28, అక్టోబర్ 2020, బుధవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. కింద నా రఫ్ నోట్స్ కూడా ఇస్తున్నాను కీపాయింట్స్ మాత్రమే తెలుసుకో దలచిన వాళ్ళు అది చదవచ్చు. 



నిన్నటి బిగ్ బాస్ డే కేర్ టాస్క్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. నోయల్ కాలు నొప్పి అని బ్రేక్ తీస్కుంటే తన కిడ్ ని కూడా అభి తీస్కున్నాడు. ఫైనల్ గా సోహెల్ అండ్ అరియానాల జోడీ గెలిచారు.ఐతే కెప్టెన్సీ టాస్క్ కి కనెక్ట్ చేయలేదు ఈసారి గిఫ్ట్స్ తో సరిపెట్టారు. పారగాన్ ప్రమోషన్ టాస్క్ నడిచింది అందరు ఒకరికొకరు చెప్పులు గిఫ్ట్ ఇచుకున్నారు. కెప్టెన్సీ టాస్క్ రేపు ఉంది కాన్సెప్ట్ ఏదో కొత్తగా అనిపించింది.   

వివరాలలోకి వెళ్తే 51 వ రోజు రాత్రి పిల్లలంతా కలిసి దాగుడు మూతలు ఆడుతున్నారు. మెహబూబ్ కిచెన్ కప్ బోర్డ్ లో దాక్కున్నాడు కనిపెట్టేశాడు అందులోనే మరో పక్క అవినాష్ దాక్కున్నాడు అందులోనే మధ్యలో హారిక దాక్కుంది. అరియానా టీపాయ్ కింద దాక్కుంది. డస్ట్ బిన్ ఉన్న ప్లేస్ లో హారిక దాక్కుంది కాబట్టి తనకి ఒక చాక్లెట్. తన్దగ్గర అవినాష్ కొట్టేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. 

చాక్లెట్స్ ఎవరి దగ్గర ఎక్కువుంటే వాళ్ళు విన్ అన్నారనుకుంటాను. మనకైతే వినిపించలేదు ఆ గేమ్ రూల్. కంటెస్టెంట్స్ యాక్షన్ ని బట్టి అలా ఉంది. చాక్లట్స్ ఇవ్వమన్నారుట వాటి కౌంట్ బట్టి ఏమైనా ఉందేమో లేదో తెలియదు అని చెప్పింది లాస్య. 

అమ్మ గారి దగ్గర హారిక లాక్కున్నందుకు అలిగి అమ్మ గారు అలిగి ఆట మానేశారు. అభి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. హారిక దగ్గర నుండి తీస్కోడనికి అభి ప్రయత్నించాడు. వాళ్ళు లాక్కుంటే ఓకే కానీ నేను లాక్కుంటే అమ్మాయ్ అమ్మాయ్ అని అరుస్తున్నారు అందరూ అని అలిగాడు అమ్మ గారు. 

హారిక పాయింటేంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకున్నారు ఆయన పెట్టుకోలేదు కొట్టేయగలిగాను అని చెప్తుంది. 
హారిక పాకెట్ నుండి తీస్కోవద్దని మోనల్ ఆపినందుకు తన మీద కోప్పడ్డాడు.  

అరియానా అండ్ మెహబూబ్ కూడా అలా షార్ట్స్ జోబులోనుండి తీయద్దు అని చెప్పారు. ఓకే అన్నాడు.   
హారిక చెప్పడం నాకు పాకెట్ లో లేదు అసలు అక్కడ చాక్లెట్ లేదు అని.

అమ్మ గారి షార్ట్ లో బయటికి కనిపిస్తుందా లేదా అని చెక్ చేశారు అవినాష్ అండ్ అరియానా కన్ఫర్మ్ చేశారు ఆ పాకెట్స్ బయటికి ఉన్నాయ్ క్లియర్ గా కనిపిస్తున్నాయ్ అని చెప్పాడు అవి.  నైట్ ఎలాగైనా దొంగతనం చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు అమ్మ గారు. 

పాకెట్ లో నుండి తీస్కోడం దొంగతనమా లేక లాక్కోడమా అని డిస్కషన్ మొదలై నేను మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోయావ్ అని అభి సీరియస్ అయ్యాడు. నేనైతే నాకు తగిలిందని అనలేదు అని అంటుంది హారిక. హారిక వాక్ ఔట్ చేసినందుకు అభికి సారీ చెప్పింది. 

ఈ డిస్కషన్ లో ఏమనుకుందో ఏమో తర్వాత హారిక అమ్మ గారి నుండి రెండు చాక్లెట్స్ కొట్టేశా అని చెప్పి ఒకటి తిరిగిచ్చేసి రేపు మళ్ళీ ఒక వేళ దొరికితే కనుక దొంగతనం చేస్తా అని చెప్పింది. మీరు కూడా కావాలంటే చేయచ్చు అని చెప్పింది. 

అభి మెహబూబ్ కి తన గేం స్ట్రాటజీ చెప్తున్నాడు పులి వెయిట్ చేస్తుంది. పులి ఆట అంతే ఉంటుంది అని చెప్తున్నాడు. చిరుత చూసిన వెంటనే అటాక్ చేస్తుంది కానీ ఒక నిముషం కన్నా పరిగెత్తలేదు బాడీ హీట్ అవుతుంది వదిలేస్తుంది. కానీ సింహం పులి అలా కాదు కేమోఫ్లాజ్ మాటేసి అదను చూసి షూర్ గ కొట్టేస్తుంది అని చెప్తున్నాడు.   


రాత్రి నిద్ర పోకుండా హారిక దొంగతనం చేస్తూ కొట్టేసిన చాక్లెట్స్ వేరే చోట దాచి పెడుతూ ఉంది. లైట్స్ దగ్గర ఉన్న ఒక కప్ లో దాచింది.   

52 వ రోజు ఇంట్లో పదకొండు మంది ఉన్నారు. ఉదయం ఈ రోజు థీం కి తగినట్లుగా హండ్రెడ్ పర్సెంట్ లవ్ లో "ఏ స్క్వేర్ బి స్క్వేర్" పాటతో మేల్కొలిపారు. అందరు బాగా డాన్స్ చేశారు. 

పాట అవగానే ఆరియానా డ్యూటీ ఎక్కేసింది. సోహెల్ వీపు మీదెక్కి తిరుగుతుంది. 

లాస్య దగ్గర పౌచ్ లోని చాక్లెట్స్ మొత్తం పోయాయి అని వెతుకుతుంది. అవినాష్ రాత్రి హారిక మెలుకువగా అంతా తిరిగింది అని చెప్పాడు. అలా కొట్టేస్తే ఆ చాక్లెట్స్ లెక్క లోకి రావు లాస్య కారణం చెప్పి ఇవ్వాలి అని ఫైనల్ చేశారు. హారికతో కూడా ఇదే విషయం చెప్పింది అండ్ నువ్వు కొట్టేస్తే ఇస్తావ్ గా అని అడిగితే ఇస్తా అంది. 

అవినాష్ చింపాంజీ బొమ్మకి టీ తాపిస్తు ఆడుకుంటున్నాడు :-)

సోహెల్ అరియానా ని ఎత్తుకుని చేసిన మంచి పనులు అన్నీ ఇలా ఇలా చేసిందని చెప్తున్నాడు.  

మెహబూబ్ మటన్ కావాలి అంకుల్ అని అడుగుతూ కొరికేశాడు. మా కేర్ టేకర్ ని అడిగితే మీ చుట్టాలని అడుక్కో అని అన్నాడు నువ్వు నాకు మటన్ ఇవ్వు అని అడుగుతున్నాడు. ఇవ్వకపోతే సోహెల్ ని గట్టిగా మార్క్ పడేలా కొరికేశాడు. 

అఖిల్ బోర్డ్ మీద అందమైన బొమ్మ గీశాడు. చాలా బావుంది. మన వాడికి కళల్లో మంచి ప్రవేశమే ఉన్నట్లుంది. 
 
