చేస్తున్నారు అని అడిగా కానీ మీ మాట విన్నాను ఏం రియాక్ట్ అయి ఆర్గ్యూ చేయలేదు. ప్రతి గేమ్ లోనూ ఓట్లు పడకుండా స్కిప్ చేస్తున్నారా అనిపిస్తుంది.
అవినాష్ పిల్లల టాస్క్ అప్పుడు కూడా టీం తో ఆడకుండా ఒకరిద్దరితో వెళ్ళి ఆడుతున్నారు టీం తరఫున ఆడడం లేదు అన్నాడు. సరె ఎవరితో నేను ఉండలేదు అని అడిగింది హారిక. ఆ గేం లో నేను అభితో మాట్లాడ్డం లేదు. నేను నా కేర్ టేకర్ తోనే ఉన్నాను అని క్లారిటీ ఇచ్చింది హారిక.
సోహెల్ : అరియానా నాకు నీ కెప్టెన్సీ ఓకే. ఇది నా కెప్టెన్సీ డిఫరెంట్ లెవల్ లో చేద్దామనుకున్నా స్ట్రిక్ట్ గా ఉండాలి అని చెప్పాను మొదటి నుండీ. మళ్ళీ పనిష్మెంట్స్ గురించే డిస్కషన్ చేశారు ఇద్దరూ. నీ ఎగ్రెస్సివ్ బిహేవియర్ నాకు నచ్చలేదు అని అంది అరియానా. ఈ రీజన్ ఐతె నాకు నచ్చలేదు అని అన్నాడు సోహెల్. మళ్ళీ పాత సోహెల్ ని చూస్తున్నాం. చాలా గట్టిగా మాట్లాడాడు.
ఆటీట్యూడ్ చూపిస్తుంది అంటూ సోహెల్ అఖిల్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు పెద్దగా అరియానాకి వినపడేట్లు. ఇంకో రీజన్ చెప్తాను అంది అరియానా యాపిల్ టాస్క్ జరిగినపుడు ఫస్ట్ టూ రౌండ్స్ ఆడలేదని చెప్పాడు సో నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అన్నావు ఆ లెక్కలేసుకున్నా. మొదటి రెండు రౌండ్స్ మోసం చేశావు అంది. నాకు మాటిచ్చిన గంట తిరగకుండానే రెండు సార్లు యాక్ట్ చేశావ్
అభి : అవినాష్ టాస్క్ లో బ్రెయిన్ పెట్తి ఆడతారు ఎంటర్ట్మైన్మెంట్ ఇవ్వలేదు మిగిలిన వాళ్ళతో పోలిస్తే అంటే వెటకారంగా మీ అంట ఇవ్వలేను అని అన్నాడు అభి :-) నోయల్ తో చిల్లర కామెడి అన్నప్పుడు దాని గురించి నేను మాట్లాడుతుంటే మీరు లేచి నన్ను మాట్లాడనివ్వకుండా ఆపేశారు అది నాకు నచ్చలేదు. మీరు నాగ్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదని అన్నారు నన్ను అది నాకు నచ్చలేదు.
సోహెల్ ఎందుకో కంఫర్టబుల్ గా మీతో మాట్లాడలేకపోతున్నాను. అబద్దాల కోరు అంటేనే ఫీలవుతున్నా నువ్వేమో అక్కడ బోర్డ్స్ అన్నీ సెట్ అవుతాయ్ అని అన్నావ్ అది నాకు నచ్చలేదు. సరే ఈ రోజు నుండి నువ్వు నామీద జోక్ లు వేయకు నేను నీమీద జోక్ లు వేయను అని అన్నాడు అభి.
మోనల్ : సోహెల్ నోయల్ తో నేను డిస్కషన్ చేసినది నువ్వు టక్ టక్ అని ఒక వర్డ్ యాడ్ చేసి చెప్పావు నువ్వు చెప్పడం వల్ల నాకు అఖిల్ కి డిస్ట్రబెన్స్ వచ్చింది. మొన్నటి కేర్ టేకర్ విషయం కూడా ఇంకా బాగా చేసుండాలి అన్నాడు.
ఎగ్ విషయానికో నామినేట్ అయినందుకో కానీ మోనల్ మళ్ళీ గట్టిగా ఏడ్చేసింది.
అవినాష్ : అభి మీరు ప్రతిసారి హెల్తీ ఎంటర్టైనర్ ని అంటుంటారు తప్ప నాకైతే అలా అనిపించలేదు. ఎంటర్టైన్మెంట్ లేక పోయినా పర్లేదు కానీ ఇలా మరొకర్ని అంటూ ఎగతాళి చేస్తూ ఎంటర్టైన్మెంట్ వద్దు. మీరు కామెడీ చేయడానికి వచ్చారేమో కానీ మేం తీస్కోడానికి రాలేదు అన్నాడు. నేను వందశాతం చేస్తాను అన్నారు. మీరు చేయకుండా నేను చేయకపోతే ఎలా అని అరుస్తూనే ఉన్నాడు. నేను ఎంటర్టైనర్ ని జీవితాంతం ఇంతే చేస్తూనే ఉంటాను అని అంటున్నాడు అవినాష్. నన్ను కామెడీ చేయద్దని చెప్పడానికి నువ్వు ఎవరు అని అంటున్నాడు అవినాష్.
రేపటి ప్రోమో లో అమ్మ రాజశేఖర్ అండ్ అభి ల మధ్య డిస్కషన్ చూపించారు ఈ రోజు ఉదయం వచ్చిన ప్రోమొలో విషయాలే రేపటికి వాయిదా వేశారు. .
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.