ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటలలో ఇక్కడ వినండి.
ఈ రోజు టాస్క్ డే.. "కొంటెరాక్షసులు మంచి మనుషులు" లక్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. లాస్ట్ సీజన్ లో దెయ్యాలు మనుషులు స్టైల్లోనే కాస్త మారిందనమాట. అవినాష్ పెర్ఫార్మెన్స్ డైలాగ్ డెలివరీ ఆ డిక్షన్ తో అదరగొట్టేశాడు. ఇది కేవలం మిమిక్రీ వల్ల నేర్చుకున్నాడా లేక స్టేజ్ ఆర్టిస్టా అని అనుమానం వచ్చింది అంత బాగా చేశాడు. అరియానా కూడా బాగా అల్లరి చేసింది రాక్షసిగా. ఈ రోజు అఖిల్ అండ్ హారిక ఇద్దరు రాక్షసులను మనుషులుగా మార్చేశారు. రేపు కూడా ఇదే టాస్క్ కంటిన్యూ అవబోతుంది.
వివరాలలోకి వెళ్తే 44 వ రోజు పన్నెండు మంది ఉన్నారు హౌస్ లో ఈ రోజు టాస్క్ కి తగినట్లుగా ఉదయం జై లవకుశ సినిమాలో రావణా పాట వేశారు.
ఓపెన్ చేయడమే డైరెక్ట్ గా టాస్క్ లోకి వెళ్ళారు బిగ్ బాస్ పురం అని ఊరట. కొంటెరాక్షసులు మంచి మనుషుల పనులకి ఆటంకం కలిగించడం కాక వస్తువులు పడేస్తారు. మంచి మనుషులు వాళ్ళని పట్తించుకోకుండా అన్నీ సర్దుకొంటూ వారి పనులు వారు చేసుకుంటూ రాక్షసులను మార్చడానికి ప్రయత్నించాలి.
రాక్షసులు : అరియానా, మెహబూబ్,అఖిల్, అవినాష్, హారిక
మనుషులు : అభి, దివి, నోయల్, లాస్య, అమ్మ, మోనల్ అండ్ సోహెల్.
విజయదశమి అంటేనే చెడుపై మంచి గెలుపు. మంచి మనుషులు గా మార్చడానికి కొన్ని టాస్క్ లు ఇస్తారు. వాటిని కొనసాగనివ్వకుండా రాక్షసులు అడ్డుపడతారు కానీ మంచి వాళ్ళు అవాంతరాలను ఎదుర్కుని టాస్క్ ముగించాక పది తలల రావణాసురుడి బొమ్మవి రెండు తలలు పగలకొట్టి రాక్షసుల టీమ్ నుండి ఒకరిని పట్టుకోవాలి. పట్టుకున్న వారు మంచిమనిషి అవుతారు. ముగిసే సమయానికి కనీసం ముగ్గురుని మారిస్తే మనుషులు విజేతలవుతారు.
హారిక అబ్బా ఇపుడు దెయ్యాల్లా రెడీ అవ్వాలా అనుకుంటుంది.
అరియానా నిజమైనా రాక్షసిలా మేకప్ వేస్కోడమే కాక నడక కూడా అంతే చేసింది. అన్నీ అటూ ఇటూ పడేస్తూ విపరీతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. గిన్న్నెలు కిందపడేసింది. బట్టలు, బెడ్ మీద దుప్పట్లు అన్ని కిందపడేసింది.
హారిక మంచి రాక్షసిలా అమ్మ గారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది.
నోయల్ నా మొహం మాత్రమే పాడు చేయగలవ్ కానీ పాడైన నీ మనసు గురించి ఆలోచించు అంటూ తన పోప్ జాన్ పాల్ అవతారాన్ని ఇక్కడకూడా విజయవంతంగా కొనసాగిస్తున్నాడు.
లాస్య మేకప్ పోతుంది బిగ్ బాస్ అని బాధపడుతూ పారిపోతూ ఉంది ఎవరికీ అందకుండా. అవినాష్ "మానినీ నీ మాటలు వింటూంటే" డైలాగ్ చెప్పాడు ఏకపాత్రాభినయం పెర్ఫార్మన్స్ అదరగొట్టేశాడు. డిక్షన్ డైలాగ్ డెలివరీ చాలా బావుంది.
అభి లాస్ వెగాస్ అని సిన్ సిటీ ఉంది అక్కడికి వెళ్ళాక రాక్షసివి అవు ఇపుడు ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని సిన్స్ చేసినా ఉపయోగం ఉండదు అని హారిక తో చెప్తున్నాడు.
సోహెల్ ని మెహబూబ్ మమ్మీలా తయారు చేస్తున్నాడు టిష్యూ పేపర్ చుట్టేసి. నోయల్ అమ్మ గారు ఇద్దరు శాంతి శాంతి అని రాక్షసులకి బుద్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.
అమ్మ గారి డ్రస్ లో ఐస్ క్యూబ్స్ వేసింది హారిక. నోయల్ మీద షేవింగ్ ఫోమ్ పూసి పసుపు బ్లాక్ కలర్ నీళ్ళు పోసి నానా హంగామా చేస్తున్నారు. లాస్య బిగ్ బాస్ ఏంటీ న్యూసెన్స్ ఇవన్నీ చూడండి వీళ్ళంతా ఎలా పూస్తున్నారో అని కంప్లైంట్స్ చేస్తుంది.
అమ్మ గారు ఎం చేసినా శాంతి శాంతి అని అంటూ కంట్రోల్ చేసుకుంటున్నారు.
దివి మీద లిప్ స్టిక్ పూస్తుంటే దొరకకుండా పారిపోయింది. మోనల్ మీద అవీ ఇవీ పూస్తుంటే హగ్ చేసుకుని అదంతా రాసిన అవినాష్ కే తిరిగి పూసేసింది. మోనల్ దగ్గర అరుందతి డైలాగ్ చెప్పాడు అవినాష్ వదల బొమ్మాలి డైలాగ్ అదరగొట్టేశాడు.
అరియానా నోయల్ తలమీద కోడిగుడ్డు పగలకొట్టింది. ఒకేటానా ఇంకా రెండో మూడు నాలుగు ఇంకా పగల కొట్టండి అని అంటున్నాడు నోయల్. మెహబూబ్ అఖిల్ చెరోవైపు ఉండి సోహెల్ ని విసిగిస్తున్నారు.
కొంటెరాక్షసుల్ని మంచి మనుషులుగా మార్చే అవకాశం మొదటి టాస్క్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న పూవులతో యాభై దండలని అల్లాలి.
అభి ఫస్టే సోహెల్ ని నోయల్ ని వాష్ రూం లోకి వెళ్ళమని సలహా ఇచ్చాడు. అక్కడ సీక్రెట్ గా దండలు అల్లుతున్నారు వాళ్ళు. ఆందరూ బాగానే చెడగొట్టాడానికి ప్రయత్నింఛారు కానీ మనుషుల సంఖ్య ఎక్కువ ఉండడంతో వాళ్ళదే విజయం.
యాభై ఆరు దండలు గుచ్చారు రాక్షసుల రెండు తలలని పగలకొట్టి ఒకళ్ళని మనిషిగా మార్చేశాయాలి. అఖిల్ ని సెలెక్ట్ చేస్కున్నారు ఫస్ట్.
రెండో టస్క్ క్లేతో వంద ప్రమిదలు తయారు చేయడం.
క్లే బాక్స్ లు దాచేస్తున్నారు రాక్షసులు.
ఈ సారి నోయల్ స్టోర్ రూం లోకి వెళ్ళి అక్కడ ప్రమిదలు చేయడం మొదలు పెట్టాడు. అక్కడ మెహబూబ్ అండ్ అవినాష్ డోర్ తీయడానికి ప్రయత్నం చేస్తుంటే నోయల్ నా కాలు నాకాలు అని ఊరికే నటిస్తూ అడ్డుపడ్డాడు సీక్రెట్ గా చేశాడు కానీ మొత్తం మీద తోసుకుని లోపలికి వచ్చేసి చెడగొట్టేశారు..
హారిక సోహెల్ తో చాలా ఫైట్ చేసింది. అరియానా అవినాష్ చేతులపై గీస్తున్నారు కొరుకుతున్నారని చూపించారు. రాక్షసులు వాళ్ళా మేమా అని అడుగుతున్నారు. సోహెల్ ఆల్రెడీ కాస్త ఇరిటేట్ అయినట్లు కనిపిస్తున్నాడు.
మొత్తానికి చివరికి మనుషులు నూట అరవై ప్రమిదలు చేశారు. ఇది ఫన్ ఇది ఫన్ అని డాన్స్ చేశారు. రెండు తలలు పగలగొట్టాక మెహబూబ్ ని అవుట్ చేయాలని ప్రయత్నింఛారు. మెహబూబ్, అవినాష్ అరియానా ముగ్గురూ ఒకే బాత్ రూం లో లాక్ చేస్కున్నారు. హారిక కూడా మంచం హెడ్ రెస్ట్ కీ గోడకీ మధ్యలో దాక్కుంది.
ఫైనల్ గా సోహెల్ హారికని కనిపెట్టాడు తననే ఔట్ చేశాడు. అందరి ఇష్టం వేరే మనిషి మీద ఉంది కాబట్టి నన్ను ముట్టుకున్నా అది చెల్లదు అని కెమెరా తో చెప్తుంది హారిక. మనుషులు ముట్టుకున్నా డ్రస్ పంపలేదు బిగ్ బాస్. ఇలా కాదని మనుషులు అందరూ కలిసి చెప్పారు హారికని మంచి మనిషిగా మారుస్తున్నాం అని అపుడు డ్రస్ పంపారు బిగ్ బాస్.
మనుషులు నన్ను మనిషిగా మార్చాలని అనుకోలేదు వేరె పేరు అనుకున్నారు అందుకని నేను మారట్లేదు వాళ్ళకి హెల్ప్ చేయను లక్జరీ బడ్జెట్ టాస్క్ లో ఐటమ్స్ కూడా తినను అని చెప్పింది హారిక. రాక్షసులు ఉన్న నలుగురిలో ముగ్గురు ఒక చోట దాక్కుని తనని ఒంటరిగా వదిలేయడం అండ్ మనుషులకి తను ఫస్ట్ చాయిస్ కాదు గదా సెకండ్ ఛాయిస్ కూడా కాకపోవడం మనుషులుకి హెల్ప్ చేస్తున్నట్లుగా అరియానా కోప్పడడం వీటన్నిటితో తను బ్రేక్ డౌన్ అయినట్లుగా కన్పించింది.
రేపటి ప్రోమోలో కూడా ఇదే టాస్క్ కొనసాగుతుంది. రేపు మూడో రాక్షసుడిని మార్చటం కోసం టాస్క్ స్విమ్మింగ్ పూల్ నీటితో డ్రమ్ములు నింపాలనుకుంటాను. మెహబూబ్ కి అఖిల్ కి మధ్య గొడవ అయింది ఫిజికల్ అవ్వద్దు అని అఖిల్ చాలా సీరియస్ అయినట్లు కనిపిస్తుంది.
అవి ఈ రోజు విశేషాలు
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.