ఏ అంటే అవినాష్ అని మోనల్ అంటే ఎల్ అంటే లవ్, లవ్ అంటే మోనల్ అని కాసేపు ఫన్ చేశాడు అవినాశ్. ఆ తర్వాత ఎక్స్ అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు మెహబూబ్. 

మధ్యాహ్నం రెండుపదిహేనుకి నోయల్ కి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల అభిజిత్ అవినాష్ కి కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నాడు. నోయల్ మెడికల్ రూం నుండి బయటికి వచ్చాడు. టాస్క్ స్కిప్ చేయండి డాక్టర్ వస్తాడు అని చెప్పారు. కాలు బాగా నొప్పి గుచ్చేస్తుంది అసలు హీల్ అవడం లేదు తీస్కోలేకపోతున్నాను అని చెప్తున్నాడు. 

ఫన్ గేం ఇచ్చాడు పిల్లలకి కేర్ టేకర్స్ కు కలిపి. సోహెల్ లాండ్ ఫైర్ వాటర్ అని చెప్పినపుడు వాటి దగ్గరకు వెళ్ళాలి లాస్ట్ వెళ్ళిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఆ గేం లో నుండి. హారిక, అరియానా, మోనల్, అవినాష్, అభిజిత్, ఔట్ అయ్యారు. మధ్యలో అభిజిత్ ఒక రౌండ్ స్కిప్ అయ్యి లాండ్ మీదకి హడావిడిగా పరిగెడుతూ వచ్చి తడిచి ఉండడం వల్ల జారిపడిపోయాడు. తను ఔటయ్యిన విషయం మర్చిపోయి నేను ఔట్ కాదని వాదించాడు. క్లారిటి ఇచ్చాక ఓకే. 

సాయంత్రం నాలుగు గంటలకి టాస్క్ ముగించేశాడు బిగ్ బాస్. లివింగ్ రూమ్ లోని సోఫాలో కూర్చోమని లాస్యని విన్నర్ జోడీని ఎంపిక చేసి బిగ్ బాస్ కి చెప్పమన్నారు. 

సోహెల్ అండ్ అరియానా ని సెలెక్ట్ చేసింది లాస్య. సోహెల్ ఓపికగా భరిస్తూ అరియానా అడిగిందల్లా చేశాడు తినిపించడంలో కూడా బాగా చేశాడు అని చెప్పింది. తన సెలక్షన్ బావుంది. ఇద్దరు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విన్నర్ జోడీ ఐనందుకు గిఫ్ట్స్ గెలుచుకున్నారు అని చెప్పారు. కెప్టెన్సీ టాస్క్ కి కనెక్ట్ చేయలేదు. 
 
చింపాంజీ బొమ్మ నాకివ్వండి బిగ్ బాస్ అని కెమేరా ముందు అడిగింది అరియానా ఈ బొమ్మ చూస్తే నాకు ఇల్లు గుర్తొస్తుంది అని చెప్పి ఏడ్చింది. ఆ బొమ్మ తిరిగి ఇవ్వాలని లేదు అని చెప్తుంది. అవినాష్ నేను కూడా అడిగి చూస్తాను ఒక వేళ ఉంచితే నీకే ఇచ్చేస్తాను అని చెప్పాడు. 
  
నోయల్ అమ్మ గారికి ఈ వీక్ బాడ్ అవుతుందేమో అని అంటున్నాడు లాస్య అండ్ హారిక తో. ఆయన ఏమన్నా అంటే వెంటనే కారెక్టర్ మీదకి వెళ్ళిపోతున్నారు అని అంది లాస్య. నోయల్ ని ఆ రోజు అన్ని మాటలు అన్నాక నైట్ సారీరా అని కాళ్ళుపట్తుకున్నంత పని చేశారట మాస్టర్ గారు నోయల్ చెప్పాడు. తప్పు చేసి సారీ చెప్పడం పెద్దరికం కాదు అసలు తప్పే చేయక పోవడం బెటర్ కదా అని చెప్తున్నాడు. చాలా నచ్చింది ఈ పాయింట్ నాకు కరెక్ట్ గా చెప్పాడనిపించింది. 

పారగాన్ ఫుట్ వేర్ చెప్పులు రెండు స్టాండ్స్ లో పెట్టి ఒకో పెయిర్ హౌస్మేట్స్ కి ఇచ్చి కారణం చెప్పమన్నారు. 

హారిక నోయల్ కి ఇచ్చి దూకుడు ఎక్కువ పైగా లెగ్ కి ప్రాబ్లం ఉంది కాబట్టి హెల్ప్ అవుతుంది అని చెప్పింది. 

మోనల్ బ్లాక్ స్టైలిష్ షూ ఫర్ అఖిల్ స్టైలిష్ కనుక అని చెప్పి ఇచ్చింది. కరెక్ట్ సైజ్ సెలెక్ట్ చేసింది. 

అఖిల్ లైట్ వెయిట్ చెప్పులు మోనల్ కి సెలెక్త్ చేసి ఇచ్చాడు నడిచేప్పుడు గట్టిగ నడుస్తుంది సో తనకి అపుడు లైట్ గా ఉంటాయని ఇస్తున్నా అన్నాడు కాకపోతే అవి బిగ్ సైజ్.  

మెహబూబ్ షూ సోహెల్ కి స్ట్రాంగ్ గేమర్ అండ్ జిమ్ చేస్తాడు కనుక బాలెన్స్ చేస్తాయ్ అని ఇస్తున్నా అన్నాడు. 

సోహెల్ మెహబూబ్ కి లైట్ వెయిట్ షూస్ వాడెలాగూ హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తాడు కనుక వాడికి అని ఇచ్చాడు. 

చూడగానే లైట్ ఉన్నాయ్ దగ్గరికి వెళ్తే స్ట్రాంగ్ గా ఉన్నాయ్ లాస్య గురించి అదె తెలుసుకుంటాం ఫెండ్స్ అయ్యాక అందుకె ఇవి తనకి అని అభి ఇచ్చాడు. 

నోయల్ నువ్వు ఏ పని చేసినా నిన్ను తలెత్తి చూడాలని నీకు ఈ హీల్స్ ఇస్తున్నా అని హారికకిచ్చాడు. 

ఈ చెప్పులు ఎంత అందంగా ఉన్నాయో తన మనసు కూడా అంత అందంగా ఉంటుంది సిగ్గు పడుతూ ఉంటుంది అందుకే తనకి ఇస్తున్నా అని చెప్పి అవినాష్ అరియానాకి ఇచ్చాడు. 

సోహెల్ అండ్ అరియానా కి గిఫ్ట్స్ వచ్చాయి మటన్ చికెన్ చాక్లెట్ అండ్ కాఫీ వచ్చాయ్. అరియానా కాఫీ చూసి గెంతులే గెంతులు. చాక్లెట్స్ మిగిలిన హౌస్మేట్స్ కూడా తీస్కున్నారు అమ్మ గారు సైలెంట్ గా తీస్కుని తినేస్తున్నారు. 
మటన్ నేనొక్కడ్నే చేస్కుని తింటా ఎవరికి ఇయ్యా అన్నాడు సోహెల్. ఈ ఇంట్లో నువ్వొక్కడివి ఎట్ల తింటావ్ చూస్తా అని అంటున్నాడు అవినాష్. అల్లా కాసేపు దాని మీద ఫన్ చేశారు హౌస్మేట్స్. 

రేపటి ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్. ఒక టేబుల్ మీద కీ అండ్ బాక్స్ ఉన్నాయ్ ఒకళ్ళు కీ చేజిక్కించుకోవాలి అబ్బాయిలు అందరు ప్రయత్నిస్తే అఖిల్ సాధించాడు. తర్వాత హౌస్మేట్స్ అందరి ఫోటోస్ ఉన్న ఫ్రూట్స్ ఒక చెట్తుకు వెళాడేసి ఉన్నాయి బాక్స్ లో ఉన్న కత్తితో ఆ చెట్తుకు ఉన్న ఫ్రూట్స్ ని కోసేసి టాస్క్ లో పాల్గొనకుండా చేయాలనుకుంటాను. మోనల్ హారిక ఫోటో ఉన్న ఫ్రూట్ ని డెస్ట్రాయ్ చేసింది.   

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts