6, నవంబర్ 2020, శుక్రవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చదవచ్చు. 


ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. అమ్మ రాజశేఖర్ గారు విన్ అయ్యారు. పెట్టిన టాస్క్ కళ్ళకు గంతలు కట్టుకుని వీపుకి రంగు పూయడం అనేది అమ్మాయిలకి అబ్బాయికి మధ్య పెట్టాల్సిన టాస్క్ కాదనిపించింది. చాలా ఎబ్బెట్టుగా ఉంది. హారిక మీద బాగానే అటాక్ జరిగినట్లు అనిపించింది. అదృష్టవశాత్తు ఎడిటింగ్ టీం జాగ్రత్తగా పని చేసి బిగ్ బాస్ పరువు కాపాడారనిపించింది. 

ఇక మాస్టర్ గారు తాను కెప్టెన్ అయింది బిగ్ బాస్ హౌస్ కేనన్న విషయం మర్చిపోయి ఓ హిట్లర్ లా నియంత లా నాకిష్టం వచ్చినట్లు చేస్తా అని చెలరేగిపోయి రచ్చరచ్చ చేశాడు. ఆతని గ్రూప్ లో ఒకరిద్దరు తప్ప ఎవరికీ నచ్చలేదు ఆయన టాస్క్ అలకేషన్ లోనే గొడవ గొడవ ఐంది. 

వివరాల్లోకి వెళ్తే 61 వ రోజు హౌస్లో పదిమందున్నారు. ఉదయం మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం పాటతో మేల్కొలిపారు. బహుశా మాస్టర్ కెప్టెన్సీ గురించే వేశారేమో ఈ పాట అనిపించింది :-)

డస్ట్ బిన్ లో కవర్ లేకుండా చెత్త వేస్తున్నారని విసుక్కుంటుంది అరియానా.. ఆ పని ఎవరు చేయాలో కూడా కెప్టెనే చెప్పాలని అంటున్నాడు అభి. ప్లాట్ఫార్మ్ క్లీనింగ్ చేసే వాళ్ళే కవర్ వేయాలి డస్ట్ బిన్ లో అని అంటుంది. ఎవరు చేయలేదో చెప్పు వాళ్ళపేరె చెప్పాలి. 
అభి అఖిల్ లాస్య సోహెల్ నలుగురు మాట్లాడుకుంటున్నారు. ఆవిడకి ఫేవర్ ఉన్నావాళ్ళకే ఫేవర్ చేస్తుంది ఈమె కెప్టెన్సీలో ఇంకోవారం అంటే కష్టమే. ఓట్లేదైనా వేసేదుంటే కనుక జాగ్రత్తగా చూసి వేయండి అని చెప్తున్నాడు అభి. 
రింగులో రంగు. 
రింగులో వైట్ టీషర్ట్ వేస్కుని కుడి చేతికి గజ్జెలు కట్తుకుని రంగుని పోటీ దారునికి పూస్తుండాలి. ముగిసే సమయానికి ఎవరి వీపు మీద తక్కువ రంగుంటే వారే కెప్టెన్. 
సోహెల్ సంచాలక్. తనదే తుది నిర్ణయం. 

అఖిల్ అండ్ అభి హారిక ని గైడ్ చేస్తున్నారు. 
సోహెల్ మెహబూబ్ అవినాష్ మాస్టర్ ని గైడ్ చేస్తున్నారు. 

హారిక వెల్లకిల పడుకుంది. కానీ కాచ్ చేసి రాసేశారు మాస్టర్ వీపుకి అసలు లేదు. 
హరిక అరియానా ఇద్దరు పడుకున్నారు కింద. మాస్టర్ వెతుకుతున్నారు నడుస్తూ కాలుతో తంతూ వెతుకున్నారు. 
హారిక వీపుకి ఆల్రెడీ ఫుల్ ఉంది. గుద్దుతున్నారు అని హారిక కంప్లైంట్ చేసింది. సారీ నాకు తెలియడం లేదు అని అన్నారు మాస్టర్. 
అందరికన్నా తక్కువ రంగు మాస్టర్ మీద ఉంది ఆయనే కెప్టెన్.
మాస్టర్ మాములుగా ఎగర లేదు సింహాసనం మీద కూచున్న ఫీలింగ్ ఇచ్చారు ఆయన. 


మెహబూబ్ సోహెల్ తో మాట్లాడారు మాస్టర్. వీళ్ళందరికీ వేరే లెవల్ ప్లాన్ చేస్తున్నాను మీరిద్దరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు. మీకు ఏది కావాలంటే అది చెప్తా మిగిలిన వాళ్ళ విషయంలో ఒక రేంజ్ లో చేయాలి అనుకుంటున్నా అని అన్నాడు. ఇంగ్లీష్ మాట్లాడితే జైల్ అంట. 

అమ్మ గారికి మైక్ అనౌన్స్మెంట్ వచ్చింది. అందరూ గోల చేశారు కెప్టెన్ ఇదేంటి అని అవినాష్ ఒక సూది దారం ఇస్తే కనుక మాస్టర్ కి కుట్టేస్తాను అని చెప్తున్నాడు :)

రేషన్ మానేజర్ గా అవినాష్ ని సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పారు. అందరు ఒప్పుకోండి అని అంటే సోహెల్ నేనొప్పుకోను అని అన్నాడు ఓకే ఒప్పుకోకపోయినా చేసేయండి అని అఖిల్ అన్నాడు ఫైనల్ గా అవినే చేశాడు. 
 
సాయంత్రం జి.ఆర్.బి. కారెట్ హల్వా.. 
గార్డేన్ ఏరియాలో ఇద్దరు బెస్ట్ ఛెఫ్స్ ని ఎన్నుకుని చేయించాలి అని చెప్పాడు. టేస్ట్ అండ్ ప్రజెంటేషన్ ని బట్టి బెస్ట్ ది సెలెక్ట్ చేశారు. 

నాకాప్టెన్సీ లో స్వీట్ చేయించారు అని అమ్మ అంటూంటే అవినాష్ నేను రేషన్ మానేజర్ ని కావడం వల్ల స్వీట్ చేయిస్తున్నారు అని చెప్పాడు :) 

మోనల్ అండ్ లాస్య లని సెలెక్ట్ చేశారు. మోనల్ కి అమ్మ గారు అవినాష్ హెల్ప్ చేశారు. అఖిల్ లాస్య కి హెల్ప్ చేయడనికి వస్తే లాస్య నువ్వు ఇటు వస్తావని అనుకోలేదు అఖిల్ అని చెప్తుంది అఖిల్ తోనె అటు వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తావ్ అనుకున్నా అంటుంది :-) 
  
జైల్ కీస్ వచ్చాయి అవినాష్ వాటిని దాచి ఏం లేదని అందరికీ చెప్పాడు. తర్వాత మాస్టర్ గారికి మాత్రమే ఇచ్చి ఇదీ విషయం అని చెప్పాడు.

ఫైనల్ విన్నర్స్ ఇద్దరూ అని చెప్పారు. ఇద్దరూ బాగా చేశారు అని చెప్పారు. 

అమ్మ గారు డ్యూటీస్ అలాట్ చేస్తున్నారు. 

లాస్య మోనల్ హారిక మధ్యాహ్నం లంచ్ వాళ్ళే సాయంత్రం స్వీపింగ్ కూడా చేయాలి. హారిక మేం ఒప్పుకోం అంటే మీరు చాలా క్లీనింగ్ చేశ్తారు అందుకే మీకు అన్నారు. 

మైక్ మిస్సయితే జైల్ మొదటి సారి తక్కువ టైమ్ తర్వుఅత ఎక్కువ టైమ్. 

నిద్ర పోతే ఎక్కడ పడుకుంటే వాళ్ళే నెక్స్ట్ మోర్నింగ్ క్లీనింగ్ చేయాలి. 

ఇంగ్లీష్ మాట్లాడితే నాగార్జున గారు నించో బెట్టిన చోట నుంచోవాలి అక్కడికె ఫుడ్ వస్తుంది. 

అవినాష్ మెహబూబ్ బాత్రూం. 

కొందరికి సింగిల్ డ్యూటీ అండ్ మిగ్లిన వాళ్ళకి డబుల్ వర్క్ ఇచ్చారు ఏంటి అని అన్నారు అందరూ. 
అభి ఎంటర్టైన్మెంట్ అంతా బావుంది. డ్యూటీస్ నాకు నచ్చలేదు. 
హారిక నేను స్వీపింగ్ సోఫా ముందు వరకే చేస్తాం అని చెప్పింద్.
అభి వివరిస్తుంటే అసలు వినను అని అంటున్నాడు అమ్మ.
అసిస్టెంట్ ఏంటీ వాళ్ళ పని ఏంటీ అని అడుగుతుంది మోనల్. లాస్య నేనడుగుతా ఆ రోల్ అని అంది. 

బాత్రూం ఇరవై నిముషాల్లో ఐపోతుంది అని చెప్పాడు అఖిల్. ఏం మాట్లాడుతున్నావ్ అని సీరియస్ గా వస్తున్నాడు అఖిల్ మీదకి మెహబూబ్ కానీ అఖిల్ క్లారిటీ ఇచ్చాడు నేను నీ గురించి ఏం మాట్లాడడం లేదు టైం చెప్పా అంతే అని అన్నాడు. 

హారిక కూడా చాలా అప్సెట్. హిట్లర్ డ్యూటీ కాదు అందరి కన్సర్న్ కూడా అర్ద్ం చేస్కోవాలి వినాలి. 

నేను రెండ్రోజులు చూస్తాను ఎవరు కష్టం పడుతున్నారు అనేది గమనింఛి దాన్ని బట్తి మారుస్తాను అని చెప్పాడు అమ్మ. నేను గొడవ రాకుండా ఉండాడానికి ఇస్తున్నా అని అన్నాడు.

నేను పని ఇచ్చినపుడు నువ్వు నవ్వి డాన్సెందుకు చేశావ్ అని అమ్మ గారు మెహబూబ్ ని అన్నాడు మీరు అలా చేయడం వల్లే ఇంత గోలా అయింది అని అంటున్నాడు. 
    
అభి ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది లాస్య. అభి ఇంగ్లీష్ లో మాట్లాడాడు. అమ్మ ఒక రేంజ్ లో యస్ అని కిక్ ఇచ్చి ఇది చాలు నాకు అని అన్నాడు. అమ్మ గారు అరియానాని అసిస్టంట్ గా వెళ్ళి పనిష్మెంట్ చెప్పమన్నాడు అభికి. అతను మీరెవరో నాకు తెలీదు ఐ కాంట్ ఐడెంటిఫై యూ అని చెప్పాడు. నేను కెప్టెన్ చెప్తే చేస్తా అని చెప్పాడు. సరే నేనే చెప్తాను అన్నాడు అమ్మ. 

అమ్మ గారు సీరియస్ గా వెళ్ళి ఇంగ్లీష్ లో మాట్లాడితే పనిష్మెంట్ అని లోపల ఉన్నపుడు చెప్పాను మీరు వెళ్ళి అక్కడ నుంచోండి అని అన్నాడు. హాట్ వాటర్ ఇస్తారా అని అడిగితె సేవలన్నీ మీకు అక్కడికే అని లాస్య చెప్తుంది. 

అభి వెళ్ళి నిలబడ్డాడు అఖిల్ వెళ్ళి పక్కన కూచొని మాట్లాడుకుంటున్నారు.   
సోహెల్ అండ్ మెహబూబ్ డిస్కస్ చేస్తున్నారు నువ్వు ఎందుకు అరిచావ్ అని అడుగుతున్నాడు సోహెల్. 

సరేలే తిను అని డ్రైఫ్రూట్స్ ఇస్తుంటే మెహబూబ్ వద్దురా బాబు మీ ఫ్రెండ్షిప్ వద్దు ఏం వద్దు నా గేం నేను ఆడుకుంటా అని అన్నాడు. దాంతో సోహెల్ చాలా ఫీలయ్యాడు ఇస్తున్నది తీసి కింద నేలకేసి కొట్టాడు. అటూ ఇటూ తన్నుకుంటూ వాష్ రూం లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.    

వామ్మో ఏం జరుగుతుంది ఈ హౌస్ల్లో నాకేం అర్థం కాటం లేదు అంటున్నాడు అభి. ఇన్ని వారాలుగా ఏ కెప్టెన్సీలో కూడా టాస్క్ అలోకెషన్ సమయంలో ఇన్ని గొడవలు జరగలేదు అని అంటుంది హారిక.
 
అఖిల్ మాట్లాడుతుంటే వాడికి ఇష్టం అని ఇస్తుంటే ఇలా మాట్లాడితే ఏం చేస్తాం అని అన్నాడు సోహెల్. 

అభి ని పనిష్మెంట్ నుండి రిలీజ్ చేశాడు అమ్మ.

ఫ్రెండ్షిప్ వద్దేంటి అని అవినాష్ అండ్ అఖిల్ ఇద్దరూ కలిసి మెహబూబ్ ని సోహెల్ ని కలిపారు. అఖిల్ మెహబూబ్ ని గదిమి డ్రైఫ్రూట్స్ తిను అని తినిపింఛాడు. బావుంది

బాటరీస్ మార్చుకోడానికి బెల్ మోగింది. అందరూ పరిగెట్టుకుని వెళ్ళారు. ఎందుకంటే కొత్త రూల్ ప్రకారం ఈ బెల్ మోగినపుడు లాస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఎగ్స్ కట్ అంటా.. సో అందరూ ఫాస్ట్ గా పరిగెట్టుకుని వెళ్ళారు లోపలికి లాస్ట్ లో మోనల్ వచ్చింది. నీకు ఫ్రూట్స్ కట్ అని చెప్పారు అమ్మ. 

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts