14, డిసెంబర్ 2020, సోమవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ చూడవచ్చు. క్రింద ఇస్తున్నది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజు మాములుగా ఐతే నామినేషన్స్ డే కానీ ఇపుడిక నామినేషన్స్ కి స్కోప్ లేకపోయినా మసాలా ఎందుకు వదులుకోవాలి అనుకున్నాడేమో బిగ్ బాస్. అందుకే అందరికి మాస్క్ లు ఇచ్చి వీటి వెనక ఉన్న మనిషి అసలు స్వరూపం చెప్పండి అలాగే మీ మాస్క్ లు ఎవరు తొలగించారో చెప్పండి అని అడిగారు బిగ్ బాస్. 

కానీ మన హౌస్మేట్స్ మళ్ళీ ఇక్కడ కూడా సేఫ్ గేం ఆడేసరికి ఇక ఇలా లాభం లేదని. మీరు ఎందుకు అర్హులో ఒకరు ఎందుకు కాదు అనేది చెప్పండి అన్నారు. నలుగురులో ముగ్గురు అరియానా పేరు తీస్కుంటే ఒకరు హారిక పేరు తీస్కున్నారు. మొత్తం మీద ఇద్దరు అమ్మాయిలే అనర్హులు అని తేల్చారు.

అందరు కలిసి ఒక మెంబర్ని టార్గెట్ చేస్తే ఆమనిషికి బయట సింపతీ ఎలా పెరుగుతుంది తద్వారా ఓట్స్ ఎలా పెరుగుతాయ్ అనేది ఆల్రెడీ అన్ని సీజన్స్ లో చూసేశాం వీళ్ళూ చూసే ఉంటారు ఐనా కూడా మళ్ళా అదే తప్పు చేస్తున్నారు. దానికి తోడు ఎలాగూ ఫైనల్ ఫైవ్ కి వచ్చాం కదా ఇంకెందుకు అనుకుందో ఏమో తన స్వభావానికి విరుద్దంగా అరియానా చాలా పాజిటివ్ గా తీస్కుని అలాగే రియాక్ట్ అయింది. ఒక్క సోహెల్ మాత్రమే అరియానా పేరు తీస్కున్నా కూడా తన ఆటా తీరు ప్రేక్షకులకి నచ్చుతుండి ఉండవచ్చు అందుకే ఫైనల్ కి వచ్చింది అంటూ సెన్సిబుల్ గా మాట్లాడాడు. 

వీళ్ళిలాగే ఇంకా అరియానా జపం చేస్తుంటే మాత్రం విన్నర్ గా ఛాన్స్ లేదు కానీ రన్నర్ గా మాత్రం అరియానానే వచ్చేలా ఉంది చూడాపోతే.ఇక రేపటి ప్రోమో ఫన్నీగా బావుంది రేపటి ఎపిసోడ్ కూడా బావుంటుందనిపిస్తుంది మరి ముందు సీజన్స్ లో అందరిని అలరించిన మెంబర్స్ వస్తే ఉండక ఏం చేస్తుంది చెప్పండి. ఆ వివరాలు చివర్లో చూద్దాం.


 
వివరాలలోకి వెళ్తే 99 వ రోజు ఇంట్లో 5 గురు సభ్యులు ఉన్నారు. ఫైనల్ ఫైవ్. అభి,అఖిల్,సోహెల్,అరియానా,హారిక  
ఉదయం శంకర్ దాదా జిందాబాద్ సినిమాలోని గుడ్ మోర్నింగ్ హైదరాబాద్ పాటతో పాటు మెయిన్ మెయిన్ అనౌన్స్మెంట్స్ ని హౌస్మేట్స్ రెస్పాన్స్ ని కీ సౌండ్స్ ని మాటల్ని మిక్స్ చేసి రాప్ లాగా వేసిన పాటతో మేల్కొలిపారు. వెరీ ఇంట్రెస్టింగ్ చాలా బావుంది ఐడియా అనిపించింది. 

ఉదయం అఖిల్ ని చూపిస్తున్నారు. హీ ఈజ్ ఫీలింగ్ లోన్లీ హార్ట్ ఈజ్ గోయింగ్ హెవీ నాకెందుకో తెలీడం లేదు. ఎక్కువ ఆలోచిస్తున్నానా వద్దనుకున్నా వస్తున్నాయ్ అని చెప్పుకుంటున్నాడు. 

కొన్ని కొన్ని సార్లు ఓ పర్సన్ తో మాట్లాడకపోయినా తను ఉంటే చాలనిపిస్తుంది కదా అని హారికతో అంటున్నాడు. హారిక వెంటనే చెప్పేసింది కమ్ నువ్వు మిస్సింగ్ మోనల్ అని. 
ఇది ఎప్పుడు అవ్వలేదు నాతో వియర్డ్ ఫీలింగ్ లో ఉన్నా ఏమవుతుందో అర్ధం కాడంలా అని అంటున్నాడు హారికతో. హారిక జస్ట్ సెవెన్ డేస్ తను ఎక్కడికి వెళ్ళదు అని అంటుంది. నేనువెళ్ళద్దన్నా అని చెప్ప్తున్నాడు అఖిల్. హారిక నేను కూడా వెళ్ళద్దన్నా అని చెప్పింది.

అఖిల్, హారిక, సోహెల్ అరియానా రియాక్షన్ ని మాక్ చేస్తూ నవ్విస్తున్నారు. మీమ్స్ పడతాయేమో అని అంటూ. బట్ యా దట్ వజ్ మై ట్రూ ఎమోషన్ అని ఇంకోసారి కన్ఫార్మ్ చేస్తుంది అరియానా.  

సాయంత్రం అందరికి మాంచి పార్టీ డ్రెస్సెస్ అండ్ మాస్క్స్ పంపించారు..  

ముసుగు ధరించి అసలైన రూపం కనిపించకుండా దాస్తుంటారు. 
తమ మాస్క్ ని తొలగించిన మనిషి ఎవరని చెప్పాలి. అలాగే ప్రతి ఒక్కరి ముసుగు వెనక ఉన్న మనిషి గురించి చెప్పాలి అన్నారు.  

గార్డెన్ ఏరియాలో డాన్స్ చేయాలి మాస్క్ గురించి కనుక నాని వి మూవీ థీం మ్యూజిక్ ప్లే చేశారు ఆ సెటప్ కి వాళ్ళ డ్రస్సెస్ కి మాస్క్ లకి ఆ మ్యూజిక్ మాములుగా సెట్ అవ్వలేదు అద్దిరిపోయింది. 

అభి నా కోపాన్ని బయటికి తీసింది సోహెల్ అరియానా అని చెప్పాడు. 

అరియానా కుకింగ్ మాస్క్ అని చెప్పింది నేను పర్ఫెక్టే కానీ వెళ్ళద్దని అలా రాదని చెప్పాను. అమ్మ రాజశేఖర్ గారు తీశారు. నా కోపం అనేది బయటికి తీసింది సోహెల్. ఏడవద్దు అని అనుకున్నా కానీ అవినాష్ దగ్గర ఆ మాస్క్ తీసేశా అంది. 

సోహెల్ ఎక్కువ ఎగ్రెస్సివ్ గ రాలేదు కానీ దివి వల్ల నా కోపం బయట పడింది కాయిన్ టాస్క్ లో. నామినేషన్ రోజు తన మీద గట్టిగా అరిచా అని చెప్పాడు. 
కుకింగ్ రాదు అని చెప్పుకున్నా ఎనిమిది మంది ఉన్నప్పటి నుండి చేయడం మొదలైంది. అఖిల్ యాభై చపాతిలు చేసే ఆడు అందరున్నపుడు అది చూసి భయపడ్డా అని చెప్పాడు. కుకింగ్ బయట పడింది అరియానా వల్ల. 

అఖిల్ అంత ఎమోషనల్ పర్సన్ కాదు చాలా కంట్రోల్ చేస్కుంటాను. నోయల్ వల్ల బ్రేక్ అయిపోయాను ఏడ్చేశాను.    
అభి వల్ల కోపం బయటపదింది మాములుగా అయితే హైడ్ చేస్కుంటాను అని చెప్పాదు. తినుఇలా చెప్తుంటే సోహెల్ హెలో హెలో పులిహోరా అని అంటున్నాడు.. ఫ్లర్టింగ్ హెల్తీ నేను అది మాస్క్ ఏం కాదు ఎక్కువ మంది ఉన్నపుడు కూడా ఛెప్పా కానీ వాళ్ళు పట్టించుకోలేదు అంతే మాస్క్ కాదన్నాడు. 

హారిక కోపం చాలా తగ్గించుకునే మాట్లాడాను సోహెల్ నామినేషన్ టైం లోనే బ్రేక్ అయ్యి అరిచాను. పేషన్స్ లెవెల్ ఇక్కడ బయటపడింది ఇదివరకు ఇంతలేదు. పొసెసివ్ నెస్ ఎక్కువ ఉంటుంది అది అభి వల్ల బయటపదింది. హెల్తీ ఫ్లర్టింగ్ అయితే అఖిల్ వల్ల బయట పడింది. నేను కూడా కొంత స్టార్ట్ చేశా అని చెప్తుంటే ఓహో ఇది కూడా జరిగిందా అని అంటున్నాడు అభి. 

ఒక పర్సన్ ని ఛూజ్ చేసుకుని వాళ్ళ గురించి చెప్పాలి. 

అరియానా సోహెల్ గురించి చెప్తా.. ఈయన కోపం షార్ట్ టెంపర్డ్ ఎలా అనుకున్నా కానీ కోపం ఎంతొస్తుందో దానికన్నా ఎక్కువ బాధపడతాడు కిడ్ యట్ హార్ట్ అని చెప్పింది. 

సోహెల్ అరియానా గురించి చెప్పాడు స్టార్టింగ్ లో బిహేవియర్ అలా ఉంటుంది కానీ క్లోజ్ అయితే మాత్రం ఎంత బాగ చూసుకుంటదనేది నెక్స్ట్ లెవెల్ అది ఉంది తన లోపల చాలా బాగా చూసుకుంటుంది. కానీ అది బయట పెట్టటం లేదు అని అన్నాడు. 

నేనంటే నేను అని అఖిల్ అండ్ హారిక అభి గురించి చెప్పడానికి పరిగెట్టారు. హారిక వదిలేసింది అఖిల్ కి ఛాన్స్ ఇచ్చింది ఐ హవ్ ఎ గుడ్ వన్ టు సే అని అంది. 
అఖిల్ ఏమో చూడ్డానికి కోపం రిజర్వ్డ్ అని ఒక ముసుగులో ఉన్నాడు కానీ హీ ఈజ్ ఆల్సో ఎమోషనల్ పర్సన్ అని అన్నాడు అది బయటికి రావడం లేదు. దాచి పెడుతున్నాడు అన్నాదు. 
హారిక నేనంత ఎక్స్ప్రెసివ్ కాదు అని అంటాడు కానీ ఈగో అడ్డొస్తది అని చెప్పకుండా అలా కవర్ చేస్తాడు తను నిజానికి చాలా ఎక్స్ప్రెసివ్ అని అంది. 

అఖిల్ ఐతే ముసుగులో దాచేది ఎముండదు అన్ని ఓపెన్ అని చెప్పింది. పొద్దున్న షేర్ చేశాడు అన్ని సార్లు తనని కేర్ చేయడానికి ఒక మనిషి ఉండాలి అని అనిపిస్తుంది కానీ అది ఎవరికి చెప్పడు ఐయాం స్ట్రాంగ్ ఐమ్ డ్యూడ్ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తాడు హీనీడ్ ఎ హాండ్ ఆన్ హిజ్ షోల్డర్ అని చెప్తుంది. చాలు ఇంక నువ్వు ఇజ్జత్ దీయకు అని అంటున్నాడు అఖిల్.

హారిక నువ్వు చాలా అండర్ ప్లే చేశావ్ పొసెసివ్ కాదు నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉంటే అనచ్చు అని చెప్తున్నాడు. తనలో ఒకటి పెట్తుకుంతుంది నేను నీకు టూ అవర్స్ బాండ్ వేశా ఇగో అదీది అన్నావ్ కదా దానికి టెన్ టైమ్స్ నువ్వు. నాకే ఇంతుందంటే రేపు ఎవరో వస్తారు కదా మనోడికి ఉంటదీ అని చెప్తున్నాడు. తను ఏదైనా విషయం వల్ల ఇబ్బంది పడుతుందంటే తను చెప్పదు అవతల మనిషి రియలైజ్ అవ్వాలని చూస్తుంది తప్ప తను చెప్పదు అంటున్నాడు. 
అరియానా నేను మాట్లాడచ్చా అభితో అని అంటుంది. మనసులో ఉన్న మాటర్ బయట పెట్టవ్ అని చెప్తున్నాడు.   

ఇంటి సభ్యులంతా తాము మాత్రమే ఎందుకు విజేతలవ్వాలో చెబ్తూ ఒకరిని ఎంచుకుని వాళ్ళు ఎందుకు అర్హులు కారో చెప్పాలి. 

అభి నామినేట్ అయినా సేవ్ అవ్వాలి మనం అనుకుంటే చాలదు ప్రేక్షకులు అనుకోవాలి. మీ అందరికంటే ఎక్కువ నామినేట్ అయి సేవ్ అయిన వ్యక్తిని అదేంటో తెలీదు కానీ నేను ఐయామ్ డూయింగ్ సంథింగ్ రైట్ అనిపిస్తుంది అని అన్నాడు. అలా అని మీ అందరు కూడా అర్హులే ఎవరూ తక్కువ కాదు కానీ ఒకరి పేరు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. 
హారిక చివరి వరకు వచ్చి నేను తనని వోడించాలంటే వరస్ట్ కేస్ సినారియో తను నా చేతిలో ఓడిపోవడం నేను చూడలేను అందుకె తను అర్హురాలు కాదు అనుకుంటున్నా అన్నాడు. చివరిలో ఇద్దరం ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు. 

అఖిల్ మొదటి నుండి నా సొంతంగా కరెక్ట్ గా ఆడుకుంటూ వచ్చాను గేం షో ఐనా టాస్క్ లు మన మెంటాలిటీ చెక్ చేసే విధంగా ఉంటుంది. నా లిమిట్ లో ఎంత వరకు ఆడాలో అంత వరకు ఆడాను. 
అరియానా కొన్ని టాస్క్స్ బియాండ్ లిమిట్స్ దాటి చేస్తుంది అందుకే అనర్హురాలు అనుకుంటున్నా అన్నాడు. 

సోహెల్ గెలిచి కెప్టెన్ అయినా బ్రెయిన్ అండ్ హార్ట్ రెండూ బాలెన్స్ చేసుకుంటూ ఆడా అన్నిటిలో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను. ఇంట్లో వాళ్ళతో ప్రేక్షకులతో కూడా ప్రేమ సంపాయించా. ఇంట్లో నేను ఎలా ఉంటానో అలాగే ఉన్నా ఇక్కడ కూడా అందుకే నేను అర్హుడ్ని. 
అర్యానా బియాండ్ లిమిట్ దాటుతుందని కొంచెం ఇష్యూ ఉంది దాని వల్ల అలా అనర్హురాలు అని చెప్పచ్చో లేదో తెలీదు టప్ ఫైవ్ కి ఎలా వచ్చింది అని ఆలోచించా. అదే కాకుండా అభి టాస్క్ ఇంకా బాగ ఆడి ఉంటే బావుండేది అనిపిస్తుంది అన్నాడు. 

హారిక నేను ఎందుకు డిజర్వింగ్ అంటే నేను కత్తి వాడా పువ్వులు వాడా కానీ బాలెన్స్ మెయింటెయిన్ చేశాను ఎవరు హర్ట్ అవలేదు. అందరితో గుడ్ రిలేషన్ ఉంది. నేనుహండ్రడ్ పర్సంట్ ఇచ్చాను. నేనైతే సూపర్ కూల్ అని నేననుకుంటున్నా. 
నాన్ డిజర్వింగ్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అరియానా ఏం లేదు బిగ్ బాస్ అందరికి ఒకే టాస్క్ ఇస్తారు నేను కూడా నీ ఆడే విధానం బట్టి కాస్త ట్రబుల్ అయ్యాను కొంచెమే లిమిట్ క్రాస్ చేశావ్ అని అంది. 

అరియానా నేను నామినేషన్స్ లో ఎక్కువ నాకు నాన్ డిజర్వింగ్ లో కూడా ఎక్కువ నాకు దిస్ సేస్ ఐయామ్ స్ట్రాంగ్ ప్లేయర్ ఒక ఆటలో గెలిచినా గెలవక పోయినా గుర్తుండి పోవడం ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా గ్రేట్ ఫీల్. ఈ విషయంలో ఐతే నేనుహాపీ. ఒకటి అండరు లైన్ దాటావ్ అని అన్నారు కానీ అది నా వే ఆఫ్ ప్లేయింగ్ డిఫారెంట్ గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని అన్ని కనిపిస్తున్నాయ్ అందుకే నేను అర్హురాలని అని అంటుంది. 
హారిక కాదు ఫైవ్ పర్సెంట్ అంతే ఎక్కడో డెసిషన్స్ జడ్జిమెంట్స్ కరెక్ట్ అనిపించవు కానీ ఎక్కడో ఆమెకి తెలుసు టాస్క్ తన వల్ల అటూ ఇటూ అయిందని. బాలెన్స్ గా డెసిషన్స్ తీస్కోలేదు అంటుంది. నువ్వు నను ఎలా ఎక్కువైంది అన్నావో నేను తక్కువైంది అని అంటా అని అంది. 

మళ్ళీ మ్యూజిక్ వేశారు అండ్ డాన్స్ చేస్తున్నారు. అభి,హారిక సోహెల్,అరియానా కలిసిడాన్స్ చేస్తుంటే పాపం అఖిల్ ఒంటరివాడైపోయాడు హి లుక్డ్ సో లాస్ట్.. మోనల్ లేని ఫీలింగ్ బాగా తెలుస్తు ఉండి ఉంటుంది.  

హారిక అరియానా మాట్లాడుకుంటున్నారు అనర్హుల పేర్లు అమ్మాయిలవే వచ్చాయి చూశావా.. ఈ గేం లో ఒకమ్మాయి విన్ అవాలని ఉంది నాకైతే అని చెప్తుంది హారిక. టాప్ ఫైవ్ అన్న మూడ్ కాస్త తగ్గింది కదా అనుకుని.. డోంట్ సెటిల్ డౌన్ అని అనుకుంటున్నారు ఇద్దరు హగ్ ఇచ్చుకున్నారు.    

రేపు ప్రోమోలో హరితేజ,గీతామాధురి,శ్రీముఖి,ఆలిరెజా వచ్చారు జస్ట్ ఒక రూం లో నుండి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. వాళ్ళని చూడగానే సోహెల్ డాం అని పడిపోయాడు అరియానాని ఇమిటేట్ చేస్తూ. 
అందరు కూడా ఫైనలిస్ట్స్ ని సరదాగా ఇంటర్వ్యూ లా చేసినట్లున్నారు ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. వెరీ నైస్ అండ్ ప్రామిసింగ్ ప్రోమో. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


13, డిసెంబర్ 2020, ఆదివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. కింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజు సండే ఫన్ డే... అండ్ ఆల్సో ఎలిమినేషన్ డే.. ఈ రోజు ఈ సీజన్ కి చివరి ఎలిమినేషన్ అఫ్ కోర్స్ ఫైనల్ ఫైవ్ లో బయటికి వచ్చే నలుగురిని వదిలేస్తే, మోనల్ హౌస్ లోకి మొదట వచ్చి చివరిగా ఎలిమినేట్ అయిన క్రెడిట్ కొట్టేసింది. దదాపు నాలుగో వారమో ఐదో వారం నుండో ఎలిమినేట్ ఆవుతుంది అవుతుంది అంటూ చాలా మంది ఎదురు చూశారు తన ఖాతాలో వేరొకరు బలవుతున్నారు అని ఎవరు ఓట్లేస్తున్నారు అని బిగ్ బాస్ సేవ్ చేస్తున్నారు అని రకరకాలుగా సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేశారు. 

కానీ ఎన్ని జరిగినా ఎన్ని కామెంట్స్ వచ్చినా పద్నాలుగు వారాల్లో ఒకటి రెండు తప్ప మిగిలిన అన్ని వారాలు నామినేట్ అయి తను నెగ్గుకుంటూ రావడం సాధారణమైన విషయం కాదు. ఇలా ప్రతి వారం నామినేట్ అవడం వల్ల కూడా తనకో కాన్స్టంట్ వోటింగ్ బాంక్ అనేది ఫార్మ్ అవుతుంది. దానికి తోడు తనకి అఖిల్ ఫాన్స్, అభి ఫాన్స్ ఇలా ఒక్కో వారం ఒక్కొక్కరు హెల్ప్ చేసే సిట్యుయేషన్స్ కూడా రావడం మరో ప్లస్ పాయింట్ అయింది. వీటన్నిటికి తోడు తెలుగు రాష్ట్రాల వోట్స్ మాత్రమే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా తనని సపోర్ట్ చేస్తున్న వారు వోట్స్ వేయడం కూడా తనకి కలిసి వచ్చిన విషయం అనిపించింది. 

అలా ఈ వారం మోనల్ ఎలిమినేట్ అయి అఖిల్,సోహెల్,అభి,హారిక,అరియానాలు ఫైనల్ ఫైవ్ గా నిలిచారు. 
            
వివరాలలోకి వెళ్తే ఈ రోజు నాగ్ తన డాన్ సినిమాలోని దడాపుట్టిస్తా నీకు పాటతో ఎంట్రీ ఇచ్చారు.   

బిగ్ బాస్ కి ఎందుకొచ్చారు అంటే ట్రోఫీ, ఎక్స్ పీరియన్స్, ఎంటర్టైన్మెంట్ అలా రకరకాలుగా చెప్పారు. నాగ్ మనీ అంటే యా అన్నారు అపుడు. తర్వాత మనీ రివీల్ చేశారు. గుడ్. 
 

అందరి పేరు మీద ఉన్న చెక్స్ ఇచ్చారు యాభై లక్షలు ఉన్నది. 

ఏమ్ చేస్తారు అని అడిగారు. 
హారిక తన మామ్ కి ఇస్తాను అని చెప్పింది తనకి ఇల్లుంటే మేం ఏం చేసినా పర్లేదు అని చెప్పింది. ఈ నంబర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయ్ అంది. 

అరియానా ఇల్లు కట్టుకుని మా ఊర్లో అప్పులున్న రైతులకి ఐదులక్షల వరకు నలుగురైదుగురికి అని చెప్పింది. 

అభి మా పేరేంట్స్ కి ఇస్తా అని చెప్పారు. లాస్ వేగాస్ కి ఏం పక్కన పెట్టడం లేదా అని అడిగారు. 

మోనల్ మమ్మి కోసం ఇన్వెస్ట్ చేస్తాను పెళ్ళి తర్వాత అమ్మ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండ ఉండేలా చూసుకుంటా అంది. 
పెళ్ళెప్పుడు అన్నారు నాగ్ ఏం అనుకోలేదు. 

అఖిల్ పెద్ద అమౌంట్ అంటే ఒక బైక్ అండ్ లాప్ టాప్ అని చెప్పారు. కొంత ఫిజికల్లీ హాండీ కాప్డ్ వాళ్ళకి కొంత ఇస్తాను. కేఫె ఒకటి ఇల్లు ఒకటి అంటే పేరు ఆలోచించావా అన్నారు. ఎమ్మేఎస్ పెడదాం మాస్ నీకు వర్క్ ఔట్ అవుతుంది. మోనల్ అఖిల్ సోహెల్  

సోహెల్ ఇది చాలా పెద్ద అమౌంట్. ఫ్లాట్ అండ్ పది లక్షలు అవసరమైన వారికి పక్కన పెడతా అని చెప్పాడు. 

విన్నింగ్ స్పీచ్ ఇవ్వాలి అంటే వస్తే ఫీల్ తో ఇస్తాం అని చెపాడు అఖిల్. 
సరే పక్క వాళ్ళది ఇవ్వండి అని చెప్పారు. 

హారిక మోనల్ ది ఇచ్చింది బావుంది సరదాగా.. రధేకృష్ణ పాడింది.. మోనల్ టైప్లో ముద్దు ముద్దు మాటలు ఆడింది. 

అరియానా అభిజిత్ ది యాజిటీజ్ దింపేసింది ఫ్లైయింగ్ కిస్.. ఇంగ్లీష్ లో.. అలాగే నేలకి ముద్దుపెట్టింది. 

అభిజిత్ - అఖిల్ ది చేశాడు.. బిహేవియర్ భలే చేశాడు స్పీచ్ కూడా బావుంది.. మమ్మీ ఇది నీకోసం అని ఈ ఫిఫ్టీ లాక్స్ టట్టూ నా చేతిమీద వేస్కుంటా.. సాష్టాంగ నమస్కారం చేశాడు.   

మోనల్ - సోహెల్ ది చేసింది. బావుంది.. ఎస్ ఎస్ ఎస్ అని ఎగురుతూ ఐ వన్ నే గెలిచాను అని చెప్పింది.. కథ వేరుంటది.. అని నాగ్ సారే గుర్తు చేశారు. 

అఖిల్ - అరియానా సీరియస్లీ.. సీరియస్లీ.. నాగ్ సార్ సీఇయస్లీ ఓ మైగాడ్.. నేను విన్నాయనా.. ఐ ప్రామిస్ గిచ్చండి అందరు వచ్చి గిచ్చండి అని అడుగుతుంది. 

సోహెల్ - హారిక ఫ్లైయింగ్ కిస్ లు తెలుగు ప్రేక్షకులు నాగ్ సర్ బిగ్ బాస్ హగ్స్ అండ్ కిసెస్ లాట్స్ ఆఫ్ లవ్ అని అరిపించాడు. 

తర్డ్ ఫైనలిస్ట్ అభిజిత్.. సోహెల్ ని అడిగితే అరియానా / మోనల్ అని చెప్పాడు. 

బజర్ గేం 
పోస్టర్ చూపిస్తారు గెస్ చేయాలి. 
అత్తారింటికి దారేది అమ్మాయిల్ గెస్ చేశారు గుడ్ గెస్ కానీ నాగ్ ఒక ఇపుడు మొదలెడదాం అని బజర్ రౌండ్ అని చెప్పారు. 

జనతా గారేజ్ అబ్బాయిలు గెస్ చేశారు. సోహెల్ అభి డాన్స్ సూపర్

కిక్ పోస్టర్ అమ్మాయిల్ గొట్టారు కానీ పవన్ అని చెప్పారు బద్రి అని క్లియర్ చేశాక గెస్డ్ కరెక్ట్. 

ప్రభాస్ పోస్టార్ గెస్ చేశారు అమ్మాయిలు.. రెబెల్.. మోనల్ తెగ ఫాస్ట్ గా బజర్ కొట్టేస్తుంది. 

శంకర్ దాదా జిందాబాద్ పోస్టర్ అబ్బాయిలు కొట్టారు కానీ గెస్ చేయలేదు.. అమ్మాయిలు బృందావనం పోస్టర్ అని గెస్ చేశారు. 

వెంకి మామ పోస్టర్ కూడా సీతమ్మ వాకిట్లో పోస్టర్ అని రాంగ్ గెస్ చేశారు.. టూమచ్.. అరియానా సూపర్ యాక్టివ్ గా గట్టిగా అరిచి చెప్పేస్తుంది.. 

వెంకి మామా బర్త్ డే అని నాగ్ చక్కగా విషెస్ చెప్పారు. మెంబర్స్ కూడా ఛెప్పారు. 

ఆడియో డంబ్ షరాడ్స్.. చెప్పే వాళ్ళకి హెడ్ ఫోన్స్ పెట్టారు.
 
గాల్లో తేలినట్లుందే పాట అభి యాక్టింగ్ బాగా చేశాడు. 

కోడి కూర - హారిక యాక్షన్ గెస్డ్ ఇట్.. 

హీ ఈజ్ సో క్యూట్ - బోయ్స్ చెప్పలేకపోయారు. 

మై లవ్ ఈజ్ గాన్ అమ్మాయిలు చెప్పేశారు

సంథింగ్ సంథింగ్ - అబ్బాయిలు చెప్పలేకపోయారు. 

నమ్మద్దు నమ్మద్దు పాట అమ్మాయిలకి చెప్పలేదు.. కానీ ఈ పాట కి సోహెల్ మాత్రం డాన్స్ అదరగొట్టేశారు.. 

అభిజిత్ కి ఒక స్క్రోల్ ఇచ్చరు దానిలో ఫోర్త్ ఫైనలిస్ట్ ఉన్నారు. ఎవరు అనుకుంటున్నావ్ అని అంటే హారిక అన్నాడు అభి.. 
హారికనే ఉంది.. షీ ఈజ్ సో హాపీ.. మోనల్ ని ఎత్తుకో ఎత్తుకో అని అడిగింది హారిక.. 

వాళ్ళ డ్రీం హోం ఎలా ఉండాలో చెప్పారంట స్కాందాంషి టాస్క్.. 
అది టాస్క్ లా చూపించారు. 
కొన్ని మోడల్స్ ఇచ్చారు. వాటిలో సెలెక్ట్ చేసి ఎవరితో షేర్ చేస్కుంటారో చెప్పాలి. 
అఖిల్ అండ్ సోహెల్ ఇద్దరు ఒకే మోడల్ సెలెక్ట్ చేశారు. ఇండిపెండెంట్ హౌస్ ప్రిఫర్ చేస్తా నేను అన్నాడు సోహెల్. 
అరియానా హజ్బెండ్ తో షేర్ చేస్తా 
అభి అనంతపూర్ ప్రోజెక్ట్ చెప్పాడు ఫ్యామిలీతో ఉంటాను అని చెప్పాడు. 
హారిక మామ్ అండ్ బ్రదర్ కోసం అని చెప్పింది ఒకటి నచ్చుతుంది అని అంటూ మరోటి నచ్చింది అని చెప్పింది. 
మోనల్ కూడా అఖిల్ వాళ్ళు సెలెక్ట్ చేసిందే చేసుకుందు. 
విజేతలు సూపర్ సిక్స్ అని చెప్పారు. 

మోనల్ అరియానా నాకుపేరు చెప్పడం ఇష్టం లేదు ప్రింటింగ్ మెషీన్ ఉంది అందులో ప్రింటవుట్ వస్తుంది. వాళ్ళు ఫైనలిస్ట్ రెండో వాళ్ళు ఎలిమినేటెడ్. గుర్తు పెట్టుకోండి. ఇక్కడి వరకు రావడం చిన్న విషయం కాదు అని చెప్పారు. 

అరియానా ఇంత దూరం రావడమే గొప్ప ప్రేక్షకులు ఏమిచ్చినా నేను హాపీ అంది. 

మోనల్ నామినేషన్ లో ఉన్న బాధ లేదు.. హాపీగా ఉన్నాను అని చెప్పింది. 

హారిక ని అడిగితే మోనల్ అని చెప్పింది. 

ఫైనలిస్ట్ ఈజ్ అరియానా.. అరియానా వినగానే కింద పడిపోయింది. సోహెల్ లేపితే ఐలవ్యూ చెప్పింది. అందరికి థ్యాంక్స్ చెప్పింది పాదాబి వందనాలు చెప్పింది. 

అఖిల్ లుక్డ్ షాక్డ్.. 
సోహెల్ కూడా చాలా ఫీలయ్యాడు. 

అఖిల్ బాబు ఉండిపోరాదే పాడాడు మంచి హార్ట్ ఫుల్ గా.. 

టియర్ ఫుల్ గుడ్ బైస్ అంటే కొంచెమే సర్ నర్మద ఇపుడు లేదు ఇంక అని అంటుంది. 

మోనల్ జర్నీ కంప్లీట్ ఫస్ట్ ఎంట్రీగా వచ్చి పద్నాలుగో వారం వరకూ ఉండడం సింప్లీ సూపర్బ్.. చాలా బావుంది వీడియో.. 

అభితో నేను లేకపోతే అఖిల్ మీకు మంచి ఫ్రెండ్ అవుతారు అన్నారు కదా ఇపుడు టైమ్ వచ్చింది అంటుంది. అయ్యో నేనాఉద్దేశ్యంతో అనలేదు తల్లీ.. అని చెప్పాడు అభి. హమ్మా ఇప్పుడు ఒప్పుకున్నాడు సర్ అని అంటుంది మోనల్. 

అరియానా టాస్క్ లో కొంచెం ఎగ్రెస్సివ్ ఉన్నారు వేరే వాళ్ళు హర్ట్ అవుతున్నారు కొంచెం జాగ్రత్త అంది. 

సోహెల్ చిన్న చిన్న మాటలు కి హర్ట్ అవ్వకండి మిమ్మల్ని కన్సోల్ చేయడానికి ఎవరు లేరు జాగ్రత్త అని అంది. ఓహ్ హాండ్సమ్ అనిపిస్తున్నారు.. సిగ్గు వాలా స్మైల్ ఇవ్వు అని అన్నారు. 

హారిక ని అఖిల్ ని బీట్ చేయ్ ఫైనల్ లో అని చెప్పింది. లవ్యూ అని పద్నాలుగు వారాలు ఉన్నందుకు నీకు అని బో చేసింది హారిక. 

అఖిల్ ఇందాక నాతో మాట్లాడలేదు అని అంది. ఇపుడు మీరు చెప్పండి సార్ మాట్లాడమని అని అదిగింది. పాట పాడమంటే వినలేదు మధ్యాహ్నం అని చెప్పింది. ఇపుడు పాడు అంది. 
నాలోనె పొంగెను నర్మదా మొదలు పెడితే నాగ్ సర్ అది వద్దు ఉండిపోరాదే కావాలి అని అడిగారు.. చాలా ఫీల్ తో పాడాడు. 

ఐ వాంట్ యు టు బి దేర్ విత్ హారిక ఇన్ ఫినాలే అని అంటే మరి నేనెటు పోవాలి అని అడిగాడు సోహెల్. 

అఖిల్  మోనల్ ఒక్క వారమే వచ్చేస్తాను వెయిట్ చేయ్ నీతో మాట్లాడాలి చాలా అని అంటే మాతో కూడా ఛెప్పచ్చు కదా అంట నాగ్. నో సర్ అంటే వద్దులే మేం వినం అని అంటున్నారు. 

మోనల్ అందరికీ బై చెప్తూ గోవింద అని అంటుంటే నాగ్ సర్ గోవిందాగోవింద అని చాలా డిఫరెంట్ గా అన్నారు :-)

సెల్ఫీ విత్ బ్యూటిఫుల్ మోనల్ అంట నాగ్ అసలు ఎక్కడా తగ్గడం లేదు.. 

గార్డెన్ ఏరియా లో ఫైనలిస్ట్స్ అని సెటప్ పెట్టి అండరిని డాన్స్ వేయమని చెప్పారు పార్టీ.. అంతా హుషారుగా గంతులు వేస్తున్నారు. నెక్స్ట్ సండే ఫైనల్ లో కలుస్తాను అని చెప్పారు. సాటార్ డే నాగ్ రారు ఫైనల్ త్రీ అవర్స్ ప్రోగ్రాం ఉంటుంది. 

బిగ్ బాస్ కూడా ఫైనలిస్ట్ లు అందరిని అభినందించి ఆల్ ద బెస్ట్ చెప్పారు.  

ఇక రేపటి ప్రోమోలో ముసుగు వెనక దాగింది ఎవరు అని ఏదో టాస్క్ పెట్టారు అందరి కళ్ళకి మాస్క్ లాంటివి ఏవో ఇచ్చి అంతా డాన్స్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి వుడెన్ బూత్స్ లాంటివి ఇచ్చారు కూచోడానికి కూడా ఫేసిలిటీ ఉన్నట్లుంది అంతకన్నా క్లారిటీ రాలేదు ప్రోమోలో. ఏమిటో రేపు ఎపిసోడ్ చూస్తే కానీ తెలియక పోవచ్చు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

12, డిసెంబర్ 2020, శనివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్.. ముఖ్యమైన పాయింట్స్ కోసం ఇక్కడ చూడవచ్చు. 



ఈ రోజు శనివారం రోస్టింగ్ డే వారంలో జరిగిన ఇష్యూస్ కి పంచాయితీ పెట్టి సాల్వ్ చేసే రోజు. నాగ్ ఈ రోజు కూడా అదే చేశారు. ఐతే తను హాండిల్ చేసిన పద్దతి మాత్రం చాలా బావుంది. చాలా కంపోజ్డ్ గా కొన్ని చోట్ల సీరియస్ అవుతూ కొన్ని చోట్ల నవ్విస్తూ చాలా కమాండింగ్ గా హాండిల్ చేశారనిపించింది నాగ్. 

ఈ రోజు శుక్రవారం జరిగినవి చూపిస్తారు కదా.. అందులో ఓ చిన్న హైజీనెక్స్ టాశ్క్ అండ్ స్కందాంశి టాస్క్ ఉన్నాయి. స్కందాంశీ వారి మెమెంటోస్ బావున్నాయ్ హౌస్మేట్స్ కూడా బాగా ఎక్సైట్ అయ్యారు అవి చూసి. 

అలాగే ఈ రోజు హౌస్మేట్స్ దృష్టిలో ముగ్గురు నచ్చిన పేర్లు ఇద్దరు నచ్చని వాళ్ళ పేర్లు చెప్పి ఒక్కొక్కరి గురించి ముందు ఏమనుకున్నారు అండ్ తర్వాత ఇపుడేమనుకుంటున్నారు అని చెప్పమన్నారు. అభి తప్ప మిగిలిన నలుగురు హౌస్మేట్స్ అరియానా పేరుని డిజ్లైక్ లోనే పెట్టడం ఇంట్రెస్టింగ్. గేం లో మరీ ఒకే పద్దతిలో ఆడుతుంది కాస్త టఫ్ అనే చెప్పారు ఒకరకంగా అంతా కూడా. అలాగే అరియానా మోనల్ ని ఫేవరెట్ త్రీలో పెట్టి కేరింగ్ అని చెప్పడం బావుంది బహుశా అఖిల్ సోహెల్ ఇద్దరిపై ఉన్న వైరం దానికి ఒక కారణం అయి ఉండొచ్చు.  

ఇక అరియానా అండ్ సోహెల్ ఇద్దరి విషయంలో నాగ్ ఇద్దరిదీ తప్పుందని క్లారిటీ ఇచ్చారు. తర్డ్ పర్సన్ ని ఫస్ట్ తీస్కొచ్చింది ముందు రెచ్చిపోయింది అరియానానే అని తనతోనే చెప్పించారు అదే కాక సోహెల్ కన్ఫెషన్ రూం కి వెళ్ళినపుడు వాష్ రూం లో సీన్ చేయడం విమెన్ కార్డ్ తీయడం కరెక్ట్ కాదు అని చెప్పారు. చాలా తెలివిగా అరియానాకి నచ్చే అభి తోనే చెప్పించారు ఈ విషయాలు దట్స్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే సోహెల్ ని కూడా నువ్వు టాస్క్ లో అంత కంట్రోల్ గా ఉన్న వాడివి బయటికి వచ్చాక అలా ఎలా రెచ్చిపోతావ్ అసలు గేం విన్ అవగానే నువ్వెంత యారొగెంట్ గా ఉన్నావో తెలుసా నువ్ అలా తన మీదకి వెళ్లడం తప్పు అండ్ నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేస్కోవాలి అని కూడా చెప్పారు. మరి చివరి వారమనో ఏమో ఇద్దరికి కూడా సమానంగా క్లాస్ తీస్కున్నారనిపించింది. ఇంతటితో ఈ ఇష్యూని క్లోజ్ చేసేయండి అని చెప్పారు. 

ఇక ఈ రోజు ఫస్ట్ సేవ్ చేసి సెకండ్ ఫైనలిస్ట్ గా సోహెల్ పేరు డిక్లేర్ చేశారు. చాలా సంతోషించాడు తను ఎలిమినేట్ అవుతాను అనుకున్నాడు ఆల్మోస్ట్ ఫస్ట్ సేవ్ అయ్యేసరికి చాలా సంతోషించాడు. అండ్ గెలిచా కదా ఇంకేంటి అని పొగరుగా బిహేవ్ చేయకుండా షో అయ్యాక అరియానా ముందు మోకాళ్ళ మీద కూర్చుని సారీ చెప్పి హగ్ చేసుకుని ఇక ఈ ఇష్యూని ఇంతటితో మర్చిపోదామని చెప్పడం నాకైతే చాలా నచ్చేసింది.   

          
వివరాల్లోకి వెళ్తే ఈ రోజు నాగ్ వి సినిమాలోని వస్తున్నావచ్చేస్తున్నా పాటతో ఎంట్రీ ఇచ్చారు.   

97 వ రోజు ఉదయం హైజీనిక్స్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఇచ్చారు క్లీన్ చేస్కోవాలని టాస్క్.. 

అభి నిన్న తర్డ్ పార్టీ ఇష్యూస్ నీకెందుకు అన్న విషయం మీద సోహెల్ అభితో అమ్మగారికి నీకు గొడవ ఐనపుడు నోయల్ కోసం స్టాండ్ తీస్కున్నావ్ కదా అని అడిగా అని చెప్తున్నాడు సోహెల్ అఖిల్ తో. 

స్కందాన్షీ వారి టాస్క్ ఇచ్చారు. రెండు టీంస్ గా ఫామ్ అయ్యి ఇల్లు కట్టాలి ఫాస్ట్ గా. ఇద్దరు హుషారుగా కట్టేశారు. అందరికీ మొమెంటోస్ ఇచ్చారు బావున్నాయ్. 

అఖిల్ డ్రస్ బాలేదని మోనల్ కామెంట్ చేస్తుంది. సోహెల్ నేను చాలా ఇచ్చాను అఖిల్ కి బట్టలు అని అన్నాడు అది నచ్చలేదు అఖిల్ కి. నాకు బట్టలు రాలేదని ఫీలవుతున్నాడు. అయ్యో అని హారిక హగ్ ఇస్తుంటే మోనల్ దూరం నుండి ఇలా చూస్తూ ఉంది మధ్య మధ్యలో మోనల్ కట్స్ వేయడం మాత్రం ఎడిటర్ టూమచ్. 

హౌస్ లోకి వచ్చాక వున్న వ్యక్తి మీద నచ్చిన ముగ్గురుని పైకి నచ్చని వాళ్ళని కింద పెట్టాలి. గ్రీన్ థంప్సప్ రెడ్ థంప్రప్ సింబల్స్. 
ఫాస్ట్ ఇంప్రెషన్ ఏంటీ ఇప్పుడు ఏంటి ?

అఖిల్ ని చూసినపుడు టట్టూ చూసి ఓహ్ ఓకే అని అన్నట్లు ఉంది. క్యూట్ అంటే ఆ నువ్వు అభి ని అఖిల్ ని ఇద్దరిని క్యూటీ పై అనే అంటున్నావ్ అని అంటున్నారు నాగ్. 
మొదట అభిని సైలెంట్ అనుకున్నా కానీ ఇపుడు కాదని తేలింది లోపల చాలా మాస్ బయటికి మాత్రమే క్లాస్ అని అంది. 

మోనల్ నాకు అక్కలా ఐంది తనకి నా గురించి అన్నీ తెలిసిపోతాయ్ అని అంటుంది. 

అరియానా 

సోహెల్ వచ్చినపుడు ఆగం ఆగం ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆగం     ఓకే మిస్ డిప్లొమాటికా అని అన్నారు నాగ్. ఐ యామ్ సూపర్ స్వీట్. 

అఖిల్ నెక్స్ట్.. 
హారిక మోనల్ సోహెల్. 
అభి అరియానా
హారిక మొదట యాటిట్యూడ్ తో వచ్చింది అనిపించింది. ఇప్పుడు ఈ ఫోర్టీన్ వీక్స్ లో చాలా రాపో పెరిగింది. షీ ఈజ్ సో క్యూట్. 

మోనల్ చూసినపుడు పట్టించుకోలేదు నాగ్ ఏ హింట్ ఇచ్చారు బ్యూటిఫుల్ ఆ.. అని అవును అన్నారు. ఇప్పుడు రియల్లీ సో గుడ్ మంచి ఫ్యామిలీ మెంబర్ టైప్ ఎన్ని గొడవలు ఐనా మళ్ళీ కలుస్తుంది. 

సోహెల్ చూడగానే ఆగం ఆగం ఉన్నాడు ఏంది ఇట్ల అరుస్తున్నాడు ఆలోచించకుండా వాగేస్తాడు అని.. ఇప్పుడు మంచి బ్రదర్ ఆలోచించి మాట్లాడుతాడు. 
మిగతా ఇద్దరితో రాపో లేదు.. 
అరియానా దెయ్యంలా నడుచుకుంటూ వచ్చింది. ఎవరీమే అనుకున్నా. 
అభి పరిచయమైనపుడు మంచి ఫ్రెండ్ అవుతాడనుకున్నా కానీ మధలఓ చిన్న చిన్న డిస్ట్రబెన్స్ వచ్చింది అని చెప్పారు. 

అభిజిత్. 
అరియానా, సోహెల్, హారిక 
అఖిల్ మోనల్
అరియన - రాగానే ఏంటీ అమ్మాయ్ అని అనుకున్నాం ఇంత చేయమంటే అంత చేస్తుంది. రకరకాల పద్దతులలో చేయచ్చు టాస్క్ అనేది కానీ ఒకటే పద్దతిలో ఉంటుంది
సోహెల్ చాలా మంచోడు కానీ కోపం కు లిమిట్ ఉండాలి అనిపిస్తుంది. అర్ధం చేస్కున్నా తన దగ్గర పాయింట్ ఉన్నా కానీ కోపం వల్ల కనపడటం లేదు. 
హారిక కూల్ చిల్డ్ ఔట్ రిలాక్స్ పర్సన ఇప్పుడు కాదని తెలుసుకుంటున్నా చిన్న పాయింట్ మీద కూడా ఆర్ చేస్తది. 
మోనల్ హైపర్ ఫస్ట్ లుకింగ్ ఫర్ హర్.. ఇపుడు కూడా అదే అనుకుంటున్నా.. మేమిద్దరం వేరే డిఫరెంట్ ఇండివిడ్యువల్స్.
అఖిల్ విషయంలో మోనల్ లింక్ లేకపోతే ఇంకా మంచి ఫ్రెండ్స్ అవుతాం అనుకున్నా. బయట ఇంకా మంచి ఫ్రెండ్స్ అవుతాం అనుకుంటున్నా అన్నాడు. 

మోనల్ 
అఖిల్, హారిక,సోహెల్ 
అభి, అరియానా
అఖిల్ - ఫస్ట్ మోస్ట్ డిజైరబుల్ యాటిత్యూడ్ ఇపుడు సూపర్ కోపం వస్తుంది కానీ అపుడు తనకి అటెన్షన్ ఇస్తే హీ విల్ బి హాపీ. 
హారిక ఇపుడు చెల్లి. 
సోహెల్ - మొదట్లో నచ్చలేదు ఇపుడు బ్రదర్ గా చాలా కనెక్ట్ అయ్యడు

అరియాన అకోపంగా ఉంది అర్ధం అవలేదు మొదటి నుండి. టాస్క్ లో చాలా అగ్రెస్సివ్ తన నేచర్. 
అభి ముందు చాలా గుడ్ నాతో నేను స్టేజ్ మీద ఫోటో చూసి సెలెక్ట్ చేశాను అని. రోబో టాస్క్ లో హర్ట్ అయ్యాను. సూపర్ హానెస్ట్ అని ఉంది మోసం చేయడనుకున్నా అందుకె అందులో హర్ట్ అయ్యా.. ఎక్కువ ఎక్కడైంది తెలీలేదు.. డిజ్లైక్ ఏం లేదు. నువ్వు అగ్రీ విత్ హిమ్ తను హాపీ.. 

అరియానా 
అభి, హారిక, మోనల్    
అఖిల్ సోహెల్
అభి ఎంత కూల్ అనుకున్నా ఒక టాస్క్ వల్ల బాడ్ స్టార్ట్ అయింది.  
హారిక తో రాపొ ఏం లేదు కానీ టాస్క్ విషయంలో ఇద్దరం కనెక్ట్ అయ్యాము అని అంది. 
మోనల్ చాలా కేరింగ్ 
అఖిల్ స్టార్టింగ్ మంచి రాపో ఉంది ఎమోషానల్ గా కనెక్ట్ అవలేదు
సోహెల్ మా కమ్యునికేషన్ సెట్ అవడం లేదు థాట్ ప్రాసెస్ వేరు. డిజ్ లైక్స్ ఏంటి అంటే కోపం కొద్దిగా కంట్రోల్ చేస్కుంటే నార్మల్ టోన్ లో మాట్లాడితే హీ ఈజ్ గుడ్ పర్సన్. 
నాగ్ సరే ఇది ఎందుకు స్ట్రెస్ చేస్తున్నావ్ ఏం జరిగింది అని అడిగారు. 
అభి ఇంప్రెషన్ ఏంటి అని అడిగారు. అఖిల్ నేను అక్కడే ఉన్నాను అని పాయింట్ చెప్పాడు ఫాస్ట్ రైజ్ ఐంది అరియానానే అని అన్నాడు. 

అభి క్రైయింగ్ ఫర్ వుల్ఫ్. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు 

అరియానా విషయంలో లాస్ట్ వీక్ అవినాష్ విషయంలో కూడా ఇదే జరిగింది చిన్న మాటకే ఇరిటేట్ ఆవుతుంది అది తన పర్సనాలిటీ అవచ్చు. 
ఒక అగ్రిమెంట్ కి వచ్చి మూవింగ్ ఫార్వర్డ్ వెంటనే కాకుండా కూచుని మాట్లాడుకుంటే బావుండేది. 

సోహెల్ నువ్వు చెప్పు. సారీ అంటే 
కోపం రాకుండా అంత సేపు కూచున్నావ్ టాస్క్ అవగానే ఎందుకు అంత రైజ్ అయ్యావ్ టాస్క్ లో కంట్రోల్ చేశావ్ లైఫ్ లో చేయలేవా అన్నారు. 
ఎంటర్టైన్మెంట్ టాస్క్ దగ్గర మేం తనని సెలెక్ట్ చేశాం కుర్చీలో కూర్చున్నపుడే రియాక్ట్ అవు మిగిలిన హౌస్మేట్స్ కి ఛాన్స్ ఇవ్వు అని బతిమాలాను అన్నాడు. 

నువ్వు గెలిచిన వెంటనే ఎంత అహంకారంతో ఉన్నావో తెలుసా మొదట అరిచింది అరియానానే అక్కడ నుండి నువ్వు మీదకి వెళ్ళావు నువ్వు చెప్పిన ప్రతి పాయింటూ కోపం లేకుండా మాట్లాడి ఉంటే వింటారు ఎదుటి వారు అని చెప్పారు. 

తర్డ్ పర్సన్ ని ఆమే తీస్కొచ్చింది అన్నాడు.. ఆమెని అడిగితే నేను తెచ్చాను కానీ నాది ఎగ్జాంపుల్ అని అంటుంది అతనేమో అవినాష్ పేరు తెచ్చాడు అని అంటుంది. 

విమెన్ కార్డ్ తీస్కొచ్చింది రెండు గంటల తర్వాత తను కన్ఫేషన్ రూం కి వెళ్ళాక అలా ఏడవడం ఏంటి అని అడిగారు నాగ్ కూడా ఎంత హిస్టీరికల్ గా ఏడ్చావమ్మా అని అన్నారు..   


అభిజిత్ అని అడిగితే అది అనవసరం అని చెప్పాడు

అఖిల్ కూడా తను అక్కడ చెప్పినదే చెప్పాడు. 

సోహెల్ మాట్లాడుతుంటే గట్టిగా ఆపేశాడు నాగ్ నేను మాట్లాడుతున్నా కదా నువ్వు మాట్లాడకు అని ఆపారు. 
అరియానా విమెన్ కార్డ్ తీస్కోవడం రాంగ్ 
సోహెల్ నువ్వు అంత కోపం తెచ్చుకోడం అర్వడాం తప్పు టాస్క్ లో లాగా కంట్రోల్ చేస్కోవాలి. 

సోహెల్ 
అఖిల్ అభి మోనల్ 
అరియానా హారిక 
అఖిల్ ఫస్ట్ యాటిట్యూడ్ అనుకున్నా కానీ ఒకసారి కనెక్ట్ అయితే వాళ్ళతోన నిలుస్తాడు నాకు బ్రదర్ లా ఉండిపోయాడు. బట్టల కోసం కొట్టుకునేంత క్లోజ్ అయ్యాం అంటే నాగ్ నరసింహ సినిమా చూశావా మీ గొడవ అంతే ఉంది అన్నారు.
 
అభి చాలా అమాయకుడు అనుకున్నా 
అభి గురించి నాకో డౌట్ ఉంది అలా నుంచో లేక కూచున్నాడేంటి 
పిల్లలెలా పుడతారు అభి అని డౌట్ అడిగారు. 
మీమ్స్ స్పెషలిస్ట్ అందరూ మీకు ఆన్సర్ ఇస్తున్నా అని పిల్లలు ఏడుస్తూ పుడతారు అని చెప్పాడు నాగ్.   
మోనల్ ఫస్ట్ లో యాటిట్యూడ్ అనుకున్నా తినలేదంటే నేనూ తినలేదు అని వెళ్ళింది. మళ్ళా తర్వాత నాట్ క్లోజ్ టు మి అని అంది కనెక్ట్ అవదు అనుకున్నా.. ఇపుడు సిస్టర్. 
హారిక అల్లరి పిల్ల ఫాస్ట్ రిసీవ్ చేశ్కుంది హారికనే.. సోహెల్ నువ్వు ఎక్కువ ఫీలవకు అడిగెవాళ్ళు కూడా ఉన్నారు. మంచి ఫ్రెండ్ అయింది అని అన్నాడు. 
అరియానా టాస్క్ విషయంలో అభి చెప్పినట్లు ఎందుకు అంత పీక్స్ కి వెళ్తుందో తెలీదు అన్నాడు. 

అరియానా కాస్త డల్ గా ఉంటే ఇలా ఉండద్దమ్మా నాకా బోల్డ్ అరియానా కావాలి అని చెప్పారు... 
టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ని రివీల్ చేయబోతున్నా అని అన్నారు. 
అఖిల్ ని నలుగురి పేర్లు చెప్పమన్నారు.  
సోహెల్,మోనల్,అభి,హారిక అని చెప్పాడు. 
టెన్ నుండి కౌంట్ డౌన్ చేయమన్నారు. 
ఇప్పుడు ప్రే చేశావ్ ఎవరికోసం అంటే సోహెల్ ఆర్ మోనల్ ఎవరొచ్చినా ఓకే సర్ అని అన్నాడు. 

సెకండ్ ఫైనలిస్ట్.. - సోహెల్
అఖిల్ మాములుగా అరవలేదు. సోహెల్ కూడా ఎగ్గిరి దూకి అఖిల్ మీదకి ఎక్కేశాడు. అందరికి థ్యాంక్స్ చెప్పాడు నన్ను క్షమించండి బిబి తరపున లాకెట్ ఇవ్వండి అది చూసినపుడల్లా నేను కోపాన్ని కంట్రోల్ చేస్కుంటా అని చెప్పాడు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


11, డిసెంబర్ 2020, శుక్రవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయచ్చు. 



ఈ రోజు రెండు టాస్క్ లు ఇచ్చారు ఒకటి ప్రమోషనల్ టాస్క్ ఐతే మరోటి గోల్డెన్ మైక్ కోసం వినోదం టాస్క్. ప్రమోషనల్ టాస్క్ లో ఇది నిజంగా సెల్ఫీనేనా అని డౌట్ వచ్చేంత బాగా క్రియేటివ్ గా ఫోటో దిగిన మోనల్ కే బెస్ట్ పిక్ అవార్డ్ వచ్చింది.

ఇక వినోదం టాస్క్ లో స్టేజ్ పై డాన్స్ చేయాల్సిన దాన్లో అభి రూల్ మర్చిపోవడం వల్ల మొదటి రౌండ్ లోనే ఔటైతే చివరి వరకు హారిక మోనల్ నిలిచారు. హారిక కెప్టెన్ ని చేసినందుకు నీకు రీపే చేయలేదు కనుక నీకే ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి మోనల్ కి ఛాన్స్ ఇచ్చింది.

హారిక ఇంత ఆలోచించిందో లేదో కానీ నిజానికి ఈ రాత్రి పన్నెండుకు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయ్ కనుక అప్పీల్ చేసుకున్నా గంట సమయంలో ఓటింగ్ పై పెద్ద ప్రభావం చూపించక పోవచ్చు కేవలం అప్పీల్ చేసిన వాళ్ళకి మానసిక తృప్తి తప్ప ప్రయోజనం ఉండదనే నా అభిప్రాయం. అలాగే హారిక కి మోనల్ కి ఇచ్చేసిందన్నా గుడ్ నేం అండ్ హమ్మ రీపే చేసేశానని తన భారం కూడా దింపుకున్న ఫీల్ ఉంటుంది కనుక గుడ్ డేసిషన్ బై హారిక.  

ఇక ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందనేది పక్కన పెడితే మోనల్ మాత్రం చాలా క్లారిటీ తో తన జర్నీ అంతా చెప్పి చాలా బాగా అప్పీల్ చేస్కుంది. అప్పీల్ అంటే ఇలా ఉండాలిరా సపోర్ట్ ఇలా అడగాలి అనిపించింది వింటున్న నాకైతే. వాటికి తోడు జైశ్రీకృష్ణ, గోవింద నామాలు ఎలానూ ఉన్నాయ్. ఇదే ఫస్ట్ లోనే తనకి ఛాన్స్ వచ్చి ఉంటే ఇంకా చాలా ప్లస్ అయుండేది ఓటింగ్ పరంగా అనిపించింది. 

ఇక సోహెల్ టెన్షన్ అండ్ భయం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది రేపు నాగ్ ఏమంటారో అని భయపడుతూనే ఉన్నాడు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా అది కనిపిస్తుంది. అభి మొన్న కానీ ఈ రోజు కానీ సోహెల్ కి అరియానా కి ఇచ్చిన సజెషన్స్ వాళ్ళతో మాట్లాడిన మాటలు. అరియానా ఏడుస్తూ కిందపడినపుడు అభి బిహేవియర్ ఇవన్నీ చూస్తే మాత్రం హీ ఈజ్ నంబర్ వన్ ఫర్ ఎ రీజన్ అనిపించింది నాకు. మరిన్ని వివరాలకి పూర్తిగా వీడియో చూడండి.  
           
వివరాల లోకి వెళ్తే 96 వ రోజు ఇంట్లో 6 గురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం రెడీ సినిమాలోని ఓం నమస్తే బోలో పాటతో మేల్కొలిపారు. అందరి డాన్స్ బావుంది.

అఖిల్ హారికతో మాములుగా ఫ్లర్టింగ్ చేయడం లేదు :-) హారిక ఏంట్రా నువ్వు నేర్చుకోవాలి అని సోహెల్ కి చెప్తుంది. 

ఓప్పో ఎఫ్ సెవెన్ ప్రో టాస్క్. 
ఫోటో బూత్ పెట్టారు.. ఒకొక్కళ్ళు ఫోన్ పాస్ చేస్కుంటూ ఏఐ పోట్రెయిట్ మోడ్ లో సెల్ఫీస్ దిగాలి. మొత్తం మూడు రౌండ్స్ దిగాలి. అభి, హారిక, అరియానా, మోనల్ చేశారు.    

మోనల్ ది క్రియేటివ్ గా ఉంది హార్ట్ సింబల్ నుండి తను కనిపించేలా చాలా బాగా దిగింది సో తనని విన్నర్ గా అనౌన్స్ చేశారు. 

అరియానా హారిక అభి గురించి మాట్లాడుకుంటున్నారు. అభి హారికతో మాట్లాడడం లేదట. ఎంత క్యూట్ గ తింటాడో చూడు అని అంటుంటే హారిక అరియానా వెంటనే అది అభికి చెప్పింది అభి దనని పట్టించుకోకుండా పెరుగు తోడేసింది నువ్వేనా అని బాగా వేశావ్ అని అరియానాని మెచ్చుకుంటున్నాడు. 
హీ ఈజ్ టూ ఇంటెలిజెంట్ అని అనుకుంటున్నారు ఇద్దరు. 

నెక్స్ట్ టాస్క్ వినోదం 
తక్కువ సైజ్ షూస్ ధరించి ఆపకుండా స్టేజ్ మీద డాన్స్ చేయాల్సి ఉంటుంది. 
డాన్స్ ఆపినా, స్టేజ్ మీద కూర్చున్నా, స్టేజ్ దిగినా ఔట్. ముగిసే సమయానికి ఎవరైతే ఉంటే వాళ్ళు విన్. ఎవరు దిగాలన్న పేరు అఖిల్ సజెస్ట్ చేయచ్చు.  

సోహెల్ కాస్త తెలివిగా లేస్ మొత్తాన్ని పై నుండి లూజ్ చేశాడు. అభి తో మాట్లాడుతున్నాడు. మొన్న జరిగిన దానికి రిప్లై ఇవ్వాలా జనాలికి నేనేంటో చూపించాలా ఏం చేయాలో అర్ధం కాటల్లేదు. ఎవరివయ్యా నువ్వు అని అన్నది తీస్కోలేకపోతున్నా అని అంతున్నాడు. అవన్ని ఆలోచించకు ఛిల్ టాస్క్ అంతే ఆడు అని అంటున్నాడు అభి.  

అందరు బాగానే ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారు. 

ఫస్ట్ బ్రేక్ లో అఖిల్ అరియానా పేరు సజెస్ట్ చేశాడు. 

నేను దిగుతాను కాని సెకండ్ దిగుతాను అని చాలా సేపు వాదించింది. దిస్ గర్ల్ ఈజ్ ఇంపాజిబుల్ నాకస్సలు నచ్చలేదు. సోహెల్ ఒక సారి వెళ్ళాడు తిను రెండు సార్లు వెళ్ళింది తనకి ఆ అడ్వాంటేజ్ ఉంది కదా ఐనా ఇలా వాదించడం అదేమంటే నాకు ఇంకాసేపు టాస్క్ లో ఆడాలని ఉంది అనడం బాలేదు.
 
ఈవిడ ఇంత డిస్కషన్ పెట్టేసరికి అభి రూల్స్ మర్చిపోయి స్టేజ్ మీద కూర్చున్నాడు దాంతో రూల్స్ ప్రకారం తను ఔట్. 

సెకండ్ టైమ్ అరియానా దిగింది కానీ గోల్డెన్ మైక్ వచ్చినదాఇన్తో ఈక్వల్ గా స్టేజ్ మీదే మంచి పేద్ద మెసేజ్ ఇచ్చింది. సోహెల్ దిగేవరకు దిగను అని మళ్ళీ వాదించకుండా దిగడం కొంతవరకు ఓకే. ఐతే దిగినా కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర బార్స్ మీద స్ట్రెచ్ చేస్తూ తన వైపు అటెన్షన్ వచ్చేలా చేస్కుంది. 

అభి కూడా కూర్చుని రిలాక్స్ అవకుండా డాన్స్ చేయడం బావుంది. అరియానా అఖిల్ కూడా కలిసి డాన్స్ చేశారు గుడ్. 

నెక్స్ట్ బ్రేక్ లో సోహెల్ ఏంది మరి పరిస్థితి అని అంటున్నాడు మీరే వెళ్ళాలి అని చెప్తుంది మోనల్.. మనం అందరికి ఛాన్స్ రావాలి అని అంటుంది. ఎందుకు అంటే హారిక ఒక సారి వెళ్ళావ్ కదా అని చెప్పింది. 
సోహెల్ నేను మొండిగా ఇక్కడే కూచోవచ్చు మొండిగా వాదించొచ్చు కానీ నా హౌస్మేట్స్ కోసం అందరికి అవకాశం రావాలని నేను దిగుతున్నా అని చెప్పాడు. నేనెంత డల్ గా ఉన్నానో ఈ వీక్ దానికి కారణం ఏంటో కూడా మీ అందరికి తెలుసు అని అంటూ తిను కూడా స్టేజ్ మీద నుండే ప్రజలకి మెసేజ్ ఇచ్చాడు. 

తర్వాత పాటలు వస్తూ మిగిలిన వాళ్ళు డాన్స్ చేస్తున్నపుడు సోహెల్ ఒక్కడే వాష్ రూం లోకి వెళ్ళి బాధ పడుతున్నాదు. పాట వస్తుండగానే బిగ్ బాస్ కెమెరాకి చెప్తున్నాడు హౌస్మేట్స్ అందరు కలిసి నిన్ను గెలిపించారు కదా నువ్వు ఎక్స్ప్రెషన్ ఛేంజ్ చేసి వేరె వాళ్ళని గెలిపించు అని చెప్పాను కానీ తను దిగలేదు ఈ రోజు అదే అమ్మాయ్ హౌస్మేట్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నా అంది. అది ఆరోజే ఉండాల్సింది అని అంటున్నాదు.      

అభి కూడా డాన్స్ బాగా చేస్తున్నాడు సోహెల్ అండ్ అఖిల్ కూడా ఆశ్ఛర్యపోయారు. 

నెక్స్ట్ బ్రేక్ లో హారిక అండ్ మోనల్ మాత్రమే ఉన్నారు. మోనల్ మాట్లాడుతుంది. నాకు ఇది చాలా అవస్రం అని చెప్తుంది. నువ్వు ఎలాగూ పెర్ఫార్మర్ నువ్వు రేపైనా గెలుచుకోవచ్చు అని చెప్తుంది. అలా చెప్పకు లాస్ట్ టూ టాస్క్ లో నేను గెలవలేదు కానీ కేప్టెన్సీ లో నువ్వు హెల్ప్ చేశావ్ కనుక ఐ డింట్ రీపే యూ.. సో అందుకే ఇపుడు ఇస్తున్నా అని చెప్పి దిగింది. 

మోనల్ నా భాష అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా నేను తెలుసుకుని ఇన్ని రోజులు ఉన్నాను. పద్నాలుగు వారాలు నాకు ఇంత లవ్ ఇచ్చారు నాకు ఇంకోంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ జర్నీలో నేను చాలా ఛేంజ్ అయ్యాను అంటూ ముద్దు ముద్దు తెలుగులో చక్కగా అప్పీల్ చేస్కుంది. బావుంది క్యూట్ గా ఉండడమే కాకుండా ఇప్పటి వరకు అప్పీల్ చేస్కున్న అరియానా, సోహెల్ ఇద్దరికన్నా కూడా తిను చాలా క్లియర్ గా క్లారిటీతో చక్కగా వివరంగా సపోర్ట్ అడిగిందనిపించింది నాకైతే. 

అభి హారిక సోహెల్ తో మాట్లాదుతున్నాడు. హౌస్మేట్స్ గురించి నీకెందుకు భై నీ గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది అని అభి అంటుంటే.. నేనూ హౌస్మేట్ నే కదా అంట సోహెల్.. ఇక దానికి ఎవరైనా ఏం సమాధానం చెప్తారు. 
ఇప్పుడు అరియానా శాక్రిఫైస్ అదీ అని అంటుంది.. అధికారం టాస్క్ లో మనం అంతా అరియానాకి ఓట్లేసి గెలిపించాం కదా తను మరి ఒక సారి వెళ్ళాను కదా అని హౌస్మేట్స్ కోసం శాక్రిఫైస్ చేసి ఉండొచ్చుకదా నాకు అందుకే కోపం వచ్చింది అంత అరిచాను అని అంటాడు సోహెల్. తను ఓపిక టాస్క్ లో గెలిచినా ఏకాగ్రత టాస్క్ లో గెలవాలనే ఆడాడు కదా వదిలేయలేదు కదా ఐనా ఇచ్చిన టాస్క్ చేయకుండా అల ఎలా శాక్రిఫైస్ చేస్తుంది. 

అభి చాలా మంచి ఎక్జాంపుల్ చెప్పాడు. అది క్లియర్ గా అరియానా డెసిషన్ మనం చెప్పలేం. డబ్బున్న వాడి దగ్గరకి వెళ్ళి నీ దగ్గర బాగా డబ్బులున్నాయ్ కదా మాకిచ్చేయ్ అంటే ఇస్తాడా అని అన్నాడు. చలా బాగా కన్వే చేశాడనిపించింది అభి. కానీ సోహెల్ మాత్రం భయంతో ఇంకా రక రకాలుగా తను చేసిన దాన్ని కవరప్ చేస్కుందాం అని చూస్తునే ఉన్నాడు. అభి చెప్పినా ఎవరు చెప్పినా తనకి అర్ధం కావడం లేదు. 

ఇలాంటపుడు అభి థాట్ ప్రాసెస్ ఇవి చూసినపుడే అభి ఈజ్ నంబర్ వన్ ఫరే రీజన్ అనిపిస్తుంది. ఇలాగే మొన్న అరియానా కిందపడినపుడు కూడా చెదిరిన తన కోటుని సర్ది తనని పైకి లేపే ప్రయత్నం చేశాడు అక్కడ కూడా ట్రూ జెంటిల్మన్ అనిపించుకున్నాడు అభి.    

తర్వాత నైట్ లైట్స్ ఆఫ్ చేసే టైం లో మోనల్ ఒక్కతే మెయిన్ గేట్ ఎదురుగా కూచుని రాప్ పాడుతుంది. బిగ్గ్గ్గ్ బాస్ అని పెద్దగా పిలిచి లవ్యూ చెప్పి ఈ హౌస్ మొత్తానికి హగ్ ఇవ్వాలని ఉంది బిగ్ బిగ్ హౌస్.. నా లైఫ్ మొత్తం చేంజ్ అయింది.. ప్రేమమ్ ప్రేమమ్ అని అంతా రాప్ లోనే ఛెప్తుంది. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


10, డిసెంబర్ 2020, గురువారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినండి. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజు మూడో టాస్క్ ఏకాగ్రత. ముప్పై నిముషాలు టైం లెక్కపెడుతూ ఏదొ ఒక పని చేయాలి మధ్యలో మిగిలిన హౌస్మేట్స్ ప్రశ్నలు అడుగుతూ డిస్ట్రబ్ చేయాలి. ఇందులో కూడా ముప్పై ఏడు నిముషాలతో అరియానానే విన్ అయి అపీల్ చేస్కునే అవకాశాన్ని పొందింది. టాస్క్ ద్వారా రెండు సార్లు అవకాశం పొందడం చాలా సంతోషంగా ఉందంటూ ఫుల్ ఎక్సైట్మెంట్ తో మాట్లాడడం, ఏడుపు గానీ కోపం కానీ కంప్లైంట్స్ కానీ లేకపోవడమ్ చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. నిన్న సీన్ తర్వాత ఈ రోజు ఇలా ఉండగలగడం రియల్లీ గ్రేట్ అనిపించింది. 

ఇక ఇదే టాస్క్ లో అఖిల్ తనేదో పెద్ద తోపు అన్నట్లు మోనల్ కి హెల్ప్ చేస్తా అని చెప్పి హారిక డిస్ట్రబ్ చేసినా పట్టించుకోకుండా చేసి కూడా నలభై ఎనిమిది నిముషాలని ముప్పై నిముషాల గా చెప్పడం హిలేరియస్ అసలు. ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తా అనడం బావుంది క్యూట్ కానీ ఫెయిల్ అవడం ఫన్నీ అనిపించింది. అభి గెలుస్తాడనుకున్నా కానీ సం హౌ తను కూడా చేయలేకపోయాడు. 

ఇక నిన్నటి గొడవ గురించి సోహెల్ టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తను తప్పు చేశాను అనే రియలైజేషన్ కన్నా తన వోట్స్ తగ్గుతాయని ఎలిమినేట్ అవుతానని బాడ్ నేం వస్తుందని భయం ఎక్కువగా కనపడుతుంది. ఈ భయంతో మరిన్ని తప్పులు చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. అరియానా బొమ్మతో కామెడీ చేస్తున్నా అనుకుంటూ ఎమోషన్ గురించి నెగటివ్ గా కామెంట్ చేయడం ఇంకా బాడ్ అయ్యే అవకాశాలే ఎక్కువున్నాయ్. 

అలాగే సాల్వ్ చేసుకుందాం అని చక్కగా అరియానాని పిలుచుకు వచ్చి సాల్వ్ చేసుకునేలా ఐందేదో ఐపోయింది వదిలేద్దాం ఫ్రెండ్స్ లా ఉందాం అని కాకుండా మళ్ళీ ఇద్దరిది తప్పుంది నువ్వు కుర్చీలోంచి లేచి ఎందుకు అరిచావ్ అంటూ నిన్నటి లాంటి డిస్కషనే మొదలు పెట్టాడు. అరియానా క్లారిటీ ఇన్ థాట్ అండ్ లాజికల్ గా కరెక్ట్ గా మాట్లాడిన మాటలు మాత్రం సూపర్. దాంతో మళ్ళీ ఏం చేయాలో అర్ధం కాక సాల్వ్ చేస్కోలేకపోయాడు. 

ఆఖరికి అఖిల్ కూడా చెప్తూనే ఉన్నాడు మూడో మనిషి గురించి మాట్లాడకు అని ఐనా అఖిల్ మీద అలిగాడే తప్ప తనని తాను సరి చేస్కోలేదు. అఖిల్ ఎప్పుడూ కూడా ఫ్రెండ్ కదా అని ఏం చేసినా సపోర్ట్ చేయడు సరైన రీజనింగ్ తో మంచి సలహా ఇస్తాడు ఎప్పుడూ ఇదే మొదతి సారి కాదు కానీ అది తనకి ఫేవరబుల్ గా లేదని సోహెల్ ముందు అఖిల్ నే తిడుతుంటాడు. రేపైనా కాస్త ఆలోచించి సాల్వ్ చేస్కుంటే బావుంటుంది.     

       
వివరాలలోకి వెళ్తే 94 వ రోజు ఇంట్లో 6 గురు సభ్యులు ఉన్నారు. 
ఉదయం రియల్ మాంగో డ్రింక్ జింగిల్ తో మేల్కొలిపారు..

ఈ రోజు మూడవ టాస్క్ ఏకాగ్రత 
ముప్పై నిముషాల టైమ్ ని లెక్కపెడుతూ లెక్కించాలి. మిగిలిన వాళ్ళు డిస్ట్రబ్ చేయాలి. క్లాక్ సెటప్ లో బిగ్ బాస్ ఇచ్చిన పనులు చేస్తుండాలి. ముగుసే సమయానికి ఎవరు కరెక్ట్ గా గెస్ చేస్తే వాళ్ళు విన్. 
దుంపలు వలవడం ఉల్లిపాయ కట్, వెల్లుల్లి తొక్కతీయడం, కార్న్ వలవడం ఆవాలు జీలకర్ర వేరు చేయడం లాంటివి ఏవో ఇచ్చారు. 

మోనల్ కి అఖిల్ తను హెల్ప్ చేస్తా అని చెప్తున్నాడు తను లెక్కపెట్టి చెప్తాను తర్టీ మినిట్స్ వచ్చినపుడు లేచి నుంఛుంటా అని అన్నాడు. 

ఫస్టే మోనల్ స్టార్ట్ చేసింది. జీరా ఆవాలు వేరు చేసే పని పెట్టుకుంది. 
అభి హారిక డిస్ట్రబ్ చేస్తున్నారు. 
అభి ప్రశ్న పిల్లలు ఎలా పుడతారుట. గిఫ్ట్ ఇది అమ్మ హాస్పిటల్ కి వెళ్తుంది అని చెప్తుంది. 
హారిక కి అఖిల్ మీద డౌట్ వచ్చింది.. నాతో మాట్లాడచ్చు కదా పొద్దున్న నుండి లవ్యూ కూడా ఛెప్పలేదు అని అడుగుతుంది. నువ్వు మనసులో కౌంట్ చేస్కుంటున్నావ్ అని నాకు తెలుసు అని చెప్తుంది. అఖిల్ వాష్ రూం లోకి వెళ్ళాడు. 

మౌంట్ ఎవరెస్ట్ హిమాలయాసా అని అదిగాడు అభి.. అవునంది సరే ఏ కంట్రీ అంటే ఇండియా చైనా బోర్డర్ అంట. 
నీ పైన ఏముంటుంది అంటే క్లాక్ అంది కాదు పైన అని హారిక వాళ్ళు హింట్ ఇచ్చారు. ఆకాశం అంది అభినేమో థై అంట నీ(మోకాలు) పైన థై ఉంటుంది అన్నాడు. హారిక అండ్ అరియానా ఫ్లాట్ :-) వెంటనే నీ స్పెల్లింగ్ చెప్పు అంటున్నాడు మోనల్ స్పెల్లింగ్ చెప్పింది. కె.ఎన్.ఈఈ కదా అని అంటుంది.
 
అఖిల్ సిగ్నల్ వచ్చాక కూడా తను చెప్పలేదు కానీ కాసేపాగి మోనల్ అయిందని చెప్పింది. తర్టీ మినిట్స్ లోపల ఉండాలి అని అంటున్నాడు అఖిల్. మోనల్ లేట్ చేసిందని. 
హారికకి అఖిల్ మోనల్ కి సపోర్ట్ చేయడమ్ నచ్చలేదు. అదే అభితో అంటుంది. 

అరియానా టాస్క్ చేస్తుంది బట్టలు మడత పెడుతుంది. కాసేపు మొక్కజొన్న వొలిచింది. 

తర్వత హారిక వచ్చింది. దుంపలు వొలిచింది, వెల్లుల్లి ఒలుస్తుంది. 
ప్రశ్నల్లో ఏం ఇంట్రెస్టింగ్ గా లేవు. తను సన్ లైట్ చూసి చెప్పాను అని చెప్పింది. 
 

అభి నెక్స్ట్ చేస్తున్నాడు. జిలకర్ర ఆవాలు వేరు చేస్తున్నాడు తను కూడా. 
శివగామి కారెక్టర్ ఎవరు ఇంట్లొ అని హారిక అడిగితె అందం మోనల్, టెర్రర్ అరియానా, ప్రేమ హారికలో అన్నాడు. 
సరే శివగామి అనుష్క తమన్నా అంటే అరియానా శివగామి, మోనల్ అనుష్క్ట, హారిక తమన్నా అంట. 

నెక్స్ట్ సోహెల్ తను కూడా ఆవాలు జీరానే తీస్కున్నాడు. 
అభి నచ్చిన పని అంటే నిద్రపోడం అన్నాడు.
నువ్వు అస్సలు ఇష్టం లేని పని నిద్రపోకుండా ఉండడం అంట. 
నీ దృష్టిలో నీ లైఫ్ పార్టనర్ లో ఉండాల్సిన క్వాలిటీస్ 
అల్లర్లు భరించాలి కోపాన్ని ఒక లుక్ తో కూల్ చేయాలి ఫెండ్లీగా ఉండాలి.     
కెమేరాలు ఆఫ్ ఐతే ఏం చేస్తావ్ అంటే బూతులు తిడతా అన్నాడు. మైక్ ఉంటది అంటే ఉన్నా అదే లేకున్నా అదే చేస్తా అన్నాడు. 

Monal - 48.3s
Ariyana - 37.54s
Harika - 53.9s 
Abhi - 44.15s
Sohel - 42
అరియానా అందరికన్నా ఎక్కువ కరెక్ట్ గా అంచనా వేయగలిగారు కనుక విన్నర్. 
రెండో సారి అవకాశం వచ్చింది సో హాపీ అని ఎగురుతుంది. మీ దగ్గరకి వస్తే నాకు అంత సక్సెస్ వస్తుంది అని అంటుంది. నిన్నటి ఇష్యూ కానీ ఏడుపు కానీ కోపం కానీ ఏం లేవు ఫుల్ ఎక్సైటెడ్ గా టాస్క్ చేసి రావడం సంతోషంగా ఉంది అని చెప్పి అప్పీల్ చేసింది. 

ఆన్ ద అదర్ హాండ్ సోహెల్ ఏమో కెమెరా తో అరియానా ఎమోషన్ ఎక్కడుందో చూశారా తన ఎమోషన్ ఇక్కడే ఉంది, అదే ఎమోషన్ అని చెప్తు కంప్లైంట్ చేస్తున్నాడు.

అరియానా మీద అఖిల్ సోహెల్ అండ్ మోనల్ జోక్స్ వేస్కుంటున్నారు. చింటూతో ఏం చెప్పానో తెలుసా అరే ఒట్టిగా అనవసరంగా ఫూల్ అవుతున్నావ్ రా అని అన్నా అని చెప్తూంటే అఖిల్ అండ్ మోనల్ ఇద్దరు నవ్వుతున్నారు. 

నెక్స్ట్ కూడా అదే బొమ్మ మీద కామెడీ చేస్తున్నాడు సోహెల్. వాష్ రూమ్ లో కింద పడి పోయింది బోర్లా.. నువ్వు పడేశావా అని అడుగుతున్నాడు సోహెల్ మోనల్ ని.. లేదు పొరపాటున కూడా టచ్ చేయలేదు నువ్వు టచ్ చేయకు అని చెప్తుంది. మోనల్ సోహెల్ ఇద్దరు ఫన్ చేస్తున్నారు బొమ్మతో. నాకైతే నచ్చలేదు. 

తొంభై ఐదో రోజు మధ్యాహ్నం ఖాళీ టైం లో ఏం చేస్తుంటావ్ అని అడిగితే అఖిల్ సోహెల్ నేను ఫోన్ లో సినిమాలు చూస్తా అని అంటున్నాడు. ఇద్దరికి లాప్ టాప్ లేదంట. గెలిస్తే బైక్ అండ్ లాప్ టాప్ ఇప్పియ్యి నేను గెలిస్తే ఆ రెండు ఇప్పిస్తా నీకు అని చెప్తున్నాడు అఖిల్ సోహెల్ తో. నేను నిన్ను నమ్మను ఒట్టేయ్ అని అంటున్నాడు.. ఇద్దరికి చాలానే హోప్స్ ఉన్నాయ్ బాబులు.. ఒట్లవీ అక్కర్లేదులే మీకు గెలిచే ఛాన్స్ ఏమైనా ఉన్నా నిన్నటితో జీరో ఐంది అని అనుకున్నా.

కోల్గేట్ వేద్ శక్తి ఫైట్ సీక్వెన్స్ ఆడిషన్స్ టాస్క్. 
రెండు జెర్మ్స్. మూగ్గురు జెర్మ్ కిల్లర్స్ ఒక జడ్జ్. ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసి కిల్ చేయాలి. 

కిల్లర్స్ సోహెల్ అరియానా మోనల్. 
జెర్మ్స్ హారిక అఖిల్ 
జడ్జ్ అభి 
సోహెల్ ఫస్ట్ అఖిల్ భలే గొంతు మార్చి ఫాఇట్ చేశాడు బావుంది పెర్ఫార్మెన్స్ ఇద్దరిదీ. 

నెక్స్ట్ అరియానా.. తన టాస్క్ లో కూడా అఖిల్ ఓ అందమైన అమ్మాయ్ నన్ను చంపేస్తుంది అని అంటున్నాడు. 

మోనల్ నెక్స్ట్ చీపురు కట్టతో ప్రయత్నం చేసింది. మోనల్ హారికని పట్తుకుని కదల నివ్వకుండా జెర్మ్ కిల్ వేసింది. 
అఖిల్ నీకన్నా పెద్ద జెర్మ్ ని కాను అని అంతున్నాడు. ఫుల్ సినిమాటిక్ ఫైట్ సీక్వెన్స్ చేస్తుంది మోనల్ కాలు పైకెత్తి ఫాల్స్ కిక్స్ ఇస్తూ చేసింది.  

బిగ్ బాస్ సోహెల్ ని బెస్ట్ జెర్మ్ కిల్లర్ గా ప్రకటిస్తున్నాను అని అన్నాడు అభి. ఇదేదో అన్ ఫెయిర్ గా కనిపిస్తుందే అని అఖిల్ అంటే ఎందుకు స్వోర్డ్ ఫైట్ బాహుబలి టైప్ నాకు బాగా నచ్చింది అన్నాడు. 

అఖిల్ ని మళ్ళీ పులిహోర అని ఏడిపిస్తున్నారు. ఒకమ్మాయిని హగ్ చేస్కోడమ్ తప్పు ఏం కాదు అని అంటున్నాడు. మోనల్ మీరు ఛేంజ్ అయ్యారు అని అంటుంది. ఒకర్ని హగ్ చేస్తే ఓకే వేరే వేరే వాళ్ళతో చేస్తేనే ప్రాబ్లం అంటుంది. 
అఖిల్ సీరియస్ అయిపోయాడు. నేనిక్కడ ఏదో చేస్తున్నట్లు మాటి మాటికి అంటున్నావ్ అని అంతున్నాడు హద్దు ఉంటుంది భయ్ దేనికైనా అని అంటున్నాదు. ఎక్కువైంది అంటే ముందు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ అయింది. అది బాగా కనిపించదు. అందుకే చెప్తున్నా అని అంతుంది మోనల్. నాకనిపించింది నీకోసమే చెప్పాను అంతే.. 

నిన్ను తప్పు గా పోర్ట్రే చేయడం లేదు అని అంటుంది. నీ మేలు కోసమే ఛెప్తున్నా అని అంతుంది. నేను కూడా పొసెసివ్ విత్ మై ఫ్రెండ్ అని అందుకే చెప్తున్నా అని అంటుంది. నా లైఫ్ లో నేను వెయిట్ చేస్తున్న కదా ఆమె వస్తే నేను స్టిక్ టు దట్ పర్సన్ ఓన్లీ నువ్వు నన్ను ఇలా చేస్తున్నావ్ అని చెప్తున్నాడు అఖిల్. ఇద్దరికి బాగానే డిస్కషన్ అవుతుంది. చెప్పే పద్దతి ఉంటుంది అని అంటున్నాడు అఖిల్. మోనల్ నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు అంటుంది. నేను కూడా అదే చెప్పచ్చు కదా నువ్వు నాతో వచ్చి ఎందుకు కూర్చోడం లేదు అంటాడు. నేను వెయిటింగ్ ఫర్ యువర్ టైం అంటుంది. 

సోహెల్ అరియనాతో సాల్వ్ చేస్కోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమైంది అని అభి అఖిల్ ని అడిగితే వాడికి హెడ్డేక్ వస్తుంది దిమాక్ ఖరాబ్ అవుతుంది సాల్వ్ చేస్కుంటే ఐపోతుంది కదా అని చూస్తున్నాడు అని అంతున్నాడు. 

టాస్క్ లో కదా అని అన్నా అంతే అని ఒక మాట అనచ్చు కదా అని అడిగాడు.. అవినాష్ విషయం నీకు అనవసరం అతను లేనపుడు మాట్లాడం నాకు నచ్చలేదు. నువ్వు లేచి నా మీద రావడం నేను తీస్కో లేకపోయాను అని అంటుంది. 
సరే ఇంతకీ ఏమంటావ్ అసలు నేను రాంగా నువ్వు రాంగా అని అంటుంది అరియానా.. సోహెల్ ఏమో ఇద్దరిదీ రాంగే ఆ టాస్క్ లేకపోతే ఈ గొడవ అయ్యేదే కాదు అని అంటున్నాడు. 
నాకు పర్సనల్ గా ఐతే ఏం లేదు నేను టాస్క్ లో భాగంగానె చేశా అంటుంది.

అరియానా మళ్ళా సోహెల్ అండ్ అఖిల్ తో మాట్లాడుతుంది. కలిసి నామినేషన్ వేయడం నచ్చలేదు అని అంటుంది. 
తర్డ్ పర్సన్ దాంట్లో దూరద్దు అని చెప్పా కదా నీకు అని చెప్తున్నాడు. సోహెల్ మళ్ళా ట్రిప్ అయ్యాడు సరే నేను పోతా ఈ వీక్ పోనీ అని అరుచుకుంటూ అఖిల్ దగ్గర నుండి కూడా వెళ్ళిపోయాడు. 
అఖిల్ వస్తే కూడా రావద్దు రాకు నా దగ్గరికి అని అంటున్నాడు. రాత్రి కూడా ఒక్కడే పడుకుని ఏడుస్తున్నాడు. అరియానా విషయంలోనే ఇంకా టెన్షన్ పదుతున్నాడు. మొగాడు మీదకి వస్తే తీస్కోలేకపోయా అని ఏదేదో అంటుంది నన్నేం చేద్దామనుకుంటుందో నాకైతే అర్ధం కావట్లా అంటున్నాడు. ఫ్రెండ్ కాదా నిన్నటిదాకా కలిసి ఉన్నాం కదా అని అంటున్నాడు. ఏం కాదు అని అఖిల్ కూడా సముదాయిస్తున్నాడు. 
 
నైట్ ఎందుకో హారిక కూడా ఒక్కతే ఎంట్రన్స్ గేట్ దగ్గర కూర్చుని బాధపడుతున్నట్లు ఉంది. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


9, డిసెంబర్ 2020, బుధవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది రిఫర్ చేయవచ్చు.



ఈ రోజు కూడా నిన్నటి ఓపిక టాస్కే కంటిన్యూ చేశారు నిజానికి తొంభై నాలుగో రోజుకి వెళ్ళకుండా తొంభైమూడో రోజున జరిగిన టాస్కే చూపించారు ఈ రోజంతా. మేజర్ అరియానా అండ్ సోహెల్ మధ్య గొడవ చూపించారు. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకుండా గట్టిగట్టిగా అరుచుకున్నారు. సోహెల్ మీద మీదకి వెళ్ళడం కొన్ని చోట్ల బీప్ వేయాల్సిన మాటలు మాట్లాడడం నాక్కూడా అస్సలు నచ్చలేదు. అది ముమ్మాటికి తప్పే. ఎంత ఆడా మగ ఒకటే అన్నా కూడా ఆడపిల్లలకి ఆ లీనియన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక అబ్బాయ్ మీద కి అలా అరుచుకుంటూ వెళ్ళడం వేరు తిట్టడం వేరు అమ్మాయి మీదకి వెళ్ళడం వేరు. ఈ రొజు ఎపిసోడ్ సోహెల్ కి బాడ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయ్. 

అయితే ఈ గొడవలో మొత్తం సోహెల్ దే తప్పు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఎవరో ఒకళ్ళు తగ్గితే గొడవే అవదు, అరియానాది కూడా ఈక్వల్ గా తప్పు ఉంది. సోహెల్ కి కోపం ఇష్యూస్ ఉన్నాయని అందరికి తెలుసు. తను అంత రెచ్చగొట్టాల్సింది కాదు ఒక వేళ రెచ్చగొట్టినా కూడా టాస్క్ అయి సోహెల్ కుర్చీ దిగిన వెంటనే అరే ఇది టాస్క్ కోసం అలా కోపం తెచ్చేలా మాట్లాడాను అని ఒక మాట చెప్పినా సరిపోయేది. నిన్న  స్విమ్మింగ్ పూల్ లో బట్టలేస్తే కోపం అన్నావ్ ఈ రోజు నా డ్రస్ అండ్ బొమ్మ ఎలా వేశావ్ అనే మాటా హారిక అండ్ అరియానా ఇద్దరు అడిగారు కానీ హరిక తో ఎందుకు గొడవ అవలేదు అని కాస్త ఆలోచిస్తే ఎవరికైనా నేనేం చెప్తున్నానో అర్ధం అవుతుంది. 

అసలు బొమ్మ సెంటిమెంట్ అని అంటుంటే నీకు సెంటిమెంట్ ఎక్కడివి అని సోహెల్ అవినాష్ గురించి మాట్లాడినపుడు ట్రిప్ ఐన అరియానా నువ్వు ఆపరా వేస్ట్ మాటలన్నీ మాట్లాడతావ్ అని చాలా గట్టిగా అరిచింది అక్కడే సోహెల్ ట్రిప్ అవడం స్టార్ట్ అయ్యాడు. ఇక అక్కడ నుండి వేరే లెవెల్ కి వెళ్ళింది గొడవ. ఐనా తను చేస్తే టాస్క్ వేరె వాళ్ళు చేస్తే రివెంజ్ అనడం ఎంత వరకు కరెక్ట్ అండీ, అలా అనేసి బాడ్ చేస్తాను కానీ ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవకుండా కూర్చోవాలి అంటే ఎలా కుదురుతుంది. నేను స్ట్రాంగ్ నేను తోపు టాస్క్ అయ్యాక చూస్కుందాం అన్నావ్ కదా రా చూస్కుందాం అని తొడగొట్టేసి తీరా వచ్చాక మమ్మీ అని ఏడిస్తే ఎలా. ఇంకా ఈ గొడవ గురించి నా వ్యూస్ ముందు ముందు డీటేయిల్స్ లో చెప్తాను. 

ఈ రోజు అభి అండ్ అఖిల్ రెండు విష్యాల్లో నాకు చాలా నచ్చేశారు ఈ ఏదుపులు మొత్తుకోళ్ళ మధ్య అభి చేసిన టాస్కే ఫన్నీగా కాస్త నవ్వించింది. అండ్ తను అరియానాని కన్సోల్ తీరు బావుంది. అలాగే అవసరమైన చోట అఖిల్ సోహెల్ తరపున తీస్కున్న స్టాండ్ కూడా బావుంది సరైన జడ్జ్ లా రెండు వేపులా మాట్లాడాడు అనిపించింది. అలాగే నిన్న అంత గొడవ అయినా నిన్న ఏడుస్తున్నపుడు అరియానా తన దగ్గరకు రాకపోయినా కూడా మోనల్ ఏడుస్తున్న అరియానాకి వాటర్ తెచ్చివ్వడం అండ్ తనని కన్సోల్ చేయడానికి దగ్గర కూచోని హౌస్ లో అందరూ హర్ట్ అయి ఉన్నారు. అందరు ఒకటే ఫేజ్ లో ఉన్నారు పక్కన ఒక మనిషి ఉండాలి. మీ తప్పు కాదు ఇంకొకరి తప్పు కాదు సిట్యుయేషన్స్ అలా వచ్చాయ్ అని చెప్పడానికి ప్రయత్నించడం బావుంది.  


వివరాలలోకి వెళ్తే     
93 వ రోజు రాత్రి సోహెల్ కూర్చున్నాడు. నా బొమ్మ ఎందుకు స్విమ్మింగ్ పూల్ లో వేశావ్ అని అరియానా గోల చేస్తుంది. నువ్వే పూల్ లో వేయడం మంచిది కాదంటావ్. బాగా రెచ్చ గొడుతుంది సోహెల్ ని. బొమ్మ గురించి. టాస్క్ అయ్యాక చూస్కుందాం అని అంటుంది. నైట్ ఎనిమిదికి మోనల్ కూడా వచ్చేసింది భలే స్ట్రాంగ్ నువ్వు అని అంటుంది. అరియానా మరో పాయింట్ రైజ్ చేయాలనుకుంటున్నా అని నువ్వు మొన్న ఇక మీదట ఎమోషన్స్ లేవు ఆడాలి అన్నవ్ కదా నేను మొదటి నుండి అదే చేస్తున్నా అని అంటుంది. నీకు నచ్చినట్లు నేను ఉండను నాకు నచ్చినట్లు నువ్వు ఉండలేవ్ అని అసలు మాములు నస పెట్టడం లేదు. జీరో ఎక్స్ప్రెషన్ ఛేంజ్ ఏమాత్రం తొణక్కుండా కూర్చున్నాడు. అరియానా హారిక ఒక ఐ బ్రో కదిలింది అన్నారు కానీ అఖిల్ లేదు అని జీరో ఇచ్చాడు..

తర్వాత హారిక కూర్చుంది. 

సోహెల్ దిగ గానే అరియానాకి రిప్లై ఇవ్వడం మొదలు పెట్టాడు.  మోనల్ కూడా జవాబివ్వడం మొదలు పెట్టింది. మీరు చేస్తే టాస్క్ మేం చేస్తే రివెంజ్ అని బాగానే గట్టిగా మాట్లాడింది. 
సోహెల్ కూడా టాస్క్ అని మా మొహానికి అవి ఇవి పూసి గుడ్డు కొడితే ఏం లేదు కానీ మేం బొమ్మ ఒక డ్రస్ తడిపితే వచ్చిందా అని అంటున్నాడు. 
సోహెల్ మోనల్ మైక్ ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. ఈ డిస్కషన్ హైపర్ లో పడి అది గుర్తురావడం లేదు వెతుకుతున్నాడు. కాసేపట్కి వెతికి ఇచ్చాడు.
సోహెల్ అరియానా ఇద్దరి డిస్కషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. నేను నీ లాగ క్రూరంగా ఆడలేదు అని చెప్తున్నాడు.  
మనిషి మీద లేదు నీకు ఎమోషన్ అవినాష్ నిన్ను ఎంత బాగా చూస్కున్నాడు అవినాష్ ని ఏడిపించావ్ చింటూ గురించి అన్నాడు. జొరం వచ్చినపుడు చింటూ చూసుకోలేదు అని చెప్తున్నాడు. వేరే వాళ్ళ మాటర్ లో నువ్వెందుకు మాట్లాడతావ్ అని మెల్లగానే మొదలు పెట్టింది కానీ నువ్వు ఆపు ఆపు అనుకుంటుంటే ఇక అరియానా ట్రిగ్గర్ ఐ నువ్వు ఆపరా వేస్ట్ మాటలన్నీ మాట్లాడతావ్ అనేసింది. దాంతో నువ్వు ముయ్ అన్నాడు సోహెల్. ఇక అలాగే అలాగె హైపర్ అయిపోయాడు.  
తొక్కలో బొమ్మని నీళ్ళలో వేసినందుకు అరుస్తున్నావ్ అని అంటున్నాడు. నీ క్రూరత్వం ఎవరికి తెలీదు అని కోపంలో గట్టిగా అరుస్తూ ఏడ్చేశాడు కూడా. అరియానా క్రూరత్వం అని హైలైట్ చేస్తున్నాడు. అరవకు అరవకు అని మధ్యలో ఎంతమంది వచ్చి అడ్డుపడినా ఆగడం లేదు. అభి అఖిల్ కలిసి వాష్ రూం లోకి తీస్కెళ్ళారు తనని.  

తను ఆడినది టాస్క్ అని అంటుంది బానే ఉంది మరి ఈ రోజు మోనల్ అండ్ సోహెల్ ఆడినది కూడా టాస్కే కదా దీన్ని రివెంజ్ అని ఎందుకు కలర్ ఇస్తుంది అందుకె కదా అంత కోపం వచ్చింది సోహెల్ కి కూడా. 

ఆడమని టాస్క్ ఇచ్చారు నాకు ఆడద్దా నేను తీస్కోలేకపోతున్నా తన బిహేవియర్ ని అని ఏడ్చేస్తుంది. 

నేను కెప్టెన్సీ చేసినా టాస్క్ అడినా వీళ్లకి ప్రాబ్లం ఇంకెలా ఆడను అని అడుగుతుంది. 
కిందపడిపోయి ఏడ్చేస్తుంది. నా వల్ల కావట్లేదు అంత హృదయం లేకపోతే నేను ఎందుకున్నాను.. అమ్మా.. నా వల్ల కావట్లేదు అని అంటూ ఏడ్చేస్తుంది. నామీద ఎలా ఎగబడుతున్నాడు. స్టార్టింగ్ నుండి చెప్తున్నా ఎగ్రెస్సివ్ బిహేవియర్ తట్టుకోలేకపోతున్నాను అని ఏడ్చేస్తుంది. వాళ్ళకి బొమ్మ అయుండచ్చు కానీ నా ఎమోషన్ అది అని ఏడ్చేస్తుంది. 

అరియానా ఏడుస్తుంటే మోనల్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. 
తర్వాత మోనల్ అరియానా పక్కన కూర్చుంటుంటే నన్ను కాసేపు వదిలేయ్ కావాలంటే రేపు మాట్లాడతా అని అంది. తనే వెళ్ళి వేరే దగ్గర కూర్చుంది. 

నీ తప్పు కాదు నా తప్పు కాదు కానీ ఎవ్విరిబడీ ఈజ్ హర్ట్ హియర్ అని చెప్తుంది మోనల్. 

అభి హారికని మాములుగా నవ్వించలేదు.

అభి కూర్చున్నాడు. వరసబెట్టి నవ్వించేశారు ఉండు కాదు అని నేనింకా కూర్చో లేదు అని కిందకి దిగేశాడు. ఒక సారి కూర్చుని కిందకి దిగితే కుదరదు అని హౌస్మేట్స్ అందరు ఒప్పుకోలేదు బిగ్ బాస్ కి అప్పగించేశారు చెప్పండి బిగ్ బాస్ అని కానీ కూర్చోని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. అందరూ మాములుగా గోల చేయలేదు కష్టపడి కంట్రోల్ చేస్కుంటున్నాడు.. అందర్ని నవ్వించావ్ చూడు అది అభిరాజా అని అంటుంది హారిక. బిగ్ బాస్ ఒప్పుకున్నట్లున్నాడు కంటిన్యూ చేస్తున్నాడు. 

పిల్లి అనుకుంటున్నావా నువ్వు కళ్ళు మూసుకుని నన్నెవరు చూడాట్లేదు అనుకుంటుంది అంటే గట్టిగా నవ్వేశాడు. ఇరవై ఏడు సార్లు ఛేంజ్ చేశాడట  

అభి కుర్చీ దిగిన వెంటనే హారిక వెంట పడ్డాడు. నన్ను నువ్వు నిన్ను నేను తప్ప ఇంకెవరు నవ్వించలేరు అని అంటుంది హారిక. 
అరియానా, హారిక నాలుగు, మోనల్ పది, అభి ఇరవై ఏడు, సోహెల్ జీరో ఛేంజెస్. 

సోహెల్ కి అప్పీల్ ఛాన్స్ వచ్చింది. 

పద్నాలుగో వారం బాడ్ కన్వర్సేషన్ అని ఫీలవుతున్నాడు సోహెల్ కూడా 

సోహెల్ నేనిక్కడ నటించలేదు కోపం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడితే సారీ నేను ఏదీ దాచుకోలేదు కోపమొచ్చినా నవ్వొచ్చినా నాలా నేనున్నాను అని చెప్పాడు. విన్నింగ్ చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. అప్పీల్ చాలా బావుంది జెన్యూన్ గా ఉంది. 

అరియానా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది అభి కన్సోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు నువ్వు అరియానా అని చెప్తున్నాడు. ఒక అబ్బాయ్ నా మీదకి అంత ఎగ్రెస్సివ్ గా రావడం ఫస్ట్ టైం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అనేబుల్ టు టేక్ ఇట్ అని అంటుంది. 
అఖిల్ నువ్వు ముద్ర వేయకు వాడి మీద నువ్వు కూడా అగ్రెస్సివ్ గానే మాట్లాడావ్ అని అంటున్నాడు. 

సడన్ గా ఎందుకు అలా పడిపోతున్నావ్ అని అడుగుతున్నాడు అఖిల్. 
అది నా ఇన్సల్ట్ నా పెయిన్ అది అని అంటుంది. ఏడుపు అంతా మర్చిపోయి మళ్ళీ అఖిల్ తో వాదిస్తుంది సీరియస్ గా. నేను అంత ముద్ర వేయడం లేదు అది నా బిహేవియర్ గాదు అంత తెలివి లేదు అని అంటుంది. 

సోహెల్ ని అప్పీల్ తర్వాత మైక్ తీస్కెళ్ళి అక్కడ పెట్టండి అన్నారు మీతో మాట్లాడచ్చా అని అడిగాడు. అపుడు నాకు ఈ రోజు జరిగిన సంఘటన గురించి చెప్తున్నా నేను చేసింది కూడా టాస్కే. అరియానాతో తీస్కోలేకపోతున్నాను. కోపం మైనస్ ఊరికే రాదు ఆవిడ బొమ్మ ఎమోషన్ అంటే ఆర్టిస్ట్ కి ఫేస్ ఎమోషన్ కాదా. ఆమెకి చిన్న ప్రాబ్లం క్రియేట్ చేసినా టక్కున చెప్పి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నాకు టైటిల్ కొట్టడం చాలా ఇంపార్టెంట్ దీని వల్ల ఓట్లు అటూ ఇటూ అవుతయ్యేమో అని చెప్తున్నా అన్నాడు.    

బిగ్ బాస్ ఎంకరేజింగ్ గా మాట్లాడాడు. ముందు ముందు ఇంకా కఠినంగా ఉంటుంది ఆట మీరు బాగా ఆడుతున్నారు మీపై మీరు నమ్మకం ఉంచి మీ లక్ష్యం వైపు దూసుకు వెళ్లండి అని చెప్పారు. ఆ మాటలు విన్నాక తను కూడా ఏడ్చేశాడు చేయ్యాలని చేయలేదు కానీ అలా ఐపోతుంది అని అంటున్నాదు. కోపం ఒక్కటే నెగటివ్. నేనెంతలా బాధపడుతున్నానో నాకు తెలుసు అని అంటున్నాడు. బాగా ఏడ్చేశాడు తను కూడా. నాకేం అర్ధం కాటం లేదు. నువ్వు ఓడిపోతే మాత్రం నేను నీతో మాట్లాడను అని చెప్పాడట అఖిల్ ఆ ఒక్క మాటతోనే నేను ఎంత నవ్వొచ్చినా అక్కడే కూర్చున్నా కదలకుండా అని చెప్తున్నాడు. అరియానా ఇది టాస్క్ అందుకే అలా అన్నా అని ఒక్క మాట చెప్పచ్చు కదా.. నేను కూర్చున్నపుడు టాపిక్ తీయకుండా ముందు చాలా టైం ఉంది అపుడు చెప్పచ్చు కదా అని ఏడుస్తున్నాడు.
 
అంత బాధ లోనూ ఆమెని కూడా ఏమీ అనకండి బిగ్ బాస్ అని అంటున్నాడు. ఇదేం కామెడీ సోహెల్ అని నేను  నవ్వుకున్నాను. మీ ఆటను ఇలాగే కొనసాగిస్తూ మీ లక్శ్యం వైపు కొనసాగండి అన్నారు బిగ్ బాస్. 

అర్ధ రాత్రి సోహెల్ అఖిల్ తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడద్దన్నావ్ కదా నాకు ఎవరితో మాట్లాడాలో అర్ధం కాలేదు నాకు షేర్ చేయాలని అనిపిస్తుంది అప్పటికప్పుడే అని చెప్పాడు. అఖిల్ దగ్గర కూడా ఏడ్చేశాడు హగ్ చేస్కుని ఊర్కో అని కూల్ చేశాడు. 

రేపటి ప్రోమోలో మూడవ టాస్క్ ఏకాగ్రత టైం లెక్కిస్తూ ఒక పని చేయాలనుకుంటాను. తను టైమ్ లెక్కపెట్టనివ్వకుండా మిగిలిన ఇంటి సభ్యులు డిస్ట్రబ్ చేయాలి.
సోహెల్ ని బాగా నచ్చిన పని అంటే నిద్రపోవడం అంట.  
అభిని శివగామి ఎవరు ఇంట్లో అని అడిగితే తనలోని అందం మోనల్ లో తనలోని ప్రేమ హారిక లో టెర్రర్ అరియానాలో ఉన్నాయ్ అని చెప్తున్నాడు. 
  
మోనల్ పాపని మౌంట్ ఎవరెస్ట్ ఏ కంట్రీలో ఉంది అని అడిగితే చైనా అండ్ ఇండియా బోర్డర్ లో ఉంది అని చెప్పింది అభి ఒక చిత్రమైన ఎక్స్పెషన్ తో కిందపడిపోయాడు 😂 నేపాల్ ఇండియాలోని ఓ స్టేట్ అనుకుందేమో మా మోనల్ పాపం. నాకైతే దీక్ష లెక్కల క్లాస్ గుర్తొచ్చింది 😉 

మొత్తం మీద రెండ్రోజులు ఏడుపులు మొత్తుకోళ్ళు తర్వాత కాస్త సరదాగా చేసినట్లున్నారు రేపటి టాస్క్. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

 

8, డిసెంబర్ 2020, మంగళవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రొజు ఎపిసోడ్ లో కూడా నిన్నటి టాస్క్ కంటిన్యూయేషనే చూపించారు. అరియానా అండ్ మోనల్ రూలింగ్ చూపించారు. అరియానా మంచి పాజిటివిటీ ఇచ్చే టాస్క్ ఇచ్చింది, చాలా బావుంది. మోనల్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టాస్క్ ఇచ్చింది. అది కూడా బావుంది. మోనల్ ఇది ఒక చిన్న సైజ్ కెప్టెన్సీ లా ఫీలైంది. 

ఇక నిన్నటి టాస్క్ అధికారమైతే ఈ రోజు టాస్క్ ఓపిక. ఒక కుర్చీలో ముఖకవళికలు మారకుండా కూర్చుని ఉండాలి మిగిలిన హౌస్మేట్స్ మార్చడానికి ప్రయత్నించాలి. అరియానా, మోనల్, సోహెల్ చేశారీ రోజు సోహెల్ జీరో, అరియానా ఫోర్, మోనల్ టెన్ టైంస్ మార్చారు. ఈ టాస్క్ లో అరియానాపై మోనల్ బిహేవియర్ నచ్చక తను గట్టిగా మాట్లాడింది మోనల్ టర్న్ లో దాంతో మోనల్ బ్రేక్ డౌన్ అయి ఫిట్స్ వచ్చినట్లుగా గుక్కపట్టి చాలా గట్టిగా ఏడ్చేసింది బెడ్ రూం లో. బిగ్ బాస్ కన్ఫేషన్ రూం కి పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చాక నార్మల్ అయింది. ఇదంతా జరుగుతున్నపుడు సోహెల్ చైర్ పై ఉండడంతో తర్వాత తను అరియానాతో గొడవపడినట్లున్నాడు. రేపటి ప్రోమో లో ఇదే ఉంది.  

 
వివరాలలోకి వెళ్తే 92 వ రోజు రూలర్ ఐన అరియానా.. ఇంటి సభ్యులని ఒకొ వస్తువు తెచ్చి వాళ్ళకి మీకున్న బెస్ట్ మెమొరీ చెప్పి వాళ్ళకి గుర్తుగా ఇవ్వాలి అన్నారు.  

సోహెల్ - అభి కి సస్పెండర్స్ ఇచ్చాడు నీకు బాగా సూట్ అయిందని. 
హారికకి సేవ్ అయిన గ్రీన్ డాగర్ ఇచ్చాడు. 
మోనల్ కి రెడ్ టీ షర్ట్ ఇచ్చాడు. ఒక సిస్టర్ లా. 
అరియానాకి పెర్ఫ్యూమ్ ఇచ్చాడు. 
అఖిల్ కి జాకెట్ ఇచ్చాడు సారీ చెప్పాడు సటకాయించి పోద్ది కోపం అని. జాకెట్స్ చాలా ఇష్టం అన్నాడు. మంత్రి గారు ఆయనే హగ్ ఇస్తే బావుంటుంది అని అంటున్నాడు. సరే దా అని అఖిల్ హగ్ ఇచ్చేశాడు. ఇద్దరి మాధ్య టెన్షన్ సాల్వ్ అయింది. 

మోనల్ కి అధికారం వచ్చింది. నాగురించి ఒక మంచి విషయం ఒక బాడ్ విషయం చెపు అని అడిగింది అఖిల్ ని. 
మంచేమో ఒక మనిషి నిన్ను ఎంత హేట్ ఛేస్తున్నా నువ్వు మాత్రం ప్రేమిస్తూనే ఉంటావ్ పట్టించుకోవు అది గుడ్ అన్నాడు
అలాగే బాడ్ ఏమో 
హ్యాపినెస్ లో నువ్వు అన్నిరకాల ప్రామిస్ లు ఇచ్చేస్తావ్ క్విక్ డెసిషన్ అన్నాడు  
ఇప్పటి వరకు నాకు చెప్పనిది చెప్పు అంది. 
నాతో ఎలా ఉన్నావో అలా వేరే అబ్బాయ్ తో అలా ఉంటే నేనైతే భరించలేను బెస్టీ అంటే బెస్టీ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే అన్నాడు. 

ఒక అమ్మాయి అబ్బాయితో ఫ్లర్ట్ చేస్తుంది కానీ చెప్పలేదు.. పార్టీ కోసం కన్విన్స్  చేయాలి. అభి అమ్మాయి సోహెల్ అబ్బాయ్. 
అభి అమ్మాయిలా గొంతు మార్చేసి మాట్లాడుతూ సరదాగా చేశాడు. 
అరియానా బాగా చేసింది బండ్ల గణేష్ డైలాగ్ ఆడపిల్లలంటే ఆట బొమ్మలనుకుంటున్నారా డైలాగ్ చెప్పింది.  
మోనల్ చాలా హాపీ ఫీలైంది. ఇది నా చిన్ని కెప్టెన్సీ అని చెప్పింది. 

ఒక గోల్డ్ మైక్ పెట్టి ఉంది. దాని ద్వారా ప్రేక్షకులకి అపీల్ చేస్కోవచ్చు. ఈ టాస్క్ ద్వారా ఒక సభ్యునికి మాత్రమే అపీల్ చేస్కునే అవకాశం ఉంటుంది.
అందరు కలిసి అరియానాని బెస్ట్ రూలర్ గా సెలెక్ట్ చేసుకున్నారు.

అరియానా అప్పీల్ బావుంది మీ ప్రేమ కావాలి ఈ ఒక్క మెట్టు ఎక్కించండి అని అడిగింది. ఎలా మాట్లాడాలో తెలీట్లేదు అంది. ప్లీజ్ ఈ సహాయం చేయండి అని ఎమోషనల్ గా అడిగింది.

రాత్రి మోనల్ ఐ మిస్ యూ క్వీన్ అని అంటుంది. నాకు ఒక ఇన్విజిబుల్ క్రౌన్ ఉంది అని మాట్లాడుకుంటుంది. మనసులో ఎంత సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి అని అనుకుంటుంది. అఖిల్ వచ్చి ఏమైంది అని అడిగి నాకు నువ్వు ఉన్నావ్ హారిక ఉన్నావ్ కానీ ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు అందుకే హారిక పేరు చెప్పా అని అన్నాదు. కానీ తను ఇది ఫస్ట్ కాదు ప్రతి సారి చూశ్తున్నా కదా అని అంది. అఖిల్ తన పేరు తీస్కోనందుకు ఫీలైనట్లుంది మోనల్. 

సోహెల్ ఒక్కడే కూచున్నాడు. మోనల్ వచ్చి మాట్లాడుతుంటే ఏమైంది అని నీకు తెలుసు కదా ఇక్కడ సెట్ చేస్కున్నాం మళ్ళీ అక్కడ మొహం అలా పెట్టుకుని కూర్చుంటే ఎలా అంటే నువ్వు వెళ్ళి అఖిల్ నే నాతో మాట్లాడమను నన్ను ఎందుకు పిలుస్తున్నావ్ అని నేనే ప్రతి సారి ఎందుకు వెళ్ళి మాట్లాడాలి అని అంటున్నాడు. 
మోనల్ నీకేం కావాలి చెప్పు పాట పాడుతుంది చాలా బాగా పాడింది. 
అర్ధ రాత్రి వెళ్ళి అఖిలే హగ్ ఇచ్చాడు సోహెల్ కి. హీ వజ్ హాపీ.. ఇదేదో అప్పుడే ఇవ్వచ్చు కదా అంటూ కలిసి పోయాడు. 

రాత్రి ఆభి హారిక బెడ్ మీద ఒక నోట్ "స్పెండ్ టైమ్ విత్ మి" అని మెసేజ్ రాశాడు నాప్ కిన్ మీద ఐ లైనర్ తో రాసినట్లున్నాడు. హారిక వజ్ కూల్ సో క్యూట్ అని హగ్ ఇచ్చింది. 


ఇక 92 వ రోజు "ఓపిక" రెండవ టాస్క్. 
ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా కూర్చోవాలి ఇంటి సభ్యులు ఏవిధంగా ఐనా ఎక్స్పెషన్ మార్చేలా చేయచ్చు. నాలుగు ఎమోజీస్ ఉన్నాయ్ వాటిలో ఏ లైట్ వెలిగితే ఆ ఎక్స్ప్రెషన్ తెప్పించాలి. 
అఖిల్ కి ఎన్నిసార్లు మార్చారో చెప్పాలి. అది నోట్ చేయాలి.

అరియానా ఫస్ట్ కూర్చుంది.  
సోహెల్ చాలా ట్రై చేస్తున్నాడు కానీ అరియానా అసలేం మార్చకుండా కూర్చుంది.  
చింటూని తీస్కొచ్చి కూడా అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నో యూజ్. 
 
అభి మళ్ళీ కాస్త బుర్ర పెట్టి ఒక ప్లేట్ అండ్ గంటె తీస్కొచ్చి వెనక నుండి సడన్ గా చెవుదగ్గర సౌండ్ చేశాడు. భయపడింది. ఒక సారి మారింది ఎక్స్ప్రెషన్. 
తన ఫేవరెట్ డ్రస్ చించుతానని ట్రై చేశాడు కానీ చించలేను ఆపేశాడు. 
తన ఫేవరెట్ కప్ ఆర్ వి. పగలగొట్టేశాడు. ఏం చేయవని తెలుసు అని అంటుంటే కోపమొచ్చి పగలగొట్టాడు (కానీ అది కాదని చెప్పాడు తర్వాత). 
చింటూ బొమ్మని చించేస్తా అని చెప్పాదు కానీ చేయలేదు. 
మోనల్ చింటూ బొమ్మని బయటికి విసిరేస్తా అని విసిరేసింది. అది బయటికి పోకుండా లోపల కాకుండా మధ్యలో ఆగిపోయింది. 
మొత్తం మీద నాలుగు మాత్రమే ఛేంజెస్ వచ్చాయి. 

నెక్స్ట్ మోనల్ కూర్చుంది. 
అరియానా అవినాష్ ని తన్నినపుడు ఎక్స్ప్రెషన్ గురించి అండ్ మోనల్ పర్సనల్ గా తీస్కున్నావ్ అని చాలా మాట్లాడింది. 
అభి సేం ట్రిక్ వాడాడు. సౌండ్. ఐదు సార్లు మార్చేసింది. 
ఏడ్పించడానికి దగ్గరికి వెళ్ళి అరిచాడు గట్టిగా సోహెల్.. ఐనా ఇలా సీరియస్ గా చూసింది తప్ప ఏం మాట్లాడలేదు సైలెంట్ గా ఉంది. 
బొమ్మ బయట పడేసినదాని గురించి అరియానా బాగా కవ్వించేలా మాట్లాడింది. నీదంతా యాక్టింగ్ అని చెప్తుంది. అఖిల్ బొమ్మని పై నుంచి తీసేశాడు.     
మోనల్ ది ఐపోయింది. మొత్తం టెన్ టైమ్స్ మార్చింది ఎక్స్ప్రెషన్స్. 

త్రో ఈజ్ నాట్ గుడ్ నాకు తెలుసు అని ఏడుస్తుంది ఒక్కతే లోపల కూర్చుని. ఎంత నెగటివ్ ఎంత నెగటివ్ అని జస్ట్ ఐస్ పాకెట్ వేస్తే బొమ్మ వేస్తే ఇంత నెగటివ్ గేం ఆడితే ప్రాబ్లం ఆడకపోతే ప్రాబ్లం అని అంటుంది. 
కెమేరాతో రిక్వెస్ట్ చేస్తుంది నా వాల్ల కావట్లేదు బిగ్ బాస్ అని.. హార్ట్ లో మైండ్ లో చాలా అవుతుంది అని చెప్తుంది. సోఫాలో పడుకుని రెండు చెవులు మూసుకుని ఏడ్చేస్తుంది. గుక్కపట్టి ఏడ్చేస్తుంది చాలా.. 

అరియానా దేనికో లోపలికి వచ్చింది చూసి టెన్షన్ పడి బయటికి పరిగెట్టి మిగిలిన వాళ్ళతో చెప్పింది. హారిక వచ్చింది కానీ తను కూడా కంట్రోల్ చేయలేకపోయింది. చాలా డిఫరెంట్ గా ఏడుస్తుంది బిగ్ బాస్ అని అరియానా రిక్వెస్ట్ చేసింది. కన్ఫెషన్ రూం కి పిలిచారు. అక్కడ ఎంత ప్రూవ్ చేస్కున్నా నా వల్ల కావట్లేదు టాస్క్ లో నేను ఎంత పెర్ఫార్మ్ చేసినా రిజల్ట్ రావడం లేదు బిగ్ బాస్ అని అంటుంది. ప్రతి ఎలిమినేషన్ లోనూ నన్ను యూ డోంట్ డిజర్వ్ దిస్ అన్నట్లే చూస్తున్నారు అని అంటు ఏడ్చేస్తుంది. 
 
బిగ్ బాస్ మిమ్మల్ని అందరు ఆదరించడం వలనే ఇక్కడి దాకా వచ్చారు అని మర్చిపోకండి.  ఉత్తమ ఆటను కనపరుస్తున్నారు సమర్ధంగా ఇక్కడికి వచ్చారు మీరు మీ విశ్వాసాన్ని కోల్పోకుండా లక్శ్యం వైపు దూసుకెళ్ళండి అని కౌన్సిలింగ్ ఇచ్చారు. 

మోనల్ తర్వాత సోహెల్ కూర్చున్నాడు కానీ తన టాస్క్ కన్నా మోనల్ అరియానా ఇష్యూ హైలైట్ అవడంతో తనని దించడానికి చేసిన ప్రయత్నాలు కనిపించలేదు. 

రేపు ప్రోమోలో బోర్డ్ మీద సోహెల్ రియాక్షన్ ఛేంజెస్ జీరో ఉన్నాయ్. అరియానా అండ్ సోహెల్ మోనల్ విషయమై గొడవపడినట్లున్నారు. మనిషికి వాల్యూ ఇవ్వడం తెలియదు ఒక బొమ్మకి వాల్యూ ఇస్తా అంటావ్ అని కోప్పడుతున్నాడు సోహెల్. అరియానా కూడా ఏ మాత్రం తగ్గకుండా అరుస్తుంది సోహెల్ మీద. వేస్ట్ మాటలన్నీ మాట్లాడతావ్ అని అరిచేసరికి సోహెల్ కూడా ట్రిప్ ఐనట్లున్నాడు బాగానే అరిచాడు. అంతా అరిచేసి నాకంత హృదయం లేకపోతే నేనెందుకు వస్తాను అని ఏడ్చేస్తూ కిందపడిపోయింది. 

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts