21, నవంబర్ 2020, శనివారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడచ్చు. 



నాగ్ వచ్చాడయ్యో సామీ పాటాతో ఎంటర్ అయ్యారు. ముందుగా నిన్నటి వివరాలు చూపిస్తున్నారు. మోనల్ రియలైజేషన్ ఫ్రెండ్షిప్ కాదు ఎవరి గేం వాళ్ళే ఆడాలి అని తనకి తానే చెప్పుకుంటుంది. బాగానే రియలైజ్ అయింది కానీ చాలా ఆలశ్యంగా రియలైజ్ అయిందా అనిపించింది. కాకపోతే ఇప్పటికైనా అవడం నాట్ బాడ్.    

రాత్రి మైక్ అనౌన్స్మెంట్ వచ్చినందుకు ఎగ్స్ ఇవ్వను అని చెప్తే అఖ్ఖిల్ అండ్ సోహెల్ కి.. తర్వాత మోనల్ కి కూడా పనిష్మెంట్ ఇస్తూ తనకి మీ ఇద్దరు హెల్ప్ చేయండి అని అడిగింది. దానికి మేం చేయం అని చెప్పి హారికని కెప్టెన్ అవితే కొమ్ములొచ్చేస్తాయ్ అని అన్నాడు అఖిల్ అది కూడా ఎదురుగా కాదు తను వెళ్ళిపోయాక. ఇది బాలేదు అనిపించింది. అభి తో కొట్లాడుతున్నది ఇలా ఎదురుగా కాకుండా వెనక మాట్లాడుతున్నండుకే కదా మరి ఇపుడు నువ్వు చేసిందేంటి అని అనిపించింది.  

రియల్ మాంగో జ్యూస్ టాస్క్ వచ్చింది. అవినాష్ పోటీ అనేదే లేకుండా గెలిచాడు. అందరికన్నా ముందు అందుకుని తాగేశాడు ఫుల్ గా.. మిగిలినవాళ్ళకి ఇంకా పట్టుకోవడం కూడా రాలేదు. అరియానా సెకండ్ కాచ్ చేసింది కానీ పూర్తి చేయలేకపోయింది.  

ఒకొక్కళ్ళని ఒకో ప్రశ్న అడుగుతాను మీరు నిజాయితీగా జవాబిస్తె మీ ఫామిలీని పిలుస్తాను. 
 

అఖిల్ కి ఎందుకు అంత కోపం వచ్చిందని అడిగారు. సపోట్ చేయడం అంటే పక్కన నుంచుని సపోర్ట్ చేయచ్చు కానీ తను ఇవ్వలేదు అని చెప్పాడు. సోహెల్ ని ఈ మధ్య నువ్వు బాగా మాట్లాదుతున్నావ్ కదా హారికతో ఈ రకంగా దించేసి సపోర్ట్ చేశావా అని జోక్ చేశారు. 

హారిక కి టాప్ టూ పొజిషన్ లో ఉంటే ఎవరు నీ పక్కన ఉండకూడదు అని అనుకుంటావు అని అడిగారు. వన్ ఎవరు కాకపోవచ్చు అని అంటున్నారు. అవినాశ్ కి ఇచ్చింది. తన కోసం తన బ్రదర్ అండ్ ఫెండ్ వచ్చారు. 

హారికని ఎందుకు అంత ఏడ్చావ్ అని అడిగారు. అమ్మకి చిన్న దెబ్బలు లాగా తగిలాయ్ అవి ఎందుకా అని అనుమానంతో ఏడుపొచ్చింది అని చెప్పింది. అలాంటిదేం లేదు నీకోసం ఒక కుక్క పిల్లని తెచ్చాం దానితో ఆడుకుంటూ సోఫా తగిలి దెబ్బతగిలింది అంతే అంతకన్నా ఏం లేదు అని చెప్పాడు బ్రదర్.

టాప్ ఫైవ్ ఎవరుంటారు అని అడిగారు హరిక, అభి, లాస్య, సోహెల్ అరియానా లను సెలెక్ట్ చేశారు. బలం కండలలో కాదు బుద్దిలో ఉంటుంది షీ ఈజ్ ఇంటెలిజెంట్ అని చెప్పారు నాగ్.    

అఖిల్ వాళ్ళ అన్న అండ్ వాళ్ళ అబ్బాయ్ వచ్చారు. ముందొకలా వెనక ఒకలా ఉండేది ఎవరు అని అడిగారు అభి అని చెప్పాడు. దానిని గురించి అభి మాట్లాడాడు గొడవ నాకు ఇష్టం లేదు స్క్రీన్ లో చూసేసరికి ఇలా ఫీలవుతున్నాదు. చిన్న విషయం కాదు పెద్ద ప్రక్రియ నిప్పుతో ఆడుకుంటున్నాడు మేక అనేది ఒక ఉదాహరణగా తీస్కున్నా తప్ప మరో ఉద్దేశ్యం లేదు. అని క్లియర్ గా మాట్లాడాడు. నన్ను మాట్లాడనివ్వడం లేదు అని నాగ్ ని పర్మిషన్ అడిగాడు అఖిల్ ని నాగ్ ఆపేశాక అభి  మాట్లాడాడు. అఖిల్ కూడా ఎవరు గొడవ పెట్టుకోరు అని చెప్తున్నాడు. ఆయనతో మాట్లాడితే గొడవే ఆవుతుంది అని చెప్తున్నాడు అభి.
 
టాప్ ఫైవ్ సోహెల్, అఖిల్, అభి, అరియానా, అవినాష్ ని సెలెక్ట్ చేశారు. 

అరియానా కోసం వాళ్ళ సిస్టర్ అండ్ ఫ్రెండ్ కార్తీక్ ఇద్దరు వచ్చారు. అందరిలో షోకోసం అన్ని విధాల అతి తక్కువ కృషి చేసింది ఎవరు అని అడిగారు. మోనల్ అని చెప్పింది.ఈమధ్య బాగా కనిపిస్తుంది కానీ అది వరకు పరిమితంగానే ఉండేది అని ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వేది కాదు అని చెప్పారు. ముందు నువ్వు నాతో మాట్లాడండి నన్నే చూడండి అరియానాతో మాత్లాడకూడదు అని కాసేపు నవ్వించారు
ఆవేశాన్ని ఆపగలరు కానీ అభిమానాన్ని ఆపలేరు అని మృగనయని డైలాగ్. 

టాప్ ఫైవ్ అరియానా, అఖిల్, సోహెల్, హారిక, అవినాష్ ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే సోఫాలో ఎపుడో రాశారు తర్వాత ఏం ఎంటర్టైన్ చేశాడు చెప్పు అని అడిగారు నాగ్. 

లాస్య వాళ్ళ అమ్మ గారు వచ్చారు. సేఫ్ గేం మాత్రమే ఆడుతూ ఇంతవరకూ నెట్టుకొచ్చింది ఎవరూ అని అడిగారు. అవినాష్ ని చెప్పింది. అందర్ని ఎంటర్టైన్ చేస్తూ నామినేట్ అవకుండా ఆ టెన్షన్ తీస్కోకుండా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పింది. 

టాప్ ఫైవ్ లాస్య, అభిజిత్, సోహెల్, అఖిల్, హరిక 

సోహెల్ కోసం రామారావ్ అన్న వచ్చారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళాక ఎవరితో స్నేహాన్ని కొనసాగించలేరు. అభిజిత్ అన్నాడు. మాదంతా కల్లు గుడాల్ తాగే బాచ్ మాది ఆయన్దేమో గ్లెన్ ఫిడిచ్ లాంటివి తాగుతాడు. కానీ ఆయన కూడా వచ్చే అప్పుడు వస్తాయ్ అని అన్నాడు మాస్ గా మారిపోతున్నా అన్నాడు అభి కూడ. నాకు అన్న లేడు కానీ అంతగానే చూసుకుంటాడు రామారావ్ అన్న అని అన్నాడు. 

టాప్ ఫైవ్ సోహెల్, అభి, అఖిల్, అవినాష్, అరియానా. 
నైన్ తర్వాత మనోడి కత వేరుంటది అని ఛాట్ చేస్తాడని ఫుల్ డీటేయిల్డ్ ఛాట్ ఇచ్చిపడేశాడు. అయ్యో ఇజ్జత్ తీస్తున్నావ్ అని అన్నాడు. 

అందరిలోకి స్వార్థపరులు ఎవరు అని అడిగారు. గెలవడానికి ఏమైనా చెప్పాలన్నా చెప్పదు అంతా దాచిపెట్టుకుంటుంది అని చెప్పాడు. ఎక్స్ప్రెసివ్ కాదంటే అది సెల్ఫిష్ ఎలా అవుతుంది అని అన్నారు నాగ్. లేదు నువ్వు జెన్యూన్ గా చెప్పలేదు ఫ్యామిలి రాదు ఆన్నాడు.

అభిజిత్ తో నిన్న సామెత చెప్పి ఇంతకీ గథా ఎవరు అని అడిగారు. హారికనే అని అన్నాడు ఖుదా అంటే ఎవరంటే బిగ్ బాస్ అని చెప్పాడు. వాళ్ళ నాన్నగారు మామ వచ్చారు. తన పెర్ఫార్మెన్స్ బావుంది అని చెప్పారు నాన్న. సినిమాల్లోకి రాడం ఇశ్టం లేదంట కదా బిగ్ బాస్ లోకి రావడం ఎలా అని అడిగితే సినిమాలు నేను చూడను అని చెప్పారు. 

టాప్ ఫైవ్ అభి, సోహెల్, హారిక, అఖిల్, మోనల్ నిన్న పెర్ఫార్మెన్స్ తో నీకు ఫిఫ్త్ ప్లేస్ ఇస్తున్నా అని చెప్పారు. అఖిల్ నిన్న కోపం తెచ్చుకోకుండా ఉంటే సెకండ్ లో ఉండే వాడివి అని అన్నారు.

మోనల్ కోసం వాళ్ళ మమ్మీ వచ్చారు. ఇంట్లో ఎవరిని నమ్మకుండా ఉంటే బావుండేది అనుకున్నావ్ అని అడిగారు అభికి ఇచ్చింది. మొదటి వారం నుండీ ఫెండ్స్ కానీ తర్వాత నా వెనక మాట్లాడుతున్నాడు. కామెల్ అని ఇంకా వేరే వేరే పేర్లు పెడుతున్నాడు. మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఫ్రెండ్స్ కాదు అని అన్నారు. నాదీ సేం ఫీలింగ్ అని అన్నాడు అభి. తను ఏడుస్తుంటే అభి నే టిష్యూ ఇచ్చాడు. అఖిల్ ఉనాడు తోడుగా అంటే అఖిల్ ఒక్కడే కాదు ఇంకా అందరూ ఉన్నారు అని చెప్పారు ఆవిడ. నాగ్ కి గణేశా బొమ్మ గిఫ్ట్ ఇచ్చారు. మీరంటే చాలా ఇష్టం అని చెప్పారు. 
 
టాప్ ఫైవ్ అభి, మోనల్, అఖిల్, లాస్య, సోహెల్. 

అవినాష్ దగ్గరకి వచ్చారు మళ్ళీ లాస్యగురించే మళ్ళీ చెప్పాడు. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. 

హౌస్ లో లాస్ట్ త్రీలో ఎక్కువ ఓట్లు వచ్చినది మోనల్ కి ఐదు లాస్య కి నాలుగు అవినాష్ కి నాలుగు వచ్చాయ్ ఈ ముగ్గురికి. మీ ముగ్గురికి మోస్ట్ నంబర్స్ వచ్చాయ్ కనుక మీ ఫేవరెట్ ఐటమ్స్ తీస్కురండి అని చెప్పారు. లాస్య పాపం జున్ను గాడి ఫోటో తెచ్చింది. వాటిని స్టోర్ రూం లో పెట్టమన్నారు. బిగ్ బాస్ మీ ఆటతీరు చూస్తారు మళ్ళీ తెచ్చిస్తారు అని చెప్పాడు నాగ్. 

టైమ్ టు సేవ్ వన్ హార్ట్ కి నామినేటెడ్ ఫేసెస్ ఉన్న కత్తులు ఉన్నాయ్. ఈ వీక్ లో ఎక్కువ నంబర్ ఆఫ్ వోట్స్ వచ్చాయ్ తొమ్మిదిన్నర కోట్ల వోట్లు వచ్చాయ్ అని చెప్పారు. 
డాగర్ టిప్ గ్రీన్ ఉంటే సేవ్ రెడ్ ఉంటే నాట్ సేఫ్. సోహెల్ ఈజ్ సేఫ్...  
అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 

20, నవంబర్ 2020, శుక్రవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇచ్చినది నా రఫ్ నోట్స్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ దానిలో చూడవచ్చు. 



ఈ రోజు హౌస్ లోకి లాస్య ఫ్యామిలి వచ్చింది మంజునాథ్ గారు బగా మాట్లాడారు. జున్ను గాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో మాటల్లో చెప్పలేం నిజంగా లాస్య చాలా మిస్సవుతుంది అని నాకే అనిపిస్తుంది తనకెలా ఉందో. ఇక కెప్టెన్సీ టాస్క్ లో మోనల్ చాలా బాగా ఆడి హారికని గెలిపించింది, కంటిన్యువస్ గా తను మోటివేట్ చేయడం కూడా బావుంది. ఇన్ని రోజులకి ఒకేసారి తన ఫిజికల్ స్ట్రెంత్ ని గేం ని రెండిటిని చూపించి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. అలాగే లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో హౌస్మేట్స్ చాలా ఐటంస్ గెలుచుకున్నారు.  

వివరాలలోకి వెళ్తే 74 వ రోజు రాత్రి తొమ్మిది గంటలకు లాస్య ఫ్యామిలీ ఎంటర్డ్ ఇన్ హౌస్ జున్ను గాడు సో క్యూట్.. లాస్య ఫ్రీజ్ లో ఉంది కానీ అక్కడ నుండే బిస్కట్స్ వాటర్ అన్నీ చెప్తుంది. త్వరగానే రిలీజ్ చేశారు. జున్ను గాడి కోసం అభి రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్లీజ్ బిగ్ బాస్ మమ్మల్ని కూడా రిలీజ్ చేయండి అని ఇంట్రెస్టింగ్. 

గివప్ ఇవ్వకు చాలా బాగా ఆడుతున్నావ్ వంటగది వదిలేసి టాస్క్ లు ఆడు అని చెప్తున్నాడు. లాస్య మంజునాథ్ మాత్లాడుకుంటుంటే జున్ను గాడు వాడ్ని పట్టించుకోట్లేదని వచ్చి ఆఅ అని పిలుస్తున్నాడు.  

అవినాష్ జోకర్ నోస్ వేస్కొని వచ్చి నవ్విస్తున్నాడు అండ్ అదే లాస్య కూడా పెట్తుకుని నవ్వించింది. జున్ను గాడు హాయిగా హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉన్నాడు హారిక తో అఖిల్ తో. అందరిని చూసి వాడికేం అర్థం కావడం లేదు.. అందరికి హాపీగా బాయ్ చెప్పాడు. లాస్య చాలా ఏడ్చేసింది. 



నైట్ అవినాష్ అందర్ని ఇమిటేట్ చేస్తున్నారు ఎవరెవరు సేవ్ అయితే ఎలా రియాక్ట్ అవుతారని చూపిస్తూ ఉన్నారు. ఫన్నీ. 

కమెండో ఇన్స్టిట్యూట్ టాస్క్ పూర్తయింది. హారిక ఏడుస్తూ భోం చేస్తుంది ఎందుకో మరి. అభిజిత్ ఒక్కడే ఎందుకో సీరియస్ గా ఉన్నాడు. కాస్త డల్ గా ఉన్నట్లు అనిపించింది. 
 
75 వ రోజు ఇంట్లో 8మంది సభ్యులు ఉన్నారు. 
ఉదయం రంగస్థలం సినిమాలో ఆగట్టునుంటావా పాటతో మేల్కొలిపారు. ఈ పాట ఈ రోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ కి భలే రెలెవెంట్ గా అనిపించింది. 

హారిక అవినాష్ అండ్ సోహెల్ తో ప్రాంక్స్ చేసి అరచేత్తో మొహం మీద కొట్టింది. హిలేరియస్.. 

స్కూల్ కి పోకుండా హోం వర్క్ చేయకుండా ఏంటి మీరు అని అవినాష్ అరియానా ని హారికని ఏడిపిస్తున్నాడు. ఇద్దరూ చక్కగా రెడీ అయి కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఒక క్వీన్ ఎలిజెబెత్ అండ్ క్వీన్ విక్టోరియాలా ఉన్నాం కదా అని అడ్గుతున్నారు ఇద్దరు. 

హయర్ రిఫ్రిజిరేటర్ ప్రోమో అండ్ లక్జరీ బడ్జెట్ టాస్క్. ఐటమ్స్ ఫ్రిజ్ లో ఉన్నాయ్ క్విజ్ ప్రోగ్రాం నలుగురు జవాబులు చెప్పాలి రైట్ చెప్పిన ప్రతి సారి ఒక డోర్ తెరిచి ఒక ఐటం తీస్కోవచ్చు. మాస్టర్ అవినాష్ పార్టిసిపెంట్స్ సోహెల్, లాస్య, అభిజిత్, మోనల్. 

సోహెల్ కి
లివింగ్ ఏరియాలో బెలూన్స్ ఎన్ని తొమ్మిది రాంగ్
డైనింఘ్ టేబుల్ పైకప్పు పై ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయ్ అని అడిగారు. నలభై ఎనిమిది ఉన్నాయంట
స్మోకింగ్ జొన్ లో సోఫా కలర్స్ ఇది కరెక్త్ చెప్పాడు
కన్ఫేశన్ రూం లో ఎన్ని ఛెస్ కాయిన్స్ ఉన్నాయ్ ట్వంటీ కరెక్ట్
గార్డెన్ ఏరియా సోఫా రంగు ఏంటి ఎల్లో రైటాన్సర్.. 
లాస్య ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతుంది కిచెన్ అది కూడా తప్పు చెప్పాడు. 
ఇంటి మొదటి కాప్టెన్ ఎవరు లాస్య అన్నీ కరెక్ట్ చెప్పారు.. 

లాస్య కి 
లివింగ్ ఏరియాలో ఎన్ని రైనో హెడ్స్ మూడు
బెడ్రూం ఏరియా గోడలపై నెమళ్ళు త్రీ
లివింగ్ ఏరియాపై ఎన్ని గిటర్స్ రెండు
డైనింఘ్ టేబుల్ దగ్గర ఎన్ని కుర్చీలు ఉన్నాయ్ రాంగ్ 
అభిజిత్ ఫేవరెట్ సోఫా రైట్

అభి 
లివింగ్ ఏరియా గోడపై ఎని 
హైర్ కి సంబందింది ఎన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాయ్ నాలుగు
ఏ ఐటం సోహెల్ ని సంతోషపరుస్తుంది. మటన్ 
మోనల్ కోసం 
బెడ్రూం ఏరియా సీలింగ్ పై ఎన్ని లైన్స్ లైట్స్ ఉన్నాయ్
మొత్తం మీద చాలానే లగ్జరీ బడ్జెట్ ఐటంస్ వచ్చాయ్.

సాయంత్రం ఛాలెంజెస్ పూర్తి చేసి స్టర్ పొందిన కెప్టెన్సీ పోటీ దార్లు ముగ్గురు మిగతా ఇంటి సభ్యులని ఒప్పించి వారి భుజాల మీద నించోవాలి చివరి వరకు ఎవరైతే ఉంటారో వారు కెప్టెన్. ఆ పోటీ వినగానే అభి నవ్వుకుంటున్నాడు. 
యెల్లో భాక్స్ లో నిలబడి ఎత్తుకోవాలి అండులో నుండి కదిలినా సభ్యుడు కిందకి దిగినా తప్పుకోవాలి. భుజాలమీద నుండి కిందకి దిగకుండా మార్చుకోవచ్చు కావాలంటే. 
అవినాష్ అభిని, సోహెల్ అఖిల్ ని మోనల్ హారికని మోస్తా అని ఒప్పుకున్నారు.
నాలుగు నలభై ఐదుకి స్టార్ట్ అయింది. 
బాక్స్ లు కొంచెం చిన్నగానే ఉన్నాయ్ సులువుగా బయటికి వెళ్ళేట్లు. 
లాస్య హే సోహెల్ అని పిలుస్తుంటే  హే వద్దు అని అంటు విసుకున్నాడు..  
అవినాష్ కాళ్ళు స్లిప్ అయ్యాయి నీస్ బెండ్ అయ్యాయి కాళ్ళు అటూ ఇటూ కదిలాయ్ దిగుతా బ్రో అని రెడీ అయ్యాడ్ అభి కూడా. అంతలో కాలు కద్లింది. 

నేను హేమాలి అనుకో నేను ట్రబుల్ లో ఉన్నాను నువ్వు సపోర్ట్ చేయ్ ఈ సారి మనం అబ్బాయిలకి ఇవ్వద్దు అని మోటివేట్ చేస్తుంది హారిక. 
సోహెల్ చాలా కష్టపడుతున్నాడు. చెయ్యలేకపోతే వదిలేయ్ అని చెప్తున్నాడు అఖిల్ కానీ సోహెల్ ఈజ్ నాట్ గివింగప్. ఒక టైమ్ లో ఐయామ్ డన్ అని చెప్పాడు పొజిషన్ మార్చుకున్నాడు కానీ చేయలేక పోయాడు దించేశాడు. మోనల్ మాత్రం అందరు దిగాక కూడా దిగకుండా అంతే మోసింగ్ గర్ల్స్ అందరూ గ్రూప్ హగ్ ఇచ్చుకున్నారు. అంతా సోహాపీ.. అరియానా హారికని ఎత్తుకుని అంతా తిప్పేసింది. 
హారిక చాలా ఎమోషనల్ అయింది మోనల్ ని గట్టిగా హగ్ చేసుకుని ముద్దులు పెట్టేసి ఐలవ్యూ చెప్పేసి చాలా హాపీ ఫీలైంది. 

సోహెల్ నేను నా కేప్టెన్సీ లాగే ఆడాను కానీ వీపంతా పట్టేసింది అని చెప్తున్నాడు అఖిల్ కి అలాగే మోనల్ ఫిక్స్ అయిపోయింది ఇంకో పదినిముషాలైనా ఉంటుంది అని అనిపించింది అన్నాడు. వెరీ వెరీ సారీ అని చెప్తున్నాడు సోహెల్. 
మోనల్ వచ్చి పక్కన కూర్చుంటే నన్ను ఒక ఐదునిముషాలు వదిలేస్తావా అని అన్నాడు. 

అభి మోనల్ మాట్లాడుకుంటున్నారు. మోనల్ చెప్తుంది నేను అడిగాను తనకి సపోర్ట్ కోసం కానీ తనకి సోహెల్ మీద ఎక్కువ నమ్మకం ఉంది మరి నేనేం చేయను అని అంది. లాస్ట్ టైం టాస్క్ లో నేను కొంచెం బాధపడ్డాను నన్ను ఎవరూ నమ్మలేదని ఈ సారి హారిక నన్ను నమ్మిందని సంతోషించాను అందుకే కష్టమైనా ఉన్నాను అని చెప్పింది. గేం కదా అందరు గేం ఆడుతున్నారు అని చెప్తుంది. 

నిజానికి అఖిల్ లాస్ట్ వీక్ కూడా మోనల్ ని చాలా చులకనగా మాట్లాడాడు నీతో పెట్టుకుంటే నేను మొదటే ఔట్ అయ్యేవాడ్ని నువ్వు ఫిజికల్ టాస్క్ లు ఆడలేవు అని ఈ రోజు ఆడి చెక్కు చెదరకుండా నిలబడి స్టామినాని తన సంకల్పబలాన్ని ప్రూవ్ చేసుకుందనిపించింది టూగుడ్. 

ఇంట్ళోకి వచ్చాక నేర్చుకున్న విషయాలేంటి ఇక్కడకొచ్చాక మీలో వచ్చిన మార్పులేంటి చెప్పమన్నారు. 
సోహెల్ ఫుడ్ వాల్యూ తెలుస్కున్నా అన్నాడు కోపం ఎక్కువుండేది అన్నాడు. మనుషులతో ఇంటరాక్షన్ తక్కువుండేది ఇక్కడ అందరితో కలుస్తున్నా అన్నాడు. మనుషులతో రియల్ ఎమోషన్ అటాచ్ ఐంది అని చెప్పాడు. 

అరియానా టైమ్ వాల్యూ నేర్చుకున్నా అంది. 
చిన్న చిన్న విషయాలకి సంతోషించడం థ్యాంక్ ఫుల్ గా ఉండడం నేర్చుకున్నా అంది. ఇగో తగ్గించుకుని కోపం తగ్గించుకున్నా అని చెప్పింది. 

నన్ను కెప్టెన్ గా చూడలేకపోతున్నారు అని అంటుంది హారిక.. అభి మోనల్ ఎంత పనిచేస్తివి అని అంటున్నాడు. ఖుదా మెహార్బాన్ హైతో గథాబీ పహల్వాన్ అని సామెత వేశాడు అంటే ఇక్కడ గథా ఎవరు అని అడిగింది హారిక. నువ్వే అర్థం చేస్కో అంటున్నాడు. అది జోక్ అని అంటున్నాడు అభి. సరే ఇది గుర్తుపెట్టుకుంటాలే ఈ సారి నే జోక్ వేస్తే నువ్వు సీరియస్ అవుతావ్ కదా అపుడు చెప్తా అంటుంది. 

హారికని మైక్ ధరించమని అనౌన్స్మెంట్ వచ్చింది. నాకు మీరెవరు గుర్తు చేయలేదు కాబట్తి ఒక స్టెప్ వేద్దాం అని అభిని కుడ పిలిచి రూల్స్ బ్రేక్ చేస్తే మేం గుర్తు చేస్తఆం అని స్టెప్ వేయించింది అందరితో.  అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


నవంబర్ పందొమ్మిదిన టెలికాస్ట్ ఐన డెబ్బై ఐదవ ఎపిసోడ్ అన్ సీన్ రివ్యూ తో పాటు అభిజిత్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడా అనేదానిపై నా విశ్లేషణ ఇక్కడ నా మాటలలో వినవచ్చు. 



సోహెల్ అవినాష్ లాస్య ఎవరెవరు కెప్టెన్ అవలేదు అని డిస్కస్ చేస్కుంటున్నారు. అఖిల్ ఓన్ గా కాలేదని సోహెల్ అంటే అలా ఐతే నేను కూడా కాలేదు అని లాస్య అంటుంది. నిన్ను కట్టప్ప అన్నారు నువ్వు ఆ అవమానాన్ని మోశావ్ కదా ఇంకేంటి అని అంటున్నాడు. థాంక్స్ తమ్ముడు గుర్తించావ్ అని అంది లాస్య. 

సోహెల్ హారిక ఇద్దరు మొన్న ఐన గొడవ గురించి మాట్లాదుకుంటున్నారు. నేను మొదటి సారి అరిచాను అంతగా ఇప్పటి వరకు ఎప్పుడు అంత అరవలేదు అని చెప్తుంది. ఏందో ఈ హౌస్ లో మూడ్స్ ఇలా మారిపోతాయ్ అని అనుకున్నారు. సోహెల్ కూడా ఏంటో ఆ మొమెంట్ లో అసలు అవసరమా అని అనిపించింది అని చెప్తున్నాడు. నాగ్ సార్ మనల్ని తిడతారేమో అని అనుకుంటున్నారు. 

మోనల్ కోపం కాస్త తగ్గిన తర్వాత అఖిల్ దగ్గరకి వెళ్ళి మూడ్ బాలేదు మీరు వచ్చారు మాట్లాడడానికి కానీ ఇంట్లో వాళ్ళు రాలేదని ఇలా చేస్తే రారేమో అని అనడం బాలేదు అని చెప్పి బాధపడుతుంది. నేనే అన్నాను కానీ మరి టాస్క్ లో జాగ్రత్తగా చేయాలి అని చెప్పాడు క్లారిటీగా అఖిల్. నువ్వు ప్లాంక్ వాక్ అవి కూడా సరిగా చేయలేదు అర్ధం చేస్కున్నాను అది నీకే మంచిది కాదు అనిచెప్పాడు. సారీ చెప్పింది మిస్టేక్ చేయకు అని అంటుంది. తెలిసి అంటుందా తెలీక అంటుందా అని నేను బుర్రగోక్కునేంతలో అఖిల్ బానే అర్థం చేస్కుని చేయకు కాదు చేయను అని చెప్పు నువ్వు చేయకూడదు అని అంటే అపుడు సరే అంది.   


హారిక అఖిల్ ఫామిలీ వచ్చింది చాలలేదు ఏం మాట్లాడామో కూడా గుర్తు లేదు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అని మళ్ళీ రికలెక్ట్ చేస్కుంటున్నారు. 

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది పాటని పూర్తిగా మార్చేసి పారెడీ చేసి పాడుకుంటున్నారు. ఫన్నీగా బావుంది. 

మోనల్ కి అవినాష్ నీ పేరు ఎందుకు తీస్కున్నాం అని వివరణ ఇస్తున్నాడు. మా అందరికన్నా నువ్వు ఎక్కువ ఫ్మామిలిని మిస్ అవుతున్నావ్ మా అందరికి ఇక్కడే ఉంది నువ్వు చాలా దూరం కదా అందుకే అని చెప్తున్నాడు. బహుశా ఈ డిస్కషన్స్ అన్నీ చూశాకే బిగ్ బాస్ మోనల్ కి స్పెషల్ ఎఫెక్ట్ ప్లాన్ చేశాడానిపించింది నాకు. 

లాస్య జున్ను గాడికోసం గోపాల బాలుడమ్మ పాట పాడింది ఎంత బావుందో అసలు చాలా బావుంది.  

అరియానా వాళ్ళ ఫ్రెండ్ వినీత్ అభిజిత్ తో నీకు బిగ్ ఫాన్ అని చెప్తున్నాడు. దట్స్ సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. 
 
బాక్ బిచ్చింగ్ అండ్ బిగ్ బాస్ హౌ రెలెవెంట్. అన్ని కెమేరాల ముందు ఎపుడు ఎవరికి ఎవరి వీడియో చూపిస్తారో తెలీదు సో అక్కడ ఉన్న వాళ్ళందరికి ఈ విషయం తెలుసు వాళ్ళలో స్మార్ట్ గా ఆలోచించే అభికి ఇంకా తెలుసు. 

టీవీ ఫోన్ లాంటి ఎంటర్టైన్మెంట్ సాధనాలేమీ లేని బిగ్ బాస్ ఇంట్లో మాటలే ఎంటర్టైన్మేంట్. ఎవరి టాపిక్ వస్తే వాళ్ళాని పిల్చి మాట్లాడుకో లేరు కదా.

అదీ కాక అభిజిత్ ఎప్పుడూ ఎవరి ముందు మంచివాడిగా ఉండాలని నటించడం చూడలేదు. నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంటాడు. వఆళ్ళు లేనపుడు మాట్లాడుకున్నా కానీ అదే విషయం ఎదురుగా చెప్పడానికి సంకోచించడు. 

అసలు ఈ పదం బిగ్ బాస్ కి వర్తించదు అన్ని కెమేరాల ముందు మాట్లాడుకుంటూ అది ఎపుడైనా అవతలి వాళ్ళకి తెలిసే అవకాశమున్నపుడు అలా అనలేం అని నా అభిప్రాయం.  



19, నవంబర్ 2020, గురువారం

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ - నవంబర్ 19th గురువారం ఎపిసోడ్ No: 75 పై నా అభిప్రాయం నా మాటలలో ఇక్కడ వినవచ్చు. కింద ఇచ్చినది రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ అందులో చదవచ్చు. 



నిన్నటి కమెండో టస్క్ లో ఫ్యామిలీలు రావడన్నే ఈ రోజు కూడా కంటిన్యూ చేశారు. ఈ రోజు కొన్ని కొన్ని సంధర్బాల్లో హౌస్మేట్స్ తో ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్రీజ్ లు చెప్తూ బిగ్ బాస్ బాగానే ఆడుకున్నారు హౌస్మేట్స్ తో. అరియానా కోసం వాళ్ళ ఫ్రెండ్ వినీత్, సోహెల్ కోసం వాళ్ళ నాన్నగారు వచ్చారు. లాస్య ఫ్యామిలీ రేపొస్తుంది. మోనల్ కి వాళ్ళ అమ్మగారి వాయిస్ మెసేజ్ వినిపించారు. వాళ్ళ అక్క హేమాలి కూడా వచ్చింది. తిను కొంచెం హౌస్ లో నెగటివ్ ఎనర్జీ ని నింపి వెళ్ళిందనిపించింది ఎందుకో వివరాల్లో చూద్దాం.       

వివరాలలోకి వెళ్తే ఈ రోజు 74 వ రోజు ఇంట్లో 8మంది సభ్యులు ఉన్నారు. 
ఉదయం మనం సినిమాలో కనిపెంచిన మా అమ్మకే పాటతో మేల్కొలిపారు. ఇంకోసారి పాటెయ్యచ్చుగా అని అడుగుతున్నారు అరియానా. 

అఖిల్ అండ్ మోనల్ మాట్లాడుకుంటున్నారు. నీతో ఎందుకో ఎక్కువ మాట్లాడలేదు అని అనుకుంటున్నారు. అఖిల్ మా అమ్మ చాలా పొసెసివ్ అని చెప్తుంది. నేనూ ఈ ఇంట్లో మనం పర్మెనెంట్ కాదు కదా వెళ్తాం కదా అని  "దుర్గా ఆంటీ హీ ఈజ్ కమింగ్ హోమ్" అని చెప్తుంది మోనల్ :-) ఊ నేను కూడా పొసెసివ్ నా ఫ్రెండ్స్ విషయంలో అని అంటుంది.  

అవినాష్ బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు అరియానా దోశలు వేస్తుంది. బిగ్ బాస్ ఫార్వర్డ్ పవర్ సేవ్ స్లో మోషన్ అని అంటూ మాములుగా ఆడుకోలేదు ఇట్ వజ్ ఫన్ :-) చాలా సేపు ఆడుకున్నాడు :-) మోనల్ దోశ తిప్పుతుంటే అందరూ వార్న్ చేస్తున్నారు మాడినా పర్లేదు వదిలేయ్ అని అది బావుంది. నీ పేరెంట్స్ ఇంకా రాలేదు గుర్తు పెట్టుకో అని అంటున్నాడు అఖిల్. దానితో మోనల్ కి బాగా కోపం వచ్చేసింది అందరు చెప్తారు అని అలిగింది. అఖిల్ అండ్ సోహెల్ ఇద్దరూ కన్విన్స్ చేశారు పక్కన కూర్చుని బావుంది. 

అఖిల్ ని వాటర్ మిలన్ జ్యూస్ అడిగితే మోనల్ ఇవ్వను అని అన్నాడు. సోహెల్ వజ్ కన్ఫూజ్డ్ అయ్యో కాఫీ ఇస్తది జ్యూస్ ఇస్తది నువ్వు ఇవ్వచ్చు కదా అని అంటున్నాడు. హౌస్ లో మొదట్లో వాటర్ అవీ తెచ్చిచ్చేవాడు అడిగీ అడగకుండానే మరి నిన్న వాళ్ళమ్మ గారి రియాక్షన్ నిబట్టి జాగ్రత్త పడుతున్నాడా అని అనిపించింది. 

అవినాష్ ని అరియానా మోనల్ ల మద్యమళ్ళీ ఆడుకున్నారు. పిలిస్తే రావా అని ఇద్దరూ తర్వాత వెళ్ళి మళ్ళా మోనల్ తో ఫ్లర్టింగ్ స్టార్ట్ చేశాడు. 

హౌస్మేట్స్ అంతా మార్చ్ ఫాస్ట్ చేస్తుంటే అరియానా ఫ్రెండ్ వినీత్ వచ్చారు. చాలా ఏడ్చేసింది. తొందరగానే రిలీజ్ చేశారు అరియానాని ఇద్దరూ బాగా మాట్లాడుకున్నారు. నువ్వేందో అట్లానే ఆడు గేం అని చెప్పాడు. హౌస్మేట్స్ పిలిస్తే హాయ్ బ్రో అని అంటున్నాడని నాతో మాట్లాడు నన్ను చూడు అని అరుస్తూ ఏడ్చేస్తుంది. మొన్న లెటర్ ఎవరు రాశారు అని అడిగింది. అన్నంలేని స్టేజ్ లో వీళ్ళింటికి వెళ్ళి తినేదాన్ని అని చెప్పింది. మీ చెల్లితో కొట్లాడి వచ్చా అని చెప్తున్నారు. లెటర్ లో ఏం రాశావో చెప్పు అని అడిగింది. అయ్యో గుర్తు లేదు అని చెప్పాడు. దిస్ ఈజ్ ద బెస్ట్ సర్ ప్రైజ్ అని గెంతులేసింది. 

అందరూ రిలాక్స్ అవుతుండగా మోనల్ వాళ్ళ అమ్మ గారి వాయిస్ మెసేజ్ వచ్చింది చాలా గట్టిగా ఏడ్చేసింది. అందరితో మంచిగా ఉండు అని చెప్పారు. జైశ్రీకృష్ణ బేటా అని ఎండ్ చేయడం బావుంది. తను వస్తారు అని చెప్తున్నారు అఖిల్ అండ్ సోహెల్ పక్కన హౌస్ లో అందరూ కూడా షాక్ అయ్యారు రారేమో అని. కెమేరా ముందు తను మెసేజ్ ఇచ్చింది. అందరు వచ్చారు మిస్సయ్యాను అని చెప్తుంది. గుజరాతీలో మాట్లాడింది. తర్వాత బిగ్ బాస్ ని బెదిరిస్తుంది చెప్తాను నాకు చాలా కోపమొస్తుంది నా ఎమోషన్స్ తో ప్లే వద్దు అని వార్నింగ్ ఇస్తుంది. ఇపుడు హేమాలి వస్తే ఇది చాలా తప్పు అని చెప్తుంది. నిన్న నైట్ మమ్మీ వాయిస్ నోట్ ఐనా కావాలని అన్నావ్ కదా అందుకని అది కూడా ఇచ్చారు అని చాలా చక్కగా కన్విన్స్ చేస్తూ చెప్తుంది హారిక చాలా చాలా నచ్చేసింది. ఇంత బాగా చూసుకుంటుంటే పక్క వాళ్ళని ఇంకా చిన్నపిల్ల అంటారేంటో హారిక వాళ్ళ మమ్మీ. 

ఇక అలా కాసేపు ఏడిపించాక మోనల్ కోసం హేమాలి వచ్చింది మోనల్ వాళ్ళ సిస్టర్.. అమ్మని చాలా మిస్ అవుతున్నాను గుజారాతీలో మాట్లాడు అని అడుగుతుంది. అఖిల్ గురించి నా గురించి బయట బాడ్ గా అనుకుంటున్నారా అని అడుగుతుంది ఏం లేదు అందరూ మెచ్చుకుంటున్నరు అని చెప్పింది. అమ్మ గుర్తొచ్చినపుడల్లా ఏడ్పొచ్చేస్తుంది అని చెప్తుంది. బాగా అడుతున్నావు అని చెప్తుంది. అందర్ని పరిచ్యం చేస్తుంటే నాకు తెల్సు రోజూ చూస్తాను అని చెప్తుంది. అందరూ బాగా ఆడుతున్నారు అని అంది. అపుడపుడు నెగటివ్ ఎందుకు అవుతున్నారు అని అడిగింది. అభిజిత్ ని వెనక మాట్లాడకు చెడైనా మంచైనా ఏమున్నా ముందే చెప్పు అని చెప్పింది. ఇదన్న కాసేపటికి అభి సైలెంట్ గా ఉన్నాడని ఆర్ యూ ఫీలింగ్ బాడ్ అని ఇంకా నేను నీతో ఎక్కువ మాట్లాడక పోతె నీకు నచ్చలేదు కదా నువ్వు కూడా మోనల్ తో అలా తక్కువ మాట్లాడకు ఇంకా బాగా మాట్లాడు అని చెప్పింది. 

అవినాష్ నాకు గుజరాతీ వచ్చు అని గుజరాతీ లో నన్ను పెళ్ళి చేస్కుంటావా అని అడిగాడు. నా ఫియాన్సే ఉన్నాడు బయటా ఐనా నువ్వేంటి అందరిని ఇలా అడుగుతూ అందరితో ఫ్లర్ట్ చేస్తావా అనేసింది. ప్రతి సారి ఎందుకు ఏడుస్తావ్.. ఏడిస్తే కొట్టేస్తాను అని చెప్తుంది మోనల్ కి.. ఆవిడ వెళ్ళిపోయాక మోనల్ కెమేరాకి హగ్గులిచ్చేసి ముద్దులు పెట్టేసింది థ్యాంక్యూ బిగ్ బాస్ అని చెప్తూ.. 

అరియానా అవినాష్ హారిక ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఆవిడ ఇచ్చిన ఫీడ్ బాక్ గురించి. ఇక్కడ కూడా హారిక చాలా క్లారిటీతో చెప్పింది అభి వెనక ఏం మాట్లాడాడో అదే ముందు కూడా మాట్లాడుతాడు ఏం మార్చడు అని. నాకు మళ్ళా హారిక నచ్చేసింది బాగా చెప్పిందనిపించింది. 

అఖిల్ అండ్ సోహెల్ కూడా తను చాలా స్ట్రయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది ఇలా ఉంటే బావుంటుంది నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు అఖిల్. అండ్ మోనల్ నేను అఖిల్ కి ఆల్రెడీ చెప్పాను తనొస్తే ఇలానే మాట్లాదుతుందని అభికి కూడా తెలుసు అని చెప్తుంది. 

అభిజిత్ బాగానే ఫీలయ్యాడు అనిపించింది. పాపం నిన్న అనుకుంటూనే ఉన్నాడు మోనల్ వాళ్ళ అమ్మ గారు వస్తే నన్నేదో ఒకటి అంటారు అని అన్నట్లే అనేసింది. అండ్ బెస్ట్ థింగ్ ఎంత ఫీలైనా ఒక్క మాట మాట్లాడకుండా ఎదురు చెప్పకుండా డీసెంట్ గా సరే అని వదిలేశాడు. ఇక్కడ నాకు అభిజిత్ ఇంకొంచెం నచ్చేశాడు. మరొకళ్ళు వేరేవాళ్ళైతే కనుక ఏదో ఒకటి అనేసేవారు వెంటనే కానీ అభిజిత్ కాబట్టి స్టెబిలిటీ కోల్పోకుండా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ నవ్వుతూ స్వీకరించాడు అని అనిపించింది. కానీ నాకు నచ్చని విషయమేంటంటే తర్వాత మోనల్ కూడా వెళ్ళి కన్సోల్ చేయలేదు అభిని. మోనల్ కాకపోయినా అఖిల్ అండ్ సోహెల్ నిన్నె కలిసిపోయారు కదా వాళ్ళైనా వెళ్ళి అభితో మాట్లాడి ఉంటే బావుండనిపించింది. రేపు అన్ సీన్ లో చూపిస్తాడేమో చూడాలి.  

ఈ యంగ్ స్టర్స్ తో ఇదే ప్రాబ్లం.. నాకు ఈ అమ్మాయ్ తనిష్ వాళ్ళ బ్రదర్ ని గుర్తు చేసింది సెకండ్ సీజన్ లో తను కూడా ఇలానే ట్రై చేశాడు. స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉండడం అంటే రూడ్ గా ఉండడం కాదు కదా ఇదె విషయాన్ని కాస్త మ్రుదువుగా సరదాగా కూడా ఛెప్పి ఉండచ్చు అనిపించింది. ఆ సీజన్ లో దీప్తి వాళ్ళ హజ్బండ్ అలా మెత్తగా చెప్పి బాగా హాండిల్ చేసినట్లు గుర్తు. మరి బిగ్ బాసే చెప్పి పంపాడో లేక చెల్లెలి మీద అక్కలకు ఉండే సహజమైన పొసెసివ్ నెస్ తో ప్రొటెక్ట్ చేయాలనే ఇన్ స్టింక్ట్ తో అలా చెప్పిందో తెలీదు. ఏదైనా కానీ అభికి ఇది పాజిటివే ఔతుంది అనిపిస్తుంది తనని గెలుపుకి చేరువగా తీస్కెళ్ళే మరో మంచి సిట్యువేషన్ ఇది. 

ఇవన్నీ పక్కన పెడితె తను కమిటెడ్ అని చెప్పింది కానీ చూడ్డానికి మాత్రం మాములుగా లేదు హేమాలి సార్ హేమాలి అంతె అన్నట్లుంది :-) సోహెల్ ఉండి హే తనకి ఆల్రెడీ పెళ్ళి సెట్ అయిందని చెప్పావ్ కదా అబ్బా ఛా మిస్ అయిపోయా అని చేతిని కొట్టుకుంటున్నాడు :-) అంత బావుందనమాట. 

ఇక ఈ రోజు చివరగా సోహెల్ కోసం వాళ్ళ నాన్న గారు వచ్చారు. సోహేల్ బాబా అని పిలుస్తుంటే సోహెల్ ఏడ్పు అసలు ఆపుకోలేకపోయారు. తనని తప్ప మిగిలిన అందరిని రిలీజ్ చేశారు. సోహెల్ తో పాటు హారిక అఖిల్ అక్కడే ఉన్నారు.. చాలా బావుంది. సోహెల్ ని రిలీజ్ చేశారు. ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు. ఉర్దూతో మొదలు పెట్టి ఇక్కడ తెలుగు మాట్లాడుకోఆలి అని చెప్పాడు. అందరూ సంతోషపడుతున్నారు అని చెప్తున్నారు ఆయన. నువ్వు ఖుష్ ఏ కదా అని అడిగితే హా అని చెప్పారు నువ్వు ఖుష్ ఉంటే చాలు అనిచెప్తున్నాడు సోహెల్. అందరు బాగా చూసుకుంటున్నారు అని చెప్తున్నాడు. 

మాంచి శ్లాంగ్ లో మాట్లాడుతున్నారు. బయటికి వస్తే గొడవలు అన్నీ సల్లబడతాయ్ అని చెప్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు ఎప్పుడేం చేస్తావో తెలీడంలేదు అని చెప్తున్నారు ఆయన గూడా. హారికని పరిచయం చెస్తె ఫైటింగ్ అని చెప్తున్నారు. లాస్యకి ఒకటికి రెండు సార్లు చెప్పారు తమ్ముడ్ని బాగా చూస్కో అని. 

కట్ చేస్తే నైట్ లాస్య జున్ను గాడి ఫోటో తో మాట్లాడుకుంటుంది "సిన్సియర్ గా పొద్దున్న పప్పాని ఇంప్రెస్ చేద్దామని రెడీ అయ్యానురా కానీ డే ఎండ్ చేసే సరికి మన చేతిలో లేదు కదారా" అని చెప్తుంది. ఇక నేను ఒక్కతినే కదా మిగిలింది ఎప్పుడు వస్తాడో రానీ అప్పుడు ఎలా ఉంటే అలా కనిపించడమే ఏం చేస్తాం అని చెప్తుంది. 

లాస్యకి మేకప్ చేస్తుంటే అఖిల్ అండ్ మోనల్ బిగ్ బాస్ మళ్ళీ పవర్ సేవ్ రిలీజ్ చెప్పి అందరితో ఆడుకున్నారు. అఖిల్ కి మాములుగా మేకప్ వేయలేదు మోనల్ అండ్ లాస్య ఇద్దరు కలిసి :-) ఇట్ వజ్ ఫన్. సోహెల్ కూడా ఫుల్ మేకప్ వేశాడు అఖిల్ కి.. లిప్ స్టిక్ ఐలైనర్ అన్నీ వేసేసి. అఖిల్ ని రిలీజ్ చెప్పగానే అందరూ పారిపోయారు సోహెల్ మాత్రమే దొరికాడు. 

లాస్య ఫ్యామిలీ జున్ను ఎంట్రీ రేపటికి పోస్ట్ పోన్ చేశారు. రేపటి ప్రోమోలో చూపించారు. జున్ను ఏమాత్రం ఏడవకుండా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు సో గుడ్ చాలా బావుంది చూడ్డానికి. మంజునాథ్ గారు చాలా బాగా చూసుకుంటున్నట్లు ఉన్నారు అని అనిపించింది. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


18, నవంబర్ 2020, బుధవారం

అవును అమ్మ ప్రేమ అన్నిటిని మరిపిస్తుంది ఇక పగలూ ప్రతీకారాలు ఎంత. అందుకే అమ్మని కలిశాక అఖిల్ అభి సోహెల్ హారిక అంతా కూడా కోప తాపాలు మర్చిపోయి ఒక్కటై పోయారు. ఈ రొజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. 


వావ్ ఏం ఎపిసోడ్ అసలు సూపర్.. అమ్మ ప్రేమ అన్నిటిని మరిపిస్తుంది అందర్నీ తన పిల్లల్లాగే అక్కున చేర్చుకుంటుంది. అందుకే హౌస్మేట్స్ కూడా పగలు ప్రతీకారాలు అన్ని మర్చిపోయి ఒక్కటై పోయారు. అందరిని అలా ఒకటిగా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. 

ఈ రోజు ఫ్యామిలీస్ వస్తాయ్ అని అందరూ ఊహించినట్లుగా నిన్న ప్రోమోలో చూపించినట్లుగానే ఈ రోజు అఖిల్, అభి, హారిక అండ్ అవినాష్ వాళ్ళ అమ్మలు వచ్చారు. అందర్ని తమ పిల్లల్లాగే ట్రీట్ చేస్తూ అభిమానంతో అందరితో మంచిగా మాట్లాడి ఇల్లంతా పాజిటివ్ వైబ్ తో నింపేశారు. 

ఈ రోజు 73 వ రోజు 8మంది సభ్యులు ఉన్నారు ఇంట్లో. 
ఉదయం బాద్ షా సినిమాలో బంతి పూల జానకీ పాటతో నిద్రలేపారు. 

కమాండో ఇన్స్టిట్యూట్ లో పెద్ద పెద్ద టాస్క్ లు ఉండాలి అంతే కానీ ఏందీ పిల్లాటలు అంట. రాత్రి అంతా బ్లైండ్స్ క్లోజ్ ఉన్నాయంట. ఏవో బయట పెద్ద రేంజ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నట్లున్నారు అనుకుంటున్నారు. 

అవినాష్ ని మటన్ బిర్యాని తింటూ టీజ్ చేస్తున్నారు సోహెల్ అండ్ కో. ఫన్నీ అవినాష్ కి మాములు టార్చర్ కాదు. బిగ్ బాంబ్ కాసేపు పక్కన పెట్టేద్దాం అంటావా అని అంటే వామ్మో నన్ను పక్కన పెట్టేస్తారు అని అంటున్నాడు అవినాష్. 

మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక గది కట్టేశారు. ఇంటి సభ్యులను డిస్ట్రాక్ట్ చేయడనికి కొన్ని అవంతరాలు కల్పించబోతున్నారు మీరు వాటిని అధిగమించి మీకిచ్చిన టాస్క్ లో ఎవరైతె డిస్ట్రాక్ట్ అవరో వారికి బిగ్ బాస్ నుండి తగిన ఫలితం లభిస్తుంది. 

నాకు చాలా టఫ్ టాస్క్ ఇస్తారు అని చెప్తు ఏడుస్తుంది అరియానా. మా ఫ్యామిలీ కోసం ఏడిస్తున్నాను చూడు నాకే ఆశ్ఛర్యంగా ఉంది అని అంటుంది.  

అఖిల్ వాళ్ళమ్మ గారికోసం చాక్లెట్ దాచిపెట్టుకోవడం బావుంది.  

మొదట అఖిల్ వాళ్ళ మమ్మీ వచ్చారు. బిగ్ బాస్ రిలీజ్ చెప్పేవరకూ చాలా కంట్రోల్డ్ గా ఉన్నాడు చెప్పిన వెంటనే అసలు చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు. వాళ్ళ అమ్మ గారు చాలా బాగా మాట్లాడారు. అభి సారి చెప్పాడు కానీ ఏం పర్లేదమ్మా ఫ్యామిలీలో బ్రదర్స్ అంటే అంతే కదమ్మా అన్నారు. అరియానా ని బోల్డ్ అంది. హారికని చెల్లి అని లాస్యని అక్క అని మోనల్ ని ఫ్రెండ్ అని రిలేషన్స్ క్లారిఫై చేసేశారు బావుంది. నువ్వు ఇక్కడే సెలెబ్రేట్ చేస్కోవాలి అని అనుకున్నా అని చెప్పారు. టాప్ ఫైవ్ లో ఉంటానా అని అడుగుతున్నాడు. అభి మీద అరవకు అని చెప్తున్నారు అఖిల్ కి.. వెళ్ళాక మంచి టైట్ హగ్గిచ్చాడు అభికి. 

అభిజిత్ సారీ చెప్తున్నాడు నాకు ఏం లేదు అని అంటూంటే ఏ మనం బయట నుండి వచ్చి కొట్లాడుకుంటున్నామా సారీ అని చెప్తున్నాడుఅఖిల్ కూడా.. మనం కలుద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఇలా అవుతుంది అని అనుకుంటున్నారు. గుడ్ టు సీదట్.. 

బిగ్ బాస్ మాములు చిలిపి కాదు. అరియానా ప్లాంక్ వాక్ మాత్రం వద్దు బిగ్ బాస్ అని బతిమాలుతుంటే బతిమాలనిచ్చి అయ్యాక ప్లాంక్ వాకే ఇచ్చాడు సూపర్ అసలు :-) అందరు బాగా అలసి పోయారు ప్లాంక్ వాక్ చేయలేక చచ్చిపోతున్నారు పాపం. 

హారిక వాళ్ళ అమ్మ గారు వచ్చారు సెకండ్ టైం. లాస్య మాత్రం మాట్లాడేస్తుంది. మిగిలిన వాళ్ళంతా మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. హారిక వాళ్ళమ్మ గారు రకరకాలుగా పిలుస్తున్నారు. తినకి త్వరగానే రిలీజ్ చెప్పేశారు బిగ్ బాస్. పొట్టి అంటే అందులోనే పోటీ ఉంది అలాగే ఆడు అని అభికి లాస్య కి థ్యాంక్స్ చెప్పారు. అరియానాని అందరూ బ్రేవ్ అని అంటున్నారు. వచ్చిన తర్వాత నేను ఎక్కడికి తిరిగినా ఏం అనద్దు అని ఇక్కడ నుండే పర్మిషన్ తీసేస్కుంటుంది. ఇంతముందు చిన్న పిల్లవి ఇపుడు బోల్డు మెచ్యురీటీ వచ్చింది పంపిస్తాలే అని అంటున్నారు. స్ట్రాంగ్ గా ఉండు ఆని చెప్తున్నారు. అనౌన్స్మెంట్ రాగానే వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయారు.  

ఛీ ఫామిలీస్ వచ్చేటప్పుడే మనం కొట్లాదుకున్నాం అని ఫీలవుతున్నారు సోహెల్ అండ్ హారిక. 

తర్వాత అభి వాళ్ళ మమ్మీ వచ్చారు... అభి నార్మల్ గా చాలా కంట్రోల్డ్ గా ఉంటాడు కదా తను కూడా మూవ్ అవడం తెలుస్తుంది ఫేస్ లో. కానీ రిలీజ్ చెప్పినపుడు వాళ్ళ అమ్మగారిని కూడా ఏడవద్దని చెప్తూ కంట్రోల్ చేశాడు సో నైస్.. అందరూ ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు వేస్కున్నారు. అభి చాలా అఫిషియల్ గా సీరియస్ గా మాట్లాడుతున్నాడు. అరియానాకి స్కూల్ డ్రస్ వేసి పంపిస్తాను అని చెప్తున్నారు. నాకూ ఓ రోజు హౌస్ లో ఉంటే బావుండు అనిపిస్తుంది అన్నారు. ఆవిడ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడబోయ్ అమ్మో తెలుగులో మాట్లాడాలి కదా అని తెలుగులో చెప్తున్నారు. అవినాష్ ఉండి ఇక్కడ ఎన్ని గొడవలు అయినా అందరం మంచి ఫ్రెండ్స్ మి అని నచ్చచెపుతుంటే మాంచి స్టైల్ లో మాస్ పంచ్ ఇస్తూ కొట్టుకోండి అని అన్నారు సో గుడ్. నీకర్థంకాటల్లేదు నన్ను బుక్ చేయకు అని అంటూంటే అభి అరే అదె మజారా అని చెప్తున్నారు. అభి తాతయ్యాడు అని మెసేజ్ ఇచ్చారు. అందరూ చిక్కిపోయారు అని చెప్పారు సో స్వీట్.. తిన్నారా అని అడిగారు మటన్ తిన్నాం అని చెప్తుంటే ఆహా గుడ్ మెహబూబ్ ఏ మిస్సింగ్ అని గుర్తు చేసుకున్నారు.  
ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఈ అవకాశం మళ్ళీ రాదు అని చెప్పారు. మొత్తం హౌస్ అంతా పాజిటివ్ వైబ్స్ తో నింపేశారు తిను.  
ఫస్ట్ సీజన్ లో అర్చన వాళ్ళ అమ్మ గారు వచ్చినపుడు ఆవిడ హౌస్ లో ఉంటే బావుండేది అని అనుకున్నాం అలాగే మళ్ళీ ఈ రోజు అభి వాళ్ళామ్మగారు వచ్చినపుడు అనిపించింది. 
    
ఆవిడ ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీతో అందరూ ఎక్సైటెడ్ అండ్ మదర్స్ అందరూ అంతే అని అనుకున్నారు. అంతా కూడా గ్రూప్ హగ్ ఇచ్చుకుని వాటెవర్ హాపెన్స్ ఇన్ బిగ్ బాస్ స్టేస్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పాడు అభి. అందరూ కూడా యునానిమస్ గా అగ్రీడ్ టు ఇట్.. సో నైస్ బావుంది. అందరం బయటికి వెళ్ళాక చూసి అరె ఇంత చిన్న విషయానికా కొట్లాడుకుంది అని బాధపడతాం అని అంటున్నాడు అఖిల్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూ. 

ఈ సారి అవినాష్ వాళ్ళ అమ్మ గారు వచ్చారు. ఆవిడ కూడా సైలెంట్ గా అందరితో పాటు అటెన్షన్ లో నిలబడ్డారు ఏం మాట్లాడకుండా. అవినాష్ కి రిలీజ్ చెప్పారు. ఆ తర్వాతే ఆవిడ కూడా మాట్లాడుతున్నారు అవినాష్ తో. పెళ్ళి చేస్తా వచ్చినాక ఊకే అనకు అని అంటున్నారు. బాగ కష్టపడి వచ్చాడు అని చెప్తుంటే అయ్యో అనిపించింది. అరియానాకి స్పెషల్ గా ముద్దు పెట్టింది. ఆ తర్వాత అమ్మాయిలందరికి ముద్దులు పెట్తింది. ఏం మాట్లాడాలో అర్థంకాటల్లేదు అంటే మంచిగా మాట్లాడు బిడ్డా ఎందుకు భయపడకు అని చెప్తున్నారు. అందరు వచ్చి నా ఫోటోస్ తీస్కెళుతున్నారు అని చెప్తున్నారు. కుర్చీ ఉంది దానిలో కూర్చుని మాట్లాడమన్నారు. అంతలోనే లేచి వెళ్ళి పోయారు. చిన్న స్టెప్ వేయ్ అంటే అనాల్నా అని అడిగి మంచి డాన్స్ వేశారు సూపర్ గా :-)
నీకా జోకులన్నీ మీ అమ్మ గారి నుండే వచ్చాయ్ అని చెప్తుంది హారిక. 

అమ్మ నడుస్తుంది సో హాపీ అని ఫిల్ అవుతున్నాదు అవినాష్ ఏదైనా కానీ పట్టుకున్న ఫీల్ ఆ స్మెల్ మిస్సవుతున్నాం కదా అని అంటున్నాడు అవినాష్. అభి ఏమో అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేం బ్రదర్ అని చెప్తున్నారు. 

నీ కన్నీరు కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందా అంట అరియానాతో అవినాష్. మిగతా వాళ్ళవైతే సింపుల్ గా ఇలా జారిపోతాయ్ నీవైతే నెమ్మదిగా అక్కడే ఉంటున్నాయ్ అని చెప్తున్నాడు. 

రేపటి ప్రోమోలో రేపు మిగిలిన వాళ్ళ ఫ్యామిలీస్ వస్తున్నట్లున్నాయ్. అరియానా క్లోజ్ ఫ్రెండ్ వినయ్ వచ్చారు. మోనల్ కి వాళ్ళ అమ్మ గారి వాయిస్ వినిపించారు. లాస్య అండ్ సోహెల్ కోసం ఎవరు వచ్చారో ఇంకా చూపించలేదు. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.  

17, నవంబర్ 2020, మంగళవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది నా రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చూడవచ్చు. 



ఈ రోజు టాస్క్ కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్రీజ్ లు ఉన్నాయ్ అది వినగానే నాకు ఈ వీకే ఫ్యామిలీస్ వచ్చేస్తున్నారా అని కాస్త ఆశ్చర్యమేసింది. రేపటి ప్రోమోలో వస్తున్నట్లు చూపించారు కూడా. టాస్క్ అందరూ బాగా ఆడారు వెయిట్ వల్ల మోనల్ బాగా ఇబ్బంది పడ్డట్లు అనిపించింది. నాకు నచ్చిన విషయం ఏంటంటే నిన్నటి నామినేషన్స్ గొడవలు అన్ని పక్కన పెట్టి అందరు కలిసిపోవడం ఒకరినొకరు ఎంకరేజ్ చేస్కోవడం అండ్ అంతా కలిసి అఖిల్ బర్త్ డే సెలెబ్రేట్ చేయడం చాలా బావుందనిపించింది. అభి కూడా ఏం మనసులో పెట్టుకోకుండా అఖిల్ అండ్ సోహెల్ తో మంచిగా మాట్లాడాడు. అండ్ యాక్టివ్ గా ఫిజికల్ టాస్క్ పెర్ఫార్మ్ చేశాడు గివప్ ఇవ్వకుండా. ఈ రోజు ఎపిసోడ్ లో నాకు కాస్త నెగటివ్ గా అనిపించింది అవినాష్ ట్రిప్ అవడం తను మళ్ళా బాలెన్స్ కోల్పోతున్నాడనిపించింది.   

వివరాలలోకి వెళ్తే డెబ్బై రెండొవ రోజు ఈ రోజు ఎనిమిదిమంది ఉన్నారు. ఈ ఉదయం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఛల్ ఛలో ఛలో లైఫ్ సే మిలో పాటతో మేల్కొలిపారు. 

కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్. 
అఖిల్ కేప్టెన్.. ట్రంపెట్ సౌండ్ కి మూడు రౌండ్స్ మార్చ్ ఫాస్ట్ అండ్ ఎక్సర్ సైజ్
గన్ షాట్ కి పరిగెత్తుకు వెళ్ళి దాక్కోవాలి 
పవర్ సేవ్ ఫ్రీజ్ 
స్లో మోషన్ 
ఫాస్ట్ ఫార్వర్డ్
డ్రం రోల్ కి ప్లాంక్ వాక్ చేయాలి 
రిలీజ్ అనగానే రీలీజ్ అవ్వాలి. 
టాస్క్ బజర్ మోగినపుడు ఎవరు బజర్ కొడితే వాళ్ళు ఛాలెంజ్ చేసే అవకాశం వస్తుంది. ముందు ఎన్నుకుని బిబికి చెప్పాలి. ఛాలెంజ్ చేశాక స్టార్ వస్తుంది ఒకసారే బజర్ కొట్టాలి. 

ప్లాంక్ వాక్ చాలా హారిబుల్ గా ఉంది అందరూ చాలా అవస్థపడ్డారు. మోనల్ పూర్తిగా పాకలేదు మోకాళ్ళ మీద మాత్రమే పాకింది. 
డ్రమ్ రోల్ కి గన్ సౌండ్ కి పెద్ద తేడా తెలీకుండా ఉంది..

హౌస్మేట్స్ ఆర్ హావింగ్ ఫన్ కమేండో అంటూ మాట్లాడు కుంటున్నారు. హారిక మీరు బయటకి వస్తే తునుక్ తునుక్ అవుతారు అంట ఫన్నీ :-)

సోహెల్ నీ దగ్గర స్కోప్ ఉందా అంటే లాస్య నా దగ్గర బయోస్కోప్ ఉంది అంటే మరొకరు నా దగ్గర స్టెతస్కోప్ ఉంది అంట. ఫన్నీ

లాస్య హారికని మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి అంటే లెవెంత్ వీక్ లో అట్లే ఉంటుంది అంట అవినాష్ ఫన్నీ గై.. 

బిగ్ బాస్ కూడా మంచి చిలిపి మార్చ్ ఫాస్ట్ చేయించి అందరూ లోపలెక్కడో బెడ్ రూం లో ఉన్నపుడు బజర్ మోగించాడు.. సోహెల్ ఏమన్నా పరిగెట్టాడా అసలు తనే ఫస్ట్ వచ్చి బజర్ నొక్కాడు. వెంటనే మెహబూబ్ అరే మెహబూబ్ అని పిలిచాడు. గుర్తొస్తున్నాడురా.. 
తన టాస్క్ స్విమ్మింగ్ పూల్ లో వెయిట్స్ ని ఒకవైపు నుండి ఒక వైపుకి తీస్కెళ్ళాలి అని ఉంది. ఒకొక్క దాన్ని తీస్కుని ఒక వైపు నుండి మరో వైపుకి ఐదు నిముషాల్లో తీస్కెళ్ళాలి అనిచెప్పారు. అందరూ బాగా ఛీర్ చేశారు సోహెల్ చాలా కష్టపడ్డాడు కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయ్ సో ఒక్కొక్కటి అనే సరికి కాస్త కష్టమైంది. అప్పటికి ఒక్కటి తప్ప మొత్తం వేసేశాడు. 
నిన్నటి గొడవంతా పక్కన పెట్టేసి హారిక కూడా వెల్ ట్రై రా మెహబూబ్ ఉన్నా ఇంతే చేసుండే వాడేమో హి విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పడం చాలా బాగా అనిపించింది. 
  
అఖిల్ సోహెల్ మాట్లాడుకుంటున్నారు.. నడవకుండా స్విమ్ చేసుంటే చేసుండే వాడ్ని అంటున్నాడు. కానీ రాంగ్ ఛాయిస్ సెలెక్ట్ చేశావ్ రా ఆ టాస్క్ తీస్కో కూడదురా అని చెప్తున్నాడు అఖిల్. బాగా ట్రై చేశాడు అప్పటికి మళ్ళా ఇపుడు ఈ జడ్జిమెంట్ లు అవసరమా అనిపించింది నాకు. 

సెకండ్ టైం బజర్ మోగినపుడు అఖిల్ పరిగెట్టుకు వెళ్ళి ఫస్ట్ నొక్కాడు. పోల్ ను వాటేసుకునే టాస్క్ చేస్తా అన్నాడు. చేస్తుంటే సోహెల్ నాలోనె పొంగెను నర్మద పాడుతున్నాడు. అఖిల్ బానే కష్టపడుతున్నాడు. సోహెల్ కిందకు దిగితే చంపుతా అని అంటున్నాడు. 
ఒక కాలు మీద కొంత సెపు మరో కాలు మీద కొంత సేపు నిలబడ్డాడు. ఫైనల్లీ హి డిడ్ ఇట్.. 

లాస్య హారిక అభి మనం కొడతామంటారా అని అంటుంటే ముందు బజర్ కొడదాం తర్వాత టాస్క్ గురించి ఆలోచిద్దాం అంటుంది లాస్య. 

బజర్ ముందు నిలబడి దండంపెడతా కాల్మొక్తా బజర్ సౌండ్ ఇవ్వండి బిగ్ బస్ అని అంటున్నాడు.   

సోహెల్ అండ్ అఖిల్ మాట్లాడుకుంటూ హారిక మోటివేట్ చేయడం బాగా అనిపించింది అంటున్నాడు సోహెల్ అండ్ అఖిల్ నువ్వు సారీ చెప్పడం కూడా బావుంది నిన్న. మనం అంతేరా అలా కరిగిపోతాం అని అంటున్నాడు :-)

మోనల్ మాములుగా కష్టపడడం లేదు.. ప్లాంక్ వాక్ లో చాలా ఇబ్బంది పడుతుంది. రోలింగ్ ట్రై చేస్తుంది. 
పవర్ సేవ్ అని చెప్తే అంటే ఏంటి అని అనుకుంటున్నారు. మర్చిపోయారు అందరూ.. 

అవినాష్ ఓపెన్ చేసున్న గ్లాస్ డోర్ క్లోజ్ చేసి దాని వెనక దాక్కొంటున్నాడు ఓపెన్ గా ఉన్న తలుపు సో అది దాక్కోడం కాదు అని అంటున్నాడు అభి. అందరూ నువ్వు పొజిషన్ మార్చుకున్నావ్ కనుక అందరూ మార్చుకున్నారు అని చెప్తున్నారు. 

అభి అవినాష్ అరియానా పొజిషన్ మార్పు.. నాకు సెన్స్ లేదు మీకు కూడా లేదా అని అన్నాడు అవినాష్ అభి ఆమాట దగ్గర ట్రిగ్గర్ అయ్యాడు.    
అరియానా మీద కాసేపు అరిచాడు నువ్వెందుకు నా పేరు చెప్తావ్ అని అవినాష్ అరియానా క్లియర్ గా చెప్పే మాటలని పట్తించుకోడం లేదు ఊరికే అరిచేస్తున్నాడు. 

ఈ సారి అభి బజర్ కొట్టాడు మంకీబార్ సెలెక్ట్ చేస్కున్నాడు. అవినాష్ వెనక ఉన్నప్పుడు బజర్ మోగుతుందట.. అనుకున్నా అనుకున్నా అని ఆవేశపడిపోతున్నాదు.

కెప్టెన్ తప్ప ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఇక్కడ అని అంటున్నాడు. 

అభికి మంకీబార్ మీద కాళ్ళు చేతులు వేసి పది నిముషాలు వేలాడాలి. బాగా లాక్ చేశాడు రెండు చేతులు అండ్ రెండు కాళ్ళు హారిక దిగితే చంపేస్తాను జనాలు కూడా చంపేస్తారు అని అంటుంది. 
ఈజీగా చేసేశాడు పది నిముషాలు. ఇంకా కాస్త ఎక్కువ ఉన్నాడు.. ఉండి దిగాక ఈ సారైనా నామినేట్ చేయకండి బాస్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా నేను అని అంటున్నాడు. 

లాస్ట్ ఛాన్స్ లో అవినాష్ చాలా ఫాస్ట్ గా పరిగెట్టాడు కానీ తాడు అడ్డం వచ్చి కింద పడ్డాడు. హారిక కొట్టేసింది. 
టైర్ ఛాలెంజ్ తీస్కుంది. పదిహేను నిముషాల్లో పది రౌండ్స్ చేయాలి గ్రౌండ్ లో ఒక వైపు నుండి మరో వైపు ఫ్లిప్ చేయాలి. ఇటునుండిఅటు అటునుండి ఇటు ఒక రౌండ్. బాగానే కష్టపడింది కానీ చేసింది. సోహెల్ కూడా ఇచ్చిపడేయ్ అని చెప్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. పదిహేను నిముషాలు ఇస్తే ఎనిమిది నిముషాల నలభై ఎనిమిది సెకండ్స్ లోపే చేసేసింది ఆల్మోస్ట్ హాఫ్ టైమ్.  

నాలుగు బజర్ యాక్టివిటీస్ అయ్యాక నైట్ మళ్ళీ ట్రంపెట్ మోగితే అరియానా వాఅ.. ఈ టాస్క్ ఇంకా అవ్వలేదా బిగ్ బాస్ ఏ పార్ట్ పని చేస్తుందో తెలీడం లేదు అని ఏడ్చేస్తుంది 
  
నైట్ పదకొండుకు అఖిల్ కోసం మోనల్ కేక్ బేక్ చేసింది. అఖిల్ వన్ అని రాసిందంట. 

అందరూ హాపీ బర్త్ డే సాంగ్ పాడుతుంటే అందులో అభి "మెనీ గర్ల్ ఫ్రెండ్స్ టూ యూ అని" యాడ్ చేసి పాడుతున్నాడు బావుంది. 

నైట్ పడుకునే ముందు అఖిల్ కి హగ్ బుగ్గమీద బోల్డు ముద్దులు పెట్టింది మోనల్ బర్త్ డే విషెస్ చెప్తూ.. ఆహా రోజు నా బర్త్ డే వస్తే బావుండు అని అంటున్నాడు అఖిల్ మొదటి సారి ఇక్కడ ముద్దు పెట్టావ్ కదా అంటే హా బర్త్ డే స్పెషల్ అని చెప్తుంది. క్యూట్ మొమెంట్ బావుందనిపించింది. 

రేపటి ప్రోమోలో కూడా ఇదే టాస్క్ కంటిన్యూ చేస్తున్నారు. ఫామిలీలు వస్తున్నారు. రేపు ఫుల్ ఎమోషనల్ ఎపిసోడ్ అవబోతుందనుకుంటా. ఫ్రీజ్ రిలీజ్ అని ఈ రోజు టాస్క్ లో అన్నపుడే నాకు అనుమానం వచ్చింది ఫామిలీ విజిట్ ఉంటుందేమో ఈ వీక్ అని. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. 


16, నవంబర్ 2020, సోమవారం

ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగిందో నా మాటల్లో ఇక్కడ వినవచ్చు. క్రింద ఇస్తున్నది రఫ్ నోట్స్ ముఖ్యమైన పాయింట్స్ కోసం అది చదవచ్చు. 



ఈ రోజు డెబ్బై ఒకటో రోజు నిన్న మెహబూబ్ ఎలిమినేషన్ తో ఇంట్లో ఎనిమిది మంది మిగిలి ఉన్నారు. ఈ రోజు నామినేషన్స్ డే.. అభిజిత్4 మోనల్3 హారిక లాస్య అరియానా సోహెల్ 2 each. అవినాష్ కి ఒక్క ఓటు వచ్చినందువల్ల సేవ్ అయ్యాడు అఖిల్ కెప్టెన్సీ ఇమ్యునిటీ ఉంది.    

వివరాలలోకి వెళ్తే సోహెల్ అండ్ అఖిల్ మాట్లాడుకుంటున్నారు ఆ ముగ్గురుకి గుడ్ మోర్నింగ్ కూడా చెప్పలేదు నాకసలు నచ్చరంటే ఇక తాకను కూడా తాకనివ్వను వాళ్ళని అని చెప్తున్నాడు అయ్యగారు. 

పొగరని అందరు అన్నా అది నా నైజం అన్న లైన్స్ నచ్చాయ్ అని అభి అండ్ కో అంటున్నారు. ఇది చాలా మంది ఫేవరెట్ లైన్ లే అంటే ఐతె నాకొద్దులే అంటా అభి. 

కెప్టెన్ గా అనౌన్స్ చేసి బాండ్ పంపించారు అఖిల్ కి మీటింగ్ పెట్టి అవినాష్ ని రెండు వారాలు చేశావ్ కదా అంటే అండరూ వరస్ట్ అంటూ గోల చేశారు. ఇదివరకు నేను మాటిచ్చాను లాస్య అక్క మూడు రోజులే రేషన్ మానేజర్ గా చేసింది సో తనకే ఇస్తున్నా అని చెప్పాడు లాస్య అభి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అస్సలు ఊహించినట్లు లేదు లాస్య. థ్యాంక్స్ చెప్పడం కూడా తనని హగ్ చేస్కున్నపుడు చాలా వెరైటీగా అనిపించింది మనస్ఫూర్తిగా కాకుండా చాలా ఇబ్బందిగా కనిపించింది. నేనైతే సోహెల్ ని చేస్తాడేమో అనుకున్నాను ఇంట్రెస్టింగ్ లాస్యని చేయడం బావుంది. 

సోహెల్ రేషన్ వచ్చినపుడు కూడా వాడుంటే ఆసల అని మెహబూబ్ నే తలుచుకుంటున్నాడు. నాగ్ సర్ పంపిన మటన్ కూడా వచ్చింది అని అంతా ఎగిరి గంతులేశారు. 

నామినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో వరస్ట్ పెర్ఫార్మర్స్ మెడలో ఉన్న హార్ట్ మీద పొడిచి నామినేట్ చేయాలి. ఈ కారణాలు మాత్రమే కాక వేరె కారణాలున్నా చెప్పచ్చు. అఖిల్ కి ఇమ్యునిటీ. 

అఖిల్ అభిజిత్ అండ్ హారిక ని చేశాడు. లాస్ట్ వీక్ వెళ్ళేప్పుడు బాధపడ్డాను అని చెప్పాడు కానీ నేను చూసింది వేరే బాధపడక పోయినా పర్లేదు కానీ నవ్వుకోవద్దు అని అన్నాడు. రోబో టాస్క్ తప్ప ఇంకెందులో పెర్ఫార్మెన్స్ కనపడలేదు. ఇమ్యునిటీ అక్కర్లేదు ప్రజలు సేవ్ చేస్తారని చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి అని. మేకని గడ్డిచూపించి లోపలికి పిల్చాడు తర్వాతేమైంది ఎక్స్ట్రా ప్రోటీన్ పెట్తి పులిలా బయటికి వదిలాడు నేను కెప్టెన్ అయ్యా అన్నాదు. 

హారిక అన్నది నా విషయంలో అఖిల్ సింపతీ కార్డ్స్ ఎన్ని సార్లు యూజ్ చేస్తారని అంది ఎన్ని సార్లు వాడానో నాకు గుర్తు లేదు. అది వర్స్ట్ లైన్ అమ్మ గారిని కూడా నేను ఇదే రీజన్ తో నామినేట్ చేశాను. నువ్వు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి గుచ్చాలి అంటే నాకు చెప్పకు ఎట్లా ఆడాలో అది నా ఇష్టం అని అన్నాడు అఖిల్ దానికి హా నీకు చెప్పేటోడు ఎవడ్లేడు ఇక్కడ నీకు అని తెలుసు అని అభి చాలా వెటకారంగా అన్నాడు. 


మేక పులి కాదు బాబు మేక బలైతది అని చెప్పాడు అభి. జరిగిన దాని తర్వాత కూడా బుద్ది రాలేదు కానీ నా సోచ్ గురించి మాట్లాడదానికి నువ్వు ఏవరివి అని అంటున్నాడు. 
అభి అండ్ అఖిల్ మధ్యలో చాలా డిస్కషన్ జరిగింది ఎక్కువే.. నువ్వు జేసిన గేం లు ఇంట్లో ఆడుకో ఇక్కడ కాదు అంటున్నాదు అభి. ఇద్దరు కూడా ఒకరినొకరు రెచ్చగొట్టుకునేలా మాట్లాడుకున్నారు.   
అభి బాగానే ఇరిటేట్ అయ్యాడు కోపం వచ్చింది బాగానే రైజ్ అయ్యాడు. 

అఖిల్ అండ్ అభి మధ్య వాదన. అభి కూల్ అండ్ కంపోజ్డ్ క్లారిటీ ఇన్ థాట్ అండ్ ప్రెజెంటేషన్ అన్ బీటబుల్. ఇలాంటి రెచ్చగొట్టే వాదనలు జరిగినపుడే తన ఒరిజినాలిటీ బయటపడుతుంది. ఇలాంటపుడు కూడా అలాగే కంపోజ్డ్ గా ఉండగలుగుతున్నాడా అనేది. ఉదాహరణకి ఈ రోజు బాగానే కోపం వచ్చింది నువ్వు బచ్చాగాడివి పక్కకి కూచో నాకు బిగ్ బాస్ తో మాట్లాడడానికే భయం లేదు నువ్వు ఎవడివి అని అనడం అంతా కాస్త లైన్ క్రాస్ చేసి తన కూల్ కోల్పోయాడనిపించింది. ఇలాంటి సిట్యుయేషన్ లో ఇలా బిహేవ్ చేయడంవల్ల తన వోట్ బాంక్ తగ్గే అవకాశాలు లేకపోలేదు.   

అండ్ అఖిల్ ఈగో అండ్ చైల్డిష్ నెస్ కూడా ఇంకా కనిపించింది ఈ రోజు ఎపిసోడ్ లో. పిల్లాడు అంటే పిల్లాడిగానే బిహేవ్ చేస్తున్నాడు అనేది నో డౌట్. పులిలా బయటికి వచ్చింది అంటూ ఆ పాయింట్ చుట్టూ అంత సీన్ చేయడం అనవసరం కాకపోతే అలా చేసి రెచ్చగొట్టబట్టే అభి ఒరిజినాలిటీ కూడా బయటపెట్టగలిగాడనిపిస్తుంది. 

అరియానా అభి ని నామినేట్ చేసింది ముగ్గురు పేరు చెప్పలేకపోయినందు వల్ల మేం డెసిషన్ తీస్కోవాల్సి వచ్చింది. ఆ ప్రక్రియ ఐకమత్యం లేదని అనిపించింది ఒక ప్రాసెస్ ని రెస్పెక్ట్ చేయాలి ఏకీభవించలేదు కాబట్తి అని అమ్ది. 
లాస్య నాకు అర్యానా కాంపిటీషన్ కాదన్నారు. అందరూ ఈక్వల్ ఎవరి పేరు చెప్పను ఎవర్ని పంపను అని అన్నపుడు మీరు వెళ్ళాల్సింది అని అంది మీరు కూడా ప్రాసెస్ ని ఆపేయడం బాలేదు. నన్ను నామినేట్ చేసినపుడు హౌస్ హార్మొని పాడైందని చెప్పారు. మీవల్ల కూడా పాడైంది డెసిషన్ కూడా తీస్కోలేదు. యాపిల్ టాస్క్ కూడా చెప్పాడు. 

అభి బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు కెమేరాలు ఉన్నాయ్ని మాకు తెలుసు కదా అది ఫ్రంట్ బిచ్చింగే అని అన్నాదు. 

సోహెల్ నాకు చిచ్చుబుడ్డి ఇచ్చిన వాళ్ళకి థాంక్స్ చెప్పి అది వెలుతురు ఇస్తది నిలబడి ఉంటుంది. ఆటం బాంబ్ కన్నాచిచ్చుబుడ్డే బెటర్ అని నేనంటా బాంబ్ పేలి దబ్ అని సౌండ్ వస్తుంది డిస్ట్రబెన్స్ ఇస్తుంది చిచ్చుబుడ్ది హౌస్ కి హాపినెస్ ఇస్తుంది అని లాజిక్ ఇచ్చాడు. 

హారిక ఎవ్వడ్ దేఖడు వేస్ట్ గాడు అని నన్ను అన్నందుకు నిన్ను ఎప్పుడూ అనలేదు ఐనా నన్ను ఇన్ని మాటలు అంటావా అని అన్నాడు. చాలా బాధనిపించింది. 
నీఅవ్వ పోబే అన్నది నీకు ఊతపదం అన్నపుడు దేఖడు వేస్ట్ గాడు అన్నది నా ఊతపదం అని హారిక వాదన. 

వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కూడా బాగా జరిగింది. ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. హారిక కూడా ఏం తగ్గలేదు అస్సలు. 
వీళ్ళిద్దరి వాదించుకుంటుంటే సోహెల్ వైపు నవ్వుకుంటూ చూస్తున్నాడు అభి. హారిక ఏమాత్రమూ తగ్గలేదు. 
  
సోహెల్ హారికల మధ్య డిస్కషన్ లో కూడా సోహెల్ చేసినది ముమ్మాటికీ తప్పు. హారిక చాలా ఫీలైనట్లు కనిపించింది. ఈ విషయమై నాగార్జున గట్టిగానే ఇస్తారనుకుంటున్నాను సోహెల్ కి ఈ వీకెండ్. అండ్ ఈ రోజు తను టంగ్ స్లిప్ అయిన దానికి మూల్యంగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు కాకపోతే అఖిల్ అండ్ మెహబూబ్ ఫాన్స్ గట్టిగా ప్లాన్ చేస్తే ఉండే అవకాశాలూ లేకపోలేదు. 

అభికి రోబో టాస్క్ తర్వాత అంత మళ్ళీ నాకు కనపడలేదు పెర్ఫార్మెన్స్ అందుకే చేస్తున్నా అన్నాడు. 

లాస్య అరియానా ని నామినేట్ చేసింది నేను ఎవరిని పంపించడానికి రెడీగా లేను పంపించాలని ఆలోచించారు కానీ ఉంఛడానికి ఐకమత్యంగా ఎవరూ ఎందుకు ట్రై చేయలేదు అని అంది. నేనైతే ఎవరిని పంపడానికి రెడీగా లేను. 
మోనల్ ని సెకండ్ నామినేషన్ రిలేషన్ లో ప్రాబ్లం ఏం లేదు టాస్క్ ల విషయంలో నువ్వు తక్కువ పెర్ఫార్మ్ చేస్తున్నావు. కుకింగ్ విషయంలో నాకు అవ్వడం లేదునిన్ను చేయమన్నపుడు చేస్తాను అని చెప్పి వదిలేయడం నచ్చడం లేదు అని అంది. నో ఆర్గ్యుమెంట్. 

హారిక సోహెల్ ని మొన్న కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చేయ్ అన్నపుడు ఓడిపోయావ్ అది నీ తప్పు అని అన్నాడు అప్పుడు హర్ట్ అయ్యాను అని చెప్పింది. సర్లే ఇపుడు నీకు చెశా కాబట్తి నువ్వు చేస్తున్నావ్ అంతే అని అన్నాడు.  ఇద్దరు అరుచుకున్నారు మళ్ళీ. 
మోనల్ మిగతా ఎవ్వరి మీద నాకు రీజన్స్ లేవు ఆ రోజు ఇంటి నుండి పంపాలి అన్నపుడు వీళ్ళు అది అడ్వాంటేజ్ అవుతుందేమో అని పేరు సెలెక్ట్ చేస్తున్నారు అనుకున్నం యా నిజమే అని నాతో ఒప్పుకున్నావ్ అండ్ వెంటనే వెళ్ళి అఖిల్ పేరు చెప్పావ్ అది నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని అంది. 

మోనల్ లాస్య కి నేను పని టైమ్ కి చేయడం లేదని లాస్ట్ వీక్ కూడా నామినేట్ చేశారు. నాపని నేను చేస్తాను. నాది తెలుగు కాదు కనుక నేను ఎక్కువ కష్టపడుతున్నాను. నేను హిందీలో చెప్పినా కూడా మీరు తప్పు అర్ధం చేసుకుంటున్నారు అని అంది. గేం గురించి మాట్లాడితే మీ ఎఫర్ట్ తక్కువ అనిపిస్తుంది అంది. 
అవినాష్ రేషన్ మానేజర్ గా ఫెయిల్ అయ్యారు అని చెప్పింది. అది నా అభిప్రాయం అందుకే నేను చేస్తున్నా. సోహెల్ హెల్ప్ తో చేస్తానని చెప్పి కూడా మీరు చేయలేదు అలా ఎలా నన్ను చేయట్లేదని చెప్తారు అని అన్నాడు అవినాష్. 

అవినాష్ మోనల్ ఇక్కడ అందరూ అలాగే మనిల్లు లాగా ఫీలవుతున్నారు. ఎవరైనా పని చెప్తే చేయి అంటే.. మోనల్ ఐహాఅవ్ టు లెర్న్ హౌటు సే నో ఎవరైనా పని చెప్తే నో చెప్పడం అలవాటు చేస్కుంటాను అని చెప్పింది. 
అభిని రోబో టాస్క్ బాగా ఆడారు తప్ప ఇంకో దాన్లో మీ పెర్ఫార్మెన్స్ చూడలేదు అందుకే అన్నాడు. 

అభి అరియానా కి ఏకాభిప్రాయానికి రానందుకు అని చెప్పాడు. అరియానా కూడా సైలెంట్ అయ్యింది. 
సోహెల్ కి సెకండ్ ఆల్రెడీ ఒక సారి ముందు చెప్పా నువ్వు మళ్ళీ మాట్లాదుతున్నావ్ అని అన్నాడు నీ యవ్వ అని నాతో మాట్లాడకు అని చెప్పాడు. చాలా కూల్ గా చెప్పాడు అంతే కూల్ గా సోహెల్ కూడా జవాబు చెప్పడం మొదలు పెట్టాడు. నువ్వు కూడా ఆరియానా తో నీయమ్మ ఏందిది అన్నావ్ కదా అన్నాదు. 
సోహెల్ అఖిల్ ఇద్దరూ కూడా వెటకారం చేస్కున్నారు శ్లాంగ్ గురించి.
నాతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు అని అన్నాడు. నా లాంగ్వేజ్ ఇంతే ఉంటుంది ఊతపదానికి నామినేట్ చేస్తుంటే నేనేం మాట్లాడను అని చెప్తున్నాడు. మేమందరం ప్రొఫెషనల్ కెపాసిటీ లో వచ్చాం నువ్వు షూటింగ్ లో మాట్లాడ్తావా అన్నాడు అభి. ఐనా కానీ నువ్వు కంటిన్యూ చేస్తున్నావ్ అన్నాడు. 

నువ్వు అరుసుకుంట మాట్లాడితే సైలెంట్ ఉండడానికి నేను వాళ్ళ కింద పని చేయడం లేదు అంటే లాస్య సైలెంట్ గా ఉండు అని అంటుంది సైలెంట్ గా ఉండే ప్రసక్తే లేదు నేను ఊర మాస్ అని అంటుంది హారిక 

గింత లేవు అని అన్నావ్ అంటే కావాలనే హర్త్ చేయాలని అన్నాను అని అంటున్నాడు సోహెల్ అరియానతో. ఇదే వేస్ట్ గాడని అభిని అనమను ఒక్క మాట తీస్కోడు అతను అట్లాటోళ్ళే కరెక్ట్ ఆమెకి. హౌస్ లో బ్రో కామెడీ చేస్తున్నాడు. 

రేపటి ప్రోమోలో బిగ్ బాస్ ఇల్లు ఒక కమేండో ఇన్స్టిట్యూట్ గా మారబోతోందిట. మిలటరీ ట్రైనింగ్ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తున్నారు. మంకీ బార్స్ కి కాళ్ళు చేతులు లాక్ చేసి హాంగ్ అయ్యాడు అభి. దట్ లుక్స్ గుడ్. అవి ఈ రోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం. 

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

పాత ముచ్చట్లు

Popular Posts