26, అక్టోబర్ 2020, సోమవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. అలాగే నా రఫ్ నోట్స్ లో పాయింట్స్ కింద చూడవచ్చు. 


లాస్య నోయల్ హారిక అండ్ అభి మోనల్ గురించి మాట్లాడుకోడం ఇంకా ఆపడం లేదు వీళ్ళ డిస్కషన్స్ చూసి నాకు చిరాకొస్తుంది. ఇక ఈ రోజు నామినేషన్స్ డే కదా.. అక్కడక్కడా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నడిచాయ్. బిగ్ బాస్ అసలు ఏ రీజన్స్ చెప్పి నామినేట్ చేయమన్నారో వాటిని తుంగలో తొక్కి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నామినేట్ చేశారు. కొందరు లాస్ట్ వీకే అనుకున్నా అప్పుడు నాకు ఆప్షన్ లేదు అంటూ నామినేట్ చేశారు. ఈ విషయం బిగ్ బాస్ కూడా అబ్జెక్ట్ చేయలేదు ఎందుకనో. ఈ రోజు ఆరుగురు నామినేట్ అయ్యారు. అమ్మరాజశేఖర్ గారు, అరియానా, మెహబూబ్ ముగ్గురు నాలుగేసి ఓట్లతోనూ లాస్య అఖిల్ మోనల్ ముగ్గురూ మూడేసి ఓట్లతోను నామినేట్ అయ్యారు. 

వివరాలలోకి వెళ్తే నలభైతొమ్మిదో రోజు రాత్రి వంట దగ్గర మొదలైంది.. అభి బట్టలు వచ్చేశాయి.. పండగంటేనే నవ్వులు ఆనందం కనుక సమంతా ప్రత్యేక విన్నపం మేరకు బిగ్ బాస్ మీబట్టలు పంపిస్తున్నారు అని అభి బట్టలు పంపేశారు. 

యాభయ్యవ రోజు పదకొండుమంది ఉన్నారు హౌస్ లో ఉదయం ఖైదీనంబర్ వన్ ఫిఫ్టీ నుండి రత్తాలు రత్తాలు పాటతో మేల్కొలిపారు. 
మోర్నింగ్ మస్తీలో మీకు నచ్చిన ఇంటి సభ్యుడు గురించి పాజిటివ్ అండ్ నెగటివ్ రాసి చెప్పమన్నారు. 
అభి గురించి అఖిల్ రాశాడు.. నువ్వు అఖిల్ తో మాట్లాడుతున్నపుడు చాలా గుడ్ లుకింగ్ బావుంటావు.. డైటింగ్ ఆపేయ్ తినడం మొదలు పెట్టు అని రాశాడు. 
మోనల్ మెహబూబ్ గురించి వెరీ స్వీట్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఫ్యామిలి పర్సనాలిటీ నాకు ఇష్టం తమ్ముడు అంది.   
అరియానా, లాస్య, మోనల్, అవినాష్ నలుగురు బతుకమ్మ పాడారు అరియానా తల మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళి పూల్ లో ప్లేట్ లో పెట్టి వదిలారు.. బావుంది.. 

సాయంత్రం నోయల్, అభి, లాస్య, హారిక నలుగురూ మళ్ళీ మోనల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దసరా కదా మాట్లాడాలని ఉంది అందట సో మాట్లాడమని చెప్పాను అన్నాడు. మోర్నింగ్ అందరి బ్లాంకెట్స్ మడత పెట్టి నీదొక్కటి పెట్టలేదంటే ఎంత ప్రత్యేకమో తెలుసుకో అంటుంది లాస్య. అతను ఇరిటేట్ అవుతాడు నేను ఫోల్డ్ చేస్తే అందట. అబి కూడా ఎస్ నేను మళ్ళీ పాడు చేసి మడత పెట్టుకునే వాడ్ని అని అంటున్నాడు.  
నువ్వు మనసులో అంత హేటె చేస్తున్నావ్ అని లాస్య అంటే హేట్ కాదు చీటెడ్ డిసీవ్డ్ గా ఫీలవుతున్నాను అని అన్నాడు అభి. నాకు వీళ్ళ నలుగురు మోనల్ గురించి మాట్లాడుకోవడం నచ్చడం లేదు ఒక రకంగా చిరాకుగా కూడా ఉంటుంది. ఆ అమ్మాయ్ కూడా అభితో మాట్లాడాలని ఎందుకు అనుకుంటుందో ఆ విషయం నోయల్ లాంటి వాళ్ళ దగ్గర ఎందుకు అంటుందో నాకు అర్థం కావడం లేదు.   

