7, డిసెంబర్ 2020, సోమవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినండి. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజు చివరి నామినేషన్స్ డే అని అంటూ బిగ్ బాస్ అఖిల్ తప్ప ఇంటి సభ్యులు అందరిని ప్రజల చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు సో అందరు నామినేట్ ఆవుతారు. ఇచ్చిన టాస్క్ ద్వారా ప్రతి ఒక్కరిక తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశాన్ని ఇస్తారు అని చెప్పారు. ఆ విధంగా ఐదుగురు నామినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేట్ అయిన వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు టాప్ ఫైవ్ లోకి వెళ్ళబోతున్నారు. 

ఇక ఈ రొజు రాజు/రాణి ఎవరు అనే టాస్క్ ఇచ్చారు. దానిలో ఒకొక్కర్రు ఒకో రకంగా ప్రతిభ చూపిస్తున్నారు కానీ అరియానా మాత్రం అవకాశమొచ్చినపుడంతా రెచ్చిపోయి చాలా హైలైట్ అవుతుంది. సోహెల్ అఖిల్ మధ్య చిన్న మనస్పర్థలు వచ్చాయి అవి రేపటి వరకుఉంటాయో లేదో చూడాలి. ఇక ప్రోమోని పట్టి రేపు కూడా ఇదే టాస్క్ కొనసాగుతున్నట్లుంది. 

షో టైమ్ ని పదిగంటలకి మార్చడం కాస్త అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఎడిటర్స్ కి కూడా ఫ్రీ హాండ్ ఇచ్చినట్లున్నారు అనిపించింది. ముద్దులు పెట్టుకోడం అడుక్కోడం చూస్తుంటే.. ఒరేయ్ నాన్నా బాబు చిట్టీ షోని అరగంటే నాన్నా వెనక్కి జరిపింది అని చెప్పాలనిపించింది.   
 
వివరాలలోకి వెళ్తే 92 వ రోజు ఇంట్లో 6 గురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం నువ్వు నేను సినిమాలోని గాజువాక పిల్లా పాటతో మేల్కొలిపారు. 
హారిక సోహెల్ అండ్ అరియానా అవినాష్ కి గుడ్ మోర్నింగ్ చెప్పడం చాలా బావుంది. 
 

అరియానా కెమెరాతో మాట్లాడుతుంది నా లైఫ్ చాలా చిన్నగా మొదలైంది. నేను పాపులారిటీ గురించి ఆలోచించలేదు కానీ నాకు కప్ కావాలి నేను ఫస్ట్ ఫిమేల్ కంటెస్టెంట్ ని టు విన్ అని ఉంది. నన్ను ఎలా బోల్డ్ అని పోట్రే చేస్తున్నారో థ్యాంక్స్. ఇదంతా నేనేనా ఫీలవుతుంది అని అనిపిస్తుంది. మీ వల్ల ఒక పెద్ద మాన్షన్ లో ఉండాలన్న కోరిక తీరింది. ఎప్పుడు ఎలిమినేట్ ఐనా మీకు మాత్రం కృతగ్నురాలనై ఉంటా అన్నాడు. 

అఖిల్ తప్ప ఐదుగురు నామినేటెడ్ బై బిగ్ బాస్. మిమ్మల్ని మీరు ప్రేక్శకులకు నిరూపించుకునే సమానమైన అవకాశం దొరుకుతుంది. 
 
అధికారం : ఇంటి బాధ్యత మీకు అప్పగిస్తున్నారు. ఒకరికి అధికారం లభిస్తుంది నియమాలని మార్చేయచ్చు. ప్రజలతో సేవలు చేయించుకుని శిక్షలు విధించవచ్చు. బెస్ట్ పెర్ఫార్మర్ ప్రేక్షకులకి విన్నవించుకునే అవకాశం దొరుకుతుంది. 
అఖిల్ రూలర్ యొక్క మంత్రి. 
ప్రజలు విన్నపాలను మంత్రి ద్వారా విన్నవించుకోవాలి.  

తలుపు తీసుందని సోహెల్ బయటికి వస్తుండగా బజర్ మోగింది ఒక్క పరుగులొ వెళ్ళిక్రౌన్ అందుకున్నాడు. 
 అందరూ స్వాగతమ్ చెప్పండి అని అదిగాదు. 

అరియానా కి గిన్నెలు కడగాలని టాస్క్ ఇచ్చాడు. పాపం వంట కూడా తనే చేసిందట. నాకు వస్తుందిగా అవకాశం అని అంటుంది అరియానా అపుడు టైల్స్ కడిగిస్తాగా అంటుంది. 

నా ఫూచర్ తెలుస్తుంది నాకు రాజు గారికి భయమేస్తుంది ఈ అరియానా రాణైతే నా పరిస్థితేంటో అని భయమేస్తుంది అంటున్నాడు. నేడు మీది రేపు మాదీ అని అంటు పాట పాడుతుంది. అరియానా పెర్ఫార్మెన్స్ కుమ్ముతుంది అసలు :-)
ముఖానికి టొమాటో రాశాడు. నన్ను క్షమించండి రాజా గారు అంటూ చేత్తో టొమాటో రసాన్ని సోహెల్ మొహానికే పూసింది. ట్రూ టామ్ అండ్ జెర్రీ వీళ్ళిద్దరూ.. ఎవరికి టాస్క్ ఇచ్చినా తనే చేస్తుంది.
రాజు ఏమైనా చేయచ్చు కదా అని కాసేపు నిద్రపోతాను అని పడుకుంటున్నాడు. 
మైసమ్మా పాటకి అరియనా జింతాతా జితాజితా స్టెప్ వేస్తుంటే నాకు అది చూస్తుంటే ఫ్యూచర్ కనిపిస్తుంది అంటున్నాడు సోహెల్.
అరియానా మీద నీళ్ళు వేయాలి అంటే అభి ఒకటి రెండు చుక్కలు వేశాడు కాదని హారికకి చెప్తే ఫుల్ కప్ ఎంప్టీ చేసేసింది. 

బజర్ మోగితే సోహెల్ తీసేసి అభికి ఇచ్చాడు. 
అరియానాగారు ఫ్రెషప్ అయి రండి అని అన్నాడు. మరీ ఇంత సాఫ్ట్ గా ఉండకండి అని అంటున్నాడు అభి. 
నేను రాజుగ ఉన్నంత కాలం హారిక ఏం మాట్లాదినా పదం తర్వాత ఇక్లిపిక్లి పదం యాడ్ చేయాలి అని చెప్పాడు ఫన్నీ. 
సోహెల్ అరియానాతో డాన్స్ చేయించాడు. మోనల్ మంచి రొమాంటిక్ పాట పాడుతుంటే. 

హారిక కి ఇచ్చాడు. అందరికి పనులు అప్పజెప్పింది.. స్విమ్మింగ్ పూల్ లో బట్టలు వేస్తా అని అంటుంది. 
సోహెల్ మీరు చాలా అందంగా ఉన్నారు అని మెచ్చుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళాడు. అఖిల్ ఏమో ఏంటి ఏం నడుస్తుంది.. సరే నాకు పెట్టు అని అడుగుతున్నాడు. నేను రాణి నుండి దిగాక పెడతా అంటే లేదు ఇప్పుడే అని బెదిరిస్తున్నాడు. ఏయ్ బెదిరిస్తున్నావేంది అని వార్నింగ్ ఇచ్చింది ఫన్నీ. 
అభిజిత్ మీరు అందంగా ఉన్నారు డ్రస్ బావుంది అని మెచ్చుకున్నాడు. తీరా అన్నీ చెపి లోపలికి వెళ్తూ ఇపుడు నేను చెప్పింది అంతా అబద్దం అని చెప్పాదు. లోపల ఇదే విషయం సోహెల్ తో చెప్పి ఇద్దరు హైఫైవ్ ఇచ్చుకుంటు నవ్వుకుంటే అభి బట్టలు తెచ్చి పూల్ లో పడేసింది.  
 
సోహెల్ కి ప్రపోజ్ చేస్తూ కంటిన్యువస్ గా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి అని అంది. మధ్యలో అఖిల్ అడ్డుపడి ఇది చాలా సింపుల్ అన్నాడు తిను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు హారికని. సరే ఐతే పదిహేను సెకన్లలో లేస్ ఉన్న షూ వేస్కుని రమ్మని అంటే సోహెల్ ట్రిప్పయ్యాడు నేను చెయ్యను నా బట్టలు స్విమ్మింగ్ పూల్ లో వేస్కోండి అంటూ ఎదురు చెప్పడం మొదలు పెట్టాడు. 
ఏంది మీ రాజ్యంలో అన్నీ పనిష్మెంట్స్ ఉంటాయా అన్నాడు. తర్వాత వేస్కుని వచ్చాడు కానీ అఖిల్ కూడా సీరియస్ అయ్యాడు. అఖిల్ ప్రపోజ్ చేయి అన్న దాని మీద చేయనివ్వకుండా అడ్డుపడ్డందుకు కోపం వచ్చింది. 
నాకు సలహా ఇచ్చాడా ఎందుకు ఇవ్వలేదు. నేను పనిష్మెంట్శ్ ఇచ్చాను చేయించమని చేయలేదు ఆమె రాణి ఐనపుడు ఆమె ఏం చెప్తే అది చేస్తున్నాడు అని కోప్పడ్డాడు. 

ఈక్వల్ గా చూస్తే బావుండు ఇలా డిఫరెన్స్ చూపిస్తే ఎలా అన్నాడు. 
హారిక అందరిని పిలిచి ఎంతమందికి పనిష్మెంట్ లా అనిపిస్తుంది అని అడిగింది. బట్టలు పడేయడం గురించి పనిష్మెంట్ అని చెప్పాడు.  
అఖిల్ మంత్రిగా నేను చెప్పినది చేయలేదు అని అన్నాడు సోహెల్. కామెడీ రాజుని చేశారు నన్ను అన్నాడు. నాకు ఇచ్చిన పనిష్మెంట్ ఈజీ అని చెప్పాడు నేను రాజుని అయినపుడు నాకు చెప్పలేదు అని అన్నాడు. అఖిల్ నేను సరదాగా చెప్పాను అంతే అన్నాడు.   

ఎవరైనా ఫ్రెండ్ కి ఈజీ ఇచ్చినపుడు హాపీ అవ్వాలికానీ అలా కష్టమైనది ఇస్తారా అని అడుగుతున్నాడు సోహెల్. కోపం వచ్చేసి అదే కంటిన్యూ చేస్తున్నాడు. 
బట్టలు పడేసే విషయం మీదే డిస్కషన్ నడుస్తుంది. సోహెల్ అదే విషయం మీద ట్రిప్ అయ్యాడు. 

మోనల్ అండ్ సోహెల్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయం మీద మోనల్ నువ్వు అందరికి ఎక్కువ స్పేస్ ఇస్తావ్ అందుకే ఎక్కువ చొరవ తీస్కుంటారు నీ దగ్గర అని చెప్తుంది.
 
అరియానా తో పోల్ డాన్స్ చేయిస్తుంది హారిక. అఖిల్ ఇప్పటికింకా నా వయసు పాట పాడుతున్నాడు. 

రేపటి ప్రోమోలో మోనల్ క్వీన్ రోల్ తీస్కుంది. అభి ని అమ్మాయి గా అరియానా ని తన బోయ్ ఫ్రెండ్ గా సోహెల్ ని ఇంకో అమ్మాయిగా హారిక ని పోకిరి అబ్బాయిగా చేయిస్తున్నట్లుంది. అరియానా బండ్ల గణేష్ డైలాగ్ "ఆడపిల్లలంటే ఆటబొమ్మలైపోయారా రా మీకు" అని చెప్తుంది. మొత్తం హిలేరియస్ గా ఉన్నట్లుంది. ఈ టాస్క్ లో అరియానానె హైలైట్ అవుతున్నట్లుగా ఉంది చూడబోతే బెస్ట్ పెర్ఫార్మర్ తనే అవుతుందేమో. 

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

6, డిసెంబర్ 2020, ఆదివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటలలో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయవచ్చు. 



ఈ రోజు ఫన్ డే అండ్ ఎలిమినేషన్ డే కదా కొన్ని చిన్న చిన్న ఆటలతో ఎంటర్టైన్ చేసి అవినాష్ ని ఎలిమినేట్ చేశారు. తను హౌస్ లో నామినేషన్స్ లో ఉన్నపుడు చూపించిన ఫ్రస్ట్రేషన్ అండ్ టెన్షన్ అన్నీ పక్కన పెట్టి అందరిని చాలా చక్కగా ఎంటర్టైన్ చేసి వెళ్ళాడు అవినాష్. 

నో డౌట్ హీ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండ్ ఎంటర్టైనర్. కేవలం తన ఫ్రస్ట్రేషన్ అండ్ హౌస్ లో సంఘటనల వల్ల తన ఇమేజ్ పాడవుతుంది అనే టెన్షన్ లేకుండా ఇదేలా ఎంటర్టైన్ చెసుంటే తను ఫైనల్ ఫైవ్ లో ఉండవలసిన వాడు. ఈ ఇరిటేషనే జనాలకి ఇరిటేషన్ తెప్పించి ఓట్స్ వేయకుండా ఆపేసింది అనిపిస్తుంది. 

ఈ రోజు మోనల్ సేవ్ అవడంతో ఇప్పటి వరకూ అఖిల్ వోట్ బాంక్, అభి హారిక వోట్ బాంక్ అనుకుంటున్న వాళ్ళందర్ని సైలెంట్ చేసేసింది మోనల్. ప్రతి వారం నామినేట్ అవడం వలన ఒక ఫాన్ బేస్ పెరుగుతుంది అదొక రీజన్ ఐతే ఆంధ్రాలో ఉన్న గుజారాతి ఫామిలీస్ ఓట్స్ కూడా తోడై తను ఆటలో కొనసాగుతుంది అనిపిస్తుంది.  
 
వివరాలలోకి వెళ్తే ఘర్షణ సినిమాలోని నిన్ను కోరి పాటతో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. వెరీ ఇంట్రెస్టింగ్లీ రెట్రోకి వెళ్ళారు. చాలా బావుంది.  
 
యారోంక యార్ గేం: 
అందరికి బోర్డ్స్ ఇచ్చారు ఒకొక్కరి గురించి ప్రశ్నలు వేసి వాళ్ళ సమాధానాలు అందరితో మ్యాచ్ చేశారు.
 
అఖిల్ పేవరెట్ సాంగ్ హ్యాపీ డేస్  
అఖిల్ కి ఎన్ని టాట్టూస్ నాలుగు
స్నానం చేయడనికి ఎంత టైమ్ తీస్కుంటావ్ టెన్

అరియానా 
ఫస్ట్ జాబ్ యాంకరింగ్ 
ఊతపదం - సీరియస్లీ
బయటపెట్టద్దనుకున్న టాలెంట్ - కుకింగ్

హారిక 
అన్నాయింగ్ హాబిట్ ప్ 
ముద్దుపేరు - పండు
కళ్ళు ఏ కలర్ - బ్లాక్ 

సోహెల్ 
ఎంతమంది అమ్మాయిలకి లవ్ లెటర్స్ - టూ
ఇంటినుండి ఖార్ఖానాకి టైమ్ ఎంత - 
బాగా ఇష్టమైన ప్రొఫేషన్ - యాక్టింగ్ డాన్స్
తెలియని పెళ్ళికి వెళ్ళావా - ఎస్..

మోనల్ 
అవినాష్ ని ఎన్నిసార్లు ముద్దు - త్రీ అవి ఒక్కడే 
ఇష్టమైన వెజిటబుల్ - పాలక్ హారిక ఒక్కతే
ఎన్ని తెలుగు సినిమాలు - ఐదు నోబడీ

అవినాష్
వైఫ్ లో ఉండాల్సిన క్వాలిటీ - కేరింగ్ అంటే నువ్విచ్చేది స్కేరింగ్ కదా అంటా నాగ్  
నువ్వు అరియానాకి సోఫా మీద ఏం రాశావ్ - కూల్ 
మొదటి జీతం - ఐదొందలు

అభి 
వన్ టు టెన్ లో డాన్స్ రేటింగ్ - వన్
ఇంట్లో వండిన టేస్టియెస్ట్ డిష్ - ఎగ్ బుర్జి అంటే కాదు రసం ఈజ్ గుడ్ అని అన్నారు హౌస్మేట్స్ నవరసాలు కాదు కొత్త రసం యాడ్ అయిందంట నాగ్. 
షూ సైజ్ ఎంత - ఎయిట్.ఫైవ్ ఫార్టీవన్ 


హారిక సోహెల్ మోనల్ ముగ్గురుకీ ఎనిమిది వచ్చాయ్
అబిజిత్ చేసిన వెబ్ సీరీస్ పెళ్ళిగోల మోనల్ కి తెలీదు.
అరియానా అమ్మ గారి ప్రొఫెషన్ నర్స్ సోహెల్ ఈజ్ ద విన్నర్ యారోంకా యార్. 
హారిక రన్నరప్ బాడ్జ్ వేసింది. అందరిబందువయా అని.   

టాస్క్ లో ఆవు ఇపుడు వచ్చింది. దాన్ని ప్రసన్నం చేస్కుంటే కనుక మిమ్మల్ని సేవ్ చేస్తుంది మీ టాలెంట్ చూపిస్తే ప్రసన్నం అవుతుంది. 

ఆవినాష్ సంక్రాంతి కి ఇంటికొస్తావ్ కదా అని అవుని అంటూంటే నువ్వు విలేజ్ నుండే వచ్చావ్ కదా సంక్రాంతికి వచ్చేది ఎద్దులా ఆవులా అని అడిగారు నాగ్. 

అభి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావ్ అని చెప్పి ఒక్కసారి నాకోసం అంబా అనవా అని అడిగితే అనేసింది అభి సేవ్.  అరిచాక కూడా అర్ధంకాలేదు అభికి పాపం ఈ వీక్ బాగానే టేన్షన్ పడ్డాడనుకుంటా. సో సేవ్ అయ్యానా నిజంగా అన్నటైప్ ఎక్స్ప్రెషన్ కనిపించింది. అందరికి పాదాభివందనం చెప్పడం బావుంది. 

స్పాటిఫై డెడికేట్ యువర్ సాంగ్ ఆట.. 
స్లింగ్ షాట్ తో ప్లేలిస్ట్ ని కొట్టాలి.  ఒక సభ్యుడి కారెక్టర్ ని బట్టి ప్లే లిస్ట్ ని డెడికేట్ ఛేయాలి. 
హారిక ప్యూర్ లీ ప్రేమ లిస్ట్ మోనల్ కి అంకితం. మాటే వినదుగ పాటకి డాన్స్ చెశారు.  

అఖిల్ ఎనర్జీ బీట్స్ గ్యాంగ్ లీడర్ వచ్చాదు సాంగ్ సోహెల్ కి 

సోహెల్ టాలీవుడ్ హంక్స్ రావణ సాంగ్ అఖిల్ కి సరిగా సరి పడుతుంది. 

అరియానా దోస్ట్ మేరా దోస్త్ లిస్ట్ ఛోటీ ఛోటీ బాతే సాంగ్ అవినాష్ తో చేసింది. 

అవినాష్ స్లింగ్ షాట్ తగలలేదు.. బాల్ తో కొట్టాడు టాలీ చిలౌట్.. సామజ వరగమనా - అరియానాతో చేశాడు సీరియస్లీ ఆని ఆశ్చర్యపోయింది. 

అభి టాలీ పార్టీ టైమ్ ముక్కాబులా పాటకి సోహెల్ ని సెలెక్ట్ చేశాడు. 

మోనల్ టాలీ ఘుమ ఘుమలు అందమైన ప్రేమ రాణి పాట ఇద్దరిని సెలెక్ట్ చేసింది. అఖిల్ అండ్ హారిక ఇద్దరిని వీళ్ళతో ఫ్యామిలీ అని ఫీలవుతాను అని సెలెక్ట్ చేసింది.    

అభి మెలాంకలీ తెలిసెనే పాటకి అవినాష్ ని సెలెక్ట్ చేశాడు. 

మోనల్ తెలుగు రొమాన్స్ - కాటుక కనులే పాటకి అఖిల్ ని సెలెక్ట్ చేసి భలే డాన్స్ చేసింది. 
ఈ మధ్య అఖిల్ కి భలే హగ్ లు దొరుకుతున్నాయ్ కదా అని అంటుంటే ఏం చెప్పను సర్ నా పరిస్థితి అంటుంది మోనల్. నంబర్ వన్ పులిహోర రాజా అఖిల్ అని తేల్చేశారు అంతా.. 

హారిక పోవే పో పాట వస్తే అభికి ఓ పాట డెడికేట్ చేశ్తా అని అంటే శరే అని రొమాన్స్ లో హొయినా హొయినా పాట ప్లే చేశారు.

ముగ్గురికి విజిల్స్ ఇచ్చారు. ఎవరి విజిల్ సౌండ్ వస్తే వాళ్ళు సేవ్ హారిక సేఫ్ అయింది చాలా హాపీ గా ఫీలైంది. 

పది కోట్ల ఐదు లక్షల వోట్లు వచ్చాయిట ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ లో

మోనల్ అవినాష్ ఇద్దరికీ మాజిక్ బౌల్స్ ఇచ్చారు టెస్ట్ ట్యూబ్ లో లిక్విడ్ ని బౌల్ లో పోయాలి ఎవరిది రెడ్ అయితే వాళ్ళే ఎలిమినేట్.   

అవినాష్ ఈజ్ ఎలిమినేటెడ్ థ్యాంక్యూ బిగ్ బాస్ అని చెప్పాడు సాష్టాంగ్ నమస్కారం చేశాడు. మోనల్ కి యూ ఆర్ స్ట్రాంగ్ అని పదే పదే మూడు సార్లు చెప్పాడు. 

లెట్స్ వెల్కం ద ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ అని పిలిచారు నాగ్. 

ఏవీ చూపించారు నిజంగానే ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ అనిపించింది. బావుంది. 
నన్నీస్థాయికి తీస్కొచ్చినందుకు పాదాభి వండనం చెప్పారు. 
నాపక్కన గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ ఉన్నాడు అని చెప్పారు నాగ్. 

మోనల్ గురించి భలే ఇమిటేట్ చేశాడు తన లాంగ్వేజ్ కూడా బాగా ఇమిటేట్ చేశాడు. 

సోహెల్ నన్ను చూసుకున్నట్లు అనిపిస్తుంది అని భలే ఇమిటేట్ చేశాడు. గేం గురించి ఆలోచిస్తూనే అందరి గురించి ఆలోచిస్తాడు. ఫెండా కప్పా అని అడిగితే కప్ తీస్కో ఫ్రెండ్ కి ఇవ్వకు అన్నాడు. 

అఖిల్ ఈ మధ్య బూతులు మాట్లాడుతున్నాడు అన్నాడు. మాములు పులిహోర కాదు అని

అరియానా ఏడుస్తుంటే నువ్వు తనని నవ్వించి వెళ్ళాలి అన్నారు నాగ్. 

హారిక ఇమిటేట్ చేయడానికి టైం పట్టింది. వాకింగ్ స్టైల్ చూపించాడు.. నవ్వించి చాలా స్ట్రాంగ్ అండ్ ఈక్వల్ గా అమ్మాయిలతో ఫైట్ చేస్తుంది. 

అభికి బ్లూ సోఫా, మెజెనైన్, మర్రిచెట్టు కింద కుర్చీలు, కప్ కెటిల్ అవి ఇచ్చి పంపండి సార్. వాకింగ్ స్టైల్ అవీ చూపించాడు భలే ఇమిటేట్ చేశాడు.

మనసులో ఎంత బాధ ఉన్నా ఎంటర్టైన్ చేసే వాడే నిజమైన కమెడియన్ అన్నట్లుగా తన మనసులో బాధని ఏమాత్రం బయటపడనీకుండా చాలా చక్కగా నవ్వించాడు అవినాష్ ట్రూ కమెడియన్. ఓన్లీ నామినేషన్స్ తీశ్కోలేక పోయిన ఫ్రస్ట్రేషన్ వల్ల ఎలిమినేట్ అయ్యాడు. 
అందరికి ఆల్ ద బెస్ట్ బాగా ఆడండి అని చెప్పాడు. 

బిగ్ బాంబ్ ఒక వారం వాళ్ళే పని చేయాల్సిన అవసరం లేదు. అభికి ఇచ్చాడు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

5, డిసెంబర్ 2020, శనివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటలలో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజు శనివారం అంటే రోస్టింగ్ డే అని అందరం ఊహిస్తాం అండ్ ప్రోమో చూశాక కూడా నాకుకాస్త అలాగే ఉండబోతుందేమోలే అనిపించింది. కానీ ఈ రోజు ఎపిసోడ్ కూడా బంధాలు అనుబంధాలు మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కాస్త బోరింగ్ గానే అనిపించింది. 

మోనల్ అవినాష్ ని తన్నడం విషయంలో క్లోజప్ స్లో మోషన్ వీడియో లో చూపించి మరి. మోనల్ కాన్ ని తన్నింది రెండో సారి కాన్ పక్కకి పడడంతో అవినాష్ కి తగిలింది అని అన్నట్లే ఛెప్పారు నాగ్. కానీ దానికి ముందు మోనల్ నవ్వు చూసి అఖిల్ ఒక్కడు తప్ప మిగిలిన హౌస్మేట్స్ అంతా అపార్థం చేస్కున్నారు ఆ నవ్వు ఏదో కన్వే చేస్తుంది అని. నవ్వు నాలుగు విధాల చేటు అని ఎందుకు అంటారో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. ఒకవేళ మోనల్ ఇంటెన్షన్ తన్నడం  కాకపోతే కనుక సంధర్బం లేకుండా నవ్వడమే తనని డిఫెన్స్ లో పడేసిందనిపించింది. 

ఇక అఖిల్ ని సేవ్ చేసి తనకి మెడల్ ఇచ్చారు ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ ఫోర్ అని చెప్పి మాంచి బాహుబలి బాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రజెంట్ చేశారు. చాలా బావుంది.  

అభిజిత్ పడ్డాడు కాలికిదెబ్బ అని ఈ రోజంతా ఊదర గొట్టేశారు కానీ అది చాలా చిన్నదే అసలు పడడం అని కూడా ఆనలేం తనకేం కాలేదు ఎటువంటి ఇబ్బంది లేదు. తన యాటిట్యూడ్ అండ్ ఎనర్జీకి అది జుజుబీ.. పైగా నాగ్ ఇచ్చిన క్లారిటీతొ బూస్ట్ తో తన లాస్ట్ వీక్ డిప్రెషన్ నుండి కోలుకొని మంచి ఎనర్జిటిక్ గా సంతోషంగా బాక్ టు నార్మల్ అన్నట్లు ఉన్నాడు. 
 
వివరాలలోకి వెళ్తే సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలోని కాటుక కనులే పాటతో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. 
 
తొంభైవ రోజు ఉదయం మోనల్ అఖిల్ మాట్లాడుకుంటున్నారు. పకడ్ పకడ్ కే హగ్ దేతే హో అంటుంది మోనల్ హారిక కి నేను ముందు నుండి ఇస్తున్నాఅ హగ్ అని అంటున్నాడు అఖిల్. కాదు ఇపుడు ఎక్కువైంది అని అంటుంది మోనల్. అఖిలేమో నీ వల్లే నేను మిగిలిన అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తున్నా అని అంటున్నాడు ఇన్నొసెంట్ అబ్బాయిని నేను మొదట మాటాడేవాడ్ని కాదు నీ వలల ఇలా అయ్యా అన్నాదు..

అవినాష్ అరియానా ల గురించి డిస్కషన్ జరుగుతుంది. అవినాష్ అందరిని కవర్ చేస్తున్నాడు మొదట్లో దివి ని కూడా అన్నాడు అని చెప్తున్నాడు సోహెల్.  

అభిజిత్ జైలు శిక్షా కాలం పూర్తయింది. 

ఎంటీఆర్ తెలుగు రుచులు టాస్క్. 

రెడ్ టీం రసం, వెజ్ గ్రేవీ, లెమన్ రైస్ చేయాలి - అభి హారిక అవినాష్
ఎల్లో టీం సాంబార్, వెజ్ గ్రేవీ, టొమాటో రైస్ చేయాలి - అరియనా మోనల్ అఖిల్ 
జడ్జ్ సోహెల్  
ఈ వంటలు చేసి తినాలి
ఇద్దరు టీంస్ వంటలు బావున్నాయ్ అని హాంపర్ అందరు పంచుకున్నారు. 


లగ్జరీ బడ్జెట్ టాస్క్. హైజీనిక్స్
ఇద్దరు సభ్యులు ఒకరు హాండ్ వాష్ దగ్గర ఉండి డైరెక్షన్స్ చెప్తుంటే మరొకరు హాండ్ వాష్ చేసి కళ్ళకి గంతలు కట్టుకుని వెళ్ళి ఐటమ్స్ తీస్కోని బాక్స్ లో వేయాలి. 
అఖిల్ డైరెక్షన్స్ చెప్తుంటే అభి కళ్ళకి గంటలు కట్తుకుని వెళ్ళాడు. కాలుకి దెబ్బ తగిలింది ఒక చోట కొంచెం పూల్ గట్టు తట్టుకుని కూర్చున్నట్లు గా పడ్డాడు.

ఐలవ్ మైసెల్ఫ్ అని అంటుంటే అభితో అవినాష్ వింటే ఫీలవుతాడు అన్నాడు తను.. అవినాష్ కి ఇలాంటి లాజిక్స్ తెలియవు అని అంది అరియానా అభితో మాట్లాడుతూ. అవినాష్ చాలా సీరియస్ అయ్యాడు. నాకేం తెలియకుండానే ఇంత స్థాయికి వస్తానా అని అంటున్నాడు. ఇద్దరు గోల గా కాస్త అరుచుకున్నారు. 

వీళ్ళ గొడవ చూసి నాగ్ సర్ ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అయింది హౌస్ లో అందరూ చాలా వోలటైల్ గా ఉన్నాట్లున్నారు చిప్.. అని ఊహూ ఊహూ కాదు మదర్ బోర్డే కాలిపోయినట్లుంది అంటున్నారు.   

హౌస్ లోకి వచ్చారు.. 
నేనేం అడగదలచుకోలేదు మీరే చెప్పండి.. ఇక్కడైనా కన్ఫేషన్ రూం లో ఐనా చెప్పచ్చు. 

అవి ఎందుకంత కోపం వస్తుంది అని అన్నారు. కన్ఫెషన్ రూం లో చెప్తా అన్నాడు. మోనల్ ఇష్యూ చెప్పాడు ఫస్ట్ మాములుగానే తగిలింది అని చెప్పింది. తర్వాత తను గట్టిగా కావాలనే తన్నింది నేను కోపంగా చూశ్తే కూడా తను ఇలా ఒక లుక్ ఇచ్చింది అని చెప్పాడు. తర్వాత అఖిల్ సోహెల్ బ్లాక్ చేసి ఇద్దరు పట్తినవి ఒకే కాన్ లో పోస్తున్నారు. నేను వెళ్ళాక నువ్వు కాసేపు నేను కాసేపు అని పట్టుకున్నారు. నేనున్నప్పడు ఎందుకు అలా చేయలేదు. అందరు ఒకటయ్యారు. సో నీ ప్రాబ్లమ్స్ అందరితో కనుక లివింగ్ రూం లో మాట్లాడుకుందాం అని చెప్పాడు నాగ్.

వీడియో క్లిప్ చూపించారు. స్లో మోషన్ లో ఫ్రేం టు ఫ్రెం జూమ్ చేసి చూపించారు. ఫస్ట్ టైం పాలకాన్ ని తన్నింది సెకండ్ టైం చేసినపుడు కాన్ తప్పుకోడం వలన అవినాష్ కి తగిలింది. 
అందరు స్మైల్ గురించి పాయింటవుట్ చేశారు. తన్నక ముందు ఎందుకు నవ్వింది అన్నది అర్ధం కాలేదు. ఒక స్మైల్ తో జడ్జ్ చేస్తున్నారు అందరు అని అంటుంది. దాన్ని బేస్ చేస్కుని కావాలని తన్నింది అని చెప్తున్నారు. మరొక సారి అపాలజీ చెప్పమన్నారు. 

ఇండివిడ్యువల్ కి సోలో గేం కి డిఫారెన్స్ ఉంది. మీగేం మీరు ఆడండి దానికి ఏమేం హెల్ప్ తీస్కుంటారు అనేది కూడా ఉంది అన్నారు. దానికి సోహెల్ అండ్ అఖిల్ ఇద్దరు థ్యాంక్స్ చెప్పారు. 

బిగ్ బాస్ ఎవరి విషయంలో పార్షియాలిటీ చూపించరు. ఇన్ని కెమేరాల మధ్య ఒకరికి చూపించడం జరిగే పని కాదు చేయరు కూడా అన్నారు.  
అభి కన్ఫేషన్ రూం కి వెళ్ళి మిమ్మల్ని డిజప్పాయింట్ చేశా అని ఫీలవుతున్నా అంటే లేదు లేదు నువ్వు బాగా ఆడుతున్నావ్ అలగే నీ గేం నువ్వు ఆడు అని చెప్పారు.     

సోహెల్ సాక్రిఫైస్ గురించి మాట్లాడుతుంటే పబ్లిక్ కి తెలుసు అఖిల్ కి మెడల్ వచ్చింది నువ్వు త్యాగం చేశావ్ అని చెప్పారు. 

అరియానా నా అబ్సర్వేషన్ ఇది అని క్లారిటీ ఇచ్చింది. 

మోనల్ కన్ఫేషన్ రూం కి వచ్చింది. త్రీ వీక్స్ నుండి నన్ను నామినేట్ చేస్తున్నారు. ప్రూవ్ చేస్కో అని చెప్తున్నారు ఎలా చేస్కోవాలో తెలీడం లేదు అని అంది. ఇండైరెక్ట్ గా మూడు వారాలు నామినేట్ చేసినందుకే తన్నాను అని చెప్పినట్లు అనిపించింది నాకైతే :-) 

నాగ్ సార్ నిన్ను నామినేట్ చేస్తున్నారు నువ్వు ఆదుతున్నావ్ సేవ్ అవుతున్నావ్ కదా అలాగే ఆడు.. ఎవరు ఏమంటారు ఏమనుకుంటారు అనేది ఆలోచించకు అది నీకు అనవసరం. వాళ్ళు నీ నవ్వు గురించి అన్నది మర్చిపో నీ వివరణ నువ్వు ఇచ్చేశావ్ కదా. నువ్వు కాన్ నే తన్నావ్ అది తొలగడంతో అవినాష్ కి తగిలింది అంతే అని క్లియర్ గా చెప్పారు. నవ్వుతూ వెళ్ళమ్మా అని పంపేశారు. 
   
అందరూ నవ్వుతున్నారు ఐ యామ్ సో హాపీ అని చెప్పారు.. 

మెడల్ ఇవ్వాలి కదా నీకు అని అంటే సేవ్ అయ్యాక సర్ అన్నాడు అఖిల్.. అవన్ని తర్వాత ముందు పద అని గార్డెన్ ఏరియాలోకి తీస్కెళ్ళాడు. మాంచి బాహుబలి బాక్ గ్రౌండ్ తో రెడ్ కార్పెట్ పరిచి వాక్ చేస్కుంటూ వెళ్ళారు అందరూ.     
 
ఎవరితో వేయించుకుంటావ్ అని అడిగితే సోహెల్ అన్నాడు. 

ఒక్కొక్కరితో ఎలా ఫీల్ అవుతున్నావ్ అని అడుగుతున్నారు. 
అవినాష్ టెన్షన్ గా ఉందా అంటే అవును సార్ చాలా అని చెప్పాడు. అది కనిపిస్తూనే ఉందన్నారు అందర్ని చంపేస్తున్నావ్ అని అననరు అవిని. 

అఖిల్ ని సేవ్ చేసి మెడల్ ఇచ్చారు.. నువ్వు సేఫ్ అండ్ యూ ఆర్ ద నంబర్ వన్ ఫైనలిస్ట్ అని చెప్పారు నాగ్. అసలు అఖిల్ మాములుగా నవ్వలేదు చాలా హాపీ ఫీలయ్యాడు గాట్టిగా నవ్వేశాడు. 

బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి ఫస్ట్ ఫైనలిస్ట్ అని అనౌన్స్ చేసి బ్లాస్ట్స్ మధ్య బాహుబలి బాక్ గ్రౌండ్ తో మెడల్ ఇచ్చారు అఖిల్ కి. 

అఖిల్ హాపీ అని అడిగితే చాలా సార్ అని చెప్పాడు. నువ్వు ఎంచక్కా కాలు మీద కాలేసుకుని మిగతావి చూడచ్చు అని అన్నారు నాగ్. 

నిన్న మీ బంధాలు అన్నీ చూసి మిమ్మల్ని హౌస్ లో ముందుకు వెళ్ళకుండా ఏ బంధం మిమ్మల్ని ఆపుతుంది అనేది ఒక స్టిక్ ని విరగొట్టేసి చెప్పాలి అంది. 

అరియానా ని అడిగితే అవినాష్ తో ఫ్రెండ్శిప్ ఉంది మిగిలిన వాళ్ళతో బాండింగ్ ఉంది. గేం ని ఆపేంత ఎవరు లేరు అంది. ముందుకెళ్ళకుండా ఆపుతుంది ఎవరు అని అడిగారు. అవినాష్ ని హోల్డ్ చేస్కుంటా కానీ సోహెల్ తో బ్రేక్ చేస్కుంటా అని చెప్పింది. 

అభి ఎనిమిని కన్ఫ్రంట్ చేయడం ఈజీ ఫ్రెండ్ ని చేయడం కష్టం సో అలా లెక్కేస్తే హారిక అని చెప్పాడు. బ్రేక్ చేస్కుంటా అన్నాడు. నాతో టైమ్ స్పెండ్ చేయడం లేదు 

హారిక ఆటలో ముందుకెళ్ళకుండా ఆపుతుంది మోనల్. సెకండ్ వీక్ నుండీ కనెక్ట్ అయి ఉన్నాం. మేమిద్దరం సో సిమిలర్ అందుకే నా వల్ల కావడం లేదు అంది. నాగ్ సర్ ఏం బాండైతే తనని కెప్టెన్ చేసిందో హారిక దాన్ని బ్రేక్ చేసేసింది అని చెప్పారు. సార్ మళ్ళీ మళ్ళీ అనకండి సర్ అని అంటుంది. తిను చెప్తున్నంత సేపు మోనల్ ఎమోషనల్ గా కన్నీళ్ళు పెడుతూనే ఉంది. 

అవినాష్ ఫస్టఫాల్ ఇక్కడున్న వాళ్ళతో ఎవరితో బాండింగ్ లేదు. అరియానాతో ఫెండ్ గా బాండింగ్ ఉంది. బ్రేక్ చేసి అండరికి ఒకొ ముక్క ఇద్దామని అనుకుంటున్నా అన్నారు.  అలా ఐతే హారిక రేపట్నించి ఎవరు మాట్లాడరు ఆమ్లెట్ లు వేయరు అంటుంది. నాగ్ సర్ కరెక్ట్ చెప్పావమ్మా ఐనా దాన్ని ఆరుముక్కలు చేయ్ చూద్దాం అని అంటున్నారు. అభి ఒకటే బ్రేక్ చేయ్ అని సలహా ఇస్తున్నాడు. ఆరు ముక్కలు చేసేశాడు అందరికి ఇచ్చాడు. 

మోనల్ అఖిల్ అండ్ హారిక కి కనెక్ట్ అయ్యాను. అఖిల్ ని బ్రేక్ చేయను. హారిక మోర్ కనెక్టెడ్ అని హారికది బ్రేక్ చేస్తా అని అంది. 

అఖిల్ నాకు ఇద్దరు ఉన్నారు సోహెల్ అండ్ మోనల్. బ్రెయిన్ తో ఆలోచిస్తే మోనల్ కి నేను బ్రేక్ చేస్కోవాలని అనుకుంటున్నా అంది. 

సోహెల్ గేం విశయానికి వస్తే అఖిల్ తో ఎమోషనల్ గా బాగా బాండ్ అయింది. అతనే కాదు హారికతో కూడా ఎవరు ఏడ్చినా కూడా నాకే ఏడ్పొస్తుంది అని అంటున్నాదు. ఎమోషనల్ ఫూల్ అన్నారు నాగ్ అవును సర్ ఐయామ్ అని అంటున్నాడు సోహెల్. 
అందరికి ఇస్తా అన్నాడు. 
అఖిల్ ఓన్ బ్రదర్ లా ఉన్నాడు. మేమిద్దరం తినిపించుకుంటున్నాం అంటే అరియానా రియాక్షన్ ఏంటి అని అన్నారు తను వచ్చి యాక్ట్ చేసి చూపించింది. 
మోనల్ సిస్టర్, అవినాశ్ ఎంటర్టైనర్, హారిక నాకు ప్రేమగా పిలవబుద్దైతది అందుకే చోటు అంటా. 

అభి మా ఇద్దరికి ఒకప్పడూ మాటలు ఒకరివి ఒకరికి పడేవి కాదు. హౌస్ లో రెస్పెక్ట్ ఫుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అభినే అన్నారు. అంటే మాస్ క్లాస్ కలిసిపోయినయి అని అంటున్నారు నాగ్. అభి కూడా సోహెల్ ఈజ్ ద గ్లూ బిట్వీన్ ఎవ్విరి బడీ ఇన్ దిస్ హౌస్ ఎమోషనల్ గా అందర్ని దగ్గరికి తీస్కోగలుగుతాడు అలాగే సెపరేట్ కూడా చేయగలుగుతాడు అంటున్నాదు. 

నాగ్ సర్ సోహెల్ లో చూసిన ఎనర్జీ ఎవ్వరిలో ఉండదు బాటరీ ఫుల్ ఛార్జ్ లో ఉంటుంది అని అన్నారు. 
మోనల్ హారిక ఇద్దరి దగ్గర ఎక్కువ నంబరాఫ్ స్టిక్స్ ఉన్నాయ్ ఆరు ఆరు చొప్పున. మీ ఇద్దరు సిస్టర్స్ అందరితో కనెక్టెడ్ అని చెప్తున్నారు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


4, డిసెంబర్ 2020, శుక్రవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయచ్చు. 



దదాపు ఇరవై రెండుగంటల పాటు ఎంతో సహనం తో ఓపిక తో చేసిన పోరాటం అనంతరం సోహెలే శాక్రిఫైస్ చేసి ఉయ్యాల దిగిపోయి అఖిల్ కి మెడల్ ఇచ్చేశాడు. అఖిల్ కూడా రెడీగా ఉన్నాడు పైగా తను నామినేషన్స్ లో ఉన్నా కనుక ఒక వేళ వెళ్ళిపోతే మెడల్ వేస్ట్ అవుతుంది కనుక సోహెల్ నే తీశ్కోమని అన్నాడు కానీ సోహెల్ సడన్ గా దిగేయడంతో అఖిల్ గెలిచేశాడు. అందుకే మెడల్ అఖిల్ గెలిచాడు సోహెల్ హృదయాలను గెలిచాడు అనిపించింది. 

ఇక రాంకింగ్ ప్రకారం నించోమని నంబర్స్ కోసం పోరాడమని అడిగిన బిగ్ బాస్ కి ఆల్రెడీ ఎమోషనల్ గా ఛార్జ్ అయి ఉన్న హౌస్మేట్స్ ఎక్కువ డిస్కషన్స్ లేకుండా పోరాడకుండా తీస్కున్న నంబర్స్ మీదే కంటిన్యూ అయ్యారు. అభి లాస్ట్ వీకెండ్ డిస్కషన్ ఎఫెక్ట్ అనుకుంటా పాపం సిక్స్ లోనే ఉండిపోయి వరస్ట్ పెర్ఫార్మర్ గా జైలుకి వెళ్ళాడు. ఈ టాస్క్ లో కొట్లాడలేం అనడం బానే ఉంది కానీ ఇదే నామినేషన్స్ విషయంలో పెట్టి ఉంటే బహుశా పోరాడే వాళ్ళేమో అనిపించింది.     

వివరాలలోకి వెళ్తే 88 వ రోజు రాత్రి పూట మూడు కి అవినాష్ అండ్ అరియానా కచేరీ చేస్తున్నారు. 

నాలుగు గంటలకి అభి సోహెల్ నిద్ర పోతున్నారు అఖిల్ కూడా నిద్ర పోతున్నట్లే ఉన్నాడు. ఉయ్యాల మాత్రం ఊగుతుంది. 

89 వ రోజు ఉదయం ఏడింటికి అంటే ఇరవై రెండు గంటలైంది. ఏంది పరిస్థితి ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని ఒకరినొకరినొకరు అడుగుకుంటున్నారు. అభి ఉండి మీకు ఇదే కావాలంటే మాత్రం సపోర్ట్ చేయడానికి మేం రెడీ అని అంటున్నాడు. మాట్లాడుకుంటున్నాం అని అన్నారు. అఖిల్ సోహెల్ చెవిలో ఏదొ చెప్పాడు సోహెల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. 

ఏడుంబావుకి అఖిల్ నీకు ఇంపార్టెంట్ నాకూ ఇంపార్టెంట్ అని అంటున్నాడు మా అమ్మ కెప్టెన్ అవ్వమన్నది నేను కాలేదు మా అన్న వచ్చి కూడా నన్ను టాప్ లో పెట్టలేదు. ఉంటానా అని అమ్మని అడిగితే ఉంటావంది. అని అంటున్నాదు. సోహెల్ డిసైడ్ అయి దిగుతా అని అంటున్నాడు అఖిల్ వద్దన్నాడు.. ఇద్దరికీ ఇంపార్టెంటే నాకు కూడా తెలుసు కానీ నీకోసం చేస్తాను అని అంటున్నాడు సోహెల్. సాయంత్రం వరకు ఉండమన్నా ఉంటాం మనం ఇద్దరం నాకు తెలుసు కానీ నా భయం ఏందంటే మళ్ళా అనౌన్స్మెంట్ ఏం వస్తుందో అటూ ఇటూ కాకుండా పోద్దేమో అని భయమేస్తుంది. 

ఇద్దరం ఉడుంపట్టే కానీ మరి తప్పదు. అమ్మ నన్ను మళ్ళీ కెప్టెన్ అవమన్నది కాబట్టి ఉంటున్నా కానీ లేకపోతే ఇంత ఘనం ఉండేవాడ్ని కాదు అని అంటున్నాడు అఖిల్. దిగుతా అంటే దిగద్దు అని అంటున్నాడు. నేను నామినేషన్స్ లో ఉన్నా కదా ఒక వేళ నాకేమైనా ఐతే వేస్ట్ అవుతుందేమో నువ్వు తీస్కో అని అంటున్నాడు అఖిల్. ఆ మాటతో సోహెల్ గట్టిగా ఏడ్చేశాడు దీనెమ్మ మనిద్దరికే తగిలిందేందిరా అని. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేస్తున్నారు. 

ఏడున్నర 
నువ్వు తీస్కో అని అంటున్నాడు అఖిల్.. కానీ సోహెల్ వద్దు అని అంటున్నాడు.. ఇంత సేపు కూసున్నది వేస్ట్ అవుతుంది అని అంటున్నాడు.    
సోహెల్ కూడా ఏం అర్ధం కావట్లేదు అని చెప్తున్నాడు. నువ్వు ఎవరికీ ఎమోషనల్ అవలేదు నన్ను తమ్ముడిలా చూసుకున్నావ్ అది తీస్కోలేక పోయినా అని అంటున్నాడు. అఖిల్ కూడా ఏడ్చేస్తున్నాడు. అఖిల్ దిమాక్ తో ఆడాలా దిల్ తో ఆడాలా అర్ధం కావట్లే అని అంటున్నాడు. సోహెల్ బిగ్ బాస్ ఏదో ఒకటి చెప్పండి బిగ్ బాస్ అని అంటున్నాడు. సోహెలే కాళ్ళు సర్దుకుంటానికి అన్నట్లు కొంచెం పక్కకి జరిపి టక్ మని దిగేశాడు అఖిల్ రియాక్ట్ అయ్యే లోపు. 

అఖిల్ పెద్దగా ఏడ్చేశాడు.. అభి నేనొచ్చేశా అని గట్టిగా హగ్ చేస్కున్నాడు ఇద్దరిని.. అఖిల్ ఏడుపు మాత్రం ఆపలేదు. ఇద్దరూ గట్టిగా హగ్ చేసుకుని చాలా సేపు ఏడ్చేశారు. ఇద్దరూ చాలా మంచిగా ఆడారు అని మెచ్చుకుంటున్నాడు అభి. అట్ల చూళ్ళేనాన్నా నేను నిన్ను అని అంటున్నాడు సోహెల్ అఖిల్ తో. 

సోహెల్ తో యూ డిడ్ ద రైట్ తింగ్ బ్రదర్ అని అంటున్నాడు అభి. పుష్ మి అని అన్నాడు అఖిల్ ఫస్ట్ నాకు ఆమాట చాలు అనిపించింది అన్నాడు.  

అందరూ కూడా చాలా బాగా ఆడారు ఇద్దరూ అని అంటున్నారు. 

అఖిల్ కి అభినందనలు అందించి మొదటి ఫైనలిస్ట్ అయ్యారు. ఈ వారం మీరు ఎవిక్షన్ నుండి సేవ్ అయితే ఫినాలే వీక్ కి చేరుకుంటారు. మెడల్ ఎప్పుడు లభిస్తుందో సమయమ్ వచ్చినపుడు తెలియచేస్తారు అని అన్నాడు. 
ప్లీజ్ బిగ్ బాస్ సోహెల్ ఫోటోని బర్న్ చేయద్దు అని అంటున్నాడు అఖిల్ తను పక్కన ఉండగానే కాల్చేశారు. 
     
89 వ రోజు ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం పదకొండు గంటలకి ఎమ్.సి.ఎ  సినిమాలోని ఫ్యామిలీ పార్టీ పాటతో మేల్కొలిపారు. 

హారిక అభి డిస్కస్ చేస్కుంటున్నారు. ఇన్ని రోజులు అయింది క్దా ఇంకా కొన్నాళ్ళే ఉంది హౌస్ లో నువ్వు మర్చిపోవచ్చుగా అంటుంది హారిక అంతే నేను మర్చిపోవాలి కానీ నువ్వు నాకు హెల్ప్ చేయవు అనంటున్నాడు అభి. సరే ఏం చేయాలో చెప్పు అంటే నీ అంతట నీకు రావాలి నేను చెప్పి చెయించేది కాదు అంటాడు. ఏంటో ఈయన బాధ నాకైతే అర్ధం కాలేదు. 

అఖిల్ నన్ను నామినేట్ ఎందుకు చేశాడో తెలుసా అని అంటూ రేయ్ ఇష్యూ మాత్ ఇష్యూ అవన్నీ చెప్తున్నాడు అభి. కాన్ ఫ్రంటేషన్ అవుతది లొల్లి అవుతది పరిష్కరం ఉండదు సంబంధం లేకుండా మాట్లాడుతాడు అని అంటున్నాడు. 

వీళ్ళు మాట్లాడుకుంటుంటే అఖిల్ వచ్చి థ్యాంక్స్ బ్రో అని అంతున్నాడు మీరు లేకపోతే మేం ఆక్కడదాకా కూడా ఆడేవాళ్ళం కాదు అని అంతున్నాదు. మొదటి నుండి జరిగిన డిస్కషన్సే అవుతున్నాయ్ రా కూర్చో అని పిలిచాడు అభి. 

రియల్ మాంగో డ్రింక్ వారి టాస్క్. 
ఒక బాటిల్ పాస్ చేస్కుని తాగుతూ ఎవరి దగ్గర ఆగిపోతే వాళ్ళకి ట్రూత్ ఆర్ డేర్ ఇవ్వాలి అనేది టాస్క్.
ఫస్ట్ సోహెల్ కి వచ్చింది బాటిల్ టచ్ చేయకుండా తాగాలి గ్రౌండ్ నుండి పైకి లేపి మాములుగా తాగలేదు సోహెల్.. ఖార్కానా బ్యాచ్ కదా అంతే అని అంటున్నాడు అఖిల్.   

ఒక రౌండ్ లో అభికి వచ్చింది. ట్రూత్ అన్నారు అరియానా నీకు స్కూల్ డేస్ నుండి ఉన్న లవ్ లో బెస్ట్ వర్స్ట్ చెప్పమన్నారు..  
తర్డ్ క్లాస్ మహిమా క్లాస్ టీచర్ కూతుర్
ఫోర్త్ అనన్య ఫిప్త్ ఈషా, సిక్స్త్ తాన్య సెవెన్త్ అక్షయ బెస్ట్ ఎవరంటే ఆల్ ఆర్ బెస్ట్. రీకనెక్ట్ ఎవరితో అంటే ఈషా.
అరియానా ఉండి వరల్డ్ ఫేమస్ లవర్ టైటిల్ నీకే అని అంటుంది :-) 

హారిక మోనల్ మిగిలారు. 
మోనల్ కి ట్రూత్ హారిక ఇచ్చింది. నాలుగు ఆప్షన్స్ లో ఏది పిక్ చేస్కుంటావ్. 
గద్దల కొండ గణేష్ వరుణ్ తేజ్ 
నాగ్ సర్ మూవీ అల్లు అర్జున్ మూవీ విజయ్ దేవరకొండ మూవి వస్తే ఎవరిది పిక్ చేస్కుంటావ్ అంటే నాగ్ సార్ అని అంది. 

అవినాష్ బుర్ర కథ లాగా చెప్తున్నాడు మోనల్, అరియానా, సోహెల్, హారిక, అభి, అఖిల్ ఇలా అందరి గురించి బాగా చెప్పాడు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అరియానా అవినాష్ ని హగ్ చేస్కుని ఏడ్చేసింది పాపం.. అందరూ కలిసి ఫామిలీ హగ్ అని లవ్యూ ఆల్ అని అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పాడు అవినాశ్ అందరి కెరీర్ లు ఓ రేంజ్ లో ఉండాలి అన్నాడు. అంతా థ్యాంక్స్ చెప్పారు. అభి నీది ఫస్ట్ అని చెప్పాడు అవినాష్ కి.

రాంకింగ్ ప్రకారం చర్చించుకుని నిలబడాలి. వన్ మీద ఉన్న వాడు బెస్ట్ ఆరు మీద ఉన్నవాడు వర్స్ట్.. బజర్ మోగాక చర్చలు ప్రారంభించాలి.        
అఖిల్ ఫైనలిస్ట్ అయిన కారణంగా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సిన అవసరం లేదు. 

సోహెల్,అరియనా,హారిక,మోనల్,అవినాష్ అండ్ అభి నిలబడ్డారు. 
అవినాష్ ఐదు మీద నిలబడడానికి ఆలోచిస్తుంటే అభినే ఎంకరేజ్ చేసి నిలబెట్టి తను ఆరు తీస్కున్నాడు. 
అందరు ఎవరి పొజిషన్ వాళ్ళు ఎందుకు తీస్కున్నారో వివరిస్తున్నారు. 
సోహెల్ టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఆడా ఒకోసారి ఏమైనా ప్రాబ్లంస్ వచ్చినా వెంటనే క్లియర్ చేస్కున్నా.
అరియానా నాది ఇండివిడ్యువల్ గేం అని హైలైట్ చేసింది వన్ లో ఉండాలంది. 

అవినాష్ తక్కువ నామినేట్ అయ్యాను అంటే మీకూ నాకు ఏ గొడవలు లేవని. నేను తప్పులు చేశా కనుక నేను సెకండ్ లో ఉండాలని ఉంది అన్నాడు.  

అభి నా తప్పులు ఏం లేవు లాస్ట్ వీక్ లో జరిగినది ఒక్కటి తప్ప అన్నాడు. అది చేయక పోయి ఉంటే కనుక వన్ కోసం పోరాడే వాడ్ని అన్నాడు దాని వల్ల ఇదే నంబర్ అనుకుంటున్నా అన్నాడు. 

హారిక మొన్న జలజ టాస్క్ లో కెప్టెన్ గా ఒక చిన్న పొరపాటు చేశాను టాస్క్ సక్రమంగా జరిగేలా చూస్కోడం నా బాధ్యత అని గుర్తించలేదు అందుకె నేను టూ అనుకుంటున్నా అంది. 

మోనల్ నాలుగులో వేరే వాళ్ళు చూస్తున్నారు లేదా అనేది నాకు సంబంధం లేదు ప్రజలు చూస్తున్నారు నచ్చుతున్నాను నేను బెస్ట్ కాదు వర్స్ట్ కాదు సో తర్డ్ లో ఉండాలని అనుకుంటున్నా అంది. 

హారిక మోనల్ ఎక్స్చేంజ్ చేసుకున్నా హారిక నాలుగుకి వెళ్ళింది. మోనల్ కి త్రీ ఇచ్చి. 

హారిక ఇప్పుడున్న సిట్యుయేషన్ లో పొజిషన్స్ కోసం ఫైట్ చేసే పొజిషన్ లో లేం ఎవ్వరం అని ఏడుస్తూ అంటుంది. 

మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం తప్ప మేం చేయలేకపోతున్నాం బిగ్ బాస్ ప్రతి ఒక్కళ్ళం ఫిజికల్ గా ఎమోషనల్ గా గ్రిల్ అయిపోయి ఉననాం అని చెప్తున్నారు. హారిక కళ్ళలో నీళ్ళు చూస్తుంటే నాకళ్ళలో నీళ్ళొచ్చేస్తున్నాయ్ అసలు ఇలా జరుగుతుందని నేనెపుడూ అనుకోలేదు బిగ్ బాస్ అని అంటున్నాడు సోహెల్. అందరం ఎమోషనల్ అవుతున్నాం అసలేం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో అని అంటున్నాడు సోహెల్. మేం ప్రజల మీదకే వదిలేస్తున్నాం బిగ్ బాస్ అని చెప్తున్నాడు. హారిక కూడా ట్రోఫీ ఒకరే విన్ అవుతారు ఎవిరి మినిట్ చేసీ చేసీ అలసిపోయాం కొంచెం అని చెప్తుంది హారిక. అందరూ కూడా ఎమోషనల్ అయిపోయారు. 

చివరిగా సోహెల్,అరియానా,మోనల్,హారిక,అవి,అభి ఈ ఆర్డర్ లో నించున్నారు. 

ఒక ముఖ్య విషయాన్ని తెలియజేస్తున్నారు మీరే మీ రాంకులని ఎన్నుకున్నారు. సోహెల్ వన్ లో ఉన్న కారణంగా బెస్ట్ పర్ఫార్మర్ గా అభి ఆరులో ఉన్న కారణంగా వర్స్ట్ పెర్ఫార్మర్ గా పరిగణించ బడ్డారు. కనుక అభిజిత్ జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నారు.

థ్యాంక్స్ బిగ్బాస్ ఫైట్ ఫర్ యువర్ రాంక్స్ అని చెప్పనందుకు అని అంటుంది హారిక. 

అభి రాత్రి తొమ్మిదికి అభి జైలుకి వెళ్తున్నాడు. హారిక నవ్వుతుంటే జైలు కెళ్తుంటే నవ్వుతావేంటి నువ్వేం ఫ్రెండ్ వి  అని అంటూన్నడు అభి. నేను కోడా వచ్చేయనా అని అంటుంది హారిక. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


3, డిసెంబర్ 2020, గురువారం

ఈ రోజు బిగ్ బస్ ఇంట్లో ఏం జరిగిందొ నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయవచ్చు. 



88 వ రోజు ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం కేరాఫ్ కంచరపాలెం సినిమాలోని పట్టి పట్టి నన్నే సూత్తాంటే పాటతో మేల్కొలిపారు. ఈ పాటకి సోహెల్ డాన్స్ చేస్తూ బయటికి రావడం ఫన్నీగా ఉంది. 

ఉదయమే టాస్క్ పేపర్స్ ఇచ్చేశారు ఉయ్యాల లో కూర్చుని దిగకుండా ఊగుతూనే ఉండాలి మధ్యలో బిగ్ బాస్ కొన్ని పనులు చెప్తారు అవి పూర్తి చేయాలి. అభి సంచాలకుడు అవి చేయించడం తన భాధ్యత. ఉయ్యాల దిగితే ఔట్.    

అరియానా నిన్న తిట్తినందుకేమో ఐ లవ్యూ బిగ్ బాస్ మీరు అన్ని బాగా చేస్తారు ఒకోసారి పొరబడ్డా మళ్ళీ వీకెండ్ సెట్ చేస్తారు అని చెప్తుంది. మాటలు కాదు నిజం అని చెప్తుంది.    
 
ఉదయం తొమ్మిది గంటలకి టాస్క్ మొదలైంది. అవినాష్ స్టోర్ రూం నుండి వస్తాయ్ కొన్ని అని భయపెడుతున్నాడు ఏం పర్లేదు హాండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఆడతాం ఎవరు గెలిచినా పర్లేదు అని అంటున్నారిద్దరు. 

పొద్దున్న వేసిన పాట బావుంది ఏం పాటది ఇంకోసారి వేయచ్చు కదా పాట అని అడుగుతున్నాడు సోహెల్. వేయడు అని చెప్తున్నాడు అఖిల్.    

తొమ్మిదిముప్పావ్ 
అవినాష్ ని మళ్ళీ ఆడుకుంటున్నారు అరియానా అండ్ మోనల్ ఇద్దరూ. నా దగ్గర ఉండు అంటే నా దగ్గర ఉండు అని అడుగుతూ ఆడుకుంటున్నారు. 
మోనల్ ని కూడా బయటికి రమ్మని ముగ్గురు మళ్ళీ గ్రూప్ హగ్ ఇచ్చుకున్నారు. 

మధ్యాహ్నం పన్నెండు గంటలు.
అర్జంట్ వచ్చేస్తుందిరా అడ్డం పెట్టుకుని పోసేద్దామా అని అనుకుంటున్నారు. 
స్వెట్టర్స్ పంపించారు వేస్కుని వాటిపై మనాలి జాకెట్స్ వేస్కోవాలి అని వచ్చింది టాస్క్.

ఒంటిగంట 
అవినాష్ వీళ్ళద్దరిని నలభై ఎన్మిది గంటలు ఉయ్యాల నుండి దింపకండి బిగ్ బాస్ అని అడుగుతున్నాడు.  

ఒకటీ పదిహేను. 
మోనల్ అవినాశ్ ఇద్దరు కపుల్ లా బయటికి వస్తే అఖిల్ మీ తమ్ముడా అని అడుగుతున్నాడు అఖిల్. హే తమ్ముడు కాదు నాకన్నా పెద్దోడు అని అంటుంది మోనల్.
నేను మాట్లాడను నీతో రా బయటకి వచ్చి అన్న కాదు అని చెప్పు అని ఫోర్స్ గా తీస్కెళ్తున్నాడు. అవినాష్ అంతే అన్న కాదు అని అంటున్నాడు. అవినాష్ ఆ అన్న నా ఏం అవుతాను అని అడిగితే అవినాషన్న అని అంటుంది ఛీ పిలిచి ఇజ్జత్ తీస్కోడం అంటే ఇదే అని అంటున్నాడు అవి.
 

రెండు నలభై ఐదు కి పాలు పంపించారు బిగ్ బాస్ చెరొక గ్లాస్ తాగాలని చెప్పారు. నాకు గొంతు డిస్ట్రబెన్స్ ఉంది కదా అందుకే పంపారు అని అంటున్నాడు సోహెల్. అఖిల్ పాలు తాగడట నాకు నచ్చదు నా వల్ల కాదు చక్కెర వేస్కోవచ్చా అని అడుగుతున్నాడు అఖిల్ కానీ ఏదోలా కష్టపడి తాగేశాడు అంతే. 

మూడు ముప్పై 
అభి సోఫాలో కూర్చుని మోనల్ అండ్ హారిక మాట్లాడుకుంటున్నారు. మొదత్లో చాలా మాట్లాడుకున్నాం ఇందులో అభి నేను కానీ లైఫ్ మొత్తం ఛేంజ్ అయిపోయింది మంచి మెమొరీస్ గుర్తు రావడం లేదు బాడ్ వి గుర్తు రావట్లేదు అని అంటుంది మోనల్. అలా రిసెట్ అవడం మంచిదేలే అని అంటుంది హారిక. 
ఉయ్యాలలోనె కంఫర్టర్ అడ్డుపెట్టుకుని సూసూ చేసేశాడు అఖిల్.

ఐదున్నర కొట్టుకుందామా అని అడుగుతున్నాడు అఖిల్ ఎవరో ఒకళ్ళం కిందపడతాం అని అంటున్నాడు. నో వద్దు మన మొండి తనానికి ఇద్దరం ఎవరు కిందపడం అని చెప్తున్నాడు సోహెల్. నాకొచ్చినా ఒక వేళ ఈ వీకెండ్ ఎలిమినేట్ అయితే నీకే ఇచ్చేస్తారా అని అంటే నేను నీతో ఆర్గ్యూ చేయను ఏం చేయను నాకు తెలీదు నెట్టాలనిపిస్తే నెట్టేయ్ నన్ను అని అంటున్నాడు సోహెల్. నో నేను నెట్టను అని చెప్తున్నాడు అఖిల్. 

సాయంత్రం ఆరుగంటలకి గన్ సౌండ్స్ షూట్ చేసిన సౌండ్స్ వచ్చాయ్ పెద్ద సైరన్ మోగింది పెద్ద పెద్ద సౌండ్స్. హౌస్మేట్స్ అంతా కూడా భయపడ్డారు వీళ్ళిద్దరు మాత్రం దిగలేదు ఉయ్యాల నుండి. అవినాష్ ఆ సౌండ్స్ మీద కుళ్ళు జోక్ వేశాడు. 

రాత్రి ఏడున్నర          
నాగ్ సార్ వచ్చేవరకు ఇలాగే కూర్చో పెడతారేమో ఇదేంది అసలు ఏదిఅనా మంచి గేం పెట్టాలి గాని అని అంటున్నాడు సోహెల్. నాగ్ సర్ వచ్చేవరకు ఇలాగే కూర్చుంటామేమో అని అంటున్నాడు. 

వీళ్ళకన్నా గెలిచిన వారికి మెడల్ వస్తుంది కానీ అభికి ఈ సంచాలక్ రోల్ నిజంగా పనిష్మెంటే... అలా అక్కడే కూచోడం. 

రాత్రి ఎనిమిది గంటలు 
రాడిష్ (ముల్లంగి) జ్యూస్ వచ్చింది.   
స్పూన్ తో ఒకరికి ఒకరు తాగించాల్సి ఉంటుంది. తాగించే ప్రతి సారి ఎదురు సభ్యుడు ఎందుకు అనర్హుడు తాను ఎందుకు అర్హుడో చెప్తూ తాగించాలి. 

అఖిల్ నువ్వు తొందరపాటు డెసిషన్స్ తీస్కుంటావ్ అని అన్నాడు
సోహెల్ కెప్టెన్సీ టాస్క్ ల్ నువ్ దిగావ్ నేను దిగలేదు
అఖిల్ కెప్టెన్సీ టాస్క్ లో నా మోకాళ్ళనొప్పి ఉంది నీవల్లే వచ్చింది ఐనా నేనూ కష్టపడ్డాను. నువ్వు గెలిచినదే ఆలోచిస్తావా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అని చెప్తున్నాదు. 
సోహెల్ ఒప్పుకోను అంటున్నాడు. అఖిల్ కి అది టేస్ట్ అసలు నచ్చలేదు కానీ సోహెల్ కి నచ్చింది. 
అఖిల్ కోప్పడ్డాడు చాలా బిగ్ బాస్ పెట్టింది చాలా అని అడుగుతున్నాడు. 

రాత్రి తొమ్మిది కి ఇప్పటికి పన్నెండు గంటలు గడిచాయ్ ఉయ్యాల ఎక్కి. 
సోహెల్ ఈమధ్య నువ్వు అరియానాకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావ్ నాకు చేయట్లేదు అన్నాదు. 
అఖిల్ నిన్న పాల దాంట్లో ఎవరు సపోర్ట్ చేశాడు అని అడుగుతున్నాడు.  
అరియానా పక్కనుండి నాకు సపోర్ట్ చేస్తే ఆయన అనర్హుడా అని అడుగుతుంది. మేమేదో చిన్న చిన్నపాయింట్స్ తీసి కొట్లాడుకుంటున్నాం నువ్వు కెలక్కు అని అన్నారు. అలా క్రియేట్ చేయడం కాదు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబిల్ అన్న విషయం మాట్లాడుకోవాలి అని చెప్తుంది. 

మాకు ఐతే ఇవే రీజన్స్ ఉన్నాయి అంతకన్నా వేరే రీజన్స్ లేవు అని చెప్తున్నారు. 

పన్నెండుంపావు పదిహేను గంటలైంది.
నువ్వు కెప్టెన్ గా ఫెయిల్ అయ్యావ్ నువ్వు అభిని టాస్క్ కి కన్విన్స్ చేయాల్సింది అని అన్నారు అని చెప్తుంది హారిక అభికి. అది టాస్క్ లా తీస్కోని ఉండాల్సింది అనుకుంటున్నారు. ఆ అమ్మాయ్ తన మనసులో ఉన్న ఏ ఎవరని నాగ్ అడిగినపుడు అదెవరని అడిగితే అది నేనని నేనంటే ఇష్టమని చెప్పింది అని చెప్తున్నాడు. ఈ పాయింట్ ఎప్పుడైనా బయట పెట్టానా నేను అది తన పర్సనల్ పాయింట్ అక్కడ నేను ఎప్పుడు చెప్పలేదు అని అంటున్నాడు. 
ఒక స్టాండ్ తీస్కుని ఉంటే నేను ఇంత ఫేస్ చేసే వాడ్ని కాదు అని అంటున్నాడు. ఇపుడు నేను సారీ చెప్తున్నది నా తప్పని కాదు నేను మర్యాద కొద్ది సారీ చెప్తున్నా ఒక జెంటిల్మన్ గా అని చెప్తున్నాడు.
ఇదంతా ఇంగ్లీష్ లో చెప్తుంటే హారిక తెలుగు అని రిమైండ్ చేస్తుంది. ఇరిటేట్ అయ్యాడు అభి.  
నువ్వు ఐదెళ్ళు పెద్దవాలి నాతో మాట్లాడాలంటే ప్రతి చిన్న పాయింట్ ఏటి నువ్వు అని అంటున్నాడు. 
ఇంట్రెస్టింగ్లీ అరియానా పక్కన కూర్చుని సైలెంట్ గా వింటుంది. 
అభి ట్రిప్ ఐ నీకెందుకంత రెస్పాన్సిబిలిటీ నేను తెలుగు మాట్లాడకపోతే బిగ్ బాస్ చెప్తారు కదా అని అంటున్నాడు. 

పన్నెండున్నర 
అఖిల్ సరదాగా పిల్లోతో మొఖం మీద కొట్టాడు తిక్క వచ్చింది సోహెల్ కి అఖిల్ వంచేసి తల మీద పిల్లోతో కొట్టాడు. అఖిల్ కోప్పడ్డాడు మజాక్ లు ఆడకు నాతో నేను కూడా ఆడను అని చెప్తున్నాడు అఖిల్. 

హారిక మధ్యలో ఇంటరప్ట్ చేసినందుకు సారీ అని అంటే కూడా నువ్వు నిజంగా అనుకుంటేనే చెప్పు ఏదో చెప్పాలని చెప్పకు అని చెప్తున్నాడు అభి. ఓకే అని వెళ్ళిపోయింది. 
ఇంట్లో టాస్క్ జరుగుతున్నందున ముగిసేంత వరకూ లైట్స్ ఆర్పబడవు అని చెప్పాడు. టాస్క్ వాళ్ళకే కాదు రాజా మనకి కూడా అని అంటున్నాదు. మొన్న మరి అవినాష్ రాత్రంతా నవ్వుకుంటూ కూచున్నపుడు ఎందుకు పెట్టాలేదు అని అడుగుతుంది హారిక.
 

ఒకటిన్నర కి 
బిగ్ బాస్ ఎవరినైనా తోసేయచ్చా అని అడుగుతున్నాడు అవినాష్. దా దగ్గరికి రా చూద్దాం తోద్దాం అని ట్రై చేయ్ చూస్తా అని అంటున్నాడు సోహెల్. 

అపుడు నిద్రమానుకుని ఇలానే నవ్వాను అని చెప్తుంటే ఆవినాశ్ హారిక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మెడల్ వస్తుంది కదా అపుడిలానె నవ్వుదాం అని అంటుంది.   

ఒకటిముప్పావు.. 
వాళ్ళు ఆట ఆడుతుంటే మేం పడుకోకుండా ఉండడం ఏంటి బిగ్ బాస్ అని అడుగుతున్నాడు అవినాష్. 
నాకు హాపీనెస్ ఎంటంటే అరియానా నాతో పాటుజాగారం చేస్తుంది ఐయామ్ హాపీ అని చెప్తున్నాడు సోహెల్.

నాకు ఛాన్స్ దొరికితే నిన్ను చంపేస్తారా అని అంటుంది అరియానా అండ్ అవి నాకు దొరికితే ఇద్దరిని చంపేస్తా అన్నాడు. దానికి అఖిల్ నాకు ఛాన్స్ దొరికితే నిను చంపుతా అని అవినాష్ ని అంటున్నాదు. నీకు ఛాన్స్ రాదులే కాని చప్పుడు కాకుండా కూచో అంటున్నాడు అవి దానికి అరియానా చప్పట్లు కొడితే  నిన్ను కాపాడదామని నేను చూస్తుంటే నువ్వు చప్పట్లు కొడతావా అంటుననడు అఖిల్. దానికి వెంటనే హారిక పులిహోర పులిహోర అని అరవడం మొదలు పెట్టింది ఛాన్స్ దొరికితే కలిపేస్తున్నాడు ఈ మధ్య అని అంటుంది. 
అఖిలే నంబర్ వన్ పులిహోరా అని అంటున్నరు. 

అరియానా పాడుతుంటే దాని లిరిక్ మార్చేసి పాడాడు అవినాష్. అరియానా ఫుల్ ఫైట్ కి వచ్చింది అవినాష్ మీదకి బాగా కోపం వచ్చినట్లుంది. ఇద్దరు ఉయ్యాల చుట్టూ తిరుగుతూ తిట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు మా చుట్టూ తిరుగుతున్నారేంటి అని టెన్షన్ పడుతున్నారు. 

రేపటి ప్రోమోలో తెల్లగా తెల్లారే వరకు ఉయ్యాలలోనే ఉన్నారు ఇద్దరూ.. సోహెల్ గట్టిగా ఏడ్చేస్తున్నాడు. దిగిన తర్వాత ఇద్దరిని అభి హగ్ చేస్కుని ఓదార్చడం బావుంది. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.


2, డిసెంబర్ 2020, బుధవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయచ్చు. 


 
ఈ రోజు రేస్ టు ఫినాలే సెకండ్ లెవల్ జరిగింది ఇందులో విజెతలుగా నిలిచి అఖిల్ అండ్ సోహెల్ తర్డ్ లెవెల్ కి వెళ్ళారు. హారిక హైట్ వలన పాపం తనకి స్కోప్ లేదని చాలా బాధపడింది అన్నట్లే మొదటి రౌండ్ లోనే ఎలిమినేట్ అయింది.

ఇది వ్యక్తిగత గేం అని అనౌన్స్ చేసినందుకు నిన్న ఇదే మాట ఎందుకు అనౌన్స్ చేయలేదు బిగ్ బాస్ అని అరియానా చాలా ఏడ్చేసింది నా కోపం నిన్న గెలవలేదని కాదు ఈ ప్రాసెస్ మీద అని చెప్తు అరిచేసింది. ఈ ఇండివిడ్యువల్ గేం అన్న విషయం మీదే చాలా డిస్కషన్ నడిచింది ఈ రొజు హౌస్ లో కూడా. 

ఇక యథావిధిగా అవినాష్ ట్రిప్పింగ్ కొనసాగుతుంది. మోనల్ కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాను పొరపాటున తగిలిందేమో అని చెప్తుంటే కూడా దానికి హైపర్ అయిపోతున్నాడు దీనివల్ల కూడా నేను విలన్ అవుతాను అని అలాగే ఆరియానా మీద కూడా చాలా చిన్న విషయానికి అరిచేశాడు. ఇది తర్తీన్త్ వీక్ ప్రతి మాటా మాటార్స్ ఇక్కడా నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటున్నాడు. అరియానా కూడా ఆసహనం ఫీలయి నిన్ను బాడ్ చేయాలని నాకెందుకు ఉంటుందంటూ అరిచేసింది.    

వివరాలలోకి వెళ్తే 87 వ రోజు ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం   సినిమాలోని Dont stop till you get enough  పాటతో మేల్కొలిపారు. 
ఉదయం కూడా మళ్ళా తన్నడం గురించే చెప్తున్నాడు అవినాష్. అభి తన దగ్గరకి వెళ్తేనే ఏదో ప్రాబ్లమ్ అవుతుంది అని అంటున్నాడు. 

కలిసి ఆడారని అఖిల్ సోహెల్ ని గ్రిల్ చేస్తున్నారు. మేం జరగకపోయుంటే అపుడు టాప్ మాకే వచ్చేది అని అంటున్నాడు అఖిల్ అండ్ సోహెల్. 
ఇది కూడా స్మార్ట్ గేమే మేం ఇండివిడ్యువల్ గానే ఇలా డిసైడ్ అయ్యాను అని అన్నాడు. 
ఫస్ట్ రౌండ్ ఐతే అడ్దుపడ్డారు కానీ తర్వాత అందర్ని పట్టుకోనిచ్చారు అని చెప్తుంది హారిక. 

ఒకవేళ మోనల్ తన్నిందంటే మాత్రం నాతో ఆబద్దం చెప్పినట్లే నేనిక మాట్లాడను అని అంటున్నాడు సోహెల్ అభి దగ్గర. 
అభినేమో ఆవిడ అబద్దాలు ఆడుతుంది బాస్ అందుకే నేను లయర్ అని చెప్పా అని అంటున్నాడు అభి. 

మోనల్ దగ్గర అదే అంటుంటే మోనల్ నాకు తెలిసి నేను కాన్ ని తన్నాను కానీ మనిషిని కాదు అతనంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు నాకే డౌట్ వచ్చి బిగ్ బాస్ ని అడుగుతున్నాను నన్ను పిలిచి చూపించి క్లారిటీ ఇవ్వండి అని అడుగుతుంది. 

మోనల్ ఫ్రం బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తుననను సారీ మిమ్మ్లని హర్ట్ చేయాలని కావాలని చేయలేదు. కావాలంటే నీ కాళ్ళు పట్తుకుంటాను రియల్లీ సారీ.. నాకు ఫుల్ పిక్చర్ క్లారిటీ రావడం లేదు అని అంటుంది. సారీ అని కాళ్ళు పట్టుకుంది. ఇలా చేస్తే నేను విలన్ అవుతాను అని అంటున్నాడు అవినాష్. 
అరియానా అవినాష్ మోనల్ గ్రూప్ హగ్ ఇచ్చుకున్నారు. మోనల్ అవినాష్ కి ముద్దు పెట్టేసింది.  

లెవెల్ టూ
మడ్ పిట్స్ పెట్టున్నాయ్ పై నుండి పువ్వులు పడుతుంటాయ్ వాటిని మడ్ పిట్స్ లో నాటాలి. ప్రతి సభ్యుడు పక్కన వారి పిట్స్ లో తక్కువ ఉండేలా చూస్కోవాలి. 
టాస్క్ చదవగానే హారిక ఇది అయినట్లే నాట్ పాజిబుల్ అని అంటుంది. 


అభి అఖిల్ సోహెల్ హారిక ఆడుతున్నారు. 
సోహెల్ హారిక ఒక చోట 
అఖిల్ అభి ఒక చోట ఆడుతున్నారు. 
హారిక లాక్కుంటుంది సోహెల్ పూలు. 
పాపం హారిక హైట్ కి రీచ్ అయ్యే లోపే సోహెల్ పైనే కలెక్ట్ చేసేస్తున్నాడు. 
అందరూ గస పోస్తున్నారు. 
అభి అఖిల్ ఇద్దరు అండర్స్టాండింగ్ కి వచ్చారు ఒకరి పిట్ నుండి ఇంకొకరు తీస్కోవద్దు అని. అందరూ అలా ఒకరి దగ్గర నుండి లాగద్దు అని అండర్ స్టాండింగ్ కి వచ్చారు. 

సెకండ్ టైం పడినపుడు తక్కువ పడితే ఏం చేయాలి నా ఆప్షన్స్ ఏంటి అని డిస్కస్ చేస్తుంది హారిక. నువ్వు పీకితే నేను పీకుతా అని అంటున్నారు అఖిల్ సోహెల్. 
బిగ్ బాస్ పువ్వులు నాటాలి దాచుకోకూడదు అని చెప్పి ఇది వ్యక్తిగత ఆట అని మరోసారి గుర్తు చేస్తున్నా అని చెప్పారు. 
అబ్బా ఈ విషయం నిన్న చెప్పి ఉండాల్సింది కదా అని అరియానా చెప్పి ఏడుస్తుంది. ఎందుకు చెప్పారు వ్యక్తిగత ఆట అని అడుగుతుంది బిగ్ బాస్ ని చాలా సీరియస్ గా అడుగుతుంది. టెలికాస్ట్ కి కాదు మీకే చెప్తున్నాం అని అంతున్నారు అవినాష్ అరియానా. మీరు నిన్న చెప్పనిది ఇవ్వాళ ఎలా చెప్తారు అని ఏడుస్తుంది. 

సెకండ్ టైం మళ్ళీ మొదలైంది. సేం కాంబినేషన్స్ ఆడుతున్నారు. 
సోహెల్  అఖిల్ ల పిట్స్ ఫుల్ గా ఉన్నాయ్. 
హారిక సోహెల్ చేతిలో నుండి లాక్కుంది. సోహెల్ కూడా లాక్కుంటా అని లాక్కున్నాడు. నేను బాగా కలెక్ట్ చేశాను కానీ నువ్వు లాక్కున్నావ్ అని అంది హారిక. 
ఇక్కడ చేతిలో నుండి లాక్కో కూడదు అక్కడ పిట్ నుండి లాక్కో కూడదు అని అంటున్నారు నా హైట్ కి దొరకడాం లేదు పూవులు ఇంక నేను ఎలా ఆడాలి ఇక్కడ అని ఏడ్చేస్తుంది హారిక. మీరు ఆడుకోండి అంటుంది. ఇది అవ్వదు బిగ్ బాస్ బ్లడీ అని అంటుంది. నా ఫ్లవర్స్ నాకు ఇచ్చేయ్ అని అంటుంటే సరే తీస్కో అని సోహెల్ ఇచ్చేశాడు. హగ్ చేస్కుని ఏడవకు ఇస్తా అని చెప్పా కదా అని అంటున్నాడు. అరె నాకు ఛాయిస్ లేదు సోహెల్ అని ఫీలవుతుంది. 
సోహెల్ ఫార్టీటీ 
అఖిల్ ఫిఫ్తీటూ
అభి తర్తీటూ
హారిక ట్వంటీఫైవ్ 
ఫస్ట్ రౌండ్ లో హారిక ఔట్. 
అభి ఈజ్ ప్లేయింగ్ గుడ్ బాగానే కాచ్ చేస్తున్నాడు. 
సోహెల్ సెవెంటీ వన్
అఖిల్ ఎయిటీసిక్స్
అభి ఫార్టీఫోర్
ఈ రౌండ్ లొ అభి వెళ్ళాడు. 
సోహెల్ అండ్ అఖిల్ లెవెల్ త్రీకి ఎంపికయ్యారు. 
ఈ ఫోటోస్ కాల్చే పద్దతేదైతే ఉందో అది టూమచ్ పాపం హారిక అది చూస్కుని చాలా ఫీలయినట్లు కనిపించింది. అభి నేమో దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ అని అంటున్నాడు.

అవినాష్ డిన్నర్ చేస్తుంటే అరియానా వచ్చి ప్లాట్ఫాం క్లీన్ చేయాలి తర్వాత వెజల్స్ చేయాలి అని అంటుంది. నాది కాదు నేను ఓన్లీ ఈపూట చేసిన వెజల్స్ మాత్రం క్లీన్ చేస్తా అని అంటున్నాడు అవినాష్. రెస్పాన్సిబిలిటీస్ గురించి అరియానా వచ్చి కొత్తగా నాకు చెప్తుంది అని అంటున్నాడు. 

ఇద్దరు కూడా సరదా సరదాగానే మాట్లాదుకుంటున్నారు కిచెన్ లో అవినాష్ అంట్లు తోముతున్నాడు. 

అఖిల్ మోనల్ మాట్లాడుకుంతున్నారు రేపు బిగ్ డే బాగా పడుకో అని చెప్తుంది అఖిల్ కి. అఖిల్ నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతా కానీ ఎవరు గెలిచినా నాకు ఓకే వాడైనా నేనైనా అని అంటున్నాడు. 
మీరు సూపర్ ఫాస్ట్ మీకు తెలుసా ఆవిషయం అని అడుగుతుంది మోనల్. చీతా జాగ్వర్ లెపార్డ్ వీటిలో ఏది ఫాస్ట్ అని అడుగుతుంది చీతా అనుకుంటా అన్నాడు.

నేను రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు తీస్కోలేదు చెప్పు అని అడుగుతున్నాడు అవినాష్ అరియానా ని. ఎందుకు నన్ను రెస్పాన్సిబిలిటీ తీస్కోలేదని అంతున్నావ్ అని అంటున్నాడు. సారీ చెప్తే కూడా ఇలా చెప్పి కూడా నన్ను బాడ్ చేస్తున్నావ్ అని అంటున్నాడు. తను స్ట్రెస్ గా ఉన్నాడు వదిలేయ్ అంటున్నారు హారిక అభి. అరియానా ఏడుస్తుంటే ఇపుడు నువ్వు ఏడ్చేది కూడా కౌంట్ ఆవుతుంది అరియానా అని అంటున్నాడు అవినాష్. 

అభి చాలా నైస్ గా అవినాష్ ని కన్విన్స్ చేస్తున్నాడు. తను కావాలని అలా చేస్తుందా చెప్పు అని అంటున్నాడు. అవినాష్ బాగా స్ట్రెస్ ఫుల్ గా ఉన్నాడు. ఎవరికి ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు అని అనుకుంటున్నారు.

ఫైనల్ గా ఇద్దరు మళ్ళా ఒకరికొకరు సారీ చెప్పుకుని సాల్వ్ చేస్కున్నారు. 

రేపటి ప్రోమో టాస్క్ లో ఫైనల్ లెవల్. ఓ ఉయ్యాల లో ఇద్దరిని కూర్చో పెట్టారు. చివరి వరకు ఎవరు దిగకుండా ఉంటారో వారు మెడల్ పొందుతారు అని చెప్పారు. మధ్యలో చల్లటి జ్యూస్ లు గట్రా పంపించారు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


1, డిసెంబర్ 2020, మంగళవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటలలో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయవచ్చు. 



ఈ రోజు రేస్ టు ఫినాలే టాస్క్ ఇచ్చారు. అందరు బాగానే ఆడినప్పటికీ అమ్మాయిలు ముగ్గురు ఆడిన విధానానికి హాట్సాఫ్ చెప్పాలి అరియానా చాలా పెయిన్ కూడా తీస్కున్నా కానీ ఎక్కడా తగ్గకుండా ఈక్వల్ గా ఆడింది. ఈ రోజు ఫస్ట్ లెవల్ విజేతలు అఖిల్,సోహెల్,అభి,హారిక. వీళ్ళు నలుగురు రేపు లెవెల్ టూ ఆడబోతున్నారు. 

ఇక ఈ రోజు అవినాష్ గేం చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది. మోనల్ దగ్గర పాలు కొట్టేయడంతో తనే ఏమైనా చేయచ్చు ఏమైనా చేయచ్చు అని అంటూ మొదలు పెట్టాడు. వాళ్ళ మీడ అటాక్ చేయడానికి ట్రై చేశాడు. అఖిల్ సోహెల్ ని తట్టుకోలేక అరియానా మోనల్ లని పుష్ చేసి పట్టుకోవాలని చూశాడు. అందరు కాస్త హెచ్చరించే శరికి ఇక నానా రచ్చ మొదలు పెట్టాడు. 

నేను ఆడను అని కాసేపు అందరు కలిసి నన్ను టార్గెట్ ఛేస్తున్నారని కాసేపు. నన్ను ఎలిమినేట్ చేయండి అని కాసేపు ఇలా రకరకాలుగా.. ఇంకా ఇది ఫిజికల్ టాస్క్ ఇది వాళ్ళు ఇద్దరు బాడీ బిల్డర్స్ అసలు ఇలాంటి గేమా ఫైనల్ వీక్ లో ఇచ్చేది అని అంటాడు. మరి మొన్న టూ వీక్స్ వాలిడిటీ తో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కి ఇచ్చిన గేం గురించి ఇలా మాట్లాడలేదేంటో. ఇదా మరి అలాంటి ఇమ్యునిటీ ఇచ్చే గేం అని. 

ఇక యాజ్ యూజువల్ అడ్రినలిన్ రష్ తో సరదా సరదా మాటలతో సోహెల్ ఎంటర్టైన్ చేశ్శాడు. అవినాష్ ని కూడా తనే కన్విన్స్ చేసి మళ్ళా ఆటలో ఉండేలా చేశాడు.  

వివరాలలోకి వెళ్తే 85 వ రోజు నామినేషన్స్ తర్వాత దిల్ సే ఆడలేదు దిమాక్ సే ఆడాను అని అఖిల్ బాధపడుతున్నాడు మళ్ళీ మళ్ళీ జరుగుతుంది లైఫ్ లో అని ఏడుస్తున్నాడు. 

సోహెల్ నువ్వు ఏ రీజన్ తో నామినేట్ చేశావ్ మోనల్ ని అని అడుగుతు ఉన్నాడు అఖిల్ ని. అఖిల్ కోప్పడుతున్నాడు. నువ్వు బ్రెయిన్ తో ఆడుతావ్ నేను దిల్ తో ఆడతా అని అంటున్నాడు. అదే పాయింట్ మీద బాగా హర్ట్ అయినట్లున్నాడు అదే బాగా హైపర్ అయ్యాడు. అఖిల్ అదే పాయింట్ మీద సోహెల్ తో కూడా గొడవ పడుతున్నాడు. 

సోహెల్ అవి అరియానా తో కూడా మోనల్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తుంది అని చెప్తున్నాడు. అదొక్కటే ఆలోచించి నేను స్టాండ్ తీస్కున్నా అని చెప్పాడు. అది వాళ్ళ ముగ్గురు చేస్కున్నది నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని అంటుంది అరియానా సోహెల్ తో. 

మోనల్ సాఅరీ చెప్తుంది కానీ వద్దు దండం పెడుతున్నా నీకు అని అంటున్నాడు అఖిల్. 
   
86 వ రోజు ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం వన్ నేనొక్కడినే సినిమాలోని హూ ఆర్ యూ పాటతో మేల్కొలిపారు. 

ఫినాలే మెడల్ ని ఇంటి మధ్యలో పెట్టారు అందరూ ఇష్టంగా చూస్కుంటున్నారు దానిని. అందరూ కూడా ఎక్సైటెడ్. 
లేవగానే అనౌన్స్మెంట్ చేశారు. ఒక మెడల్ పెట్టబడి ఉంది. దాన్ని గెలుచుకున్న వారికి ఫినాలే లోకి ఎంట్రీ లభిస్తుంది ఆటతీరుని బట్టి అంచెలంచెలుగా దగ్గరవుతారు. మెడల్ లభించిన సభ్యుడు ముందు ముందు నామినేషన్స్ తప్పించుకుని నేరుగా ఫైనల్ వీక్ లోకి ఎంటర్ అవుతారు. ఈ వారం ఎవిక్షన్ నుండి సురక్షితులైతేనే ఈ మెడల్ వర్తిస్తుంది. ఇంటి సభ్యులంతా ఈ మెడల్ కోశం ఒకరికొకరు ఏమాత్రం తక్కువ కాదనేలా ప్రాణం పెట్టి పోరాడతారని ఆశిస్తున్నారు అని చెప్పారు. 

గార్డెన్ ఏరియాలో అందరి ఫోటోస్ పెట్టిన స్టాండీస్ ఉన్నాయ్ వాటి దగ్గర  సోహెల్ ఒక్కొక్క ఫోటో దగ్గిర ఒక్కో రకంగా కామెంట్ చేస్తూ ఆడు బాగా ఆడు అని అంటున్నాడు. 

రేస్ టు ఫినాలే లెవల్ వన్
గార్డేన్ ఏరియా లో ఒక ఆవుంది. ప్రతి సభ్యుడికి మిల్క్ స్టేషన్ ఉంది. ప్రతి సారి ఆవు అంబా అని అరిచినపుడల్లా వచ్చే పాలను ఇంటి సభ్యులంతా తమ బాటిల్స్ లో నింపుకోవాలి. రౌండ్ ముగిసే సమయానికి బజర్ మోగుతుంది అది మోగే సమయానికి ఎవరి దగ్గర తక్కువ బాటిల్స్ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. 

త్రీ రౌండ్స్ లో ఎక్కువ బాటిల్స్ ఉన్న నలుగురు మాత్రమే లెవెల్ టూ లోకి వెళ్తారు. దానికోసం ఎలాంటి పనులు చేస్తారో మీ ఇష్టం. తెలివైన ఇంటి సభ్యులకి హెచ్చరిక ఆవునుండి వచ్చేవి పాలలాంటి పాలు కానీ నిజమైన పాలు కాదు తాగకండి. 

మోనల్ ఈజ్ కూల్ అంతా ఒక వైపే అటాక్ చేస్తే తను మరో వైపు నుండి వెళ్ళింది. 

అందరూ విపరీతంగా తోస్కుంటున్నారు పాలు రావడం ఆగిపోయింది చేత్తో ఆపేస్తున్నారని కొందరు గోల చేస్తున్నారు.

అఖిల్ అండ్ సోహెల్ పెద్ద కాన్స్ తీస్కొచ్చి దానిలో డైరెక్ట్ గా నింపుకుంటున్నారు మిగిలిన వాళ్ళు చిన్న చిన్న మగ్స్ తో నింపుకుంటున్నారు. 
అవినాష్ మోనల్ కాన్ నుండి ఒంపుకున్నాడు. గివ్ మై మిల్క్ బాక్ అని అడుగుతుంది లేదు నేను తీస్కోలేదు అని చెప్తున్నాడు. 

అఖిల్ అండ్ సోహెల్ ఇద్దరూ ఎవరు ఎక్కువ ఉన్నాయ్ ఎవరు తక్కువ ఉన్నాయ్ అని లెక్కలేసుకుని చూసుకుంటూ కలిసి ఆడుతున్నారు. 

అవినాష్ మోనల్ కాలితో తంతుందని కోప్పడి మీదకి వెళ్ళి బలంగా తోసేయడానికి ట్రై చేస్తున్నాడు. అఖిల్ అవినాష్ చూసి అని అన్నందుకు అమ్మాయ్ తన్నింది చూడరు కానీ అమ్మాయ్ అనగానె అండరు సపోర్ట్ కొచ్చేస్తారు మూస్కొని అన్నాడు. సోహెల్ అఖిల్ ఇరిటేట్ అయ్యారు. 

అవినాష్ మరీ వైల్డ్ గా ఆడుతున్నాడు. అఖిల్ కూర్చుని ఒకరి తర్వాత ఒకరు ఫిల్ చేస్కుంటున్నారు. అవినాష్ అండ్ సోహెల్ మధ్య బాగా గొడవైంది అఖిల్ ని పక్కకి వెళ్లమని సోహెల్ అవినాష్ ని పక్కకి లాగి ఇద్దరు గొడవపడుతున్నారు. 
అవినాష్ బిగ్ బాస్ కి కంప్లైంట్ చేస్తున్నాడు అందరు కలిసి నన్ను పట్తుకోనివ్వట్లేదు వాళ్ళు వాళ్ళ్ పట్టుకుంటున్నారు అని. అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నాడు. 

బిగ్ బాస్ నేను ఆడను అందరు కలిసి నన్ను ఆపుతున్నారు నాకొద్దు బిగ్ బాస్ అని కంప్లైంట్ చేస్తున్నాడు. నువ్వు పట్టుకున్నది పెద్ద డబ్బా మేమంతా చిన్న చిన్న డబ్బాలు వాడుతున్నాం అని అంటే మీరు మొదట పెద్దది పట్టారు అని గోల చేస్తున్నాడు అవినాష్ సీరియస్ గా అరిచాడు. సోహెల్ అండ్ అఖిల్ కూడా అరిచారు. 

కొంతమంది వ్యక్తిగతమైన గేం ఆడట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నాడు. టీం లు గా ఆడుతున్నారు అని అంటున్నాడు. 
అఖిల్ సీసాలు లోపల దాచుకుంటున్నాడు. 
అవినాష్ అంతా కంప్లైంట్ మోడ్ లోనే ఉన్నాడు. ఆడాళ్ళు తంతే ఏం లేదు నేను పట్టుకుంటే మాత్రం తప్పుఅందరు రియాక్ట్ అవుతారు అని అంటున్నాడు బాగా సీరియస్ అయ్యాడు. 

అందరు సపోర్ట్ చేస్తున్నారు నువ్వు మరీ నా కాలు మీద క్యాన్ పెట్టేస్తున్నావ్ అని చెప్తుంది అరియానా . నేను ఆడను బిగ్ బాస్ అని చెప్తున్నాడు. అరటిపండు కూడా తినను అని అలుగుతున్నాడు. నాగేం నేను తప్పుకుంటున్నాను ఎలిమినేట్ చేయండి అని అరుస్తున్నాడు. ఒక్కడే కిచెన్ లోకి వెళ్ళి ఏడుస్తున్నాడు. 

వెళ్ళి విడిగా కూర్చున్నాడు బజర్ మోగిన తర్వాత వస్తా అని అన్నాడు. 

అవినాష్ పాల కాన్ ని వాష్ రూం లోపలికి తీస్కెళ్ళాడు. కిచెన్ లో కూడా పాలకాన్ లో నీళ్ళు పోస్తున్నాడు.  
ఫ్రిజ్ లో నుండి నిజం పాలు తీసి కలుపుతున్నాడు కాన్ లో.. అండరు బయట ఉంటే ఇతను లోపల ఇది చేస్తున్నాడు. 

ఫస్ట్ బజర్ మోగింది  బాటిల్స్ కౌంట్ చేసి చెప్పండి అని అడిగారు బిగ్ బాస్. 

నీళ్ళు కలిపాడు అని చెప్పారు హౌస్ లో అందరూ... 
ఆవునుండి పాలు కాకుండా ఇంట్లో నీళ్ళు మరియూ పాలు కలిపినందున అవినాష్ ని ఈ రౌండ్ నుండి నిష్క్రమించినట్లుగా ప్రకటిస్తున్నారు. 
     
ఒక పైప్ లో ఎక్కువ ఫోర్స్ గా వస్తుంది మరో దానిలో సన్నగా వస్తుంది. అని కంప్లైన్ చేస్తున్నాడు అవినాష్. అఖిల్ అండ్ సోహెల్ ఫుల్ గా నింపేసుకుంటున్నారు అని చెప్తున్నారు. రేస్ టు ఫినాలే టాస్క్ లో ఇలాంటివి ఇస్తారా వాళ్ళు ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వడం లేదు అని చెప్తున్నాడు.   

అభి ఏంది కలిసి ఆడుతున్నారా మీరిద్దరు అని అడుగుతున్నాడు అఖిల్. 
సెకండ్ బజర్ లో అరియానా దగ్గర పాల బాటిల్స్ తక్కువ ఉన్నందున ఔట్.  
మోనల్ సోహెల్ అఖిల్ అభి ముగ్గురి దగ్గర టెన్ టెన్ హారిక లెవెన్. 
  
సోహెల్ టాప్ మూసేస్తున్నాడు అభి మీరిద్దరు కలిసి ఆడుతున్నట్లే అని అంటున్నాడు. గేం గేం అని అంటున్నాడు అఖిల్. అభి ఏమో మనమిప్పుడే కలుస్తున్నాం అని అంటే అలా అనకు అంటున్నాడు అఖిల్ గేం గేమే పర్సనల్ వేరే అంటాడు. 

అవినాష్ నన్ను సోహెల్ అఖిల్ అంతా కలిసి టార్గెట్ చేశారు పట్టుకోనివ్వకుండా అని చెప్తున్నాడు అరియానాతో. 
అఖిల్ మోనల్ కి క్లియర్ గా చెప్పాడు ఏం చెస్తున్నావ్ నువ్వు పట్తుకో అని అంతే తను నన్ను తోసేసి పట్టుకుంది అనిచెప్తుంది. 
అరియానా బయటికి వెళ్ళినందుకు ఏడ్చేస్తుంది. టాప్ ఫైవ్ లో ఉంటావ్ అని చెప్తున్నాడు అవినాష్. ఎలాగైనా ఉండాలని ఉంది అని చెప్తుంది.  
  
మూడో బజర్ కి హారిక పద్నాలుగు సోహెల్ అఖిల్ పదిహేను మోనల్ పదకొండు. 
సో మోనల్ ఈ రౌండ్ నుండి ఔట్. 

లెవల్ టూ లోకి అఖిల్, సోహెల్, అభి, హారిక. 

ఔట్ అయిన ముగ్గురి ఫోటోస్ కాల్చేశారు బిగ్ బాస్. అంత కోపమెందుకు బిగ్ బాస్ మామీద అని అంటున్నాడు అవినాష్. 

అవినాష్ ని ఎందుకు తన్నావ్ అని అడుగుతున్నారు అఖిల్ అండ్ సోహెల్. లేదు నెను తనను తన్నలేదు కాన్ ని పుష్ చేశాను అంతే కాన్ నా కాలు మీద అరియానా చేతి మీద వస్తుంది అందుకే తోయాల్సి వచ్చింది అని చెప్తుంది. మొహం మీదకొచ్చిందనే తీశాడు నీ షూ అని చెప్తున్నాడు అఖిల్. నేను కాన్ ని పుష్ చేస్తుంటేనే తను తీసి పీకాడు అని చెప్తుంది. సరే నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడి సార్ట్ ఔట్ చేస్కో అని చెప్పారు. 

అవినాష్ అరియానా ల దగ్గరకి వెళ్ళింది. నీకు దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. నువ్వు అవినాష్ ని తన్నావా అని అడిగితే లేదు నేను కాన్ ని మాత్రమే నెడుతున్నాను అని అంటుంది. సరే నేను నాగ్ సర్ ని ఫుటేజ్ అడుగుతాను చూద్దాం అని అంటున్నాడు అవినాష్ సరే అని అంది. 

రేపటి ప్రోమోలో పూవులు పడుతున్నాయ్ అవి కలెక్ట్ చేస్కునే టాస్క్ అనుకుంటాను. హారిక సోహెల్ గొడవపడుతున్నారు పూవులు లాక్కోడం గురించి. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts