28, నవంబర్ 2020, శనివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందొ నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్. ముఖ్యమైన పాయింట్స్ అందులో చూడవచ్చు. నా అభిప్రాయాలు వీడియోలో మాత్రమే ఉంటాయి. 



నాగార్జున హోస్టింగ్ రోజు రోజుకీ పదునెక్కుతుంది. ఈ రోజు తన హోస్టింగ్ చాలా బావుంది మరో మెట్టెక్కేశారు అనిపించింది. హౌస్మేట్స్ ని అవసరమైన చోట నాన్నలా దండించారు అలాగే అమ్మలా అక్కున చేర్చుకున్నారు. ఒక ఆత్మీయ స్నేహితుడి లా మంచి సలహా ఇచ్చి ఆచరించమని అభ్యర్థించారు. తన స్పాంటేనిటీకి క్విక్ అండ్ ఫర్మ్ రెస్పాన్స్ నిర్మొహమాటంగా మాట్లాడిన విధానం ఓవరాల్ గా నాగ్ డిడ్ ఎ వండర్ ఫుల్ జాబ్.

ఈ రోజు హైలైట్స్ లో శుక్రవారం చూపిస్తారు కదా ఉదయం అఖిల్ అండ్ అభి మధ్య లైట్ గా గొడవైంది బ్రేక్ ఫాస్ట్ విషయమై. తర్వాత వరసగా చిన్న చిన్న ప్రమోషనల్ టాస్క్ లు ఇచ్చారు. 

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో హారిక కి కన్ఫెషన్ రూమ్ లో చిన్న చిన్న వీడియోస్ చూపించి తను ఎలా ఫేవరిటిజమ్ చూపిస్తుందో క్లియర్ గా చూపించారు. బెస్త్ కాప్టెన్ కాదని బల్లగుద్ది చెప్పారు. తను మిగిలిన వళ్ళ లాగా ఓపెన్ గా సపోర్త్ ఛేస్తున్నా అని చెప్పి చేసుంటే ఏమనక పోయి ఉందురు కానీ మసి పూసి మారేడు కాయ చేసేసి ఇంతింత ఎక్స్లనేషన్స్ ఇచ్చి డ్రామా చేయడంతో బిగ్ బాస్ కి కూడా విసుగొచ్చి ఇంత క్లారిటీ ఇచ్చారనిపించింది. 

హారిక కి కన్ఫేషన్ రూమ్ లో వీడియోస్ చూపించి క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ అభిజిత్ విషయంలో మాత్రం ఓపెన్ గా అందరి ముందు చూపించారు ఒక వీడియో. తప్పు ఒప్పుకోకపోతే బయటికి పంపేద్దామని డిసైద్ అయ్యారట. మరీ కొంచెం ఎక్కువ హార్ష్ గా వ్యవహరించారేమో తినని కూడా కన్ఫెషన్ రూం కి పిలిచి వార్నింగ్ ఇస్తే బావుండేదేమో అనిపించింది నాకు. 

ఇక ఈ రొజు ఫస్ట్ మోనల్ సేవ్ అయింది. అవినాష్ ని ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారమా వచ్చేవారమా నీకోసమా వేరే వాళ్ళ కోసమా ఎలా వాడుకుంటావ్ డిసైడ్ చేసి రేపు చెప్పు అని ఆప్షన్ ఇచ్చారు.  

వివరాలు :

83 వ రోజు ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం కాటమరాయుడు సినిమాలోని మిరా మిరా మీసం పాటతో మేల్కొలిపారు. 

లాస్య ఎలిమినేట్ అయి వెళ్ళడం కాదు కానీ కిచెన్ లో నానా కష్టాలు పడుతున్నారు వంటకోసం. అఖిల్ దోశలు బాగా వేస్తా అని చేస్తుంటే వంటకోసం నువ్వు నన్ను పర్మిషన్ తీస్కొని చేయాలి అని అంటున్నాడు అభి. కింగ్ ఆఫ్ ద కిచెన్ అని నాకు చెప్పారు బిగ్ బాంబ్ అని వేశారు సో నువ్వు చేసేట్లైతే నన్ను పర్మిషన్ అడిగి చేయాలి అన్నాడు. అఖిల్ కి కోపం వచ్చేసింది రోజు సోహెల్ హెల్ప్ చేస్తున్నాడు కదా అలాగే నేను చేస్తా అని వచ్చాను అంటున్నాడు ఇద్దరూ ఈ విషయమై గట్టి గట్టిగా వాదించుకున్నారు.  

అభి బ్రేక్ ఫాస్ట్ బాగా లేట్ చేయడం సరిగా చేయకపోవడం చేస్తున్నట్లున్నాడు ఇంట్లో నిన్న కూడా కొందరు ఇదే విషయమై కంప్లైంట్ చేశారు. నాలుగు రోజుల నుండి కార్న్ ఫ్లేక్స్ చేస్కుని తింటున్నా సరిగా తినడం లేదు టిఫిన్ అని చెప్తున్నాడు అఖిల్. 

అభి ఏమో దోశ కాదు అతని యాటిట్యూడ్ ప్రాబ్లం అని చెప్తున్నాడూ అఖిల్ కూడా నేనసలు నచ్చను ఆ మనిషికి అందర్ని అడుగుతాడు కానీ నన్ను మాత్రం అడగడు టిఫిన్ గురించి అని చెప్తున్నాడు మోనల్ తో. 
 

పంకజ్ కస్తూరీ బ్రీత్ ఈజీ అనే టాస్క్ ఇచ్చారు అవినాష్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించాలి అందరితో అండ్ ఆ తర్వాత అందరు లాఫ్టర్ క్లబ్ చేయాలి అంటే అందరూ రౌండ్ గా నిలబడి నవ్వాలి. 

స్కందాంశీ వారి టాస్క్ ఇచ్చారు. 
జండాలని పాతి ప్రాపర్టీస్ ని ఆక్రమించాలి ఎవరు ఎక్కువ కాపాడుకుంటే వారు విన్. 
సంచాలక్ మోనల్ 
బ్లూ హరిక అవి అభి
రెడ్ సోహెల్ అరియానా అఖిల్ 
బ్లూ టీమ్ గెలిచింది. అయ్యాక అందరికి గిఫ్ట్ బాక్స్ లు వచ్చాయ్ 

అవినాష్ పది మాంగో బాటిల్స్ విన్ అయ్యారు. ఎవరిని చీరప్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక బాటిల్ ఇచ్చి చీరప్ చేయండి అని చెప్పారు. సోహెల్ ఆ సరే ఎవరో ఒకరు తాగాలి అంతె కదా ఓకే అని ముందుకొచ్చేసి తీస్కోబోతుంటే ఆహా నో అని అవినాష్ అరియానాకి ఇచ్చాడు. 

బెస్ట్ కాప్టెన్ ఎవరు వరస్ట్ కాప్టెన్ ఎవరు అని సెలెక్ట్ చేశారు అది కరెక్టా కాదా చూద్దాం అని లోపలికి తీస్కెళ్ళారు. 

అందర్ని ఇంప్రెస్ చేసి బెస్ట్ అయ్యావ్ కంగ్రాట్స్ అని 
నువ్వు చేసిన బెస్ట్ తింగ్స్ ఏంటి అని అడిగారు
చేసినవి చెప్పింది పక్క వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. నేనే చూశాను నిద్రపోకుండా అని చెప్పారు. 
సరే నీకో వీడియో చూపిస్తాను అది ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అడిగారు. 
అభిజిత్ టాస్క్ చేయను అన్న వీడియో చూపించారు. రెండు రెస్పాన్సిబిలిటీస్ మిస్ అయ్యావ్ ఇంగ్లీష్ మాటాడుతుంటే తెలుగు లో మాట్లాడమనలేదు టాస్క్ చేయనంటే నువ్వు కన్విన్స్ చేయాలి కదా ఎందుకు ఫెయిల్ అయ్యావ్ అని అడిగారు. 
కావాలని ఏడిపించలేదు అని అంది హారిక సిట్యుయేషన్స్ అలా వచ్చాయి అంది. సరే అని అభి ఏడిపించా అన్న వీడియో చూపించారు. అతనన్నమాటే కదా అని అన్నారు. 
నువ్వు అభికి ఫేవరిటిజం చూపించావ్ అని స్పష్టంగా అనేశాడు నాగ్.
లేదు అలా ఐడోంట్ వాంట్ మోనల్ బిజినెస్ అని అన్నపుడు  
అభి మోనల్ నైట్ మా నాన్నకి నచ్చావ్ అని అన్న వీడియో చూపించారు. ఆయనే ప్రొజెక్త్ చేస్తున్నాడు మా నాన్నకి నచ్చావ్ అని మీ అమ్మ చూస్తుంది నువ్వు చూడలేదు అని అంటున్నాడు. 
నువ్వు ఫర్ ద పీపుల్ అన్నారు కానీ నువ్వు మోనల్ వల్ల  కేప్టెన్ అయి అభిజిత్ కోసం కెప్టెన్ అయ్యావ్. 
      
హారికని మాములుగా ఆడుకోలేదు మోనల్ కి ఇమ్యునిటీ అపుడు చేసిన సపోర్ట్ గురించి అన్నీ క్లిప్పింగ్స్ చూపించి చాలా క్లియర్ గా ఇచ్చారు నాగ్. బజర్ మోగాకే తీస్కొని బయల్దేరింది. 

అభి చెట్టుకి ఆకులు లెక్కపెట్టే టాస్క్ ఎందుకు చేయలేదు
టాస్క్ డినై చేసినపుడు కన్విన్స్ చేసి చేయించాల్సి ఉంది అని హారిక చెప్పింది. అభి టాస్క్ చేయకపోడానికి చెప్పిన కారణం రైటా రాంగా అంటే రాంగ్ అని చెప్పింది. 
నువ్వు బెస్ట్ కేప్టెన్ కాదు అన్నారు. 
నువ్వు నీకోసం ఆడాలి ఎవరి కోసమో కాదు అని క్లియర్ గా చెప్పారు.  
మోనల్ శ్వాప్ చేసిన తను నచ్చిన వాళ్ళతో చేసుండాల్ ఇ
ఎవిక్షన్ ప్రీ పాస్ ఐనా అఖిల్ కి సపోర్ట్ చేయాల్సింది
టాస్క్ విషయంలో కన్విన్స్ చేయాల్సింది
ఇంగ్లీష్ విషయంలో ఆపుండాల్సింది.   

అభిజిత్ కి ఫేవర్ గా చేస్తే చేసింది కానీ నేను సూపర్ అన్నట్లుగా ఇది టఫ్ డెసిషన్ అనీ అదనీ ఇదనీ ఇంత పెద్ద పెద్ద స్పీచ్ లు ఇవ్వడం టూమచ్ అనిపించింది. దానికి తగినట్లు బాగా క్లియర్ గా వీడియోస్ తో క్లారిటీ ఇచ్చి హారిక తోనే ఏమేం తప్పులు చేసిందో మళ్ళీ చెప్పించడం మాత్రం టూ గుడ్. నాగ్ సర్ ఆన్ ఫైర్ అండ్ టూ గుడ్.. 

హౌస్ లో ఎవరెవరు ఏం తప్పు చేశారు మీరు మీరే చెప్తే ఐఫీల్ హాపీ అని చెప్పారు. 
సోహెల్ నేను అరియానాని వెక్కిరించడం తప్పు అని చెప్పారు. 
అదొక్కటేనా అని అంటే ఆ రూం లో భయపడలేదు అని అబద్దం చెప్పాం హౌస్మేట్స్ కి అని అన్నాడు. అలాగే మోనల్ విషయంలో తల ఊపినది కూడా తప్పు అని చేసి చూపింఛారు బ్రెయిన్ పడిపోద్ది అని నవ్వించారు. 
అరియానా ని నువ్వు వర్స్ట్ కాప్టెన్ కాదు నువ్వు గుడ్ కాప్టెన్ అని అన్నారు. 
మరి నువ్వు ఏం తప్పు చేశావ్ అంటే డల్ అయ్యాను సరిగా సపోర్ట్ చేస్కోలేకపోయాను అని అంది. ఎదుటి వాళ్ల కల్లలోనుండి నిన్ను నువ్వు చూస్కోకు బి స్ట్రాంగ్ అని అన్నారు. 
అవినాష్ ని అడిగితే అరియానాని వెర్రిపప్ప అని అన్నాను తప్పు అని అన్నారు. 
ఇంకో తప్పు స్మశానం టాస్క్ లో గెలవాలనే తపనలో ఎక్కువ అలోచించి టాస్క్ డిలే చేశాం. అని అన్నారు హండ్రెద్ పర్సెంట్ ట్రూ ఇక్కడ ఏం జరిగినా బిగ్ బాస్ ఆదేశంతోనే జరుగుతుంది అన్నారు. 
లక్ అని ఏమన్నావ్ అని అడిగారు. నామినేషన్స్ లో లేకపోతే నీ ఎనర్జీ ఇంత ఎత్తులో ఉంటుంది అని అన్నరు. జోబులో ఎవిక్షన్ పాస్ ఉందా అని ఈ వరం వాడుతున్నావా లేక వచ్చేవారమా నీకోసమా లేక వేరే వాళ్ల కోసమా అని అన్నారు. 
ఆలోచించి చెప్తా అన్నాడు. 

మోనల్ నామినేషన్ లో మాములుగా అఖిల్ ని సపోర్ట్ చేస్తాను ఫస్ట్ టైం గట్టిగా నా కోసం నేను ఆర్గ్యూ చేశాను. అలాగే తన పాయింట్స్ రైజ్ చేశాడు కానీ ఒకసారి కూడా అడగలేదు అడిగితే చేద్దామని ఎదురు చూస్తున్నాను. నేను అభితో శ్వాప్ అవడం బాడ్ అని ఫీలయ్యాను అని చెప్పింది. బాగా ఆడుతున్నావ్ అని చెప్పారు.  
సోహెల్ ని ఛీ అని ఎందుకు అన్నావ్ అని అడిగారు. 
వివరించాక నాకు అర్ధమైందేంటంటే తొమ్మిద్ తర్వాత ఖార్ఖాన అవీ లేవు అందుకే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు మా సోహెల్ అని చెప్పి నవ్వించారు.    

అఖిల్ ని అడిగితే జలజ టాస్క్ విషయంలో ఎక్కువ ఆలోచించాం లెటర్ మీద బిగ్ బాస్ అని లేవు కాబట్టి అని చెప్పాడు. లెటర్ గార్డేన్ ఏరియాలోనో మరో చోటో పడలేదు కదా స్టోర్ రూం లోకి వేరె ఎవరు తెచ్చి పెడతారు అని అడిగి క్లియర్ గా చెప్పారు. సీక్రెట్ రూం నిండి వచ్చినపుడు హారిక ఐ హేట్ యు అన్నపుడు నువ్వు ఎపుడు నాకు ఐ లవ్ యూ అని చెప్పావ్ అని అడిగాను అది ఫ్లోలో చెప్పడం తప్పు అని అన్నాడు. 

గేట్స్ ఓపెన్ చేయ్ అని అడిగారు నాగ్. తర్వాత అభి ని పిలిచారు. ఏడిపింఛారు అని అన్న పాయింట్ నాకు నచ్చలేదు లింకప్ చేయద్దు అని చెప్పాను బిగ్ బాస్ కి అని చెప్పారు. ఓకే నువ్వు ఏడిపించలేదా అని అడిగారు లేదు అంటే వీడియో చూపించి నువ్వు అన్న పదమే అది నువ్వు చెప్పిన మాటలే బిగ్ బాస్ లో పంపించారు అని చెప్పారు. 

ఆకులు లెక్కపెట్టే టాస్క్ లో రూల్ బ్రేక్ చేస్తున్నా అని చెప్పావు మరి టాస్క్ చేయకపోవడం రూల్ బ్రేక్ చేయడం కాదా అని అడిగారు. వన్ సింపుల్ తింగ్ 

నువ్వు పదే పదే తప్పు చేస్తున్నావ్ మళ్ళీ సారీ చెప్తున్నావ్ నువ్వు తప్పు చేశాను అని ఒప్పుకోకపోతే బయటికి పంపేవాడ్ని అని చెప్పారు. 

మీరు సూపర్ సెవెన్ ఒక చిన్న విషయానికి మీరు రియాక్ట్ అయేదాన్ని బట్టి ఓటింగ్ పాటర్న్ అంతా మారిపోతుంది అని చెప్పారు. బాగా ఆడండి అని చెప్పారు. మీరందరు అంటే నాకు ఇష్టం మీ గురించే ఆలోచిస్తాను ఐ లవ్యూ అని చెప్పారు.    

టైం టు సేవ్ వన్ అని చెప్పారు. 
ఈ వారం కూడా తొమ్మిదిన్నర  కోట్ల ఓట్లు వచ్చాయిట. ఒకతనికి బ్రెయిన్ సర్జరీ చేసే టైంలో అతనికి బిగ్ బాస్ చూపింఛారు అతనడిగి పెట్టించుకున్నాడుట అని చెప్పారు. 

కవర్స్ ఇచ్చారు ఒక్కొక్కళ్ళు పుల్ చేయాలి చేస్తే సేవ్ ఆర్ అన్ సేవ్ అనేది తెలుస్తుంది. 
మోనల్ సేవ్ అయింది చాలా గట్టిగా ఏడ్చేసింది ఎమోషన్ అస్సలు ఏమాత్రం కంట్రోల్ చేస్కొలేకపోయింది. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నా పాయింట్ రైజ్ చేశాను నాకోసం మాట్లాడాను నా ఫ్రెండ్ ని కూడా రిస్క్ లో పెట్టాను. మెనీ మెనీ థ్యాంక్స్ టు తెలుగు ప్రేక్షకులకి అని చెప్పింది. 
నీ ఆట నువ్వు నీకోసం ఆడావు అందుకే ప్రేక్షకులు సేవ్ చేశారు అని చెప్పారు. 

నామినేట్ అయిన ముగ్గురుని నిలబడమన్నారు. 
ఎవిక్షన్ పాస్ నీకోసమా వేరే వారి కోసమా ఈ వారమా లేక వచ్చేవారమా ఆలోచించి చెప్పు రేపు కలుద్దాం అని చెప్పారు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts