21, నవంబర్ 2020, శనివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడచ్చు. నాగ్ వచ్చాడయ్యో సామీ పాటాతో ఎంటర్ అయ్యారు. ముందుగా నిన్నటి వివరాలు చూపిస్తున్నారు. మోనల్ రియలైజేషన్ ఫ్రెండ్షిప్ కాదు ఎవరి గేం వాళ్ళే ఆడాలి అని తనకి తానే చెప్పుకుంటుంది. బాగానే రియలైజ్ అయింది కానీ చాలా ఆలశ్యంగా రియలైజ్ అయిందా అనిపించింది. కాకపోతే ఇప్పటికైనా అవడం నాట్ బాడ్.    

రాత్రి మైక్ అనౌన్స్మెంట్ వచ్చినందుకు ఎగ్స్ ఇవ్వను అని చెప్తే అఖ్ఖిల్ అండ్ సోహెల్ కి.. తర్వాత మోనల్ కి కూడా పనిష్మెంట్ ఇస్తూ తనకి మీ ఇద్దరు హెల్ప్ చేయండి అని అడిగింది. దానికి మేం చేయం అని చెప్పి హారికని కెప్టెన్ అవితే కొమ్ములొచ్చేస్తాయ్ అని అన్నాడు అఖిల్ అది కూడా ఎదురుగా కాదు తను వెళ్ళిపోయాక. ఇది బాలేదు అనిపించింది. అభి తో కొట్లాడుతున్నది ఇలా ఎదురుగా కాకుండా వెనక మాట్లాడుతున్నండుకే కదా మరి ఇపుడు నువ్వు చేసిందేంటి అని అనిపించింది.  

రియల్ మాంగో జ్యూస్ టాస్క్ వచ్చింది. అవినాష్ పోటీ అనేదే లేకుండా గెలిచాడు. అందరికన్నా ముందు అందుకుని తాగేశాడు ఫుల్ గా.. మిగిలినవాళ్ళకి ఇంకా పట్టుకోవడం కూడా రాలేదు. అరియానా సెకండ్ కాచ్ చేసింది కానీ పూర్తి చేయలేకపోయింది.  

ఒకొక్కళ్ళని ఒకో ప్రశ్న అడుగుతాను మీరు నిజాయితీగా జవాబిస్తె మీ ఫామిలీని పిలుస్తాను. 
 

అఖిల్ కి ఎందుకు అంత కోపం వచ్చిందని అడిగారు. సపోట్ చేయడం అంటే పక్కన నుంచుని సపోర్ట్ చేయచ్చు కానీ తను ఇవ్వలేదు అని చెప్పాడు. సోహెల్ ని ఈ మధ్య నువ్వు బాగా మాట్లాదుతున్నావ్ కదా హారికతో ఈ రకంగా దించేసి సపోర్ట్ చేశావా అని జోక్ చేశారు. 

హారిక కి టాప్ టూ పొజిషన్ లో ఉంటే ఎవరు నీ పక్కన ఉండకూడదు అని అనుకుంటావు అని అడిగారు. వన్ ఎవరు కాకపోవచ్చు అని అంటున్నారు. అవినాశ్ కి ఇచ్చింది. తన కోసం తన బ్రదర్ అండ్ ఫెండ్ వచ్చారు. 

హారికని ఎందుకు అంత ఏడ్చావ్ అని అడిగారు. అమ్మకి చిన్న దెబ్బలు లాగా తగిలాయ్ అవి ఎందుకా అని అనుమానంతో ఏడుపొచ్చింది అని చెప్పింది. అలాంటిదేం లేదు నీకోసం ఒక కుక్క పిల్లని తెచ్చాం దానితో ఆడుకుంటూ సోఫా తగిలి దెబ్బతగిలింది అంతే అంతకన్నా ఏం లేదు అని చెప్పాడు బ్రదర్.

టాప్ ఫైవ్ ఎవరుంటారు అని అడిగారు హరిక, అభి, లాస్య, సోహెల్ అరియానా లను సెలెక్ట్ చేశారు. బలం కండలలో కాదు బుద్దిలో ఉంటుంది షీ ఈజ్ ఇంటెలిజెంట్ అని చెప్పారు నాగ్.    

అఖిల్ వాళ్ళ అన్న అండ్ వాళ్ళ అబ్బాయ్ వచ్చారు. ముందొకలా వెనక ఒకలా ఉండేది ఎవరు అని అడిగారు అభి అని చెప్పాడు. దానిని గురించి అభి మాట్లాడాడు గొడవ నాకు ఇష్టం లేదు స్క్రీన్ లో చూసేసరికి ఇలా ఫీలవుతున్నాదు. చిన్న విషయం కాదు పెద్ద ప్రక్రియ నిప్పుతో ఆడుకుంటున్నాడు మేక అనేది ఒక ఉదాహరణగా తీస్కున్నా తప్ప మరో ఉద్దేశ్యం లేదు. అని క్లియర్ గా మాట్లాడాడు. నన్ను మాట్లాడనివ్వడం లేదు అని నాగ్ ని పర్మిషన్ అడిగాడు అఖిల్ ని నాగ్ ఆపేశాక అభి  మాట్లాడాడు. అఖిల్ కూడా ఎవరు గొడవ పెట్టుకోరు అని చెప్తున్నాడు. ఆయనతో మాట్లాడితే గొడవే ఆవుతుంది అని చెప్తున్నాడు అభి.
 
టాప్ ఫైవ్ సోహెల్, అఖిల్, అభి, అరియానా, అవినాష్ ని సెలెక్ట్ చేశారు. 

అరియానా కోసం వాళ్ళ సిస్టర్ అండ్ ఫ్రెండ్ కార్తీక్ ఇద్దరు వచ్చారు. అందరిలో షోకోసం అన్ని విధాల అతి తక్కువ కృషి చేసింది ఎవరు అని అడిగారు. మోనల్ అని చెప్పింది.ఈమధ్య బాగా కనిపిస్తుంది కానీ అది వరకు పరిమితంగానే ఉండేది అని ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వేది కాదు అని చెప్పారు. ముందు నువ్వు నాతో మాట్లాడండి నన్నే చూడండి అరియానాతో మాత్లాడకూడదు అని కాసేపు నవ్వించారు
ఆవేశాన్ని ఆపగలరు కానీ అభిమానాన్ని ఆపలేరు అని మృగనయని డైలాగ్. 

టాప్ ఫైవ్ అరియానా, అఖిల్, సోహెల్, హారిక, అవినాష్ ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే సోఫాలో ఎపుడో రాశారు తర్వాత ఏం ఎంటర్టైన్ చేశాడు చెప్పు అని అడిగారు నాగ్. 

లాస్య వాళ్ళ అమ్మ గారు వచ్చారు. సేఫ్ గేం మాత్రమే ఆడుతూ ఇంతవరకూ నెట్టుకొచ్చింది ఎవరూ అని అడిగారు. అవినాష్ ని చెప్పింది. అందర్ని ఎంటర్టైన్ చేస్తూ నామినేట్ అవకుండా ఆ టెన్షన్ తీస్కోకుండా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పింది. 

టాప్ ఫైవ్ లాస్య, అభిజిత్, సోహెల్, అఖిల్, హరిక 

సోహెల్ కోసం రామారావ్ అన్న వచ్చారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళాక ఎవరితో స్నేహాన్ని కొనసాగించలేరు. అభిజిత్ అన్నాడు. మాదంతా కల్లు గుడాల్ తాగే బాచ్ మాది ఆయన్దేమో గ్లెన్ ఫిడిచ్ లాంటివి తాగుతాడు. కానీ ఆయన కూడా వచ్చే అప్పుడు వస్తాయ్ అని అన్నాడు మాస్ గా మారిపోతున్నా అన్నాడు అభి కూడ. నాకు అన్న లేడు కానీ అంతగానే చూసుకుంటాడు రామారావ్ అన్న అని అన్నాడు. 

టాప్ ఫైవ్ సోహెల్, అభి, అఖిల్, అవినాష్, అరియానా. 
నైన్ తర్వాత మనోడి కత వేరుంటది అని ఛాట్ చేస్తాడని ఫుల్ డీటేయిల్డ్ ఛాట్ ఇచ్చిపడేశాడు. అయ్యో ఇజ్జత్ తీస్తున్నావ్ అని అన్నాడు. 

అందరిలోకి స్వార్థపరులు ఎవరు అని అడిగారు. గెలవడానికి ఏమైనా చెప్పాలన్నా చెప్పదు అంతా దాచిపెట్టుకుంటుంది అని చెప్పాడు. ఎక్స్ప్రెసివ్ కాదంటే అది సెల్ఫిష్ ఎలా అవుతుంది అని అన్నారు నాగ్. లేదు నువ్వు జెన్యూన్ గా చెప్పలేదు ఫ్యామిలి రాదు ఆన్నాడు.

అభిజిత్ తో నిన్న సామెత చెప్పి ఇంతకీ గథా ఎవరు అని అడిగారు. హారికనే అని అన్నాడు ఖుదా అంటే ఎవరంటే బిగ్ బాస్ అని చెప్పాడు. వాళ్ళ నాన్నగారు మామ వచ్చారు. తన పెర్ఫార్మెన్స్ బావుంది అని చెప్పారు నాన్న. సినిమాల్లోకి రాడం ఇశ్టం లేదంట కదా బిగ్ బాస్ లోకి రావడం ఎలా అని అడిగితే సినిమాలు నేను చూడను అని చెప్పారు. 

టాప్ ఫైవ్ అభి, సోహెల్, హారిక, అఖిల్, మోనల్ నిన్న పెర్ఫార్మెన్స్ తో నీకు ఫిఫ్త్ ప్లేస్ ఇస్తున్నా అని చెప్పారు. అఖిల్ నిన్న కోపం తెచ్చుకోకుండా ఉంటే సెకండ్ లో ఉండే వాడివి అని అన్నారు.

మోనల్ కోసం వాళ్ళ మమ్మీ వచ్చారు. ఇంట్లో ఎవరిని నమ్మకుండా ఉంటే బావుండేది అనుకున్నావ్ అని అడిగారు అభికి ఇచ్చింది. మొదటి వారం నుండీ ఫెండ్స్ కానీ తర్వాత నా వెనక మాట్లాడుతున్నాడు. కామెల్ అని ఇంకా వేరే వేరే పేర్లు పెడుతున్నాడు. మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఫ్రెండ్స్ కాదు అని అన్నారు. నాదీ సేం ఫీలింగ్ అని అన్నాడు అభి. తను ఏడుస్తుంటే అభి నే టిష్యూ ఇచ్చాడు. అఖిల్ ఉనాడు తోడుగా అంటే అఖిల్ ఒక్కడే కాదు ఇంకా అందరూ ఉన్నారు అని చెప్పారు ఆవిడ. నాగ్ కి గణేశా బొమ్మ గిఫ్ట్ ఇచ్చారు. మీరంటే చాలా ఇష్టం అని చెప్పారు. 
 
టాప్ ఫైవ్ అభి, మోనల్, అఖిల్, లాస్య, సోహెల్. 

అవినాష్ దగ్గరకి వచ్చారు మళ్ళీ లాస్యగురించే మళ్ళీ చెప్పాడు. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. 

హౌస్ లో లాస్ట్ త్రీలో ఎక్కువ ఓట్లు వచ్చినది మోనల్ కి ఐదు లాస్య కి నాలుగు అవినాష్ కి నాలుగు వచ్చాయ్ ఈ ముగ్గురికి. మీ ముగ్గురికి మోస్ట్ నంబర్స్ వచ్చాయ్ కనుక మీ ఫేవరెట్ ఐటమ్స్ తీస్కురండి అని చెప్పారు. లాస్య పాపం జున్ను గాడి ఫోటో తెచ్చింది. వాటిని స్టోర్ రూం లో పెట్టమన్నారు. బిగ్ బాస్ మీ ఆటతీరు చూస్తారు మళ్ళీ తెచ్చిస్తారు అని చెప్పాడు నాగ్. 

టైమ్ టు సేవ్ వన్ హార్ట్ కి నామినేటెడ్ ఫేసెస్ ఉన్న కత్తులు ఉన్నాయ్. ఈ వీక్ లో ఎక్కువ నంబర్ ఆఫ్ వోట్స్ వచ్చాయ్ తొమ్మిదిన్నర కోట్ల వోట్లు వచ్చాయ్ అని చెప్పారు. 
డాగర్ టిప్ గ్రీన్ ఉంటే సేవ్ రెడ్ ఉంటే నాట్ సేఫ్. సోహెల్ ఈజ్ సేఫ్...  
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts