17, నవంబర్ 2020, మంగళవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజు టాస్క్ కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్రీజ్ లు ఉన్నాయ్ అది వినగానే నాకు ఈ వీకే ఫ్యామిలీస్ వచ్చేస్తున్నారా అని కాస్త ఆశ్చర్యమేసింది. రేపటి ప్రోమోలో వస్తున్నట్లు చూపించారు కూడా. టాస్క్ అందరూ బాగా ఆడారు వెయిట్ వల్ల మోనల్ బాగా ఇబ్బంది పడ్డట్లు అనిపించింది. నాకు నచ్చిన విషయం ఏంటంటే నిన్నటి నామినేషన్స్ గొడవలు అన్ని పక్కన పెట్టి అందరు కలిసిపోవడం ఒకరినొకరు ఎంకరేజ్ చేస్కోవడం అండ్ అంతా కలిసి అఖిల్ బర్త్ డే సెలెబ్రేట్ చేయడం చాలా బావుందనిపించింది. అభి కూడా ఏం మనసులో పెట్టుకోకుండా అఖిల్ అండ్ సోహెల్ తో మంచిగా మాట్లాడాడు. అండ్ యాక్టివ్ గా ఫిజికల్ టాస్క్ పెర్ఫార్మ్ చేశాడు గివప్ ఇవ్వకుండా. ఈ రోజు ఎపిసోడ్ లో నాకు కాస్త నెగటివ్ గా అనిపించింది అవినాష్ ట్రిప్ అవడం తను మళ్ళా బాలెన్స్ కోల్పోతున్నాడనిపించింది.   

వివరాలలోకి వెళ్తే డెబ్బై రెండొవ రోజు ఈ రోజు ఎనిమిదిమంది ఉన్నారు. ఈ ఉదయం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఛల్ ఛలో ఛలో లైఫ్ సే మిలో పాటతో మేల్కొలిపారు. 

కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్. 
అఖిల్ కేప్టెన్.. ట్రంపెట్ సౌండ్ కి మూడు రౌండ్స్ మార్చ్ ఫాస్ట్ అండ్ ఎక్సర్ సైజ్
గన్ షాట్ కి పరిగెత్తుకు వెళ్ళి దాక్కోవాలి 
పవర్ సేవ్ ఫ్రీజ్ 
స్లో మోషన్ 
ఫాస్ట్ ఫార్వర్డ్
డ్రం రోల్ కి ప్లాంక్ వాక్ చేయాలి 
రిలీజ్ అనగానే రీలీజ్ అవ్వాలి. 
టాస్క్ బజర్ మోగినపుడు ఎవరు బజర్ కొడితే వాళ్ళు ఛాలెంజ్ చేసే అవకాశం వస్తుంది. ముందు ఎన్నుకుని బిబికి చెప్పాలి. ఛాలెంజ్ చేశాక స్టార్ వస్తుంది ఒకసారే బజర్ కొట్టాలి. 

ప్లాంక్ వాక్ చాలా హారిబుల్ గా ఉంది అందరూ చాలా అవస్థపడ్డారు. మోనల్ పూర్తిగా పాకలేదు మోకాళ్ళ మీద మాత్రమే పాకింది. 
డ్రమ్ రోల్ కి గన్ సౌండ్ కి పెద్ద తేడా తెలీకుండా ఉంది..

హౌస్మేట్స్ ఆర్ హావింగ్ ఫన్ కమేండో అంటూ మాట్లాడు కుంటున్నారు. హారిక మీరు బయటకి వస్తే తునుక్ తునుక్ అవుతారు అంట ఫన్నీ :-)

సోహెల్ నీ దగ్గర స్కోప్ ఉందా అంటే లాస్య నా దగ్గర బయోస్కోప్ ఉంది అంటే మరొకరు నా దగ్గర స్టెతస్కోప్ ఉంది అంట. ఫన్నీ

లాస్య హారికని మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి అంటే లెవెంత్ వీక్ లో అట్లే ఉంటుంది అంట అవినాష్ ఫన్నీ గై.. 

బిగ్ బాస్ కూడా మంచి చిలిపి మార్చ్ ఫాస్ట్ చేయించి అందరూ లోపలెక్కడో బెడ్ రూం లో ఉన్నపుడు బజర్ మోగించాడు.. సోహెల్ ఏమన్నా పరిగెట్టాడా అసలు తనే ఫస్ట్ వచ్చి బజర్ నొక్కాడు. వెంటనే మెహబూబ్ అరే మెహబూబ్ అని పిలిచాడు. గుర్తొస్తున్నాడురా.. 
తన టాస్క్ స్విమ్మింగ్ పూల్ లో వెయిట్స్ ని ఒకవైపు నుండి ఒక వైపుకి తీస్కెళ్ళాలి అని ఉంది. ఒకొక్క దాన్ని తీస్కుని ఒక వైపు నుండి మరో వైపుకి ఐదు నిముషాల్లో తీస్కెళ్ళాలి అనిచెప్పారు. అందరూ బాగా ఛీర్ చేశారు సోహెల్ చాలా కష్టపడ్డాడు కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయ్ సో ఒక్కొక్కటి అనే సరికి కాస్త కష్టమైంది. అప్పటికి ఒక్కటి తప్ప మొత్తం వేసేశాడు. 
నిన్నటి గొడవంతా పక్కన పెట్టేసి హారిక కూడా వెల్ ట్రై రా మెహబూబ్ ఉన్నా ఇంతే చేసుండే వాడేమో హి విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పడం చాలా బాగా అనిపించింది. 
  
అఖిల్ సోహెల్ మాట్లాడుకుంటున్నారు.. నడవకుండా స్విమ్ చేసుంటే చేసుండే వాడ్ని అంటున్నాడు. కానీ రాంగ్ ఛాయిస్ సెలెక్ట్ చేశావ్ రా ఆ టాస్క్ తీస్కో కూడదురా అని చెప్తున్నాడు అఖిల్. బాగా ట్రై చేశాడు అప్పటికి మళ్ళా ఇపుడు ఈ జడ్జిమెంట్ లు అవసరమా అనిపించింది నాకు. 

సెకండ్ టైం బజర్ మోగినపుడు అఖిల్ పరిగెట్టుకు వెళ్ళి ఫస్ట్ నొక్కాడు. పోల్ ను వాటేసుకునే టాస్క్ చేస్తా అన్నాడు. చేస్తుంటే సోహెల్ నాలోనె పొంగెను నర్మద పాడుతున్నాడు. అఖిల్ బానే కష్టపడుతున్నాడు. సోహెల్ కిందకు దిగితే చంపుతా అని అంటున్నాడు. 
ఒక కాలు మీద కొంత సెపు మరో కాలు మీద కొంత సేపు నిలబడ్డాడు. ఫైనల్లీ హి డిడ్ ఇట్.. 

లాస్య హారిక అభి మనం కొడతామంటారా అని అంటుంటే ముందు బజర్ కొడదాం తర్వాత టాస్క్ గురించి ఆలోచిద్దాం అంటుంది లాస్య. 

బజర్ ముందు నిలబడి దండంపెడతా కాల్మొక్తా బజర్ సౌండ్ ఇవ్వండి బిగ్ బస్ అని అంటున్నాడు.   

సోహెల్ అండ్ అఖిల్ మాట్లాడుకుంటూ హారిక మోటివేట్ చేయడం బాగా అనిపించింది అంటున్నాడు సోహెల్ అండ్ అఖిల్ నువ్వు సారీ చెప్పడం కూడా బావుంది నిన్న. మనం అంతేరా అలా కరిగిపోతాం అని అంటున్నాడు :-)

మోనల్ మాములుగా కష్టపడడం లేదు.. ప్లాంక్ వాక్ లో చాలా ఇబ్బంది పడుతుంది. రోలింగ్ ట్రై చేస్తుంది. 
పవర్ సేవ్ అని చెప్తే అంటే ఏంటి అని అనుకుంటున్నారు. మర్చిపోయారు అందరూ.. 

అవినాష్ ఓపెన్ చేసున్న గ్లాస్ డోర్ క్లోజ్ చేసి దాని వెనక దాక్కొంటున్నాడు ఓపెన్ గా ఉన్న తలుపు సో అది దాక్కోడం కాదు అని అంటున్నాడు అభి. అందరూ నువ్వు పొజిషన్ మార్చుకున్నావ్ కనుక అందరూ మార్చుకున్నారు అని చెప్తున్నారు. 

అభి అవినాష్ అరియానా పొజిషన్ మార్పు.. నాకు సెన్స్ లేదు మీకు కూడా లేదా అని అన్నాడు అవినాష్ అభి ఆమాట దగ్గర ట్రిగ్గర్ అయ్యాడు.    
అరియానా మీద కాసేపు అరిచాడు నువ్వెందుకు నా పేరు చెప్తావ్ అని అవినాష్ అరియానా క్లియర్ గా చెప్పే మాటలని పట్తించుకోడం లేదు ఊరికే అరిచేస్తున్నాడు. 

ఈ సారి అభి బజర్ కొట్టాడు మంకీబార్ సెలెక్ట్ చేస్కున్నాడు. అవినాష్ వెనక ఉన్నప్పుడు బజర్ మోగుతుందట.. అనుకున్నా అనుకున్నా అని ఆవేశపడిపోతున్నాదు.

కెప్టెన్ తప్ప ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఇక్కడ అని అంటున్నాడు. 

అభికి మంకీబార్ మీద కాళ్ళు చేతులు వేసి పది నిముషాలు వేలాడాలి. బాగా లాక్ చేశాడు రెండు చేతులు అండ్ రెండు కాళ్ళు హారిక దిగితే చంపేస్తాను జనాలు కూడా చంపేస్తారు అని అంటుంది. 
ఈజీగా చేసేశాడు పది నిముషాలు. ఇంకా కాస్త ఎక్కువ ఉన్నాడు.. ఉండి దిగాక ఈ సారైనా నామినేట్ చేయకండి బాస్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా నేను అని అంటున్నాడు. 

లాస్ట్ ఛాన్స్ లో అవినాష్ చాలా ఫాస్ట్ గా పరిగెట్టాడు కానీ తాడు అడ్డం వచ్చి కింద పడ్డాడు. హారిక కొట్టేసింది. 
టైర్ ఛాలెంజ్ తీస్కుంది. పదిహేను నిముషాల్లో పది రౌండ్స్ చేయాలి గ్రౌండ్ లో ఒక వైపు నుండి మరో వైపు ఫ్లిప్ చేయాలి. ఇటునుండిఅటు అటునుండి ఇటు ఒక రౌండ్. బాగానే కష్టపడింది కానీ చేసింది. సోహెల్ కూడా ఇచ్చిపడేయ్ అని చెప్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. పదిహేను నిముషాలు ఇస్తే ఎనిమిది నిముషాల నలభై ఎనిమిది సెకండ్స్ లోపే చేసేసింది ఆల్మోస్ట్ హాఫ్ టైమ్.  

నాలుగు బజర్ యాక్టివిటీస్ అయ్యాక నైట్ మళ్ళీ ట్రంపెట్ మోగితే అరియానా వాఅ.. ఈ టాస్క్ ఇంకా అవ్వలేదా బిగ్ బాస్ ఏ పార్ట్ పని చేస్తుందో తెలీడం లేదు అని ఏడ్చేస్తుంది 
  
నైట్ పదకొండుకు అఖిల్ కోసం మోనల్ కేక్ బేక్ చేసింది. అఖిల్ వన్ అని రాసిందంట. 

అందరూ హాపీ బర్త్ డే సాంగ్ పాడుతుంటే అందులో అభి "మెనీ గర్ల్ ఫ్రెండ్స్ టూ యూ అని" యాడ్ చేసి పాడుతున్నాడు బావుంది. 

నైట్ పడుకునే ముందు అఖిల్ కి హగ్ బుగ్గమీద బోల్డు ముద్దులు పెట్టింది మోనల్ బర్త్ డే విషెస్ చెప్తూ.. ఆహా రోజు నా బర్త్ డే వస్తే బావుండు అని అంటున్నాడు అఖిల్ మొదటి సారి ఇక్కడ ముద్దు పెట్టావ్ కదా అంటే హా బర్త్ డే స్పెషల్ అని చెప్తుంది. క్యూట్ మొమెంట్ బావుందనిపించింది. 

రేపటి ప్రోమోలో కూడా ఇదే టాస్క్ కంటిన్యూ చేస్తున్నారు. ఫామిలీలు వస్తున్నారు. రేపు ఫుల్ ఎమోషనల్ ఎపిసోడ్ అవబోతుందనుకుంటా. ఫ్రీజ్ రిలీజ్ అని ఈ రోజు టాస్క్ లో అన్నపుడే నాకు అనుమానం వచ్చింది ఫామిలీ విజిట్ ఉంటుందేమో ఈ వీక్ అని. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts