ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. కింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయవచ్చు.
ఈ రోజు నాగ్ కాస్ట్యూంస్ చాలా బావున్నాయ్. అండ్ హోస్టింగ్ లో కూడా అదరగొట్టేశారు. ఎక్కడ ఎలా ఉండాలో అలా హీ ఈజ్ స్ట్రిక్ట్, హీ ఈజ్ జోవియల్, స్పాంటేనియస్ అండ్ స్ట్రాంగ్ రిప్లైస్ తో ఓవరాల్ గా హోస్టింగ్ అదరగొట్టేశారీ రోజు. ఇక అఖిల్ ని మాములుగా భయపెట్టలేదు ఎలిమినేషన్ అంటూ బయటికి వచ్చేయమని చెప్పారు. గజగజ వణికి పోయి ఏడ్చేశాడు. ఐనా నేనేం చేయలేను అని చాలా గట్టిగా చెప్పేశారు బహుశా ష్యూర్ గా వెళ్తానని అనుకున్నాడేమో ఎనిమీస్ నిచెప్పమంటే అభిహారికలాస్యలకు గట్టిగా ఫీడ్బాక్ ఇచ్చేశాడు. బహుశా నాగ్ అంత స్ట్రాంఘ్ గా చెప్పకపోతే తను ఇంత గట్టిగా చెప్పేవాడు కాదేమో.
వివరాలలోకి వెళ్తే చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి పాటతో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లో స్మోక్ ఫ్రీ దీపావళి జరుపుకున్నాం బావుంది కానీ రేపటి నుండి వచ్చే పొల్యూషన్ పరిస్థితేంటి అని వారానికి ఒక రోజు వాహనాలు వాడడం మానేద్దాం అని చెప్పారు.
అరవైతొమ్మిదో రోజు ఉదయం మోనల్ అవినాష్ హారిక మాట్లాడుకుంటున్నారు. మోనల్ ఏదో చెప్పింది అభి హారికకి అని సోహెల్ అండ్ అవినాష్ మాట్లాడుతున్నారు. మోనల్ కి ఏం అర్థం కాలేదు ఎక్స్ప్లైన్ చేయండి ప్లీజ్ అని అడిగితే అది ప్రాంక్ అని నవ్వేశాడు సోహెల్ :-)
అవినాష్ ఎగ్ దోశ వేస్కు తింటుంటే సోహెల్ అండ్ మెహబూబ్ లాక్కుని తింటు ఫన్నీ గా కాసేపు ఆడుకున్నారు. అవినాష్ ఇంతేనా ప్రేమా అని మళ్ళీ ఫన్నీగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇద్దరూ..
లక్జరీ బడ్జెట్ పాయింట్స్ పదాహారొందలు ఇచ్చారు కానీ మటన్ కేజీ రెండు వేల పాయింట్స్ పెటారు. సో ఇక నిన్ను నామినేట్ చేయడం ష్యూర్ అని చెప్తున్నారు అభి, సోహెల్, మెహబూబ్. మీరు అవినాష్ ని నామినేట్ చేయండి అనే పెట్టారు ఆ స్లైడ్ అని అంటున్నారు.
ఓపో పోట్రెయిట్ టాస్క్ ఇచ్చారు. ఒకరు ఫ్రేమర్ ఒకరు ఫోటోగ్రాఫర్ గా ఇద్దరిద్దరుగా రెండు టీంస్ ఫార్మ్ అయి మిగిలిన వాళ్ళని ఫోటోలు తీసి ఒక కథ చెప్పాలి. ఒకో టీమ్ మూడు ఫీచర్స్ ఉపయోగించి మూడు ఫోటోల ద్వారా మాత్రమే కథ చెప్పాలి. అందరూ బాగా కష్టపడి తీశారు.
నాగ్ కి సర్ ప్రైజ్ అని లివింగ్ రూం లో ఓన్లీ అభి అండ్ లాస్య ఉన్నారు అందరు ఎవరి ప్లేస్ లో వాళ్ళున్నారుట. మీరు ఓకే అంటే స్రప్రైజ్ చూపిస్తాం అన్నారు. వీళ్ళిద్దరు అందమా అందుమా పాటకి డాన్స్ చేశారు.
బెడ్ రూం లో మెహబూబ్ హారిక ఇద్దరూ ప్రియరాగాలే పాటకు డాన్స్ చేశారు. వీళ్ళిద్దరు హైట్ తో సహా పర్ఫెక్ట్ మాచ్ అవుతారు అండ్ డాన్స్ పార్టనర్స్ గా మంచి సింక్ లో చేశారు.
అవినాష్ అండ్ అరియానా ఇద్దరూ గార్డెన్ ఏరియా లో డిక్క డిక్క డుం డుం పాటకు డాన్స్ చేశారు.
సోహెల్ అండ్ మోనల్ సిటింగ్ ఏరియా లో అష్టలక్ష్మి అష్టలక్షి వేర్ ఈజ్ ద ప్రాబ్లం పాటకు డాన్స్ చేశారు.
హౌస్మేట్స్ అందరూ లివింగ్ ఏరియాలో సోఫా వెనక దాక్కుని దేవదాసు సినిమాలో పడుచందం పక్కనుంటే పాటకు డాన్స్ చేశారు. సర్ప్రైజ్ బావుంది.
అందరూ బాగా చేశారు ఈవెన్ అభిజిత్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు.
మీకోసం అమల నిన్న స్పెషల్ గా తెప్పించింది. మా ఇంట్లో నుండి అంటే తెలుసు కదా హెల్తీ గిఫ్ట్సే వస్తాయి అని గిఫ్ట్స్ ఇచ్చారు. డ్రై ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ హౌస్మేట్స్ అంతా ఎక్సైటెడ్ వావ్ ఇన్ని డ్రైఫ్రూట్సా అని.
అవినాష్ ని స్టోర్ రూం కి వెళ్ళమనడానికి మటన్ ని డీప్ లో పెట్టకుండా పాడుచేసిన అవినాష్ గుడ్లు పగలగొట్టిన అవినాష్ స్టోర్ రూంకి వెళ్ళు అని అన్నారు.
మనం ఆటపాటల్లోకి వెళ్ళేముందు ఒక ఇష్యూ ఉంది అది అడ్రస్ చేద్దాం అని బిగ్ బాస్ అడిగినపుడు ఒక యూనిటీతో డెసిషన్ తీస్కోలేదు అని అవినాష్ ని పిడికిలి బిగించి ఓపెన్ చేయితో ఎక్స్పెరిమెంట్ చేయించి కలిసుంటే బలం అని చెప్పారు. మీకు ఆయన మూడు విషయాలు చెప్పారు ఇక ఒకటి స్ట్రాంగ్, రెండు ఎవరు అడ్డుపడుతున్నారు, మూడు ఎవరు ఫైనల్ కి వెళ్ళనివ్వరు. మూడు పట్తించుకోకుండా మీరు మొదటి స్ట్రాంగ్ అన్న పాయింట్ మాత్రమే తీస్కున్నారు.
హౌస్ లో అందరికి ప్రాపర్ సెండాఫ్ ఇచ్చాం సో అఖిల్ కి కూడా ఇచ్చి పంపిద్దాం అని చెప్పారు. హౌస్మేట్స్ అంతా బాగానే సర్ ప్రైజ్ అయ్యారు. ఇలా మేం ఎలిమినేట్ చేయలేం అంటే కొన్ని భాషల్లో ఇలా కూడా జరిగింది అని చెప్పారు.
హౌస్ లో చిచ్చుబుడ్డి ఎవరు ఆటంబాంబ్ ఎవరు అని అడిగారు.
మెహబూబ్ అరియానని చిచ్చుబుడ్డి అని అభిని ఆటంబాంబ్ అని ఇచ్చాడు.
అరియానా మెహబూబ్ కి చిచ్చుబుడ్డి ఇచ్చి ఆయన బాంబ్ లా పేలాలల్ని అనుకుంటాడు కానీ తుస్ మంటాడు అని అంది. అవినాష్ కి బాంబ్ ఇచ్చింది. దొంగమొహం వాడు అని పేరు పెట్టింది అవికి.
సోహెల్ చిచ్చుబుడ్డి అరియానా అన్నాడు నా మీద నామినేషన్ రోజు అరుచుకున్నాం కానీ చివరికి గోలంతా డౌన్ అయ్యాయ్ అందుకే. బాంబ్ అభికి ఏ టాస్క్ లో ఎపుడు అరుస్తాడు అని ఊహించలేం అన్నాదు.
మోనల్ చిచ్చుబుడ్ది సోహెల్ కోపం వచ్చినపుడు ఫుల్ రైజ్ అవుతాడు తర్వాత కూల్ అవుతాడు. అభి బాంబ్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడో అని భయం అని చెప్పిమ్ది.
అభిజిత్ సోహెల్ చిచ్చుబుడ్ది. అపుడపుడు లూజ్ టంగ్ ఉంటది అది ఎక్కువ వాడేస్తున్నాడు. నా ఊత పదాలు తట్టుకోలేక పోతున్నాడు నేను మాస్ ఆయన క్లాస్. మెహబూబ్ బాంబ్ టైంకి ఎక్స్ప్లోజన్ ఎక్కడ వాడాలి అనేది బాగా కంట్రోల్ చేస్తుంటాడు అని అంది.
హారిక సోహెల్ కి చిచ్చుబుడ్డి ఇచ్చింది. ఆటంబాంబ్ నేనే అని అంది. హారిక జంప్ చేసింది. ఇపుడైపోయింది ఎవరికిస్తావ్ చెప్పు అని ఇమిటేట్ చేస్తూ ఎగిరి దూకారు భలే ఇమిటేట్ చేశారు. ఐతే నేను మెహబూబ్ కి ఇస్తాను అని చెప్పింది అరిచేస్తాడు.
లాస్య ఆటంబాంబ్ అభికి ఇస్తాడు టైం కోసం వెయిట్ చేస్తాడు కానీ టైమొస్తే మాత్రం బ్లాస్ట్ అవుతాడు. టాస్క్ ఆడడానికి కూడా బాగా ట్రై చేస్తాడు. అవును ట్రై చేస్తాడు అని చెప్పారు నాగ్ కూడా. సోహెల్ కి చిచ్చుబుడ్డి నువ్వు రైజ్ అవుతాడు అంతలోనే తుస్ అవుతాడు అని అంది.
అవినాష్ దొంగమొహం వేస్కుని చిచ్చుబుడ్డి ఎవరో చెప్పు అన్నారు మోనల్ ఎపుడూ వెలుగుతూ ఉంటుంది లోలోపల బాగానే కూల్ అవుతుంది ఈ మధ్య బాగా ఆడుతుంది అంటే అఖిల్ వెళ్ళాక అని అంటే లేదు నాట్ బికాజ్ ఆఫ్ అఖిల్ అని మోనల్ క్లారిటీ ఇచ్చింది. అందరు నోట్ చేస్కోండి అని ఆ మాటా రిపీట్ చేశాడు నాగ్. ఆటంబాంబ్ అరియానా కి ఇచ్చాడు. నువ్వు ఆటంబాంబు ఇచ్చినా పడదు అని కాసేపు ఏడిపించారు.
అఖిల్ జెనరల్ గా మంచి ఫైటర్ కానీ మొన్న ఏంటో అసలు ఫైట్ చేయకుండా వెళ్ళిపోయాడు ఏంటో చూద్దాం అని సీక్రెట్ రూం కి వెళ్ళారు.
అభి ఏం చెప్పాడో అదే చెప్పారు అఖిల్ తో అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయావ్ అని అడిగారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బయటికి పంపిస్తారు అని అనుకోలేదు ఎక్కడో కొంచెం భయం ఉంది కానీ ఇలా చేయరు అని ఆ బేసిస్ మీద కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నాను అన్నాడు. నీ భయం నిజం నీ కాలిక్యులేషన్స్ వెంట్ రాంగ్ చాలా భాషల్లో ఇలా జరిగింది హౌస్మేట్స్ ఎలిమినేట్ చేశారు అని చెప్పాడు. పాక్ చేస్కుని హౌస్ లోకి వెళ్ళు సెల్ఫీ తీస్కుని స్టేజ్ మీదకు వచ్చేయ్ అని చెప్పారు. ఐ బెగ్ యూ సర్ ఇది నా వల్ల కాదు నేను తీస్కోలేను సర్ అని గట్టిగా ఏడ్చేశాడు. నువ్వు డిఫెండ్ చేస్కోలేదు అని మళ్ళీ నొక్కి చెప్పారు నాగ్ నాకు ఏం చేయలో అర్థం కాలేదు సర్ అని చెప్పాడు. చాలా ఏడ్చేశాడు. డోంట్ డూ దిస్ ప్లీజ్ అని అంటూ.
ఫైనల్ గా గాదర్డ్ హిమ్ అప్ అండ్ కంట్రోల్ చేస్కుని కొంచెం ఫ్రెషప్ అయి ఏం జరిగితే అది జరుగుతుంది ఓకే అని చెప్పి రెడీ అయి హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. వెళ్తున్నా అని చెప్తే ఎవరూ నమ్మడం లేదు.
అభితో సహా అందరూ కూడా సార్ సార్ మాకు యూనిటీ లేదు అన్నారు ఇప్పుడు అందరం ఒకటై మేం అందరం కలిసి అడుగుతున్నాం ఎలిమినేషన్ వద్దు అతను హౌస్ లో ఉండాలి అని అడిగారు. అభి వియ్ వాంట్ హిమ్ హియర్ సర్ అని ప్రత్యేకంగా అడిగాడు.
అరియానా గట్టిగా ఆర్గ్యూ చేసింది అలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలా పంపిస్తారు అని. చాలా లాంగ్వేజెస్ లో ఇలా జరిగింది అని అలాపంపితే ఉన్న వాళ్ళలో వీక్ ప్లేయర్స్ స్ట్రాంగ్ అవుతారు మోనల్ స్ట్రంగ్ అవలేదా అఖిల్ వెళ్ళాక అని చెప్పారు నాగ్. సూపర్ స్పాంటేనియస్ రెస్పాన్స్ అనిపించింది నాగ్ ది.
మోనల్ నేను అఖిల్ బదులు వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆ రోజు రాత్రి చేసుండాల్సింది అఖిల్ బదులు నేను వెళ్ళిపోతాను అని అన్నారు నాగ్. వాహ్ ఇది కదా హోస్టింగ్ అంటే అనిపించింది.
అభి కన్విన్స్ చేస్తూ ఉన్నాడు మోనల్ ని. అఖిలే సెల్ఫీ తీస్కున్నాడు.
తనకి గుడ్ బై చెప్పే ముందు చిన్న టాస్క్ చేయాలి. తను సీక్రెట్ రూం నుండి అబ్సర్వ్ చేస్తున్నాడు సో తను ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పాలి నలుగురు ఎనిమీస్ చెప్పాలి మిగతావాళ్ళు న్యూట్రల్ అని అన్నారు.
ఫ్రెండ్స్ చెప్తా అని సోహెల్ కి బాండ్ కట్టాడు. తను ఏడుస్తూనే ఉన్నాడు గట్టిగా. నాలాగే ఇంకో వ్యక్తిని చూశాను ఇంట్లో అది వీడు నన్ను గుండెల్లో పెట్టుకున్నాడు ఈ నాల్రోజుల్లో ఇంకా కొద్దిగా క్లియర్ అయింది బాధపడింది వీడొక్కడ్నే చూశాను. ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ నా తమ్ముడుగా ఫ్రెండ్ గా ఉండిపోతాడు అని చెప్పాడు. నేను ఎప్పుడు లోగా ఫీలైనా నన్ను హగ్ చేసుకుని నన్ను నార్మల్ చేస్తాడు అని అన్నాడు. ఆ రోజు అని మాట్లాడుతుంటే ఆ రోజు గురించి చెప్పకు నీకో మంచి అన్న దొరికాడు అంతే అని ఆపేశాడు.
మోనల్ కి ఫ్రెండ్షిప్ బాండ్ కట్టాడు. ఫ్రెండ్ కాబట్తి సరైన సీక్రెట్ చెప్పకపోయినా లెటర్ పంపావ్ కదా అంటే చిన్న నవ్వు నవ్వేశాడు. అభి తనని ఫ్రెండ్ గా ట్రీట్ చేయకపోయినా పక్కన కూర్చుని ఒక మాటంది ఐకెన్ సీయూ ఇన్ టాప్ ఫైవ్ అని నాకనిపిస్తుంది ఆ మనిషి ఎంత ఛీకొట్టినా పాజిటివిటీ ఇస్తుంది కానీ నెగటివిటీ ఇవ్వడంలేదు అలాంటి ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం అందుకే అన్నాడు.
ఫోర్ నెగటివ్ అభి,హారిక,లాస్య,మెహబూబ్
అభి కింద ఏదో పడిపోయింది అని నీ సోచ్ అని చెప్పాడు అఖిల్ సింపతీ అనే వర్డ్ ఉండుంటే ఎవరు అడుక్కోరు. అన్నావ్ కదా సింపతీ బ్లఫ్ అని ఆ రోజు ఈ పర్సన్ ఫేక్ గా నటిస్తున్నాడు అని లెటర్ లో రాసినా నేనేం అనలేదు. కామెర్లు వచ్చినవాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట నువ్వు ఫేక్ ఐతేనే వేరె వాళ్ళు ఫేక్ గా కనపడుతారు అన్నారు.
హారిక ని సింపతీ కార్డ్స్ డజన్ట్ వర్క్ నువ్వు ఎన్ని సార్లు ఉపయోగించావ్ నువ్వు ఆ కార్డ్స్ ఫుల్ అనుభవం తో చెప్పావ్ అని అన్నావ్.
లాస్య ని నేను అసలు అనుకోలేదు. ఒకళ్ళు వెళ్ళాక జోక్స్ వేయడం ఏంటి. చికెన్ షాప్ ముందుకు వెళ్ళి చికెన్ డాన్స్ ఆడితే చికెన్ ఏమైంది. మటన్ దుకాణమోడు గడ్డిని చూపించి మేకని లోపలికి రమ్మన్నాడు ఆ తర్వాత ఏమైంది. ఇదే మాట్లాడే స్టైల్ నీ మెచ్యురీటీ. నాకు ఏమైంది కూడా నాకు తెలీదు నువ్వు నవ్వుతూ నవ్వుతూ అనేస్తావ్ అక్క అని చెప్తున్నాడు.
మెహబూబ్ ఒకళ్ళు గేం ఆడేప్పుడు నీకేం చేస్తున్నారో నువ్వు చూడు లేకపోతే తర్వాత ఎవరూ చేయను కూడా చేయరు అన్నాడు.
మెహబూబ్ అండ్ సోహెల్ ఇద్దరూ గట్టిగా ఏడుస్తున్నారు. అవినాష్ అరియానా ఇద్దరూ నువ్వు వెళ్ళట్లేదు అని చెప్పారు. అభి అఖిల్ తో ఐ విష్ యూ నతింగ్ బట్ గుడ్ అని చెప్పాడు.
పోడియం దగ్గర రెండు కుండలు కనపడుతున్నాయ్ కుండబద్దలు కొట్టే విషయం ఒకటి ఉంది అది కూడా చేసి వెళ్ళాలి. అందరు లైన్ లో నుంచోండి. ఇది అందరికి చెప్తున్నాను ఆటలో కాలిక్యులేషన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. జరుగుతే ఇదే జరుగుతుంది. అఖిల్ ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పారు. అభి తప్ప మిగిలిన వాళ్ళు హాపీగా కనిపించారు.
ఒక కుండలో డైరెక్ట్ నామినేషన్ మరో కుండలో కెప్టెన్ అవుతావ్ పిక్ వన్ అని చెప్పాడు. నీ కాలిక్యులేషన్ కి టెస్ట్ అని అన్నాడు. బ్లూ కుండ సెలెక్ట్ చేస్కున్నాడు. అందులో కెప్టెన్ అని ఉంది. ఈ రోజు ఎమోషన్స్ పైకి కిందకి వెళ్ళాయ్ కదా అంటే ఆడుకున్నారు సర్ రూం లో నన్నైతే అని చెప్పాడు అఖిల్.
టైమ్ టు సేవ్ అని ఒక ఆర్డర్ లో నించోపెట్టారు.
మెసేజ్ ఇన్ ద బాటిల్ ఏదైతే కొట్తి నామినేట్ చేశారో అవే బాటిల్ ని ఎవరికి వాళ్ళు తలమీద కొట్టుకోవాలి దానిలో సేవ్ ఆర్ అన్ సేవ్ అని ఉంటుంది అన్నారు.
సార్ బాటిల్స్ ఏమైనా మిగిలిపోయాయా మళ్ళా పంపించారు అని అభి అంటే.. హా హా ఇలాగే పంచ్ లు వేస్తూ ఉండూ బిగ్ బాస్ చూస్కుంటారు అని అన్నారు నాగ్ :-)
అభిజిత్ ఈజ్ సేఫ్ సారీ బిగ్ బాస్ తప్పుగా అర్ధం చేస్కున్నాను మిమ్మల్ని అని అన్నారు. ఓహో సేవ్ చేస్తే ఇలా అంటావ్ లేకపోతే జోక్స్ వేస్తావా అన్నారు నాగ్.
చిన్న మెసేజ్ సర్ అని దివాలి టైమ్ లో యానిమల్స్ చాలా భయపడుతుంటాయ్ సో వాటికి షెల్టర్ ఇవ్వండి అని అడిగాడు.
పండగ రోజు సేవ్ అయింది అభి ఒక్కడే అఖిల్ కూడా ఇంట్లోనే క్ంటిన్యూ అవుతున్నాడు అన్నారు. కానీ ఇద్దరికీ బాగానే మళ్ళీ ఫైట్ పెట్టాడు బిగ్ బాస్.
కేక్ ఎంజాయ్ చేయండి అని బైబై చెప్పబోతుంటే అవినాష్ ముందుకు వచ్చి మటన్ పంపించండి సార్ అని రిక్వెస్ట్ చేశాడు. నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు పంపింఛాలి అంటే కొడుతున్నారు సార్ అని అన్నాడు ఇంకోసారి కొట్తించి ఓకే మటన్ పంపిస్తున్నాను అని చెప్పారు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.