ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటలలో ఇక్కడ వినవచ్చు.
ఈ రోజు రెండు టాస్క్ లు నడిచాయి. ఒకటి సెంచరీ మాట్రెసెస్ టాస్క్. ఇందులో విన్నర్ ఒక గంట ఎక్కువ నిద్ర పోవచ్చని చెప్పారు దాని కోసం బానే ఫైట్ చేస్కుని దివి గెలిచింది ఫైనల్ గా. రెండోది బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా మేకింగ్. అందరూ బానే పార్టిసిపేట్ చేశారు. తెల్లారుఝూమున మూడున్నర వరకూ షూట్ చేస్తూనే ఉన్నారు. మాస్టర్ ఈ రోజు కూడా అభి మీద అనవసరంగా రైజ్ అయ్యారని అనిపించింది.
వివరాలలోకి వెళ్తే 47వ రోజు ఉదయం ఓ బావా మా అక్కని సక్కగ సూస్తావా పాటతో మేల్కొలుపు..
సెంచరీ మాట్రెసెస్ టాస్క్ అందరు దాని మీద పడుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేపు ఉంటారో వారు దాని మీద ఈ రోజు రాత్రి పడుకోవచ్చు దానితో పాటు రేపుదయం ఒక్క గంట ఎక్కువ నిద్ర పోయే అవకాశాన్ని పొందుతారు.
అభి బయటే ఉన్నాడు ముందు నోయల్ ని ఎవరో తోసేశారు. తర్వాత అతను అమ్మ గారిని లాగారు. వాళ్ళు మెహబూబ్ ని లాగేశారు ఇలా అందరూ ఒక్కొక్కళ్ళని లాగేసి ఔట్ చేసేశారు. అరియానా మోనల్ దివి మాత్రం ఇంకా మాట్రెస్ మీదే ఉన్నారు మిగిలిన వాళ్ళందర్ని లాగేశారు. బజర్ మోగేసరికి ఒక్కసారి కూడా కిందకి దిగకుండా దివి మాత్రమే ఉండేసరికి తననే విజేత గా ప్రకటించారు.
సినిమా మేకింగ్ టాస్క్.
బిగ్ బాస్ బ్లాక్ బస్టర్
డైరెక్టర్ అభి అసిస్టెంట్ : దివి
స్క్రిప్ట్ : అవినాష్ డిఓపి నోయల్
కొరియోగ్రఫీ అమ్మ
మేకప్ అండ్ స్టైలింగ్ లాస్య
ఐటమ్ సాంగ్ హారిక సోహెల్
స్క్రిప్ట్ రైటర్,డైరెక్టర్,డిఓపి ఫైనల్ చేశాక ఆర్టిస్ట్స్ ని సెలెక్ట్ చేయాలి.
అవి యాక్ట్ కూడా చేయచ్చు.
సినిమాలో అన్ని ఎమోషన్స్ తో పాటు మొదలు ఎండింగ్ మిడిల్ మరియూ మంచి క్లైమాక్స్ ఉండాలి.
మొత్తం సెటప్ చూసి సభ్యులు అంతా ఎక్సైట్ అయ్యారు.
స్క్రిప్ట్ వర్క్ ఒక పక్క డాన్స్ ప్రాక్టీస్ ఒక పక్క జరుగుతుంది.
నేను అఖిల్ ని హీరో చేస్తుంటే మీరు అర్థం చేస్కోవాలి అని నవ్వుతున్నాడు అభి.. అఖిల్ హీరో గా బాగా చేస్తాడు అండ్ మెహూ ఫెంటాస్టిక్ విలన్ అవుతాడు అని చెప్తున్నాడు అభి.
అమ్మ గారు ఊరికే రైజ్ అయిపోయారు. కొరియోగ్రఫీ దగ్గరకి డైరెక్టర్ రాకూడదు అని అన్నాడు. నేను రాకూడదు కదా అని అన్నాడు. రెండు పాటలు ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేస్కోవాలి అండ్ రెండోది బిగ్ బాస్ ఇస్తారు. ఐటం సాంగ్ ఎక్కడ తీయాలో లొకేషన్ బిగ్ బాస్ చెప్తారు. ఇదే డిస్కషన్ దగ్గర కోప్పడ్డారు మాస్టర్.
సినిమా టైటిల్ కోసం డిస్కషన్ చేస్తున్నారు..
ప్రేమ మొదలైంది అని టైటిల్ సజెస్ట్ చేశారు
మనం తోపెహె అని లాస్య సజెషన్
కతవేరుంటది అని సోహెల్ సజెషన్. ఎవరికీ నచ్చలేదు.
స్క్రిప్ట్ రైటర్ వచ్చి హీరోయిన్ ఎలా ఉండాలో పొజిషన్ అన్నీ సజెస్ట్ చేస్తున్నాడు. గార్డెన్ ఏరియా లో షూటింగ్ నడిచింది హాల్ లోకి వచ్చారు నెక్స్ట్. డైరెక్టర్ ఫుల్ సజెషన్స్ ఇస్తున్నాడు యాక్టివ్ గా..
మోనలేమో రైటరే యాక్టింగ్ అంటే అతనే హీరో ఐపోతాడు. నేను అఖిల్ సైడ్ అయింది ఇపుడు సినిమా అరియానా అవినాష్ ది ఐపోయింది అంటుంది. పార్షియాలిటీ జరిగింది నేను ఊహించలేదు ఇలా చేస్తాడు అవినాశ్ అని అంటుంది మోనల్.
నోయల్ విలన్ గా చేస్తున్నాడు. అరియానా హీరోయిన్ గా చేస్తుంది. సోహెల్ అండ్ లాస్య ఇద్దరు సినిమా మీద గాసిప్స్ లాగా మాట్లాడుకుంటున్నారు పబ్లిక్ టాక్ అండ్ లీక్స్ లాగా...
బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్స్ తోపు దమ్ముంటే ఆపు అనేది టైటిల్ అంట. ఈమూవీ రిలీజ్ రేపు అని అమ్మ గారు యాడ్ చేశారు. అవినాష్ అండ్ అభి మధ్య డైలాగ్స్ ఎవరు రాయాలి అనేది డిస్కషన్ నడిచింది.ఎలివేషన్ అనేది హీరో అండ్ విలన్ ఇద్దరిదీ సమానంగా ఉండాలి అని అవినాష్ చెప్తున్నాడు. అభి ఏమో అఖిల్ కి మిస్సయింది పెడదాం అనిచెప్తున్నాడు.
అవినాష్ ని డైలాగ్స్ రాయనివ్వడం లేదు అని అంటున్నాడు. నేనేం హీరోని కాదు కామెడీ పీస్ ని అని నాకు తెలుసు అని చెప్తున్నాడు అవినాష్ సోహెల్ తో.. నా సీన్స్ ఎక్కువున్నాయ్ అంటున్నారు కానీ నేను అరియానా చేసింది రెండే వాళ్ళవి ఆల్రెడీ నాలుగు సీన్స్ అయ్యాయి అనిచెప్తున్నాడు.
అఖిల్ అండ్ మోనల్ లవ్ సీన్ తీస్తున్నారు ఈ సీన్ నేను డైరెక్ట్ చేయడం ఏం ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్ అని అంటున్నాడు అభి.
అఖిల్ మొన్న కనిపించావు పాట మంచి ఫీల్ తో పాడాడు.. మోనల్ కూడా చాలా ఫీల్ తో యాక్ట్ చేసింది. మీద వాలి పోయింది. సీన్ అయ్యే సరికి అమ్మ గారు ఆ గేట్ తీయండిరా నేను వెళ్ళిపోతాను అని అంటున్నారు. అందరూ సూపర్ సూపర్ అని చప్పట్లు కొట్టారు.
అవినాష్ ఇదేదో నాకు యాక్టింగ్ లా కనిపించడం లేదే చాలా రియల్ గా ఉంది అని అంటే. అరియానా వన్ మోర్ టేక్ తీయచ్చు కదా అంట :-) అఖిల్ వద్దు బాబోయ్ అని అంటున్నాడు. మాస్టర్ కి వాళ్ళ వైఫ్ గుర్తొస్తుంది అంటున్నాడు.
నోయల్ ఇన్ పుట్స్ ఎవరూ తీస్కోడం లేదని హారిక నవ్వుతూ కామెడీ చేస్తుంది.
అవినాష్ నాకు డైరెక్షన్ ఇస్తె రియల్ ఫైట్ లా చేస్తాను అద్దాలన్నీ నిజంగా పగల గొట్టేస్తా అని చెప్తున్నాడు.
కెవ్వు కేక పాటకి సోహెల్ అండ్ హారిక పెర్ఫార్మెన్స్ అదర గొట్టేశారు. అమ్మ గారి కొరియోగ్రాఫ్ లో.. మొత్తం లాంజ్ లోమాంచి సెటప్ వేసి అందులో చేశారు.
రాత్రి మూడింటికి అఖిల్ మోనల్ అవి అరియానా మధ్య సీన్ తీస్తున్నారు. సెట్ లో సీరియస్ నెస్ లేకుండా నవ్వుతూ ఉన్నారు దివి కూడా నవ్వుతుంది.. అరియానా నవ్వుతూ కింద పడిపోయింది.
అవినాష్ బాగా సీరియస్ అయ్యాడు నేను చేయను అని డ్రస్ తీసేసి లోపలికి వెళ్ళాడు. డైరెక్టర్ కూడా టోపీ తీసి కింద పడేశాడు. నాకు సీరియస్ నెస్ లేకపోతే నచ్చదు నేను ఫుడ్ కూడా తినలేదు వాళ్ళంతా తినేవరకు ఎదురు చూశాను. ఇప్పుడు కాదు మొత్తం అందరికీ నామినేషన్స్ టైమ్ లో చూపిస్తా అని సీరియస్ అవుతున్నాడు అవినాశ్.
ఒక ఐదు నిముషాల తర్వాత అమ్మ గారు లోపలికి వచ్చి సరే ఐపోయింది నువ్వు వెళ్ళి ఒక్క షాట్ చేసేయ్ అని చెప్పాడు.
అభి కూడా వచ్చేసి రా రా అని పిలుచుకుని వెళ్ళాడు షూటింగ్ కి. రాత్రి మూడున్నర వరకూ షూటింగ్ చేస్తున్నారు.
లాస్ట్ సీన్ లో మోనల్ నా పెళ్ళికి రండి అని చెప్తుంది పక్కన అఖిల్ ని ఉంచుకుని ఇక నేను డైరెక్షన్ చేయలేను బాబోయ్ అని అభి ప్యాకప్ చెప్పేశాడు.
దివి బెడ్ అంతా నీట్ గా బ్రహ్మాండంగా సెట్ చేస్కుంది మూడుముప్పావ్ అప్పుడు. నాకు చాలా బావుంది ఇంట్లో నా బెడ్ మీద పడుకున్నట్లు ఉంది అని చెప్తుంది.
రేపటి ప్రోమోలో మీరు చూడబోతున్నారు అతి పెద్ద మూవీ ప్రీమియర్ బిగ్ బాస్ బ్లాక్ బస్టర్. అని కొన్ని షాట్స్ చూపించాడు ప్రీమియర్ కోసం అందరూ డ్రస్సప్ అవుతున్నారు. బిబి స్టార్ అవార్డ్స్ అని సెట్ చేసిన స్టేజ్ సెటప్ అంతా చూపించాడు గ్రాండ్ గా బావుంది. ప్రేమ మొదలైంది పేరె ఫైనల్ చేసినట్లున్నారు అవే పోస్టర్స్ చూపించారు.
అవండీ ఈ రోజు విశేషాలు. మళ్ళా రేపటి హైలైట్స్ లో కలుద్దాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.