ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. కింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ అందులో రిఫర్ చేయవచ్చు.
చాలా స్పెక్యులేషన్స్, లీక్స్, డిస్కషన్స్ అన్నిటిని దాటుకుని బిగ్బాస్ ఫైనల్ డేకి వచ్చేసింది. లాస్ట్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ని చాలా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేసిన స్టార్ మా ఈ ఏడాది ఎలా చేస్తుందో ఛీఫ్ గెస్ట్ ఎవరో అనుకుంటూ ఆసక్తిగా ఎదురు చూశాను. మొదటి అండ్ చివరి పొజిషన్స్ అభి అండ్ హారిక అని ముందే ఫైనల్ అయినప్పటికీ మధ్యలో మూడు స్థానాలు ఎవరై ఉంటారా అనే ఉత్కంఠ మాత్రం చివరి వరకూ బాగానే కొనసాగింది. అన్ అఫిషియల్ పోల్స్ లో ఎన్నిసార్లు ఇన్ కాగ్నిటో మోడ్ లో పెడితే అన్ని ఓట్లు వేస్కోవచ్చు మన ఫేవరెట్ కంటేస్టెంట్స్ కి అందుకె వాటిని నమ్మలేం అనేది సత్యం.
ఇక ఈ రోజు ఎపిసోడ్ కి వస్తే అప్పటి వరకు ఒక లెక్క బాస్ ఎంటర్ అయ్యాక ఒక లెక్క అన్నట్లుగా చిరు ఎంట్రన్స్ తో ఎపిసోడ్ మొత్తం మారిపోయింది ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ సీజన్స్ అనిపించడంలో ఏం సందేహం లేదు.
మొదట ఐదవస్థానంలో హారిక, నాలుగులో అరియానా ఎలిమినేట్ అయ్యారు. మూడో స్థానానికి పాతిక లక్షలు ఆఫర్ చేస్తే సోహెల్ స్మార్ట్ మూవ్ తో అది అందుకుని వచ్చేశాడు. దానితో టాప్ టు అభి అండ్ అఖిల్ గా నిలిచారు. అభి విన్నర్ అండ్ అఖిల్ రన్నరప్.
ఐతె సోహెల్ పాతిక లక్షలతో బయటికి రావడంతో ఆ డబ్బును ప్రైజ్ మనీలో నుండి తీసేయడం మాత్రం అన్యాయం అనిపించింది. అభికి ట్రోఫీతో పాటు పాతిక లక్షలు మాత్రమే ప్రైజ్ మనీ వచ్చింది అండ్ టీవిఎస్ తరఫున అపాచీ బైక్ కూడా వచ్చింది.
విన్నింగ్ స్పీచ్ లో అభి వాళ్ళ అమ్మ గారు పిల్లలు ఇద్దరిని అభిని అఖిల్ ని మీ అంత గొప్పవాళ్ళవాలని దీవించండి అని కోరి తన మంచి అమ్మ మనసును చూపించారు చాలా బాగా అనిపించింది.
ఐతే సోహెల్ మొదట పాతిక లక్షల్లో ఐదు ఛారిటీకి ఐదు మెహబూబ్ కి ఇస్తాను అన్నాడు పదిహేను తను ఉంచుకుని. మెహబూబ్ తన ఐదు కూడా ఛారిటీకే ఇస్తా అంటే వద్దు ఈ పాతిక నువ్వే ఉంచుకో నేను పది లక్షలు ఇస్తాను ఛారిటికి మీ తరఫున అని నాగ్ చెప్పారు.
ఇక చిరు వచ్చాక సోహెల్ కోసం హలాల్ ఘోష్ తో బిర్యాని వండించుకుని తెచ్చారు సురేఖ గారు పంపారని. దానితో పాటు సోహెల్ మీ సపోర్ట్ కావాలి అని అడిగితే. ఏం చేయమంటావ్ అని సినిమాలో గెస్త్ రోల్ చేస్తాను అలానే ఆడియో రిలీజ్ కూడా నేనే చేస్తా అని మాటిచ్చారు.
మెహబూబ్ మంచితనం గురించి చెప్తే చిరు పదిలక్షల చెక్ అక్కదికక్కడే రాసిచ్చారు మెహబూబ్ కి. అంతే కాక తినకి ఆల్రెడీ రెండు సినిమాలు ఒక వెబ్ సీరీస్ ఆఫర్స్ వచ్చాయని కూడా చెప్పాడు మెహబూబ్.
దివి కి తన వేదాళం సినిమా రీమేక్ లో ఒక రోల్ ఇవ్వమని చెప్పాను నీకు ఏడెనిమిది నెలల తర్వాత ష్యూర్ గా వస్తుంది అని చెప్పారు.
ఎటూ వచ్చి పాపం అఖిలే కేవలం రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది నో మానిటరీ బెనిఫిట్స్.
విన్నర్ ఐన అభి కన్నా సోహెల్ కే ఎక్కువ మానిటరీ బెనిఫిట్స్ రావడమే కాక తనకే రియల్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉండుంటుంది అంటే మన ఇంట్లో మనిషి అన్నట్లుగా ఓన్ చేసుకుని ఉంటారు ప్రజలు అని నా ఫీలింగ్.
వివరాలలోకి వెళ్తే ఈ రోజు గ్రాండ్ ఫినాలే
డాన్ సినిమాలో సు సూరి అన్న పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగ్. డుంగురూ డుంగురూ మ్యూజిక్ తో ఎండ్ చేశారు నాగ్ ప్రతి వీకెండ్ కన్నా ఎక్కువ సేపే డాన్స్ చేశారు. కానీ డ్రస్సే కొంచెం ఆడ్ గా ఉంది అనిపించింది.
లాస్ట్ సీజన్ ఫినాలేకి ఓట్స్ ఎనిమిది కోట్లు ఐతే ఈ సీజన్ పదిహేను కోట్ల అరవై ఐదు లక్షల వోట్స్ వచ్చాయిట.
పందొమ్మిదిమందిలో పద్నాలుగుమంది బయటకి వెళ్ళిపోయారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో మొదలైంది.
ముక్కాలా పాటకి మెహబూబ్
దోచెయ్ దోర సొగసులు పాటకి మోనల్ అండ్ దివి.
రావణా పాటకి అమ్మ గారు
హే పిల్లా నా స్వీటు సిండ్రెల్లా కి స్వాతి దీక్షిత్
నాగులమ్మో గున్నమావి కొమ్మా పాటకి కుమార్ సాయి గంగవ్వ
నక్కిలీసు గొలుసు పాటకి కళ్యాణి గారు
ఫ్యామిలీ పార్టీ పాటకి అవినాష్ తో పాటు హౌస్మేట్స్ అందరూ జాయిన్ అయ్యారు.
ఒక్కొక్కరికి బిగ్ బాస్ ముందు తర్వాత ఎలా ఉంది అని అడిగారు. అంతా బాగా మాట్లాడారు.
గంగవ్వ ఐతే రోజుకి పది పదిహేను కార్లు వస్తున్నాయ్ ఫోటోలు దిగడం యాష్టకొస్తుంది అని అంటున్నారు.
స్వాతి ఆర్జీవి తో వర్క్ చెస్తున్నా అంటే జాగ్రత్త అంటున్నార్ నాగ్ :-)
నోయల్ అవినాష్ అండ్ అమ్మ గారితో ఐ రెస్పెక్ట్ దెం అని మా ముగ్గురి మధ్యా సాల్వ్ చెసేస్కోవాలి అనుకుంటున్నా అని సారీ చెప్పి ఐలవ్యూ మాస్టర్ అని చెప్పి సాల్వ్ చేస్కున్నాడు.
మెహబూబ్ రెండు సినిమాలు ఒక వెబ్ సీరీస్ సైన్ చేశాడట.
లాస్య, మెహబూబ్ ఆల్వేస్ ట్రెండింగ్ అంట.
అందరు కూడా పాపులారిటీ పెరిగిపోయింది అని చెప్పారు.
టాప్ ఫైవ్ పెర్ఫార్మెన్సెస్ చూపించారు
అఖిల్ బాడ్ బాయ్ పాటకి, సోహెల్ పెట్టలో మాస్ మరణం పాటకి వేశాడు.
బూం బూం నకనక పాటకి అరియానా
మైనేమ్ ఈజ్ బిల్లా పాటకి అభి
ఇట్స్ టైం టు పార్టీ పాటకి అందరూ వచ్చేశారు.
అందర్నీ కలిపాక బిగ్ బాస్ హౌస్ జర్నీ అంటూ ఏవీ వేశారు చాలా బావుంది అన్ని రకాల ఎమోషన్స్ తో ఇట్స్ సో బ్యూటిఫుల్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అరిపిస్తున్నారు ఎడిటర్స్.. సో గుడ్..
అందరు ఇష్టమైన ప్లేస్ ని మార్క్ చేయాలి అని చెప్పారు అంతకు ముందు మీ ఫ్యామిలి మెంబర్స్ బెస్ట్ విషెస్ చెప్పబోతున్నారు అంటూ విషెస్ చెప్పారు.
అఖిల్ వాళ్ళ అమ్మగారు నువ్వు ఇక్కడిదాకా రవడం గ్రేట్ నాన్నా నేనేదైనా తీస్కోడనికి రెడీ అని చెప్పి హింటిచ్చేశారు.
అభి వాళ్ళ అమ్మ గారరు మాట్లాడుతుంటే మనం ఇంట్లో ఇలా చెప్పుకోం అని చెప్తే చెప్పుకోఆలి రోజు నోట్ రాసి చెప్పు అన్నారు నాగ్
అరియానా కూడా ఇలా చెప్పుకోం అంటే ఏం దొబ్బుడాయా అని అడుగుతున్నారు నాగ్.
హారిక వాళ్ళ అమ్మగారు, సోహెల్ వాళ్ళ నాన్న గారు మాట్లాడారు. ఏంటి సోహెల్ ఖార్ఖానా అంటుంటే నాన్న ఉన్నారు సర్ అని చెప్తున్నాడు సోహెల్.
అఖిల్ ఎంట్రెన్స్ గేట్
హారిక పూల్ పక్కన బెంచ్ ఇది తీస్కెళ్తా అని అంటే ఓకే అన్నారు.
అభి మెజనైన్ ఫ్లోర్ ఏరియా నేనిక్కడే చిల్ అవుతా అంటే నువ్వు ఎక్కడైనా ఛిల్లే కదా అంటున్నారు.
సోహెల్ కిచెన్ అంటే మటన్ చికెన్ డాన్స్ చేయించారు.
అరియానా స్మోక్ ఏరియా పక్కన అరుగు చెప్పింది. ఏక్యూబ్ డిస్క్వేర్ అని రాసింది.
టైమ్ టు ఎలిమినేట్ వన్..
అందర్ని చెప్పమని అడిగారు. అందరు కూడా ఏదైనా యాక్సెప్ట్ చేస్తామన్నట్లు చెప్పారు. అఖిల్ టాప్ టూ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పాడు పదే పదే వాళ్ళ పేరెంట్స్ మాత్రం బయట సీన్ తెలుసు కాబట్టి కాస్త టెన్షన్ పడుతున్నారు.
ప్రణీత సుభాష్ డాన్స్ మెడ్లీ.. చాలా బావుంది షీ ఈజ్ క్యూట్...
అనిల్ రావిపూడి ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళని బయటికి తీస్కుని రావడానికి వచ్చారు.
ఎఫ్ టూ నాగ్ ఫేవరెట్ అంట. బిగ్ బాస్ ప్రతి రోజు ఫ్యామిలీతో సహా కూర్చుని చూస్తాను అన్నారు అనిల్. మహేష్ షూటింగ్ లో సినిమా ఆపేసి తొమ్మిదిన్నరకి బిగ్ బాస్ చూస్తారుట నాగ్ కి మహేష్ చెప్పారు అన్నాడు.
కొన్ని ప్రశ్నలు ఇచ్చి మీ స్టైల్ లో అడగండి అన్నారు.
నవ్వింఛడం వరకు ఓకే కానీ ఎలిమినేట్ చేసి తీస్కురావడం కష్టం సో మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళకి అప్పచెప్పండి ఆ పని అంటే.
మెహ్రీన్ ని పిలిచారు హనీ ఈజ్ ద బెస్ట్ కదా అని అంటూ
వంద రోజుల తర్వాత ఫస్ట్ టైం ఒక గెస్ట్ లోపలికి వెళ్తున్నారు అని చెప్పారు.
నాకు హౌస్ లో ఉండాలనిఉంది అంటే అనిల్ నీ బదులు ఎవరు వస్తారో కనుక్కో అంటే హీరోగాఛాన్స్ ఇస్తే నేను వచ్చేస్తా అని చెప్పాడు సోహెల్. సరే దా అని తీస్కెళ్ళడానికి తీస్కెళ్తే వచ్చేస్తున్నాడు తను.
ఎవరి కప్ లో ఐనా కాఫీ తాగావా అని అడిగితే అభి నో అన్నాడు.. హారిక అమ్మగారి దాంట్లో తాగిందట. అరియానా అవినాష్ దాన్లో తాగింది.
సోహెల్ మస్త్ సార్ల్ అన్నాడు కరేలా
అఖిల్ నేను లేదు అన్నాడు.
ఎవరిదైనా టవల్ వాడారా అని అడిగారు.
సోహెల్
హౌస్మేట్స్ గురించి వాళ్ళ వెనక చెడుగా మాట్లాడారా అని అడిగారు అందరు తాగాలి అందరు మాట్లాడారు అన్నారు.
ఎప్పుడైనా ఎవరైనా హౌస్మేట్ ని కొట్టాలనుకున్నారా అని అడిగారు.. అఖిల్ సోహెల్ ఇద్దరు ఒకరి పెరు ఒకరు చెప్పుకున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకోడం గురించి అనిల్ యాక్ట్ ఛేసి చూపించారు.. భలే ఉంది.. అరగంట ముందు కూడా కొట్లాడుకున్నారు అని చెప్తుంది హారిక.
అభి ని నీకు ఎందుకు ఇంగ్లీష్ వస్తుంది అని అడిగారు.
అరియానాని ఎందుకు పడిపోయావ్ అని అడిగారు
సోహెల్ ని నీ జిఫ్ లు వచ్చాయ్ అని చెప్పారు.
అఖిల్ ని లెవెన్త్ ట్వల్త్ వీక్ నుండి మొత్తమ్ మారుపోయాడు లవర్ బోయ్ అయ్యాడు అని చెప్పాడు మొదత్లో అమ్మాయిలు ఏంటి అని ఓ యాటిట్యూడ్ చూపించాడు.
మా అమ్మాయి దేత్తడి దేత్తడి అని నీకే ఓట్స్ వేస్తుంది అని చెప్తున్నారు.
అనిల్ అబ్సర్వేషన్ ని అంతా మెచ్చుకున్నారు ఆశ్ఛర్యపోయారు.
ఎలిమినేషన్ అయ్యే వరకు ఎవరు మాట్లాడకండి అన్నారు.
అందరిని బ్లైండ్ ఫోల్డ్ చేసి మెహ్రీన్ నీకేం చేయాలో నీకు తెలుసు అంటే తను ఒక్కొక్కరిని కదిలిస్తూ ఉంది అఖిల్ ని ముట్టుకున్నపుడు మాత్రం ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. మెహ్రీన్ హారికని తెచ్చేసింది.
హారికని ఒక బాస్కెట్ లో పెట్టారు క్రేన్ తో పైకి లిఫ్ట్ చేసి తీస్కెళ్ళారు హౌస్ నుండి బయటికి.. మాములు పిచ్చెక్కింఛలేదు ఈ స్టైల్.. హారిక ఎలిమినేట్ అయిన దానికన్నా ఈ లిఫ్టాఫ్ కి చాలా సర్ప్రైజ్ అయింది.
మోనల్ కాస్త డిజప్పాయింటెడ్..
హారిక ఆన్ స్టేజ్.. ఫుల్ గెంతులేస్తూ తెగ డాన్స్ చేసింది అయామ్ సూపర్ హాపీ అని.
పదిలక్షలు డబ్బులు ఇచ్చి పంపారు నెక్స్ట్ ప్రణీతని.. నాగ్ సార్ కన్నా ప్రణీత బాగా కన్విన్స్ చేసింది. అండ్ ఈ డబ్బులు ప్రైజ్ మనీలో నుండి మైనస్ చేసి ఇస్తారు అని చెప్పారు. మే నాట్ బి ట్రూ.. ఎవరూ ఒప్పుకోలేదు.
ఫోర్త్ పర్సన్ ని ఎలిమినేట్ ఛేయడానికి లక్ష్మీ రాయ్ వచ్చింది.
ప్లాట్ఫాం మీద ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయ్ రెడ్ సేఫ్ గ్రీన్ ఎలిమినేట్. లక్ష్మీ బజర్ ప్రెస్ చేయాలి.
అభి,అఖిల్,సోహెల్ సేఫ్ అరియానా ఎలిమినేటెడ్. అఖిల్ సేవ్ అయినపుడు మోనల్ రియాక్షన్ సూపర్బ్.
అరియానా స్టేజ్ మీదకి వచ్చేసింది.
ముగ్గుకి మైక్ ఇస్తె నీ బోల్ద్ నెస్ కి ప్రతి టాస్క్ కి అని చెప్పి బో చేసింది.
అవినాష్ పోయాకే సన్నగా అయ్యాను తినిపించె వాళ్ళు లేక అని చెప్తుంది. నీకు అభిమానులు చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు ఇద్దరు కూడా. నువ్వు గెలిచావ్ అరియానా అని చెప్తున్నారు.
అమ్మ గారు వచ్చిన రోజే కప్ తీయకుండా వెళ్ళను అని చెప్పావ్ నేను అందుకే వచ్చా అని చెప్పారు. నా మైండ్ లో మాత్రం నువ్వే విన్నర్ వి అని చెప్పారు.
అరియానా ఫోర్త్ లో బయటికి వచ్చాక అఖిల్ వాళ్ళ అమ్మ గారు కాస్త రిలీఫ్ గా కనిపింఛారు.
తర్వాత మెహ్రీన్స్ మెడ్లీ బావుంది మంచి డాన్స్ నంబర్స్ తీస్కుని చేసింది.
నెక్స్ట్ ఇరవై లక్షల సూట్కేస్ ఇచ్చారు. సోహెల్ కొంచెం ఇంక్లైన్డ్ గానే ఉన్నాడు కానీ పూర్తిగా ఎవరు ముందుకు రాలేదు. ఇంకో ఐదు కలిపి పాతిక చేశారు. సోహెల్ నేను తీస్కుంటాను అన్నాడు.
ఫ్యామిలి సలహా అడిగితే అఖిల్ వాళ్ళ అమ్మ గారు అభి వాళ్ళ అమ్మగారు విన్ అవుతాడనే కాన్ఫిడెన్స్ చూపించారు. సోహెల్ వాళ్ళ నాన్న గారు మాత్రం మరో మాట మాట్లాడకుండా లేలో బేటా అని చెప్పారు.
వాళ్ళ తమ్ముడు మాట్లాడుతూ అందులో నువ్వు పది ఆర్ఫానేజ్ కి ఇస్తా అంటేనే తీస్కో అంటే సోహెల్ కూడా ఎస్ ఓకే అని చెప్పాడు.
అభి ప్రేక్షకుల కి విలువ ఇస్తా అంటే అఖిల్ ప్రేమ పొందలేం సర్ డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు అని చెప్పాదు.
సో సోహెల్ మనీ తీస్కుని తర్డ్ ప్లేస్ లో బయటికి వచ్చేశాడు.
సోహెల్ ఆన్ స్టేజ్.. నాగ్ సర్ గాట్టిగా హగ్ ఇచ్చి పైకి ఎత్తుకున్నారు. సూపర్ అసలు..
కథ వేరుంటది అని మొత్తం బిగ్ బాస్ కథే మార్చేశావ్ గా అని అన్నారు నాగ్. ఇప్పటి వరకూ కూడా ఎవరూ డబ్బులు తీస్కున్నట్లు తెలీదు నాకు.
సోహెల్ ఈజ్ లైక్ బోయ్ నెక్స్ట్ డోర్ ఎంత అంటే నేను ఇంకా చాలా మందిమి అనుకున్నాం అరె వాళ్ళు తీస్కుని వెళ్తే బావుండేది అని. లాస్ట్ సీజన్ బాబా గారి విషయంలో కూడా చాలా అనుకున్నాను నేను ఇలా తీస్కుంటే బావుండేది అని. ఒక సగటు మిడిల్ క్లాస్ వ్యక్తిలా ఆలోచించి సోహెల్ మంచి పని చేశాడు అనిపించింది.
పది లక్షలలో ఐదు మెహబూబ్ కి ఇస్తా అన్నాడు మెహబూబ్ కూడా ఆర్ఫనేజ్ కే ఇస్తా అన్నాడు.
వీళ్ళిద్దరిని కాదని పది లక్షలు ఆర్ఫనేజ్ కి నేను ఇస్తాను నువ్వు పాతిక ఇంటికి తీస్కెళ్ళు అని చెప్పారు నాగ్.
తర్వాత లక్ష్మీ రాయ్ డాన్స్ మెడ్లీ...
బ్రేక్ తర్వాత తమన్ పెర్ఫార్మెన్స్ మ్యూజిక్...
తర్వాత ట్రోఫీ రివీల్ చేయడానికి ధీరా ధీరా పాట పెర్ఫార్మ్ చేశారు అమేజింగ్ గా డాన్స్ కంపోజ్ చేశారు దీనికి ట్రోఫీ కూడా చాలా బావుంది.
అభి అండ్ అఖిల్ ని తీస్కురాడానికి హౌస్ లోకి వెళ్ళారు నాగ్. ఇద్దరూ కూడా అంతా తిప్పి చూపించారు.
మై బెస్ట్ ఫ్రెండ్, మై బిగ్ బ్రదర్ అండ్ ఇండస్ట్రీకి బిగ్ బాస్ మెగాస్టార్ అంటూ వెల్క్ం చేశారు.
మీ వెయిస్ట్ సైజ్ ఎంతండీ అని అడిగితే మా ఆవిడ్ని అడగండి అంట.
కరోనా టైమ్ లో ఎవరెంత నష్టపోయారో ఎంత లాభం పొందారో కానీ నేనైతే ఫిట్నెస్ పెంచుకున్నాను అని అన్నారు.
సీజన్ త్రీకి ఫోర్ కి తేడా ఏంటి అంటే మాస్టర్ ఏం లేదు అని అననరు. ఏం లేకపోడం ఏంటి మా సిక్స్టీ ఇయర్ క్లబ్ లోకి వచ్చారని సంతోషిస్తే కాని ఆయన మెయింటెనెన్స్ చూస్తే మాత్రం చాలా కుళ్ళు అనిపించింది. అంటే మీకోసం కాదు సర్ ఓన్లీ ఆడవాళ్ళ కోసం అంటూంటే నవమన్మథుడు అని చెప్పారు చిరు. అన్ని సీజన్స్ మీరే చేయాలని నా కోరిక అని చెప్పారు. దీనివలన నెంబర్ వన్ ఛానల్ ఐందంటే మీరు మీ పెర్ఫార్మెన్సే కారణం అని చెప్పారు. తెలుగు ప్రజలు ఓన్ చేసేసుకున్నారు అని చెప్పారు.
నాగ్ జర్నీ ఎలా ఉందో చూడాలని ఉంది అని అడిగారు. నాగ్ ఏవీ చూపించారు సింప్లీ సూపర్బ్...
సర్ మా టాప్ టూ అని అంటే.. అభి నువ్వు నుంచున్నావేంటి సోఫా వేస్కోవాలి కదా మర్చిపోయారా వేయడం. అని అడిగారు. కౌచ్ పొటాటో అని అంటూనే నీ బిహేవియర్ చాలా కంపోజ్డ్ గా ఉంటుంది అని మెచ్చుకున్నారు.
అఖిల్ చూస్తున్నప్పుడు అందరి అటెన్షన్ గ్రాబ్ చేశావ్ ఎనర్జిటిక్ గా ఆడేవాడివి స్నెహాన్ని ప్రేమోనల్ని అని ప్రేమల్ని, అత్మీయతని, అభిమానాన్ని పంచడం అమేజింఘ్ అన్నాడు.
సోహెల్ కి కథ వేరమ్మా అని నా సినిమాలో పెట్టుకుంటాను మీ అనుమతి కావాలి అని చెప్పాడు. పాతిక లక్షలు గురించి చెప్పాడు నాగ్. సోహెల్ కోసం సురేఖ గారు మటన్ బిర్యాని చేసి పంపించారు అని చెప్పి తీస్కొచ్చారు. నాకు సినిమాకు సపోర్ట్ చేయండి అని అడిగితే ఏం చేయమంటావ్ చెప్పు అంటే ఆడియో రిలీజ్ అన్నాడు నా చేతుల మీదుగా చేస్తాను వీలైతే నాకో చిన్న కెమియో రోల్ ఇవ్వు అని చెప్పారు. థియేటర్ కి ఐదు పది కాదు వేలమంది నీ ఇంటికి వస్తారు అని చెప్పాడు.
సోహెల్ కి విన్నర్ కన్నా ఎక్కువ వరాలు దొరికినట్లే..
అరియానా చిరు కార్ తో ఫోటోదిగిందంటా ఇపుడు మీరు నా పేరు తీశారంటో సోహాపీ అని చెప్పింది. గ్లోరీ యువర్ లైఫ్ విల్ బి గ్లోరియస్..
హారిక వాట్ ఎ లవ్లీ నేమ్ చాలా కనెక్టెడ్ ఆ పేరుతో అని చెప్పారు. నువ్వు లాస్ట్ వరకు నిలబడ్డంలో నీ స్వయం శక్తే అని చెప్పారు. మన ఇండస్ట్రీలో నువ్వు కూడా ఓ తారలా వెలిగి పోవాలి అన్నారు.
మోనల్ నీ నవ్వు అంటే ఛాలా ఇష్టం అని చెప్పారు. మొదట్లొ అన్నిటికి ఏడ్చేదానివి ఇపుడు కాస్త తగ్గించావ్ ఇలాగే నవ్వు అని చెప్పారు.
అవినాష్ నువ్వు ఎంటర్తైన్ చేస్తూ బాగా చేశావ్ కానీ రాన్రాను కొంచెం కోపం పెరిగింది అసహనం పెరిగింది. రాజబాబు తో పోల్చి ఆస్టేజ్ కి నువ్వు రావాలని చెప్పారు.
లాస్య ని మా ఇంటి సభ్యురాలిలా ఉంటావ్. నిన్ను లాస్యక్క అని అంటా నేను.
మెహబూబ్ యూ ఆర్ ఎ డైనమిక్ బోయ్ యూ ఆర్ జెమ్ ఆఫ్ ఎ బోయ్.. నిన్ను చూస్తుంట్ నేను చిన్నపుడు సినిమాల్లోకి రావాలని యాస్పైరింగ్ మంఛితనం గురించి కూడా చాలా మెచ్చుకున్నారు. మెహబూబ్ కి సోహెల్ నీకు ఇస్తానన్నా డబ్బులు అతనికి వెనక్కి ఇచ్చేసేయ్ నీకు టెన్ లాక్స్ నేను ఇస్తానని చెప్పారు చిరంజీవి. స్టేజ్ మీదే టెన్ లాక్స్ కి చెక్ రాసి ఇచ్చేశారు. నీ సొంతానికి ఖర్చుపెట్టుకో అని చెప్పారు.
దివి ని చూసి చాలా సిగ్గు పడ్డారు.. మాములుగా నవ్వించలేదు. వేదాళం తెలుగు వర్షన్ లో నీకు రోల్ ఇవ్వమని చెప్పాను అని చెప్పారు.
గంగవ్వ ఇల్లు పని ఎంత వరకు వచ్చిందో చూపించారు పని మొదలు పెట్టేశారుట. ప్లాన్ తో సహా చూపించారు. చాలా బావుంది.
ఇతరులతో మాట్లాడినది చాలా కట్ చేసేసినట్లున్నారు.
ఇద్దరు వచ్చి చిరు కాళ్ళకి మొక్కారు బ్లెస్సింగ్స్ తీస్కున్నారు .
ఫైనల్లీ ఇద్దరి చేతులు పట్టుకుని నాగ్ లిఫ్ట్ చేశారు..
అభి ఈజ్ ద విన్నర్ ఆఫ్ సీజన్ ఫోర్..
అభికి టివిఎస్ అపాచీ బైక్ కూడా ఇచ్చారు.
అఖిల్ స్పీచ్ సింపుల్ గా బావుంది.
అభి స్పీచ్ ఇంగ్లీష్ మొదలు పెట్టాడు. నాగ్ తెలుగు అని గుర్తు చేశారు. తర్వాత చక్కటి తెలుగులో మాట్లాడాడు.
పాదాభివందనాలు చేశాడు. ఆచార్య దేవో భవ అంటే నా సినిమా ఆచార్యా నా సినిమాకి పబ్లిసిటీ కూడా వచ్చేసింది అని చెప్పారు. ఒక బాద్షా అండ్ ఒక చక్రవర్తి ఉన్నారు మీ ఇద్దరు వారిద్దరిని కూడా మీలా అవ్వాలని దీవించండి అని అడిగారు అభి వాళ్ళ మమ్మీ.
నా అరవైమూడేళ్ళ లైఫ్ లో ఇది నా బెస్ట్ డే అని చెప్పారు అభి వాళ్ళ నాన్న..
ఇది ఒక ఆటగా తీస్కోకుండా దీనిలోని ఎమోషన్స్ అవి మన వ్యక్తిత్వాన్ని మలుచుకోడానికి మంచి అవకాశం ఈ బిగ్ బాస్ స్టేజ్ వ్యక్తిత్వ వికాసానికి అద్భుతమైన వేదిక ఇలాంటి వాటికి డబ్బులు ఇచ్చి వెళ్ళాలి కానీ వీళ్ళు మీకు డబ్బులు ఇచ్చి నేర్పుతున్నారు మీ గ్లామర్ కూడా పెంచి సెలెబ్రీటీని చేస్తున్నారు అనిచ్ ఎప్పారు చిరు.
అవి ఈ రోజు విశేషాలు. ఇంతటితో బిగ్ బాస్ సీజన్ ఫోర్ రివ్యూలు సమాప్తం..
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.