25, నవంబర్ 2020, బుధవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. నా అభిప్రాయాల కోసం మాత్రం వీడియో చూడాలి.



ఈ రోజు బిగ్ బాస్ హౌస్ ని హాంటెడ్ హౌస్ గా మార్చేసి ఆ సెటప్ తో దెయ్యాల టాస్క్ లాంటిది ఇద్దామని ప్రయత్నం చేశారు. కానీ అంతా ఇంటి సభ్యుల నవ్వులతో ఓవర్ థింకింగ్ తో రసాభసా అయిందనిపించింది. మొదట హౌస్మేట్స్ అంతా దెయ్యం చెప్పే టాస్క్ చేయము అనేశారు. తర్వాత బిగ్ బాస్ ఇది మీ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అని చెప్పాక అపుడు చేస్తామని ముందుకొచ్చారు కానీ అపుడు కూడా అభిజిత్ మోనల్ ని ఏడిపించారనే మాట నచ్చక టాస్క్ చేయను అని చెప్పేశాడు. రేపటి ప్రోమోలో ఏదో ఫిజికల్ టాస్క్ ఇచ్చినట్లుగా ఉంది అది కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ రోజు అవినాష్ అండ్ సోహెల్ కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా లేకపోతే ఈ రోజు ఎపిసోడ్ ఇంకా బోర్ కొట్టి ఉండేదేమో అనిపించింది. 

వివరాలలోకి వెళ్తే ఈ రోజు 80 వ రోజు ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం గబ్బర్ సింగ్ సినిమాలో గన్నులాంటి కన్నులున్న పాటతో మేల్కొలిపారు. 

సోహెల్ ఫేస్ వాష్ బదులు టూత్ పేస్ట్ పెట్టుకున్నాడు మొహానికి నిద్రమంపులో అవినాష్ అండ్ అరియానా నవ్విస్తూ ఆటపట్టిస్తున్నారు. 

అఖిల్ రిలాక్స్ అవుతుంటే అలా చూడ్డం హాపీగా ఉంది అని చెప్తుంది మోనల్ దాన్కి ఆ వీటికేం తక్కువలేదు అంటున్నాడు అఖిల్. నిజం చెప్తే కూడా నువ్వు అర్ధం చేస్కోలేవు అంటుంటే ఏదో చెప్పాలని చెప్పినట్లు అనిపించింది నాకు అని అంటున్నాడు అఖిల్. ఈ మోనల్ కి పాపం హౌస్ లో అఖిల్ ఆర్ అభి ఎవరో ఒకరితో ఇలాంటి మాటలు పడడం రెగ్యులర్ అయిపోయింది పాపం. 

అవినాష్ కి ఎవిక్షన్ పాస్ వచ్చిందని హాపీగా అరియానా దగ్గర అఖిల్ దగ్గర పాటలు పాడుతున్నాడని ఆట పట్టిస్తున్నారు. 
అరియానా భుజం మీద చేయేసి అఖిల్ మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఆటపట్టిస్తున్నారు. మోనల్ జ్యూస్ చేస్కొని వచ్చి ఇచ్చింది అఖిల్ కి ఇచ్చి వెళ్ళి అవినాష్ పక్కన కాస్త దూరంగా కుర్చీలొ కూచుంది. చూశావా మేం ఇది అని అవినాష్ అంటే అఖిల్ మేం చూడు ఇంత దగ్గర కూచున్నాం వాటర్ పోస్తే కూడా కిందకి జారదు అంటా పాపం అరియానా నిజంగానే సిగ్గుపడింది ఆ మాటకి సో క్యూట్ :-) గుడ్ ఫ్రెండ్స్ యార్ అని చెప్తున్నారు ఇద్దరూ.   
సోహెల్ అఖిల్ అరియానా అవినాష్ మాములుగా ఆడుకోడం లేదు. ఒకరినొకరు కొట్టుకుంటూ ఫన్ జనరేట్ చేస్తున్నారు. 
నైట్ సెవెన్ కి గార్డెన్ ఏరియాని గ్రేవ్ యార్డ్ గా మార్చేసి దెయ్యాల టాస్క్ కి సెటప్ వేశారు కానీ ఇంకా కర్టెన్స్ తీయలేదు. 
అరియానా వాష్ బేసిన్ దగ్గరకు వెళ్తే అక్కడ అద్దం మీద దెయ్యం కనిపించింది. ఒక్క దెబ్బతో కెవ్వున కేకేసి ఏడ్చేసింది. సోహెల్ ఎక్కడో బెడ్ రూం లో ఉన్న వాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు కిచెన్ లోకి. 
హే మేం భయపడం పార్టాఫ్ ద టాస్క్ ఆ అని అనుకుంటూ ఉన్నారు.
అవినాష్ డెవిల్ ఫేస్ పెడితే ఆ చూడు ఇంతకన్నా ఘోరంగా ఉందా మీ దెయ్యం అని అంటూ సోహెల్ ఆటపట్టిస్తున్నాడు. 


హారిక అద్దం ముందుకు వెళ్ళి ఏది మళ్ళీ రండి భయపెట్టండి చూడ్దఆం అంటే  సోహెల్ దెయంతో భయపెట్టండి రాత్రి మాత్రం రాకండి అని అంటున్నాడు. ఇంకో పక్క అవినాష్ ఏమో హే నీకు పెళ్ళయిందా అని అడుగుతున్నాడు అందరూ కరువు ప్రాంతం అని అంటూ నవ్వేశారు. దాని చూట్టూ బాగా ఫన్ చేశారు. తలుపుల కింద నుండి పొగ వస్తుంది. బాత్రూం డోర్ లాక్ చేశారుట హారిక రిక్వెస్ట్ చేస్తుంటే గజ్జల చప్పుడు వస్తుంది ఒక్క సారి ఉలిక్కి పడిందిహారిక కూడా కానీ మళ్ళీ కవర్ చేస్తూ నాట్యం చేస్తుంది. సోహెల్ కూడా జాయిన్ అయ్యి ఫుల్ ఫన్నీ నాట్యం చేశారు.   
లివింగ్ రూం లో కూర్చుని ఉంటే టీవీ పక్కన ఉన్న మిర్రర్ లో కనిపించింది. అవినాష్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు దెయ్యానికి మాస్క్ శానిటైజర్స్ వేస్కోమని చెప్తున్నాడు. అభిజిత్ ఒక్కడే సీరియస్ గా ఏం మాట్లాడకుండా వీళ్ళని చూసి అపుడపుడు నవ్వుతు ఉన్నాడు. 
అవినాష్ వాష్ రూం కి వెళ్ళడానికి హారికని లోపల్ చెక్ చేయమని చెప్పి బయటే నుంచోవా అని అడుగుతున్నాడు. 
అరియానా నువ్వు ఎక్కువ బయపడితే నీమీదే ఫోకస్ చేస్తారు అని అంటుంది హారిక.  
నేను కోపంగా ఉన్నాను అని అరుస్తుంది నవ్వుతుంది.. ఏం భయపడక పోగా నవ్వుతూ కామెడీ చేస్తున్నారు. 
నా పేరు జలజ మీ అందర్ని నాకు నచ్చినట్లు ఇబ్బందికి గురి చేస్తాను అని ఒప్పందం కుదుర్చుకున్నా. నియమాలు ఉల్లంఘిస్తే నాకు కోపం. ఈ రోజు నుండి నా రాత్రి మొదలు నేనేం చెప్తె అది మీరు చేయాలి. నవ్వొస్తున్నట్లుంది వస్తా నేనేంటో చూపిస్తా అని అంటుంది. 
హారిక ఆపేసింది మజాక్ లు ఎక్కువైనై ఆవిడ ఏం చెప్తుందో జాగ్రత్తగా విందాం అని అంటుంది.
నేను వెళ్ళాననుకుంటున్నానా వెళ్ళలేదు అని అంటుందని ఆ హైట్ లో ఎవరున్నారా అని ఆలోచిస్తున్నారు. స్వాతి హైట్ మాచ్ అవుతుంది లేదంటే దివి నా ఆ వాయిస్ ఏదో తేడాగా ఉంది అని తెగ రీసెర్చ్ చేసేస్తుంది హారిక. 
అరియానా వాయిస్ తన వాయిస్ తో పోటీ పడేలా ఉందట. 
అవినాష్ మీకు పెళ్ళి సంబంధాలు చూశ్తున్నారు కదా మీ అమ్మని నాతో మాట్లాడమను అంట. 
సోహెల్ నేమో మ్యూజిక్ ప్లే చేసినపుడల్లా షర్ట్ తీసేసి పోల్ డాన్స్ చేయాలి అని చెప్పింది. 
అందర్ని ఒరే అనిపిలుస్తుంది. ఒరే తెలివైనోడా నువ్వు రోజు నా చెట్టుదగ్గిరే కూచుని ఆలోచిస్తుంటావ్ ఆ చెట్టుకు ఎన్ని ఆకులున్నాయో లెక్కపెట్టి చెప్పు అని అంది. 
అరియానా బయటికి వెళ్ళడానికి బ్లైండ్స్ ఓపెన్ అవుతుంటే కూడా మోనల్ తోడు రావా నాకు అని అడుగుతుంది. 
బయట సెట్టింగ్ చూసి సూపర్బ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సాలిడ్ సాలిడ్ అని అంతా మెచ్చుకున్నారు. 
పాములంటే నాకు పిచ్చి లేస్తది అని హారిక హింటిచ్చేసింది. 
ఆర్ జే సునీత వాయిస్ అని గెస్ చేశాడు అవినాష్. 
ఏం చేయాలి బిగ్ బాస్ ఏంటిది అని అంటున్నాడు మళ్ళా ఒరే అభిజిత్ ఆకులు లెక్కపెట్టు అని మళ్ళీ చెప్పింది. 
సోహెల్ నువ్వు చెప్తే ఎందుకు చేస్తా బిగ్ బాస్ చెప్తే చేస్తా అని అంటున్నాడు.  
ఎన్మిది కొమ్మలున్నాయ్ ఒకోదానికి యాభై ఉండచ్చు మొత్తం నాలుగొందలు అని లెక్కేశాడు అభి. 
అవినాష్ ఒక గ్రేవ్ మీద పడుకుని దెయ్యంలాగా సోహెల్ తో మాట్లాడుతున్నాడు సోహెల్ కూడా అలా దెయ్యంతో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నాడు. ఇద్దరూ బానే ఫన్ జెనెరేట్ చేశారు. 

అఖిల్ మోనల్ డిస్కషన్ హగ్ ఇమ్మంటే అఖిల్ సరిగా ఇవ్వడం లేదు. సపోర్ట్ గురించే మాట్లాడుతున్నాడు అఖిల్ ట్రస్ట్ ఇష్యూస్.. ఐ కెన్ ఫర్గివ్ బట్ కెనాట్ ఫర్గెట్ అని అంటున్నాడు. 

ఏడ్చినపుడు మీరందరు జోక్స్ చెప్పి మమ్మల్ని నవ్వించాల్సి ఉంటుంది నవ్వించలేకపోయారో నా చేతిలో ఐపోయారే అని అంటుంది దెయ్యం. 
అరుపులు ఏడుపులు లాంటివి  వచ్చినపుడు అరియానా బాగా భయపడుతుంది. 
అఖిల్ అభిజిత్ మీరిద్దరు మోనల్ ని ఎక్కువ ఏడ్పించారు సో ఒకరు మోనల్ ని గ్రేవ్ యార్డ్ లో డేట్ కి తీస్కెళ్ళాలి అరియానా క్విజ్ పెడుతుంది అందులో ఎక్కువ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు తీస్కెళ్ళాలి. జలజ నవ్వు వినిపించగానే క్విజ్ మొదలు పెట్టాలి.  
పేపర్ కింద బిగ్ బాస్ అని లేదు ఈ టాస్క్ చేయం అని అంటున్నారు. అభి మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాడు. 
మీరీ టాస్క్ కి ఒప్పుకుంటే మీరు మోనల్ ని ఏడ్పించినట్లు ఒప్పుకున్నట్లె అంటున్నాదు సోహెల్. 
అభి బాగా ఫీలవుతున్నాడు మోనల్ అభిజిత్ బిజినెస్ ఏ వద్దు అని అంటున్నాడు. మోనల్ పాయింటొచ్చిన ప్రతి సారి నాకు రాడ్ పడుతుంది. నాకు సంబంధం లేని విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. నాకు వద్దు అని చెప్తున్నాడు అభి. 
బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది ఇది మీ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అన్ని ప్రక్రియలని కొనసాగించాల్సి ఉంటుంది అని. ఓకే బిగ్ బాస్ ఇది క్లారిటి ఇపుడు మేం చేస్తాం అని చెప్పారు హౌస్మేట్స్. 
అభి ఈ టాస్క్ చేయడానికి నిరాకరించిన కారణంగా అఖిల్ మీరు మోనల్ వెళ్ళి ఈ టాస్క్ ను కొనసాగించండి అని అడిగారు. 
అభి ఏడ్చేస్తున్నాడు హీ ఈజ్ మెస్సింగ్ విత్ మీ ఫ్రమ్ డే వన్ అని అంటున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అని అఖిల్ అడిగితే మోనల్ ని ఏడిపించారన్న ఆ ఫస్ట్ లైన్ నచ్చలేదు అని చెప్తుంది హారిక అవును నాక్కూడా నచ్చలేదు అని అంటున్నాడు అఖిల్. 

అఖిల్ మోనల్ ఇద్దరూ డేట్ కి వెళ్ళారు మొత్తం అన్నీ తీసి పక్కన పెడుతున్నాను ఫస్ట్ టైం మీటింగ్ అని చెప్తున్నాడు అఖిల్ ఓకే అని మోనల్ ఫుల్ హాపీ. ఫుల్ నేం అంటే గజ్జర్ అంటే స్వీటా అని అడుగుతున్నాడు గాజర్ కాదు గజ్జర్ అని క్లారిటీ ఇస్తుంది మోనల్.   
నందికొండ వాగుల్లోనా పాట ప్లేచేస్తున్నారు సోహెల్ పోల్ డాన్స్ చేస్తున్నాడు. అందరూ డాన్స్ చేస్తున్నారు. 

రేపటి ప్రోమోలో ఇదే టాస్క్ కంటిన్యూ అవుతుంది. దీనికి తోడు ఏదో గట్టి ఫిజికల్ టాస్కే ఇచ్చినట్లున్నారు అంతా కలిసి ఫోర్స్ గా ఏవో టాయ్స్ లాంటి వాటిని పట్టుకోడానికి సేవ్ చేస్కోడానికి ప్రయత్నిస్తున్నట్లున్నారు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 
 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts