ఈ రోజు బిగ్ బాస్ఇంట్లో లో ఏం జరిగిందో నా స్వరంలో ఇక్కడ వినండి.
ఈ రోజు సండే ఫన్ డే. రెండు టీమ్స్ గా విడగొట్టి చాలా గేంస్ ఆడించారు. డాన్సులు వేయించారు. ఎక్కువమంది ఊహించినదానికి విరుద్దంగా కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. సోషల్ నెట్వర్క్ లో నిన్నటి నుండీ ఈ విషయం సర్కులేట్ అవుతూనే ఉంది కానీ సర్ ప్రైజింగ్ అనే చెప్పాలి. అందరూ అన్ ఫెయిర్ అంటున్నారు చాలా పబ్లిక్ పోల్స్ లో మోనల్ లాస్ట్ లో ఉంది అని అంటున్నారు. కానీ అలాంటి చోట్ల వోట్ చేసేవాళ్ళకన్నా మిస్డ్ కాల్స్ అండ్ హాట్ స్టార్ ఓట్స్ వేసేవాళ్ళే ముఖ్యం కనుక కుమార్ కి అక్కడ ఓట్లు వచ్చి ఉండవు అనుకుంటున్నాను. ఇది ఒక్క తెలుగు లోనే వస్తున్న లోకల్ షో కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే సంస్థ డీల్ చేస్తుంది కనుక ఓట్స్ విషయంలో ఇలా వాళ్ళకి నచ్చినట్లు చీట్ చేయరు అనే అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. పూర్తి వివరాలు వీడియోలో వినండి.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.