ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటలలో ఇక్కడ వినండి.
ఈ రోజు మెయిన్ ఫోకస్ కెప్టెన్సీ టాస్క్. వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ తో పాటు హౌస్మేట్స్ సపోర్ట్ కూడా ఆవసరమయిన టాస్క్ ఇది. ఇద్దరూ చాలా కష్టపడ్డారు. అరియానా ఒక అమ్మాయిగా బక్కప్రాణిగా అవినాష్ తో సమానంగా అంత ఎఫర్ట్ పెట్టడమ్ మాత్రం కమెండబుల్. ఫైనల్ విన్నర్ మోనల్ సపోర్ట్ తో అవినాష్. కాకపోతే అరియానాని రేషన్ మానేజర్ ని చేసి అవినాష్ హౌస్మేట్స్ తో పాటు ఆడియన్స్ మనసులు కూడా గెలిచేశాడు. అమ్మ గారు నోయల్ ని బయట కెరీర్ సంబంధమైన విషయాలతో కోప్పడడం అస్సలు బాలేదు. అభి త్యాగం చేసిన బట్టలు వస్తువులు ఇంకా రాలేదు రేషనా అవా అని అడిగితే రేషన్ కే ఓటు వేసింది కొత్త రేషన్ మానేజర్ అరియానా.
వివరాలు :
నోయల్ అండ్ అమ్మ అభి మధ్య డిస్కషన్ అభి అమ్మ గారిని నోయల్ మిమ్మల్ని నామినేషన్ చేసినపుడు ఏమనుకున్నారు అని అడిగాడు. ఆ డిస్కషన్ అలా అలా నోయల్ ఔట్ సైడ్ వర్క్ గురించి డిస్కషన్ వచ్చింది. నువ్వు నాకు పాట రాస్తాను అని అన్నావు కానీ ప్రామిస్ చేసి ఎందుకు బ్రేక్ చేశావ్ నాకు ఎందుకు రాసివ్వలేదు అని అడిగారు. కేమెరా కోసం చేయడమే తప్ప నువ్వు బయట అలా లేదురా అని మొదలు పెట్టేశాడు అమ్మ గారు.
లాస్య అభి కూడా మాస్టర్ ఒప్పుకోరు అని చెప్తున్నారు. అభి ఉండి కన్ఫ్రంట్ చేయకుండా ఎలా ఉంటావు ఎప్పుడో ఓ సారి ఫేస్ చేయాలి అని అభి అన్నాడు.
నలభై ఆరో రోజు ఉదయం సీటీమార్ సీటీమార్ పాటతో మేల్కొలిపారు. అంతా బాగా డాన్స్ చేశారు.
సోహెల్ అమ్మ దివి మధ్య డిస్కషన్. దివి ఏమైంది ఇంత డాన్స్ చేశారు అని అడుగుతుంది. ఈ వయసులో ఇంత డాన్స్ అని సోహెల్ అంటే అమ్మ గారు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే నువ్వు ఇలా ఏజ్ మాట ఎలా తీస్తావ్ అని సోహెల్ ని అడుగుతున్నాడు. ఇట్ వజ్ ఫన్ ఫర్ సమ్ టైమ్. నువ్వు అలా మాట్లాడడమె నచ్చలేదు అందుకే వెళ్ళిందంట మాస్టర్. అంతే అలానే అనుకోవాలి అని సోహెల్ అంటూ నవ్వుతున్నాడు.
అవినాష్ అండ్ అరియానా కెప్టెన్సీ వస్తే ఎలా చేయాలి అనేది డిస్కస్ చేస్కుంటున్నారు సరదాగా.. అరియానా కెప్టెన్ అయితె అవినాష్ తో గార్డెన్ ఏరియాలో లాన్ అంతా తీసి దాని కింద తుడిపిస్తుందంట. అవినాష్ ఏమో ఇదంతా తవ్వేసి కింద ఉన్న దాన్ని కూడా క్లీన్ చేయిస్తా నీతో అని చెప్తున్నాడు.
అవినాష్ మోనల్ ఫ్లర్టింగ్ కామెడీ కంటిన్యూ చేస్తున్నాడు అరియానా పక్కన ఉండగానే. మోనల్ అనబోయి అరియానా అని అన్నాడు. అఖిల్ వచ్చాక మోనల్ అటు చూస్తుంటే ఎందుకు అక్కడ చూస్తున్నావ్ ఇటు చూడు అన్నాడు. హీ ఈజ్ హాండ్సమ్ అంటే ఓ కుళ్ళు జోకేశాడు అవి అస్సలు బాలేదు. కాసేపటికి అఖిల్ వాళ్ళని దగ్గరకు తీస్కుంటే అవి నీకు ఇద్దరిద్దరు నాకు ఒక్కళ్ళు కూడా లేరు అని ఫన్ చేస్తున్నాడు.
అఖిల్ అండ్ మోనల్ డిస్కషన్ నడుస్తుంది. మీ హజ్బెండ్ ఏం చేస్తున్నారు అంటే యాక్టర్ అని చెప్తుంది అన్ని ఇండస్ట్రీలలో పని చేస్తారు అని చెప్తుంది. ఆహా అవునా ఏం పేరు అంటే గుజరాతీలో హజ్బండ్ పేరు చెప్పకూడదు అని చెప్తుంది మోనల్. వీళ్ళ కథ బాగానే దూరం వెళ్తున్నట్లుంది చూడబోతే.
కెప్టెన్సీ టాస్క్ బండి తోయ్ రా బాబు.
గార్డెన్ ఏరియాలో రెండు స్టేషన్స్ ట్రాలీస్ ఇస్తారు బిగ్ బాస్ స్టేషన్స్ లో సభ్య్లు ఉంటారు ఎవరైతే ఎక్కువ మందిని తమ స్టేషన్ లో ఉంచుతారో వారు కేప్టెన్.
అరియానా నోయల్ ని నెడుతుంది. అవినాష్ సోహెల్ ని ఎక్కించుకున్నాడు అవి ముందు తీస్కెళ్ళాడు అరియానా కి కొంచెం లేట్ అయింది.
అరియానా దివిని అవి మాస్టర్ ని ఎక్కించుకున్నారు.
అవి అఖిల్ ని ఎక్కించుకున్నాడు తినిపిస్తావా అని అడిగాడు సరే అని చెప్పి ఎక్కించుకున్నాడు. అరియానా మోనల్ ని తోస్తుంది. మోనల్ ఒక కాలు బయట పెట్టి తోస్కుంటూ వెళ్తుంది.
అవి అభిని రమ్మంటే నేను ఏ డ్యూటీస్ చేయను అని చెప్పాడు అలా ఐతేనే వస్తా అన్నాడు ఓకే అన్నాడు
మెహబూబ్ అరియానా దాన్లో వచ్చాడు.
చివరికి లాస్య ని అవినాష్ అండ్ హారిక ని అరియానా తీస్కొచ్చింది సో టై అయింది. ఇద్దరికీ సమానం అవడంతో. చాలా టఫ్ టాస్క్ అండ్ అరియానా అవినాష్ తో పోటీ పడి సమానంగా నెట్టడం చాలా మెచ్చుకోవాల్సిన విషయం.
ఇప్పుడు ప్రత్యర్థి స్టేషన్ లో ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసి తీస్కురండి. ఎవరి దగ్గర ఎక్కువుంటే వాళ్ళే అని అన్నారు.
అవి మోనల్ ని తీస్కొస్తే అరియానా అమ్మ గారిని తీస్కొచ్చుకుంది.
అవినాష్ అమ్మ గారిని కన్విన్స్ చేసి తీస్కొస్తే మోనల్ మళ్ళీ అరియానా టీం లోకి వెళ్ళింది.
నోయల్ అరియానా నుండి అవినాష్ టీం కి వెళ్ళాడు.
అవినాష్ మోనల్ ని రమ్మని కన్విన్స్ చేస్తున్నాడు ప్లీజ్ ప్లీజ్ అని లీడర్షిప్ అంటే నాకిష్టం అంటూ ఉన్నాడు కన్విన్స్ చేయడనికి ట్రై చేస్తున్నాను.
అరియానా వర్క్ లేకుండా ఇవ్వను అన్నది వేరే వర్క్ ఇస్తాను అని చెప్తుంది. లాస్య ని కన్విన్స్ చేయడనికి ట్రై చేస్తుంది.
హారిక వుమెన్ కెప్టెన్సీ కోసం నేను అరియానాని సపోర్ట్ చేస్తాను అని చెప్పింది.
స్టిల్ ఇద్దరి వైపూ ఐదైదుగురు ఉన్నారు. కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరూ కదలడం లేదు.
అవినాష్ నా కెప్టెన్సీ బావుంటుంది నా ఐడియాస్ బావుంటాయ్ అని అనిపిస్తే కనుక నా వైపు రండి అని అడిగాడు మళ్ళా మోనల్ అవినాష్ వైపు వెళ్ళింది.
హారిక దూరం నుండి అరియానా అమ్మ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇటు వస్తారు అని ఐడియా ఇస్తుంటే అవినాష్ చాలా సీరియస్ అయ్యాడు పర్సనల్ గేమ్స్ ని అలాగె ఆడనివ్వండి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయకండి అని చాలా అరిచి చెప్పాడు. మాటలు కూడా తడబడేంత కోపం వచ్చింది.
మోనల్ ని ఎందుకు వెళ్ళావ్ అని అరియానా అడిగితే నువ్వు మొన్న కుమార్ సాయి న మోనల్ నా అని అడిగితే నువ్వు కుమార్ పేరు చెప్పావ్ కదా అని అంది అందుకే.
దివి నువ్వు కూడా ఇటేనా నిన్ను కూడా బతిమాలాడలా అని అడుగుతున్నాడు నువ్వు ఎలానూ లీడ్ లో ఉన్నావు కదా నేను అరియానాకే సపోర్ట్ అని క్లియర్ గా చెప్పింది.
టాస్క్ ముగిసే సమయానికి అవినాష్ స్టేషన్ లో ఆరుగురు అండ్ అరియానా దానిలో నలుగురు ఉన్నారు. సో అవినాష్ ఇంటి కెప్టెన్ అయ్యాడు.
పాపం అరియానా ఏడ్చేసింది.
అవినాష్ ఎవరు సపోర్ట్ చేసినా చేయక పోయినా అది టాస్క్ వరకే మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పాడు. అరియానా నువ్వు ఏడుస్తున్నావా అని సారీ చెప్పి బ్యాండ్ పెట్టుకో నువ్వు అని చెప్పాడు కానీ అరియానా నో అని అంది.
అవినాష్ రేషన్ మానేజర్ గా అరియానా ని సెలెక్ట్ చేశాడు. నా ఫ్రెండ్ అనే కాదు లేడీ కెప్టెన్ కావాలని అన్నారు పైగా అరియానా కూడా చాలా కష్టపడింది అందుకే రేషన్ మానేజర్ ని చేస్తున్నా అని చెప్పాడు.
అరియానా అవినాష్ అమ్మ దివి మధ్య డిస్కషన్. మన పోటీ కన్నా అమ్మ గారు అండ్ దివి ఎక్కువ గొడవ పడుతున్నారు అని అరియానా చెప్పింది. ఇందులోనే ఆసలు నిజం చెప్పు నీకు నిజంగా కాలు నొప్పి ఉందా అంత ఎగిరి ఎగిరి పరిగెట్టావ్ టాస్క్ లో నేనేమో పిచ్చి దానిలా నా ఫ్రెండ్ కి కాలునొప్పి అని తినిపిస్తూ కాలికి మందు రాస్తున్నా ఈ రోజు అదే నా కొంప ముంచింది నువ్వు తెగ ఫాస్ట్ గా పరిగెట్టావ్ అని అంది.
స్కాందాంషీ తరఫున సమంత నాగ చైతన్య ఒక మెసేజ్ పంపారు. అది తెలుసుకోడాన్కి జిగ్ సా పజిల్ పూర్తి చేయాలి అన్నారు. లాస్య మెహబూబ్ సోహెల్ నోయల్ హారిక ల టీమ్ గెలిచింది.
అవినాష్ ముందు జాగ్రత్త అని కొన్ని పనిష్మెంట్స్ చెప్పాడు మైక్ మర్చిపోతే తల మీద నుండి వంద సార్లు వేస్కోవాలి. రెండు సార్ల కన్నా ఎక్కువ కుక్కలు మొరిగితె పూల్ లో దూకాలి. ఇంగ్లీష్ లో మాట్లాడితె కెమెరా దగ్గరకి వెళ్ళి చిన్నపిల్లల్లా మెం ఇంగ్లీష్ లో మాట్లాడం అనిచెప్పాలి అని కొత్త రూల్స్ పెట్టాడు.
అరియానాని స్టోర్ రూం కి పిలిచారు. రేషన్ అండ్ అభి సూట్ కేస్ మధ్యలో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్కోండి అని చెప్పాడు. రెండింటిలో ఏదో ఒకటే సెలెక్ట్ చేస్కోండి అని చెప్పారు.
అభి కూడా రేషన్ రేషన్ అని చెప్పాడు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు అన్నాడు.
సీజన్ మొత్తం బట్టలు ఇవ్వను అంటే కనుక నేను అభి థింగ్స్ తీస్కుంటాను అని చెప్పింది. సీజన్ మొత్తమో కాదో చెప్పకుండా తక్షణమే ఏదో ఒక డెసిషన్ తీస్కోండి అని చెప్పాడు బిగ్ బాస్. అంతమందిని నేను ఆకలితో ఉంఛలేను డెసిషన్ తీసేస్కుంటాను అని రేషనే తీసేస్కుంది.
అవి ఈ రోజు విశేషాలు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.