నామినేషన్ లో ఇప్పటి వరకు ఇంటిలో మీ ప్రయాణం ఏ సభ్యుల వల్ల ఇబ్బంది కరంగా మారిందో ఇంకా ఏ సబ్యుని వల్ల ముందు ముందు మీకు అడ్డంకులు వస్తాయనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పి ఇద్దరి ని నామినేట్ చేయాలి. ఇంటి సభ్యుల పిక్స్ ఉన్న టైల్స్ పెట్టి ఉన్నాయి అవి పగలగొట్టాలి. కెప్టెన్ కనుక అవినాష్ ని నామినేట్ చేయకూడదు అని చెప్పారు కానీ ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీస్కోలేదు అందరు ఏవో వాళ్ళకి నచ్చినవి ముందుగా అనుకున్నవి రీజన్స్ చెప్పారు నామినేషన్స్ కి. బిగ్ బాస్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీస్కున్నట్లు కనిపించలేదు.  

అమ్మ గారు : లాస్య నన్ను కన్నింగ్ స్మైల్ అన్నారు. అలగే మిమ్మల్ని వరస్ట్ పెర్ఫార్మర్ అన్నందుకు మీరు తీస్కోలేకపోయారు. 
అఖిల్ నన్ను సింపతీ సింపతీ అని అనడం బాలేదు ఆ వర్డ్ బాలేదు. ఫ్యామిలి సింపతి ఉంది అన్నారు అది నచ్చలేదు. అది సినిమా లాంగ్వేజ్ అని ఏదో కవర్ చేశారు కానీ ఒప్పుకోలేదు. 
సోహెల్ ఠక్కున కోపం వచ్చేస్తుంది. మీరు కూడా నాలాగా ఛేంజ్ అయితే బావుంటుందని అనుకుంటున్నా అంటే. ఐతె నువ్వు నా సారీ నాకు వాపస్ ఇచ్చేయ్ అని అడిగారు. ఆల్రెడీ రెండున్నాయ్ కదా వేసేయ్ మూడోది అని అన్నారు. సోహెల్ కాసేపు ఆలోచించి సారీ చెప్పి వేసేశాడు. 
అభి మీకు ఒక పాయింట్ చెప్పాలి. చిన్న చిన్న విషయాల్లో హర్ట్ అవుతున్నారు అంటే. నేను మాస్ నువ్వు క్లాస్ అని అన్నారు మళ్ళీ. నా నామినేషన్ ని పాజిటివ్ తీస్కుంటారు అనుకుంతున్నా. 


అరియానా : అఖిల్ ఎదుటి వాళ్ళ మాటలు వినదు. ఆవేశపడిపోతుంది. వాకౌట్ చేయడం నచ్చలేదు. 
మెహబూబ్ మనమధ్య అన్ని క్లియర్ అవ్వాలని చేస్తున్నా నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావు అని అన్నాడు. నేనన్నానా అని అడిగింది. 
సోహెల్ సారీ చెప్పమని అడిగితే నువ్వు ఆలోచించి చెప్పావ్. అవినాష్ ప్లేస్ లో ఇంకెవరు ఉన్నా కెప్టెన్సీ టాస్క్ లో నిన్నే సపోర్ట్ చేసే వాడ్ని అని చెప్పాడు. అలాగె పాస్ట్ గురించి చెప్పమన్నారు కాబట్తి చేస్తున్నా అంతకన్నా వేరే ఏం లేదు. నేను జెర్రీనే నీ ముందు అలా చూడకు అని చెప్పాదు. ఏం లేదు సోహెల్ అని సింపుల్ గా వదిలేసింది అరియానా.  
హారిక మొన్న టాస్క్ లో బయటుంది ఏం చేస్తుననర్ అనడం నచ్చలేదు. నువ్వు చెప్పి వెళిపోతావ్ మమ్మల్ని మాట్లాడనివ్వవు అని చెప్పింది. 

మెహబూబ్ : అరియానా క్లియర్ అవ్వాలి సారీ చెప్పావ్ బావుంది కానీ క్లియర్ చేస్కోవాలి అంటే ఇంట్లొ ఉండి సహాయం చేస్కుంటారా లేక బయటికి పంపేస్తారా. సారీ చెప్పి నామినేట్ చేయడం నచ్చలేదు. 
నోయల్ అఖిల్ లాగె మెహబూబ్ కూడా చాలా స్ట్రాంగ్ కనుక నేను నామినేట్ చేస్తున్నా. పర్సనల్ రీజన్స్ ఏం లేవు అని అన్నాడు. 
హారిక స్ట్రాంగ్ కాంపిటీటర్ అనుకుంటున్నా అందుకె చేస్తున్నాను. 
మోనల్ నాకు అభితో ఒక డిస్కషన్ జరిగింది ఇందులో ఉన్న విషయం నేనెవరితో షేర్ చేయలేదు. అభితో నేనే చెప్పాను నువ్వు నాకు అభికి ఉన్న ఫైట్ ని యాభై రెట్లు పెంచావు నువ్వు అంది. మెహబూబ్ మన ఐదుగురి మధ్య జరిగిన డిస్కషన్ అభికి ఎందుకు చెప్పావ్ అంటే స్వాతి ఎలాగూ చెప్తుంది కదా అని చెప్పాను అన్నావ్ కదా నేను అదే అభికి చెప్పాను అని చెప్పాడు.

మోనల్ : లాస్య నువ్వు అర్థంకావట్లేదు నువ్వే మాట్లాడడం మానేస్తున్నావ్ మళ్ళీ వచ్చి నన్ను నువ్వెందుకు మానేశావ్ అని అడుగుతావ్. 
మెహ్బూబ్ రేషన్ మానాజర్ గా ఉన్నపుడు నేనెవరికి చెప్పాలి అని అంది ఆ ఒక్క విషయమే ఉంది మిగతా హౌస్మేట్స్ తో ఏంలేదు అని చెప్పాడు.  
అభి నీ నిర్ణయం అంటూ నువ్వు తీస్కున్న తర్వాత నిజంగా చెప్పు. నువ్వు నన్ను మానిపులేటర్ అని పిలిస్తె నువ్వు నాకు డైరెక్ట్ గా చెప్పు అంతే కానీ దర్డ్ పర్సన్ ఉంది కదా అని అలా చెప్పకు. ఎందుకు అన్నావో నాకు తర్వాత తెలిసింది. దట్స్ బిగ్గర్ క్రైమ్. మన మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఇన్ని రోజులు చేయలేదు. కానీ అది నాకు వచ్చిన విషయం బాలేదు అని చెప్పాడు.   
 
లాస్య : అవినాష్ నాకు మీకు బయట పరిచయం ఉంది కానీ ఎందుకో ఇక్కడ దూరం పెరిగింది. టీ పెట్టమంటే పెట్టలేదు తర్వాత వేరే ఎవరో అడిగారని వాళ్ళకి టీ పెట్టారు. కానీ నాకప్ పెడితే మాత్రం నాకు పోయలేదు. దీని తర్వాత అలాంటివి ఉండకూడదు అంది. నన్ను అడిగినట్లు అనిపింఛలేదు నువ్వు చేయాలి అని ఆర్డర్ వేసినట్లు అనిపించింది. ఆల్రెడీ బిగ్ బాంబ్ చేస్తున్నా కదా ఇంకోపని ఇవ్వాలని ఎలా ఆలోచించారు అని అడిగారు. నాకు ఐడియా లేకపోవడం వల్ల కొశ్చన్ రైజ్ చేశాను అని అన్నాడు. నా వల్ల హర్ట్ అయి ఉంటే సారీ అని చెప్పాడు. 
మాస్టర్ కన్నింగ్ అంటే ఒక విషయం మనసులో పెట్టుకుని వేరొకలా ఉండడం కన్నింగ్ నా దృష్టిలో అని చెప్పాడు. నన్ను వరస్ట్ అని మళ్ళీ నవ్వుతావ్ అది కూడా కన్నింగ్ అనే అంటాను. లాస్య నా శత్రువు ఎదురు పడినా నేను నవ్వుతాను అని చెప్పింది.  
మోనల్ లాస్ట్ లక్జరీ బడ్జట్ లో చికెన్ మటన్ అన్నీ వచ్చాయ్ నా హెల్త్ బాలేదు హారికా చాల బాగా చూసుకుంది నన్ను థ్యాంక్స్. లాస్య ని నాకోసం చేయమని అడిగితే నువ్వే చేస్కో అని చెప్పింది. నేను చాలా బాధ పడ్డాను నువ్వు చేయలేదు అని. పొద్దున్న మళ్ళీ డిస్కషన్ జరిగింది వెజిటేరియన్ ఎవరు అని. నేను తప్పు చేశానంటే వెళ్ళి సారీ చెప్ప్తాను. నువ్వు నన్ను నామినేట్ చేయడం నచ్చలేదు ఊహించలేదు. దానికి లాస్య "నేను నాన్వెజ్ చేస్తున్నా కదా ఇంకా వంటొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళనెందుకు అడగలేదు అని చెప్పింది. ఫైనల్ గా మోనల్ అఖిల్ అభి నా మాటర్ అనేది ఐవాంట్ టు క్లియర్ అండ్ ఫినిష్ వన్ థింగ్ హియర్ ఎవరికేం డౌట్స్ ఉన్నా కానీ అవి నాతో మాట్లాడి క్లియర్ చేస్కోండి అని చెప్పింది.  

అఖిల్ : అమ్మ గారు సింపతీ అనేది చాలా సెంటిమెంటల్ వర్డ్ అని వివరణ ఇచ్చారు. అభి అఖిల్ మోనల్ ముగ్గురు మధ్య డిస్కషన్ వచ్చింది మోనల్ ఇంకా అభితో మాట్లాడడం లేదు. ఇలాంటి టైం లో మీరు అభికి క్లోజ్ అవడం బాలేదు. నా స్ట్రెంత్ అఖిల్ అని ఆమె చెప్పినపుడు నువ్వు ఇన్ని ఆర్గ్యుమెంట్స్ చేసి ఎలా నువ్వు మాట్లాడుతున్నావ్ మీ క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడడం లేదు. మేం కొట్టుకుంది రా ఒరేయ్ అన్న దగ్గర నుండి మొదలైంది కానీ అమ్మాయ్ వల్ల కాదు అని చెప్పాడు. ఇది చాలా ఛండాలమైన రీజన్ వేరే రీజన్ చెప్పాలి అని చెప్పాడు అఖిల్. అప్పుడు కుమార్ ఎలిమినేట్ అయ్యే టైమ్ లో నువ్వు అలా మాట్లాడకూడదు అంటూ అటు తిప్పేశారు. నేను ఆల్రెడీ మోనల్ వెళ్తుందనే టెన్షన్ లో ఉన్నాను. అతను నన్నో పాయింట్ అన్నందుకు నేను అన్నాను అందులో తప్పేంటి అన్నాడు. 
అరియానా రిచ్ మాన్ టాస్క్ అయ్యాక మీకు సారీ చెప్పాను అంటే లేదని అన్నారు. నన్ను వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. మీ రియాక్షన్స్ నిజంగానే కోపంగా ఉంటున్నాయ్ సో కొద్దిగా కోపం కంట్రోల్ చేయాలి అని చెప్పింది. నా పాయింట్ కరెక్ట్ ఉన్నపుడు కోపం వస్తుంది. నువ్వు చెప్పింది మంచి పాయింట్ కనుక వింటున్నా అన్నాడు. 
నోయల్ ఛెస్ లొ స్ట్రాంగ్ పవర్స్ ని ఎలిమినేట్ చేస్తే మనం సులువుగా గెలవచ్చు అందుకే నాకు పర్సనల్ గా ఇష్టమైనా కూడా నేను వాళ్ళతో ఫిజికల్ టాస్క్ లు ఆడలేను చాలా స్ట్రాంగ్ కనుక నామినేట్ చేస్తున్నాను. 
  
హారిక : అవినాష్ కొంటె రాక్షసిగా సరిగా పెర్ఫార్మ్ చేయలేదు ఒకరిద్దరి దగ్గరే స్టిక్ అయి పెర్ఫార్మ్ చేశారు తప్ప ఫుల్ ఎఫర్ట్ పెట్టలేదు అని అన్నాడు. హారిక ప్రతి ఒక్కరిని నేను మిమ్మల్ని ఆపానా లేదా అని అడిగింది అందరు ఎస్ అన్నారు అదే నా ఆన్సర్ అని చెప్పింది. బంతిపూల విషయంలో కొంటెగా ప్రయత్నించాను అని అంది.  

ఉన్న పదకొండు మందిలో అవినాష్ కెప్టెన్ కనుక వదిలేస్తే ఈ రోజు ఆరుగురు నామినేట్ అయ్యారు. అమ్మరాజశేఖర్ గారు, అరియానా, మెహబూబ్ ముగ్గురు నాలుగేసి ఓట్లతోనూ లాస్య అఖిల్ మోనల్ ముగ్గురూ మూడేసి ఓట్లతోను నామినేట్ అయ్యారు. హారిక కి ఒక వోట్ వచ్చింది కానీ బిగ్ బాస్ వదిలేశారు. సోహెల్, అభిజిత్, నోయల్ ముగ్గురికి ఓట్స్ రాలేదు. 

రేపటి ప్రోమోలో బిబి డే కేర్ .. బిగ్ బాస్ ఇల్లు పసిపిల్లలను చూస్కునే డేకేర్ సెంటర్ గా మారబోతోందిట. మెహబూబ్, అమ్మ గారు, అరియానా, అవినాష్ పిల్లల్లాగా మారి అల్లరి చేస్తున్నారు   

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts