ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. నా అభిప్రాయం వీడియోలో మాత్రమే వినవచ్చు.
చాలా రోజుల తర్వాత ఈ రోజు మనం ఒక ఎంటర్టైనింగ్ రియాలిటీ షో చూస్తున్నాం అని అనిపించింది బిగ్ బాస్ చూస్తుంటే. హిలేరియస్ ఎపిసోడ్. అఖిల్ అండ్ సోహెల్ ఇద్దరి పెర్ఫార్మెన్స్ చాలా బావుంది. అఖిల్ టాస్క్ లో కూడా అదరగొట్టేస్తే స్కేరీ రూం టాస్క్ లో మాత్రం సోహెల్ అండ్ అఖిల్ ల ఎపిసోడ్ చూసి తీరాల్సిందే.
ఒక హార్రర్ సినిమా చూపిస్తూ మధ్యలో ఈ స్కేరీ హౌస్ లోకి పంపించడం వెరీ గుడ్ స్ట్రాటెజీ లేదంటే నిన్నటిలాగే కామెడీ చేస్కునే వారేమో హౌస్మేట్స్. ఆ హార్రర్ సినిమా వల్ల పూర్తిగా ఆ మూడ్ లోకి వెళ్ళడం వల్ల నిజంగానే భయపడినట్లు కనిపించింది. అండ్ ఈ టాస్క్ లో మోనల్ ధైర్యం చూస్తే మాత్రం వావ్ అనిపించింది వెరీ నైస్ అసలు అమేజింగ్ గా చేసింది తను.
వివరాలలోకి వెళ్తే 80 వ రోజు రాత్రి హారిక మోనల్ మాట్లాడుకుంటున్నారు. చాలా సార్లు అభి రాంగ్ కూడా ఉంటాడు కానీ అది ఒప్పుకోడు. నేషనల్ టెలివిజన్ లో నాతో లింకప్ చేయకు అని స్టేట్మెంట్ ఇచ్చాడంటే నేనెందుకు ట్రై చేస్తాను. నీ ఫ్రెండ్ కాదు మాట్లాడతాను అంతే అని అంటే ఎంత హార్ష్ స్టేట్మెంట్ అని చెప్తుంది మోనల్.
మిర్చి మిర్చి లాంటి కుర్రాడే పాట వచ్చింది సోహెల్ వెంటనే పరిగెట్టుకు వెళ్ళి పోల్ డాన్స్ చేస్తున్నాడు. అదరగొట్టేశాడు కుర్రాడు. ఈ పాట రాగానే హారిక మోనల్ పక్కనుండి పోల్ దగ్గరకి పరిగెట్టడం చూస్తే హమ్మయ్య బిగ్ బాస్ బతికించారు నన్ను అన్నట్లే పరిగెత్తింది :-)
ఇంట్లో మీ ప్లేట్స్ అన్నీ లాగేస్కుని అరిటాకులు పెట్టాను మిమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెడతాను లైట్స్ వెలుగుతు ఆరుతు ఉన్నపుడు చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉండాలి. లైట్సాఫ్ అయ్యాక నాకోసం ఒక సభ్యుడిని ఎంచుకోవాలి అతను గార్డెన్ ఏరియాలో లాంతరు పట్టుకుని నవ్వుతూ ఒంటరిగా కూర్చోవాలి నే చెప్పింది చెప్పినట్లు చెయ్యకపోతే కథ వేరే ఉంటుంది.
లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇది సైలెంట్ గా చేయడమే అని అనుకున్నారు అందరూ.
అవినాష్ వెళ్ళి బయట కూచుంటా అన్నాడు.
మోనల్ అఖిల్ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అందరూ చెప్పేవాళ్ళే కానీ చేసే వాళ్ళు కాదు అని చెప్తుంది మోనల్. సోహెల్ ఎవరితో ఎలా మాట్లాడితే మంచి ఫీలింగ్ వస్తుంది అని ఆలోచించి ఆడతాడు అని చెప్తుంది మోనల్. అఖిల్ అదే కావాలి కదా గేం కావాలి అంటాడు అఖిల్ నా పెర్స్పెక్టివ్ లో ఐతె స్ట్రాటెజీ అయుండచ్చు నాతో ఎలా ఉంటున్నాడో అదే నాకు ముఖ్యం అని అంటున్నాడు.
తెల్లవారు ఝూమున నాలుగింటపుడు అవినాష్ జలజతో మాట్లాడుతున్నాడు రాత్రంతా ఇక్కడే నవ్వుతూ ఉండమన్నావ్ పడుకున్నావా నువ్వు అని అడుగుతున్నాడు.
ఐదున్నరపుడు అందరూ మంచి నిద్రలో ఉండగా దెయ్యం ఏడుపు వినిపించింది లైట్స్ ఆన్ ఆఫ్ అవుతుంది. నవ్వుతూ చప్పట్లు కొట్టారు అందరూ హారిక ఏదో ఓ పిచ్చి జోక్ చెప్పింది.
81 వ రోజు ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
ఉదయం సూర్య రాక్షసుడు సినిమాలో బూచి బూచి బూబూచాడే పాటతో మేల్కొలిపారు.
పొద్దున్న పొద్దున్నే అఖిల్ స్మోకింగ్ ఏరియాలో ఏడుస్తున్నాడు. అవినాష్ అరియానా కలిసి కన్సోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో వాళ్లు గుర్తొచ్చారా.. స్ట్రెస్సా ఏమైంది అని అడుగుతున్నారు కానీ తనేం చెప్పట్లేదు.
అరియానా అభి మాట్లాడుకుంటున్నారు కనెక్షన్ గురించి అనుకుంటున్నారు. ఇంగ్లీష్ లో మాట్లాడాడు అనౌన్స్మెంట్ వచ్చింది. జలజ తలకిందకి కాళ్ళు పైకి అని చెప్పింది. తలకిందులుగా శీర్షాసనం వేసి అఆలు చెప్పించారు అరియానా ప్రాంప్ట్ చేస్తూ.
దెయ్యం తన స్నేహితులు అరియానా అవినాష్ అండ్ సోహెల్ ని ఆవరించబోతున్నారు. ఇంట్ళొ ఒక పాప, చేయి, కాలు బొమ్మ పెట్టున్నాయ్ వాటిని స్విమ్మింగ్ పూల్ లో వేస్తే మనుషులు విజేతలు. ఒకోదాన్ని పడేశాక ఒకరిని మార్ఛేస్కోవచ్చు.
తలుపులు మూయడానికి వీల్లేకుండా అడ్డుగా నుంచున్నారు.
కాలు బొమ్మ అఖిల్ కి దొరికింది స్విమ్మింగ్ పూల్ లోకి విసిరేశాడు సోహెల్ ని మార్చేశారు.
పాప బొమ్మ తీస్కుని ట్రై చేశారు కానీ అవినాష్ అరియానా అడ్డుపడి లాక్కుని బయటికి విసిరేశారు. చేతిని దొరికించుకుని పడేశాడు అఖిల్ చాలా ఫాస్ట్ గా పరిగెట్టాడు.
మూడుబొమ్మలని స్విమ్మింగ్ పూల్ లో విసిరేసి దెయ్యాలని మనుషులగా మార్చిన కారణంగా మనుషులు విజేతలు.
అవినాష్ జలజ రా అని పిలుస్తున్నాడు వదలబొమ్మాలి అని అంటూంటే నవ్వు వినిపించింది. అరియానా భయపడింది. అవినాష్ కూడా భయపడ్డాడు.
జలజ హర్రర్ సినిమా చూపించబోతుంది. మధ్యలో సినిమా ఆపి తనకిష్టమైన సభ్యులను కన్ఫేషన్ రూమ్ కి పిలుస్తుంది. అక్కడ ఒక స్పూన్ ని వెతికి బయటికి తీస్కురావాలి.
రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన పన్నెండవ అంతస్థు సినిమా చూపిస్తున్నారు. అందరూ సీరియస్ గా చూస్తున్నారు. అరియానా సౌండ్స్ కి ఉలికి పడి మోనల్ ని పట్టుకుంటుంది.
ఫస్ట్ బ్రేక్ లోనే అరియానా ని పిలిచింది. తర్వాత అవినాష్ ని పిలిచింది. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. అరియానా చాలా భయపడుతుంది నో నేను రానంటే రాను అని అంటుంది. సోహెల్ ఏం కాదు అని అంటూ కోప్పడుతూ ధైర్యం చెప్తున్నాడు. కన్ఫేషన్ రూం చీకటిగా ఉంది స్కేరీ హౌస్ టైప్ లో.. ఏం కనపడడం లేదు. లైట్ ఉంటే లోపలికి వెళ్తుంది లేదంటే వెళ్ళడం లేదు. ఆఆఆ అని అరుస్తుంది. బయట నుండి సోహెల్ అఖిల్ ఇద్దరూ నవ్వుతున్నారు. ఒక స్పూన్ దొరికింది. అరియానా ఆల్మోస్ట్ ఫెయింటెడ్. హిలేరియస్ ఎపిసోడ్ మొత్తానికి.
ఈ సారి మోనల్ ని పిలిచింది. చాలా ధైర్యంగా వెళ్ళింది చీకట్లో కూడా భయపడలేదు. లైట్ లేదు కదా స్పూన్ ఎలా కనిపెట్టాలి అని అడుగుతుంది. డోర్ తీసి లోపలికి చూస్తుంది రక రకాల సౌండ్స్ తో భయపెడుతుంది రా అని పిలుస్తూ.. లైట్ ఆన్ చేయండి లోపలికి వస్తా అని అంటుంది. మోనల్ అని అరిస్తే ఎందుకు అరుస్తున్నావ్ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది. లైట్ లేకపోయినా బ్లడ్ లాంటి జెల్ ని చేత్తో అలాగే పట్టుకుని వెతికి స్పూన్ కాచ్ చేసింది. వెరీ బోల్డ్ అస్సలు ఏమాత్రం భయపడలేదు తొణక లేదు బెణక లేదు.
సినిమా ఐపోయింది. సోహెల్ ని పిలిస్తే నేనేం చేశాను అని అడుగుతున్నాడు అఖిల్ సో వెంటనే తన పేరు కూడా పిలిచింది. సరే ఈ రోజు జలజనా నేనా వస్తన్నం వస్తన్నాం అంటూ తొడకొట్టాడు సోహెల్ కథ వేరుంటది అనుకుంటూ అరుస్తున్నాడు. అఖిల్ కి ఆల్రెడీ కాస్త భయం మొదలైనట్లుంది. భయం కొద్దీ గట్టి గట్టిగా అరుస్తున్నాడు సోహెల్. ఒకరిని ఒకరు వదలడం లేదు. మధ్య మధ్యలో లైట్స్ ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నారు ఒక మెరుపులాగా. స్పూన్ వెతుకుతూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కూడా ఉలిక్కి పడుతున్నారు. చీకట్లో వెతుకుతూ అఖిల్ కాస్త పక్కకి వెళ్తే సోహెల్ ఏయ్ నువ్వు ఏడున్నావ్ అని మళ్ళీ వెతికి పట్టుకుంటున్నాడు. గజ్జల సౌండ్ వస్తుంది.
సౌండ్ పెట్టద్దు బిగ్ బాస్ అని బతిమాలుతున్నాడు సోహెల్. ఉండురా అని అఖిల్ వెతుకుతున్నాడు. కథ ఏం లేదు బిగ్ బాస్ సౌండ్స్ వద్దు అని అంటున్నాడు. అరే గట్టిగా అరవద్దు బయటికి వినపడుతుంది ఇజ్జత్ పోద్ది అని అంటున్నాడు అఖిల్. అది సరే నువ్వు నన్ను పట్టుకో విడిపోవద్దు అని చెప్తున్నాడు సోహెల్. ఇంకా నయ్యం నువ్వున్నావ్ ఒక్కడ్నే వస్తా అని చెప్పా నేను అని అంటున్నాడు సోహెల్. మోనల్ దగ్గర ఇజ్జత్ పోతుందిరా జల్దీ స్పూన్ తీస్కొచ్చి ఇచ్చింది అని చెప్తున్నాడు అఖిల్. మెరుపులు వచ్చినపుడు అఖిల్ తెలివిగా జాగ్రత్తగా స్పూన్ కోసం చుట్టుపక్కల అంతా చూస్తున్నాడు సోహెల్ మాత్రం భయపడ్తున్నాడు. ఫైనల్ గా ఒకటి దొరికింది. బయటికి వెళ్ళి ఏం జరగనట్లే ఉండాలి అని అంటున్నాడు అఖిల్. మొత్తంమీద రెండుస్పూన్ లు పట్టుకున్నారు ఫైనల్ గా.
ఇద్దరు బయటికి వచ్చి అసలేం జరగలేదు అన్నట్లు ఫుల్ బిల్డప్ ఇస్తున్నారు ఇద్దరూ కలిసి. బయటికి కెమేరా దగ్గరికి వెళ్ళారు ఇద్దరూ కలిసి.. కాసేపటికి చుక్కలు కనపడ్డాయ్ బై మిస్టేక్ కూడా ఈ వీడియోలు ఎక్కడ వేయకండి టెలికాస్ట్ కూడా చేయకండి అని అడుగుతున్నాడు అఖిల్. చూడ్డానికి ఇలా కండలేసుకుని ఉన్నాం భయపడ్డాం అంటే ఇజ్జత్ పోతది అని అంటున్నారు. స్టార్టింగ్ లో భయమేసిందిరా అని చెప్పుకుంటున్నారు ఒకరికొకరు. ఇద్దరు మోనల్ ముందు చాలా బిల్డప్ ఇస్తున్నారు. స్టార్టింగ్ అంతే నేనైతే ఏం భయపడలే అని చెప్తున్నారు మోనల్ కి. వీకెండ్ ఈ వీడియో నాగార్జున చూపించాలి మోనల్ అండ్ వీళ్ళు ఇద్దరిదీ.
రేపటి ప్రోమో చూపించలేదు ఈ రోజు.
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.