29, అక్టోబర్ 2020, గురువారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. అలాగే నా రఫ్ నోట్స్ కింది ఇస్తున్నాను. ఆసక్తి ఉన్నవారి క్విక్ పాయింట్స్ కోసం అది చూడగలరు. 



నిన్నటి టాస్క్ లోనే మధ్యలో బ్రేక్ తీస్కున్న నోయల్ పాదం నొప్పి బాగా గుచ్చుతుంది అస్సలు తీస్కోలేకపోతున్నాను అని చెప్పాడు అభితో అండ్ బిగ్ బాస్ తో కూడా నా గురించి ఒక డెసిషన్ తీస్కోండి బిగ్ బాస్ అని అడిగాను అని కూడా చెప్పాడు. ఈ రోజు ఆ డెసిషన్ తీస్కున్నాడు బిగ్ బాస్. మెరుగైన చికిత్స కోసం ఇంటినుండి బయటికి పంపించమని డాక్టర్స్ సలహా ఇచ్చారుట. అందుకే నోయల్ ట్రీట్మెంట్ కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఐతే చివర్లో త్వరలో పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారని అనుకుంటున్నాను అంటూ బిగ్ బాస్ హోప్ ఇచ్చాడు. బహుశా నూతన్ నాయుడులా ఓ వారం ట్రీట్మెంట్ తీస్కుని హెల్త్ సెట్ అవగానే తిరిగి వచ్చేస్తాడేమో

మొదటి సారి బిగ్ బాస్ కు నోయల్ వస్తున్నాడు అని విన్నపుడు ఆహా విన్నింగ్ మెటీరియల్ రా ఇతను జనంలో పాపులారిటీకి రాహుల్ తో ఫ్రెండ్శిప్ వల్ల గేం పట్ల అవగాహనకు లోటుండదు బయట కూడా సపోర్ట్ బాగా దొరకచ్చు. గెలిచే ఆవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్ అని అనుకున్నాను నేను. అయితే మొదటి వారం తర్వాత బాగా మెత్త బడిపోయి ఆటల్లో యాక్టివ్ గా పాల్గోలేక ఇబ్బంది పడడం గమనించాక ఏమైందా అనుకున్నాం తప్ప అతని హెల్త్ గురించి పూర్తి అవగాహన ఐతే ఎవరికి లేదు. ఏదైనా అతను ఈ కారణంతో వెళ్ళిపోతే మాత్రం బాధ పడాల్సిన విషయమే అనిపిస్తుంది. విష్ యూ ఎ స్పీడీ రికవరీ నోయల్. త్వరగా వచ్చేసి యాక్టివ్ గా ఆటలో పాల్గొనండి. 
   
ఇతర ముఖ్యమైన విషయాల్లో అరియానా కొత్త కెప్టెన్ అయింది. మోనల్ ని రేషన్ మానేజర్ గా ఎన్నుకుంది. అమ్మ గారి తన ఇరిటేటింగ్ బిహేవియర్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. ఎపుడు వెళ్తారురా ఈయన అనిపించింది. 

వివరాలలోకి వెళ్తే 52 వ రోజు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఆరోగ్య సమస్య వలన ఒత్తిడికి గురౌతున్నారు అని చూపించారు. చాలా బాధ పడుతున్నాడు. రాత్రి మూడు గంటలకు పాట పాడుకుంటున్నాడు. సాగేనా నా పయనం ఆగేనా ఈ రాత్రి ఎట్లా గడిచేనా అనుకుంటూ. 

53 వ రోజు ఇంట్లో పదకొండు మంది ఉన్నారు. ఉదయం శంకర్ దాదా ఎమ్బిబిఎస్ లో "ఏ జిల్లా ఏజిల్లా ఓ పిల్లా నీదీ ఏ జిల్లా" పాటతో మేల్కొలిపారు. అందరు డాన్స్ బాగా వేశారు క్లాసికల్ డాన్స్ స్టెప్స్ తో సహా. 

అరియానా మెహబూబ్ మధ్య డిస్కషన్ రేషన్ మానేజర్ గా మెహబూబ్ కొన్ని వదిలేశారు అవి పాడైపోతున్నాయ్ అని చెప్తుంది. నువ్వు ఇంకొన్ని వాడాల్సింది అని చెప్తుంది. 

అభి నోయల్ హారిక మధ్య డిస్కషన్ మోనల్ ఒంటెలా నడుస్తుందిట అభి చెప్తున్నాడు పెద్ద పెద్ద అంగలు వేస్తూ. 

బిగ్ బాస్ కాప్టెన్సీ టాస్క్ ఆడవాళ్ళకు మాత్రమే వాళ్ళంతా పోటీ దారులు. గార్డెన్ ఏరియాలో యాపిల్ చెట్టు ఉంది చెట్టుకి ఉన్న యాపిల్స్ మీద పోటీ దారుల ఫోటోస్ ఉన్నాయ్. బాక్స్ లో కత్తి ఉంది తాళం విడిగా ఉంది. అబ్బాయిలు డ్రమ్ మోగినపుడు తాళం తీస్కోవాలి. అమ్మాయిలు అబ్బాయిలని ఆ తాళాన్ని తమకే ఎందుకు ఇవ్వాలి కెప్టెన్ అర్హత ఏంటి ఇమ్యునిటి ఎందుకు అని కన్విన్స్ చేయాలి.


తాళమ్ దొరికిన సభ్యురాలు కత్తితో యాపిల్ కోసి ముక్కలు చేసి ఆ సభ్యురాలు ఎందుకు కాప్టెన్ కాకూడదో చెప్పాలి. 
ఒక సారి తాళం దొరికిన సభ్యుడు మళ్ళీ ఆడకూడదు నోయల్ ఆరోగ్య రీత్యా ఆడనవసరం లేదు. 
చివరిగా చెట్టుపై మిగిలిన సభ్యురాలు ఇంటికి కెప్టెన్ అవుతారు. 

ఫస్ట్ టైమ్ అఖిల్ చేతికి తాళం వచ్చింది. 
లాస్య నేను ఇంటిని బాగా చూస్కోగలను. ప్రతి టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను రూల్స్ ఎప్పుడూ బ్రేక్ చేయలేదు. 
మోనల్ ఆరువారాలు నామినేటెడ్ ఒక్కసారి కూడా నాకు కెప్టెన్సీ రాలేదు. ఇపుడు అవసరం అనుకుంటున్నా అని
హారిక చాలా సార్లు వెళ్ళి ఓడిపోయాను అది ఎలా ఉంటుందో నీకు తెలుసు సో ఈ వీక్ టాస్క్ ప్రకారం నాకు నామినేషన్స్ ఎక్కువ పడుతాయ్ అని అనుకుంటున్నా సో ఇమ్యునిటీ అవసరం. ఇపుడు గెలిస్తే మీరంతా కలిసి గెలిపించినత్లుంటుంది. 
అరియానా టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను  హౌస్ కేప్టెన్ అవడం అనేది నా కల. అమ్మాయిలలో నామినేషన్స్ కి ఎక్కువ ఓట్లు పడేది నాకే అందుకె ఇమ్యునిటీ అవసరం అనుకుంటున్నా. 

మోనల్ కి ఇద్దామనుకుంటున్నాను. కెప్టెన్సీ టాస్క్ లో చాలా సార్లు తను నాకు హెల్ప్ చేసింది. అందుకే నేను తనకి సపోర్ట్ చేద్దామనుకుంటున్నాను. 
మోనల్ హారికకి హౌస్ లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీక్ సేఫ్ ఉన్నారు. రెలెటివ్ గా మీరు మా అందరికన్నా బెటర్ సపోర్ట్ ఉంది. నోయల్ అభి లాస్య ఉన్నారు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అని అంది. నాకు కెప్టెన్సీ ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పింది. హారిక అది సపోర్ట్ సిస్టం అని చెప్పకండి మీరు ఇంకేం చెప్పినా ఓకే. మిగతా వాళ్ళు నామినేట్ చేయడం లేదు అంటే నేను వాళ్ళకి ట్రబుల్ మేకర్ ని కాలేదు అని చెప్పింది అస్సలు నచ్చలేదు అది ప్రాపర్ రీజన్ కాదు అని చాలా ఇరిటేట్ అయింది. 

రెండో సారి మెహబూబ్ కి దొరికింది. 
అరియాన కెప్టెన్ అంటే నెక్స్ట్ బిగ్ బాస్ ఇమ్యునిటి చాలా అవసరం నాకు. 
మోనల్ కేప్టెన్సీ అంటే పెద్ద రెస్పన్సైబిలిటీ ఇమ్యునిటీ కూడా నాకు అవస్రం ఇంటిని బాగా చూసుకుంటాను అని చెప్పింది. 
లాస్య సేం రీజన్స్ నేను ఇంటిని బాగా చూసుకుంటాను ఇమ్య్నిటీ కూడా అవసరం అందుకే నాకు కావాలి అని. 
అరియానా కి ఇచ్చాడు. తను నాకు హెల్ప్ చేసింది. సో నేను ఇపుడు తనకి ఇమ్యునిటీ ఇద్దామనుకుంటున్నాను వచ్చేవారమ్ ఐయాం పేయింగ్ ఇట్ బాక్ అని ఇచ్చాడు. 
అరియానా లాస్యని గేం లోనిండి తీసేసింది మీరు ఆల్రెడీ ఫస్ట్ కెప్టెన్ అయ్యారు ప్రతి ఒక్కరు ఎక్స్ప్రీరియన్స్ చేయాలి అని మిమ్మల్ని తొలిగిస్తున్నా అని చెప్పింది. 

మూడో సారి మాస్టర్ చేతికి వచ్చింది కీ.

మోనల్ కి ముందె సారీ చెప్పాడు. 
అరియానా అమ్మా సీజన్ ఫోర్ కి కెప్టెన్ అవ్వాలనుకుంటున్నా నీకు తెలుసు. 
మోనల్ ఇమ్యునిటీ అండ్ కెప్టెన్సీ రెండు పెద్ద విషయాలు ఇద్దరికీ అవసరమే అది అని చెప్పింది. 
అమ్మ గారు మీరిద్దరూ నాకు రెండు కళ్ళు లాగా అరియానాకి అవినాష్ కి ప్రామిస్ చేశాను మరో సారి అవకాశమొస్తే నేను అరియానాకి సపోర్ట్ చేస్తాను అని అందుకె తనకి ఇస్తున్నా అని చెప్పాడు.
అరియానా ఈజ్ ద న్యూ కెప్టెన్. 

మోనల్ హారిక అండ్ లాస్యల డిస్కషన్. మోనల్ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. హారిక నేమో సపోర్ట్ సిస్టం గురించి మాట్లాడితే నేనింత కాలం హౌస్ లో ఉన్నది వీళ్ళ వల్ల అన్నట్లు అనిపిస్తుంది అది కరెక్ట్ కాదు అని చెప్తుంది. 
  
అరియానా మోనల్ ని రేషన్ మానేజర్ గా ఎన్నుకుంది. అమ్మ గారు లుక్డ్ డిజప్పాయింటెడ్. నీకు సపోర్ట్ చేయడం తప్పని నువ్వు ప్రూవ్ చేస్కున్నావ్ అని అంటున్నాడు అమ్మ గారు. నువ్వు నన్ను రేషన్ మానెజర్ గా చేసుంటే నేను నామినేషన్స్ లో ఉన్నా కనుక నాకు హెల్ప్ అయ్యేది అని అంటున్నాడు. 
అమ్మ గారు ఆయనకి ఇవ్వనందుకు చాలా ఫీలయ్యాడు అనవసరంగా డిస్కస్ చేస్తున్నాడు. అసలు ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ వివరాలు చెప్పడం అనవసరం కానీ దీని తర్వాత ఇతను ఈ వారం వెళ్ళిపోవాలని నాకు చాలా అనిపించింది నాకు. చిన్న చిన్న విషయాలకి అనవస్రంగా గొడవ పెట్టుకుంటున్నాడు.    

కోల్గెట్ వేద శక్తి మౌత్ ప్రొటెక్ట్ స్ప్రే ని ఇంటిలో కొన్ని చోట్ల ఉంచబడుతుంది అది అందరు ఉపయోగింఛండి అని అన్నారు. మౌత్ స్ప్రే ని గిఫ్ట్ పాక్ ఓపెన్ చేసి డిమాన్స్ట్రేట్ చేయాలి అని చెప్పారు. అంతా చేశారు. 

రేషన్ మేనజర్ మోనల్ ఆరు స్వీట్ లెమన్ (బత్తాయి) వేస్ట్ అయ్యాయని చెప్పి బయటకి తీస్కొచ్చి చూపిస్తుంది. ఆ విషయం అవినాశ్ తో చెప్తుంటే నాకు కాదు అరియానా తో చెప్పు అన్నాడు. అరియానా వచ్చి అవి నా రెస్పాన్సిబిలిటీ కాదు నేనున్న టైమ్ లో వచ్చినవి కాదు అని చెప్పింది. అమ్మ గారు మరి నీ రెస్పాన్సిబిలిటికాకపోతె మెహబూబ్ దా అని అనడం కాక మాటల్తో పొడుస్తూ ఉన్నారు. 

అవినాష్ ఫుడ్ ఇస్తుంటే అరియానా నాకు ఫుడ్ వద్దని చెప్పి వెళ్ళిపోయింది. సపోర్ట్ చేసినట్లే చేసి తిడతారు అని ఏడ్చేసింది. 

రాత్రి నోయల్ మెడికల్ రూం కి వెళ్ళాడు. హారిక ఏడుస్తుంది. అతన్ని ఇలా చూడలేక పోతున్నా అని. అభి కూడా ఫీలవుతున్నాడు.
రాత్రి మూడు గంటలకు డాక్టర్ చెక్ చేసిన తర్వాత స్పెషలిస్ట్ ల సలహా మేరకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఇంటి నుండి బయటకి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పారు బిగ్ బాస్. ట్రీట్మెంట్ అంటే ఏంటో కూడా ఏం చెప్పలేదు. అభి అదే అడిగాడు కానీ ఏం చెప్పలేదు అని చెప్పాడు.  

హారిక అభి మోనల్ ఉన్నారు అక్కడే ఎదురు చూస్తూ. అరియానా కూడా వచ్చింది. 

తర్వాత అఖిల్ మెహబూబ్ లాస్య కూడా జాయిన్ అయ్యారు. 
మిగిలిన అందరూ కూడా వచ్చారు. అందరికి బై చెప్పి పాక్ చేస్కుని వెళ్ళడానికి రెడీ అవుతుంటే బిగ్ బాస్ త్వరలోనే మీరు పూర్తి ఆరోగ్య వంతులై తిరిగి రావాలని బిగ్ బాస్ కోరుకుంటున్నారు అని చెప్పారు.
అందరూ చాలా హాపీ ఫీలయ్యారు నో మోర్ గుడ్ బైస్ అని చెప్పాడు అభి. 

నోయల్ డైలాగ్ "అందరూ పొద్దున్న వెళ్ళారు నేను స్టార్ కదా అందుకే రాత్రి వెళ్తున్నాను" అంట.
హారిక బాగా ఫీలైంది ఏడ్చేసింది. లాస్య కూడా బాగా ఫీలవుతుంది. 

రేపటి ప్రోమో లో ఉన్న పది మందిని ఐదు జంటలుగా విడగొట్టి ఒక్కొ జంటకి వాళ్ళిచ్చిన ఐదు పేర్ల లోంచి ఒకటి పెట్టమన్నట్లు ఉన్నారు. 

అభిజిత్ హారిక కి జీరో టాలెంట్ జంట, అమ్మ లాస్య కి గజిబిజి 
జంట, అఖిల్ మోనల్ కి అహంకారుల జంట, అవినాష్ అరియానా కి బద్దకస్తుల జంట, సోహెల్ అండ్ మెహబూబ్ కి అబద్దాల కోరుల జంట అని పేర్లు పెట్టి ఉండడం చూపించారు. మళ్ళీ ఏవో గొడవలు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నట్లున్నాడు బిగ్ బాస్. 

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts