ఈ రోజు తెలుగు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినండి.
ఈ రోజు నిన్నటి "కొంటెరాక్షసులు మంచి మనుషులు" లక్జరీ బడ్జెట్ టాస్క్ కొనసాగుతుంది. మరో మూడు టాస్క్ లు ఇచ్చారు రాక్షసులని మనుషులుగా మార్చడానికి. ఒకటి ఫెయిలై మిగిలిన రెండు పూర్తి చేశారు మనుషులు. ఎప్పుడో ఫస్ట్ సీజన్ లో అర్చన మీద కామెడీ పంచ్ వేసి నవ్వించిన బిగ్ బాస్ ఈ సీజన్లో మళ్ళీ మెహబూబ్ మీద పంచ్ వేసి నవ్వించాడు. దసరా స్పెషల్ లక్జరీ ఐటమ్స్ గా స్వీట్స్ చాక్లెట్స్ వచ్చాయ్. కెప్టెన్సీ టాస్క్ రేపు ఉంటుంది.
వివరాలలోకి వెళ్తే
44 వ రోజు రాత్రి మూడవ టాస్క్.. గార్డెన్ ఏరియాలోని సర్కిల్ మధ్యలో ఉన్న ఇసుక మూటలు బయట పెట్టి కొంటె రాక్షసులు ఆ బస్తాలను సర్కిల్ లోపల వేయకుండా చూడాలి. సర్కిల్ లోపల మంచి మనుషులు బయట రాక్షసులు ఉండాలి. మనుషులు ఇసుక మూటలను తీస్కొని పూల్ లో వేశారు. ఒకటే మూట ఉండడంతో దాన్ని పట్టుకుని మెహబూబ్ ప్లే చేద్దామని చూస్తున్నాడు.
అదను చూసి సోహెల్ ఇసుక మూటను లోపలకి వేస్కోవడంతో కాసేపటికి బజర్ మోగడంతో ఆ సమయాన్కి ఇసుక మూట లోపలే ఉండడంతో మనుషులు ఓడిపోయారు.
నిన్న మనం అనుకున్నాం కదా.. హారిక రాక్షసులు మొత్తం ముగ్గురు నన్ను వదిలేసి ఒక బాత్ రూం లో దాక్కున్నారు నన్ను అలా వదిలేస్తే ఎలా అని అడిగా అని లాస్యతో చెప్పింది. వేరు వేరు సమయాల్లో వచ్చామని చెప్పారు అల వస్తే కనుక ఒకటే బాత్ రూం లో ఎలా ఉంటారు అని అడిగా అని చెప్పింది.
45వ రోజు హౌస్ లో పన్నెండు మంది ఉన్నారు. ఈ రోజు ఉదయం జానీ సినిమాలోని "నారాజు గాకుర మా అన్నయ్య" పాటతో మేల్కొలిపారు.
టాస్క్ డ్రస్ లోనే కంటిన్యూ అవ్వాలి అని చెప్పినా కొందరు డ్రస్ ఛేంజ్ చేస్కున్నారు. వెంటనే టాస్క్ డ్రస్ వేస్కుని టాస్క్ మొదలు పెట్టేయండి అని అనౌన్స్ చేశారు.
అరియానా మళ్ళీ అదే రేంజ్ లో అల్లరి మొదలు పెట్టింది. అదే డ్రస్సుల్లో వంట చేస్కుంటున్నారు.
పరుపులూ బట్టలు చెప్పులు అన్నీ మంచాల మీద నుండి తీసి మధ్యలో వేశారు. మనుషులు ఏం చేయకుండా సైలెంట్ గా చూస్తూ కూచున్నారు.
ఈ రాక్షసి ఎలా ఉంది అని అవినాష్ అడిగితే అరియానా గురించి అందంగా ఉందని చెప్పింది లాస్య. అందాల రాక్షసి అని అన్నాడు. మాడ్ ఫర్ ఈజ్ అదర్ అన్నట్లు ఉన్నారు అంటే అవునా అలా పంచ్ లు వేస్తే నేను మళ్ళీ మీ డ్రస్ లు తీసి బయట పడేస్తాం అని బెదిరించింది. మేడ్ ఫార్ ఈచ్ అదర్ అంటే అలా కూడా అనకండి మేం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు అవినాష్.
అవినాష్ సరదాగా ఓ చిన్న ఫన్నీ యాక్ట్ చేశాడు. మోనల్ వచ్చి హొయలు పోతూ మనిషిగా మారిపోవచ్చు కదా అని అవినాష్ ని అడుగుతుంది. మీరిద్దరూ చచ్చిపోండి అని అరియానా వెళ్ళిపోతుంది. అవినాష్ ఫ్లర్టింగ్ విత్ మోనల్ ఫన్నీగ ఉంది. అరియానాని పిలిచి మరీ ఉడికించడం ఫన్నీ..
సోహెల్ కొట్టడానికి వచ్చాడని అతని బట్టలు అతన్నే తీస్కుని బయట వేయమన్నాడు మెహబూబ్. లేకపోతే మిగిలిన అందరివీ కూడా వేసేస్తాను అని చెప్పాడు ఫైనల్ గా సోహెలే వేశాడు కోపంగ వేస్తుంటే కోపమొస్తుందీ అంటూ ఆటపట్టించాడు.
ఈ రోజు మొదటి టాస్క్ కుండలతో స్విమ్మింగ్ పూల్ నీళ్ళని రెండు పెద్ద డ్రమ్ములలో నింపడం. ఈ టాస్క్ బాగానే ఫిజికల్ అయింది. డ్రమ్ములు కాపాడుకోడానికి మనుషులు చాలానే కష్టపడ్డారు.
డ్రమ్ములు పొజిషన్ మార్చకూడదు అని రాక్షసులు వాదించారు. అలా మార్చినందుకు మెహబూబ్ కుండలు పగలగొట్టేస్తున్నాడు.
మెహబూబ్ డ్రమ్ము పూర్తిగా తలకిందులు చేసి దాని మీద కూర్చున్నారు మెహబూబ్ అవినాష్.
డ్రమ్ములని వంచి కిండ పడేస్తున్నారు. సో డ్రమ్ముని పూల్ లో వేశారు నింపడానికి. మెహబూబ్ డమ్ములోకి దిగాడు పైకి లేపడానికి వీలు లేకుండా. మెహబూబ్ అండ్ అఖిల్ ఇద్దరూ కూడా నువ్వు ఫిజికల్ అవుతున్నావంటే నువ్వు ఫిజికల్ అవుతున్నావని గట్టిగా వాదించుకున్నారు. నువ్వు తోపా అంటే నువ్వు తోపా అని కూడా కాసేపు అరుచుకున్నారు.
ఒక డ్రమ్ము పూల్ లో వేసి నింపాము ఒకటి బయట నింపాము మా టాస్క్ పూర్తయింది బిగ్ బాస్ అని చెప్తున్నారు మనుషులు బిగ్ బాస్ కి..
ఫైనల్ గా ఎండ్ బజర్ మోగేసరికి పూల్ లోని నీటితో రెండు డబ్బాలు నింపినందున ఈ టాస్క్ విజయవంతమైంది అని చెప్పారు.
మెహబూబ్ మళ్ళీ పారిపోయి బాత్ రూం లో దాక్కున్నాడు. ఈ సారి అవినాష్ ని మంచి మనిషిగా మార్చేశారు. నోయల్ ఒకటి దివి అండ్ మోనల్ ఒకటి తల పగలగొట్టారు.
చివరి టాస్క్ ఒక కొంటె రాక్షసున్ని ఎత్తుకుని బజర్ మోగే సమయానికి ఆ రాక్షసుడు నేలపై లేకుండా చూస్కోవాల్సి ఉంటుంది. టాస్క్ గురించి చెప్పగానే అరియానా అలా కిందపడిపోయింది తననే తీస్కుంటారని.
మెహబూబ్ మళ్ళీ వాష్ రూంలో దాక్కున్నాడు. అమ్మ గారు అరియానాని చంటిపిల్లలని ఎత్తుకున్నట్లుగా ఆయన భుజాల మీద ఎత్తుకున్నారు. కూచోబెట్టుకుని దించడం లేదు తను బాక్ పెయిన్ అన్నారు కదా మరి అంటే ఇలాంటపుడు రాదు అంటుంది అరియానా :-)
మెహబూబ్ ని వాష్ రూం దగ్గర నుండి లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు అఖిల్ అండ్ సోహెల్. ఇక ఇలా లాభం లేదని తను గట్టిగా తలుపు నెట్టుకు రావడానికి ప్రిపేర్ అవుతున్నాడు కానీ అంతలో అభి లేదు రానివ్వండి తనువస్తేనె గేం బావుంటుంది అని చెప్పాడు.
మెహబూబ్ లోపలికి వచ్చినా అరియానాని కిందకి దించలేదు మెహబూబ్ కూడా సీరియస్ గా ట్రై చేసినట్లు కనిపించలేదు. ఈ మధ్యలో మెహబూబ్ ని దివి ఎత్తుకుని కాసేపు తిప్పింది. అలాగె వాళ్ళిద్దరూ గథా యుద్దంలాగా చిన్న ఫైట్ చేశారు బావుంది.
బజర్ మోగె సమయానికి అరియానాను ఎత్తుకునే సోఫాలో ఉంఛడంతో కాలు కింద పెట్టకుండా మనుషులే విజేతలయ్యారు. చివరి తలలను అరియానా అండ్ మెహబూబ్ కూడా పగలగొట్టారు బావుంది వాళ్ళ యాక్ట్.
అందర్ని లివింగ్ రూంలో కూర్చిమ్మన్నపుడు మెహబూబ్ లేట్ గా వచ్చాడు డ్రస్ ఛేంజ్ చేస్కుని. "మంచి మనిషిగా మారిన మెహబూబ్ మైక్ వేస్కోవడం కూడా మంచి మనుషుల లక్షణమే" అని మైక్ మరిచిపోయినందుకు మంచి పంచ్ ఇచ్చారు బిగ్ బాస్ తనకి. హౌస్మేట్స్ కూడా బాగా నవ్వుకున్నారు. ఎప్పుడో ఫస్ట్ సీజన్ లో అర్చనతో ఇలాంటి ఫన్ చేశారు బిగ్ బాస్.
బెస్ట్ అండ్ వరస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేయమన్నారు. బిగ్ బాస్ మీరె డిసైడ్ చేయండి అని అడిగారు అందరూ. కానీ బిగ్ బాస్ నోయల్ ని అడిగారు కెప్టెన్ కనుక తక్షణమే చెప్పాలి. చెప్పలేకపోతే అందరూ నామినేట్ అవుతారు అని చెప్పారు. బెస్ట్ పెర్ఫార్మర్స్ అవినాష్ అండ్ అరియానా మాకు చుక్కలు చూపించారు కనుక అన్నాడు నోయల్. వాళ్ళే కెప్టెన్సీ టాస్క్ కు అర్హులు.
వరస్ట్ ఎవరూ లేరు కనుక మెంబర్స్ అంతా కలిసి ఇంటిని తిరిగి సర్దుకోండి అని చెప్పారు. అరియానా కాంపెయినింగ్ స్టార్ట్ చేసింది అఖిల్ అండ్ సోహెల్ ని మీకు అవకాశం ఉంటే నాకు సపోర్ట్ చేయండి అని.
ఓప్పో ఎఫ్ సెవెంటీన్ స్పెషల్ దివాలి ఎడిషన్ ని అన్ బాక్స్ చేయించారు. ఫీచర్స్ ఒక్కోటీ చదివి వినిపించి అఫర్మ్ చేశాడు అభి. తర్వాత సెల్ఫీ తీస్కున్నారు.
తర్వాత దసరా స్పెషల్ లక్జరీ బడ్జెట్ ఐటమ్స్ ని తీస్కోండి అని చెప్పారు. స్వీట్స్ బ్లాక్ చాక్లెట్స్ లాంటి గుడీస్ వచ్చాయి చిన్న పిల్లలకన్నా ఘోరంగా అల్లరి చేశారు అవన్నీ చూసి దదాపు యాభై రోజులవుతుంది కదా అలానే ఉంటుందేమో.
ఇక రేపటి ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్ చూపించారు. పేరు "బండి తోయ్ రా బాబు" అంట. ఒక్కో మెంబర్ ని బండిమీద ఎక్కించుకుని తోస్కుని వెళ్ళాలి అనుకుంటా ఇద్దరూ చెరో బండిలో మెంబర్స్ ని తోస్కుంటూ కనిపించారు. ఇద్దరూ కూడా చాలా అలసి పోయి బలంగా శ్వాస తీస్తూ కనిపించారు ఫైనల్ షాట్ లో. పాపం టఫ్ టాస్క్ లాగే ఉంది చూస్తుంటే.
అవి ఈ రోజు ఎపిసోడ్ విశేషాలు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.