31, అక్టోబర్ 2020, శనివారం

అక్టోబర్ ముప్పై శుక్రవారం అన్ సీన్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. ఈ ఎపిసోడ్ నిన్న రాత్రి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ కి కొనసాగింపు. ఈ అన్ సీన్ ఎపిసోడ్ హాట్ స్టార్ లో ఉదయం అప్డేట్ చేస్తారు. మా మ్యూజిక్ ఛానల్ లో ఉదయం పదికి మరియూ సాయంత్రం ఆరుకి టెలికాస్ట్ అవుతుంది.  


అఖిల్ అండ్ సోహెల్ మధ్య డిస్కషన్ నడుస్తుంది. నువ్వు ఆడే గేం నాకు నచ్చలేదు. నో రిగ్రెట్స్ అంటే ఒక్క సారి కూడా ఆలోచించలేదు అని వస్తుంది అంటున్నాడు. కెప్టెన్సీ గేం లో మనస్ఫూర్తిగా ఆడలేదు నువ్వు మోనల్ కి ఇచ్చినా అరియానా కి ఇచ్చిన ఎవరైనా ఫీలవుతారు అని నువు సరిగా ఆడలేదు. నీ ప్రయత్న నువ్వు చేయాలి సరిగా ఆడలేదు. బిగ్ బాస్ చెప్పాడు కదా అబ్బాయిలు ట్రై చేయాలి అని నువ్వు ఆడ లేదు అని అంటున్నాడు. 

మోనల్ అండ్ రాజశేఖర్ ఇద్దరు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. సోహెల్ సేఫ్ గేం ఆడుతున్నాడు అని.

పిలిచినపుడు రాకపోడం మాట్లాడుతుంటే లేచెళ్ళిపోడం కరెక్ట్ కాదు అని సోహెల్ అంటున్నాడు 

సోహెల్ అవినాష్ కి చెప్పేశాడంట మొదటి రెండో రౌండ్స్ లో సరిగా ఆడలేదు ఎవరికివ్వాలో అని డౌట్ ఇద్దరూ నా ఫ్రెండ్సే అని. నాగార్జున గారు వీకెండ్ నన్నేసుకుంటారు ఫుల్ గా అని అన్నాడట. 

మాస్టర్ అవినాష్ అండ్ అరియానా మాట్లాడుకుంటున్నారు. సోహెల్ నామినేషన్స్ వేసిన దాని గురించి. అవినాష్ అమ్మ గారిని నువ్వు నామినేట్ వేయ్ అని అనడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు.
 

అభి లాస్య అండ్ హారిక డిస్కస్ చేస్తున్నారు. మోనల్ హారిక యాపిల్ ఫస్ట్ కట్ చేయడాం గురిమ్చి నోయల్ తో డిస్కస్ చేసిందట. అది కరెక్ట్ కాదు అతని ఆరోగ్యం బాలేకపోతే నాగురించి విను అనడం ఏంటి అని అంటున్నారు. పైగా అది ఆల్రెడీ క్లియర్డ్ డిస్కస్ చేసేసుకున్నాం కదా అని అంటున్నాదు. నోయల్ కూడా నేను హారిక సైడ్ తీస్కుంటున్నా అని చెప్పాడుట. ఐనా ఎందుకు అంత డిస్కస్ చేస్తుంది అని. లాస్య కూడా నాకే నచ్చలేదు మాకిద్దరికి డిస్ట్రబెన్సెస్ ఉన్నాయ్ కానీ నువ్వు మోనల్ ని బాగా చూశుకున్నావ్ అంది మీ ఇద్దరి రిలేషన్ బావుంది కదా ఎందుకు కట్ చేసిందో అని అంది. అప్పుడు అభి నాకు క్లియర్ తన కంటెంట్ బయటికి వెళ్ళాలి కదా సో ఒకటికి పది సార్లు ఎంత మంది దొరికితే అంతమందికి చెప్తుంది కూల్ స్ట్రాటెజీ వావ్ అని అంటున్నాడు. నా బర్త్ డే రోజు క్లియర్ గా చెప్పాను నువ్వు తనని అంత కేర్ చేయకు వినకు అని.

అమ్మ గారు కెప్టెన్ గా ఎవరు బెస్ట్ అంటే నువ్వే అని చెప్తా అని అంటున్నాడు. కెప్టెన్సీలో ఎవరూ పని చేయలేదు అవినాష్ చేశాడు ఐ అంటున్నారూ. అరియానా నేను చేయను అని చెప్పేసిందట. అరియానా బ్రిలియంట్ గా అన్నీ చూసి ప్లాన్డ్ గా ఆడుతుంది అని చెప్తున్నాడు. 

హారిక నోయల్ చొక్కా వేస్కుంది. లుక్స్ లైక్ షీ ఈజ్ మిస్సింగ్ హిమ్ ఇన్ హౌస్. 

ఇది చూసి అరియానా అవినాష్ మధ్యలో రేపు అరియానా వెళ్ళిపోతే ఎం చేస్తావ్ అని అడిగాడు అమ్మ. మంకీ బొమ్మ ని నువ్వు పెట్టుకుంటావా లేక స్ప్రే వేస్కుంటావా అని అడుగుతున్నాడు. ఇంకా నయం డ్రస్ వేస్కుంటావా అని అడగలేదు అంటున్నాడు అవి. 

ఫెండ్ అంటే ఇలా ఉండాలి నేను చేసినా నాకు ఒక్క హెల్ప్ చేయలేదు అని అరియానా గురించి అంటూ ఉన్నాడు అమ్మ సరదాగా నవ్వుతూనే అనేశాడు. పాపం అరియానా కాళ్ళు పట్టుకోబోయింది నువ్వు నా ఫ్రెండ్ అమ్మా అని చెప్తుంది. మళ్ళీ కాళ్ళకి మొక్కి మీరంటే నాకిష్టం అమ్మా అని చెప్తుంది. 

అవినాష్ నిద్ర ఆపుకోడానికి నానా ఫీట్స్ చేస్తున్నాడు .కప్ బోర్డ్ లో కూచుని కంఫర్టర్ మీద కప్పుకుని పడుకోడానికి ట్రై చేస్తున్నాడు. రోజుకి ఒక గంట అయినా ఎక్కువ నిద్ర పోయే అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు కెమేరా లో అవినాష్.    

టాస్క్ అయింది కదా మీరే నా బెడ్ సర్దమని అడిగాడు అఖిల్ సోహెల్ అండ్ మెహబూబ్ ని. ఇదే విషయాన్ని అభికి చెప్పి మాట్లాడుతున్నాడు. మాస్టర్ షూస్ తీసి ఇచ్చారు కదా టాశ్క్ అయ్యాక నువ్వు కూడా బెడ్ సర్దేసేయాలి అని వాదిస్తున్నాడు. ఆ టాగ్స్ నాకు వర్తించదు అని ప్రూవ్ చేస్కోవాలి కాబట్టి టాస్క్ అనే కాదు మీరు కంట్రోల్ లో ఉండాలి అని హరిక కూడా చెప్పింది.   

సోహెల్ సర్దేశాక అపుడు నవ్వుతున్నాడు అఖిల్. నువ్వు అట్ల కూచుని ఉంటే చూడలేక పోయాను అని ఏడ్చేశాడు సోహెల్. రా తినిపిస్తా అని చెప్తున్నాడు సోహెల్ కి..


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts