31, అక్టోబర్ 2020, శనివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. అవినాష్ నోయల్ విషయం పై నా అభిప్రాయం ఎనిమిది నిముషాల నుండి మొదలవుతుంది వీడియోలో. కింద ఉన్నది రఫ్ నోట్స్.. 


55 వ రోజు ఇంట్లో పదకొండు మంది ఉన్నారు. మధ్యాహ్నం ప్రీతీ మిక్సర్ గ్రైండర్ వాళ్ళ ప్రమోషన్ టాస్క్ ఇచ్చారు. అమ్మాయిల టీం అబ్బాయిల టీం గా విడిపోవాలి. అభిజిత్ అండ్ మెహబూబ్ ఫుడ్ టేస్టర్స్ అమ్మాయిలు పాలక్ పన్నీర్ సాలడ్, అబ్బాయిలు పరాఠా ప్రాన్ కర్రీ చేయాలి. రెండు టీమ్స్ బాగా చేశారు.. ప్రాన్స్ అండ్ పాలక్ పన్నీర్ రెండూ చాలా బావున్నాయ్ బాగా చేశారు.. కానీ విన్నర్ మాత్రం బోయ్స్ టీం. 

ఈ టాస్క్ అవగానే హౌస్ లోకి వెళ్ళిపోయారు. కులు లో షాప్స్ లేవు టూరిస్ట్స్ లేవు వెతికి వెతికి ఒక షాప్ పట్టుకుని ఒపెన్ చేయించాను అని చెప్పారు. స్వెట్టర్స్ అండ్ వింటర్ వేర్ కులు ట్రెడిషనల్ వేర్ అని చెప్పి ఇచ్చారు. 

అఖిల్ అండ్ సోహెల్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు మీరిద్దరు ఏదో చిన్న డిస్ట్రబెన్స్ ఉంది అది సార్ట్ అవడానికి ఒక వీడియో చూపిస్తాను అని  మోనల్ నోయల్ దగ్గర సోహెల్ డిస్కషన్ వీడియో మొత్తం క్లిప్ వేసి చూపించారు. ఇందులో తప్పెవరిది అని అడిగితే తర్డ్ పర్సన్ వచ్చి చెప్పడం వల్ల జరిగింది అని చెప్పారు. పదాలు మారితే అర్థాలు మారతాయ్ అని చెప్పి పంపించారు. లోపల ఏం జరిగిందో అది బయట చెప్పకండి. 

మోనల్ ని లోపలికి పిలిచారు అభిజిత్ తో కలవడానికి ప్రయత్నం చేస్తున్నావ్ కదా గుడ్ అని చెప్పి నీకో వీడియో చూపిస్తా అని నోయల్ లాస్య అభి మధ్య బ్లాంకెట్స్ సీన్ గురించి డిస్కషన్ జరిగిన వీడియో క్లిప్ చూపించారు. హేట్ కాదు చీటెడ్ అని అన్నది మోనల్ వాక్స్ లైక్ ఎ కేమెల్ అన్న వీడియో క్లిప్ కూడా చూపించారు. నార్మల్ గా లాస్య నోయల్ స్వీట్ గా మాట్లాదుతారు వాళ్ళది వేరే ఫేస్ కనిపిస్తుంది ఇపుడు అని అంది. రైట్ ఒకోసారి గ్యాప్ ఏంటంటే చుట్టూ కూచున్న వాళ్ళది కూడా అని చెప్పారు. 

అరియానా ని పిలిచారు. చాలా మంది నీకోసం హౌస్ లో శాక్ర్తిఫైస్ చేయడమ్ లేదు. అది అర్థం కాడానికి నీకు ఓ వీడియో చూపిస్తా అని అమ్మ గారు రేషన్ మానేజర్ ఇవ్వలేదని మాట్లాడిన వీడియో చూపించారు. బత్తాయిలు పాడైన విషయం క్లిప్ కూడా చూపించారు. నీ నుండి ఆశించి నీకు సాయం చేశారు అండ్ వాళ్ళని నువ్వు పట్తించుకోలేదు అలాగే ఉండు బాగా ఆడుతున్నావు అని అన్నారు. మోనల్ విషయం తీస్కున్న డెసిషన్ కరెక్టేనా అంటే నువ్వు జస్టిఫై అయితే నువ్వు ఆ నిర్ణయంతోనే వెళ్ళు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ నువ్వు ఒంటరిగానే ఉంటావు అని చెప్పారు. 


ఈ యాభై ఐదు రోజుల్లో మీకు విలన్ ఎవరూ అని అడిగారు. 

అఖిల్ స్టార్ట్ చేశాడు అభికి పెట్టాడు. కొన్ని మిస్ కమ్యునికేషన్స్ వలన ఈ జర్నీలో అన్నాడు ఫ్యూచర్ లో ఏం కాదు అన్ని సార్టెడ్ ఔట్ అన్నాడు. 

సోహెల్ అరియానా నే మాటల్లో స్ట్రాంగ్ వోడించలేను అని అన్నాదు. అరియానా మాత్రం ఫెండ్ గానే కన్పించాడు నాకు అంది. 

అభిజిత్ ని పిలిచి నువ్వు పులి కదా పులి హాజ్ పేషన్స్ నీ గురించి తర్వాత మాట్లాడుతా అని చెప్పారు. 

అమ్మ గారు అభిని విలన్ అన్నాడు మొదటి నుండి క్లాస్ మాస్ డిఫరెన్స్ ఉన్నాయ్ తను బ్రిలియంట్ గా చేస్తాడు నేను కష్టపడ్తాను. 

హారిక మెహబూబ్ ని నా బౌల్ లో వాటార్ పోసి నన్ను వెళ్ళిపోవాలని అప్పటి నుండీ నాకు విలన్ గేం లో కూడా బెదిరిస్తాడు నా జోలికొస్తే అంతె అని అందుకే అన్నడు. మటన్ మాన్ అని పిలిచాడు.. సోహెల్ల్ ని కొరకడమేంటి అన్నాదు అఖిల్ అంకుల్ బాగా చూసుకున్నాదు అంటే అఖిల్ అంకుల్ చాలా మందిని చూసుకుంటుననదు అని అన్న్నారు. 

మెహబూబ్ హారిక ని విలన్ అన్నాడు ఆల్రెడీ నాలుగు సార్లు నామినేట్ చేస్తుంది అందుకే అని చెప్పాడు. 

అవినాష్ ని పిల్లాడిగా బాగా చేశావ్ అన్నారు. అరియానా దగ్గర చాక్లెట్ అడిగు చిన్న పిల్లాడిలా అని. ఎత్తుకొ అని గోల చేశాడు ఎత్తుకోబోతుంటే ఛీఛీ ఆపన్నారు నాగ్. విలన్ లాస్య అని అన్నాడు. టీ పెట్టనందుకు టీ పోయలేదు అని అన్నాడు నామినేషన్స్ లో కూడా అదే ఛెప్పాడు. 

లాస్య అవిని విలన్ అంది. మూడు మీల్స్ బిగ్ బాంబ్ లో చేస్తున్నాను మరో వర్క్ ఇవ్వాలని ఎలా అనిపించింది అంది. నువ్వు టీ కూడా పెట్టుకో లేవు ఆమెకి మాత్రం అన్ని పనులు ఎక్కువ ఇస్తావా అని అడిగాడు. 

అరియానా కనిపించని విలన్ అఖిల్ అని అంది. గేం మీద ఫోకస్ ఎక్కువ చేస్తాడు నన్ను కాంపిటీటర్ అని ఫీలవి చిన్న రీజన్స్ తో నామినేట్ చేస్తున్నాదు. కొట్లాడే విధానం నాకు నచ్చదు అని అఖిల్ అంటున్నాడు. టేక్ ఇట్ యాజ్ కాంపిటీషన్ అని అన్నారు.. చిన్న పిల్లల టాస్క్ చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. 

అభిని పులి పులి అని పిలిచారు. నీకు యానిమల్స్ ఎక్కువ ఇష్టం అంటగదా నా వైఫ్ ఇన్ప్లుయెన్స్ చేసిందా అన్నాడు. కొంటవరకు ఎస్ అని చెప్పాదు. నీకు పులి తో పాటు కేమెల్ కూడా ఇష్టం అంట కదా అంటే రాజస్థాన్ కొంచెం దగ్గర కదా అని అన్నాదు. అలా వచ్చావా అని అన్నాడు. అభికి విలన్ అమ్మ గారు ఆయన పెద్దరికం గా ఉండాలని అనుకుంటాం బట్ హీ ఈజ్ నాట్ అన్నాడు.  
పాపం హారిక మీద అంత కోప్పడడం ఏంటీ అని అడిగారు. యా నేను కూడా ఫీలయ్యాను అని చెప్పాడు.. నా దగ్గర మాట్లాడదామని వచ్చి తను ఆశించినది నేను అనలేదని వెళ్ళిపోయింది అదే నాకు నచ్చక అలా అరిచాను అన్నాడు. అలా వెళ్ళిపోతే ఆమాత్రం నన్ను అర్ధం చేస్కోలేవా అని అడిగింది. క్లోజ్ గా ఉన్నపుడు వాళ్ళమీదే అరవ కూడదు వాళ్ళనే ఎక్క్కువ పట్తించుకోవాలి. హారిక ఏడ్చేసింది ఈ సారి తిడితే చంపేసేయ్ అని అన్నారు. 

మోనల్ లాస్యని విలన్ అంది. ఎలిమినేషన్ కి వెళ్ళి వచ్చాక లాస్య హగ్ ఇవ్వలేదు తర్వాత నుండి బిహేవియర్ కొంచెం మారిపోయింది అని చెప్పింది. దగ్గర ఐన వాళ్ళే కొంచెం హర్ట్ చేసే ఆవకాశం ఎక్కువ ఉంది అని అంది. బ్లాంకెట్ టాక్ విషయం వచ్చింది అక్కడ లాస్య క్లారిటీ ఇచ్చింది అది మజాక్ చేస్తునా అంతే అంది. 

టైమ్ టు సేవ్ వన్ స్టోర్ రూం లో ఓ బొమ్మ ఉంది తీస్కురమ్మాన్నారు. ఆ బేబీని మోనల్ కి ఇచ్చేయండి, ఏడుస్తూ ఉంటుంది నవ్వించడానికి ట్రై చేయండి ఎక్కడ నవ్వితే వాళ్ళు సేఫ్ అని చెప్పారు. మోనల్ అఖిల్ లాస్య అరియానా అమ్మ గారు మెహబూబ్ అందరూ ట్రై చేశారు మళ్ళీ రిటర్న్ రౌండ్ లో అఖిల్ దగ్గర నవ్వింది.    

ఇప్పటివరకూ చెప్పలేదు ప్రేక్షకులు అందరికీ ఇక్కడి దాకా తీస్కొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. నీ ఆటని బట్టే ఓట్స్ అని చెప్పారు. 

నోయల్ ఆరోగ్య రీత్యా వెళ్ళాల్సి వచ్చింది నార్మల్ వెల్కమ్ ఇవ్వాలి అని వెల్కమింగ్ ఆన్ టు ద స్టేజ్. స్పాండిలైటిస్ ఉందిట మొదట లెఫ్ట్ లెగ్ లో మొదలైంది హౌస్ లో ప్రెజర్ అంతా రైట్ లెగ్ పై పడడం తో దానిలో కూడా డెవలప్ అయింది. పూల్ దగ్గర వేలు కట్ అయింది అది కూడా బెండ్ అవడం లేదు అది కూడా ఓ ట్రామా ఐపోయింది అని చెప్పాడు. అవి బయటికి కనిపించనీకుండా చాలా బాగా ఆడావ్ అని చెప్పారు నాగ్. 

స్పాండిలైటిస్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసీ అది భరిస్తూ ఇన్ని రోజులు ఆడాడంటే నిజంగా గ్రేట్ అనిపించింది నాక్కూడా. 

జర్నీ వీడియో చూపించాడు బావుంది. 

అవినాష్ అండ్ అమ్మ గారిని ఒంటి కాలి మీద నుంచో మని అడిగాడు ఈ లోపు మిగిలిన వాళ్ళతో మాట్లాడుతాను అని చెప్పాడు. లాస్య హారిక అభి ముగ్గురు టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకుంటున్నా అని అన్నాడు. లాస్య ని ఎవరైనా కిందకి లాగుతుంటే వాళ్ళు కిందున్నారు తొక్కేయ్ అని చెప్పారు.
అరియానా బయటెలా ఉన్నావో ఇంట్లో కూడా అలాగే ఉన్నావు నువ్వు జర్నీ లో పెట్రోల్ అవ్వ కూడదు బర్న్ అయిపోతావ్ గేం బాగా ఆడు అని చెప్పాడు. 

మెహబూబ్  మనకి గ్యాప్ ఎందుకు వచ్చిందొ తెలీదు నువ్వు నావాడివి అని అనుకున్నా కనుకే గ్యాప్ తీస్కోనిచ్చా. 
సోహెల్ బాయ్ నువ్వు చిన్న పిల్లోనివి. నువ్వు నాకు ఇష్టం అని చెప్పాదు. 

హారికని పిలిచాడు నాగ్ హారిక గురించి ఏం చెప్పకు అని అన్నారు. ఆగు అని చెప్పినా ఆగట్లేదు కన్నీళ్ళు బయట వాళ్ళతో ఇన్ని రోజులు ఇరవై నాలుగు గంటలు కలిసి ఉండము. హెల్ల్ లో ఉంటే నన్ను ఎప్పుడూ బయటకి తీస్కొచ్చావు నువ్వు నాకు బ్యాక్ బోన్ వి అని చెప్పింది. మోటివేటింగ్ రాప్ పాడాడు. జనన్ని లైఫ్ లాంగ్ ఎంటర్టిఅన్ చేయాలా లేక ఓన్లీ రెండు నెలలా అని అలోచించాను అందుకే వెళ్టున్నా అని చెప్పాడు. 

అమ్మ అండ్ అవినాష్ ఇద్దరిని కాలు నొప్పొచ్చాయా అని అడిగాడు. దానికి వేయి రెట్లు కాళ్ళు నొప్పి ఉంటుంది నాకు కాళ్ళు పొద్దున్న అరగంట పాటు ఫిజియో చేస్తే కానీ నడవడానికి రాదు అని చెప్పాడు. 

మూడు రోజుల క్రితం మీరిద్దరు నన్ను తప్పుగా ఇమిటేట్ చేశారు అని చెప్పాడు. నాగ్ ముందె చాలా సేపు హీటెడ్ డిస్కషన్ నడిచింది. 

నోయల్ అభి తో కలిసి మోనల్ మీద జోకులు, కేమెల్ నడక అనడం. లాస్ట్ సీజన్ లో రాహుల్ ఎలివేషన్ అండ్ శ్రీముఖిని పై నెగటివ్ పబ్లిసిటీ.

చిల్లర కామెడీ అనే మాట వాడి ఉండకూడదు. అదే అవినాష్ కి ట్రిగ్గర్ అండ్ అతని కోపం ఖచ్చితంగా నెగటివ్ అయుంటుంది అతని రెప్యుటేషన్ కి. మే బీ ఏ ట్రాప్ బై నోయల్.        

హౌస్ నుండి వెళ్ళే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు అండ్ అది కరెక్ట్ ఐతే మీరు కరెక్ట్ చేస్కోండి ఒక వేళ కాదంటే కనుక వదిలేసేయండి అని అన్నారు నాగ్. 

నోయల్ చేతుల మీదుగానే ఒకరిని సేవ్ చేద్దాం అన్నారు. కవర్ వచ్చింది. సబ్ దిల్ చురాలియా రాప్ పాడాడు లాస్య సేవ్డ్. 

అభి యూ ఓ మీ హెయిర్ కట్ అండ్ నేను బయటికి వచ్చే వరకూ దాన్ని టచ్ చేయడం లేదు అని చెప్పాడు. 

నీకు నువ్వే సాటి.. వియ్ విల్ వియ్ విల్ రాక్ యూ రాప్ పాడాడు. 

లోపల ఉన్నంత కాలం బాబా గా ఉన్నా వెళ్ళేప్పుడు మాత్రం హౌస్మేట్స్ గురించి తాను చెప్పాలనుకున్నది నిక్కచ్చిగా చెప్పాడు దట్స్ నోయల్ అని చెప్పారు నాగ్. 
 
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.


అక్టోబర్ ముప్పై శుక్రవారం అన్ సీన్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. ఈ ఎపిసోడ్ నిన్న రాత్రి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ కి కొనసాగింపు. ఈ అన్ సీన్ ఎపిసోడ్ హాట్ స్టార్ లో ఉదయం అప్డేట్ చేస్తారు. మా మ్యూజిక్ ఛానల్ లో ఉదయం పదికి మరియూ సాయంత్రం ఆరుకి టెలికాస్ట్ అవుతుంది.  


అఖిల్ అండ్ సోహెల్ మధ్య డిస్కషన్ నడుస్తుంది. నువ్వు ఆడే గేం నాకు నచ్చలేదు. నో రిగ్రెట్స్ అంటే ఒక్క సారి కూడా ఆలోచించలేదు అని వస్తుంది అంటున్నాడు. కెప్టెన్సీ గేం లో మనస్ఫూర్తిగా ఆడలేదు నువ్వు మోనల్ కి ఇచ్చినా అరియానా కి ఇచ్చిన ఎవరైనా ఫీలవుతారు అని నువు సరిగా ఆడలేదు. నీ ప్రయత్న నువ్వు చేయాలి సరిగా ఆడలేదు. బిగ్ బాస్ చెప్పాడు కదా అబ్బాయిలు ట్రై చేయాలి అని నువ్వు ఆడ లేదు అని అంటున్నాడు. 

మోనల్ అండ్ రాజశేఖర్ ఇద్దరు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. సోహెల్ సేఫ్ గేం ఆడుతున్నాడు అని.

పిలిచినపుడు రాకపోడం మాట్లాడుతుంటే లేచెళ్ళిపోడం కరెక్ట్ కాదు అని సోహెల్ అంటున్నాడు 

సోహెల్ అవినాష్ కి చెప్పేశాడంట మొదటి రెండో రౌండ్స్ లో సరిగా ఆడలేదు ఎవరికివ్వాలో అని డౌట్ ఇద్దరూ నా ఫ్రెండ్సే అని. నాగార్జున గారు వీకెండ్ నన్నేసుకుంటారు ఫుల్ గా అని అన్నాడట. 

మాస్టర్ అవినాష్ అండ్ అరియానా మాట్లాడుకుంటున్నారు. సోహెల్ నామినేషన్స్ వేసిన దాని గురించి. అవినాష్ అమ్మ గారిని నువ్వు నామినేట్ వేయ్ అని అనడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు.
 

అభి లాస్య అండ్ హారిక డిస్కస్ చేస్తున్నారు. మోనల్ హారిక యాపిల్ ఫస్ట్ కట్ చేయడాం గురిమ్చి నోయల్ తో డిస్కస్ చేసిందట. అది కరెక్ట్ కాదు అతని ఆరోగ్యం బాలేకపోతే నాగురించి విను అనడం ఏంటి అని అంటున్నారు. పైగా అది ఆల్రెడీ క్లియర్డ్ డిస్కస్ చేసేసుకున్నాం కదా అని అంటున్నాదు. నోయల్ కూడా నేను హారిక సైడ్ తీస్కుంటున్నా అని చెప్పాడుట. ఐనా ఎందుకు అంత డిస్కస్ చేస్తుంది అని. లాస్య కూడా నాకే నచ్చలేదు మాకిద్దరికి డిస్ట్రబెన్సెస్ ఉన్నాయ్ కానీ నువ్వు మోనల్ ని బాగా చూశుకున్నావ్ అంది మీ ఇద్దరి రిలేషన్ బావుంది కదా ఎందుకు కట్ చేసిందో అని అంది. అప్పుడు అభి నాకు క్లియర్ తన కంటెంట్ బయటికి వెళ్ళాలి కదా సో ఒకటికి పది సార్లు ఎంత మంది దొరికితే అంతమందికి చెప్తుంది కూల్ స్ట్రాటెజీ వావ్ అని అంటున్నాడు. నా బర్త్ డే రోజు క్లియర్ గా చెప్పాను నువ్వు తనని అంత కేర్ చేయకు వినకు అని.

అమ్మ గారు కెప్టెన్ గా ఎవరు బెస్ట్ అంటే నువ్వే అని చెప్తా అని అంటున్నాడు. కెప్టెన్సీలో ఎవరూ పని చేయలేదు అవినాష్ చేశాడు ఐ అంటున్నారూ. అరియానా నేను చేయను అని చెప్పేసిందట. అరియానా బ్రిలియంట్ గా అన్నీ చూసి ప్లాన్డ్ గా ఆడుతుంది అని చెప్తున్నాడు. 

హారిక నోయల్ చొక్కా వేస్కుంది. లుక్స్ లైక్ షీ ఈజ్ మిస్సింగ్ హిమ్ ఇన్ హౌస్. 

ఇది చూసి అరియానా అవినాష్ మధ్యలో రేపు అరియానా వెళ్ళిపోతే ఎం చేస్తావ్ అని అడిగాడు అమ్మ. మంకీ బొమ్మ ని నువ్వు పెట్టుకుంటావా లేక స్ప్రే వేస్కుంటావా అని అడుగుతున్నాడు. ఇంకా నయం డ్రస్ వేస్కుంటావా అని అడగలేదు అంటున్నాడు అవి. 

ఫెండ్ అంటే ఇలా ఉండాలి నేను చేసినా నాకు ఒక్క హెల్ప్ చేయలేదు అని అరియానా గురించి అంటూ ఉన్నాడు అమ్మ సరదాగా నవ్వుతూనే అనేశాడు. పాపం అరియానా కాళ్ళు పట్టుకోబోయింది నువ్వు నా ఫ్రెండ్ అమ్మా అని చెప్తుంది. మళ్ళీ కాళ్ళకి మొక్కి మీరంటే నాకిష్టం అమ్మా అని చెప్తుంది. 

అవినాష్ నిద్ర ఆపుకోడానికి నానా ఫీట్స్ చేస్తున్నాడు .కప్ బోర్డ్ లో కూచుని కంఫర్టర్ మీద కప్పుకుని పడుకోడానికి ట్రై చేస్తున్నాడు. రోజుకి ఒక గంట అయినా ఎక్కువ నిద్ర పోయే అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు కెమేరా లో అవినాష్.    

టాస్క్ అయింది కదా మీరే నా బెడ్ సర్దమని అడిగాడు అఖిల్ సోహెల్ అండ్ మెహబూబ్ ని. ఇదే విషయాన్ని అభికి చెప్పి మాట్లాడుతున్నాడు. మాస్టర్ షూస్ తీసి ఇచ్చారు కదా టాశ్క్ అయ్యాక నువ్వు కూడా బెడ్ సర్దేసేయాలి అని వాదిస్తున్నాడు. ఆ టాగ్స్ నాకు వర్తించదు అని ప్రూవ్ చేస్కోవాలి కాబట్టి టాస్క్ అనే కాదు మీరు కంట్రోల్ లో ఉండాలి అని హరిక కూడా చెప్పింది.   

సోహెల్ సర్దేశాక అపుడు నవ్వుతున్నాడు అఖిల్. నువ్వు అట్ల కూచుని ఉంటే చూడలేక పోయాను అని ఏడ్చేశాడు సోహెల్. రా తినిపిస్తా అని చెప్తున్నాడు సోహెల్ కి..


30, అక్టోబర్ 2020, శుక్రవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఉన్నది రఫ్ నోట్స్ వినలేని వారు క్విక్ పాయింట్స్ అందులో చూడవచ్చు. 


ఈ రోజు మొదటి టాస్క్ గా పదిమంది సభ్యులని జంటలుగా విడగొట్టి పేర్లు పెట్టమని అన్నారు. ఆ తర్వాత ఆ పేర్లను తప్పని నిరూపించుకోడానికి టాస్క్ లను చేయమన్నారు. ఐదు జంటలలో ఇద్దరిని చూపించలేదు. ఈ రోజు ఫుటేజ్ లో అఖిల్ ఎక్కువ కనిపించాడనిపించింది కానీ అందులో ఎక్కువ హైలైట్ అయింది మాత్రం సోహెల్ మంచితనం అండ్ తన స్వచ్చమైన మనస్సు స్నేహానికి తనిచ్చే విలువ బాగా కనిపించాయ్. 
యాభై రోజుల జర్నీ వీడియో చూపించారు హౌస్మేట్స్ కి బావుంది. రోలర్ కోస్టర్ రైడ్. అందరు బాగా ఎమోషనల్ అండ్ హాపీ ఫీలైనట్లు కనిపించారు. 
 
వివరాల్లోకి వెళ్తే 54 వ రోజు ఇంట్లో పదకొండు మంది ఉన్నారు. ఉదయం "హిప్ హాప్ హిప్ హాప్" పాటతో మేల్కొలిపారు. 

వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా ఒక కొత్త సభ్యుడు స్టోర్ రూం లో ఎదురు చూస్తున్నాడు. అరియానా మాత్రమే వెళ్ళి తీస్కు వచ్చి అందరికి పరిచయం చేయాలి అని చెప్పారు. లోపల చింటూ అని పిలుచుకుంటూ తను బిగ్ బాస్ ని ఉంచమని అడిగిన చింపాంజి వచ్చింది. అరియానా కోసం. 
   
అఖిల్ అండ్ అభి డిస్కషన్ ముందే ఎవరికి ఇవ్వాలో ప్రిపేర్ అయి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరికి ఇవ్వాలి అన్నట్లు ఆలోచించడం ఎందుకు అని అంటున్నాడు అఖిల్ అభితో మనవాడు కూడా చేసింది అదే కదా మరి. ఇపుడు వేరె వాళ్ళని అంటున్నాడేంటో మరి. 

సోహెల్ మెహు డిస్కషన్ సోహెల్ ఇక ఇప్పటి నుండి డీప్ గా ఆలోచించి ఆడుతా అంట :-) నేను ఎంతసరదాగా ఉంటానో అంత బరాబర్ ఉంటుంది అని చెప్తున్నాడు. 

అభి అండ్ మోనల్ మధ్య డిస్కషన్ నడుస్తుంది. నన్ను మానిపులేటర్ అని ఎందుకు అన్నావ్ అని మొదలు పెట్టాడు. ఇద్దరిదీ తప్పు ఉంది అని చెప్పడం కూడా నీ తప్పు నువ్వు అలా చేసి ఉండకూడదు అని మళ్ళీ చెప్తున్నాడు. నేను నీ గురించి ఎందుకు మాట్లాడతా అని అంటున్నాడు. మోనల్ మాత్రం మానిపులేటర్ అన్నందుకు సారీ చెప్పింది. అఖిల్ కూడా జాయిన్ అయ్యాడు వాళ్ళిద్దరితో. నువ్వు అంతా నీ గురించే ఆలోచిస్తావ్ తప్ప ఇతరుల గురించి ఆలోచించవు అని అంటున్నాడు. నేను మాత్రం మళ్ళీ మాట్లాడను ఎవరి స్పేస్ లో వాళ్ళుండడం పీస్ అందరికి అని చెప్తున్నాడు. 


సాయంత్రం ఇంటి సభ్యులు పిలిచిన క్రమంలో కన్ఫెషన్ రూం కి రండి అని పిలిచారు. 
హారిక అభి - లోపలికి వెళ్ళగానే అబ్బా అబ్బా ఫిట్తింగ్ అని గెస్ చేసేశాడు అభి :-) జంటలకి టాగ్ ఇచ్చి కారణాలు చెప్పండి అని అడిగారు. అమ్మ గారు లాస్యకి గజిబిజి జంట అని ఇచ్చారు. మాస్టర్ అలా గజిబిజి అవుతారు అని హారిక లాస్య జోకులు గజిబిజిగా ఉంటాయ్ అని చెప్పాడు అభి. 
మెహూ సోహెల్ : బద్దకస్తుల జంట అని అవి అరియానాకి ఇచ్చారు అరియానా ఎక్కువ వర్క్ చేయదు స్కిప్ చేస్తుంది. అవు చేస్తే ఏక్కువ లేపోతే అస్సలు చేయడు అన్నారు. 

అకిల్ మోనల్ : అబద్దాల కోరు అని సోహెల్ మెహు కి ఇచ్చారు చిన్న చిన్న అబద్దాలు ఆడుతున్నట్లు అనిపిస్తుంది. వేరే వాళ్ళని హర్ట్ చేయద్దని చిన్న చిన్న అబద్దాలు చెప్తున్నాడు సోహెల్. మెహబూబ్ సగం విని వేరె వాళ్ళకి చెప్తున్నాదు. 

అవినాష్ అరియానా : అఖిల్ మాట్లాడే విధానం కొన్ని సార్లు మోనల్ కూడా చెప్పే విధానం కూడా వేరే ఉంటుంది అందుకే అని అహంకారుల జంట అని ఇస్తున్నా అన్నారు.   

అమ్మ లాస్య : అభి అండ్ హారిక కి మిగిలింది ఇదే కనుక పెడుతున్నాం కరెక్ట్ కాదు. అని జీరో టాలెంట్ అని అన్నారు. టాస్క్ లో లెగ్ ప్రాభ్లం వల్ల ఫిఫ్టీ పర్సెంటే ప్లే చేస్తాడు అని అన్నారు. 

తర్వాత టాగ్స్ వచ్చాయి ఇచ్చిన జంటకి ఆ టాగ్స్ వేయమని చెప్పారు. 

ఇంటి సభ్యులందరూ తమకు లభించిన టాగ్స్ సరైనవి కాదని నిరూపించుకోడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. 
బిగ్ బాస్ జీరో టాలెంట్ జంట పేరు పిలిచినపుడు నిరూపించుకోడనికి పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది.  
గజిబిజి జంట ని పిలిచినపుడు స్విమ్మింగ్ పూల్ లో దూకాలి 
అబద్దాల కోరుల జంట పిలిచినపుడపుల్లా ఇంటి సభ్యుల గురించి కుండబద్దలు కొట్టినట్లు నిజాలు చెప్పాలి. 
అహంకారుల జంట పిలిచినపుడపుల్లా ఇంటి సభ్యులందరూ కోపం తెప్పించడాన్కి ప్రయత్నిస్తారు మీరు ప్రశాంతంగా అణుకువుగా ఉండాలి. ఏమైనా చేయవచ్చు. 

బద్దకస్తుల జంట పిలిచినపుడల్లా ఇంటి సభ్యులు ఏవిధమైన పని ఇచ్చినా చేస్తుండాలి మరియూ ఇంటిని శుభ్రం చేస్కోవాలి. 

సోహెల్ అఖిల్ మధ్య వాదన సోహెల్ నేను అబద్దం చెప్పలేదు నీకు చెపినదానికన్నా మోనల్ కి ఎక్కువ పాయింట్స్ చెప్పాను అంతే అది అబద్దం కాదు అని వాదిస్తున్నాడు. అఖిల్ ఏడ్చేశాడు. ఇద్దరూ వాదించుకున్నా మళ్ళీ కలిసిపోయారు. 

బద్దకస్తులజంట అని పిలిచారు అరియానా అవినాష్ కి పని అప్పజెప్పారు. వాళ్ళు చేస్తుండగా అబద్దాల కోరుల జంట అని పిలిచారు. నెక్స్ట్ జంటని పిలిచారు కనుక ఇక మా టాస్క్ అయిపోయిందని అంటే బిగ్ బాస్ మీకు ఇచ్చిన పని పూర్తి చేయాలి అని చెప్పారు. అందరూ డాన్స్ వేసి అవిని వెక్కిరించారు. 

మెహబూబ్ మాస్టర్ గారి కోపం గురించి చెప్పాడు. 

అహంకారుల జంట ను పిలవగానే సోహెల్ మళ్ళీ అఖిల్ మీద వాదన మొదలు పెట్టాడు. మెహూ బాడీ చూడాలి అని షర్ట్ తీయమని అడిగాడు. నవ్వుతూ కంట్రోల్ చేస్కుంటున్నాడు అఖిల్. 
అవినాష్ మోనల్ మీద నీళ్ళు పోసేశారు. 
అఖిల్ పాంట్ లో ఐస్ ముక్కలు వేశారు. 
ఇద్దరిని స్విమ్మింగ్ పూల్ లో వేశారు. ఎగ్ ని మగ్ లో పోసి దాన్ని పూల్ లో ఉన్న వాళ్ళిద్దరి మీద పోశారు. అఖిల్ మోనల్ మీద పడకుండా కాపాడడానికి చాలా ప్రయత్నించాడు.  
నా బెడ్ తీశారు నాకు కోపం రాలేదు కానీ అది సెట్ చేయండి చేసే వరకూ నేను పడుకోనూ మెహబూబ్ బెడ్ మీద పడుకుంటా అని చెప్పాడు. సోహెల్ పాపం మళ్ళీ సర్దేశాడు. నువ్వు అలా అక్కడ కూచుని ఉంటే చూడలేక పోయాను అని అన్నాడు. 

టాస్క్ ని ముగించేశాడు. 

యాభై రోజులు పూర్తయింది. మీ ప్రయాణం ఒక సారి చూద్దాం అని ఏవీ చూపించారు. 

వీడియో ఎడిటింగ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. ఇట్ వజ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. హౌస్మేట్స్ నే కాదు ప్రేక్షకులని కూడా నవ్వించారు ఏడిపించారు ఆనందంతో గెంతులేయించారు. బావుందనిపించింది సో ఫార్. మెయిన్ సీన్స్ కి తగినట్లు ఇచ్చిన పాటలు బీజిఎమ్ తో అదరగొట్టేశారు. 

వీడియో తర్వత అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఒకరినొకరు హగ్ చేస్కున్నారు. 
 
అభి నా హాపినెస్ ఈ వీడియో చూస్తుంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను థ్యాంక్యూ అని చెప్పాడు కెమెరాతో. 
అండ్ అవినాష్ థ్యాంక్స్ చెప్పి ముందు జర్నీ కూడా ఇలాగె సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. 
  
అభి అఖిల్ అండ్ మోనల్ ముగ్గురు హగ్ చేస్కున్నారు. ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నారు.
మీరిద్దరు వాటర్ ఇవ్వడం హైలైట్ రా అని అమ్మ అంటే అఖిల్ అండ్ అభి ఇద్దరూ షాక్ అసలు అదెప్పుడైందసలు ఇలా కూడా కాప్చర్ చేస్తారా అని ఆశ్చర్య పోయారు ఇద్దరూ కూడా 

అరియానా అవినాష్ దగ్గర బాగా ఏడ్చేస్తుంది. రెండ్రోజుల నుండి బగ ఒంటరినైపోయానని ఫీలింగ్ వస్తుంది అని అంటుంది.  
 
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.

29, అక్టోబర్ 2020, గురువారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. అలాగే నా రఫ్ నోట్స్ కింది ఇస్తున్నాను. ఆసక్తి ఉన్నవారి క్విక్ పాయింట్స్ కోసం అది చూడగలరు. 



నిన్నటి టాస్క్ లోనే మధ్యలో బ్రేక్ తీస్కున్న నోయల్ పాదం నొప్పి బాగా గుచ్చుతుంది అస్సలు తీస్కోలేకపోతున్నాను అని చెప్పాడు అభితో అండ్ బిగ్ బాస్ తో కూడా నా గురించి ఒక డెసిషన్ తీస్కోండి బిగ్ బాస్ అని అడిగాను అని కూడా చెప్పాడు. ఈ రోజు ఆ డెసిషన్ తీస్కున్నాడు బిగ్ బాస్. మెరుగైన చికిత్స కోసం ఇంటినుండి బయటికి పంపించమని డాక్టర్స్ సలహా ఇచ్చారుట. అందుకే నోయల్ ట్రీట్మెంట్ కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఐతే చివర్లో త్వరలో పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారని అనుకుంటున్నాను అంటూ బిగ్ బాస్ హోప్ ఇచ్చాడు. బహుశా నూతన్ నాయుడులా ఓ వారం ట్రీట్మెంట్ తీస్కుని హెల్త్ సెట్ అవగానే తిరిగి వచ్చేస్తాడేమో

మొదటి సారి బిగ్ బాస్ కు నోయల్ వస్తున్నాడు అని విన్నపుడు ఆహా విన్నింగ్ మెటీరియల్ రా ఇతను జనంలో పాపులారిటీకి రాహుల్ తో ఫ్రెండ్శిప్ వల్ల గేం పట్ల అవగాహనకు లోటుండదు బయట కూడా సపోర్ట్ బాగా దొరకచ్చు. గెలిచే ఆవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్ అని అనుకున్నాను నేను. అయితే మొదటి వారం తర్వాత బాగా మెత్త బడిపోయి ఆటల్లో యాక్టివ్ గా పాల్గోలేక ఇబ్బంది పడడం గమనించాక ఏమైందా అనుకున్నాం తప్ప అతని హెల్త్ గురించి పూర్తి అవగాహన ఐతే ఎవరికి లేదు. ఏదైనా అతను ఈ కారణంతో వెళ్ళిపోతే మాత్రం బాధ పడాల్సిన విషయమే అనిపిస్తుంది. విష్ యూ ఎ స్పీడీ రికవరీ నోయల్. త్వరగా వచ్చేసి యాక్టివ్ గా ఆటలో పాల్గొనండి. 
   
ఇతర ముఖ్యమైన విషయాల్లో అరియానా కొత్త కెప్టెన్ అయింది. మోనల్ ని రేషన్ మానేజర్ గా ఎన్నుకుంది. అమ్మ గారి తన ఇరిటేటింగ్ బిహేవియర్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. ఎపుడు వెళ్తారురా ఈయన అనిపించింది. 

వివరాలలోకి వెళ్తే 52 వ రోజు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఆరోగ్య సమస్య వలన ఒత్తిడికి గురౌతున్నారు అని చూపించారు. చాలా బాధ పడుతున్నాడు. రాత్రి మూడు గంటలకు పాట పాడుకుంటున్నాడు. సాగేనా నా పయనం ఆగేనా ఈ రాత్రి ఎట్లా గడిచేనా అనుకుంటూ. 

53 వ రోజు ఇంట్లో పదకొండు మంది ఉన్నారు. ఉదయం శంకర్ దాదా ఎమ్బిబిఎస్ లో "ఏ జిల్లా ఏజిల్లా ఓ పిల్లా నీదీ ఏ జిల్లా" పాటతో మేల్కొలిపారు. అందరు డాన్స్ బాగా వేశారు క్లాసికల్ డాన్స్ స్టెప్స్ తో సహా. 

అరియానా మెహబూబ్ మధ్య డిస్కషన్ రేషన్ మానేజర్ గా మెహబూబ్ కొన్ని వదిలేశారు అవి పాడైపోతున్నాయ్ అని చెప్తుంది. నువ్వు ఇంకొన్ని వాడాల్సింది అని చెప్తుంది. 

అభి నోయల్ హారిక మధ్య డిస్కషన్ మోనల్ ఒంటెలా నడుస్తుందిట అభి చెప్తున్నాడు పెద్ద పెద్ద అంగలు వేస్తూ. 

బిగ్ బాస్ కాప్టెన్సీ టాస్క్ ఆడవాళ్ళకు మాత్రమే వాళ్ళంతా పోటీ దారులు. గార్డెన్ ఏరియాలో యాపిల్ చెట్టు ఉంది చెట్టుకి ఉన్న యాపిల్స్ మీద పోటీ దారుల ఫోటోస్ ఉన్నాయ్. బాక్స్ లో కత్తి ఉంది తాళం విడిగా ఉంది. అబ్బాయిలు డ్రమ్ మోగినపుడు తాళం తీస్కోవాలి. అమ్మాయిలు అబ్బాయిలని ఆ తాళాన్ని తమకే ఎందుకు ఇవ్వాలి కెప్టెన్ అర్హత ఏంటి ఇమ్యునిటి ఎందుకు అని కన్విన్స్ చేయాలి.


తాళమ్ దొరికిన సభ్యురాలు కత్తితో యాపిల్ కోసి ముక్కలు చేసి ఆ సభ్యురాలు ఎందుకు కాప్టెన్ కాకూడదో చెప్పాలి. 
ఒక సారి తాళం దొరికిన సభ్యుడు మళ్ళీ ఆడకూడదు నోయల్ ఆరోగ్య రీత్యా ఆడనవసరం లేదు. 
చివరిగా చెట్టుపై మిగిలిన సభ్యురాలు ఇంటికి కెప్టెన్ అవుతారు. 

ఫస్ట్ టైమ్ అఖిల్ చేతికి తాళం వచ్చింది. 
లాస్య నేను ఇంటిని బాగా చూస్కోగలను. ప్రతి టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను రూల్స్ ఎప్పుడూ బ్రేక్ చేయలేదు. 
మోనల్ ఆరువారాలు నామినేటెడ్ ఒక్కసారి కూడా నాకు కెప్టెన్సీ రాలేదు. ఇపుడు అవసరం అనుకుంటున్నా అని
హారిక చాలా సార్లు వెళ్ళి ఓడిపోయాను అది ఎలా ఉంటుందో నీకు తెలుసు సో ఈ వీక్ టాస్క్ ప్రకారం నాకు నామినేషన్స్ ఎక్కువ పడుతాయ్ అని అనుకుంటున్నా సో ఇమ్యునిటీ అవసరం. ఇపుడు గెలిస్తే మీరంతా కలిసి గెలిపించినత్లుంటుంది. 
అరియానా టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను  హౌస్ కేప్టెన్ అవడం అనేది నా కల. అమ్మాయిలలో నామినేషన్స్ కి ఎక్కువ ఓట్లు పడేది నాకే అందుకె ఇమ్యునిటీ అవసరం అనుకుంటున్నా. 

మోనల్ కి ఇద్దామనుకుంటున్నాను. కెప్టెన్సీ టాస్క్ లో చాలా సార్లు తను నాకు హెల్ప్ చేసింది. అందుకే నేను తనకి సపోర్ట్ చేద్దామనుకుంటున్నాను. 
మోనల్ హారికకి హౌస్ లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీక్ సేఫ్ ఉన్నారు. రెలెటివ్ గా మీరు మా అందరికన్నా బెటర్ సపోర్ట్ ఉంది. నోయల్ అభి లాస్య ఉన్నారు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అని అంది. నాకు కెప్టెన్సీ ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పింది. హారిక అది సపోర్ట్ సిస్టం అని చెప్పకండి మీరు ఇంకేం చెప్పినా ఓకే. మిగతా వాళ్ళు నామినేట్ చేయడం లేదు అంటే నేను వాళ్ళకి ట్రబుల్ మేకర్ ని కాలేదు అని చెప్పింది అస్సలు నచ్చలేదు అది ప్రాపర్ రీజన్ కాదు అని చాలా ఇరిటేట్ అయింది. 

రెండో సారి మెహబూబ్ కి దొరికింది. 
అరియాన కెప్టెన్ అంటే నెక్స్ట్ బిగ్ బాస్ ఇమ్యునిటి చాలా అవసరం నాకు. 
మోనల్ కేప్టెన్సీ అంటే పెద్ద రెస్పన్సైబిలిటీ ఇమ్యునిటీ కూడా నాకు అవస్రం ఇంటిని బాగా చూసుకుంటాను అని చెప్పింది. 
లాస్య సేం రీజన్స్ నేను ఇంటిని బాగా చూసుకుంటాను ఇమ్య్నిటీ కూడా అవసరం అందుకే నాకు కావాలి అని. 
అరియానా కి ఇచ్చాడు. తను నాకు హెల్ప్ చేసింది. సో నేను ఇపుడు తనకి ఇమ్యునిటీ ఇద్దామనుకుంటున్నాను వచ్చేవారమ్ ఐయాం పేయింగ్ ఇట్ బాక్ అని ఇచ్చాడు. 
అరియానా లాస్యని గేం లోనిండి తీసేసింది మీరు ఆల్రెడీ ఫస్ట్ కెప్టెన్ అయ్యారు ప్రతి ఒక్కరు ఎక్స్ప్రీరియన్స్ చేయాలి అని మిమ్మల్ని తొలిగిస్తున్నా అని చెప్పింది. 

మూడో సారి మాస్టర్ చేతికి వచ్చింది కీ.

మోనల్ కి ముందె సారీ చెప్పాడు. 
అరియానా అమ్మా సీజన్ ఫోర్ కి కెప్టెన్ అవ్వాలనుకుంటున్నా నీకు తెలుసు. 
మోనల్ ఇమ్యునిటీ అండ్ కెప్టెన్సీ రెండు పెద్ద విషయాలు ఇద్దరికీ అవసరమే అది అని చెప్పింది. 
అమ్మ గారు మీరిద్దరూ నాకు రెండు కళ్ళు లాగా అరియానాకి అవినాష్ కి ప్రామిస్ చేశాను మరో సారి అవకాశమొస్తే నేను అరియానాకి సపోర్ట్ చేస్తాను అని అందుకె తనకి ఇస్తున్నా అని చెప్పాడు.
అరియానా ఈజ్ ద న్యూ కెప్టెన్. 

మోనల్ హారిక అండ్ లాస్యల డిస్కషన్. మోనల్ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. హారిక నేమో సపోర్ట్ సిస్టం గురించి మాట్లాడితే నేనింత కాలం హౌస్ లో ఉన్నది వీళ్ళ వల్ల అన్నట్లు అనిపిస్తుంది అది కరెక్ట్ కాదు అని చెప్తుంది. 
  
అరియానా మోనల్ ని రేషన్ మానేజర్ గా ఎన్నుకుంది. అమ్మ గారు లుక్డ్ డిజప్పాయింటెడ్. నీకు సపోర్ట్ చేయడం తప్పని నువ్వు ప్రూవ్ చేస్కున్నావ్ అని అంటున్నాడు అమ్మ గారు. నువ్వు నన్ను రేషన్ మానెజర్ గా చేసుంటే నేను నామినేషన్స్ లో ఉన్నా కనుక నాకు హెల్ప్ అయ్యేది అని అంటున్నాడు. 
అమ్మ గారు ఆయనకి ఇవ్వనందుకు చాలా ఫీలయ్యాడు అనవసరంగా డిస్కస్ చేస్తున్నాడు. అసలు ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ వివరాలు చెప్పడం అనవసరం కానీ దీని తర్వాత ఇతను ఈ వారం వెళ్ళిపోవాలని నాకు చాలా అనిపించింది నాకు. చిన్న చిన్న విషయాలకి అనవస్రంగా గొడవ పెట్టుకుంటున్నాడు.    

కోల్గెట్ వేద శక్తి మౌత్ ప్రొటెక్ట్ స్ప్రే ని ఇంటిలో కొన్ని చోట్ల ఉంచబడుతుంది అది అందరు ఉపయోగింఛండి అని అన్నారు. మౌత్ స్ప్రే ని గిఫ్ట్ పాక్ ఓపెన్ చేసి డిమాన్స్ట్రేట్ చేయాలి అని చెప్పారు. అంతా చేశారు. 

రేషన్ మేనజర్ మోనల్ ఆరు స్వీట్ లెమన్ (బత్తాయి) వేస్ట్ అయ్యాయని చెప్పి బయటకి తీస్కొచ్చి చూపిస్తుంది. ఆ విషయం అవినాశ్ తో చెప్తుంటే నాకు కాదు అరియానా తో చెప్పు అన్నాడు. అరియానా వచ్చి అవి నా రెస్పాన్సిబిలిటీ కాదు నేనున్న టైమ్ లో వచ్చినవి కాదు అని చెప్పింది. అమ్మ గారు మరి నీ రెస్పాన్సిబిలిటికాకపోతె మెహబూబ్ దా అని అనడం కాక మాటల్తో పొడుస్తూ ఉన్నారు. 

అవినాష్ ఫుడ్ ఇస్తుంటే అరియానా నాకు ఫుడ్ వద్దని చెప్పి వెళ్ళిపోయింది. సపోర్ట్ చేసినట్లే చేసి తిడతారు అని ఏడ్చేసింది. 

రాత్రి నోయల్ మెడికల్ రూం కి వెళ్ళాడు. హారిక ఏడుస్తుంది. అతన్ని ఇలా చూడలేక పోతున్నా అని. అభి కూడా ఫీలవుతున్నాడు.
రాత్రి మూడు గంటలకు డాక్టర్ చెక్ చేసిన తర్వాత స్పెషలిస్ట్ ల సలహా మేరకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఇంటి నుండి బయటకి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పారు బిగ్ బాస్. ట్రీట్మెంట్ అంటే ఏంటో కూడా ఏం చెప్పలేదు. అభి అదే అడిగాడు కానీ ఏం చెప్పలేదు అని చెప్పాడు.  

హారిక అభి మోనల్ ఉన్నారు అక్కడే ఎదురు చూస్తూ. అరియానా కూడా వచ్చింది. 

తర్వాత అఖిల్ మెహబూబ్ లాస్య కూడా జాయిన్ అయ్యారు. 
మిగిలిన అందరూ కూడా వచ్చారు. అందరికి బై చెప్పి పాక్ చేస్కుని వెళ్ళడానికి రెడీ అవుతుంటే బిగ్ బాస్ త్వరలోనే మీరు పూర్తి ఆరోగ్య వంతులై తిరిగి రావాలని బిగ్ బాస్ కోరుకుంటున్నారు అని చెప్పారు.
అందరూ చాలా హాపీ ఫీలయ్యారు నో మోర్ గుడ్ బైస్ అని చెప్పాడు అభి. 

నోయల్ డైలాగ్ "అందరూ పొద్దున్న వెళ్ళారు నేను స్టార్ కదా అందుకే రాత్రి వెళ్తున్నాను" అంట.
హారిక బాగా ఫీలైంది ఏడ్చేసింది. లాస్య కూడా బాగా ఫీలవుతుంది. 

రేపటి ప్రోమో లో ఉన్న పది మందిని ఐదు జంటలుగా విడగొట్టి ఒక్కొ జంటకి వాళ్ళిచ్చిన ఐదు పేర్ల లోంచి ఒకటి పెట్టమన్నట్లు ఉన్నారు. 

అభిజిత్ హారిక కి జీరో టాలెంట్ జంట, అమ్మ లాస్య కి గజిబిజి 
జంట, అఖిల్ మోనల్ కి అహంకారుల జంట, అవినాష్ అరియానా కి బద్దకస్తుల జంట, సోహెల్ అండ్ మెహబూబ్ కి అబద్దాల కోరుల జంట అని పేర్లు పెట్టి ఉండడం చూపించారు. మళ్ళీ ఏవో గొడవలు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నట్లున్నాడు బిగ్ బాస్. 

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.

28, అక్టోబర్ 2020, బుధవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. కింద నా రఫ్ నోట్స్ కూడా ఇస్తున్నాను కీపాయింట్స్ మాత్రమే తెలుసుకో దలచిన వాళ్ళు అది చదవచ్చు. 



నిన్నటి బిగ్ బాస్ డే కేర్ టాస్క్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. నోయల్ కాలు నొప్పి అని బ్రేక్ తీస్కుంటే తన కిడ్ ని కూడా అభి తీస్కున్నాడు. ఫైనల్ గా సోహెల్ అండ్ అరియానాల జోడీ గెలిచారు.ఐతే కెప్టెన్సీ టాస్క్ కి కనెక్ట్ చేయలేదు ఈసారి గిఫ్ట్స్ తో సరిపెట్టారు. పారగాన్ ప్రమోషన్ టాస్క్ నడిచింది అందరు ఒకరికొకరు చెప్పులు గిఫ్ట్ ఇచుకున్నారు. కెప్టెన్సీ టాస్క్ రేపు ఉంది కాన్సెప్ట్ ఏదో కొత్తగా అనిపించింది.   

వివరాలలోకి వెళ్తే 51 వ రోజు రాత్రి పిల్లలంతా కలిసి దాగుడు మూతలు ఆడుతున్నారు. మెహబూబ్ కిచెన్ కప్ బోర్డ్ లో దాక్కున్నాడు కనిపెట్టేశాడు అందులోనే మరో పక్క అవినాష్ దాక్కున్నాడు అందులోనే మధ్యలో హారిక దాక్కుంది. అరియానా టీపాయ్ కింద దాక్కుంది. డస్ట్ బిన్ ఉన్న ప్లేస్ లో హారిక దాక్కుంది కాబట్టి తనకి ఒక చాక్లెట్. తన్దగ్గర అవినాష్ కొట్టేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. 

చాక్లెట్స్ ఎవరి దగ్గర ఎక్కువుంటే వాళ్ళు విన్ అన్నారనుకుంటాను. మనకైతే వినిపించలేదు ఆ గేమ్ రూల్. కంటెస్టెంట్స్ యాక్షన్ ని బట్టి అలా ఉంది. చాక్లట్స్ ఇవ్వమన్నారుట వాటి కౌంట్ బట్టి ఏమైనా ఉందేమో లేదో తెలియదు అని చెప్పింది లాస్య. 

అమ్మ గారి దగ్గర హారిక లాక్కున్నందుకు అలిగి అమ్మ గారు అలిగి ఆట మానేశారు. అభి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. హారిక దగ్గర నుండి తీస్కోడనికి అభి ప్రయత్నించాడు. వాళ్ళు లాక్కుంటే ఓకే కానీ నేను లాక్కుంటే అమ్మాయ్ అమ్మాయ్ అని అరుస్తున్నారు అందరూ అని అలిగాడు అమ్మ గారు. 

హారిక పాయింటేంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకున్నారు ఆయన పెట్టుకోలేదు కొట్టేయగలిగాను అని చెప్తుంది. 
హారిక పాకెట్ నుండి తీస్కోవద్దని మోనల్ ఆపినందుకు తన మీద కోప్పడ్డాడు.  

అరియానా అండ్ మెహబూబ్ కూడా అలా షార్ట్స్ జోబులోనుండి తీయద్దు అని చెప్పారు. ఓకే అన్నాడు.   
హారిక చెప్పడం నాకు పాకెట్ లో లేదు అసలు అక్కడ చాక్లెట్ లేదు అని.

అమ్మ గారి షార్ట్ లో బయటికి కనిపిస్తుందా లేదా అని చెక్ చేశారు అవినాష్ అండ్ అరియానా కన్ఫర్మ్ చేశారు ఆ పాకెట్స్ బయటికి ఉన్నాయ్ క్లియర్ గా కనిపిస్తున్నాయ్ అని చెప్పాడు అవి.  నైట్ ఎలాగైనా దొంగతనం చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు అమ్మ గారు. 

పాకెట్ లో నుండి తీస్కోడం దొంగతనమా లేక లాక్కోడమా అని డిస్కషన్ మొదలై నేను మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోయావ్ అని అభి సీరియస్ అయ్యాడు. నేనైతే నాకు తగిలిందని అనలేదు అని అంటుంది హారిక. హారిక వాక్ ఔట్ చేసినందుకు అభికి సారీ చెప్పింది. 

ఈ డిస్కషన్ లో ఏమనుకుందో ఏమో తర్వాత హారిక అమ్మ గారి నుండి రెండు చాక్లెట్స్ కొట్టేశా అని చెప్పి ఒకటి తిరిగిచ్చేసి రేపు మళ్ళీ ఒక వేళ దొరికితే కనుక దొంగతనం చేస్తా అని చెప్పింది. మీరు కూడా కావాలంటే చేయచ్చు అని చెప్పింది. 

అభి మెహబూబ్ కి తన గేం స్ట్రాటజీ చెప్తున్నాడు పులి వెయిట్ చేస్తుంది. పులి ఆట అంతే ఉంటుంది అని చెప్తున్నాడు. చిరుత చూసిన వెంటనే అటాక్ చేస్తుంది కానీ ఒక నిముషం కన్నా పరిగెత్తలేదు బాడీ హీట్ అవుతుంది వదిలేస్తుంది. కానీ సింహం పులి అలా కాదు కేమోఫ్లాజ్ మాటేసి అదను చూసి షూర్ గ కొట్టేస్తుంది అని చెప్తున్నాడు.   


రాత్రి నిద్ర పోకుండా హారిక దొంగతనం చేస్తూ కొట్టేసిన చాక్లెట్స్ వేరే చోట దాచి పెడుతూ ఉంది. లైట్స్ దగ్గర ఉన్న ఒక కప్ లో దాచింది.   

52 వ రోజు ఇంట్లో పదకొండు మంది ఉన్నారు. ఉదయం ఈ రోజు థీం కి తగినట్లుగా హండ్రెడ్ పర్సెంట్ లవ్ లో "ఏ స్క్వేర్ బి స్క్వేర్" పాటతో మేల్కొలిపారు. అందరు బాగా డాన్స్ చేశారు. 

పాట అవగానే ఆరియానా డ్యూటీ ఎక్కేసింది. సోహెల్ వీపు మీదెక్కి తిరుగుతుంది. 

లాస్య దగ్గర పౌచ్ లోని చాక్లెట్స్ మొత్తం పోయాయి అని వెతుకుతుంది. అవినాష్ రాత్రి హారిక మెలుకువగా అంతా తిరిగింది అని చెప్పాడు. అలా కొట్టేస్తే ఆ చాక్లెట్స్ లెక్క లోకి రావు లాస్య కారణం చెప్పి ఇవ్వాలి అని ఫైనల్ చేశారు. హారికతో కూడా ఇదే విషయం చెప్పింది అండ్ నువ్వు కొట్టేస్తే ఇస్తావ్ గా అని అడిగితే ఇస్తా అంది. 

అవినాష్ చింపాంజీ బొమ్మకి టీ తాపిస్తు ఆడుకుంటున్నాడు :-)

సోహెల్ అరియానా ని ఎత్తుకుని చేసిన మంచి పనులు అన్నీ ఇలా ఇలా చేసిందని చెప్తున్నాడు.  

మెహబూబ్ మటన్ కావాలి అంకుల్ అని అడుగుతూ కొరికేశాడు. మా కేర్ టేకర్ ని అడిగితే మీ చుట్టాలని అడుక్కో అని అన్నాడు నువ్వు నాకు మటన్ ఇవ్వు అని అడుగుతున్నాడు. ఇవ్వకపోతే సోహెల్ ని గట్టిగా మార్క్ పడేలా కొరికేశాడు. 

అఖిల్ బోర్డ్ మీద అందమైన బొమ్మ గీశాడు. చాలా బావుంది. మన వాడికి కళల్లో మంచి ప్రవేశమే ఉన్నట్లుంది. 
 
ఏ అంటే అవినాష్ అని మోనల్ అంటే ఎల్ అంటే లవ్, లవ్ అంటే మోనల్ అని కాసేపు ఫన్ చేశాడు అవినాశ్. ఆ తర్వాత ఎక్స్ అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు మెహబూబ్. 

మధ్యాహ్నం రెండుపదిహేనుకి నోయల్ కి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల అభిజిత్ అవినాష్ కి కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నాడు. నోయల్ మెడికల్ రూం నుండి బయటికి వచ్చాడు. టాస్క్ స్కిప్ చేయండి డాక్టర్ వస్తాడు అని చెప్పారు. కాలు బాగా నొప్పి గుచ్చేస్తుంది అసలు హీల్ అవడం లేదు తీస్కోలేకపోతున్నాను అని చెప్తున్నాడు. 

ఫన్ గేం ఇచ్చాడు పిల్లలకి కేర్ టేకర్స్ కు కలిపి. సోహెల్ లాండ్ ఫైర్ వాటర్ అని చెప్పినపుడు వాటి దగ్గరకు వెళ్ళాలి లాస్ట్ వెళ్ళిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఆ గేం లో నుండి. హారిక, అరియానా, మోనల్, అవినాష్, అభిజిత్, ఔట్ అయ్యారు. మధ్యలో అభిజిత్ ఒక రౌండ్ స్కిప్ అయ్యి లాండ్ మీదకి హడావిడిగా పరిగెడుతూ వచ్చి తడిచి ఉండడం వల్ల జారిపడిపోయాడు. తను ఔటయ్యిన విషయం మర్చిపోయి నేను ఔట్ కాదని వాదించాడు. క్లారిటి ఇచ్చాక ఓకే. 

సాయంత్రం నాలుగు గంటలకి టాస్క్ ముగించేశాడు బిగ్ బాస్. లివింగ్ రూమ్ లోని సోఫాలో కూర్చోమని లాస్యని విన్నర్ జోడీని ఎంపిక చేసి బిగ్ బాస్ కి చెప్పమన్నారు. 

సోహెల్ అండ్ అరియానా ని సెలెక్ట్ చేసింది లాస్య. సోహెల్ ఓపికగా భరిస్తూ అరియానా అడిగిందల్లా చేశాడు తినిపించడంలో కూడా బాగా చేశాడు అని చెప్పింది. తన సెలక్షన్ బావుంది. ఇద్దరు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విన్నర్ జోడీ ఐనందుకు గిఫ్ట్స్ గెలుచుకున్నారు అని చెప్పారు. కెప్టెన్సీ టాస్క్ కి కనెక్ట్ చేయలేదు. 
 
చింపాంజీ బొమ్మ నాకివ్వండి బిగ్ బాస్ అని కెమేరా ముందు అడిగింది అరియానా ఈ బొమ్మ చూస్తే నాకు ఇల్లు గుర్తొస్తుంది అని చెప్పి ఏడ్చింది. ఆ బొమ్మ తిరిగి ఇవ్వాలని లేదు అని చెప్తుంది. అవినాష్ నేను కూడా అడిగి చూస్తాను ఒక వేళ ఉంచితే నీకే ఇచ్చేస్తాను అని చెప్పాడు. 
  
నోయల్ అమ్మ గారికి ఈ వీక్ బాడ్ అవుతుందేమో అని అంటున్నాడు లాస్య అండ్ హారిక తో. ఆయన ఏమన్నా అంటే వెంటనే కారెక్టర్ మీదకి వెళ్ళిపోతున్నారు అని అంది లాస్య. నోయల్ ని ఆ రోజు అన్ని మాటలు అన్నాక నైట్ సారీరా అని కాళ్ళుపట్తుకున్నంత పని చేశారట మాస్టర్ గారు నోయల్ చెప్పాడు. తప్పు చేసి సారీ చెప్పడం పెద్దరికం కాదు అసలు తప్పే చేయక పోవడం బెటర్ కదా అని చెప్తున్నాడు. చాలా నచ్చింది ఈ పాయింట్ నాకు కరెక్ట్ గా చెప్పాడనిపించింది. 

పారగాన్ ఫుట్ వేర్ చెప్పులు రెండు స్టాండ్స్ లో పెట్టి ఒకో పెయిర్ హౌస్మేట్స్ కి ఇచ్చి కారణం చెప్పమన్నారు. 

హారిక నోయల్ కి ఇచ్చి దూకుడు ఎక్కువ పైగా లెగ్ కి ప్రాబ్లం ఉంది కాబట్టి హెల్ప్ అవుతుంది అని చెప్పింది. 

మోనల్ బ్లాక్ స్టైలిష్ షూ ఫర్ అఖిల్ స్టైలిష్ కనుక అని చెప్పి ఇచ్చింది. కరెక్ట్ సైజ్ సెలెక్ట్ చేసింది. 

అఖిల్ లైట్ వెయిట్ చెప్పులు మోనల్ కి సెలెక్త్ చేసి ఇచ్చాడు నడిచేప్పుడు గట్టిగ నడుస్తుంది సో తనకి అపుడు లైట్ గా ఉంటాయని ఇస్తున్నా అన్నాడు కాకపోతే అవి బిగ్ సైజ్.  

మెహబూబ్ షూ సోహెల్ కి స్ట్రాంగ్ గేమర్ అండ్ జిమ్ చేస్తాడు కనుక బాలెన్స్ చేస్తాయ్ అని ఇస్తున్నా అన్నాడు. 

సోహెల్ మెహబూబ్ కి లైట్ వెయిట్ షూస్ వాడెలాగూ హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తాడు కనుక వాడికి అని ఇచ్చాడు. 

చూడగానే లైట్ ఉన్నాయ్ దగ్గరికి వెళ్తే స్ట్రాంగ్ గా ఉన్నాయ్ లాస్య గురించి అదె తెలుసుకుంటాం ఫెండ్స్ అయ్యాక అందుకె ఇవి తనకి అని అభి ఇచ్చాడు. 

నోయల్ నువ్వు ఏ పని చేసినా నిన్ను తలెత్తి చూడాలని నీకు ఈ హీల్స్ ఇస్తున్నా అని హారికకిచ్చాడు. 

ఈ చెప్పులు ఎంత అందంగా ఉన్నాయో తన మనసు కూడా అంత అందంగా ఉంటుంది సిగ్గు పడుతూ ఉంటుంది అందుకే తనకి ఇస్తున్నా అని చెప్పి అవినాష్ అరియానాకి ఇచ్చాడు. 

సోహెల్ అండ్ అరియానా కి గిఫ్ట్స్ వచ్చాయి మటన్ చికెన్ చాక్లెట్ అండ్ కాఫీ వచ్చాయ్. అరియానా కాఫీ చూసి గెంతులే గెంతులు. చాక్లెట్స్ మిగిలిన హౌస్మేట్స్ కూడా తీస్కున్నారు అమ్మ గారు సైలెంట్ గా తీస్కుని తినేస్తున్నారు. 
మటన్ నేనొక్కడ్నే చేస్కుని తింటా ఎవరికి ఇయ్యా అన్నాడు సోహెల్. ఈ ఇంట్లో నువ్వొక్కడివి ఎట్ల తింటావ్ చూస్తా అని అంటున్నాడు అవినాష్. అల్లా కాసేపు దాని మీద ఫన్ చేశారు హౌస్మేట్స్. 

రేపటి ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్. ఒక టేబుల్ మీద కీ అండ్ బాక్స్ ఉన్నాయ్ ఒకళ్ళు కీ చేజిక్కించుకోవాలి అబ్బాయిలు అందరు ప్రయత్నిస్తే అఖిల్ సాధించాడు. తర్వాత హౌస్మేట్స్ అందరి ఫోటోస్ ఉన్న ఫ్రూట్స్ ఒక చెట్తుకు వెళాడేసి ఉన్నాయి బాక్స్ లో ఉన్న కత్తితో ఆ చెట్తుకు ఉన్న ఫ్రూట్స్ ని కోసేసి టాస్క్ లో పాల్గొనకుండా చేయాలనుకుంటాను. మోనల్ హారిక ఫోటో ఉన్న ఫ్రూట్ ని డెస్ట్రాయ్ చేసింది.   

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.

27, అక్టోబర్ 2020, మంగళవారం

బిగ్ బాస్ ఇంట్లో ఈ రోజు ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. చదవడం ఇష్టమున్న వాళ్ళు కింద రఫ్ నోట్స్ లో మెయిన్ పాయింట్స్ చూడవచ్చు. 



50 వరోజు రాత్రి నామినేషన్స్ తర్వాత మోనల్ అఖిల్ తో డిస్కషన్. అఖిల్ లాస్యతో నువ్వు ఇష్యూ ఎందుకు క్లియర్ చేస్కోలేదు అని అడుగుతున్నాదు. మోనల్ నేను టైర్డ్ ఎలా మాట్లాడాలో తెలీదు అని అంటుంది. సరే నన్ను మాట్లాడమంటావా అని అడిగాడు ఓకె అంది సరే నువ్వు మాట్లాడమన్నావ్ కదా అని మాట్లాడుతాను అని చెప్పాడు.
 
అభి నామినేషన్స్ లో లేకపోవడం ఆశ్చర్యం అని అంటున్నారు లాస్య, హారిక, నోయల్. లాస్ట్ టైం టాస్క్ లో చాలా ఉంటాయ్ అనుకుంటున్నాను అని అంది. 

అఖిల్ అభిని పక్కకి తీస్కెళ్ళి క్లారిటీ కోసం ఒక్క సారి మాట్లాడుకుందాం ముగ్గురము కూర్చుని అని చాలా కన్విన్సింగ్ గా మాట్లాడాడు. అభి ఒక్క రోజు టైమిద్దాం ఇపుడు నామినేషన్స్ ఫుల్లీ ఛార్జ్ డ్ గా ఉన్నాం. రేపు మాట్లాడదాం అన్నాడు. సరే అనుకున్నారు. అమ్మ గారి గురించి పిచ్చ లైట్ అనుకున్నారు ఇద్దరు అభి నామినేట్ చేస్తాడని తనకి తెలుసు అందుకే అలా ప్లే చేశాడు అని అన్నాడు అభి. 

అమ్మ గారు ఫుల్ ఏడుస్తున్నారు మెహబూబ్ అండ్ సోహెల్ మాట్లాడుకుంటున్నారు. సోహెల్ వేసినందుకు నేను అప్సెట్ అయ్యాను అని అంటున్నారు. 

సోహెల్ నెక్స్ట్ వీక్ నామినేషన్ కి అందర్ని ఏసిపడేస్తాను నాతో కావాలంటే గొడవ పెట్టుకోండి అని అన్నాడు. అమ్మ గారిని నామినేట్ చేయడం లో సేఫ్ గేం ఆడాను అని చెప్తున్నాడు. 
ఇది జరుగుతుండగా అభి నోయల్ నిన్ను స్ట్రాంగ్ ప్లేయర్ కాదంటున్నాడు చూడు అని చెప్పాడు. సోహెల్ అసలు విషయం మర్చిపోయి ఛల్ ఎట్టుంటది అని టాపిక్ మర్చేసి ఫుల్ డైవర్ట్ అయిపోయాడు. 

మళ్ళీ మాస్టర్ బ్లాక్ మెయిల్ మొదలు పెట్టాడు. నేను పోవాలి నీకోసమే పోవాలి అని సోహెల్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. 

అరియానా అవినాష్ మాట్లాడుకుంటుంటే మోనల్ అటు వస్తా అని చెప్పిందట. కానీ మళ్ళీ కాఫీ తాగడానికి అఖిల్ దగ్గరకి వెళ్తున్నందుకు అవినాష్ కాస్త సీన్ చేస్తుంటే పరుగెట్టుకు వెళ్ళి అవినాష్ నుదుటి మీద ముద్దు పెట్టింది ఇక మోనల్ దృష్టిలో ఎ అంటే అవినాష్ అని రచ్చ రచ్చ చేశాడు. ఓ హీరోయిన్ కమెడియన్ కి ముద్దు పెట్టింది అని తెగ ఫీలవుతు చాలా హ్యాపీ ఫీలవుతున్నా అంటూ గోల గోల చేశాడు.
 
నైట్ సోహెల్ అండ్ అఖిల్ మధ్య డిస్కషన్ నాకు అక్కడ ఇంకే ఆప్షన్ లేక అమ్మ గారిని నామినేట్ చేశాను అని చెప్తున్నాడు. అఖిల్ ఇక్కడ అందర్ని హ్యాపీగా పెట్తలేం అని క్లారిటీ ఇస్తున్నాడు. 

ఆ డిస్కషన్ తర్వాత సోహెల్ మోనల్ అండ్ నోయల్ దగ్గరకి వచ్చాదు. అక్కడ సరదాగా నువ్వు సింపుల్ గా స్ట్రఆంగ్ ప్లేయర్స్ అని అఖిల్ ని మెహుని ఇద్దర్ని వేసేశావ్ సూపర్ అసలు అని అన్నాడు. 

మోనల్ అక్కడ నుండి లేచెళ్ళి అఖిల్ దగ్గరకు వెళ్తె ఏం మాట్లాడుతున్నాడు అని అడిగాడు అఖిల్ వచ్చీ రాని తెలుగులో చెప్పింది. దానికి అఖిల్ ఫీలయ్యాడు నా పేరెందుకు తీస్కురాడం అని. సోహెల్ వాళ్ళ దగ్గరకు వచ్చాక కూడా మోనల్ ఇదె చెప్పాను అని చెప్పింది. అఖిల్ మాట్లాదుతూ లేచెళ్ళిపోయాడు. 

51 వ రోజు ఇంట్లో పదకొండు మంది ఉన్నారు ఉదయం ఈ రోజు టాస్క్ కు తగినట్లుగా "చిన్నారి పొన్నారి కిట్టయ్య" పాటతో మేల్కొలిపారు.  స్టెప్స్ పక్కన పెడితే కొంచెం కన్ఫూజన్ కనపడింది కంటెస్టెంట్స్ ఫేస్ లో.. 

సోహెల్ అఖిల్ మధ్య డిస్కషన్ మోనల్ కి చెప్పద్దు అని చెప్పాను ఇలా. నేను అక్కడ నోయల్ తో ఏం మాట్లాడుతున్నా అని నీతో ఎందుకు చెప్తుంది అని అంటున్నాడు. నేను నీతో మాట్లాడుతున్నపుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయానా ఎపుడైనా అని అంటున్నాడు. 

సోహెల్ మోనల్ కి మళ్ళీ చెప్పాడు అక్కడివి ఇక్కడ చెప్పకు అని. 

బిగ్ బాస్ డేకేర్ సెంటర్ టాస్క్
పిల్లలు : అవినాష్ అరియాన మెహబూబ్ హారిక అమ్మ గారు. 
కేర్ టేకర్స్ : సోహెల్ నోయెల్ అఖిల్ మోనల్ అభి 
లాస్య హెడ్మిస్ట్రెస్ తనే సంచాలక్. అందరు సక్రమంగా చేసేలా చూస్కోవాలి. 
అన్నం తినిపించాలి. బట్టలు డయపర్స్ వేయాల్సి చదువు చెప్పాలి ఆడించాలి. చిన్నపిల్లలు చాలా కొంటెపిల్లలు అల్లరి చెస్తారు. 
ఏడుపు సౌండ్ వచ్చిన ప్రతి సారి బట్టలు డయపర్స్ మార్చాలి 
స్కూల్ బెల్ మోగినపుడు క్లాసెస్ చెప్పాలి. స్కూల్ కెళ్ళేప్పుడు టిఫిన్ బాక్స్ సిద్ధం చేయాలి. 
పిల్లలు - కేర్ టేకర్స్
అవినాశ్ నోయల్ 
అరియానా సోహెల్ 
మెహబూబ్ అఖిల్ 
హారిక మోనల్ 
అమ్మ గారు అభిజిత్ 
పెద్దవాళ్ళందరూ ఇదేం టాస్క్ బిగ్ బాస్ మమ్మల్ని పిల్లలు రోల్ కి ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. 
పిల్లలు ఆట మొదలెట్టేశారు ఒక్కొక్కళ్ళతో.. సోహెల్ భుజాల మీదెక్కి జడ వేస్తుంది అరియానా.
అవినాష్ అందరి మీద ఏదో పౌడర్ కొడుతున్నాడు మోనల్ మీద కూడా వేస్తే కళ్లలోకి వెళ్ళింది అప్పుడు హారిక టాస్క్ పక్కన పెట్టేసి మోనల్ కళ్ళలోది అంతా క్లీన్ చేసింది చాలా బావుంది. రెండు దిళ్ళు తీస్కుని అందరిని కొట్టడం మొదలు పెట్టింది. 

పిల్లల ఏడుపు వచ్చింది డయపర్ అండ్ బట్టలు ఛేంజ్ చేయాలి. హారిక నాకు సోహెల్ అంకుల్ స్మైల్ ఇష్టం అంటూంటే లాస్య ఇంకో గంటలో ఆ స్మైల్ పోతుంది చూడు అని జోక్ చేస్తుంది :-) 

మోనల్ అభిని కూర్చోపెట్టి మాట్లాడింది. టాస్క్ తర్వాత మనిద్దరం మాట్లాడుకుందాం. డీటేయిల్డ్ గా చెప్పు అని అడిగింది. ఆల్రెడీ చెప్పేశాను అన్నాడు అభి అలా లేదు నీకు తెలుసు ఎవరి స్పేస్ లో వాళ్ళం ఉందాం అని అంటున్నాడు. మోనల్ సరే ఇద్దరం మాట్లాడుకుందాం తర్వాత అని అంటే ఓకే అన్నాడు ఫైనల్ గా. 

సోహెల్ అందరికి క్లాస్ తీస్కుంటున్నాడు. ఫస్ట్ ఏబిసిడి లు నేర్పిస్తాను అంటూ మొదలు పెట్టాడు. ఈ ఎఫ్ లు రాస్తే ఏబిసిడి లు నేర్పిస్తాను అన్నారు ఈ ఎఫ్ ఎందుకు రాస్తున్నారు అని అమ్మగారు జోక్. 

లాస్య బుర్రు పిట్ట బుర్రుపిట్ట తుర్రు మన్నది నేర్పిస్తుంది. అమ్మ గారు హారిక దగ్గర పౌచ్ కొట్టేశాడు. నా బుక్ ఇస్తే పౌచ్ ఇస్తా అని అంటున్నారు. తర్వాత హారిక అరియానా దగ్గర పెన్సిల్ కొట్టేసింది. మళ్ళా అరియానా దగ్గర నుండి లాక్కుంది రక్కినట్లుంది హారిక కి దెబ్బలు తగిలాయ్. కాపాడుకోవాలి అని ఉంది దొంగతనం చేయకుండా అని చెప్తుంది హారిక. 

రేపటి ప్రోమోలో అభి అండ్ హారికల మధ్య సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. లాక్కోవడం దొంగతనం చేయడం గురించి. అభి గట్టిగా మాట్లాడాడని హారిక లేచెళ్ళిపోయింది.  

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం. 



26, అక్టోబర్ 2020, సోమవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. అలాగే నా రఫ్ నోట్స్ లో పాయింట్స్ కింద చూడవచ్చు. 


లాస్య నోయల్ హారిక అండ్ అభి మోనల్ గురించి మాట్లాడుకోడం ఇంకా ఆపడం లేదు వీళ్ళ డిస్కషన్స్ చూసి నాకు చిరాకొస్తుంది. ఇక ఈ రోజు నామినేషన్స్ డే కదా.. అక్కడక్కడా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నడిచాయ్. బిగ్ బాస్ అసలు ఏ రీజన్స్ చెప్పి నామినేట్ చేయమన్నారో వాటిని తుంగలో తొక్కి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నామినేట్ చేశారు. కొందరు లాస్ట్ వీకే అనుకున్నా అప్పుడు నాకు ఆప్షన్ లేదు అంటూ నామినేట్ చేశారు. ఈ విషయం బిగ్ బాస్ కూడా అబ్జెక్ట్ చేయలేదు ఎందుకనో. ఈ రోజు ఆరుగురు నామినేట్ అయ్యారు. అమ్మరాజశేఖర్ గారు, అరియానా, మెహబూబ్ ముగ్గురు నాలుగేసి ఓట్లతోనూ లాస్య అఖిల్ మోనల్ ముగ్గురూ మూడేసి ఓట్లతోను నామినేట్ అయ్యారు. 

వివరాలలోకి వెళ్తే నలభైతొమ్మిదో రోజు రాత్రి వంట దగ్గర మొదలైంది.. అభి బట్టలు వచ్చేశాయి.. పండగంటేనే నవ్వులు ఆనందం కనుక సమంతా ప్రత్యేక విన్నపం మేరకు బిగ్ బాస్ మీబట్టలు పంపిస్తున్నారు అని అభి బట్టలు పంపేశారు. 

యాభయ్యవ రోజు పదకొండుమంది ఉన్నారు హౌస్ లో ఉదయం ఖైదీనంబర్ వన్ ఫిఫ్టీ నుండి రత్తాలు రత్తాలు పాటతో మేల్కొలిపారు. 
మోర్నింగ్ మస్తీలో మీకు నచ్చిన ఇంటి సభ్యుడు గురించి పాజిటివ్ అండ్ నెగటివ్ రాసి చెప్పమన్నారు. 
అభి గురించి అఖిల్ రాశాడు.. నువ్వు అఖిల్ తో మాట్లాడుతున్నపుడు చాలా గుడ్ లుకింగ్ బావుంటావు.. డైటింగ్ ఆపేయ్ తినడం మొదలు పెట్టు అని రాశాడు. 
మోనల్ మెహబూబ్ గురించి వెరీ స్వీట్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఫ్యామిలి పర్సనాలిటీ నాకు ఇష్టం తమ్ముడు అంది.   
అరియానా, లాస్య, మోనల్, అవినాష్ నలుగురు బతుకమ్మ పాడారు అరియానా తల మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళి పూల్ లో ప్లేట్ లో పెట్టి వదిలారు.. బావుంది.. 

సాయంత్రం నోయల్, అభి, లాస్య, హారిక నలుగురూ మళ్ళీ మోనల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దసరా కదా మాట్లాడాలని ఉంది అందట సో మాట్లాడమని చెప్పాను అన్నాడు. మోర్నింగ్ అందరి బ్లాంకెట్స్ మడత పెట్టి నీదొక్కటి పెట్టలేదంటే ఎంత ప్రత్యేకమో తెలుసుకో అంటుంది లాస్య. అతను ఇరిటేట్ అవుతాడు నేను ఫోల్డ్ చేస్తే అందట. అబి కూడా ఎస్ నేను మళ్ళీ పాడు చేసి మడత పెట్టుకునే వాడ్ని అని అంటున్నాడు.  
నువ్వు మనసులో అంత హేటె చేస్తున్నావ్ అని లాస్య అంటే హేట్ కాదు చీటెడ్ డిసీవ్డ్ గా ఫీలవుతున్నాను అని అన్నాడు అభి. నాకు వీళ్ళ నలుగురు మోనల్ గురించి మాట్లాడుకోవడం నచ్చడం లేదు ఒక రకంగా చిరాకుగా కూడా ఉంటుంది. ఆ అమ్మాయ్ కూడా అభితో మాట్లాడాలని ఎందుకు అనుకుంటుందో ఆ విషయం నోయల్ లాంటి వాళ్ళ దగ్గర ఎందుకు అంటుందో నాకు అర్థం కావడం లేదు.   

నామినేషన్ లో ఇప్పటి వరకు ఇంటిలో మీ ప్రయాణం ఏ సభ్యుల వల్ల ఇబ్బంది కరంగా మారిందో ఇంకా ఏ సబ్యుని వల్ల ముందు ముందు మీకు అడ్డంకులు వస్తాయనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పి ఇద్దరి ని నామినేట్ చేయాలి. ఇంటి సభ్యుల పిక్స్ ఉన్న టైల్స్ పెట్టి ఉన్నాయి అవి పగలగొట్టాలి. కెప్టెన్ కనుక అవినాష్ ని నామినేట్ చేయకూడదు అని చెప్పారు కానీ ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీస్కోలేదు అందరు ఏవో వాళ్ళకి నచ్చినవి ముందుగా అనుకున్నవి రీజన్స్ చెప్పారు నామినేషన్స్ కి. బిగ్ బాస్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీస్కున్నట్లు కనిపించలేదు.  

అమ్మ గారు : లాస్య నన్ను కన్నింగ్ స్మైల్ అన్నారు. అలగే మిమ్మల్ని వరస్ట్ పెర్ఫార్మర్ అన్నందుకు మీరు తీస్కోలేకపోయారు. 
అఖిల్ నన్ను సింపతీ సింపతీ అని అనడం బాలేదు ఆ వర్డ్ బాలేదు. ఫ్యామిలి సింపతి ఉంది అన్నారు అది నచ్చలేదు. అది సినిమా లాంగ్వేజ్ అని ఏదో కవర్ చేశారు కానీ ఒప్పుకోలేదు. 
సోహెల్ ఠక్కున కోపం వచ్చేస్తుంది. మీరు కూడా నాలాగా ఛేంజ్ అయితే బావుంటుందని అనుకుంటున్నా అంటే. ఐతె నువ్వు నా సారీ నాకు వాపస్ ఇచ్చేయ్ అని అడిగారు. ఆల్రెడీ రెండున్నాయ్ కదా వేసేయ్ మూడోది అని అన్నారు. సోహెల్ కాసేపు ఆలోచించి సారీ చెప్పి వేసేశాడు. 
అభి మీకు ఒక పాయింట్ చెప్పాలి. చిన్న చిన్న విషయాల్లో హర్ట్ అవుతున్నారు అంటే. నేను మాస్ నువ్వు క్లాస్ అని అన్నారు మళ్ళీ. నా నామినేషన్ ని పాజిటివ్ తీస్కుంటారు అనుకుంతున్నా. 


అరియానా : అఖిల్ ఎదుటి వాళ్ళ మాటలు వినదు. ఆవేశపడిపోతుంది. వాకౌట్ చేయడం నచ్చలేదు. 
మెహబూబ్ మనమధ్య అన్ని క్లియర్ అవ్వాలని చేస్తున్నా నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావు అని అన్నాడు. నేనన్నానా అని అడిగింది. 
సోహెల్ సారీ చెప్పమని అడిగితే నువ్వు ఆలోచించి చెప్పావ్. అవినాష్ ప్లేస్ లో ఇంకెవరు ఉన్నా కెప్టెన్సీ టాస్క్ లో నిన్నే సపోర్ట్ చేసే వాడ్ని అని చెప్పాడు. అలాగె పాస్ట్ గురించి చెప్పమన్నారు కాబట్తి చేస్తున్నా అంతకన్నా వేరే ఏం లేదు. నేను జెర్రీనే నీ ముందు అలా చూడకు అని చెప్పాదు. ఏం లేదు సోహెల్ అని సింపుల్ గా వదిలేసింది అరియానా.  
హారిక మొన్న టాస్క్ లో బయటుంది ఏం చేస్తుననర్ అనడం నచ్చలేదు. నువ్వు చెప్పి వెళిపోతావ్ మమ్మల్ని మాట్లాడనివ్వవు అని చెప్పింది. 

మెహబూబ్ : అరియానా క్లియర్ అవ్వాలి సారీ చెప్పావ్ బావుంది కానీ క్లియర్ చేస్కోవాలి అంటే ఇంట్లొ ఉండి సహాయం చేస్కుంటారా లేక బయటికి పంపేస్తారా. సారీ చెప్పి నామినేట్ చేయడం నచ్చలేదు. 
నోయల్ అఖిల్ లాగె మెహబూబ్ కూడా చాలా స్ట్రాంగ్ కనుక నేను నామినేట్ చేస్తున్నా. పర్సనల్ రీజన్స్ ఏం లేవు అని అన్నాడు. 
హారిక స్ట్రాంగ్ కాంపిటీటర్ అనుకుంటున్నా అందుకె చేస్తున్నాను. 
మోనల్ నాకు అభితో ఒక డిస్కషన్ జరిగింది ఇందులో ఉన్న విషయం నేనెవరితో షేర్ చేయలేదు. అభితో నేనే చెప్పాను నువ్వు నాకు అభికి ఉన్న ఫైట్ ని యాభై రెట్లు పెంచావు నువ్వు అంది. మెహబూబ్ మన ఐదుగురి మధ్య జరిగిన డిస్కషన్ అభికి ఎందుకు చెప్పావ్ అంటే స్వాతి ఎలాగూ చెప్తుంది కదా అని చెప్పాను అన్నావ్ కదా నేను అదే అభికి చెప్పాను అని చెప్పాడు.

మోనల్ : లాస్య నువ్వు అర్థంకావట్లేదు నువ్వే మాట్లాడడం మానేస్తున్నావ్ మళ్ళీ వచ్చి నన్ను నువ్వెందుకు మానేశావ్ అని అడుగుతావ్. 
మెహ్బూబ్ రేషన్ మానాజర్ గా ఉన్నపుడు నేనెవరికి చెప్పాలి అని అంది ఆ ఒక్క విషయమే ఉంది మిగతా హౌస్మేట్స్ తో ఏంలేదు అని చెప్పాడు.  
అభి నీ నిర్ణయం అంటూ నువ్వు తీస్కున్న తర్వాత నిజంగా చెప్పు. నువ్వు నన్ను మానిపులేటర్ అని పిలిస్తె నువ్వు నాకు డైరెక్ట్ గా చెప్పు అంతే కానీ దర్డ్ పర్సన్ ఉంది కదా అని అలా చెప్పకు. ఎందుకు అన్నావో నాకు తర్వాత తెలిసింది. దట్స్ బిగ్గర్ క్రైమ్. మన మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఇన్ని రోజులు చేయలేదు. కానీ అది నాకు వచ్చిన విషయం బాలేదు అని చెప్పాడు.   
 
లాస్య : అవినాష్ నాకు మీకు బయట పరిచయం ఉంది కానీ ఎందుకో ఇక్కడ దూరం పెరిగింది. టీ పెట్టమంటే పెట్టలేదు తర్వాత వేరే ఎవరో అడిగారని వాళ్ళకి టీ పెట్టారు. కానీ నాకప్ పెడితే మాత్రం నాకు పోయలేదు. దీని తర్వాత అలాంటివి ఉండకూడదు అంది. నన్ను అడిగినట్లు అనిపింఛలేదు నువ్వు చేయాలి అని ఆర్డర్ వేసినట్లు అనిపించింది. ఆల్రెడీ బిగ్ బాంబ్ చేస్తున్నా కదా ఇంకోపని ఇవ్వాలని ఎలా ఆలోచించారు అని అడిగారు. నాకు ఐడియా లేకపోవడం వల్ల కొశ్చన్ రైజ్ చేశాను అని అన్నాడు. నా వల్ల హర్ట్ అయి ఉంటే సారీ అని చెప్పాడు. 
మాస్టర్ కన్నింగ్ అంటే ఒక విషయం మనసులో పెట్టుకుని వేరొకలా ఉండడం కన్నింగ్ నా దృష్టిలో అని చెప్పాడు. నన్ను వరస్ట్ అని మళ్ళీ నవ్వుతావ్ అది కూడా కన్నింగ్ అనే అంటాను. లాస్య నా శత్రువు ఎదురు పడినా నేను నవ్వుతాను అని చెప్పింది.  
మోనల్ లాస్ట్ లక్జరీ బడ్జట్ లో చికెన్ మటన్ అన్నీ వచ్చాయ్ నా హెల్త్ బాలేదు హారికా చాల బాగా చూసుకుంది నన్ను థ్యాంక్స్. లాస్య ని నాకోసం చేయమని అడిగితే నువ్వే చేస్కో అని చెప్పింది. నేను చాలా బాధ పడ్డాను నువ్వు చేయలేదు అని. పొద్దున్న మళ్ళీ డిస్కషన్ జరిగింది వెజిటేరియన్ ఎవరు అని. నేను తప్పు చేశానంటే వెళ్ళి సారీ చెప్ప్తాను. నువ్వు నన్ను నామినేట్ చేయడం నచ్చలేదు ఊహించలేదు. దానికి లాస్య "నేను నాన్వెజ్ చేస్తున్నా కదా ఇంకా వంటొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళనెందుకు అడగలేదు అని చెప్పింది. ఫైనల్ గా మోనల్ అఖిల్ అభి నా మాటర్ అనేది ఐవాంట్ టు క్లియర్ అండ్ ఫినిష్ వన్ థింగ్ హియర్ ఎవరికేం డౌట్స్ ఉన్నా కానీ అవి నాతో మాట్లాడి క్లియర్ చేస్కోండి అని చెప్పింది.  

అఖిల్ : అమ్మ గారు సింపతీ అనేది చాలా సెంటిమెంటల్ వర్డ్ అని వివరణ ఇచ్చారు. అభి అఖిల్ మోనల్ ముగ్గురు మధ్య డిస్కషన్ వచ్చింది మోనల్ ఇంకా అభితో మాట్లాడడం లేదు. ఇలాంటి టైం లో మీరు అభికి క్లోజ్ అవడం బాలేదు. నా స్ట్రెంత్ అఖిల్ అని ఆమె చెప్పినపుడు నువ్వు ఇన్ని ఆర్గ్యుమెంట్స్ చేసి ఎలా నువ్వు మాట్లాడుతున్నావ్ మీ క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడడం లేదు. మేం కొట్టుకుంది రా ఒరేయ్ అన్న దగ్గర నుండి మొదలైంది కానీ అమ్మాయ్ వల్ల కాదు అని చెప్పాడు. ఇది చాలా ఛండాలమైన రీజన్ వేరే రీజన్ చెప్పాలి అని చెప్పాడు అఖిల్. అప్పుడు కుమార్ ఎలిమినేట్ అయ్యే టైమ్ లో నువ్వు అలా మాట్లాడకూడదు అంటూ అటు తిప్పేశారు. నేను ఆల్రెడీ మోనల్ వెళ్తుందనే టెన్షన్ లో ఉన్నాను. అతను నన్నో పాయింట్ అన్నందుకు నేను అన్నాను అందులో తప్పేంటి అన్నాడు. 
అరియానా రిచ్ మాన్ టాస్క్ అయ్యాక మీకు సారీ చెప్పాను అంటే లేదని అన్నారు. నన్ను వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. మీ రియాక్షన్స్ నిజంగానే కోపంగా ఉంటున్నాయ్ సో కొద్దిగా కోపం కంట్రోల్ చేయాలి అని చెప్పింది. నా పాయింట్ కరెక్ట్ ఉన్నపుడు కోపం వస్తుంది. నువ్వు చెప్పింది మంచి పాయింట్ కనుక వింటున్నా అన్నాడు. 
నోయల్ ఛెస్ లొ స్ట్రాంగ్ పవర్స్ ని ఎలిమినేట్ చేస్తే మనం సులువుగా గెలవచ్చు అందుకే నాకు పర్సనల్ గా ఇష్టమైనా కూడా నేను వాళ్ళతో ఫిజికల్ టాస్క్ లు ఆడలేను చాలా స్ట్రాంగ్ కనుక నామినేట్ చేస్తున్నాను. 
  
హారిక : అవినాష్ కొంటె రాక్షసిగా సరిగా పెర్ఫార్మ్ చేయలేదు ఒకరిద్దరి దగ్గరే స్టిక్ అయి పెర్ఫార్మ్ చేశారు తప్ప ఫుల్ ఎఫర్ట్ పెట్టలేదు అని అన్నాడు. హారిక ప్రతి ఒక్కరిని నేను మిమ్మల్ని ఆపానా లేదా అని అడిగింది అందరు ఎస్ అన్నారు అదే నా ఆన్సర్ అని చెప్పింది. బంతిపూల విషయంలో కొంటెగా ప్రయత్నించాను అని అంది.  

ఉన్న పదకొండు మందిలో అవినాష్ కెప్టెన్ కనుక వదిలేస్తే ఈ రోజు ఆరుగురు నామినేట్ అయ్యారు. అమ్మరాజశేఖర్ గారు, అరియానా, మెహబూబ్ ముగ్గురు నాలుగేసి ఓట్లతోనూ లాస్య అఖిల్ మోనల్ ముగ్గురూ మూడేసి ఓట్లతోను నామినేట్ అయ్యారు. హారిక కి ఒక వోట్ వచ్చింది కానీ బిగ్ బాస్ వదిలేశారు. సోహెల్, అభిజిత్, నోయల్ ముగ్గురికి ఓట్స్ రాలేదు. 

రేపటి ప్రోమోలో బిబి డే కేర్ .. బిగ్ బాస్ ఇల్లు పసిపిల్లలను చూస్కునే డేకేర్ సెంటర్ గా మారబోతోందిట. మెహబూబ్, అమ్మ గారు, అరియానా, అవినాష్ పిల్లల్లాగా మారి అల్లరి చేస్తున్నారు   

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.

25, అక్టోబర్ 2020, ఆదివారం

బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు (ఆదివారం 25th October) ఏం జరిగిందో నా మాటలలో ఇక్కడ వినవచ్చు. వీడియో చూడడం కన్నా చదవడం మీద ఆసక్తి ఉన్నవారు నా రఫ్ నోట్స్ ద్వారా ముఖ్యమైన పాయింట్స్ కింద చూడవచ్చు. 


దసరా స్పెషల్ ఎపిసోడ్ నాగ్ ఇంట్రో.. మనం ఇంట్లో లేనపుడు ఇంటిని ఏం చేస్తాం మన కోడలు పిల్లకి అప్పజెప్తాం కదా. నేనూ అదే చేస్తున్నాను. కులుమనాలి లో ఉన్నాను ప్రస్తుతం అందుకే ఈదసరా స్పెషల్ ఎపిసోడ్ ని నా కోడలు పిల్లకి అప్పజెప్తున్నా అని చెప్పాడు. 

సమంతా ఇంట్రడక్షన్ ఏవీ బావుంది.
మామ గారు నాకు చాలా పెద్ద బరువు అప్పజెప్పారు. మీరు కో ఆపరేట్ చేయాలి నేను తెలుగు తప్పుతప్పుగా మాట్లాడితే అది మీకు స్వీట్ గా వినిపించాలి అని చెప్పింది. 
 
లెట్స్ గో ఇన్ టూ మామా టీవీ అంటా. నాగ్ హౌస్మేట్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ నేను మీతో స్మూత్ గా డీల్ చేస్తాను కానీ తను అంత స్మూత్ కాదు జాగ్రత్త అని చెప్పారు :-)

పండగ శుభాకాంక్షలు చక్కగా తెలుగులో అదరగొట్టేశారు. బాగా మాట్లాడుతుంది తెలుగు. 
ఒక్కొక్కరి గురించి రెండు మాటలట. 
అరియానా - షి ఈజ్ ఫైటర్ లైఫ్ లో నామినేషన్స్ లోనిన్ను చూస్తే నన్ను చూశుకున్నట్లు ఉంది షీ ఈజ్ కూల్. అరియానా అండ్ అవినాష్ ఇద్దర్ని మెచ్చుకుంది. కెప్టెన్ గా బాగా చేశారు ఇద్దరు. 
దివి గురి పెడితే తప్పదు ఫోకస్ ఎప్పుడు పెడుతుందో తెలీదు అని చెప్పింది. 
హారిక : పోచమ్మ గుడి హైదరాబాద్ పోరి ఆటలో పాటలో దేత్తడి. ఎందుకు బిగ్ బాస్ అన్ ఫెయిరా అని అడిగింది. 
లాస్య : నవ్వుతోనే అందర్ని బుట్టలో వేసేస్తుంది. అవార్డ్ విన్నింగ్ స్మైలా కొందరు కన్నింగ్ స్మైల్ అంటున్నారా నాకు విన్నింగ్ లానే కనిపిస్తుంది. గాసీప్ క్వీనా.. వంటింటి మహారాణా. 
మోనల్ : సెవెన్ వీక్స్ లోనే తెలుగు బాగా నేర్చుకున్నావ్. చాలా మందికి చాలా నేర్పుతుంది. ప్రేమ పంచుతుంది ప్రేమించడం నేర్పుతుంది. ఈ వీక్ లో ఫీలయ్యావ్ కదా..కెన్ ఐ గివ్ యూ వన్ సజెషన్ అని అడిగింది. ఏడుపు ఒకసారే వర్క్ అవ్తుంది క్లారిటీ తో చెప్తే బావుంతుంది నేనైనా ఏడిస్తె చైతుకి కోపం వస్తుంది. 

హా ఐపోయింది కదా అని క్లోజ్ చేసేస్తుంటే అబ్బాయిలం వెయిటింగ్ మేడమ్ అంటూంటే లేదు ఈ రోజు ఏంటో తెలుసు కదా  పవరాఫ్ శక్తి.. సరే అబ్బాయిలకి అడిగారు కనుక మీకే ఛాన్స్ ఇస్తాను మీరే టూ స్ట్రెంత్స్ టూ వీక్నెసెస్ చెప్పుకోండి అని అడిగింది. 


సోహెల్ కోపం తగ్గించుకున్నందుకు మీ గేమ్ ఇక్కడకి వెళ్ళింది. గుడ్ అని మెచ్చుకుంది. 
అభి యూ హావ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అని అంటే హౌస్లో అందర్ని ఇంప్రెస్ చేస్తున్నావ్ సరే నన్ను కూడానా అని అంది. స్ట్రెంత్ డిసిప్లిన్ అండ్ ఫేషన్స్ అన్నాడు కోపం వీక్నెస్ అన్నాడు. 
నోయల్ స్ట్రెంత్  వీక్నెస్ ఫ్యామిలి గుర్తొస్తుంది.  
అవినాష్ స్ట్రెంత్ ఆడియన్స్..\ అన్నాడు వీక్నెస్ ఫ్యామిలి అన్నాడు ఈ మధ్య కోపం వస్తుంది. నామినేషన్స్ లో ఉన్నావ్ కాబట్టి వస్తుందిలే అని చెప్పింది. 
మాస్టర్ స్ట్రెంత్ వైఫ్ అండ్ కిడ్స్, ఎంటర్టైనర్ వీక్నెస్ సెంటిమెంట్ కోపం అని ఫైవ్ మినిట్స్ లోనే పోతుంది కదా హౌస్మేట్స్ కూడా లెక్కచేయడం లేదు అని అంది. 
మెహబూబ్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రాంగ్ ఎమోషనల్ అవసరానికి మించి ఎఫర్ట్ పెడతా అన్నాడు. టాస్క్ లో ఎగ్రెస్సివ్ అవుతావు ఏం ప్రోటీన్ షేక్ లో ఏం ఉంది అని అడిగింది
అఖిల్ డ్రస్ బావుంది స్పెషల్ గుజరాతీనా అని అంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్ పేషన్స్. ఫ్యామిలి అబద్దం భరింఛలేకపోడం రెండు వీక్నెస్ 
నామినేషన్స్ లో బాగా చెప్పారు ఐ సపోర్ట్ యూ అని చెప్పింది.  ఈ రోజు ఎలిమినేట్ అయితే ఎలా ఫీలవుతావ్ అంటే ఎలిమినేషన్ ఉండదు అని చెప్పాడు. ఆహా అలా అనుకుంటున్నారా మీరందరూ చూద్దాం అని అంటుంది. 

స్పాన్సరర్స్ పేర్లు కూడా బాగానే చెప్తుంది. ఎక్కడ తడబడలేదు. బాగా ప్రాక్టీస్ చేసినట్లుంది. 
 
పండగ రోజు మనం ఆడబోయె గేం స్వయంవరం. 
మ్యాచ్ మేకర్ గా లాస్య ఫాదర్ ఆఫ్ బ్రైడ్ అమ్మ గారు బోయ్స్ సైడ్ పెద్దమనిషి నోయల్ 
ఫస్ట్ టాస్క్ బ్యాచిలర్స్ అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలి. గార్డెన్ ఏరియాలోకి వెళ్దాం అంది.  
అభి ఎవర్ని ఇంప్రెస్ చేస్తున్నావ్ అంటే అందర్ని ఒక్కర్ని కాదు నీకు అలవాటే కదా అని చెప్పింది. 

అభి దివి కళ్ళను గురించి మెచ్చుకున్నాడుఅమ్మాయిలు జగ్రత్త అని చెప్పింది. అవడం లేదు అంటే సరే అందరూ ఇంప్రెస్ అయ్యేలా ఒకటి చెప్పి టాలెంట్ చూపించండి అని చెప్పింది.

అమ్మా అని కొత్తగా అని మొదలుపెడితే ఏంటి వాళ్ళలో అమ్మ కనిపిస్తున్నారా ఆపు అని ఆపేసి లవ్ సాంగ్ పాడమని అడిగారు. ఏమిటో ఏమిటో పాడాడు నాట్ బాడ్.     

సోహెల్ ఏదో ట్రై చేస్తుంటే సిక్స్ పాక్ ఉందంట కదా అని అడిగి రిమూవ్ యువర్ షర్ట్ అండ్ ఇంప్రెస్ అంది. తీస్ మార్ ఖాన్ పాటకి డాన్స్ చేశాడు. చాలా బనియన్ కూడా తీయాలా అని అడిగింది. ఎస్ ఎస్ ఇంప్రెస్డ్ అని చెప్పారు. 

అవినాష్ నవ్వించడం తప్ప ఏం తెలీదు. యోగా పోజ్ చేస్తారట కదా అని అదిగితే చేస్తా కానీ తీయడం రాదండీ అని చెప్పాడు. 

మెహబూబ్ వెళ్తుంటే షర్టిప్పించండి మాడమ్ అంటున్నాడు అవినాష్ మెహబూబ్ ఉండి ఈయన ఇంట్రెస్ట్ ఏంటో అర్థం కావడం లేదు అన్నాడు. మీ వైఫ్ ని ఎలా చూస్కుంటావ్ అని అడిగింది దివి కుకింగ్ చేస్తా హెల్తీగా చూసుకుంటా అన్నాడు. మిర్చి మిర్చి లాంటి కుర్రాడే పాటకి డాన్స్ చేశాడు షర్ట్ తీసేసి. 
 
అఖిల్ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని అమ్మలా చూసుకుంటా. అమ్మాయి అబ్బాయి ఈక్వాల్ అని నా ఉద్దేశం సో మిమ్మల్ని నాతో సమానంగా చూసుకుంటా. బంగారు కళ్ళ బుజ్జమ్మో పాట పాడాడు ఫైనల్లీ పాట మార్చాడండోయ్. బాగా పాడాడు. 

నోయల్ లాస్య ఇంప్రెస్ అయిందని చెప్తుంటే ఎవరూ అవడం లేదు అని లాస్య అలా అని ఆంటీని సెలెక్ట్ చేస్తారా అని అంది. నువ్వు ఏం చేస్తున్నావ్ నోయల్ అని నోయల్ వయసలాంటిది అని మాములు పంచ్ వేయలేదు :-) 

అమ్మాయిలందరు కలిసి అఖిల్ పేరు సెలెక్ట్ చేశారు. నీకు స్పెషల్ సర్ ప్రైజ్ అని మీ ఫ్యామిలీ వీడియో చూపిస్తాను అని చూపించారు. చాలా ఎమోషనల్ అయ్యాడు గట్టిగా ఏడ్చేశాడు.  
అఖిల్ కి ఛాన్స్ ఇచ్చింది నువ్వు ఒకర్ని సెలెక్ట్ చెయ్ అంటే మోనల్ ని సెలెక్ట్ చేశాడు తను చాలా మిస్ అవుతుంది ఫ్యామిలీని అని చెప్పాడు. తను కూడా బాగా ఏడ్చేసింది. ఇంట్లో వాళ్ళంతా ఏడ్చినపుడు బావుండదు సో ఏడవకు అని చెప్పారు.  

తను నోయల్ పేరు చెప్పింది. నోయల్ ఫ్యామిలి వీడియో కూడా బావుంది తమ్ముడు కూల్ గా మాట్లాడాడు.

ముగ్గురివి మాత్రమే చూపించ గలను అని చెప్పింది. 

ఒకరిని సేవ్ చేయాలి కన్ను పార్ట్స్ ఉన్నాయి ఎవరి కన్నైతే బిగ్ బాస్ కన్నుతో సెట్ అవుతుందో వాళ్ళు సేవ్ అని చెప్పింది. ఫట్ సేవ్ అయింది అరియానా.. గ్రేట్ వీక్ కదా అని కంగ్రాట్స్ చెప్పింది. 

గీతామాధురి, మనీషా, శ్రావణ భార్గవి మెడ్లీ లాగా కొన్ని పాటలు పాడారు. 

ప్రశ్న అడుగుతారు తెలిసిన వాళ్ళు బెల్ కొట్టాలి. 
అరియానా డేటాఫ్ బర్త్ ఎంత ?
దివి కి ఏమంటేచాలా భయం ? అఖిల్ కొట్టాడు దెయ్యం అంటే భయం అని చెప్పాడు. 
హారిక ఫేవరెట్ కలర్ మెహబూబ్
మోనల్ లక్కీ నంబర్ ఎంతంటే అవి రెండు అని చెప్పాడు అవినాష్ 
తప్పని శీర్షాసనం వేయించింది. 
వెనక్కి తిప్పి దివి ఇయర్ రింగ్ కలర్ అడిగింది. 
ఎవరెక్కువ మాట్లాడతారు అంటే అభి అమ్మాయిలే అని చెప్పాడు
ఎవరెక్కువ అబద్దాలు అంటే అఖిల్ మగవాళ్ళే ఆని చెప్పాడు నీకు టూ పాయింట్స్ అఖిల్ అని చెప్పింది. 
ఆడవాళ్ళకి బాగా నచ్చే కలర్ పింక్ వైట్ 
ఒక చీర ఎంత పొడవు ఉంటుంది అంటే ఆరు మీటర్లు అని అఖిల్ చెప్పాడు. ఈ రౌండ్ లో విన్నర్ కూడా అఖిల్ రొమాంటిక్ బాయ్ అని అంది సామ్.

సోహెల్ ని స్వయంవరం నుండి ఎలిమినేట్ చేస్తే తనకి ఫామిలీ వీడియో చూపించారు.. హీ ఈజ్ వెరీ హాపీ. బ్రదర్స్ మాట్లాడారు అంతా జిరాక్స్ ప్రింట్ లా ఉన్నారు. తను అమ్మ గారిని సెలెక్ట్ చేశారు. 
అమ్మ గారి పిల్లలు మాట్లాడారు గుండు బావుందని చెప్పారు చాలా ఎమోషనల్ అయ్యారు తను కూడా. అరియానా కూడా ఏడ్చేసింది. తను దివి పేరు సజెస్ట్ చేశారు. దివి ఫ్యామిలి వీడియో సింపుల్ గా ఉంది. 

అరియానా మెహబూబ్, దివి అభి, మోనల్ అఖిల్, హారిక అవినాష్ పెయిర్స్ గా సెలెక్ట్ చేశారు. నాలుగు జోడీలు కంటిన్యూస్ గా పెర్ఫార్మ్ చేయాలి మిమ్మల్ని జడ్జ్ చేయడానికి నాతో పాటు ఇంకో గెస్ట్ ఉంటారు అని చెప్పింది.  
  
అఖిల్ ఎంటర్ అయ్యాడు. మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అని పిలిచింది. 
అవినాష్ అండ్ హారిక ఫస్ట్ పెయిర్ పెళ్ళికల వచ్చేసిందే బాలా కి డాన్స్ చేశారు. డాన్స్ ఎంజాయ్ చేస్తూ హెడ్ మూవ్మెంట్స్ ఇస్తుంది సామ్. అఖిల్ మాత్రం చాలా సీరియస్ గా చూస్తున్నాడు. మా ఇద్దరికి కనెక్షన్ తక్కువున్నా సింక్ లో ఉన్నాం కనుక మమ్మల్ని బెస్ట్ అని చెప్పాలి. 

అఖిల్ మోనల్ రామా లవ్స్ సీతా సీతా లవ్స్ రామా పాటకి డాన్స్ చేశారు. నీ పేరు వెనక స్టోరీ ఏంటి అంటే సిసింద్రీ రిలీజ్ అయ్యాక ఆ పేరు పెట్టారు మా ఇంట్లో అని చెప్పాడు. సో అందుకు నన్ను హేట్ చేస్తున్నావా అని అడిగితే లేదు ఐలైక్ ద నేమ్ అన్నాడు. మా కనెక్షన్ బావుంది హి అండర్స్టాండ్స్ మి వెల్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ మీ అని మోనల్ అంటే గుడ్ హీ ఈజ్ కీపింగ్ అప్ ద నేమ్ అని అంటుంది. 

అభిజిత్ అండ్ దివి అదరదరగొట్టు ఆనే పాటకు డాన్స్ చేశారు. అభి అస్సలు చేయలేకపోయాడు. ఇంత బాగా డాన్స్ చేశాం ఇవ్వలేరా అనిఅడిగితే దివి అభి తక్కువ మాట్లాడుతాడు అంటే సామ్ డాన్స్ కూడా తక్కువ చేస్తాడు అని మాములు పంచ్ వేయలేదు. 

మెహబూబ్ అండ్ అరియానా నిన్నే పెళ్ళాడుకుని పాటకు చేశారు దే వర్ గుడ్ బాగా చేశారు ఇద్దరూ. జోడీ అంటే కేరింగ్ ఉండాలి లవింగ్ ఉండాలి ఇద్దరం ఈక్వల్లీ మొండి వాళ్ళం. కాంపిటీటివ్ స్పిరిట్ ఉంది ఇద్దరిలో అని చెప్పింది గుడ్ ఆన్సర్ అంది సామ్.

అమ్మ గారు నాలుగో పొజిషన్ అభి అండ్ దివి కి ఇచ్చారు. టాప్ టూ అఖిల్ అండ్ మెహబూబ్ అని అంటే అందులో అఖిల్ ఒకర్ని సెలెక్ట్ చేస్కోమంటే 
అరియానా చెప్పిన పాయింట్ నాకు నచ్చింది అందుకే మెహబూబ్ అని అఖిల్ సెలెక్ట్ చేశాడు.

మెహబూబ్ అరియానల్ వీడియోస్ చూపించారు. బావున్నాయ్ చాలా ఎమోషనల్ అరియానా అవినాష్ పేరు చెప్పింది అతని వీడియో కూడా చూపించారు. కూల్ గా ఉన్నాడు పెద్దగా ఎమోషనల్ అవ్వలేదు. 

టాప్ వన్ జోడీ.. ప్లీజ్ ఎక్చేంజ్ చేస్కోండి అని ఫ్రెండ్శిప్ గార్లండ్ అని చెప్పింది. స్నేహమాలా అని చక్కగా తెలుగులో చెప్పింది. అలాగే గిన్నెలో రింగ్ వేసి అది ఎవరికి దొరుకుతుంది చూద్దాంఅ ని చెప్పింది. బెస్ట్ ఆఫ్ త్రీ అని అంది. అరియానా రెండు సార్లు గెలిచింది. అరియానా బాగా ఆడుతున్నావ్ అని చెప్పింది. 

మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ టీజర్ ప్లే చేసారు. తను మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అని అనుకుని బయల్దేరిన అబ్బాయ్ అతను ఎలిజిబుల్ ఆ కాదా అనేది కథ. డైరెక్టర్ భాస్కర్ ని పిలిచారు. 

ఒకర్ని సేవ్ చేసి వెళ్ళమన్నారు. మోనల్ పోటో వచ్చింది. అఖిల్ వచ్చాడు మోనల్ ని సేవ్ చేశాడు అని చెప్తుంది సామ్. 

పాయల్ రాజ్ పుత్ పెర్ఫార్మెన్స్ కొన్ని సాంగ్స్ మెడ్లీ చేసింది. పర్లేదు బానే ఉంది.   
     
శామ్ డైరెక్ట్ గా అభిజిత్ ని సేవ్ చేసింది. అభి లాస్య పేరు సెలెక్ట్ చేశాడు ఫ్యామిలి వీదియో చూడడానికి. జున్ను వీడియో కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పాడు. నేను కూడా వెయిటింగ్ అని సామ్ కూడా చెప్పింది. వీడియో చాలా బావుంది. సామ్ ఐతె నాకే ఏడుపొస్తుంది వీడియో చూస్తుంటే చాలా క్యూట్ గా ఉన్నాడు జున్ను మాచింగ్ షర్ట్స్ అన్నీ సూపర్ అని చెప్పారు. చూసినవాళ్ళందరి పరిస్థితి ఇదే అనిపించింది. 

లాస్య అభి పేరు సెలెక్ట్ చేసింది. వీడియో బావుంది అభి మెసేజ్ కూడా బావుంది. అందరూ సన్నగా ఐపోయావ్ అని అంటున్నారు. 

చివరగా హారిక వీడియో వచ్చింది చాలా బావుంది. అన్నయ్య హెయిర్ స్టైల్ బావుంది చాలా అలా టీమ్ కోసం శాక్రిఫైస్ చేయడం బావుంది అని చెప్పారు అన్న. తన రిప్లై కూడా బావుంది. 

ఇపుడు డిటెక్టివ్ వస్తున్నారు అని ఆది ని తీస్కొచ్చింది. తన పంచెస్ అన్నీ సూపర్ ఫన్ తన స్టైల్లోనే. 

అఖిల్ నువ్వు సోహెల్ మెహబూబ్ అమ్మాయిలు వస్తారని ప్రిపేర్ అయ్యారు కదా మా అవినాష్ గాడికి తెలీక పొట్ట పెంచుకునిఇ వచ్చాడు అన్నాడు.

సోహెల్ ని నాగార్జున గారు చెప్పినట్లు కోపం కంట్రోల్ లో ఉంచుకున్నావ్ కనుక ఇంట్లో ఉన్నావ్ టీవీలో కనిపిస్తున్నావ్ లేదంటే మీ ఇంట్లో టీవీ ముందు వుండేవాడివి అని పంచ్ వేశాడు.  

మోనల్ నా పేరు కూడా ఏ తోనే స్టార్ట్ అవుద్ది అంటే హైపర్ ఆది కదా అంటే మోనల్ కోసం అది తీసేయనా అన్నాడు. 

అభి ని మోనల్ ని నా పెళ్ళికి అంటే తెలుగు తప్పన్నావ్ కాదు కరెక్టే ఆవిడ క్లరిటీతో ఉంది మీరెవ్వరూ లిస్ట్ లో లేరు నా పెళ్ళికి మీరంతా రండి అని అంటుంది. 

దివి కళ్ళు ఎంత బావున్నాయో బ్లాక్ శారీలో భూమికని చూసుకున్నారు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ అయ్యారు. 

నోయల్ ని మంచి తనానికి జిఎస్టీ పెడితే చాలా కట్టాల్సి వస్తుంది అని అన్నాడు. సీతమ్మ వాకిట్లో ప్రకాష్ రాజ్ బ్రహ్మోత్సవంలో సత్యరాజ్ తర్వాత నువ్వే ముగ్గురే ముగ్గురు మంచివాళ్ళు అని అన్నాడు. 

అరియానా ని నన్ను కూడా పొగరంటారు మాట్లాడాలి అంటే టైమిస్తా అని చెప్పాడు. నీకు ఖచ్చితంగా పడతాడు బయట ఆర్జీవి నే పడేశావ్ అవినాష్ ఎంత అన్నాడు. 

అభిజిత్ మీరు అఖిల్ మోనల్ ముగ్గురు మాట్లాడుకుంటుంటే మాకు ప్రేమ దేశం చూసినట్లు అనిపించింది. మీరు మాట్లాడడం మానేశాక వాళ్ళ ప్రేమ దేశాన్ని మీరు డైరెక్ట్ చేయాల్సొచ్చింది చూశావా. చేస్తే హీరోగానె చేయాలి కానీ డైరెక్షన్ వద్దని అనిపించిందా అని అడిగారు. 

హారిక ని బ్రహ్మానందంతో పోల్చారు ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్ అని తెగ చెప్తుంది బిగ్ బాస్ నే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్తున్నాడు. 

లాస్య బయటెలాగుంటుందో అలాగే ఉంది బయట కూడా అంతే ఆవిడ జోక్ వేసి ఆవిడే నవ్వుకుంటుంది అని అన్నాడు

అవినాష్ ని ప్రౌడ్ గా ఫీలవుతున్నా నువ్వు లోపలున్నందుకు అన్నాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడని తర్వాత అవినాష్ సోఫా మీద ఏం రాశాడని అంత పాపులర్ ప్రశ్న ఐంది అని చెప్పాడు. మన కమెడియన్స్ ఎంత పులిహోర కలిపినా మనల్ని దద్దోజనం లాగే చూస్తారు అని చెప్పాడు. 

ఏం పేరు ఉంటుంది సేవ్ చేయడానికి అని అడిగితే అవినాష్ పేరు చెప్పాడు కానీ యాక్చువల్ గా సేవ్ అయింది నోయెల్. 

కార్తికేయ డాన్స్ పెర్ఫార్మెన్స్ బాడ్ గర్ల్ సాంగ్ తొ స్టార్ట్ చేసి మెడ్లీ లాగా చేశాడు బావుంది పవర్ పాక్డ్ పెర్ఫార్మెన్స్. 

తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ అవినాష్ అండ్ దివి మాత్రమే మిగిలాఅరు పైన బకెట్స్ వేలాడేసి కింద నుంచోమన్నారు గ్రీన్ కన్ఫెటీ పడితే సేఫ్ అలా దివి ఎలిమినేట్ అయింది. ప్రాసెస్ చాలా త్వరగా ముగించారు హౌస్మేట్స్ తో కూడా మాట్లాడించలేదు. ఏవీ చూపించాక హౌస్మేట్స్ ని కలిసి అందరికి బైబై చెప్పేసి బిగ్ బాంబ్ మాత్రమె వేశారు. వంట వారం రోజుల పాటు చేయాలి. లాస్య మీద వేసింది. అభి హెల్ప్ తీస్కుంటాను అని అంది.. 

లాస్య తో షటప్ ఎపిసోడ్ అండ్ మొన్నటి పప్పు ఎపిసోడ్ వల్ల తన ఫాన్స్ సపోర్ట్ దొరికి ఉండదు దివికి. అలాగే అట్ ద సేం టైమ్ మోనల్ కి అఖిల్ ఫాన్స్ వి అరియానా కి సోహెల్ ఫాన్స్ అవినాష్ కి మెహబూబ్ ఫాన్స్ సపోర్ట్ చేసుండచ్చు అందుకే దివి ఎలిమినేట్ అయుంటుంది అనుకుంటున్నాను. 

అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం. 

24, అక్టోబర్ 2020, శనివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. వినడానికి సమయం వెచ్చించడం కన్నా చదవడం పై ఆసక్తి ఉన్న వాళ్ళు కింద నా రఫ్ నోట్స్ ఇస్తున్నాను. అది చదువుకోవచ్చు.


ముందుగా హిమాలయాల్లో వైల్డ్ డాగ్ షూట్ లో ఉన్నాను అంటూ నాగ్ మెసేజ్ వచ్చింది. ఇరవై ఒక్క రోజులు షూటింగ్ ఆతర్వాత వచ్చేస్తాను అని చెప్పారు. సో ఈ రోజు ఎపిసోడ్ అంతా హోస్ట్ లేకుండా నిన్న హౌస్మేట్స్ తీసిన సినిమా ప్రీమియర్ పేరుతో ఆ తర్వాత వాళ్ళ అవార్డ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ లతో నింపేశారు. నాట్ బాడ్ ఎంటర్టైనింగ్. చివరన సమంతా ప్రోమో వేశారు రేపు ఆదివారం సాయంత్రం ఆరుగంటలకే షో అట దసరా స్పెషల్. తను కూడా హోస్టింగ్ బాగానే చేసిందనిపించింది ప్రోమో ఐతే అదిరిపోయింది. 
 
వివరాలు : 
 
48వ రోజు ఉదయం "పైసా వసూల్ " పాటతో మేల్కొలుపు.. దివి లేచి బెడ్ మీద నుండే రెండు స్టెప్పులు వేసి మళ్ళీ పడుకుంది. 

బిగ్ బాస్ మూవీ ప్రీమియర్ గురించి అనౌన్స్మెంట్ వచ్చింది. మీరు చేసిన సినిమాని మీరు చూశే సమయం వచ్చింది అందరూ ప్రీమియర్ కోసం డ్రస్సప్ అవండి అని చెప్పారు. 

లాస్యకి వెల్లు వచ్చి గోదారమ్మ పాటకి డాన్స్ నేర్పుతున్నారు అమ్మ గారు. మెహబూబ్ కాంబినేషన్ లో అట. 

డైరెక్ట్ గా రాత్రి తొమ్మిదింబావుకి ప్రీమియర్ సెట్ చూపించారు. 
ప్రేమ మొదలైంది పోస్టర్స్ ఉన్నాయి అఖిల్ మెహబూబ్ కటౌట్స్ ఉన్నాయ్ సోహెల్ హరికల పోస్టర్ సెపరేట్ గా ఉంది.

అరియానా మోనల్ ని రెడ్ కార్పెట్ ఇంటర్వూ చేస్తుంది.
మీకు బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ మొదలైందా అని అడిగింది. ఆహా లేదు అని చెప్పింది చాలా మంది పీపుల్ లైన్ లో ఉన్నారు అని చెప్పింది. 

తర్వాత లాస్య వచ్చింది ఇంటర్వ్యూకి అవినాభావ అనడానికి అభినవ భావ అని ఏదో అంది అరియానా లాస్య సరి చేసింది. టైటిల్ సజెస్ట్ చేశా అని చెప్తుంది పప్పులో పోపు నేను తోపు దమ్ముంటే ఆపు అని మళ్ళీ సజెస్ట్ చేసింది. 

అక్కడే మొదటి సారి కలుసుకున్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు సరదాగా. 

తర్వాత సోహెల్ ని ఇంటర్వ్యూ చేసింది. కోపం తెప్పించడానికి ప్రయత్నం చేసింది. కానీ సోహెల్ కంట్రోల్ చేస్కున్నాడు. అవినాష్ ఇంటర్వ్యూ చేశాడు. నాది కామెడీ రోల్ అండ్ ఎమోషనల్ గా కూడా ఉంటుంది సినిమాలో అని అన్నారు. మీరు అండర్ని అరియానా అనిపిలుస్తారట ఏంటి అంటే జస్ట్ గుడ్ ఫ్రెండ్ అండీ అని చెప్పాడు. 

తర్వాత అఖిల్ ఇంటార్వ్యూ.. మీకు బిబి హౌస్ లో ప్రేమ మొదలైందా అని అడిగితె ఇక్కడ మొదలైంది అందరిమీడ ఉంటుంది. ప్రేక్షకులకుకూడా నా మీద ప్రేమ మొదలైంది అని చెప్తున్నాడు. ఆ ప్రేమతోనే ప్రేక్షకులు ఇక్కడకు తీస్కొచ్చారు అని చెప్తున్నాడు. 

అభి ఇంటర్వ్యూకి మంచి యాటిట్యూడ్ తో ఫాస్ట్ గా వచ్చాడు. త్వరగా ఫినిష్ చేస్కుని వెళ్దాం పద అని అడిగాడు. తను చెప్పిన ఆన్సర్ బావుంది. అండ్ అతని డ్రస్ కూడా బావుంది. చాలా రోజుల తర్వాత మంచి డ్రస్ లో చూడ్డం రిలీఫ్ గా బావుంది.  మీకు లవర్ బోయ్ ఇమేజ్ ఉంది అమ్మాయిలు పడిచచ్చిపోతున్నారు ఎందుకు అని అడిగింది. అందర్ని మెప్పిమ్చడానికి ప్రయత్నిస్తున్నా అంది. మీకు ప్రేమ మొదలైందా అంటే మొదలవబోతుంది రండి చూద్దాం అని సినిమా మీద కలిపేసి పిలిచాడు. 

ఇంటర్వ్యూలో బాగా మాట్లాడిన వారికి రియల్ మాంగో జ్యూస్ ఇచ్చారు. మోనల్, సోహెల్, అవినాష్ లకి ఇచ్చింది. 

ప్రీమియర్ కి సోహెల్ అండ్ లాస్య యాంకరింగ్ చేస్తూ ఉన్నారు. 
స్క్రీన్ సెటప్ అండ్ సీటింగ్ బావుంది. 
యాంగ్రీ స్టార్ అఖిల్ యాజ్ అఖిల్ అంట. 
ఎమోషనల్ స్టార్ మోనల్ యాస్ స్రవంతి అంట. బిగ్ బాస్ కాలేజ్ లో చదువుతున్నారు వీళ్ళిద్దరు. అఖిల్ అంటే స్రవంతికి ప్రాణం అంట. షాట్స్ బావున్నాయ్ మోనల్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ బావుంది. 
లౌడ్ స్టార్ అరియానా యాస్ సుభాషిణి అలియాస్ సుబ్బలక్ష్మి అంట. ఈ అమ్మాయికి కూడా అఖిల్ అంటేనే ఇష్టం. 
అవినాష్ ఇంట్రో.. బాచిలర్ స్టార్ అవినాష్ యాజ్ ఏడుకొండలు సుభాషిణి తిన మరదలు. 
మజిల్ స్టార్ మెహబూబ్ యాజ్ మెహబూబ్ 
పులిజింకని ఎలా వేటాడుతుందో అలా అమ్మాయిలని వేటాడుతుంది అని ఇంట్రో. 

మిర్రర్ లో మిగిలిన హౌస్మేట్స్ అంతా కనిపిస్తున్నారు. సీరియస్ సీన్ లో వెనక అఖిల్ దోశలు వేస్తున్నారు. 

అవినాష్ అమాయకమైన పల్లెటూరి బావగా అదరగొట్టేస్తున్నాడు యాక్షన్. అరియానా పెర్ఫార్మెన్స్ కూడా బావుంది. 
మెహబూబ్ యాక్షన్ కూడా అదరగొట్టేస్తున్నాడు. అఖిల్ అండ్ మెహబూబ్ మధ్య ఫైట్ కూడా అదరగొట్టేశారు.  అవినాష్ అండ్ అరియానా కలిసిపోయే సీన్ లో కూడా అదరగొట్టేశారు. వాళ్ళిద్దరు కలిశాక మెహబూబ్ మీద ఇంటర్వెల్ బ్రేక్ యాక్షన్ అదర గొట్టేశాడు.
 
బ్రేక్ తర్వాత అఖిల్ అండ్ మోనల్ లవ్ సీన్ అఖిల్ మొన్న కనిపించావు పాడాడు. ప్రేమ మొదలవుతుంది అనగా ఫోన్ మెహబూబ్ జైల్ నుండి రిలీజ్ అయ్యాడట బిబి దాబాకి వచ్చేయండి అని సుబ్బలక్ష్మి పోన్. హారిక కెవ్వు కేక పాట మొదలైంది.. చింపి అవతలపడేసింది డాన్స్ సోహెల్ కూడా చాలా బాగా చేశాడు. సాంగ్ సూపర్ అసలు. 

మెహబూబ్ విలనీ బావుంది మోనల్ ని ముట్టుకోడానికి ట్రై చేస్తే మళ్ళీ మెహబూబ్ అండ్ అఖిల్ మధ్య ఫైట్ బావుంది. మెహు కిందనుండి స్టైల్ గా పైకి లేచాడు అద్దిరిపోయింది. 

రెండు జంటల పెళ్ళిళ్లతో ఎండ్ పడింది. నైస్ మూవీ అనమాట. 

బిబి స్టార్ అవార్డ్స్ షో మొదలైంది. 
బెస్ట్ యాక్టర్ అవార్డ్ అవినాష్.. సినిమా కోసం చచ్చిపోతాను టాస్క్ కోసం చచ్చిపోతాను అని స్పీచ్ మనవాడు :-) ప్రేమ మొదలవదు అండ్ పెళ్ళి మొదలవుద్ది ఆ తర్వాత ప్రేమ మొదలవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు. 

అమ్మాయిల హార్ట్ థ్రోబ్ అవార్డ్ అఖిల్.. స్పీచ్ నిజం స్పీచ్ లా ఇచ్చాడు. అవార్డ్ డెడికేట్ చేయమని అడిగితే పేరెంట్స్ కి డెడికేట్ చేస్తాను అనిచెప్పాడు. 

రాకింగ్ డీఓపీ అవార్డ్ నోయల్
బెస్ట్ బాడీ విలన్ అవార్డ్ మెహబూబ్ అవార్డ్ మమ్మీకి డెడికేట్ చేశాడు. 

నోయల్ రాప్ చేశాడు పక్కన అమ్మ గారు బీట్ బాక్స్ చేశారు.. రాప్ బావుంది..

బెస్ట్ స్టైలిస్ట్ అవార్డ్ లాస్య.. చాలా ఎమోషనల్ ఫీలవుతుంటే ఆసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు కదా అని అభి పంచ్ :-) జున్ను గాడికి డెడికేట్ చేసింది. టు ఆల్ ద మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ స్టైలిస్ట్స్ కి

తర్వాత డ్రీమ్ గర్ల్ కేటగిరీలో మోనల్. ప్రేమ మొదలైందా అని అడిగితే హౌస్ లో ఎంటర్ అవ్వగానే మొదలైంది అని చెప్పింది. మెహబూబ్ యాక్టింగ్ మెచ్చుకుంది. 

మిర్చీ అవార్డ్ గోస్ టూ అరియానా 
బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ టు రాజశేఖర్ 

ఒకొకరు ఇచ్చే స్పీచ్ లో థ్యాంక్స్ చెప్పేపుడు ఎవరైనా లాస్య పేరు మర్చిపోతే అక్కడే స్టేజ్ మీడ టచప్ చేసి చూపిస్తుంది నా పేరు కూడా చెప్పండి అన్నట్లుగా.. ఫన్నీగా ఉంది. 

కొన్ని ఫోటోస్ చూపిస్తారు వాటికి కామెంట్ చెప్పాలి అవినాష్. 
మెహబూబ్ విలన్ అండ్ గుడ్ గెటప్ పిక్స్ చూపించారు మొదటిది నెను విలన్ నేనే విలన్ అని చెప్పాడు. తర్వాత దానికి నేను మంచి మనిషిని సార్ అని వాపోతున్నాట్లు చెప్పాడు బావుంది. నోయల్ పిక్స్ వచ్చాయ్ ఎంట్రీ / జైలు లో ఉన్న పిక్స్ రాప్ మార్చేశాడు సో సో గా ఉంది. 
అమ్మ గారి పిక్స్ అద్దిరి పోయాయ్.. సోహెల్ పిక్స్ కి కామెంట్ అదిరి పోయింది. కథ వేరుంటది నాకథేంటో తెలీట్లేదు. 

ఐటం రాణీ అవార్డ్ గోస్ టు హారిక. అమ్మ గారి చేతులమీదగా ఇచ్చారు. ఇది అందరు ఈజీగా కారీ చేయలేరు.. థ్యాంక్స్ అని చెప్పారు. 

బెస్ట్ అప్ కమింగ్ డైరెక్టర్ అభిజిత్. మెహబూబ్ సీన్స్ ని మెచ్చుకున్నాడు. ఇక్కడ అనుకున్న సీన్ ని అక్కడకి తీస్కెళ్ళావ్ అని చెప్పాదు. టెక్నీషియన్స్ ని మెచ్చుకున్నాడు. మీరందరు మాత్రమే ఇంపార్టెంట్ మీరు లేకపోతే నేను లేను అని చెప్పారు. ఇంత మంచి ఔట్పుట్ రావడానికి కారణం మీరే అని చెప్పాడు. 

జ్యూరీ స్మార్ట్ అవార్డ్ దివి కి. 

ఐటం రాజా అవార్డ్ గోస్ టు సోహెల్.. మాస్టర్ గారి చేతుల మీదుగా తీస్కుంటా అన్నారు. అమ్మ గారు సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్ అని మెచ్చుకున్నారు. 

తర్వాత అమ్మ గారు దివి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది పాటకి డాన్స్ చేశారు బావుంది. 

మోనల్ అండ్ సోహెల్ ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటకి డాన్స్ చేశారు. 

తర్వాత లాస్య మెహబూబ్ వెల్లువొచ్చి గోదారమ్మ పాటకి డాన్స్ చేశారు బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింది. ఈ పక్కన దివి కూడా హుషారుగా డాన్స్ చేస్తూ ఉంది. 

అవినాష్ అండ్ అరియానా స్వాతిలో ముత్యమంత పాటకి డాన్స్ చేశారు. అవినాష్ రెచ్చిపోయి చేశాడు డాన్స్.. అరియానా కూడా బాగా మాచ్ చేసింది.  

తర్వాత హౌస్మేట్స్ అందరూ ప్లీజ్ బిగ్ బాస్ ఒక్క పాట అని అడిగితే బంగారు కోడిపెట్ట పాట వేశారు అందరూ రెచ్చిపోయి డన్స్ చేశారు ఇంక్లూడింగ్ అభి. 

రేపటి ప్రోమో "ఈ రోజు నాతో ఎంజాయ్మెంట్ మాములుగా ఉండదు" అంటూ సమంత వచ్చేసింది. అండ్ అండ్ షీ ఈజ్ కూల్ అని అరియానా స్టైల్ డాన్స్ తో తనని, కోపమొస్తే సోఫా మీద రాస్కోండి అని అవికి సోఫా మాటర్ ట్రెండింగ్ మా అని అవికి, దేత్తడి దేత్తడి అని డాన్స్ తో హారిక కి, డ్రస్ బావుంది గుజరాతీనా అని అఖిల్, అబ్బా అండర్ని ఎవర్ని వదలకూడదా అని అభిని, మీరు గురువు ఐపోవాలండి అని నోయల్ ని. నామీద పంచ్ లు వేస్తే నా ఫాన్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా కాల్ చేస్తను  తొక్కేయండి ఇతన్ని అన్నట్లు సైన్ చేస్తూ అవినాష్ ని చూపిస్తూ ఫన్నీగా సైన్ చేసింద్. ప్రోమో మాత్రం అదిరి పోయింది. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts