9, డిసెంబర్ 2020, బుధవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయవచ్చు.



ఈ రోజు కూడా నిన్నటి ఓపిక టాస్కే కంటిన్యూ చేశారు నిజానికి తొంభై నాలుగో రోజుకి వెళ్ళకుండా తొంభైమూడో రోజున జరిగిన టాస్కే చూపించారు ఈ రోజంతా. మేజర్ అరియానా అండ్ సోహెల్ మధ్య గొడవ చూపించారు. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకుండా గట్టిగట్టిగా అరుచుకున్నారు. సోహెల్ మీద మీదకి వెళ్ళడం కొన్ని చోట్ల బీప్ వేయాల్సిన మాటలు మాట్లాడడం నాక్కూడా అస్సలు నచ్చలేదు. అది ముమ్మాటికి తప్పే. ఎంత ఆడా మగ ఒకటే అన్నా కూడా ఆడపిల్లలకి ఆ లీనియన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక అబ్బాయ్ మీద కి అలా అరుచుకుంటూ వెళ్ళడం వేరు తిట్టడం వేరు అమ్మాయి మీదకి వెళ్ళడం వేరు. ఈ రొజు ఎపిసోడ్ సోహెల్ కి బాడ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయ్. 

అయితే ఈ గొడవలో మొత్తం సోహెల్ దే తప్పు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఎవరో ఒకళ్ళు తగ్గితే గొడవే అవదు, అరియానాది కూడా ఈక్వల్ గా తప్పు ఉంది. సోహెల్ కి కోపం ఇష్యూస్ ఉన్నాయని అందరికి తెలుసు. తను అంత రెచ్చగొట్టాల్సింది కాదు ఒక వేళ రెచ్చగొట్టినా కూడా టాస్క్ అయి సోహెల్ కుర్చీ దిగిన వెంటనే అరే ఇది టాస్క్ కోసం అలా కోపం తెచ్చేలా మాట్లాడాను అని ఒక మాట చెప్పినా సరిపోయేది. నిన్న  స్విమ్మింగ్ పూల్ లో బట్టలేస్తే కోపం అన్నావ్ ఈ రోజు నా డ్రస్ అండ్ బొమ్మ ఎలా వేశావ్ అనే మాటా హారిక అండ్ అరియానా ఇద్దరు అడిగారు కానీ హరిక తో ఎందుకు గొడవ అవలేదు అని కాస్త ఆలోచిస్తే ఎవరికైనా నేనేం చెప్తున్నానో అర్ధం అవుతుంది. 

అసలు బొమ్మ సెంటిమెంట్ అని అంటుంటే నీకు సెంటిమెంట్ ఎక్కడివి అని సోహెల్ అవినాష్ గురించి మాట్లాడినపుడు ట్రిప్ ఐన అరియానా నువ్వు ఆపరా వేస్ట్ మాటలన్నీ మాట్లాడతావ్ అని చాలా గట్టిగా అరిచింది అక్కడే సోహెల్ ట్రిప్ అవడం స్టార్ట్ అయ్యాడు. ఇక అక్కడ నుండి వేరే లెవెల్ కి వెళ్ళింది గొడవ. ఐనా తను చేస్తే టాస్క్ వేరె వాళ్ళు చేస్తే రివెంజ్ అనడం ఎంత వరకు కరెక్ట్ అండీ, అలా అనేసి బాడ్ చేస్తాను కానీ ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవకుండా కూర్చోవాలి అంటే ఎలా కుదురుతుంది. నేను స్ట్రాంగ్ నేను తోపు టాస్క్ అయ్యాక చూస్కుందాం అన్నావ్ కదా రా చూస్కుందాం అని తొడగొట్టేసి తీరా వచ్చాక మమ్మీ అని ఏడిస్తే ఎలా. ఇంకా ఈ గొడవ గురించి నా వ్యూస్ ముందు ముందు డీటేయిల్స్ లో చెప్తాను. 

ఈ రోజు అభి అండ్ అఖిల్ రెండు విష్యాల్లో నాకు చాలా నచ్చేశారు ఈ ఏదుపులు మొత్తుకోళ్ళ మధ్య అభి చేసిన టాస్కే ఫన్నీగా కాస్త నవ్వించింది. అండ్ తను అరియానాని కన్సోల్ తీరు బావుంది. అలాగే అవసరమైన చోట అఖిల్ సోహెల్ తరపున తీస్కున్న స్టాండ్ కూడా బావుంది సరైన జడ్జ్ లా రెండు వేపులా మాట్లాడాడు అనిపించింది. అలాగే నిన్న అంత గొడవ అయినా నిన్న ఏడుస్తున్నపుడు అరియానా తన దగ్గరకు రాకపోయినా కూడా మోనల్ ఏడుస్తున్న అరియానాకి వాటర్ తెచ్చివ్వడం అండ్ తనని కన్సోల్ చేయడానికి దగ్గర కూచోని హౌస్ లో అందరూ హర్ట్ అయి ఉన్నారు. అందరు ఒకటే ఫేజ్ లో ఉన్నారు పక్కన ఒక మనిషి ఉండాలి. మీ తప్పు కాదు ఇంకొకరి తప్పు కాదు సిట్యుయేషన్స్ అలా వచ్చాయ్ అని చెప్పడానికి ప్రయత్నించడం బావుంది.  


వివరాలలోకి వెళ్తే     
93 వ రోజు రాత్రి సోహెల్ కూర్చున్నాడు. నా బొమ్మ ఎందుకు స్విమ్మింగ్ పూల్ లో వేశావ్ అని అరియానా గోల చేస్తుంది. నువ్వే పూల్ లో వేయడం మంచిది కాదంటావ్. బాగా రెచ్చ గొడుతుంది సోహెల్ ని. బొమ్మ గురించి. టాస్క్ అయ్యాక చూస్కుందాం అని అంటుంది. నైట్ ఎనిమిదికి మోనల్ కూడా వచ్చేసింది భలే స్ట్రాంగ్ నువ్వు అని అంటుంది. అరియానా మరో పాయింట్ రైజ్ చేయాలనుకుంటున్నా అని నువ్వు మొన్న ఇక మీదట ఎమోషన్స్ లేవు ఆడాలి అన్నవ్ కదా నేను మొదటి నుండి అదే చేస్తున్నా అని అంటుంది. నీకు నచ్చినట్లు నేను ఉండను నాకు నచ్చినట్లు నువ్వు ఉండలేవ్ అని అసలు మాములు నస పెట్టడం లేదు. జీరో ఎక్స్ప్రెషన్ ఛేంజ్ ఏమాత్రం తొణక్కుండా కూర్చున్నాడు. అరియానా హారిక ఒక ఐ బ్రో కదిలింది అన్నారు కానీ అఖిల్ లేదు అని జీరో ఇచ్చాడు..

తర్వాత హారిక కూర్చుంది. 

సోహెల్ దిగ గానే అరియానాకి రిప్లై ఇవ్వడం మొదలు పెట్టాడు.  మోనల్ కూడా జవాబివ్వడం మొదలు పెట్టింది. మీరు చేస్తే టాస్క్ మేం చేస్తే రివెంజ్ అని బాగానే గట్టిగా మాట్లాడింది. 
సోహెల్ కూడా టాస్క్ అని మా మొహానికి అవి ఇవి పూసి గుడ్డు కొడితే ఏం లేదు కానీ మేం బొమ్మ ఒక డ్రస్ తడిపితే వచ్చిందా అని అంటున్నాడు. 
సోహెల్ మోనల్ మైక్ ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. ఈ డిస్కషన్ హైపర్ లో పడి అది గుర్తురావడం లేదు వెతుకుతున్నాడు. కాసేపట్కి వెతికి ఇచ్చాడు.
సోహెల్ అరియానా ఇద్దరి డిస్కషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. నేను నీ లాగ క్రూరంగా ఆడలేదు అని చెప్తున్నాడు.  
మనిషి మీద లేదు నీకు ఎమోషన్ అవినాష్ నిన్ను ఎంత బాగా చూస్కున్నాడు అవినాష్ ని ఏడిపించావ్ చింటూ గురించి అన్నాడు. జొరం వచ్చినపుడు చింటూ చూసుకోలేదు అని చెప్తున్నాడు. వేరే వాళ్ళ మాటర్ లో నువ్వెందుకు మాట్లాడతావ్ అని మెల్లగానే మొదలు పెట్టింది కానీ నువ్వు ఆపు ఆపు అనుకుంటుంటే ఇక అరియానా ట్రిగ్గర్ ఐ నువ్వు ఆపరా వేస్ట్ మాటలన్నీ మాట్లాడతావ్ అనేసింది. దాంతో నువ్వు ముయ్ అన్నాడు సోహెల్. ఇక అలాగే అలాగె హైపర్ అయిపోయాడు.  
తొక్కలో బొమ్మని నీళ్ళలో వేసినందుకు అరుస్తున్నావ్ అని అంటున్నాడు. నీ క్రూరత్వం ఎవరికి తెలీదు అని కోపంలో గట్టిగా అరుస్తూ ఏడ్చేశాడు కూడా. అరియానా క్రూరత్వం అని హైలైట్ చేస్తున్నాడు. అరవకు అరవకు అని మధ్యలో ఎంతమంది వచ్చి అడ్డుపడినా ఆగడం లేదు. అభి అఖిల్ కలిసి వాష్ రూం లోకి తీస్కెళ్ళారు తనని.  

తను ఆడినది టాస్క్ అని అంటుంది బానే ఉంది మరి ఈ రోజు మోనల్ అండ్ సోహెల్ ఆడినది కూడా టాస్కే కదా దీన్ని రివెంజ్ అని ఎందుకు కలర్ ఇస్తుంది అందుకె కదా అంత కోపం వచ్చింది సోహెల్ కి కూడా. 

ఆడమని టాస్క్ ఇచ్చారు నాకు ఆడద్దా నేను తీస్కోలేకపోతున్నా తన బిహేవియర్ ని అని ఏడ్చేస్తుంది. 

నేను కెప్టెన్సీ చేసినా టాస్క్ అడినా వీళ్లకి ప్రాబ్లం ఇంకెలా ఆడను అని అడుగుతుంది. 
కిందపడిపోయి ఏడ్చేస్తుంది. నా వల్ల కావట్లేదు అంత హృదయం లేకపోతే నేను ఎందుకున్నాను.. అమ్మా.. నా వల్ల కావట్లేదు అని అంటూ ఏడ్చేస్తుంది. నామీద ఎలా ఎగబడుతున్నాడు. స్టార్టింగ్ నుండి చెప్తున్నా ఎగ్రెస్సివ్ బిహేవియర్ తట్టుకోలేకపోతున్నాను అని ఏడ్చేస్తుంది. వాళ్ళకి బొమ్మ అయుండచ్చు కానీ నా ఎమోషన్ అది అని ఏడ్చేస్తుంది. 

అరియానా ఏడుస్తుంటే మోనల్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. 
తర్వాత మోనల్ అరియానా పక్కన కూర్చుంటుంటే నన్ను కాసేపు వదిలేయ్ కావాలంటే రేపు మాట్లాడతా అని అంది. తనే వెళ్ళి వేరే దగ్గర కూర్చుంది. 

నీ తప్పు కాదు నా తప్పు కాదు కానీ ఎవ్విరిబడీ ఈజ్ హర్ట్ హియర్ అని చెప్తుంది మోనల్. 

అభి హారికని మాములుగా నవ్వించలేదు.

అభి కూర్చున్నాడు. వరసబెట్టి నవ్వించేశారు ఉండు కాదు అని నేనింకా కూర్చో లేదు అని కిందకి దిగేశాడు. ఒక సారి కూర్చుని కిందకి దిగితే కుదరదు అని హౌస్మేట్స్ అందరు ఒప్పుకోలేదు బిగ్ బాస్ కి అప్పగించేశారు చెప్పండి బిగ్ బాస్ అని కానీ కూర్చోని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. అందరూ మాములుగా గోల చేయలేదు కష్టపడి కంట్రోల్ చేస్కుంటున్నాడు.. అందర్ని నవ్వించావ్ చూడు అది అభిరాజా అని అంటుంది హారిక. బిగ్ బాస్ ఒప్పుకున్నట్లున్నాడు కంటిన్యూ చేస్తున్నాడు. 

పిల్లి అనుకుంటున్నావా నువ్వు కళ్ళు మూసుకుని నన్నెవరు చూడాట్లేదు అనుకుంటుంది అంటే గట్టిగా నవ్వేశాడు. ఇరవై ఏడు సార్లు ఛేంజ్ చేశాడట  

అభి కుర్చీ దిగిన వెంటనే హారిక వెంట పడ్డాడు. నన్ను నువ్వు నిన్ను నేను తప్ప ఇంకెవరు నవ్వించలేరు అని అంటుంది హారిక. 
అరియానా, హారిక నాలుగు, మోనల్ పది, అభి ఇరవై ఏడు, సోహెల్ జీరో ఛేంజెస్. 

సోహెల్ కి అప్పీల్ ఛాన్స్ వచ్చింది. 

పద్నాలుగో వారం బాడ్ కన్వర్సేషన్ అని ఫీలవుతున్నాడు సోహెల్ కూడా 

సోహెల్ నేనిక్కడ నటించలేదు కోపం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడితే సారీ నేను ఏదీ దాచుకోలేదు కోపమొచ్చినా నవ్వొచ్చినా నాలా నేనున్నాను అని చెప్పాడు. విన్నింగ్ చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. అప్పీల్ చాలా బావుంది జెన్యూన్ గా ఉంది. 

అరియానా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది అభి కన్సోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు నువ్వు అరియానా అని చెప్తున్నాడు. ఒక అబ్బాయ్ నా మీదకి అంత ఎగ్రెస్సివ్ గా రావడం ఫస్ట్ టైం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అనేబుల్ టు టేక్ ఇట్ అని అంటుంది. 
అఖిల్ నువ్వు ముద్ర వేయకు వాడి మీద నువ్వు కూడా అగ్రెస్సివ్ గానే మాట్లాడావ్ అని అంటున్నాడు. 

సడన్ గా ఎందుకు అలా పడిపోతున్నావ్ అని అడుగుతున్నాడు అఖిల్. 
అది నా ఇన్సల్ట్ నా పెయిన్ అది అని అంటుంది. ఏడుపు అంతా మర్చిపోయి మళ్ళీ అఖిల్ తో వాదిస్తుంది సీరియస్ గా. నేను అంత ముద్ర వేయడం లేదు అది నా బిహేవియర్ గాదు అంత తెలివి లేదు అని అంటుంది. 

సోహెల్ ని అప్పీల్ తర్వాత మైక్ తీస్కెళ్ళి అక్కడ పెట్టండి అన్నారు మీతో మాట్లాడచ్చా అని అడిగాడు. అపుడు నాకు ఈ రోజు జరిగిన సంఘటన గురించి చెప్తున్నా నేను చేసింది కూడా టాస్కే. అరియానాతో తీస్కోలేకపోతున్నాను. కోపం మైనస్ ఊరికే రాదు ఆవిడ బొమ్మ ఎమోషన్ అంటే ఆర్టిస్ట్ కి ఫేస్ ఎమోషన్ కాదా. ఆమెకి చిన్న ప్రాబ్లం క్రియేట్ చేసినా టక్కున చెప్పి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నాకు టైటిల్ కొట్టడం చాలా ఇంపార్టెంట్ దీని వల్ల ఓట్లు అటూ ఇటూ అవుతయ్యేమో అని చెప్తున్నా అన్నాడు.    

బిగ్ బాస్ ఎంకరేజింగ్ గా మాట్లాడాడు. ముందు ముందు ఇంకా కఠినంగా ఉంటుంది ఆట మీరు బాగా ఆడుతున్నారు మీపై మీరు నమ్మకం ఉంచి మీ లక్ష్యం వైపు దూసుకు వెళ్లండి అని చెప్పారు. ఆ మాటలు విన్నాక తను కూడా ఏడ్చేశాడు చేయ్యాలని చేయలేదు కానీ అలా ఐపోతుంది అని అంటున్నాదు. కోపం ఒక్కటే నెగటివ్. నేనెంతలా బాధపడుతున్నానో నాకు తెలుసు అని అంటున్నాడు. బాగా ఏడ్చేశాడు తను కూడా. నాకేం అర్ధం కాటం లేదు. నువ్వు ఓడిపోతే మాత్రం నేను నీతో మాట్లాడను అని చెప్పాడట అఖిల్ ఆ ఒక్క మాటతోనే నేను ఎంత నవ్వొచ్చినా అక్కడే కూర్చున్నా కదలకుండా అని చెప్తున్నాడు. అరియానా ఇది టాస్క్ అందుకే అలా అన్నా అని ఒక్క మాట చెప్పచ్చు కదా.. నేను కూర్చున్నపుడు టాపిక్ తీయకుండా ముందు చాలా టైం ఉంది అపుడు చెప్పచ్చు కదా అని ఏడుస్తున్నాడు.
 
అంత బాధ లోనూ ఆమెని కూడా ఏమీ అనకండి బిగ్ బాస్ అని అంటున్నాడు. ఇదేం కామెడీ సోహెల్ అని నేను  నవ్వుకున్నాను. మీ ఆటను ఇలాగే కొనసాగిస్తూ మీ లక్శ్యం వైపు కొనసాగండి అన్నారు బిగ్ బాస్. 

అర్ధ రాత్రి సోహెల్ అఖిల్ తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడద్దన్నావ్ కదా నాకు ఎవరితో మాట్లాడాలో అర్ధం కాలేదు నాకు షేర్ చేయాలని అనిపిస్తుంది అప్పటికప్పుడే అని చెప్పాడు. అఖిల్ దగ్గర కూడా ఏడ్చేశాడు హగ్ చేస్కుని ఊర్కో అని కూల్ చేశాడు. 

రేపటి ప్రోమోలో మూడవ టాస్క్ ఏకాగ్రత టైం లెక్కిస్తూ ఒక పని చేయాలనుకుంటాను. తను టైమ్ లెక్కపెట్టనివ్వకుండా మిగిలిన ఇంటి సభ్యులు డిస్ట్రబ్ చేయాలి.
సోహెల్ ని బాగా నచ్చిన పని అంటే నిద్రపోవడం అంట.  
అభిని శివగామి ఎవరు ఇంట్లో అని అడిగితే తనలోని అందం మోనల్ లో తనలోని ప్రేమ హారిక లో టెర్రర్ అరియానాలో ఉన్నాయ్ అని చెప్తున్నాడు. 
  
మోనల్ పాపని మౌంట్ ఎవరెస్ట్ ఏ కంట్రీలో ఉంది అని అడిగితే చైనా అండ్ ఇండియా బోర్డర్ లో ఉంది అని చెప్పింది అభి ఒక చిత్రమైన ఎక్స్పెషన్ తో కిందపడిపోయాడు 😂 నేపాల్ ఇండియాలోని ఓ స్టేట్ అనుకుందేమో మా మోనల్ పాపం. నాకైతే దీక్ష లెక్కల క్లాస్ గుర్తొచ్చింది 😉 

మొత్తం మీద రెండ్రోజులు ఏడుపులు మొత్తుకోళ్ళు తర్వాత కాస్త సరదాగా చేసినట్లున్నారు రేపటి టాస్క్. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts