10, అక్టోబర్ 2020, శనివారం

ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. వినడం కన్నా త్వరగా చదవడం ఇష్టపడే వారు కింద నోట్స్ లో ముఖ్యమైన పాయింట్స్ చూడవచ్చు. 


ఈ వారం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ నాగ్. జరిగిన ఎపిసోడ్స్ అన్నీ జాగ్రత్తగా చూసి సూపర్ కంట్రోల్ తో చాలా బాగా హాండిల్ చేశారు షో అనిపించింది. నాగ్ లో ఇంత కమాండ్ ఎప్పుడూ చూడలేదు. లిటరల్లీ ఒక కొరడా తీస్కుని వచ్చి అవసరమైనపుడు ఒక్కొక్కరి మీద ఝుళిపించారు. పిచ్చికుక్కలా అరుస్తున్నావ్ అని స్లిప్ అయిన ఒక మాట తప్ప, షో అంతా చాలా బాగా హాండిల్ చేశారు. 

గంగవ్వ గారి అనారోగ్యం వలన తన మెడికల్ రిపోర్ట్ ఎక్జామిన్ చేసి బిగ్ బాస్ అనుమతితో తనని ఇంటికి పంపించేశారు. మెయిన్ హైలైట్స్ అయితే ఇవే.   

బుట్ట బొమ్మ పాటతో నాగ్ ఎంట్రీ.. స్టెప్ బాగా వేశాడు..  

ముప్పై నాలుగోరోజు ఉదయం ఎనిమిదికి పాట బదులు సైరన్ మోగించి మేల్కొలిపారు. అందర్ని లివింగ్ రూం కి రమ్మన్నారు. మీరు వచ్చి ఐదు వారాలైంది బిబి పదె పదె హెచ్చరించినా నియమాలు పాటింఛడం లేదు. హెచ్చరికల సమయం ముగిసింది. రేషన్ మానేజర్ ఫెయిలయ్యారు. శుభ్రం చేస్కోవాలి. లైట్స్ ఉన్నపుడు నిద్రపోడం మీ తీరుకు ఉదాహరణలు. ఇది చివరి మరియూ ఆఖరి హెచ్చరిక, బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకూ ఎవరికోసం హెచ్చరిక వచ్చినా సోహెల్ ప్రతి కెమేరా కి క్షమాపణలు చెప్పాలి. 

"నువ్వు నా మెడిసిన్ పక్కన ఉంటే బావుంటుంది" అని అఖిల్ తో మోనల్ అంటుంది. "ఈ మెడిసిన్ ఎక్స్పైర్ అయింది. ఐనా నువ్వు బెస్ట్ ఫెండ్ కి మిగిలిన వాళ్ళకి డిఫరెన్స్ చూపించడం లేదు." అని జవాబిచ్చాడు తను. 

తర్వాత ఓఫ్ఫో టాస్క్. 
ఏడు పోడియంస్ ఒక్కోదానిలో ఫోన్ ఫీచర్ అండ్ పర్సనాలిటీ ట్రెయిట్ ఉంటాయి. అది ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలి. పోడియంస్ పేర్లు అన్నీ వాళ్ళే చెప్పారు

అఖిల్ మోస్ట్ స్టైలిష్ - మెహబూబ్
నోయల్ పర్ఫెక్ట్ పిక్చర్ - అరియానా 
హారిక మోస్ట్ స్పీడీ - లాస్య   
దివి మోస్ట్ హైలైటెడ్ ఇన్ ద క్రౌడ్ - అవినాష్ 
అభి మోస్ట్ క్లియర్ ఇన్ థాట్ - కుమార్ సాయి 
గంగవ్వ మోస్ట్ పవర్ఫుల్ - అమ్మ రాజశేఖర్
సోహెల్ ఆల్ రౌండర్ - మోనల్ షి గెట్స్ ద క్రౌన్ 

ఇక నాగ్ మన టీవీ ద్వారా హౌస్ లోకి ఎంటరయ్యాక "సోహెల్ కెప్టెన్ అయ్యావ్ గుడ్ కాని నిద్ర పోతున్నావ్" అని అంటే "మధ్యాహ్నం నిద్ర అలవాటు ఓ గంట అందుకే అలా కానీ కుక్కలు వస్తున్నాయ్ సర్" అంటే "అవునవును అరియానా ప్లాన్ చేసి మరీ పిలుస్తుంది" అని చెప్పారు నాగ్. 

"అఖిల్ అండ్ అభి ఇద్దరు బానే నామినేట్ చేశారు కానీ మరొకళ్ళ పేరు తీస్కురాకూడదు. ఒక వేళ తేవాలంటే వాళ్ళ అనుమతి తీస్కోవాలి" అని చెప్పారు. అభి సపోర్ట్ చేస్కోడానికి ట్రై చేశాడు తప్పని చెప్పాడు అఖిల్ కూడా సపోర్ట్ చేస్కోడానికి ప్రయత్నం చేశాడు. కానీ నాగ్ ఇద్దరిదీ తప్పే అన్నాడు ఇద్దరు అపాలజీ చెప్పారు. 

మోనల్ ని అడిగితే అభి నాకు మోనల్ అంటే ఇష్టం అని చెప్పడం నచ్చలేదని డ్రాగ్ చేశాడు. ఇద్దరిదీ తప్పుంది అని చెప్పింది. తరువాత అఖిల్ ని మోనల్ తో ఎందుకు మాట్లాడడం లేదు అని అడిగాడు. దానికి "ఏం అర్ధం కాడం లేదు" అని అన్నాడు తను. "మాట్లాడితే కదా నీకు అర్థం అవుతుంది" అని చెప్పారు నాగ్.  అభి నాకు మొనల్ పర్సనల్లీ అఖిల్ మొదట మాట్లాడకుండా ఉండాల్సింది అని అతని తప్పన్నట్లు చెప్పింది అని కంటిన్యూ చేయబోయాడు. అంటే ఇద్దరికి ఎవరి దగ్గర మాటలు వాళ్ళకి చెప్తున్నట్లుంది అన్నాడు. నాగ్ ఆపేశాడు ఇద్దరిది తప్పే అని చెప్పాడు. 

నోయల్ ని స్వాతి విషయంలో కరెక్ట్ చెప్పావ్ కానీ మరి కుమార్ సాయి కి నువ్వు చెప్పలేదా అని అడిగారు. కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. కానీ నాగ్ కన్విన్స్ అవ్వలేదు. క్లియర్ గా వివరింఛారు.    


అమ్మ గారిని ఇంకొకరికి సెకండ్ ఛాన్స్ ఇవ్వరా మాట వినరా అంత కోపమైతే ఎలా అని అడిగారు. "ఆ స్వాతి తో చేసిందంతా అబద్దం అలాంటి దాన్లో మాటిచ్చానని నన్ను నామినేట్ చేయడం నచ్చలేదు" అని చెప్పారు. నాగ్ వినను అని యాక్ట్ చేసి ఇపుడెలా ఉంది నేను వినకపోతే అని చెప్పారు. అవికి చెప్పిన విషయం చాలా బావుంది సూసైడ్ గురించి. ఇల్లు గురించి అడిగారు. అమ్మ వద్దని సెంటిమెంట్ అని చెప్పిందని అమ్మాను అని చెప్పారు. 

సోహెల్ దివి నామినేట్ చేసినందుకు అంత కోపమెందుకు నరాలు పొంగుతున్నాయ్ ఒక పిచ్చికుక్కలా అరుస్తున్నావ్ ఇలా ఐతే ఎలా అని అడిగారు. ఒక ఆడపిల్ల మీద అరుస్తున్నావ్.. ఇంకొక్క సారి ఆడపిల్ల మీద అరిస్తే కొడతా అని ఇండైరెక్ట్ గా కొరడా ఝుఌపించి చెప్పారు. నువ్వు బాగా ఆడుతున్నావు కాని ఇదొక్కటే నిన్ను వెనక్కి లాగుతుంది. రిపీట్ చేయకన్నారు.

అవినాష్ నీకేంటి బిగ్ బాస్ నే ఇమిటేట్ చేస్తావు.. ఇంట్లో లైనేద్దామని వచ్చావా.. పొడుగ్గా ఉంటుంది కదా ఒక అమ్మాయ్ అని దివి ని ఇమిటేట్ చేయించారు. హైట్ తక్కువైంది అవినాష్ ఏం చేయలేం అని చెప్పారు. అలాగే దివికి ఎవరైనా ఇమిటేట్ చేస్తే అది బెస్ట్ ఫామ్ ఆఫ్ ఫ్లాటరీ టేక్ ఇట్ పాజిటివ్ అని చెప్పారు. అవి సీక్రెట్ టాస్క్ గురించి మెచ్చుకున్నారు.  అవినాష్ కి హాట్సాఫ్ అని టోపీతో చేసి చూపించారు.   
శారు. 

అభి ఆట ఆగిపోయేలా చేశాడు అది కరెక్ట్ కాదు అనిచెప్పారు. సర్వీస్ చేసి స్టార్స్ తీస్కోమని చెప్పారు కానీ డిమాండ్ చేసి సర్వీస్ ఇమ్మని కాదు. మీరు ఓడిపోడానికి కారణం హారిక కెమేరాకి చెప్పడం మంచిదైంది అని చెప్పారు. నీ ఒక్కడి గెలుపు కోసం నువ్వు కమిషన్స్ తీస్కున్నావ్ అండ్ టీం వర్క్ చేయలేదు. నీ ఏడ్యుకేషన్ గురించి తీస్తున్నావ్ అది తీసి నేను నీకన్నా బెటర్ అని చెప్తే అది ఎడ్యుకేషన్ కానే కాదు అని చెప్పాడు. చదువు లేనోడివి రా అనేది రాంగ్ వర్డ్.. అది వాడద్దని చెప్పాడు. అప్పుడు అఖిల్ ఎక్స్ప్రెషన్ ఫన్నీ :-)

మెహబూబ్ ని పుచ్చపగిలిపోద్దనే మాట గురించి మీ ఇంట్లో మాట్లాడతావా అని హెచ్చరించారు. "అది మా ఫ్రెండ్స్ తో కాజువల్ గా అనేమాట కానీ సోహెల్ తర్వాత చెప్పాడు" అని వివరించాడు మెహూ. టాస్క్ ఆడు కానీ లాంగ్వేజ్ జాగ్రత్త అని చెప్పారు. అలాగే సోహెల్ నువ్వు ఎంత ఫ్రెండ్ అయినా తప్పు అని చెప్పడం బావుంది అలాగే అఖిల్ కూడా గుడ్ జాబ్ అని చెప్పారు. 

ఫస్ట్ సేవ్ డైరెక్ట్ గా పేరు చెప్పేశారు ఆట బాగా ఆడావు సోహెల్ నువ్వు సేఫ్. ఈ వారమే కాదు నెక్స్ట్ వీక్ కూడా సేఫ్ అలా అని ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని చెప్పారు. 

గంగవ్వ రిపోర్ట్స్ తీస్కొచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ ఆరోగ్య పరిస్థితి మానసిక స్థితి చూద్దామని ఏవీ చూపించారు. 
   
గంగవ్వ "మీరంటే భయపడుతున్నాను కోప్పడకండి నామీద.. కావాలంటే మళ్ళీ ఓ ఇరవై రోజులు ఆగి వస్తాను" అని చెప్పారు. సరే మీరు భయపడకండీ బిగ్ బాస్ మీరు పర్మిషన్ ఇస్తే తను వెళ్ళిపోతారు అని అడిగారు. బిగ్ బాస్ "అనుమతినిస్తున్నాను" అని చెప్పారు. నేను ఎదురు చూస్తుంటాను మీరు అందరికి బై బై చెప్పి స్టేజ్ మీదకి రండి అని పిలిచారు. ఆవిడ అమాయకంగా మరి నేను ఇంటికి ఎట్టా వెళ్ళాలి అని అడిగితే నేనున్నా కదా చూసుకుంటా అని చెప్పారు. 

అవ్వ అందరికి గుడ్ బై చెప్పారు చాలా బాగా ఉంది.. హాయిగా నవ్వుతూ అందరూ సంతోషంగా బై బై చెప్పారు. స్టేజ్ మీద అవ్వ ఏవీ చూసి అవ్వే చాలా ఆశ్చర్యపోయింది. చూడ్డానికి చాలా బావుంది.. అఖిల్ చాలా బాగా చూస్కున్నాడు అని చెప్పి హార్ట్ సింబల్ గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పింది.

హౌస్మేట్స్ తో మాట్లాడింది గంగవ్వ. 

హారిక - అప్పుడే సీరియస్ ఔతావ్ నవ్వుతావ్ అది మంచిది కాదు అంది. 
దివి నా మనవరాలు లాగా గిచ్చి గిల్లి ఆడుకుంటది నాతో అని చెప్పింది.
సోహెల్ నాగసర్పం లాగా కిందికి పైకి వస్తాడు నరాలు తేల్తాయ్ బుస్సని అరుస్తాడు.. మంచి లేదు కరుస్తాడు. పీకుతా పో అని తిట్తింది.
అఖిల్ నాతో చాలా మంచిగుంటడు బాగా చూసుకుంటాడు అని చెప్పింది. 
అమ్మ గారు పదివేల నమస్కారం నన్ను గుర్తుంచుకోండి హౌస్లో ఉండాలి కలకలలు ఉంటాయ్ నువ్వు ఉంటే. ఎగురుతాడు. నన్ను సినిమాలోకి తీస్కోండి అని చెప్పింది. 
మోనల్ ఎంత దూరం నుండి వచ్చింది మంచిది.. చెడు లేదు.. ఆమెకు ఏమి తెల్వదు మంచి పిల్ల అంది. 
నోయల్ రొయ్యల్ వెళ్ళి మంచి అమ్మాయిని చూస్కుని పెళ్ళి చేస్కో అంది. నువ్వు చూడు అవ్వ అని నాగ్ అంటే "మాది చిన్న పల్లె అక్కడి నుండి రారు" అంది. 
లాస్య నాకు పెద్ద బిడ్డ లాగే అన్నం పెట్టింది బిడ్డలాగా అంటే నాగ్ "పప్పు కూడా పెట్టిందా" అని అడిగారు. అదృష్టం తప్పిచ్చుకుని వెళ్తున్నావ్ అని చెప్పారు.   
సుజాత పేలన్నీ తీసింది అంటే నాగ్ " ఆ ఏముంది దగ్గరకి వచ్చి నవ్వు నవ్వింటది పేలు పోయింటయి" అని చెప్పారు. "నామినేషన్ లో నువ్వే వస్తావేమో అనుకున్నా" అని అమాయకంగా చెప్పింది.   
అభి మంచోడు నామినేట్ చేశా కానీ ఎక్కడా అందరితో కలవడు ఒక్కడే తిరుగుతుంటాడు అంది. 
అరియానా మొఖం మీదే అనేస్తది చిన్నది అంది. 
అవినాష్ కుందేలు అక్కడిక్కడ తిరుగుతుంటాడు అంది. నాగ్ సార్ లాస్ట్ వీక్ అమ్మాయిల మధ్య దాక్కున్న విషయం గుర్తు చేసి కూతుర్లనిచ్చే అత్తల్లార జాగ్రత్త అని చెప్పారు.  
మెహబూబ్ మనం బాగా చేసినం మంచిగుండు అదొక్కటే మాట జారిపోయింది కానీ బావుంది అంది. 
కుమార్ సాయి నీకారోజు చెప్పా నువ్వీరోజుల్లో ఎక్కువ నేర్చుకున్నావ్ అందరితో కలిసిపోతున్నావ్ బావున్నావ్ అంది. 

"నీ ఇల్లు పూర్తి అయ్యేటట్టు నేను చూస్తాను" అని ప్రామిస్ చేశారు నాగ్. అందరూ చాలా హాపీ ఫీల్ అయ్యారు చప్పట్లు కొట్టారు. 

ఇంకొకళ్ళని సేవ్ చేసేసి వెళ్ళండి అని అవ్వకి స్టాండింగ్ ఒవేషన్ ఇద్దాం అని అందరికి చెప్పారు. లేచి నిలబడి చప్పట్లు కొట్టారు హౌస్మేట్స్ అంతా.  
 
ఎవరు సేఫో చెప్పండి అని అంటే ఫోటో తీసి చూసి చాలా హాప్పీ ఫీలయ్యారు గంగవ్వ. అఖిల్ ని సేవ్ చేశారు. అఖిల్ కూడా చాలా హాపీ ఫీలయ్యాడు. ఏడుస్తూ వెళ్ళ్తుంటే మీరు బయటనుండి చూడచ్చు అందరిని రోజు అని నచ్చచెప్పారు. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts