16, నవంబర్ 2020, సోమవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చదవచ్చు. 



ఈ రోజు డెబ్బై ఒకటో రోజు నిన్న మెహబూబ్ ఎలిమినేషన్ తో ఇంట్లో ఎనిమిది మంది మిగిలి ఉన్నారు. ఈ రోజు నామినేషన్స్ డే.. అభిజిత్4 మోనల్3 హారిక లాస్య అరియానా సోహెల్ 2 each. అవినాష్ కి ఒక్క ఓటు వచ్చినందువల్ల సేవ్ అయ్యాడు అఖిల్ కెప్టెన్సీ ఇమ్యునిటీ ఉంది.    

వివరాలలోకి వెళ్తే సోహెల్ అండ్ అఖిల్ మాట్లాడుకుంటున్నారు ఆ ముగ్గురుకి గుడ్ మోర్నింగ్ కూడా చెప్పలేదు నాకసలు నచ్చరంటే ఇక తాకను కూడా తాకనివ్వను వాళ్ళని అని చెప్తున్నాడు అయ్యగారు. 

పొగరని అందరు అన్నా అది నా నైజం అన్న లైన్స్ నచ్చాయ్ అని అభి అండ్ కో అంటున్నారు. ఇది చాలా మంది ఫేవరెట్ లైన్ లే అంటే ఐతె నాకొద్దులే అంటా అభి. 

కెప్టెన్ గా అనౌన్స్ చేసి బాండ్ పంపించారు అఖిల్ కి మీటింగ్ పెట్టి అవినాష్ ని రెండు వారాలు చేశావ్ కదా అంటే అండరూ వరస్ట్ అంటూ గోల చేశారు. ఇదివరకు నేను మాటిచ్చాను లాస్య అక్క మూడు రోజులే రేషన్ మానేజర్ గా చేసింది సో తనకే ఇస్తున్నా అని చెప్పాడు లాస్య అభి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అస్సలు ఊహించినట్లు లేదు లాస్య. థ్యాంక్స్ చెప్పడం కూడా తనని హగ్ చేస్కున్నపుడు చాలా వెరైటీగా అనిపించింది మనస్ఫూర్తిగా కాకుండా చాలా ఇబ్బందిగా కనిపించింది. నేనైతే సోహెల్ ని చేస్తాడేమో అనుకున్నాను ఇంట్రెస్టింగ్ లాస్యని చేయడం బావుంది. 

సోహెల్ రేషన్ వచ్చినపుడు కూడా వాడుంటే ఆసల అని మెహబూబ్ నే తలుచుకుంటున్నాడు. నాగ్ సర్ పంపిన మటన్ కూడా వచ్చింది అని అంతా ఎగిరి గంతులేశారు. 

నామినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో వరస్ట్ పెర్ఫార్మర్స్ మెడలో ఉన్న హార్ట్ మీద పొడిచి నామినేట్ చేయాలి. ఈ కారణాలు మాత్రమే కాక వేరె కారణాలున్నా చెప్పచ్చు. అఖిల్ కి ఇమ్యునిటీ. 

అఖిల్ అభిజిత్ అండ్ హారిక ని చేశాడు. లాస్ట్ వీక్ వెళ్ళేప్పుడు బాధపడ్డాను అని చెప్పాడు కానీ నేను చూసింది వేరే బాధపడక పోయినా పర్లేదు కానీ నవ్వుకోవద్దు అని అన్నాడు. రోబో టాస్క్ తప్ప ఇంకెందులో పెర్ఫార్మెన్స్ కనపడలేదు. ఇమ్యునిటీ అక్కర్లేదు ప్రజలు సేవ్ చేస్తారని చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి అని. మేకని గడ్డిచూపించి లోపలికి పిల్చాడు తర్వాతేమైంది ఎక్స్ట్రా ప్రోటీన్ పెట్తి పులిలా బయటికి వదిలాడు నేను కెప్టెన్ అయ్యా అన్నాదు. 

హారిక అన్నది నా విషయంలో అఖిల్ సింపతీ కార్డ్స్ ఎన్ని సార్లు యూజ్ చేస్తారని అంది ఎన్ని సార్లు వాడానో నాకు గుర్తు లేదు. అది వర్స్ట్ లైన్ అమ్మ గారిని కూడా నేను ఇదే రీజన్ తో నామినేట్ చేశాను. నువ్వు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి గుచ్చాలి అంటే నాకు చెప్పకు ఎట్లా ఆడాలో అది నా ఇష్టం అని అన్నాడు అఖిల్ దానికి హా నీకు చెప్పేటోడు ఎవడ్లేడు ఇక్కడ నీకు అని తెలుసు అని అభి చాలా వెటకారంగా అన్నాడు. 


మేక పులి కాదు బాబు మేక బలైతది అని చెప్పాడు అభి. జరిగిన దాని తర్వాత కూడా బుద్ది రాలేదు కానీ నా సోచ్ గురించి మాట్లాడదానికి నువ్వు ఏవరివి అని అంటున్నాడు. 
అభి అండ్ అఖిల్ మధ్యలో చాలా డిస్కషన్ జరిగింది ఎక్కువే.. నువ్వు జేసిన గేం లు ఇంట్లో ఆడుకో ఇక్కడ కాదు అంటున్నాదు అభి. ఇద్దరు కూడా ఒకరినొకరు రెచ్చగొట్టుకునేలా మాట్లాడుకున్నారు.   
అభి బాగానే ఇరిటేట్ అయ్యాడు కోపం వచ్చింది బాగానే రైజ్ అయ్యాడు. 

అఖిల్ అండ్ అభి మధ్య వాదన. అభి కూల్ అండ్ కంపోజ్డ్ క్లారిటీ ఇన్ థాట్ అండ్ ప్రెజెంటేషన్ అన్ బీటబుల్. ఇలాంటి రెచ్చగొట్టే వాదనలు జరిగినపుడే తన ఒరిజినాలిటీ బయటపడుతుంది. ఇలాంటపుడు కూడా అలాగే కంపోజ్డ్ గా ఉండగలుగుతున్నాడా అనేది. ఉదాహరణకి ఈ రోజు బాగానే కోపం వచ్చింది నువ్వు బచ్చాగాడివి పక్కకి కూచో నాకు బిగ్ బాస్ తో మాట్లాడడానికే భయం లేదు నువ్వు ఎవడివి అని అనడం అంతా కాస్త లైన్ క్రాస్ చేసి తన కూల్ కోల్పోయాడనిపించింది. ఇలాంటి సిట్యుయేషన్ లో ఇలా బిహేవ్ చేయడంవల్ల తన వోట్ బాంక్ తగ్గే అవకాశాలు లేకపోలేదు.   

అండ్ అఖిల్ ఈగో అండ్ చైల్డిష్ నెస్ కూడా ఇంకా కనిపించింది ఈ రోజు ఎపిసోడ్ లో. పిల్లాడు అంటే పిల్లాడిగానే బిహేవ్ చేస్తున్నాడు అనేది నో డౌట్. పులిలా బయటికి వచ్చింది అంటూ ఆ పాయింట్ చుట్టూ అంత సీన్ చేయడం అనవసరం కాకపోతే అలా చేసి రెచ్చగొట్టబట్టే అభి ఒరిజినాలిటీ కూడా బయటపెట్టగలిగాడనిపిస్తుంది. 

అరియానా అభి ని నామినేట్ చేసింది ముగ్గురు పేరు చెప్పలేకపోయినందు వల్ల మేం డెసిషన్ తీస్కోవాల్సి వచ్చింది. ఆ ప్రక్రియ ఐకమత్యం లేదని అనిపించింది ఒక ప్రాసెస్ ని రెస్పెక్ట్ చేయాలి ఏకీభవించలేదు కాబట్తి అని అమ్ది. 
లాస్య నాకు అర్యానా కాంపిటీషన్ కాదన్నారు. అందరూ ఈక్వల్ ఎవరి పేరు చెప్పను ఎవర్ని పంపను అని అన్నపుడు మీరు వెళ్ళాల్సింది అని అంది మీరు కూడా ప్రాసెస్ ని ఆపేయడం బాలేదు. నన్ను నామినేట్ చేసినపుడు హౌస్ హార్మొని పాడైందని చెప్పారు. మీవల్ల కూడా పాడైంది డెసిషన్ కూడా తీస్కోలేదు. యాపిల్ టాస్క్ కూడా చెప్పాడు. 

అభి బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు కెమేరాలు ఉన్నాయ్ని మాకు తెలుసు కదా అది ఫ్రంట్ బిచ్చింగే అని అన్నాదు. 

సోహెల్ నాకు చిచ్చుబుడ్డి ఇచ్చిన వాళ్ళకి థాంక్స్ చెప్పి అది వెలుతురు ఇస్తది నిలబడి ఉంటుంది. ఆటం బాంబ్ కన్నాచిచ్చుబుడ్డే బెటర్ అని నేనంటా బాంబ్ పేలి దబ్ అని సౌండ్ వస్తుంది డిస్ట్రబెన్స్ ఇస్తుంది చిచ్చుబుడ్ది హౌస్ కి హాపినెస్ ఇస్తుంది అని లాజిక్ ఇచ్చాడు. 

హారిక ఎవ్వడ్ దేఖడు వేస్ట్ గాడు అని నన్ను అన్నందుకు నిన్ను ఎప్పుడూ అనలేదు ఐనా నన్ను ఇన్ని మాటలు అంటావా అని అన్నాడు. చాలా బాధనిపించింది. 
నీఅవ్వ పోబే అన్నది నీకు ఊతపదం అన్నపుడు దేఖడు వేస్ట్ గాడు అన్నది నా ఊతపదం అని హారిక వాదన. 

వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కూడా బాగా జరిగింది. ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. హారిక కూడా ఏం తగ్గలేదు అస్సలు. 
వీళ్ళిద్దరి వాదించుకుంటుంటే సోహెల్ వైపు నవ్వుకుంటూ చూస్తున్నాడు అభి. హారిక ఏమాత్రమూ తగ్గలేదు. 
  
సోహెల్ హారికల మధ్య డిస్కషన్ లో కూడా సోహెల్ చేసినది ముమ్మాటికీ తప్పు. హారిక చాలా ఫీలైనట్లు కనిపించింది. ఈ విషయమై నాగార్జున గట్టిగానే ఇస్తారనుకుంటున్నాను సోహెల్ కి ఈ వీకెండ్. అండ్ ఈ రోజు తను టంగ్ స్లిప్ అయిన దానికి మూల్యంగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు కాకపోతే అఖిల్ అండ్ మెహబూబ్ ఫాన్స్ గట్టిగా ప్లాన్ చేస్తే ఉండే అవకాశాలూ లేకపోలేదు. 

అభికి రోబో టాస్క్ తర్వాత అంత మళ్ళీ నాకు కనపడలేదు పెర్ఫార్మెన్స్ అందుకే చేస్తున్నా అన్నాడు. 

లాస్య అరియానా ని నామినేట్ చేసింది నేను ఎవరిని పంపించడానికి రెడీగా లేను పంపించాలని ఆలోచించారు కానీ ఉంఛడానికి ఐకమత్యంగా ఎవరూ ఎందుకు ట్రై చేయలేదు అని అంది. నేనైతే ఎవరిని పంపడానికి రెడీగా లేను. 
మోనల్ ని సెకండ్ నామినేషన్ రిలేషన్ లో ప్రాబ్లం ఏం లేదు టాస్క్ ల విషయంలో నువ్వు తక్కువ పెర్ఫార్మ్ చేస్తున్నావు. కుకింగ్ విషయంలో నాకు అవ్వడం లేదునిన్ను చేయమన్నపుడు చేస్తాను అని చెప్పి వదిలేయడం నచ్చడం లేదు అని అంది. నో ఆర్గ్యుమెంట్. 

హారిక సోహెల్ ని మొన్న కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చేయ్ అన్నపుడు ఓడిపోయావ్ అది నీ తప్పు అని అన్నాడు అప్పుడు హర్ట్ అయ్యాను అని చెప్పింది. సర్లే ఇపుడు నీకు చెశా కాబట్తి నువ్వు చేస్తున్నావ్ అంతే అని అన్నాడు.  ఇద్దరు అరుచుకున్నారు మళ్ళీ. 
మోనల్ మిగతా ఎవ్వరి మీద నాకు రీజన్స్ లేవు ఆ రోజు ఇంటి నుండి పంపాలి అన్నపుడు వీళ్ళు అది అడ్వాంటేజ్ అవుతుందేమో అని పేరు సెలెక్ట్ చేస్తున్నారు అనుకున్నం యా నిజమే అని నాతో ఒప్పుకున్నావ్ అండ్ వెంటనే వెళ్ళి అఖిల్ పేరు చెప్పావ్ అది నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని అంది. 

మోనల్ లాస్య కి నేను పని టైమ్ కి చేయడం లేదని లాస్ట్ వీక్ కూడా నామినేట్ చేశారు. నాపని నేను చేస్తాను. నాది తెలుగు కాదు కనుక నేను ఎక్కువ కష్టపడుతున్నాను. నేను హిందీలో చెప్పినా కూడా మీరు తప్పు అర్ధం చేసుకుంటున్నారు అని అంది. గేం గురించి మాట్లాడితే మీ ఎఫర్ట్ తక్కువ అనిపిస్తుంది అంది. 
అవినాష్ రేషన్ మానేజర్ గా ఫెయిల్ అయ్యారు అని చెప్పింది. అది నా అభిప్రాయం అందుకే నేను చేస్తున్నా. సోహెల్ హెల్ప్ తో చేస్తానని చెప్పి కూడా మీరు చేయలేదు అలా ఎలా నన్ను చేయట్లేదని చెప్తారు అని అన్నాడు అవినాష్. 

అవినాష్ మోనల్ ఇక్కడ అందరూ అలాగే మనిల్లు లాగా ఫీలవుతున్నారు. ఎవరైనా పని చెప్తే చేయి అంటే.. మోనల్ ఐహాఅవ్ టు లెర్న్ హౌటు సే నో ఎవరైనా పని చెప్తే నో చెప్పడం అలవాటు చేస్కుంటాను అని చెప్పింది. 
అభిని రోబో టాస్క్ బాగా ఆడారు తప్ప ఇంకో దాన్లో మీ పెర్ఫార్మెన్స్ చూడలేదు అందుకే అన్నాడు. 

అభి అరియానా కి ఏకాభిప్రాయానికి రానందుకు అని చెప్పాడు. అరియానా కూడా సైలెంట్ అయ్యింది. 
సోహెల్ కి సెకండ్ ఆల్రెడీ ఒక సారి ముందు చెప్పా నువ్వు మళ్ళీ మాట్లాదుతున్నావ్ అని అన్నాడు నీ యవ్వ అని నాతో మాట్లాడకు అని చెప్పాడు. చాలా కూల్ గా చెప్పాడు అంతే కూల్ గా సోహెల్ కూడా జవాబు చెప్పడం మొదలు పెట్టాడు. నువ్వు కూడా ఆరియానా తో నీయమ్మ ఏందిది అన్నావ్ కదా అన్నాదు. 
సోహెల్ అఖిల్ ఇద్దరూ కూడా వెటకారం చేస్కున్నారు శ్లాంగ్ గురించి.
నాతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు అని అన్నాడు. నా లాంగ్వేజ్ ఇంతే ఉంటుంది ఊతపదానికి నామినేట్ చేస్తుంటే నేనేం మాట్లాడను అని చెప్తున్నాడు. మేమందరం ప్రొఫెషనల్ కెపాసిటీ లో వచ్చాం నువ్వు షూటింగ్ లో మాట్లాడ్తావా అన్నాడు అభి. ఐనా కానీ నువ్వు కంటిన్యూ చేస్తున్నావ్ అన్నాడు. 

నువ్వు అరుసుకుంట మాట్లాడితే సైలెంట్ ఉండడానికి నేను వాళ్ళ కింద పని చేయడం లేదు అంటే లాస్య సైలెంట్ గా ఉండు అని అంటుంది సైలెంట్ గా ఉండే ప్రసక్తే లేదు నేను ఊర మాస్ అని అంటుంది హారిక 

గింత లేవు అని అన్నావ్ అంటే కావాలనే హర్త్ చేయాలని అన్నాను అని అంటున్నాడు సోహెల్ అరియానతో. ఇదే వేస్ట్ గాడని అభిని అనమను ఒక్క మాట తీస్కోడు అతను అట్లాటోళ్ళే కరెక్ట్ ఆమెకి. హౌస్ లో బ్రో కామెడీ చేస్తున్నాడు. 

రేపటి ప్రోమోలో బిగ్ బాస్ ఇల్లు ఒక కమేండో ఇన్స్టిట్యూట్ గా మారబోతోందిట. మిలటరీ ట్రైనింగ్ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తున్నారు. మంకీ బార్స్ కి కాళ్ళు చేతులు లాక్ చేసి హాంగ్ అయ్యాడు అభి. దట్ లుక్స్ గుడ్. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts