ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ అందులో చూడవచ్చు. నా అభిప్రాయాలు వీడియోలో మాత్రమే ఉంటాయ్.
నిన్న అంత ఎంటర్టైన్మెంట్ తో సాగిన ఎపిసోడ్ తర్వాత ఈ రోజు కాస్త నీరసంగానే అనిపించింది. రేస్ టు ఫినాలే మొదలైంది కనుక ఇకపై కెప్టెన్ ఉండరని ఎనౌన్స్ చేశారు. బెస్ట్ అండ్ వర్స్ట్ కెప్టెన్ ని ఎన్నుకోమన్నారు. హారిక బెస్ట్ అరియానా వర్స్ట్ గా ఎన్నుకున్నారు హౌస్మేట్స్.
లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఐన దెయ్యం టాస్క్ లో పెర్ఫార్మెన్స్ బాలేనందున కాన్సిల్ చేశాఋ. హ్య్ండాయ్ ఐ ట్వంటీ కార్ ని హౌస్ లోకి తెచ్చి లాంచ్ చేయించి మోడలింగ్ చేయించారు.
వివరాలలోకి వెళ్తే ఈ రోజు ఇంట్లో 82 వ రోజు.. మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఉదయం ఓబేబీ సినిమాలోని టైటిల్ సాంగ్ తో మేల్కొలిపారు.
మోనల్ యోగాసనాలు వేస్తుంది. అవినాష్ యా నేను కూడా వేస్తాను మనమేం తక్కువనా అని తను కూడా వేయడానికి వచ్చాడు కానీ సొంతంగా వల్ల కాలేదు. సోహెల్ వచ్చి బలవంతంగా చేయించాడు ఫన్నీ మొమెంట్ :-)
లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఫెయిల్ అయింది అత్యంత నిరాశాజనకంగా ఉంది. ఇక్కడ ఏం జరిగినా బిగ్ బాస్ అనుమతితోనే జరుగుతుందని మర్చిపోయి టాస్క్ లెక్క చేయకుండా వైల్డ్ కార్డ్ కోసం వెతికారు. అభి నిరాకరించాడు వరస్ట్ పెర్ఫార్మర్ గా బిగ్ బాస్ ప్రకటిస్తున్నారు. ఈ కారణంగా లగ్జరీ బడ్జెట్ లభించదు. పన్నెండు వారాల తర్వాతైనా కాస్త తెలివిగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. ఎక్కడ పొరబాటు చేశారో అందరూ ఆలోచించి చెప్పండి అన్నారు.
అభిజిత్ పర్సనల్ గా హర్ట్ అయ్యాను ఒకరిని ఏడిపించాను అని అన్నారు దానికి నేను హర్ట్ అయ్యాను పర్సనల్ గా తీస్కోడం వల్ల చేయలేకపోయాను.
అవినాష్ అందరిని అనకండి అన్నాడు ఎవరైన ఫోన్ లిఫ్ట్ చేస్తే మీరు నామినేట్ అయ్యారు అని అంటారేమో అలాంటి సర్ ప్రైజ్ లు ఉంటాయని భయపడి ఆగిపోయాం అని అన్నాడు.
అరియానా నేనైతే విల్లింగ్ గానె ఉన్నాను అని చెప్తుంది.
సోహెల్ మీరే చెప్పండి మేం ఎక్కడ తప్పు చెశామో అని అడుగుతున్నాడు.
రేస్ టు ఫినాలే మొదలైంది. ఇక ఇక్కడ్నుంచి కెప్టెన్ ఉండరు బ్యాండ్ కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది.
ఇంటి సభ్యులు ఎదుర్కొన్న సవాళ్ళు అమలుపరిచిన నియమాలు తమ బాధ్యతలను సమర్ధవంతంగ నిర్వర్తించారా అన్న వాటిని దృష్టిలో పెట్టుకుని ఉన్న వారిలో ఒక బెస్ట్ అండ్ వర్స్ట్ కెప్టెన్ ని ఎన్నుకుని కెప్టెన్సీ బ్యాండ్ కి వీడ్కోలు ఇవ్వండి.
కెప్టెన్సీ గురించి అందరు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు నాకు కెప్టెన్సీ కష్టపడితే వచ్చింది అని చెప్పుకుంటున్నారు.
సోహెల్ అండ్ హారిక చెరి రెండు ఓట్స్ వచ్చాయ్ అరియానా హారికకి వేయడంతో బెస్ట్ కాప్టెన్ గా హారికని ఎన్నుకున్నారు.
వరస్ట్ కాప్టెన్ గా అవినాష్ అఖిల్ ని సెలెక్ట్ చేశాడు పనిష్మెంట్స్ చూపించలేదు అని అంటున్నాడు నాకు అసలు పనిష్మెంట్ అనౌన్స్మెంట్ లు రాకపోతే నా తప్పేంటి అన్నాడు.
వరస్ట్ పెర్ఫార్మెన్స్ కి అఖిల్ పేరు చెప్తే అసలు తీస్కోలేకపోతున్నాడు.
అభి అఖిల్ పేరు చెప్పాడు లక్ బేస్ గా సెలెక్ట్ అయ్యావ్ కాబట్టి అని. బిగ్ బాస్ క్లియర్ గా చెప్పారు చేసిన పనులను బట్తి సెలెక్ట్ చేస్కోండి అని కానీ ఎన్నికైన ప్రాసెస్ ని బట్టి అభి చెప్పడం బాలేదు ఒక రకంగా బిగ్ బాస్ ని అవమానించినట్లు ఐంది ఆ ప్రాసెస్ ని తప్పు అనడం ద్వారా.
అరియానా ని వరస్ట్ కాప్టెన్ గా తీస్కున్నారు.
అందరూ ప్రతిజ్ఞ చేశారు ప్రతి ఒక్కరు కేప్టెన్ గా ప్రవర్తిస్తూ నియమాలు పాటిస్తూ పరిశుభ్రంగా ఉంచుతామని ప్రమాణం చేస్తున్నాం అని చెప్పారు.
ఒకరి తర్వాత ఒకరు కెప్టెన్ అయినందున అభినందిస్తున్నాం అని అంటూ బ్యాండ్ ఒకరి తర్వాత ఒకరు అయిన ఆర్డర్ లోనే తగిలించుకుని పాస్ చేస్తూ బ్యాండ్ కి వీడ్కోలు చెప్పారు..
అరియానా వర్స్ట్ అని ఎన్నుకున్నందుకు చాలా ఫీలవుతుంది. నువ్వు కెప్టెన్ అయ్యావ్ నేను కాలేదు నాకంటే బెటరే కదా అని అభి చెప్తుంటే అరియానా ఒప్పుకోలేదు నువ్వు బెటర్ పర్సన్ వి అని అంటుంది. ఒక మనిషి బాధ పడుతుంటే అభిజిత్ తనని తాను తగ్గించుకుని మరీ ఓదార్చడం నాకు చాలా నచ్చేసింది. వావ్ అభి నీలో ఈ ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందా అనిపించింది.
సోహెల్ సెకండ్ టైం అవినాష్ పేరు సెలెక్ట్ చేయడం మోనల్ కి నచ్చలేదు అదే విషయంలో సోహెల్ ని కోప్పడుతూ మాట్లాడుతూ ఛీ అంది దాంతో సోహెల్ కి కాస్త మండినట్లుంది మేం ఛీ అమ్మా మేం గలీజ్ గాళ్ళం వదిలేయ్ అని అంటూ సీరియస్ అయ్యాడు.
హ్యుండయ్ ఐట్వంటీ కార్ టాస్క్ ఇచ్చారు.
ఇంటి సభ్యులు మూడు జంటలుగా విడిపోవాలి ఒకరు ఫోటోగ్రాఫర్ ఒకరు మోడల్ ఒకరు జడ్జ్.
ఒకో ఫీఛర్ ని మోడల్ తో ఫోటోగ్రాఫ్స్ తీయాలి.
అందరూ వావ్ ఎన్ని రోజులు ఐంది కార్ ని చూసి అని ఆశ్చర్యపోతున్నారు.
సోహెల్ మోనల్ ఒక జంట అభి అరియానా ఒక జంట హారిక అవినాష్ ఒక జంట గా ఫోటోస్ తీశారు.
అవినాష్ మోనల్ కి పాట అర్థం చెప్తున్నా అని అంటూ తనని ని పొగుడుతూ ఫ్లర్ట్ చేస్తుంటే పక్కనుండి అఖిల్ పంచ్ లు వేస్తున్నాడు.
అరియానా అవినాష్ ని మాట్లాడద్దని అందట అవినాష్ హర్ట్ అయ్యాను అని చెప్తున్నాడు.
అఖిల్ జడ్జ్ మోనల్ సోహెల్ అండ్ హారిక అవినాష్ లు ఇద్దరికి టై అయింది అభి వాళ్ళు కూడా బాగా చేశారు కాకపోతే లాస్ట్ ఫోటో తేడాపడింది అని చెప్పి హరిక అవినాష్ ని విన్నింగ్ కి సెలెక్ట్ చేశాడు.
అవినాష్ అరియానాకి సారీ చెప్పాడు నాక్కూడా కొంచెం అనిపించాలి కదా స్పేస్ కావాలి అని అంటుంది అరియానా.
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.